సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరుస్తూ కథనం ప్రసారం చేసిన కేసులో టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బలుసు శివశంకరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ డజనుకుపైగా షరతులు విధించారు. టీవీ 9 కథనంపై న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయటం తెలిసిందే.