Ravi Prakash
-
విద్రోహి చాలా మంచి కథ: శ్రీకాంత్
రవి ప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విద్రోహి’. వీఎస్వీ దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పొస్టర్‌ను రిలీజ్ చేసిన నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. చాలా మంచి మూవీ అవుతుంది.రవిప్రకాశ్ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. ‘విద్రోహి’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను పొలీసాఫీసర్ పాత్ర చేశాను. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది’’ అని తెలిపారు రవిప్రకాశ్. ‘‘ఓ సరికొత్త పాయింట్‌తో మేం తీసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు వీఎస్వీ. ‘‘విద్రోహి’ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పప్పుల కనకదుర్గా రావు. నటుడు శివకుమార్ మాట్లాడారు. -
కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ ఎం.రవిప్రకాశ్ హైకోర్టుకు నివేదించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారంటూ పలువురు హోంగార్డులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కులు ఉండవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లందరికీ స్పష్టంగా తెలుసని, వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్‌ను తప్పుపడుతున్నారని తెలిపారు.నోటిఫికేషన్‌లోని పేరా–7లో పేర్కొన్న స్పెషల్ కేటగిరీలు హారిజాంటల్ రిజర్వేషన్ (హోంగార్డులు, ఎన్సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసుల పిల్లలు తదితరాలు) కిందకు వస్తాయన్నారు. ఈ హారిజాంటల్‡ రిజర్వేషన్ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని తెలిపారు.అలా చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయిరూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమవుతుందని రవిప్రకాశ్ వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారని పేర్కొన్నారు.అయితే, తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందంటే..!!
-
RERA అప్రూవల్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలు చేయడం సురక్షితమేనా..?
-
రవిప్రకాశ్‌పై కేసు ఉపసంహరణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం, ఫోర్జరీలకు పాల్పడ్డారంటూ టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్‌పై నమోదైన కేసు ఉపసంహరణకు అనుమతించిన కూకట్‌పల్లిలోని మేజి్రస్టేట్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి.కౌశిక్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రవి ప్రకాశ్‌పై కేసు ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2024, మార్చి 15న జీవో 158 జారీ చేసింది. దీని ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమో దాఖలు చేయగా, కూకట్పల్లి కోర్టు తీర్పునిచి్చంది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కౌశిక్‌రావు కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసును మార్చిలో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని ఆధారంగా అనుమతిస్తూ మేజి్రస్టేట్ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. కేసు పూర్వాపరాలను, ఇతర అంశాలను పరిశీలించకుండానే ఉత్తర్వుల జారీ సరికాదు. క్రిమినల్ కేసు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?.. కారణాలు ఏమైనా ఉన్నాయా?.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంతో పడే ప్రభావాన్ని, చార్జిషీట్లోని ఆధారాలను, సాక్షుల స్టేట్మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. మేజి్రస్టేట్ కూడా ఎలాంటి కారణాలను పేర్కొనకుండా మెమోను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. రవిప్రకాశ్.. నిందితుడిగా ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, మోసానికి పాల్పడటం లాంటి పనులు చేశారని సాక్షులు వాంగ్మూలంలో పేర్కొ న్నారు. యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయకూడదన్న సత్యాన్ని మేజి్రస్టేట్ పాటించలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టు ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, రవిప్రకాశ్, సొంటినేని శివాజీ, జె. కనకరాజు, జె. తేజవర్మ, మహేశ్ గాం«దీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 5కి వాయిదా వేశారు. -
సస్పెన్స్... థ్రిల్
అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను నటించిన చిత్రం ‘కేస్ నం. 15’. తడకల వంకర్ రాజేశ్ స్వీయ దర్శకత్వంలో బీజీ వెంచర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.ఈ సందర్భంగా తడకల వంకర్ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కేస్ నం.15’. అజయ్ మంచి పాత్ర చేశారు. ఆయనకు మంచి పేరు వస్తుంది. రవిప్రకాశ్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి’’ అన్నారు. -
బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14). పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
సీఐ సహా ముగ్గురు ఎస్ఐల సస్పెన్షన్
తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో హైదరాబాద్‌కు చెందిన బిజి.నిశాంత్‌కు చెందిన వంద అంకణాల రెండు అంతస్తుల భవనం ఉంది. దీన్ని చెన్నైకి చెందిన ముత్తుకుమార్ లీజుకు తీసుకుని అందులో ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్లు, బిస్కెట్లు, ఇతర సామగ్రిని ఉంచి వ్యాపారం చేసుకునేవారు. అయితే ముత్తుకుమార్ ఈ భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో మణికంఠను ఆశ్రయించి ఆ భవనాన్ని విక్రయించాలని నిశాంత్ కోరారు. మణికంఠ ప్రైవేట్ కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. శ్రీనివాసపురంలో అదే భవనానికి ఎదురుగా ఉంటున్న డాక్టర్ రహమాన్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో భవనాన్ని విక్రయించాడు. ఖాళీ చేయించి.. సిగరెట్లు అమ్ముకుని.. రిజిస్ట్రేషన్ అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని ముత్తుకుమార్‌ను కోరగా అతను నిరాకరించడమే కాకుండా భవనం తనదేనని పత్రాలు కూడా ఉన్నాయని అడ్డం తిరిగాడు. దీంతో మణికంఠ తిరుపతికి చెందిన ఇర్ఫాన్, శ్రీనివాస్, మరికొంతమందితో కలసి ఏప్రిల్ 9న దౌర్జన్యంగా భవనాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షల విలువైన సిగరెట్ ప్యాకెట్లు అక్కడ ఉండడాన్ని గమనించారు. తిరుచానూరులో పనిచేస్తున్న ఎస్ఐ వీరేష్‌తో కలసి సిగరెట్ ప్యాకెట్లు విక్రయించి మణికంఠ సొమ్ము చేసుకున్నాడు. ఈ నగదును సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాస్ పంచుకున్నారు. దీనిపై ఐటీసీ కంపెనీ మేనేజర్ అజయ్ ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేయించారు. సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలు కూడా లాలూచీ పడినట్లు విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం అనంతపురం డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. -
సాగులో డ్రోన్ల వినియోగం వేగవంతం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని మూడు విభాగాలు దీనిపై సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ (డీపీపీక్యూఎస్) సీనియర్ అధికారి రవి ప్రకాశ్ ఈ విషయాలు తెలిపారు. డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతించాలంటూ డీపీపీక్యూఎస్‌లో భాగమైన సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఅండ్‌ఆర్‌సీ)కి ఎనిమిది పంట సరక్షణ కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. పంట పర్యవేక్షణ, ఆగ్రో రసాయనాలు స్ప్రే చేయడం తదితర అవసరాల కోసం డ్రోన్లను వినియోగించేందుకు ఉద్దేశించిన ఈ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), వ్యవసాయ శాఖ, సీఐబీఅండ్‌ఆర్‌సీ కలిసి పని చేస్తున్నాయని ప్రకాశ్ చెప్పారు. క్రాప్‌లైఫ్ ఇండియా, థింక్‌ఏజీ సంయుక్తంగా నిర్వహించిన పరిశ్రమ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. ఎన్ఐపీహెచ్ఎం శిక్షణా కోర్సు.. డ్రోన్లను ఎగరేయడం, స్ప్రే చేయడం వంటి అంశాల్లో డ్రోన్ పైలట్లు, ఆపరేటర్లకు శిక్షణనిచ్చేందుకు పది రోజుల ట్రెయినింగ్ కోర్సును రూపొందించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) జాయింట్ డైరెక్టర్ విధు కాంపూరథ్ తెలిపారు. దీనికి డీజీసీఏ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మాడ్యూల్తో డ్రోన్ పైలట్‌కు పదేళ్లు వర్తించే లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నారు. ఫినిష్డ్ డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించడం వల్ల దేశీయ తయారీ పరిశ్రమకు ఊతం లభించగలదని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా తెలిపారు. -
రవిప్రకాశ్‌కు హైకోర్ట్‌లో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో రవిప్రకాష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌ను అనుమతులు లేకుండా విత్‌డ్రా చేసిన కేసులో గతంలోనే తెలంగాణ హైకోర్టు పోలీసులకు స్టే ఆర్డర్ ఇచ్చింది. తాజాగా తిరిగి అదే కేసును తెర మీదకు తీసుకురావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అరెస్ట్ చేయడానికి వీలులేకుండా హైకోర్టు రవిప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా గతంలో టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి అనుమతులు లేకుండా రవిప్రకాశ్ భారీగా నిధులను విత్ డ్రా చేయడంతో ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల రూపాయల నిధులను రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు విత్ డ్రా చేశారని కేసు నమోదు కావడంతో దానిపై విచారణ చేపట్టారు. గతంలోనే ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో సహా పలువురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ విత్ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు. (రవిప్రకాశ్‌పై ఈడీ కేసు నమోదు) -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు
-
రవిప్రకాశ్‌పై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి భారీగా నిధులను రవిప్రకాశ్ విత్ డ్రా చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల రూపాయల నిధులను రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు విత్ డ్రా చేశారని కేసు నమోదు కావడంతో దానిపై విచారణ చేపట్టారు.గతంలోనే ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో సహా పలువురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ విత్ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
-
రవిప్రకాశ్ కస్టడీపై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు రవిప్రకాష్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయనీ, పది రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించింది. రవిప్రకాశ్ తన అధికార దుర్వినియోగంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్‌గ్రేషియా నిధులను అక్రమంగా మళ్లించారని, దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని కోర్టుకు సమర్పిస్తున్నామని ఈ మేరకు తెలిపింది. అలాగే అతడు డ్రా చేసిన నగదు లావాదేవీల పూర్తి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగిందని వివరించింది. రవిప్రకాశ్‌పై ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), హైకోర్టులోని కేసులకు.. ఈ కేసుకు సంబంధం లేదనీ, 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరింది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్, ఏ-2గా ఆర్థిక వ్యవహారాలు చూసే మూర్తిగా గుర్తించారు. కాగా ప్రస్తుతం మూర్తి పరారీలో ఉన్నాడు. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ
-
రవిప్రకాశ్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి: టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ అలియాస్ రవిబాబు రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐ) ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌కి తాజాగా లేఖ రాశారు. రవిప్రకాశ్, ఆయన భార్య దేవిక, ఇతరుల అక్రమార్జన, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను కూడా జతచేసి సీజేఐకి పంపించారు. అడ్డగోలు సంపాదన ‘‘ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్న రవిప్రకాశ్ తన పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులను సంపాదించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం(వీఎంఎల్ఏ), ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం(ఫెమా), ఆర్బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్‌బాబుకు రవిప్రకాశ్ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్‌ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు. ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు చెందిన సుకేష్ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అంతేకాక ఈ విధంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్‌కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్ఎక్స్టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో కోరారు. -
రవిప్రకాశ్‌పై సుప్రీం సీజేకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఆస్తులపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రవిప్రకాశ్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఫెమ, మనీలాండరింగ్, ఐటీ నిబంధనల్ని రవిప్రకాశ్ ఉల్లంఘించారని ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి పలువురిని మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించారని తెలిపారు. హవాలా సొమ్ముతో కెన్యా, ఉగాండాలోని కంపాల సిటీకేబుల్‌లో రవిప్రకాశ్ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్ అక్రమ వ్యాపారాలు, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను జతచేసి ఆధారాలతో సహా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాసినట్టు తెలిసింది. -
చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించి... కృష్ణా బ్యారక్‌లో ఉంచారు. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న ఆయన రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం. ఉదయం రవిప్రకాశ్‌కు జైలు సిబ్బంది అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా, సగం తిని వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 9న వాదనలు జరగనున్నాయి. కాగా రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టీవీ9 సీఈవో గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. చదవండి: రవిప్రకాశ్ అరెస్ట్... -
మెరుగైన మోసం
-
రవిప్రకాశ్ అరెస్ట్...
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో ఆ టీవీ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల కం పెనీ లాభాలకు సమానంగా బోనస్, ఎక్స్ గ్రేషియాల కింద రూ.18,31,75,000 నగదు డ్రా చేశారని, అయితే టీడీఎస్ మినహాయింపుల తర్వాత రూ.11,74,51,808గా బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తోందని అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌టైమ్ డైరెక్టర్ జి.సింగారావు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. టీవీ9 లోని 90.54 శాతం మెజారిటీ షేర్‌హోల్డింగ్‌ను ఈ ఏడాది ఆగస్టు 27 నాటికి అలందా మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కొత్త బోర్డు డైరెక్టర్లు సంస్థ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించగా, రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తిలు మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని తేలింది. 2018 సెప్టెంబర్ 18న , 2019 మార్చి 3న,మే 8న రవిప్రకాశ్ రూ.6,36,000, 2018 అక్టోబర్ 24, డిసెంబర్ 10, 2019 మే 8న ఎంవీకేఎన్ మూర్తి రూ.5,97,87,000లు, కంపెనీ డైరెక్టర్ క్రిఫర్డ్ పెరీరా 2018 అక్టోబర్ 24, డిసెంబర్ 10, 2019 మే 8న రూ.5,97,87,000 డ్రా చేసినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి కింద రూ.18,31,75,000 డ్రా చేశారని రికార్డులను బట్టి తెలిసింది. కంపెనీకి నష్టం కలిగించడంతో పాటు మోసపూరితంగా చేసిన లావాదేవీలను బోనస్, ఎక్స్‌గ్రేషియా రంగుపులిమే ప్రయత్నం చేశారు. బోర్డు తీర్మానం లేకుండా అలాంటివి ఇచ్చే వీలుండదు. కంపెనీ షేర్‌హోల్డర్స్ జనరల్ మీటింగ్‌లో ఆమోదం తీసుకోకుండానే బోనస్, ఎక్స్‌గ్రేషియాగా రికార్డు చేయాలని అకౌంటెంట్లకు వారు సూచించినట్లు తెలిసింది. ‘సెప్టెంబర్ 24న జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఈ మోసపూరిత లావాదేవీలపై పూర్తిస్థాయి చర్చలు జరిగాకే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ నగదును తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాం’అని ఫిర్యాదులో జి.సింగారావు పేర్కొన్నారు. పోలీసులతో వాగ్వాదం.. బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, మీరెవరంటూ రవి ప్రకాశ్ ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్ వరకు తన కారులోనే వస్తానని చెప్పగా పోలీసు వాహనాన్ని ఎస్కార్టుగా పెట్టి స్టేషన్‌కు తరలించారు. అనంతరం రవిప్రకాశ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కూడా టీవీ9కు సంబంధించిందని గతంలోనే అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీతాఫల్మండిలో మేజిస్ట్రేట్ ముందు ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం చంచలగూడ జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై ఈ నెల 9న విచారణకు రానుంది. కస్టడీలోకి తీసుకుంటాం: వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి సొంత అవసరాల కోసం భారీ మొత్తంలో కంపెనీ నగదు డ్రా చేసుకున్న రవిప్రకాశ్‌ను పోలీసు కస్టడీకి తీసుకుంటాం. టీవీ9 తాజాగా సమర్పించిన రికార్డుల ఆధారంగా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశాం. రవిప్రకాశ్‌ను విచారిస్తే పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయి. -
రవిప్రకాశ్‌ను విచారిస్తున్న పోలీసులు
-
రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేశాం: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు. రవిప్రకాశ్‌తో పాటు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్(ఏబీసీఎల్) మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఏబీసీఎల్ కంపెనీ చెందిన దాదాపు రూ.18 కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి ప్రశ్నించినట్టు తెలిపారు. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు ఫిర్యాదు పేర్కొన్నట్టు వెల్లడించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని డీసీపీ సుమతి తెలిపారు. -
పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
-
పోలీసుల అదుపులో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏబీసీఎల్ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు. సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో పాటు ఏబీసీఎల్ మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తిపై బంజరాహిల్స్ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వి రవిప్రకాశ్ మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్ డ్రా చేశారు. అలాగే డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నారు. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్ అండ్ కోపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
రవి ప్రకాశ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. కాగా గతంలో రవిప్రకాశ్ రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని న్యాయవాదులు కోరారు. దాంతో తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్‌కు బెయిల్ నిరాకరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు రవి ప్రకాశ్‌కు సూచించిన సంగతి తెలిసిందే. -
శివాజీ పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా
సాక్షి, హైద్రాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, గరుడ శివాజీ క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 21కి వాయిదా వేసింది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే. కాగా, క్వాష్ పిటిషన్‌పై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. -
ఎట్టకేలకు పట్టుబడ్డ శివాజీ
-
ఎట్టకేలకు పట్టుబడ్డ ‘గరుడ’ పక్షి
సాక్షి, హైదరాబాద్: అలందా మీడియా కేసులో నిందితుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు బుధవారం చిక్కాడు. గత 2 నెలల నుంచి అనారోగ్య కారణాలరీత్యా పోలీసుల విచారణకు రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన శివాజీని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న శివాజీ అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్‌ను బుక్ చేసుకొని బుధవారం తెల్లవారుజామున 6.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ దేశం విడిచి వెళ్లే అవకాశముందని లుకౌట్ నోటీసులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకోగలిగారు. రజనీకాంత్ స్టైల్లో తయారైనా..! అయితే సినిమా ఫక్కీలో తన అసలు వేషధారణకు కాస్త భిన్నంగా.. శివాజీ సినిమాలో రజనీకాంత్ మాదిరిగా రెడీ అయ్యాడు. ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా ఎత్తుగడ పన్ని నా.. పాస్పోర్టుతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయాన్ని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే 160 సీఆర్పీసీ కింద అక్కడే నోటీసులివ్వాలనుకున్నా.. కొన్ని మార్పులు చేయాల్సి ఉండటంతో శివాజీని గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం దాదాపు 45 నిమిషాలపాటు శివాజీని అక్కడే ఉంచిన పోలీసులు మార్పులు చేసిన నోటీసును ఇచ్చి ఈ నెల 11న విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో అక్కడి నుంచి శివాజీ వెళ్లిపోయాడు. అయితే సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినా శివాజీ అమెరికా వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడనేది ఇప్పుడూ అనేక అనుమానాలను రెకెత్తిస్తోంది. కాగా టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారని అలంద మీడియా ఫిర్యాదు చేయడంతో.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రవిప్రకాష్‌ను పలు పర్యాయాలు విచారించారు. -
శివాజీ పాస్‌పోర్ట్ సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. చదవండి: పోలీసుల అదుపులో సినీనటుడు శివాజీ -
శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
పోలీసుల అదుపులో నటుడు శివాజీ
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో సినిమా నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారు. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని..ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర పన్ని..పాత తేదీతో నకిలీ షేర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తితోపాటు డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు హరి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారి మూర్తి, మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ- మెయిళ్ల ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ..సైబర్ క్రైం పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానంతో వాటిని వెలికి తీశారు. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాశ్‌తో పాటు శివాజీపై గతంలో పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లేందుకు శివాజీ ప్రయత్నించడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ...’దేశం పాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నాం. శివాజీని అరెస్ట్ చేయము. కోర్టు ఆదేశాల మేరకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశాం. శివాజీని విచారణకు సహకరించాలని కోరాం. నోటీసులు ఆధారంగా ఆయనను విచారణ చేస్తాం.’ అని తెలిపారు. ఇప్పటికే శివాజీపై లుక్ఔట్ నోటీసులు ఉన్నాయి. శివాజీ అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి రాగా...ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. శివాజీకి మరోసారి నోటీసులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆయనను బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి...ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని శివాజీకి సూచించారు. నోటీసులు అందుకున్న అనంతరం ఆయన పీఎస్ నుంచి వెళ్లిపోయారు. -
అరెస్టయితే బయటకు రాలేడు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 లోగో కంపెనీ పేరిటే రిజిస్టర్ అయిందని, ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ వ్యక్తిగతం కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. లిటిగేషన్ కోసమే రూ.వంద కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99 వేలకే రవిప్రకాశ్ అమ్మేశారని చెప్పారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన రిట్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రకటించారు. టీవీ9 లోగోను 15 ఏళ్లపాటు వాడుకున్నందుకు 4% వాటా ఉంటుందనే వాదనలో అర్థం లేదని ప్రతాప్‌రెడ్డి వాదించారు. టీవీ9 చానల్ కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయన్న రవిప్రకాశ్ ఆరోపణను ఖండించారు. రూ.500 కోట్లు బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయన్నారు. కొత్త యాజమాన్యం చట్ట ప్రకారం డైరెక్టర్లను నియమించిందని, అయితే రవిప్రకాశ్ ఫోర్జరీ పత్రాలు తయారు చేసి వాటా బదిలీ అయినట్లు చేశారన్నారు. రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరైతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టమని ఆయన తరఫు న్యాయవాది దిల్జీత్‌సింగ్ అహ్లూవాలియా వాదించారు. ముందస్తు బెయిల్ ఇస్తే పోలీసుల దర్యాప్తుకు రవిప్రకాశ్ సహకరిస్తారని, అందుకు ఎలాంటి కఠిన షరతులు పెట్టినా ఫర్వాలేదన్నారు. కావాలని మూడు కేసుల్లో ఇరికించినప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని, సుప్రీం కోర్టు సిబ్బియా కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
ముగిసిన రవిప్రకాశ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ ముగిసింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వడ్‌లో ఉంచింది. రవిప్రకాశ్ తరపున దిల్‌జిత్‌సింగ్ అహువాల్యా వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిదిందని ఆరోపించారు. రవిప్రకాశ్ 40వేల షేర్లను సినీ నటుడు శివాజీకి విక్రయించిన విషయం వాస్తవమన్నారు. టీవీ9 లోగో రవిప్రకాశ్‌కే చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. అగ్రిమెంట్‌కు సంబంధించిన పేపర్లను కోర్టుకు సమర్పించారు. టీవీ9 లోగో ఒక వ్యక్తి ప్రాపర్టీ కాదని, అది కంపెనీ ప్రాపర్టీగా ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదన్నారు. రవిప్రకాశ్, శివాజీలకు సంబంధించిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ అప్లియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని హైకోర్టుకు తెలియజేశారు. అనంతరం తీర్పును రిజర్వడ్‌లో పెట్టినట్లు హైకోర్టు వెల్లడించింది. -
రవిప్రకాశ్‌కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్ తగిలింది. ఆయన వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్ చేశారు. ఆయన డ్రైవర్స్ ఫోన్లను తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని ఇదివరకే న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్‌పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. -
రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల విచారణకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సహకరించడం లేదని, కొన్ని పత్రాలు ఆయనకు చూపించినా వివరాలు చెప్పడం లేదని, ఈ నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ చెప్పారు. కొన్ని విషయాలపై రవిప్రకాశ్‌కు మాత్రమే పూర్తి అవగాహన ఉందని, వివరాలు చెప్పకుండా మౌనం గా ఉండటమో, పొంతనలేని జవాబులు చెప్పడమో చేస్తున్నారని తెలిపారు. టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని చెప్పారు. కావాలని లిటిగేషన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా కనబడుతున్నాయని చెప్పారు. టీవీ9 లోగో ఖరీదు కోట్ల రూపాయల ధర పలుకుతుందని, దానిని కేవలం రూ.99 వేలకే అమ్మేశారంటే ఆయనలో ఉన్న నేరస్వభావాన్ని అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ రాజీనామా చేశారని తప్పుడు పత్రాల్ని సృష్టించారని, అగ ర్వాల్ రాజీనామా చేసినట్లుగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు పంపించేశారని, దాంతో కొత్త డైరెక్టర్ల వివరాలు పంపితే వాటిని నమోదు చేసేందుకు ఇబ్బంది వచ్చిందని హరేన్ రావల్ వివరించారు. అగర్వాల్ రాజీనామా చేసినట్లు చెబుతున్న నెలలో రోజూ ఆఫీసుకు వచ్చారని, బయోమెట్రిక్ కూడా రికార్డు అయిందని, జీతం కూడా తీసుకున్నారని చెప్పారు. సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు. ఏడేళ్లకుపైగా శిక్ష పడే కేసు కాబట్టి రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. నటుడు శివాజీకి షేర్ల విక్రయం కూడా ఆర్థిక నేరమేనని, రూ.20 లక్షలకు షేర్లను విక్రయిస్తే ఆ మేరకు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో శివాజీగానీ, రవిప్రకాశ్గానీ ఎందుకు చూప లేదని ప్రశ్నించారు. శివాజీ తరఫున నోటీసు ఇచ్చిన న్యాయవాదే తిరిగి రవిప్రకాశ్ తరఫున జవాబు ఇచ్చారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. శివాజీ పరారీలో ఉన్నందున రవిప్రకాశ్‌కు బెయిల్ ఇస్తే దర్యాప్తులోని సమాచారాన్ని ఇతర నిందితులకు తెలియజేసే అవకాశముందన్నారు. రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారు... టీవీ9 లోగోను రవిప్రకాశ్ తయారు చేయించారని, కాపీ రైట్ యాక్ట్ ప్రకారం దానిపై సర్వహక్కులు ఆయనకే చెందుతాయని ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లూవాలియా వాదించారు. రవిప్రకాశ్‌కు మౌనంగా ఉండే హక్కు ఉందని చెప్పారు. పోలీసులు రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారని, కావాలనే కేసుల్లో ఇరికించారని చెప్పారు. ఎందుకు బెయిల్ ఇవ్వాలో, ఎందుకు ఇవ్వరాదో లిఖితపూర్వకంగా న్యాయవాదులు తమ వాదనల్ని హైకోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ 18కి వాయిదా పడింది. ఎఫ్ఐఆర్లు కొట్టేయండి: శివాజీ తనపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని కోరుతూ నటుడు శొంఠినేని శివాజీ మంగళవారం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టీవీ9లో రవిప్రకాశ్‌కు ఉన్న షేర్లలో 40 వేల షేర్లను గత ఏడాది ఫిబ్రవరి 19న రూ.20 లక్షలకు కొనుగోలు నిమి త్తం చెల్లించినట్లు తెలిపారు. అయితే రవిప్రకాశ్ షేర్లను బదలాయించకపోవడంతో ఈ ఏడాది మార్చి 15న నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. -
టీవీ9 షేర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు : అలందా
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 కొనేందుకు హవాలా డబ్బును వాడారన్న ఆ చానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆరోపణలను అలందా మీడియా తీవ్రంగా ఖండించింది. నిబంధనల ప్రకారమే టీవీ9 షేర్లను కొనుగోలు చేశామని సృష్టం చేసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకే రవిప్రకాశ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు మంగళవారం అలందా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. టీవీ9 షేర్లను పూర్తిగా బ్యాంకు రూపంలోనే కొనుగోలు చేశామని, ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వలేదని పేర్కొంది. షేర్ల కొనుగోలుకు హవాల డబ్బు వాడారన్న రవిప్రకాశ్ ఆరోపణలు అవాస్తవాలని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది. కాగా టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల అక్రమ నిధులు వచ్చాయని రవిప్రకాశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు సమకూర్చారని ఆయన ఆరోపించారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులను అందజేసే మార్గాల్లో ఈ నిధులను తరలించారని సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని రవిప్రకాశ్ ఆరోపించారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
రవిప్రకాశ్ కేసు విచారణ మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు హైకోర్టులో ప్రారంభమైన రవిప్రకాశ్ కేసు విచారణలో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని... అందుకే బెయిల్‌ను నిరాకరించాలని హైకోర్టుకు విన్నవించారు. దేవేందర్ అగర్వాల్ రిజైన్ లెటర్లో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ.. వారితో జరిపిన ఫోన్ చాటింగ్ స్ర్కీన్‌షాట్స్‌ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వమని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో నిందితుడైన ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా వాదించింది. బెయిల్ మంజూరు చేస్తే రవిప్రకాశ్ సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని, పైగా మరో నిందితుడు నటుడు శివాజీ పరారీలో ఉన్నారని, దీంతో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు బాగా ఉన్నాయంది. కింది కోర్టే కాకుండా సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వలేదని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. ఇప్పటికే కింది కోర్టు రవిప్రకాశ్ బెయిల్ దరఖాస్తును కొట్టివేసిందని, సుప్రీంకోర్టుకు వెళితే అరెస్ట్ నోటీసుకు 48 గంటల గడువు ఇవ్వాలని పేర్కొందని హరేన్ రావల్ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కింది కోర్టు ఉత్తర్వులకు ఇక్కడ సంబంధం లేదు. సుప్రీంకోర్టు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు’అని వ్యాఖ్యానించారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు పేర్కొనలేదని, 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని మాత్రమే చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. ఏబీసీఎల్లో రవిప్రకాశ్‌కు పది శాతమే వాటా ఉందని, 40 వేల షేర్లను రూ.20 లక్షలకు నటుడు శివాజీకి అమ్మినట్లుగా గత ఏడాది తప్పుడు పత్రాలు సృష్టించారని హరేన్ రావల్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే వాటాల్ని విక్రయించడం నిజమైతే ఆ విషయాల్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేసిన రిటర్న్‌లో ఎందుకు పేర్కొనలేదన్నారు. షేర్ల అమ్మకాల గురించిగానీ, తద్వారా వచ్చిన రూ.20 లక్షల సొమ్ము గురించిగానీ రవిప్రకాశ్ లేదా శివాజీ ఆదాయపు పన్ను పత్రాల్లోనే కాకుండా రికార్డుల్లో కూడా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. రూ.140 కోట్లతో 90 శాతం టీవీ9 వాటాల కొనుగోలుకు ఏబీసీఎల్, అలందాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే, ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాల్ని సృష్టించి అమ్మకాలను అడ్డుకునేందుకు రవిప్రకాశ్ కుట్ర పన్నారని ఆరోపించారు. టీవీ9, బ్రాండ్ పేరును రవిప్రకాశ్ రూ.99 వేలకు చట్ట వ్యతిరేకంగా అమ్మేయడమే కాకుండా మరో మీడియా సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించారని పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే రవిప్రకాశ్ తప్పించుకు తిరిగారని, ఇప్పటికీ శివాజీ పరారీలో ఉన్నారని హరేన్ రావల్ వాదించారు. కేసు విచారణకు హాజరుకాకుండా కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ మంజూరు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాక పోలీసుల దర్యాప్తునకు రావ డం ప్రారంభించారని పేర్కొన్నారు. దర్యాప్తులో కూడా పొంతనలేని జవాబులు చెబుతున్నారని, మీడియా రంగంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చని, ఈ దశలో రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని రావల్ వాదించారు. మౌనంగా ఉండటమూ హక్కే.. తొలుత రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దిల్జిత్ సింగ్ అహ్లూవాలియా వాదిస్తూ.. బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. పోలీసులు 40 గంటలపాటు విచారించారని, పోలీసులు తాము కోరుకున్న జవాబులు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా హక్కేనని చెప్పారు. టీవీ9లో శ్రీనిరాజుకు ఉన్న 90 శాతం వాటాను కొనుగోలుకు సైఫ్ మారిషస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ నుంచి సైఫ్ మారిషస్ స్టే ఉత్తర్వులు ఉన్నా వేరే వారికి రూ.500 కోట్లకు విక్రయించారని తెలిపారు. ఒక్కసారిగా సైఫ్ మారిషస్ ఆ కేసును వెనక్కి తీసుకుందని, దీని వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారని, రూ.294 కోట్లు టెర్రరిస్టుల్లాంటి వారికి అందే హవాలా తరహాలో బదిలీలు జరిగాయని, దీనిపై రవిప్రకాశ్ సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన వెంటపడిందని చెప్పారు. ఈ కేసుల వెనుక కుట్ర ఉందని, ఒక కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాకుండా ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారని చెప్పగా, హరేన్ రావల్ కల్పించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈ విధంగా విచారించే వీలుందన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
రవిప్రకాశ్ కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు రేపటికి వాయిదా పడింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఈ రోజు(సోమవారం) హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రవిప్రకాశ్ దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) తమ వాదనలు వినిపిస్తూ..రవిప్రకాశ్ తన 9శాతం షేర్లలో 40 వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. మెజారిటీ షేర్హోల్డర్స్కు తెలియకుండా రూ. 99వేలకు టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేశాడని కోర్టుకు తెలిపారు. కావాలనే శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు వేయించాడని ఆరోపించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు పిలిచిన హాజరు కాలేదని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు. ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
రవిప్రకాశ్ కేసులో తొలగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో విక్రయం తదితర కేసుల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దర్యాప్తులో సహకరించని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ వైఖరిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీవీ9కి సంబంధించి అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పలు సాక్ష్యాలు సంపాదించిన పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణలో తలమునకలయ్యారు. ఇప్పటికే ఫోర్జరీ కేసులో సంస్థ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రవిప్రకాశ్ అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన కేసులపై దృష్టి సారించారు. ఈ కేసులో శివాజీ– రవిప్రకాశ్ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సంగ్రహించిన విషయం తెలిసిందే. చానల్ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా కేసులో కీలకం కానున్నాయి. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకు విక్రయించడంపైనా పోలీసుల సందేహాలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వా ధీనం చేసుకున్న పోలీసులు వాటి విశ్వసనీయతపై నిగ్గు తేల్చనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు సినీనటుడు శివాజీ తనకు మంచిమిత్రుడని చెప్పిన రవిప్రకాశ్.. అతన్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మౌనం వహించడం విశేషం. మరోవైపు సైబరాబాద్ పోలీసులపైనా రవిప్రకాశ్ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్ విచారణను సాంతం పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. రెండు కమిషనరేట్లలో పోలీసులు ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలు సరిపోలేదని అనిపిస్తే.. మరోసారి రవిప్రకాశ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళతాం.. రవిప్రకాశ్ కేసు విషయమై ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్ కుమార్ సైబరాబాద్ కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు ఫిర్యాదులోని అం శాల ఆధారంగా జరుగుతోంది. తదుపరి విచారణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను సోమవారం న్యాయస్థానం ముందుంచుతాం. తదుపరి దర్యాప్తు ముందుకుసాగేలా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తాం.. అని అన్నారు. లోపల ఒకలా.. బయట మరోలా.. కేసు సాంతం రవిప్రకాశ్ వ్యవహారశైలి వింత గా ఉంటూ వస్తోంది. లోపల విచారణలో ఒకలా.. బయట మీడియాకు మరోలా కనిపిస్తూ.. విచార ణను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. లోపల మాత్రం దర్యాప్తునకు సహకరించట్లేదు. కేసు నమోదైనప్పటి నుంచి కోర్టులో పిటిషన్ల విచా రణ జరుగుతున్నపుడు వాటిపై ప్రభావం చూపేలా 9వ తేదీన ఒకసారి, 22న మరోసారి వీడియోలు రిలీజ్ చేశాడు. విచారణకు హాజరైనప్పుడు మాత్రం ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. పైగా ప్రశ్నావళి రాసిస్తే.. తాను వాటికి సమాధానాలు రాసిస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓ 10 నిమిషాలు ప్రశ్నలు అడిగాక తల టేబుల్‌పై పెట్టుకుని పడుకుంటున్నారు. విచారణ కు సంబంధించిన వీడియో రికార్డింగ్ అంతా తనికివ్వాలంటూ పోలీసులను కోరుతున్నారు. 6 నెలల తరువాత అసలు యుద్ధం మొదలుపెడతా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఒక్కటి కూడా పాటించకుండా విచారణకు సహకరించడం లేదు. -
రవి ప్రకాష్ బయట ఒకలా.. లోపల ఒకలా..
సైబరాబాద్ : టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాష్ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా.. లోపల ఒకలా వ్యవహరిస్తున్నారని బంజారాహిల్స్ పోలీసు అధికారులు తెలిపారు. రవి ప్రకాష్‌ను గత మూడు రోజులుగా విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. విచారణకు ముందు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చే రవి ప్రకాష్‌ను విచారించామన్నారు. ఆయనను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అలంద మీడియా ఇచ్చిన కేసుపైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్‌ను ప్రశ్నించామన్నారు. రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపారు. నటుడు గరుడ శివాజీకి కూడా ఈ మధ్యనే నోటీసులు పంపామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, రవి ప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టే రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేయాలా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. -
రవిప్రకాశ్ సమాధానాల్లో వాస్తవాలు వెలికితీస్తాం
-
అమ్మే హక్కుంది... విక్రయించలేదు!
సాక్షి, హైదరాబాద్: టీవీ–9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు చుక్కలు చూపించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ విషయం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలిసింది. శుక్రవారం 6 గంటల పాటు ప్రశ్నించినా రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో శనివారం సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని రావాల్సిందిగా ఆదేశిస్తూ రవిప్రకాశ్‌ను ఇంటికి పంపారు. టీవీ–9 కొత్త యాజమాన్యానికి లోగో దక్కకూడదనే కుట్రతోనే రవిప్రకాశ్ ఈ వ్యవహారం నడిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.99 వేలకు టీవీ–9 లోగోను మోజో టీవీకి అక్రమంగా విక్రయించినట్లు ఫోర్జరీ పత్రాలు, తప్పుడు సంతకాలతో మోసం చేశాడంటూ అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు గత నెలలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌కు ‘సీఆర్పీసీ 41 (ఎ)’సెక్షన్ కింద 2 నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసును బేఖాతరు చేసిన రవిప్రకాశ్ గురువారం అందుకున్న రెండో నోటీసుతో దిగివచ్చాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఏసీపీ కేఎస్ రావ్, ఇన్స్పెక్టర్ కళింగ్‌రావుతో కూడిన బృందం ఆయన్ను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. టీవీ–9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టాలని కుట్ర పన్నారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. లోగోను ఎలా విక్రయించారనే ప్రశ్నకు ‘అది నా సంస్థ. ఆ హక్కు నాకు ఉంది’అంటూ సమాధానం ఇచ్చారని తెలిసింది. దీంతో తీవ్రంగా స్పందించిన పోలీసులు అదే నిజమనుకున్నా... రూ.100 కోట్ల విలువైన సంస్థ లోగోను కేవలం రూ.99 వేలకే అమ్మారంటే నమ్మవచ్చా? అని ప్రశ్నించగా... తాను ఎవరికీ విక్రయించలేదంటూ చెప్పిన రవిప్రకాశ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా పొంతన లేని సమాధానాలు చెబుతూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. సాయంత్రం వరకు విచారించి ఆపై ఆ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తీసుకుని శనివారం రమ్మని పంపారు. శుక్రవారం నాటి విచారణలో రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అటు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు, ఇటు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుల విచారణలను తప్పించుకోవడానికి రవిప్రకాశ్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు అందుకు చెక్ చెప్పడానికి రవిప్రకాశ్ గతంలో అజ్ఞాతంలో ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎలా తలదాచుకున్నారు? సహకరించింది ఎవరు? అనే అంశాలను సాంకేతికంగా సంగ్రహిస్తున్నట్లు సమాచారం. రవిప్రకాశ్ అరెస్టు నేడు! ఫోర్జరీ, నిధుల మళ్లింపు వ్యవహారంలో పోలీసులు కేసు వేగవంతం చేశారు. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా కూడా అడిగిన పోలీసులు శనివారం అరెస్టుపై నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం సైబరాబాద్ పోలీసు విచారణ సందర్భంగా రవిప్రకాశ్ పోలీసులనే బెదిరించడం సంచలనం రేపుతోంది. ‘‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది’’అని బెదిరించే ప్రయత్నం చేయడం గమనార్హం. పోలీసులపై పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తూ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడన్న కారణంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులు మీడియా పాయింట్‌ను ఎత్తేశారు. దీంతో రవిప్రకాశ్ నేరుగా తమపైనే బెదిరింపులకు దిగాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో సీరియస్ అయిన పోలీసులు సీపీ సజ్జనార్‌తో సమావేశమై, అరెస్టు విషయమై చర్చించారని సమాచారం. ఫోర్జరీ ఆరోపణ అంగీకారం.. మొత్తం 3 రోజుల సైబరాబాద్ విచారణలో రవిప్రకాశ్ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఫోర్జరీ కేసులో సంతకాన్ని తానే ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. ఎలా ఫోర్జరీకి పాల్పడిందీ.. పోలీసులకు వివరించాడు. ఈ పనికి ఎందుకు పాల్ప డ్డావంటే మాత్రం సమాధానం దాటవేశాడు. అతని మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు పోలీసులు నిందితుడి చేతిరాతను సేకరించారు. ఫోర్జరీ కేసులో ఈ చేతిరాతను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. విచారణనంతా పోలీ సులు వీడియో రికార్డింగ్ చేశారు. మొత్తానికి ఈ కేసులో శనివారం పలు కీలక మలుపులు చోటుచేసుకోనున్నాయి. -
రవి ప్రకాష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని సమాచారం. ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో రవి ప్రకాష్నుంచి కీలక ఆధారాలను రాబట్టిన పోలీసులు ఆరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం. రవి ప్రకాష్ ఈ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజుల విచారణలో పోలీసులకు సహకరించని రవి ప్రకాష్ నాల్గవ రోజు కూడా తన పంథాను కొనసాగించారు. యాజమాన్యం మార్పిడి తర్వాత టీవీ9 లోగో కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవి ప్రకాష్ కుట్ర పన్నారు. లోగో అక్రమ విక్రయం కేసులో రవి ప్రకాష్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. టీవీ9 లోగోను సీఈఓ స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఎలా విక్రయించాలనుకున్నారని, లోగోను అమ్మేయాలనుకుంటే యాజమాన్యానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మూడు రోజులపాటు విచారించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. మూడు రోజుల విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. రవి ప్రకాష్‌కు పెన్ను, పేపర్ ఇచ్చి గంట సేపు పరిశీలించారు. అతడు పేపర్‌పై రాసిన విధానాన్ని బట్టి అతని మానసిక స్థితిని, చేతి రాతను పరిశీలించారు. ఫోర్జరీ విషయంలో రవి ప్రకాష్ చేతి వ్రాతను సేకరించారు. దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ఎస్ఎల్కు పంపారు. రవి ప్రకాష్ ఇన్ని రోజులు ఎక్కడ తలదాచుకున్నారో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పూర్తి సమాచారం దొరికింది. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ నిమిత్తం గత మూడు రోజులుగా సైబర్ క్రైం పోలీసుల ఎదుట ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అయితే, సైబర్ క్రైం పోలీసులకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. మొదటి రోజు దాదాపు 5 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించగా.. ఆయన నోరు మెదపలేదు. దీంతో నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక రెండో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్ కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చారు. డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. ఫోర్జరీ చేసిన విధానం కూడా వివరించారు. కానీ, దేనికోసం ఫోర్జరీ చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇక మూడో రోజు విచారణకు గురువారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. నిన్న కూడా తీరు మారలేదు. రవిప్రకాశ్ పోలీసుల ప్రశ్నలకు స్పందించలేదు. పైగా విచారణ అధికారులను బెదిరించే యత్నం చేశారు. ‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు మీకూ టైమ్ వస్తుంది’ అన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. -
రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు
-
రవి ప్రకాష్‌కు పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్ రేపు(శుక్రవారం) బంజారాహిల్స్ పోలీస్ స్టేసన్‌కు వెళ్లే అవకాశం ఉంది. కాగా మూడవ రోజు రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. ఈ గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అయితే, గత రెండు రోజుల విచారణలో రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. -
మూడోరోజు విచారణకు రవిప్రకాశ్
-
మూడోరోజు విచారణకు హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మూడోరోజు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10 గంటలు సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఆయనను 5 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే, రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక రెండోరోజు కూడా ఆయన తీరు మారలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. (రెండోరోజూ అదే తీరు!) ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. -
రెండోరోజూ అదే తీరు!
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ తీరు మారలేదు. రెండోరోజు కూడా ఆయన పోలీసులకు సహకరించలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలివే... రవిప్రకాశ్‌ని విచారించడానికి పోలీసులు ముందుగానే ప్రశ్నావళిని సిద్ధం చేసుకు న్నారు. ‘‘కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఎవరు, ఎందుకు ఫోర్జరీ చేశారు? తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించ డానికి కారణాలేంటి? శివాజీకి 40వేల షేర్లు ఎందుకు విక్రయించారు? మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు మోసగించారు? టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా’’అంటూ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కాగా, తనపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా మోజో టీవీని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాశ్ మీడియా ముందు ధ్వజమెత్తారు. పెండింగ్‌లోనే మరో కేసు... టీవీ9 వ్యవహారంలో రవిప్రకాశ్‌పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లోనూ మరో కేసు పెండింగ్‌లో ఉంది. టీవీ9 లోగో, కాపీ రైట్స్, ట్రేడ్‌మార్కులను 2018 మే నెలలో మోజో టీవీకి విక్రయించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో ఇచ్చిన నోటీసుకు రవిప్రకాశ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రెండోసారి నోటీసు జారీచేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. రెండో నోటీసు జారీచేసిన తర్వాత కూడా విచారణకు హాజరు కాకుంటే రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. -
రవిప్రకాశ్‌కు పోలీసుల ప్రశ్నల పరంపర
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. రవిప్రకాశ్‌ను మంగళవారం ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక సైబర్ క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం స్టేషన్లోకి వెళ్లారు. ఆయనకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. (సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్) కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించడానికి కారణాలేంటి..? శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు చీట్ చేశారు ? మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా..! టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా..? టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా..? యాజమాన్యానికి తెలియకుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..? లేదా..? ఒకవేళ మీరు ఎలాంటి తప్పులు చేయనప్పుడు నెలరోజులుగా ఎందుకు తప్పించుకు తిరిగారు...పోలీసులకు ఎప్పుడో లొంగిపోయి వివరణ ఇస్తే అయిపోయేది కదా.. అని పోలీసులు రవిప్రకాశ్‌కు పలు ప్రశ్నలు సందించారు. -
రెండోరోజు విచారణకు రవిప్రకాశ్..
-
సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా.. 27 రోజులుగా పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఎట్టకేలకు మంగళవారం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్‌ను నిన్న ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. (పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్) సైబర్‌క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మీడియాకు మాఫియాకు తెలుగు నెలమీద యుద్ధం జరుగుతోంది. మీడియా వైపు మేమున్నాం. ప్రజలంతా మీడియా వైపు ఉండాలి. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మీడియా కబ్జాకాండ కొనసాగుతోంది. దొంగ పత్రాలు సృష్టించి, పొలీసులు, రెవెన్యూ అధికారులు పేద రైతుల్ని ఒత్తిడి చేసి ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను ఆక్రమిస్తున్నారు. నాకు కొంత మంది మిత్రులు ఉన్నారు. వారంతా కలసి మోజో టీవీని నెలకొల్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈ లేకి తనాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి. మీడియా కబ్జాపై జర్నలిస్టులందరూ పోరాడాలి. ప్రజలందరూ మీడియా కబ్జాపై గళం ఎత్తాలని కోరుతున్నా’అని ముగించారు. -
పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఎట్టకేలకు 27 రోజుల పరారీ తర్వాత పోలీసుల ఎదుటకు వచ్చాడు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పోర్షే కారులో(పీవీ05సీ 0055) రవిప్రకాశ్ సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విలేకరులను పలకరిస్తూ నేరుగా కార్యాలయంలోకి వెళ్లిపోయాడు. 5 గంటల పాటు విచారణ: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్‌ను ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు అడ్డదిడ్డమైన సమాధానాలతో పాటు అప్పుడు తాను లేనని, తనకు గుర్తు లేదని, తన లాయర్లు సమాధానం చెబుతారంటూ దాటవేసే విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోసారి హాజరు కావాలని నోటీస్: బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌కు నోటీస్ ఇచ్చినట్టు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్ సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. విచారణ అనంతరం రవిప్రకాశ్ మాట్లాడారు. ‘‘టీవీ9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారు. నాపై దొంగ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టీవీ9 నుంచి బయటికి పంపించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్న. ఇది మాఫియాకు, మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది’’అని పేర్కొన్నారు. నమోదైన కేసులివే: శొంఠినేని శివాజీతో కలిసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీ పత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్‌పై అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, 66, 72 ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. మరో కేసులో రవిప్రకాశ్‌తోపాటు ఎంకేవీఎన్ మూర్తిపైనా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మే 9వ తేదీన టీవీ9 కార్యాలయంతోపాటు, బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ నివాసం, హిమాయత్‌నగర్‌లోని శివాజీ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. పలు కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సమాచారం చెరిపివేసినా.. పోలీసులు తిరిగి సంగ్రహించగలిగారు. ఇదే క్రమంలో రవిప్రకాశ్‌పై మే 16వ తేదీన టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్కులు 2018 మేలో మీడియా నెక్టŠస్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120(బీ)సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తర్వాత ఆయా కేసుల్లో విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ 160 కింద పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. మరో రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద అతని ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. రవిప్రకాశ్ దేశం దాటకుండా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో లుక్ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. గత్యంతరం లేకనే వచ్చాడు: పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా రవిప్రకాశ్ అందుబాటులోకి రాలేదు. అతను ఏపీలో తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. ఏపీలో అతడికి మద్దతిచ్చే రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికితోడు రెండుసార్లు, హైకోర్టు లో.. ఆఖరుగా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌కు విశ్వప్రయత్నాలు చేశాడు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. మరో నిందితుడైన శివాజీ రేపోమాపో బయటకు వస్తాడని పోలీసులు భావిస్తున్నారు. -
ముందస్తు బెయిల్ రద్దు.. పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్
-
పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్‌పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. దారులన్నీ మూసుకుపోవడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయినట్టుగా తెలుస్తోంది. అన్ని విషయాలపై ప్రశ్నిస్తాం : సైబర్ క్రైమ్ ఏసీపీ రవిప్రకాశ్ విచారణకు హాజరు కావడంపై సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాసరావు స్పందించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. రవిప్రకాశ్ చెప్పేదాన్ని బట్టి ఎన్ని రోజులు విచారణ చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో అతన్ని ప్రశ్నిస్తామని వెల్లడించారు. రవిప్రకాశ్‌పై కేసులు.. శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు 2018 మేలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే రవిప్రకాశ్ కోసం పోలీసులు ఆయా నగరాల్లో గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్ కార్డులు మారుస్తూ. సోషల్ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చదవండి : సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు -
రవిప్రకాశ్ లొంగిపోవడమే శరణ్యం..
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్‌కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. తరువాత బెంగళూరుకు, అక్కడ నుంచి ముంబై, గుజరాత్‌కు వెళ్లినట్లు.. తెలవడంతో పోలీసులు ఆయా నగరాల్లో అతని కోసం గాలించారు. పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్ కార్డులు మారుస్తూ. సోషల్ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒత్తిడి పెంచుతున్న బృందాలు శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్ట, నిధుల మళఙ్లంపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు 2018 మేలో మీడియా నెక్ట్స ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్సీ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. లొంగిపోవడమే శరణ్యం.. వాస్తవానికి మే చివరి వారంలో రవిప్రకాశ్ లొంగిపోతాడన్న సమాచారం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సాధ్యపడలేదని సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఇప్పుడు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు. ఇందే సమయంలో రవిప్రకాశ్‌తో పాటు మరారీలో ఉన్న మరో నిందితుడు శివాజీ ఆచూకీ కూడా పోలీసులకు ఇంతవరకు చిక్కలేదు. పోలీసులు అన్ని వైపులా ఒత్తిడి పెంచుతుండడంతో వీరిద్దరూ లొంగిపోతారా? పరారీలోనే ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురైంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెడుతూ తాజాగా మెరిట్ ఆధారంగా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ రవిప్రకాశ్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్లు 160, 41ఏ కింద రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రవిప్రకాశ్ విచారణకు హాజరుకాలేదని వాదించారు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే పోలీసులు పదేపదే ఆయన ఇంటికొచ్చి సోదాలు చేస్తున్నారని చెప్పగా, అది తప్పుడు విశ్లేషణ అంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ చేశారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేస్తే తప్పుకుండా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ కేసులో తాము ముందస్తు బెయిల్ ఇవ్వబోమని తెలిపింది. ముందస్తు బెయిల్ కోసం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని చెప్పింది. హైకోర్టు రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌ను మెరిట్స్ ఆధారంగా విచారణ జరపకుండా కొట్టేయడంతో.. ఈ కేసును హైకోర్టు తిరిగి విచారించాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. జూన్ 10న మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తేల్చాలని ఆదేశించింది. పోలీసులు ఒకవేళ రవిప్రకాశ్‌ను అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
-
రవిప్రకాశ్ కోసం గాలింపు ముమ్మరం
-
తప్పించుకు తిరుగువాడు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల విషయంలో పోలీసుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఈ కేసుల్లో నిందితులంతా దేశం వదిలిపోకుండా ఇప్పటికే విమానాశ్రయాలు, షిప్‌యార్డుల్లో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తుండటం, నిందితుల సన్నిహితులు, స్నేహితులపై నిఘా తీవ్రతరం చేస్తున్నారు. ఈ కేసుల్లో తప్పకుండా పురోగతి ఉంటుందని, వారిని తప్పకుండా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. దీనికితోడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిందితులకు వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. దీంతో పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. ఇప్పుడు తమ లాయర్ల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తూ ముందస్తు బెయిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లోను ముఖ్య నిందితులంతా.. ఏపీలో తలదాచుకున్నారన్న విమర్శలు రావడం, ఇప్పుడు రాజకీయంగా వారికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని సమాచారం. దీంతో ఆ ప్రాంతం తమకు అంత సురక్షితం కాదని భావించి ఇప్పటికే మరో చోటుకు మకాం మార్చారని సమాచారం. పట్టువదలని డాకవరం.. జాతీయస్థాయిలో సంచలనం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత డాకవరం అశోక్ అరెస్టును తప్పించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ కేసులో ఫిబ్రవరి 23 తర్వాత కేసు నమోదైంది. అప్పటికే డాకవరం రాష్ట్రం సరిహద్దులు దాటి పారిపోయాడు. అతనికి ఏపీలోని కొందరు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. పైగా అప్పటి ఏపీలోని ప్రభుత్వం పెద్దలు అశోక్‌కు బహిరంగంగా మద్దతివ్వడం కూడా చర్చనీయాంశమైంది. పోలీసులు తన కోసం గాలిస్తుండగానే.. అశోక్ మాత్రం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో అశోక్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. విచిత్రంగా మే 24 నుంచి ఈసారి ఎల్బీనగర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన తిరిగి బుధవారం హైకోర్టును ఆశ్రయించాడు. రవిప్రకాశ్ ఏకంగా సుప్రీంకే..! డేటాచౌర్యం, ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీలు ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160, 41ఏల కింద 2 సార్లు నోటీసులు ఇచ్చినా.. ఇంతవరకూ పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ముందస్తు బెయిలు కోసం 2 సార్లు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తాజాగా రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఆయనపైనా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి దేశం వదిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్ ఇప్పటికే ఏపీ వదిలి ఉత్తరభారతానికి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
సాక్షి, న్యూఢిల్లీ : టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే, ఆయన ఇంతవరకు పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ భంగపాటు ఎదురైంది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టు గుమ్మం తొక్కారు. మరోవైపు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
రవిప్రకాశ్ కోసం గాలింపు ముమ్మరం!
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ ఇంతవరకూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భంగపాటే మిగిలింది. ఏపీ వదిలి వెళ్లాడా? తెలంగాణ నుంచి పరారైన రవిప్రకాశ్ ఏపీలోని అప్పటి అధికార పార్టీ నేతల వద్ద తలదాచుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరోచోటుకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, బెంగళూరు, విజయవాడలతోపాటు ముంబై, గుజరాత్‌లోనూ రవిప్రకాశ్ తలదాచుకునే అవకాశాలు ఉండటంతో రెండు టీంలు అక్కడా వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిప్రకాశ్ తన ఆచూకీ చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా దాదాపు 30 వరకు సిమ్‌కార్డులు మార్చాడని సమాచారం. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మాత్రం సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పోలీసుల విచారణకు బాగానే సహకరిస్తున్నారు. -
ఇంకా అజ్ఞాతంలో రవిప్రకాశ్
-
రవిప్రకాశ్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 టేకోవర్ విషయంలో సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్–ఐ విజన్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. కోర్టు వెలుపల ఈ రెండు కంపెనీలు రాజీ చేసుకోవడంతో ఐ విజన్‌పై సైఫ్ మారిషస్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ ) శుక్రవారం అనుమతిచ్చింది. ఈ పిటిషన్‌పై టీవీ9 మాజీ సీఈవో వి. రవిబాబు అలియాస్ రవిప్రకాశ్ చేసిన అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. రవిప్రకాశ్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్)కు సంబంధించిన అంతర్గత వివాదాలని గుర్తుచేసింది. ఏబీసీఎల్ టేకోవర్, ఆ కంపెనీ నుంచి రవిప్రకాశ్, ఇతరులు డైరెక్టర్లుగా తొలగింపు తదితర వివాదాలను ఈ వ్యాజ్యంలో లేవనెత్తడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాలు సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణను తిరస్కరించడానికి ఎంతమాత్రం కారణాలు కాజాలవని పేర్కొంది. ఈ అంశాలన్నింటిపై రవిప్రకాశ్ ఇప్పటికే ఇదే ట్రిబ్యునల్‌లో మరో పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. ఆ పిటిషన్ విచారణపై జూన్ 12 వరకు స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుం టూ ఐ విజన్ మీడియాపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సైఫ్ మారిషస్ కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు (జ్యూడీషియల్) కె.అనంత పద్మనాభస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ సైఫ్–ఐ విజన్ మధ్య వివాదం... తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐ విజన్ వాటాల బదలాయింపు చేయలేదని, అదే విధంగా ఎన్సీఎల్టీ ఆదేశాల మేరకు నడుచుకోలేదంటూ సైఫ్ మారిషస్ గత ఏడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే, ఈ రెండు కంపెనీల మధ్య ట్రిబ్యునల్ వెలుపల రాజీ కుదిరింది. దీంతో ఐ విజన్ మీడియాపై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది. అయితే దీనిపై రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని సైఫ్ మారిషస్‌కు ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో సైఫ్ పిటిషన్ ఉపసంహరణ నిమిత్తం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన రవిప్రకాశ్ సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించవద్దంటూ అభ్యంతరాలు లేవనెత్తారు. టీవీ 9లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ అందులో ప్రస్తావించారు. రవిప్రకాశ్ జోక్యంపై అభ్యంతరాలు... రవిప్రకాశ్ దాఖలు లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై అటు సైఫ్ మారిషస్, ఐ విజన్ మీడియా, ఇటు ఏబీసీఎల్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు తమ మధ్య లావాదేవీల్లో రవిప్రకాశ్‌కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపాయి. సంబంధం లేని వ్యక్తి లేవనెత్తే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అందరి వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు అనంత పద్మనాభస్వామి సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చారు. చట్ట ప్రకారం పిటిషన్‌ను ఉపసంహరించుకునే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. సైఫ్–ఐ విజన్లు రాజీకొచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సంబంధం లేని వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని వీఎల్ఎస్ వర్సెస్ సౌత్ ఎండ్ ఇన్ఫ్రా కేసులో ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును ఉదహరించారు. -
ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ముందుస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయగా.. తాజగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)లో చుక్కెదురైంది. ఎన్సీఎల్టీలో ఏబీసీఎల్కు వ్యతిరేకంగా సైఫ్ మరిషస్ కంపెనీ వేసిన పిటిషన్‌ను అడ్డుపెట్టుకుని టీవీ9 యాజమన్య బదిలీని అడ్డుకోవాలని రవిప్రకాశ్ ప్రయత్నించారు. అయితే రెండు కంపెనీల మధ్య వివాదం ముగిసి సయోద్య కుదరడంతో ఏబీసీఎల్‌పై మారిషస్ కంపెనీ వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాడాన్ని ఎన్సీఎల్టీ కూడా ఆమోదించింది. దీంతో రవిప్రకాశ్ పన్నిన వ్యూహానికి బ్రేక్ పడింది. అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ పోలీసులు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులకు స్పందించలేదు. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్ జాడకోసం సైబర్‌క్రైం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఓ వీడియో సందేశం ద్వారా టీవీ9 నూతన యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేసిన రవిప్రకాశ్.. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తుండగా తనపై పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారన్న విషయం తెలిసిందే. -
పోలీసులు అరెస్ట్ చేస్తారని.. గోడ దూకి పారిపోయా
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బంజారాహిల్స్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో గోడ దూకి పారిపోయానని, పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలన్న రవిప్రకాశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టేసింది. రవిప్రకాశ్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇప్పటికే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని, ఈ కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయి... ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి తీరాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. అందుకే ఒకే అంశానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారన్నారు. పిటిషనర్ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారని, వాస్తవానికి ఆ డాక్యుమెంట్లు గతేడాది ఏప్రిల్ 18న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు సమర్పించారని తెలిపారు. దాదాపు ఏడాది తరువాత పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఎన్సీఎల్టీ ముందు విచారణలో ఉన్న వ్యవహారంలో కేసు నమోదు చేయడం దురుద్దేశాలతో కూడుకున్నదని వివరించారు. దురు ద్దేశాలతో కేసు నమోదు చేసినప్పుడు, ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు ఇప్పటికే సీఆర్సీపీ సెక్షన్ 41–ఏ, సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ స్పందించలేదన్నారు. ముందు ఆయనను పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకే అప్పుడు గోడ దూకి పారిపోయారు... ఈ సమయంలో అహ్లువాలియా స్పందిస్తూ ఇటీవల టీవీ9 స్టూడియాలోకి వచ్చిన పోలీసులు రవిప్రకాశ్ అరెస్ట్‌కు ప్రయత్నించడంతో ఆయన గోడ దూకి పారిపోయారని తెలిపారు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల గురించి పోలీసులు కేసు పెట్టారని, అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్సీఎల్టీ తప్ప పోలీసులు కాదని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఈ వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు... అయితే ఈ వాదనను ప్రతాప్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే కేసును 15 రోజులకు వాయిదా వేయవచ్చునని, ఈలోగా పిటిషనర్‌ను పోలీసులు ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. రవిప్రకాశ్ బయట ఉండి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, ఎటువంటి వాంగ్మూలాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. తామేమీ రవిప్రకాశ్ విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోబోమన్నారు. దీనికి అహ్లువాలియా స్పందిస్తూ, ఆ 15 రోజుల వరకైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందు విచారణకు వస్తే ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచించవచ్చునని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పారిపోయి విలువల గురించి లెక్చర్! టీవీ9 వాటాల వివాదంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్... సమాజం, విలువలంటూ మరోసారి ఉపదేశమిచ్చారు. కేసులకు భయపడి తెలంగాణ వదిలి పారిపోయిన ఆయన.. పోలీసులపై, ఈ వివాదంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసుల నేపథ్యం గురించి బుధవారం రవిప్రకాశ్ మీడియాకు మరో వీడియోను విడుదల చేశారు. తనకు, కొత్త యాజమాన్యానికి ఎక్కడ విభేదాలు వచ్చాయి? అవి ఎలా మొదలయ్యాయి? అంటూ వీడియోలో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. తనకు, సిటీనటుడు శివాజీ మధ్య తలెత్తిన వాటాల వివాదం ఎన్సీఎల్టీ పరిధిలో ఉండగా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులది అజ్ఞానమని అక్కసువెళ్లగక్కారు. కొన్ని మీడియా సంస్థలు తనను ఉగ్రవాదితో పోలుస్తూ పారిపోయానంటూ వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాకు పాఠాలు కూడా చెప్పారు. వీడియో సాంతం.. విలువలు, సమాజహితం అంటూ పదేపదే వల్లె వేసిన రవిప్రకాశ్... ఇంతకీ తానెందుకు పారిపోయానన్నది మాత్రం చెప్పలేదు. కోర్టులపై, చట్టాలపై విజ్ఞత ప్రదర్శిస్తూనే పోలీసులను ఎందుకు తప్పుబడుతున్నదీ మాత్రం చెప్పలేకపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మధ్యలో మీడియా మీద పడటం, వార్తల విషయంలో హితబోధ చేస్తూ అక్కసును బయటపెట్టుకున్నారు. వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు.. రవిప్రకాశ్ వీడియో బయటకు రాగానే సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడి యోను ఎక్కడ షూట్ చేశారు, ఎప్పుడు అప్లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే సిమ్‌కార్డులు, ఫోన్లు మారుస్తూ పోలీసులకు తన జాడ చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవిప్రకాశ్‌కు ఈ వీడియో తీయడంలో ఎవరైనా సాయం చేశారా? అతని ఫోన్ నుంచే అప్లోడ్ చేశారా? అనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే వారు పురోగతి సాధించినట్లు సమాచారం. -
రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందుస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్‌ను ధర్మాసం కొట్టివేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. రవిప్రకాష్ వేసిన బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగ్గా.. ఆయన తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది దిల్జిత్ సింగ్ ఆహువాల్య వాదనలు వినిపించారు. నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తుండగా పోలీసులు రవిప్రకాశ్‌పై అక్రమ కేసులు పెట్టారని, ఒకే వ్యక్తి పై మూడు చోట్ల వేర్వేరు కేసులు నమోదు చేశారని ఆహువాల్య వాదించారు. రవిప్రకాశ్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనికి కౌంటర్‌గా.. పోలీసుల ముందు హాజరు కావాలని ఇప్పటికే రవిప్రకాష్ రెండు సార్లు 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ఈ నోటీసులకు స్పందించకపోతే 41ఏ నోటీసులు కూడా ఇచ్చామని, వాట్సాప్ కాల్లో అందరితో రవిప్రకాష్ టచ్‌లో ఉంటున్నాడని, పోలీసుల విచారణకు మాత్రం హాజరు కావడం లేదన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41ఏ నోటీసుల తర్వాత ఈ స్టేజిలో బెయిల్ ఇవ్వలేమని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇక అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ టీవీ9 నూతన యాజమన్యమే తనపై తప్పుడు కేసులు పెట్టించిందని ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఈ వీడియోలో వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీవీ9 లోగో సృష్టికర్త తనేనని, అది తన సొంతమని పేర్కొన్నారు. రవిప్రకాశ్ వ్యాఖ్యలపై టీవీ9 నూతన యాజమన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కేసులు పెట్టినప్పుడు పారిపోవడందేనికని ప్రశ్నించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రవిప్రకాశ్‌పై టీవీ9 ఆగ్రహం!
-
రవిప్రకాశ్‌పై టీవీ9 ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్ : అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఆ చానల్ నూతన యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ రవిప్రకాశ్ విడుదల చేసిన వీడియోపై చానల్ యాజమాన్యం స్పందించింది. ఈ వీడియోలో రవిప్రకాశ్ చేసిన ఆరోపణలను టీవీ9 యాజమాన్యం ఖండించింది. తప్పుడు కేసులైతే పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది. టీవీ9 సంస్థకు చెందిన లోగోను తన సొంతమనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీసీఎల్ సంస్థలో మెజారిటీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించేందుకు రవిప్రకాష్ యత్నించాడని, పలు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించింది. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరగడమని నిలదీసింది. ఇక టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని రవిప్రకాశ్ ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఈ వీడియోలో వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీవీ9 లోగో సృష్టికర్త తనేనని, అది తన సొంతమని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్ వీడియో సందేశం!
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియో ఆధారంగా రవిప్రకాష్ ఎక్కడ ఉన్నాడనే కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఇక ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. -
రవిప్రకాశ్ మరోసారి...
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. వీరిద్దరిని ప్రశ్నిస్తేనే కేసులు కొలిక్కి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
రవిప్రకాశ్ కోసం మూడు బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. అతని ఆచూకీ కోసం ఇప్పటికే మూడు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాశ్‌కు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. వారి వద్దే సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రముఖుల అండతోనే శివాజీ తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఇందుకోసం లాయర్లు, అనుచరులతో మాట్లాడేందుకు పదేపదే సిమ్‌కార్డులు మారుస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్స్‌ను కూడా వాడుతున్నారని సమాచారం. పోలీసులు అతని కాల్స్‌పై నిఘా పెట్టారు. అయితే, ఆయన నిత్యం ఫోన్లు మారుస్తున్నట్లు గుర్తించారు. ఎవరి కేసు వారిదే..! రవిప్రకాశ్ కేసుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్‌లో నమోదయ్యాయి. శివాజీతో కలసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీపత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్కులు 2018 మే నెలలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్‌ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120 (బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండింటిలో నిందితుడు ఒకరే అయినా కేసుల నేపథ్యం వేర్వేరు కావడంతో ఎవరి దర్యాప్తును వారే కొనసాగించాల్సి వస్తోంది. గతంలో ఐటీ గ్రిడ్ వ్యవహారంలో మాదాపూర్, ఎస్సార్‌నగర్ ఠాణాలలో ఫిర్యాదులు అందాయి. నేరస్వభావం ఒకటే కావడంతో ఈ రెండు కేసులను కలిపి విచారించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. రవిప్రకాశ్ కోసం పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్ మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిరణ్‌లు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. రవిప్రకాశ్ విషయంలో పాత ఉద్యోగులను కూడా పోలీసులు పిలిపించి కూపీలాగుతున్నారు. అవకతవకల విషయంలో పలు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ముందస్తు బెయిలివ్వండి
సాక్షి, హైదరాబాద్: పరారీలో ఉన్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం (22న) హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్య మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారన్నారు. తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చి ఎన్సీఎల్టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల వెనకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లదని ఆయన అన్నారు. ఎన్సీఎల్టీలో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు. పాత తేదీతో డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్సీఎల్టీ తేల్చాల్సి ఉందన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని రవిప్రకాశ్ తెలిపారు. -
మరోసారి హైకోర్టుకు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చిన ఎన్సీఎల్టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల నమోదు వెనుకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లదన్నారు. ఎన్సీఎల్టీలో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు. పాత తేదీతో డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్సీఎల్టీ తేల్చాల్సి ఉందన్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తూ తన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారని, తద్వారా అరెస్ట్‌ను తనకు రుచి చూపించాలన్న కృతనిశ్చయంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునన్నారు. ముందస్తు బెయిలు, తాత్కాలిక ముందస్తు బెయిల్ ఏ ఏ సందర్భాల్లో ఇవ్వొచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తి సహకరిస్తానని తెలిపారు. కాగా నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేశారు. -
నోటీసులివ్వగానే పరార్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేసినా, దాదాపు అందరూ పోలీసుల విచారణకు వెంటనే రాలేదు. రేపని.. మాపని.. ఆరోగ్యం బాగాలేదని.. అందుబాటులో లేమంటూ.. రకరకాల కారణాలు చెప్పి విచారణను వీలైనంత జాప్యం చేశారు. ఈలోగా కేసు గురించి అంతా మర్చిపోయారు. ఇది ఇలాంటి కేసుల్లో ఇరుక్కునే వారికి ప్రాథమిక పాఠంగా మారింది. విచారణను వీలైనంత జాప్యం చేస్తే.. కేసు గురించి అంతా మర్చిపోతారన్న సంకేతాలు బలంగా వెళ్లాయి. అది మొదలు.. ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న వారెవరూ పోలీసు విచారణ అంటే పెద్దగా బెదిరిపోవడం లేదు. వెసులుబాటే ఆసరా.. ఓటుకు కోట్లు కేసులో నిందితుడు మత్తయ్య నుంచి ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ వరకు అందరూ ఇదే పోకడ అనుసరిస్తుండటం గమనార్హం. విచిత్రంగా ఓటుకు కోట్లు, ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులు ఆరంభంలో తీవ్ర సంచలనం రేపాయి. కానీ, కాలక్రమంలో రెండు కేసుల్లో ఇంత వరకూ పెద్దగా పురోగతి లేకపోవడం, నత్తకు తాతలా దర్యాప్తు సాగడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూడు ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలే కావడంతో పోలీసులు నిబంధనల ప్రకారం.. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. వీటిని అందుకున్న నిందితులు కేసు దర్యాప్తును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో విచారణకు డుమ్మా కొడుతున్నారు. తెలంగాణలో ఉంటే పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు. వీరంతా ఏపీకి వెళ్లడం, అక్కడి అధికార టీడీపీ నిందితులకు మద్దతు పలకడం విశేషం. ఒకవేళ తెలంగాణ పోలీసులు వెళ్లినా.. వారికి నిందితులను అరెస్టు చేయడం కష్టం అవుతుండటంతో ఈ కేసుల్లో విపరీతమైన జాప్యం నెలకొంటోంది. మత్తయ్య బాటలో ఏపీకి పారిపోయిన ఐటీ గ్రిడ్ అశోక్, రవిప్రకాశ్ ఆచూకీని ఇంతవరకూ పోలీసులు కనిపెట్టలేకపోయారు. వాస్తవానికి క్లిష్టమైన కేసుల చిక్కముడులు విప్పడంలో, వివిధ నేరాల్లో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్ర పోలీసులు అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటున్నారు. కానీ, ఈ మూడు కేసుల్లో మాత్రం దర్యాప్తు తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సాగడం గమనార్హం. -
రవిప్రకాశ్ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం
-
ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్!
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్‌మార్క్‌లను కేవలం రూ. 99 వేలకే మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్ డీడీలు అమలు చేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై కేసు నమోదవడం తెలిసిందే. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ హాజరుకాకపోవడంతో ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం గుర్తించినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్లే ముందురోజే రవిప్రకాశ్ జారుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టగా రవిప్రకాశ్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని రవిప్రకాశ్ ఇంటితోపాటు ఆయన సన్నిహితుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. మరోవైపు టీవీ9 వాటాల వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించడంతోపాటు సంతకం ఫోర్జరీ చేశారన్న కేసులో నిందితులైన రవిప్రకాశ్, నటుడు శివాజీ అచూకీ కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీల కోసం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రవిప్రకాశ్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు జారుకున్నట్లు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ నోటీసుల వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేది తెలియాల్సి ఉంది. పోలీసుల ముందు హాజరైన హరికిరణ్... టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లను అక్రమంగా బదలాయించుకున్న కేసులో మీడియా నెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత హరికిరణ్ చెరెడ్డిపై కేసు నమోదవడంతో ఆయన శనివారం బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎప్పుడు పిలిచినా హాజరవుతానని లిఖితపూర్వక లేఖను పోలీసులకు అందించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఎవో ఎంవీకేఎన్ మూర్తి ఇప్పటికే సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. రవిప్రకాశ్ అడ్వొకేట్ ఇంట్లో సోదాలు.. టీవీ9 వాటాల వ్యవహరంలో తప్పుడు పత్రాలు సృష్టించారంటూ రవిప్రకాశ్‌పై నమోదైన కేసులో ఆయన అడ్వొకేట్ జె.కనకరాజ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు శనివారం సోదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీ ప్లాట్ నంబర్ 40లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేసి కీలక సాక్ష్యాలు సేకరించినట్లు తెలిసింది. వడదెబ్బ వల్ల విశ్రాంతి తీసుకుంటున్నా: శివాజీ తమిళనాడు, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల వడదెబ్బ తగలడంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తాను ఎక్కడికీ పారిపోలేదని శనివారం విడుదల చేసిన వీడియోలో శివాజీ పేర్కొన్నాడు. రవిప్రకాశ్‌కు, తనకు మధ్యలో ఉన్న చిన్న పంచాయితీని కొన్ని మీడి యా సంస్థలు చిలువలు పలువలుగా చేసి చూపిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ‘ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కేసు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. పోరాడతా. మరికొంతకాలం విశ్రాంతి తీసుకొని బయటకు వస్తా. న్యాయం దొరకడం ఆలస్యం కావచ్చు కానీ చివరకు గెలుపు మాత్రం న్యాయానిదే’అని శివాజీ అన్నాడు. తెలంగాణ పోలీసులు, నాయకులతోపాటు ఏపీ నాయకులపై పలు ఆరోపణలు చేసిన శివాజీ... తాను ఎక్కడ ఉన్నదీ వీడియోలో వెల్లడించకపోవడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : రవిప్రకాశ్ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం -
‘వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’
సాక్షి, హైదరాబాద్: నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. వామ్మో రవి ప్రకాశూ నువ్వు మామూలోడివి కాదంటూ ఆయన అక్రమాల పుట్టను భట్టబయలు చేశారు. ‘‘బ్రోకర్ శివాజీని పట్టుకుని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నిస్తే గరుడ పురాణం స్క్రిప్ట్ ఎవరిచ్చారో కక్కేస్తాడు. అది మీడియా ‘నయీం’ పనే అని తేలుతుంది. ఈ నేరాలు విచారించాలంటే స్పెషల్ కోర్టులు కావాలి. 25 ఏళ్ల క్రితం వేయి జీతానికి పనిచేసినోడు వందల కోట్లు ఎలా పోగేశాడో తేల్చాలి. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్‌ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కాగా అంతకుముందు కూడా రవిప్రకాశ్‌పై విజయసాయి రెడ్డి ట్విట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘‘బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట’’ అంటూ ట్విటర్లో ఆరోపించారు. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్‌ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట.రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు.టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 18 May 2019 -
శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ
-
‘చంద్రబాబు రహస్యాలపై మీడియా నయీం బ్లాక్మెయిల్’
సాక్షి, అమరావతి : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట. జిల్లాకో ఏజెంటును పెట్టి ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కలప స్మగ్లర్లు, రైస్ మిల్లర్లు, కార్పోరేట్ కాలేజీలను బ్లాక్మెయిల్ చేసిన ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట మీడియా ‘నయీం’. ఈనెల 23 తర్వాత తన పరిస్థితే ఏమవుతుందో అంతుబట్టక సతమతమవుతుంటే శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్దన్ చౌదరిల బెదిరింపులతో కుంగిపోతున్నాడట. ఇంత ఈజీగా దొరికి పోయారేంటని మొత్తుకుంటున్నాడట. చంద్రబాబు ఆయన కుల మీడియా పార్ట్నర్ల మోసాలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే నమ్మిన వాళ్లను తడిగుడ్డతో గొంతులు కోయడంలో వాళ్ళ నైపుణ్యం ఏమిటో తెలిసిపోతోంది. గుడితోపాటు గుడిలో లింగాన్ని కూడా మింగటం అనే సామెత వీరిని చూసే పుట్టి ఉంటుంది. బయట పడకపోతే తెలుగు రాష్ట్రాలను శాశ్వతంగా చెరబట్టే వారే' అని విజయసాయిరెడ్డి ట్విటర్లో నిప్పులు చెరిగారు. -
రవిప్రకాశ్, శివాజీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీ, మాజీ సీఎఫ్‌వో మూర్తికి కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా...వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎఫ్‌వో మూర్తి విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరు అయ్యారు. ఈ విచారణలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇక టీవీ9లో వీరు చేసిన అక్రమాలు, తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 2018 ఫిబ్రవరిలో నటుడు శివాజీ, రవి ప్రకాష్, శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. టీవీ9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైనా రవి ప్రకాష్, శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా ? మరింత ఆసక్తిగా మారింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ -
నిందితులకు షెల్టర్‌జోన్‌గా అమరావతి
సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్ జోన్‌గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి. అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్‌లోను, మరో ఫామ్‌హౌస్‌లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం. ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది. తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్‌కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ దొరకని అశోక్ ఆచూకీ.. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్‌కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్ ఎండీ దాకవరపు అశోక్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి. ఆధార్ డేటాబేస్కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్ అయ్యాయని, ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్‌ను కాపాడేందుకు ఏపీఎస్పీ 6 బెటా లియన్తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్ షెల్టర్ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్‌కు చెందిన ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. గరుడ పురాణం శివాజీకి దన్ను ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. -
రవిప్రకాశ్‌కు లొంగిపోయే ఆలోచన లేనట్లేనా?
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగుచూడటం, అవన్నీ రవిప్రకాశ్‌కు ప్రతికూలంగా ఉండటం చూస్తుంటే.. ఈ కేసులో ఆయన రోజురోజుకూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. టీవీ9 యాజమాన్య మార్పు వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో నటుడు శివాజీ, మాజీ సీఈఓ రవిప్రకాశ్లకు చుక్కెదురైంది. దీంతో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలందా మీడియా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో రవిప్రకాశ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తోంది. చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోతున్న క్రమంలో ఇకపై ఆయన ఏం చేస్తారనే అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. అలందాకు తొలగుతున్న అడ్డంకులు ఈ వ్యవహారంలో టీవీ9ని కొనుగోలు చేసిన కొత్త కంపెనీ అలందా మీడియా సంస్థకు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. తాజాగా ఎన్సీఎల్టీ తీర్పుతో ఈ ఎపిసోడ్లో శివాజీ పాత్ర ముగిసినట్లేనని టీవీ9 ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా టీవీ9 యాజమాన్య బదిలీ జరగకుండా శివాజీని అడ్డంపెట్టుకుని రవిప్రకాశ్ వేసిన ఎత్తుగడ ఎన్సీఎల్టీ వద్ద బోల్తా కొట్టిందంటున్నారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న శివాజీ దొరకడమే మిగిలింది. మరో నిందితుడు టీవీ9 మాజీ సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనను పోలీసులుపలుమార్లు విచారించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని పోలీసులు ఆదేశించారు. ఈయన తెలిపిన ఆధారాలతోనే ఈ–మెయిల్ సంభాషణలను పోలీసులు వెలికి తీయగలిగారని తెలిసింది. కానీ, మూర్తి, శివాజీ, రవిప్రకాశ్, న్యాయవాది శక్తి మధ్య జరిగిన ఈ–మెయిల్స్ వ్యవహారం.. ఎలా లీకైందన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. పోలీసులు మాత్రం తాము విడుదల చేయలేదని చెబుతున్నారు. లాయర్ శక్తి పాత్ర కీలకమే! ఈ కేసులో మరో కీలక నిందితుడు న్యాయవాది శక్తి. పాతతేదీలతో రవిప్రకాశ్‌పై ఎన్సీఎల్టీలో వేయాల్సి న వ్యాజ్యం డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలున్నాయి. అలందా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం న్యాయవాది శక్తి కూడా పత్తా లేకుండాపోయారు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనికితోడు రవిప్రకాశ్ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ స్టే ఇవ్వడం, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే అలందా ముందున్న అడ్డంకులు తొలగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే ఆలోచన లేనట్లేనా? టీవీ9 మాతృసంస్థ అయిన ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీ జరగకుండా రవిప్రకాశ్ చాలా సుదీర్ఘమైన వ్యవహారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే, రవిప్రకాశ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, శివాజీ చేత వ్యాజ్యం వేయడం, టీవీ9 లోగోను మోజో టీవీ చైర్మన్ హరికిషన్కి విక్రయించడం తదితర పరిణామాలన్నీ చూస్తుంటే తమ చేతికి పగ్గాలివ్వకుండా రవిప్రకాశ్ చాలా భారీ స్కెచ్ వేశారని అలందా మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే.. పరారీలో ఉన్న రవిప్రకాశ్ అజ్ఞాతం వీడాలి. కానీ, జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో రవిప్రకాశ్ పోలీసులకు లొంగిపోయే ఆలోచనేదీ లేదని సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడమే ఇందుకు నిదర్శనమని న్యాయనిపుణులంటున్నారు. -
23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలే...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. షేర్ హోల్డర్ల అనుమతి లేకుండా టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేయడంపై సాయిరెడ్డి స్పందించారు. ‘అప్పట్లో నట్వర్లాల్ అనే చీటర్ తాజ్‌మహల్‌నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం. ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్), టీవీ9 ట్రేడ్‌మార్క్, కాపీరైట్ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్ మోసాలు నైజీరియన్ మోసగాళ్ళను తలపిస్తున్నాయి. మీడియా 'నయీం' నేరాలపై దర్యాప్తు ఆధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. గరుడ పురాణం బ్రోకర్ శొంఠినేని శివాజీ కూడా తప్పించుకోలేడు. 14 నెలల క్రితం రవి ప్రకాష్ తనకు షేర్లు విక్రయించాడని రాసుకున్న అగ్రిమెంటు పత్రం తాజాగా సృష్టించినదే అని వెల్లడైంది. చట్టాలంటే ఎంత చులకనో వీళ్లకు.’ అని వ్యాఖ్యానించారు. 23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలవుతుంది అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహణపై చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేయడంపై కూడా విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఓ మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా?. ఎన్నికల కమిషన్ మెత్తగా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో అదే తరహా రిగ్గింగ్‌కు పాల్పడేవాడు కాదా?.చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగు అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గరుడ బ్రోకర్ శివాజీ కూడా తప్పించుకోలేడు 23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం.’ అంటూ ట్వీట్ చేశారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. -
రవిప్రకాశ్ కోసం రామోజీ వద్దకు..
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగారు. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈకేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఈనాడు’చైర్మన్ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై అరెస్ట్ వారెంట్ జారీచేస్తారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్‌పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్‌కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ, ఇంట్లో బార్ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్‌ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాలపైన చర్చ ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం. రవిప్రకాశ్‌కు ఎదురుదెబ్బ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్పీసీలోని 154 సెక్షన్ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్‌పై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఈనాడు’చైర్మన్ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై అరెస్ట్ వారెంట్ జారీచేస్తారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్‌పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్‌కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ, ఇంట్లో బార్ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్‌ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాలపైన చర్చ ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం. రవిప్రకాశ్‌కు ఎదురుదెబ్బ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్పీసీలోని 154 సెక్షన్ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్‌పై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది. -
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రవిప్రకాశ్!
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్య బదిలీని నిలువరించేందుకు ప్రయత్నించిన కేసులో.. ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశే సూత్రధారనే అంశం తేలిపోయింది. సినీ నటుడు శివాజీకి తన షేర్లు కొన్ని విక్రయించినట్లుగా రవిప్రకాశ్ నకిలీ పత్రాలు సృష్టించిన వైనం బట్టబయలైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని æతెరవెనక ఉండి నడిపింది రవిప్రకాశేనని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. షేర్ల బదిలీ అంటూ కొత్త వ్యక్తి శివాజీని తెరపైకి తెచ్చిందీ.. పాత తేదీలతో పత్రాలు సృష్టించిన రవిప్రకాశ్ తనపైన తానే కేసు వేయించుకున్నారని స్పష్టమైంది. ఈ వ్యవహారం మొత్తానికి ప్రణాళిక రచించి, అమలు చేయడం, ఎవరేపనిచేయాలో నిర్దేశించడం వరకు అన్నీ రవిప్రకాశ్ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ మేరకు రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగుల మధ్య ఈ–మెయిల్ సంభాషణలను తెలంగాణ పోలీసులు వెలికి తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఏ క్షణాన్నైనా రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. దీంతో కొంతకాలం క్రితం టీవీ9ని టేకోవర్ చేసిన అలందా మీడియా సంస్థ ఆరోపిస్తున్నట్టుగా ఈ వ్యవహారం మొత్తం నడిపిందీ రవిప్రకాశేనని తేటతెల్లమైంది. అసలేం జరిగింది? 2018 ఆగస్టులో టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి మేఘా ఇంజినీరింగ్స్, మైంహోమ్ గ్రూప్ సంయుక్త వెంచర్ టీవీ9 దాని అనుబంధ చానెళ్లను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ను రవిప్రకాశ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. రవిప్రకాశ్, తన అనుచరులతో కలిపి 8.5% షేర్లను కలిగి ఉండటమే దీనికి కారణం. సంస్థ సీఈఓ కూడా కావడంతో రవిప్రకాష్ ఈ డీల్‌ను భగ్నం చేసేందుకు తనకున్న అన్ని అవకాశాలను వినియోగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించేందుకు అభ్యంతరం చెప్పడం, సంస్థ కార్యదర్శి కౌశిక్‌రావు సంతకాన్ని ఫోర్జరీ చేయడం, శివాజీ అనే సినీనటుడిని తెరపైకి తీసుకవచ్చి రవిప్రకాశ్‌పై కేసు వేయడం అన్నింటిపైనా అలందా మీడియా మొదట నుంచి గుర్రుగానే ఉంది. దీంతో రవిప్రకాశ్ ఆగడాలకు కళ్లెం వేసేందుకు నిర్ణయించి ఫోర్జరీ, డేటాచౌర్యం, నిధుల మళ్లింపుపై సైబరాబాద్ పోలీసులకు కౌశిక్‌రావు ద్వారా ఫిర్యాదు చేయించింది. ఆ రోజు మాత్రం టీవీ9 స్టూడియోలో తానెక్కడీ పారిపోలేదని, తన వార్తలను తానే చదువుకున్న రవిప్రకాశ్ ఇప్పటివరకూ పరారీలోనే ఉండటం గమనార్హం. కుట్ర బయటపడిందిలా! తాను నిరపరాధినని రవిప్రకాశ్ పైకి చెబుతున్నా.. పోలీసుల విచారణకు హాజరుకాకపోవడంతో అతని తీరుపై అనుమానం పెరుగుతోంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగులు ఎంవీకేఎన్ మూర్తి, మరో అధికారి మూర్తి, న్యాయవాది శక్తి మధ్య సర్క్యులేట్ అయిన ఈ–మెయిల్స్ పోలీసుల చేతికి అందినట్లు ప్రచారం జరిగింది. ఈ ఆధారాలు దొరక్కుండా సర్వర్ల నుంచి ఈ–మెయిల్స్ సంభాషణను తొలగించినప్పటికీ పోలీసులు వాటిని తిరిగి సంపాదించారంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. 2018 ఫిబ్రవరి 20న రవిప్రకాశ్ రూ.20 లక్షలకు 40వేల షేర్లు విక్రయించారంటూ ఆరోపిస్తూ సినీనటుడు శివాజీ నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆధారంగా చూపించిన డ్రాఫ్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13న సృష్టించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఆ ఈ–మెయిల్‌ను అదేరోజు సాయంత్రం 5.46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్ఓ ఎంవీఎన్కే మూర్తికి, రవిప్రకాశ్‌కు, ఆయన సన్నిహితుడు హరికిషన్‌కు.. రవి లాయర్ శక్తి మెయిల్ చేశారని సమాచారం. ఈ డ్రాఫ్ట్ మాత్రం 2018 ఫిబ్రవరి 20 తేదీతో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈ బృందం అందరి మధ్యా రాత్రి 9.35 గంటల వరకు పలు రకాల మెయిల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ కేసు దాఖలు చేయడానికి అవసరమైన డ్రాఫ్ట్‌ను విజయవాడకు చెందిన ఓ లాయర్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న ఉదయం 5.38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, మార్పులు చేర్పులు సరిచూసుకున్నాక ఉదయం 9గంటలకల్లా లాయర్ వద్దకు పంపాలని రవిప్రకాశ్ తన అనుచరులకు ఆదేశించారని.. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే పోలీసులు ఈనెల 13న సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాలను ధ్రువీకరించలేదు. రవిప్రకాశ్‌ను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో ఆయన నేటికీ పరారీలో ఉన్నారు. బుధవారం ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఏపీలో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రవిప్రకాశ్ స్నేహితుడు, లాయర్ శక్తి, నటుడు శివాజీ కూడా పరారీలో ఉన్నారు. ట్రిబ్యునల్‌లోనూ దక్కని ఊరట టీవీ9 కొనుగోలు డీల్‌ని నిలిపివేయాలంటూ నటుడు శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇపుడు విచారణ జరపలేమని తేల్చిచెప్పింది. రవిప్రకాశ్ తనకు 40వేల షేర్లు విక్రయించానని చెప్పి మోసగించారని.. ఏబీసీఎల్ కంపెనీ యాజమాన్య మార్పుల విషయమై తనకు సమాచారం అందించలేనందున.. ఈ డీల్‌ను నిలిపివేయాలని కోరుతూ.. శివాజీ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీవీ9 డైరెక్టర్ల పదవుల్లో నుంచి కొత్త యాజమాన్యం తమను తొలగించకుండా చూడడంతో పాటు, కొత్తవారిని విధులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కలిసి హైదరాబాద్‌లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కొత్త యాజమాన్యం అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ఆఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం రవిప్రకాశ్ వేసిన పిటిషన్‌పై జూన్ 9 వరకు స్టే విధిస్తూ.. తీర్పునిచ్చింది. దీంతో ఇదేరోజు హైదరాబాద్‌లోని ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం కూడా రవిప్రకాశ్ వాజ్యంపై విచారణను వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ తరువాత ప్రొసీడింగ్స్ వచ్చేవరకు అంటే జూన్ 12 వరకు కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రవిప్రకాశ్ వెనక పెద్ద తలలు తానెక్కడికి పారిపోలేదని ప్రకటనలు ఇచ్చిన రవిప్రకాశ్ తాజాగా గురువారం సైబరాబాద్ పోలీసులకు ఓ సందేశం పంపినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత గడువు కావాలని, ఈ–మెయిల్ పంపినట్లు వార్తలొచ్చినా.. పోలీసులు వీటిని ధ్రువీకరించడం లేదు. వాస్తవానికి రవిప్రకాశ్ ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అతని వెనక ఏపీలోని అధికార పార్టీకి చెందిన పలువురు పెద్దతలల అండ ఉందని, వారి సాయంతోనే రవిప్రకాశ్ అక్కడ తలదాచుకుంటున్నాడని సమాచారం. దీనికితోడు రవిప్రకాశ్, అతని సన్నిహితులు టీవీ9 నుంచి నిధులను ఇతర మార్గాల్లో మళ్లించాడన్న ఆరోపణల్లో రవిప్రకాశ్ సన్నిహితుడు హరికిషన్‌పై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. -
రవిప్రకాశ్‌పై మరో కేసు
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్‌మార్క్‌లను కేవలం రూ.99వేలకే ‘మీడియా నెక్ట్స్ ఇండియా’ కంపెనీకి బదలాయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్ డీడీలు అమలుచేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) డైరెక్టర్ పి.కౌశిక్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు టీవీ9 మాజీ సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ అనుచరుడు మీడియా నెక్ట్స్ కంపెనీకి చెందిన హరికిషన్ చెరెడ్డిల పాత్ర కూడా ఉందని పేర్కొనడంతో ఐపీసీ 467, 420, 409, 406, 120(బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీవీ9లో మెజారిటీ వాటా (90.54%)ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. 2018 ఆగస్టు 27న దక్కించుకున్నప్పటి నుంచి తమ పట్టుకోల్పోతున్నామని భావించిన రవిప్రకాశ్ అడ్డదారులు తొక్కాడని కౌశిక్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. శివాజీకి షేర్లు విక్రయ ఒప్పందంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ బెంచ్‌లో ఉండగా, తప్పుడు పత్రాలతో పాటు సంతకం ఫోర్జరీపై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దర్యాప్తు క్రమంలో రవిప్రకాశ్, మూర్తితో పాటు ఈ గూడుపుఠాణిలో హరికిషన్ పాత్ర కూడా ఉందంటూ తమ దృష్టికి వచ్చిందని కౌశిక్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 మే 5న టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు మీడియా నెక్ట్స్ ఇండియా కంపెనీకి బదలాయింపుపై మౌఖిక చర్చలు జరిగాయని అయితే 2018 డిసెంబర్ 31న అసైన్డ్ డీడీలు అమలుచేసినట్టుగా చూపించారన్నారు. అయితే రికార్డులను తనిఖీ చేస్తే 2019 జనవరి 11వ తేదీన రూ.99వేలు చెల్లించినట్టుగా ఉందని, బుక్స్‌లో మాత్రం 2019 ఫిబ్రవరి 28వ తేదీగా ఉందన్నారు. టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌ల బదలాయింపుతో కంపెనీకి నష్టం చేకూరేలా తప్పుడు పత్రాలు సృష్టించారని కౌశిక్‌రావు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్సీఎల్టీలో శివాజీకి ఎదురు దెబ్బ
-
ఎన్సీఎల్టీలో శివాజీకి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సినీనటుడు, గరుడ పురాణం శివాజీకి చుక్కెదురు అయింది. ఇప్పటికే అలందా మీడియాకు అనుకూలంగా ఢిల్లీలోని ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్‌పై ప్రస్తుతం ప్రొసీడింగ్స్ జరపలేమని తేల్చి చెప్పింది. కాగా టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో జరిగిన మార్పులు, తనకు తెలియకుండా రవిప్రకాశ్ మోసపూరితంగా వ్యవహరించారని, ఏబీసీఎల్లో మార్పులపై స్టే విధించి యధాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆయన ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు అలందా మీడియా ఒప్పందాలపై స్టే కోరుతూ రవిప్రకాశ్ కూడా వారం క్రితం ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ.. ఏబీసీఎల్‌ను టేకోవర్ చేసిన అలంద మీడియా నేషనల్ ఢిల్లీలోని కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ...హైదరాబాద్ ఎన్‌సీటీఎల్‌లో జరిగే కేసు విచారణపై జూలై 9వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. దీంతో స్టే కారణంగానే జూలై 12 వరకూ ఎలాంటి ప్రొసిడింగ్స్ జరగడానికి వీల్లేదని ఎన్సీఎల్టీ స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు రవిప్రకాశ్, శివాజీ గైర్హాజరు కాగా, వాళ్ల తరఫు న్యాయవాదులు హాజరు అయ్యారు. మరోవైపు ఎన్సీఎల్టీ వద్ద సైబర్ క్రైమ్, ఎస్వోటీ పోలీసులు కూడా మోహరించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎన్సీఎల్టీలో శివాజీకి ఎదురు దెబ్బ -
ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్ గరుడ శివాజీ ఎక్కడ?
సాక్షి, అమరావతి : ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. 'మెరుగైన సమాజం కోసం ఫోర్జరీ ఎలా చేయాలనే సలహాలు మాత్రమే పెకాశం గారిని అడుగుతారట.. శివాజీ కోసం స్టేషన్లో వైట్ బోర్డు, మార్కర్ పెన్ను సిద్ధంగా ఉంది.. ఫోర్జరీ పురాణం చెప్తే చాలట' అంటూ సైరా పంచ్ హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ పెట్టారు. తనకు కులం లేదు, మతం లేదంటూనే సొంత సామాజిక వర్గానికే ప్రమోషన్లలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మరో సైరా పంచ్ వేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/BsBdw98tt0 — Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019 తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎగ్జిట్ పోల్స్‌ను మాత్రం నమ్మొద్దనడం వింతగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మొచ్చో దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుసని ట్విటర్లో మరో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని డిమాండ్ చేశారు. పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయొద్దని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును ఏటీఏమ్‌లా మార్చుకుని వేల కోట్లు మింగారని ధ్వజమెత్తారు. ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్లో వెళ్లి ఆయనను కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ? అంటూ తూర్పారబట్టారు. చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్లో ఎదిగిన తీరు గమనిస్తే రవిప్రకాశ్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యమని ధ్వజమెత్తారు. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోందని పోస్ట్ చేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/dvAk3f8ESl — Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019 -
రవిప్రకాశ్ శివాజీ కుట్ర బట్టబయలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు గరుడ పురాణం శివాజీల మధ్య జరిగిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఈ మెయిల్స్‌ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ బయటపడ్డాయి. టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపారని తేటతెల్లమయ్యింది. రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: (బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!) కుట్రకు సంబంధించిన పలువురు వక్తుల మధ్య బదిలీ అయిన పలు ఈ మెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్... వాస్తవానికి ఏప్రిల్13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తికి రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి మెయిల్ చేశారు. ఈ మెయిల్‌ను రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక శివాజీ ఎన్సీఎల్టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించారు. ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి ... రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్సీఎల్టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు రవిప్రకాశ్ సన్నిహితుడు, న్యాయవాది శక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
బెజవాడలో రవిప్రకాశ్, శివాజీ!
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపులు, ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్...సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు పాటు ఆయన గడువు కోరారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్ ఈ మెయిల్లో తెలిపారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై పోలీసులు సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం రవిప్రకాశ్, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది. -
పోలీసులకు మెయిల్ పంపిన టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్
-
బాబు, రామోజీ మధ్యలో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఈనాడు’చైర్మన్ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఫిల్మ్‌సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై అరెస్ట్ వారంట్ జారీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో బాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్‌పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్‌కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ, ఇంట్లో బార్ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్‌ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాలపైన చర్చ ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం. రవిప్రకాశ్‌కు ఎదురుదెబ్బ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్పీసీలోని 154 సెక్షన్ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్‌పై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది. -
ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో!
సాక్షి, హైదరాబాద్ : పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలు వంగ్యోక్తులు విసిరారు. ‘పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది!. విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!’ అని ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన సెటైర్లు వేశారు. ‘సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.’ అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్లో వ్యాఖ్యానించారు. -
రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు
-
హైకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. సైబర్ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. కాగా గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం విదితమే. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌కు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఇచ్చిన గడువు ముగియడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు న్యాయస్థానంలో కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా? లేక పోలీసుల ఎదుట లొంగిపోతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ బుధవారం ఉదయం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంతకీ రవిప్రకాశ్ ఎక్కడ? ఇంతకీ రవిప్రకాశ్ ఎక్కడున్నాడన్న విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆయన ముంబైలో ఉన్నారని, హైదరాబాద్‌లోని సన్నిహితుల వద్ద ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన సెల్‌ఫోన్, సోషల్ మీడియాలో ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీపై స్పష్టత లేకుండాపోయింది. కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు తమకేం తెలియదని సమాధానమిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన తొలిరోజు ‘తానెక్కడికీ పారిపోలేదని, తన వార్తలు తానే చదువుకున్న రవిప్రకాశ్ పరారీలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది’అని నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. -
విచారణకు రాకుంటే అరెస్టు వారంటే
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సైబరాబాద్ కమిషనరేట్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విచారణకు రాకపోతే అరెస్టే! రవిప్రకాశ్ విచారణకు రాకపోతే ఏం చేయాలన్నదానిపైనా పోలీసులు ప్లాన్–బీ కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ బుధవారం ఉదయం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం. సాధారణంగా ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనే ఈ సెక్షన్‌ను ప్రయోగిస్తారు. నిందితులు కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేయడం, బెదిరింపులకు దిగడం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే.. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నోటీసులు జారీ చేస్తే.. విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేస్తారు. దీంతో ఆయన ఎక్కడ కనిపించినా అరెస్టు చేసేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అతన్ని గాలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. పత్తాలేని రవిప్రకాశ్! ఇంతకీ రవిప్రకాశ్ ఎక్కడున్నాడన్న విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆయన ముంబైలో ఉన్నారని, హైదరాబాద్‌లోని సన్నిహితుల వద్ద ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన సెల్‌ఫోన్, సోషల్ మీడియాలో ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీపై స్పష్టత లేకుండాపోయింది. కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు తమకేం తెలియదని సమాధానమిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన తొలిరోజు ‘తానెక్కడికీ పారిపోలేదని, తన వార్తలు తానే చదువుకున్న రవిప్రకాశ్ పరారీలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది’అని నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. -
పరారీలో రవిప్రకాశ్
-
పరారీలో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీవీ–9 వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ఈ నోటీసులకు స్పందించకపోతే రవిప్రకాశ్ అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే సీఆర్పీసీ 160 ప్రకారం ఈనెల 9, 11వ తేదీల్లో రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవిప్రకాశ్ తాను విచారణకు హాజరు అయ్యేందుకు 10 రోజుల సమయం కావాలని లాయరు ద్వారా కోరినట్లు సమాచారం. మరో నిందితుడు, సినీనటుడు శొంఠినేని శివాజీ ఇంతవరకూ పత్తాలేడు. ఈ కేసులో మరో నిందితుడు ఎంకేవీఎన్ మూర్తి విచారణకు సహకరిస్తున్నారు. మూర్తిని ఇప్పటికే పలుమార్లు పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను మూర్తి పోలీసులను వివరించినట్లు సమాచారం. సెక్షన్ 41 ప్రకారం నోటీసులు! ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న రవిప్రకాశ్‌కు పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం రాత్రి రవిప్రకాశ్ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే గతంలో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వగా, ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. ఈనెల 9న ఒకసారి, 11వ తేదీన మరోసారి సెక్షన్ 160 కింద పోలీసులు నోటీసులిచ్చినా రవిప్రకాశ్, శివాజీలు ఇంతవరకూ జాడలేకుండా పోయారు. ఈ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ), 72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌పై ప్రధానంగా ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులు నమోదయ్యాయి. కేసులో తీవ్రత ఆధారంగా పోలీసులు సెక్షన్ 41 ద్వారా నోటీసులు జారీ చేశారు. అంతుబట్టని శివాజీ వ్యవహారం ఈ వ్యవహారంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన నటుడు శివాజీ పాత్ర అంతుబట్టడంలేదు. టీవీ9లో 8 శాతం వాటా ఉన్న రవిప్రకాశ్ తనకు 2018, ఫిబ్రవరిలో 40వేల షేర్లు విక్రయించాడని, ఒప్పందం ప్రకారం తనకు ఏడాదిలోగా షేర్లు బదిలీ చేయలేదని, అలందాకు టీవీ9 విక్రయిస్తున్న విషయం కూడా తన వద్ద దాచారని ఆరోపిస్తూ శివాజీ ‘లా ఆఫ్ ట్రిబ్యునల్’ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు అన్యాయం జరిగినపుడు రవిప్రకాశ్‌పై ఫిర్యాదు చేయకుండా యాజమాన్య మార్పులను తెరపైకి తేవడం అంతా రవిప్రకాశ్ పథకంలో భాగమేనని అలందా మీడియా అనుమానిస్తోంది. ఇప్పుడు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినపుడు బాధితుడిగా తనకు జరిగిన అన్యాయం చెప్పుకునే అవకాశం వచ్చినా, ఎందుకు పరారీలో ఉన్నాడన్న ప్రశ్నలకు శివాజీ ఆచూకీ లభిస్తేనే సమాధానం దొరుకుతుంది. సెక్షన్ మారిస్తే ఏంటి? సెక్షన్S160 ప్రకారం.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కేవలం విచారణకు మాత్రమే పిలిచే అవకాశం ఉంటుంది. అదే సెక్షన్ 41కి మారిస్తే.. కేసు తీవ్రత ఆధారంగా అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లోనే ఈ సెక్షన్‌ని ప్రయోగిస్తారు. నిందితులు సాక్షులను ప్రభావితం చేయడం, వారిపై బెదిరింపులకు దిగడం, కీలక ఆధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే.. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. అందుకే, పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. -
రవిప్రకాశ్, శివాజీలకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా నిధులు బదలాయింపు, ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలకు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు వీరివురు స్పందించని విషయం తెలిసిందే. దీంతో రవిప్రకాశ్, శివాజీలకు 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం లోపు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయనున్నారు. అప్పటికీ స్పందించని పక్షంలో కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. వీరు ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు...వీరిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రవిప్రకాశ్, శివాజీ ముందస్తు బెయిల్ కోసం క్వాష్ లేదా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. రవిప్రకాశ్, నటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిపై అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రవిప్రకాశ్‌తో పాటు శివాజీ గైర్హాజరు కాగా, మాజీ సీఎఫ్‌వో మూర్తి మాత్రం పోలీసులు విచారణకు హాజరు అయ్యారు. విచారణలో ఎంవీఎస్ మూర్తి నుంచి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల ఆధారంగా తప్పుడు బదలాయింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
రెండోసారి విచారణకూ రవిప్రకాశ్ గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో నకిలీ పత్రాల సృష్టి, సంతకం ఫోర్జరీ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ రెండో నోటీసుకు కూడా స్పందించకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.160 సీఆర్పీసీ కింద ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు రవిప్రకాశ్ హాజరు కాకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయసలహాను తీసుకుంటున్నారు. ఒకవేళ సోమవారం రవిప్రకాశ్ విచారణకు హాజరైతే ఓకే కానీ, లేనిపక్షంలో వారంట్ ద్వారా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సోమవారం తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సీఆర్పీసీ 160 కింద శనివారం జారీ చేసిన నోటీసును బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటి గోడకు అంటించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు ఒక్కరోజులో హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్న ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు రవిప్రకాశ్ రాలేదు. అయితే, అలంద మీడియా సంస్థ డైరక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ 24, 30 తేదీల్లో రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన విషయాలపై 160 సీఆర్పీసీ కింద రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, మాజీ సీఎఫ్ఓ మూర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటికి మూర్తి ఒక్కరే స్పందించి గత మూడ్రోజుల నుంచి పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీలు మాత్రం ఇంత వరకు హాజరుకాలేదు. అయితే రవిప్రకాశ్, శివాజీలు పది రోజుల గడువు కోరినప్పటికీ దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి అంత సమయం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫోర్జరీ కేసులో విచారణకు టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తి ఆదివారం మూడోరోజూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అతనితో పాటు హెచ్ఆర్, అడ్మిన్, అకౌంట్స్ వ్యవహారాలు చూస్తున్న ముగ్గురు కూడా పోలీసుల ఎదుట హాజరైనట్టు తెలిసింది. వీరిచ్చిన వివరాలతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోర్జరీ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎవరి కోసం చేశారు.. ఎలా చేశారు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నారు. సైబర్ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సారథ్యంలోని సైబర్ క్రైమ్ బృందం ఈ కేసు విచారణను పకడ్బందీగా చేస్తోంది. -
పరారీలో ఎందుకున్నావ్ ప్రవక్తా?: విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీవీ9లో వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ అభియోగాలతో రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన విజయసాయి రెడ్డి... ‘మెరుగైన సమాజ ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3గంటల నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే ఈ నెల 23వ తేదీ తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?’ అంటూ ట్వీట్ చేశారు. కాగా రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీ ఆదివారం తమ ఎదుట హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పటివరకూ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. రవిప్రకాశ్ ఫోన్ నిన్న మధ్యాహ్నం నుంచి స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయనతో పాటు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మూర్తి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్ మాత్రం విచారణకు రాలేదు. వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు సమాచారం. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు అలందా మీడియా గ్రూపు శుక్రవారం ప్రకటించిన సంగతి విదితమే. -
ఆయన ఫోన్లో కూడా దొరకట్లేదంటగా?
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 రవి ప్రకాశ్, సీనీ నటుడు శివాజీపై వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పలు విమర్శలు, వ్యంగోక్తులు చేశారు. విజిల్ బ్లోయర్స్ యాక్ట్, పీనల్ కోడ్ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శివాజీ నాలుగు రోజులుగా ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు. తన జాతకం తానకే తెలిసిపోవడంతో పరారీలో ఉంటున్నారని విమర్శించారు. ‘ రవి ప్రకాశ్ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డునపడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా’ అంటూ వరుస ట్వీట్లతో శివాజీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి : తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో? టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసు వ్యవహారంలో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవి ప్రకాశ్, శివాజీలకు నోటీసులు అందించారు. వీరిలో ఎంకేవీఎన్ మూర్తి విచారణకు హాజరుకాగా.. రవిప్రకాశ్, శివాజీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. -
తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి టీవీ9 రవిప్రకాశ్, టాలీవుడ్ నటుడు శివాజీ విమర్శనాస్త్రాలు సంధించారు. రవిప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్ లా ట్రిబ్యునల్‌కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్ కేసుగా పరిగణించి ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ‘ రవి ప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజీ కంపెనీస్ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్ కేసు అవుతుంది. ట్రిబ్యునల్ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అయినా తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?’ అని విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. వాళ్ల కోసం బాబు నానా తంటాలు పడుతున్నారు ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను చకచక క్లియర్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ నెల 23న( ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. -
పోలీసు విచారణకు హాజరు కాని రవిప్రకాశ్, శివాజీ
-
పత్తాలేని గరుడ పురాణం శివాజీ
సాక్షి, హైదరాబాద్ : టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో టీవీ 9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తిని శనివారం మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఫోర్జరీ, నిధుల మల్లింపు అంశాలపై మూర్తిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్, గరుడ పురాణం నటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం విచారణకు రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు వారిద్దరితోపాటు ఎంకేవీఎన్ మూర్తికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్, శివాజీ విచారణకు డుమ్మా కొట్టగా.. మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రి 11 గంటల వరకు విచారించింది. కాగా, రవిప్రకాశ్ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్‌లోని టీవీ 9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్‌ను విచారించారు. కాగా, టీవీ 9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్ కార్యాలయానికి వచ్చారు. ఆయన లోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తాము రోడ్డు మీద నిలబడి రికార్డు చేస్తున్నామని సాక్షి టీవీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రవిప్రకాశ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన చాంబర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 కార్యాలయానికి రావడంతో రవిప్రకాశ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు సభ్యులు అక్కడకు చేరుకుని సమావేశమయ్యారు. అనంతరం అక్కడున్న సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్ మళ్లీ కార్యాలయానికి వస్తే లోనికి అనుమతించొద్దని కొత్త సెక్యూరిటీకి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రవిప్రకాశ్ ఓ సహచరుడి ద్వారా లేఖ పంపించారు. -
విచారణకు రవిప్రకాశ్, శివాజీ డుమ్మా
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం విచారణకు రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు వారిద్దరితోపాటు టీవీ 9 ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్, శివాజీ విచారణకు డుమ్మా కొట్టగా.. మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రి వరకు విచారించింది. కాగా, రవిప్రకాశ్ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్‌లోని టీవీ 9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్‌ను విచారించారు. టీవీ 9 కార్యాలయం వద్ద హైడ్రామా... టీవీ 9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్ కార్యాలయానికి వచ్చారు. ఆయన లోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తాము రోడ్డు మీద నిలబడి రికార్డు చేస్తున్నామని సాక్షి టీవీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రవిప్రకాశ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన చాంబర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 కార్యాలయానికి రావడంతో రవిప్రకాశ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అసోసియేట్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు సభ్యులు అక్కడకు చేరుకుని సమావేశమయ్యారు. అనంతరం అక్కడున్న సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్ మళ్లీ కార్యాలయానికి వస్తే లోనికి అనుమతించొద్దని కొత్త సెక్యూరిటీకి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రవిప్రకాశ్ ఓ సహచరుడి ద్వారా లేఖ పంపించారు. -
అంతా రవిప్రకాశే చేసుకున్నాడా..!
సాక్షి, హైదరాబాద్ : మెరుగైన సమాజం కోసం.. కులం గోడలు కూల్చేద్దాం..! అంటూ భారీ ఆదర్శాలను వల్లెవేస్తూ ఒక సాధాసీదా జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన రవిప్రకాశ్ టీవీ9 సీఈవో స్థాయికి ఎదిగాడు. ఇంటా బయటా ఎన్నో ‘రాజీకీయాలు’ చేశాడు. 8 శాతం వాటాతో 90.5 శాతం షేర్లు కలిగిన అలందా వాటాదారులను నియంత్రించాలని చూశాడు. చివరకు అవమానకర రీతిలో అటు సీఈవో పదవిని ఇటు డైరెక్టర్ పదవిని కోల్పోయాడు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు. డెరెక్టర్లను నియమించుకోకుండా, యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించకుండా అలందా సంస్థకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని శుక్రవారం సాయంత్రం జరిగిన ఏబీసీఎల్ బ్రాడ్ కాస్టింగ్ డెరెక్టర్లు వెల్లడించారు. సంస్థలో అధికారం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ తన గోతి తనే తవ్వుకున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. (టీవీ9తో రవిప్రకాశ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్లు) ‘50కి పైగా షేర్లున్న వాటాదారుకు యాజమాన్య హక్కులు దఖలు పడాలి. మేమూ అదే చేశాం. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించాం. కంపెనీల చట్టం ప్రకారం డైరెక్టర్ల మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని షేర్ హోల్డర్ల మీటింగ్‌లో చర్చించి శుక్రవారం మీడియాకు వెల్లడించాం. వాటార్లందరి అభిప్రాయం మేరకే వారిని తొలగించాం. కానీ, రవిప్రకాశ్ నిన్న టీవీ9 లైవ్‌లోకొచ్చి తనపై ఎలాంటి ఆరోపణలు లేవని అన్నాడు. ఆరోపణలు లేకుంటే మంచిదే’ అని డెరెక్టర్ సాంబశివరావు అన్నారు. ఇక ఆదిపత్యం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇరుకున్నట్టు తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు డైరెక్టర్లు చెప్పారు. టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది. -
రవిప్రకాష్, శివాజీ కుట్రకు ముగింపు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు శొంఠినేని శివాజీని అడ్డుపెట్టుకుని టీవీ9లో రవిప్రకాష్ సాగించిన కుట్ర బట్టబయలైంది. తాము బాధ్యతలు చేపట్టకుండా శివాజీని అడ్డుపెట్టుకుని రవిప్రకాష్ ఆడిన నాటకానికి కొత్త యాజమాన్యం ముగింపు పలికింది. తన పట్టు సడలిపోకూడదన్న దురుద్దేశంతో అడ్డదారులు తొక్కిన ఆయనను టీవీ9 నుంచి సాగనంపింది. ఇక టీవీ9తో రవిప్రకాష్‌కు ఎటువంటి సంబంధం లేదని, కైవలం మైనార్టీ షేర్‌హోల్డర్‌గా మాత్రమే కొనసాగుతారని అలందా గ్రూపు తేల్చిచెప్పింది. ఈ నెల 8న జరిగిన డైరెక్టర్ల సమావేశంలోనే రవిప్రకాష్‌ను తొలగిస్తూ నిర్ణయం జరిగిందని, ఈ రోజు షేర్‌హోల్డర్ల ఆమోదం కూడా తీసుకున్నామని వెల్లడించింది. తనకు తల్లిదండ్రుల కంటే రవిప్రకాష్ ఎక్కువని ఓ సందర్భంలో శివాజీ చెప్పారు. చాలా ఏళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. శివాజీని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా రవిప్రకాష్ ‘ఆపరేషన్ గరుడ’కు రూపకల్పన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జర్నలిజం విలువలను తుంగలో తొక్కి తన వర్గానికి కొమ్ముకాసిన రవిప్రకాష్ తాజాగా శివాజీ పేరుతో ఆడిన నాటకం టీవీ9 కొత్త యాజమాన్యానికి తెలిసిపోవడంతో ఆయన కుతంత్రాలు వెలుగులోకి వచ్చాయి. తన భక్తుడు శివాజీతో కలిసి రవిప్రకాష్ మొదట డ్రామాకు తెర తీశారు. టీవీ9 చానళ్లను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి 90.54 శాతం షేర్లను కొనుగోలు చేసిన అలందా గ్రూపుకు యాజమాన్య బాధ్యతలు అప్పగించకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. శివాజీతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయించి కొత్త యాజమాన్యానికి అడ్డంకులు కల్పించారు. ఈ విషయాన్ని పసిగట్టిన అలందా గ్రూపు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మొత్తం డొంకా కదిలింది. మరోవైపు తాను రాజీనామా చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని రవిప్రకాష్‌పై కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారంపై వ్యామోహంతో అడ్డదారులు తొక్కిన రవిప్రకాష్‌ను ఎట్టకేలకు కొత్త యాజమాన్యం సాగనంపింది. జర్నలిజం విలువలు పాటిస్తూ, ఉద్యోగులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తూ ముందుకు సాగుతామని అలందా గ్రూపు ప్రకటించింది. నోరు విప్పని శివాజీ గత రెండు రోజులుగా టీవీ9 వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై నటుడు శివాజీ ఇప్పటివరకు స్పందించలేదు. తమ ఎదుట హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వలేదు. తాను ఎంతో ఇష్టపడే రవిప్రకాష్‌కు కష్టం వచ్చినా శివాజీ బయటకు రాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాను బయటకు వచ్చి మాట్లాడితే ఎక్కడ తమ కుట్ర బయటపడుతుందన్న భయంతోనే శివాజీ మౌనంగా ఉన్నాడన్న వాదనలు విన్పిస్తున్నాయి. -
సీఈవో, డైరెక్టర్‌గా రవి ప్రకాశ్‌ను తొలగిస్తున్నాం
-
టీవీ9తో రవిప్రకాశ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్లు ప్రకటించారు. టీవీ9 సంస్థలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో బోర్డుసభ్యులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రవి ప్రకాశ్ స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా గొట్టిపాటి సింగారావు నియమిస్తున్నట్లు అలందా మీడియా డైరెక్టర్ ఎస్ సాంబశివరావు ప్రకటించారు. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించామని తెలిపారు. 9 నెలల క్రితమే టీవీ9లో 90.5 శాతం వాటాలను ఏవీసీఎల్ నుంచి అలందా మీడియా కొనుగోలు చేసిందని, కొనుగోలు అనంతరం సంస్థలో చాలా అవరోధాలు సృష్టించారని, సంస్థలో 8శాతం వాటా ఉన్న వాళ్లు నియంత్ర చేయాలని చూశారని వెల్లడించారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవి ప్రకాశ్, మూర్తి అడ్డుపడ్డారని అన్నారు. వాటాదార్లందరి అభిప్రాయం మేరకే రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవి ప్రకాశ్ ఫోర్జరీ చేశారని ఆయన వెల్లడించారు. తన సంతకాన్ని రవి ప్రకాశ్ ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. యజమాన్య మార్పిడి జరగకుండా రవి ప్రకాశ్, మూర్తి ఎన్నో అవరోధాలు సృష్టించారని, తప్పుడు నిర్ణయాలతో సంస్థను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం టీవీ9లోని అన్ని ఛానెళ్లు కొత్త సంస్థ పరిధిలోకి వస్తామని స్పష్టం చేశారు. తాజా ఘటన నేపథ్యంలో టీవీ9తో రవిప్రకాశ్, మూర్తిలకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. అలాగే వాళ్లిదరూ ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరిపితే మాకంపెనీకి ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రవి ప్రకాశ్‌తో పాటు మిగతా వారికి 9.5 శాతం వాటాలు ఉన్నాయని, షేర్‌హోల్డర్‌గా రవిప్రకాశ్ సమావేశాలకు హజరుకావచ్చని బోర్డు డైరెక్టర్లు తెలిపారు. -
రెండోరోజు టీవీ9 సంస్థలో కీలక పరిణామాలు
-
టీవీ9 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చర్చలు
-
టీవీ 9 తాత్కాలిక సీఈఓగా మహేంద్ర మిశ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీ 9 తెలుగు ఛానల్ కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావు నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు నిర్ణయం తీసుకుంది. శుక్ర వారమిక్కడ ఏబీసీపీఎల్ డైరెక్టర్లు జగపతిరావు జూపల్లి, సాంబశివరావు సంగు, శ్రీనివాసరావు అరవపల్లి, పుల్లూరి కౌశిక్‌రావు మీడియాతో మాట్లాడారు. గతే డాది ఆగస్టులో ఏబీసీపీఎల్‌లో అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్స్‌మెంట్ ప్రైవే ట్ లిమిటెడ్ 90.54% వాటాను కొనుగోలు చేసినట్టు సాంబశివరావు వెల్లడించారు. రవిప్రకాశ్, ఇతరులకు 9.5% వాటా ఉన్న ట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో హోల్ టైం డైరెక్టర్ అండ్ సీఈఓ నుంచి రవిప్రకాశ్‌ను, హోల్ టైం డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో పదవుల నుంచి మంగిపూడి కల్యాణ వెంకట నర సింహ మూర్తి (ఎంకేవీఎన్ మూర్తి)లను శాశ్వతంగా తొలగించినట్టు చెప్పారు. ఇకపై ప్రజలు, బ్యాంకు లు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ఇన్స్టిట్యూషన్లు ఎవరూ కూడా రవిప్రకాశ్‌తో వ్యవహారా లు, కార్యకలాపాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మైనార్టీ షేర్ ఉంది కాబట్టి షేర్ హోల్డర్స్ సమావేశానికి రవిప్రకాశ్ హాజరుకావొచ్చని.. ప్రాఫిట్స్, డివిడెండ్లను డిక్లేర్ చేయవచ్చన్నారు. ప్రస్తుతం టీవీ 9 కన్నడ హెడ్‌గా మిశ్రా పనిచేస్తున్నారని, టీవీ 9 తెలుగుకు శాశ్వత సీఈఓను నియమించేంత వరకూ ఈయనే పదవిలో కొనసాగుతార న్నారు. 10 టీవీ సీఈఓగా ఉన్న సింగారావుకు 6ఏళ్ల కు పైగా మా టీవీతో అనుబంధం ఉంది. స్టార్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్‌లో ఈయన చీఫ్ ఇంటిగ్రేషన్ ఆఫీసర్‌గా, ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నారు. ఉద్యోగుల తొలగింపులుండవ్.. టీవీ 9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, యూఎస్ఏ, భారత్‌వర్‡్ష చానల్స్, న్యూస్ 9 బెంగళూరు, టీవీ 1 హైదరాబాద్ చాన ల్స్ కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ మారినప్పటికీ.. ఏబీసీపీఎల్, టీవీ 9 బ్రాండింగ్‌లో ఎలాంటి మార్పులూ ఉండవని, ఉద్యోగుల తొలగింపులూ జరగవని సాంబశివరావు స్పష్టంచేశారు. అవసరమైతే కొత్త ఉద్యోగులతో పాటూ చానల్స్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. -
సాక్షి ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు దౌర్జన్యం
-
టీవీ9 వద్ద ఉద్రిక్తత, సాక్షి ప్రతినిధిపై దౌర్జన్యం
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ’సాక్షి’ రిపోర్టరుతో రవిప్రకాశ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. కెమెరాను లాక్కునేకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానల్స్ ప్రతినిధులు ఉన్నప్పటికీ...కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే వాళ్లు టార్గెట్ చేశారు. రోడ్డు అడ్డంగా ఉన్నారని, తమకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ దౌర్జన్యానికి దిగారు. లైవ్ కవరేజ్ చేస్తున్న డీఎస్ఎన్జీ వాహనం వైర్లు పీకేశారు. చదవండి: (టీవీ9లో రెండోరోజు పోలీసుల సోదాలు) -
టీవీ9లో రెండోరోజు పోలీసుల సోదాలు
సాక్షి, హైదరాబాద్ : రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప.. ఫోర్జరీ వంటి ఆరోపణలపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అత్యవసర భేటీ ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే సీఈవో తొలగింపు, కొత్త సీఈవో నియామకంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి నిన్నటి నుంచి విచారణ జరుపుతోంది. -
‘మెరుగైన సమాజం’ వెనుక చీకటి రాజ్యం
సాక్షి, అమరావతి: మెరుగైన సమాజం వెనుక చీకటి రాజ్యం నడుపుతున్న టీవీ–9 రవిప్రకాశ్ దశాబ్దిన్నర కాలంలో చేసిన అక్రమాల జాబితా గురించి రాస్తే ఒక పెద్ద గ్రంధమే అవుతుందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి గురువారం పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. టీవీ9తో తెలుగు జర్నలిజంలో నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రవి ప్రకాశ్‌కు అంతే చీకటి చరిత్ర కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. గత ఏడాది టీవీ9లో 90 శాతం వాటాలను శ్రీనిరాజు విక్రయించినప్పటి నుంచి రవిప్రకాశ్ ‘మెరుగైన జీవితం’లో చీకట్లు మొదలయ్యాయి. అతని చీకటి సామ్రాజ్యం గుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఆరంభమైంది. చంద్రబాబుకు అండగా.... చంద్రబాబు చిరకాలం అధికారంలో కొనసాగేందుకు టీవీ9 తెర ముందు శివాజీ, తెర వెనుక రవిప్రకాశ్ తమ పాత్రలను శక్తి వంచన లేకుండా పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే వీరిద్దరూ వైఎస్సార్సీపీ పైనా, వైఎస్ జగన్మోహన్రెడ్డి పైనా టీవీ9 ద్వారా విషం కక్కుతూ, గరుడ పురాణాలు ప్రసారం చేస్తూ వచ్చారు. వారి పాపం బద్దలై వారి రహస్య బంధం కూడా బట్టబయలైంది. రవిప్రకాశ్ టీవీ9లోని తన వాటాల్లో కొన్ని తనకు అమ్మి ఆ షేర్లు బదలాయించకుండా మోసం చేశారంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని శివాజీ ఆశ్రయించి మరో పెద్ద నాటకానికి తెర తీశాడు. షేర్ల కొనుగోలు కోసం వీళ్ళద్దరూ ఒక తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకుని ఏడాది తరువాత బదిలీ విషయం చూసుకుందాం అని అనుకున్నారంటేనే ఎంత హంబగ్గో అర్థం చేసుకోవచ్చు. టీవీ–9 పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళకుండా కుట్ర... టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళకుండా ఆపేందుకే ఏడాది క్రితమే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని రవిప్రకాశ్ రంగంలోకి దింపాడు. ఈ వ్యూహ రచన అంతా అమరావతిలోని కరకట్టపైనే జరిగింది. ఆమేరకే శివాజీ ఎన్సీఎల్టీలో తన షేర్ల పురాణం విప్పాడు. టీవీ9పై పెత్తనం రవిప్రకాశ్ చేతుల్లోంచి జారిపోతే అది రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందన్న భయంతో దీన్ని ఒక లీగల్ సమస్యగా మార్చి యాజమాన్య మార్పును అడ్డుకోవడానికి శివాజీ లాంటి కేరెక్టర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ‘మెరుగైన సమాజం కోసం, కులం గోడలు కూల్చేద్దాం’ అంటూ గొప్ప ఆదర్శాలను వల్లిస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు ఆ ఆదర్శాలను తుంగలో తొక్కేసి, అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బలవంతపు వసూళ్ళకు నడుం కట్టినపుడు సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగిపోయాడు. చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్చాడు. అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు. అక్రమంగా ఆర్జించిన వందల కోట్లను విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పెట్టుబడులుగా పెట్టాడు. ఆ ఆదర్శవాది ఇప్పుడు జైలు గోడలు తప్పించుకోవడానికి పోలీసులకు దొరక్కుండా చంద్రబాబు అండతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నిధులు కాజేసి, ఫోర్జరీ పత్రాలు సృష్టించి.... రవిప్రకాశ్ భాగోతంపై బ్రేకింగ్ న్యూస్ నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయన రహస్య మిత్రుడు, చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ ‘గరుడ పురాణం’ శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ఆసక్తికరంగా అనిపించింది. రవిప్రకాశ్, ‘శుంఠ’ శివాజీల మధ్య బంధం ఈనాటిది కాదు. వారి రహస్య మైత్రి వెనుక బలమైన ఒక రాజకీయ అజెండా ఉందన్న మా అనుమానం తిరుగులేని సత్యమని ఈ ఉదంతం «ధృవపరుస్తోంది. రవి ప్రకాశ్ సంపాదన వందల కోట్లు దాటింది... టీవీ9ను అడ్డు పెట్టుకుని రవిప్రకాశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బ్లాక్మెయిల్ చేసి కూడబెట్టిన సంపాదనే వందల కోట్లు దాటిపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయన రవిప్రకాశ్ బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది. సత్యం రామలింగరాజును బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొట్టేశాడు ట్విట్టర్లో విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి రవిప్రకాశ్ వంటి చీడపురుగుల వల్ల తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందని విజయసాయిరెడ్డి ట్విటర్లో్ల విమర్శించారు. ప్రవక్తలాగా చెలరేగిన రవిప్రకాశ్ చేయని దుర్మార్గాలు లేవని, మతాలను కించపర్చడం, కార్పొరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టీవీ స్క్రీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడన్నారు. చివరకు టీవీ9 ప్రధాన పెట్టుబడిదారుడు శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ అతని తోడల్లుడు సత్యం రామలింగరాజును కూడా బ్లాక్మెయిల్ చేసి రూ. కోట్లు వసూలు చేశాడంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. రామలింగరాజు బెయిల్ రావడానికి ముందు చికిత్సకోసం నిమ్స్ హాస్పిటల్లో చేరితే ఆయన సెల్ఫోన్లో మాట్లాడుతుండగా స్పై కెమెరాతో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెపుతుంటారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకున్నాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు జరగాలి. చివరకు టీవీ9 స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనాన్ని తరలించారని, ఇలా రూ. లక్షల కోట్ల ఎర్రచందనం తరలిపోవడంలో రవిప్రకాశ్ హస్తం ఉండటం దారుణమన్నారు. సినిమాల్లో వేషాల్లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలన్నారు. శివాజీ గరుడ పురాణం ఒక కుట్ర అని ఆయన అమరావతిలో భూములు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడు అన్న విషయం బయటకు రావాలన్నారు. తెలుగు మీడియా వీళ్ల బారినుంచి బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందన్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాశ్.. పోలీసులకు లొంగిపోయి సహకరించాలని పౌర సమాజం కోరుతోందన్నారు. మరిన్ని బ్రేకింగ్‌లు.. ►టీవీ9పై రవిప్రకాశ్ పెత్తనం కొనసాగించమని చంద్రబాబుతోపాటు ఆయన అనుచరగణం (గూండాలు) కొత్త యాజమాన్యాన్ని తీవ్రస్థాయిలో బెదిరించారు. ►టీవీ9 రాబడిని, నిధులను సీఈవోగా రవి ప్రకాశ్ భారీ ఎత్తున అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నట్లు కొత్త యాజమాన్యం చేసిన ఆడిట్లో వెల్లడైంది. ►ఇటీవల ప్రారంభించిన భారత్ వర్ష్ హిందీ జాతీయ చానల్ విషయంలోనూ రవి ప్రకాశ్ కొన్ని నిధులు స్వాహా చేసినట్లు వెల్లడైంది. ► టీవీ9పై తన పెత్తనం యధాప్రకారం కొనసాగేందుకు రాజకీయంగా కూడా రవిప్రకాశ్ పావులు కదిపాడు. -
రవిప్రకాశ్, శివాజీపై ఫోర్జరీ కేసు
సాక్షి,హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి గురువారం విచారణ ప్రారంభించారు. దీంతోపాటుగా నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వ్యవహారంలో రవిప్రకాశ్‌తో పాటు ఎంకేవీఎన్ మూర్తిపై కూడా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. కోర్టు సెర్చ్‌వారంట్ ఆధారంగా గురువారం బంజారాహిల్స్‌లోని టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్ నివాసంలోను, హిమాయత్‌నగర్‌లోని సినీనటుడు శివాజీ, ఖైరతాబాద్‌లోని మూర్తి ఇళ్లలోనూ సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. రవిప్రకాశ్ ఇంట్లో లేకపోవడంతో శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని ఇంటి గోడకు నోటీసులు అతికించారు. టీవీ9 కార్యాలయంలో బందోబస్తు బంజారాహిల్స్ టీవీ9 కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉదయం కార్యాలయంలో రవిప్రకాశ్ కోసం ఆరా తీశారు. ఆయన లేరని చెప్పడంతో వివిధ డాక్యుమెంట్లను అడిగి తెప్పించుకున్నారు. సైబరాబాద్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారని ప్రచా రం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికు వ చ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద నివాసముంటున్న నటుడు శివాజీ ఇంట్లో ఉదయం 10–11 గంటల మధ్యలో పోలీసులు సోదా లు చేశారు. ఆ సమయంలో హీరో శివాజీ ఇంట్లో లేరు. సోదాల్లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. -
టీవీ9 నుంచి రవిప్రకాశ్ ఔట్!
సాక్షి, బిజినెస్ ప్రతినిధి: తెలుగు శాటిలైట్ చానళ్లలో కొత్త ఒరవడి తెచ్చిన టీవీ9 నుంచి ఆ చానల్ సీఈఓ వెలిచేటి రవిప్రకాశ్‌ను తొలగించారు. చానల్లో 90% వాటాను మైహోమ్ గ్రూప్, మేఘ ఇంజనీరింగ్ సంస్థలకు చెందిన అలందా గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసింది. 90% వాటా కొనుగోలు చేసినప్పటికీ.. తమకు రవిప్రకాశ్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, కంపెనీ సెక్రటరీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని, అందుకే ఆయన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నామని అలందా మీడియా పేర్కొంది. ఫోర్జరీ విషయంలో తాము చీటింగ్ కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. ‘రవిప్రకాశ్ కొందరు వ్యక్తులతో కుమ్మక్కై సంస్థకు హాని చేసేలా వ్యవహరిస్తున్నారు’అని అలందా ఆ ఫిర్యాదులో పేర్కొంది. కానీ.. గురువారం సాయం త్రం రవిప్రకాశ్ టీవీ9 చానల్లో కనిపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. అంతే తప్ప.. ఫోర్జరీ కేసు గురించిగానీ, తనపై వచ్చిన ఇతర అభియోగాల గురించి కానీ ప్రస్తావించలేదు. ఈ వ్యవహారం వివరాలు చూస్తే.. టీవీ9 లోగోతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లిష్, హిందీ చానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ ప్రారంభించాయి. ఏబీసీఎల్లో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది. ఈ సంస్థలో ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా ఎదిగిన రవిప్రకాశ్, ఆయన సహచరులకు 8% వాటా ఉంది. గత ఆగస్టులో శ్రీనిరాజు తన వాటాను హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియాకు విక్రయించారు. అదే నెలలో డీల్ పూర్తయి ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతిలోకి వచ్చింది. ఆర్ఓసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)లో కూడా దీనికి సంబంధించిన పత్రాలు నమోదయ్యాయి. దీంతో నలుగురు కొత్త డైరెక్టర్లను ఏబీసీఎల్లో నియమించడానికి కేంద్ర సమాచార శాఖ అనుమతి కోరుతూ ఏబీసీఎల్ బోర్డు తీర్మానాన్ని ఆమోదించి పంపింది. ఈ తీర్మానాలపై ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎంకేవీఎన్ అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార శాఖ.. మొన్నటి మార్చి 29న అనుమతి కూడా మంజూరు చేసింది. అన్ని అనుమతులూ ఉన్నా.. కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్‌కు రవిప్రకాశ్ రకరకాలుగా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఆ నలుగురు డైరెక్టర్లూ ఏప్రిల్ 23న సమావేశమై.. తమ నియామక పత్రాలను ఆర్‌ఓసీలో దాఖలు చేయాలని కంపెనీ సెక్రటరీని కోరారు. సెక్రటరీ సంతకం ఫోర్జరీ? దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కొందరు ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారనేది అలందా అభియోగం. దీనిపై కంపెనీ సెక్రటరీ కూడా ఆర్‌ఓసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకు న్న ఆర్ఓసీ అధికారులు ఏబీసీఎల్లో కొత్త డైరెక్టర్ల నియామక పత్రాలను ఆమోదించారు. ‘90% వాటా మా చేతిలోనే ఉంది. కనుక చట్టపరంగా పూర్తి అధికారం మాకే ఉంది. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్ వైఖరిని సీరియస్‌గా తీసుకుని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించాం’అని అలందా మీడియా తెలియజేసింది. ఇదీ అలందా మీడియా ఫిర్యాదు దురుద్దేశపూర్వకంగా సినీ నటుడు శొంఠినేని శివాజీతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించారని, సంస్థ నిర్వహణలో తమకు ఇబ్బందులు కల్పించేలా రవిప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టీవీ9 కొత్త యాజమాన్యం పేర్కొంది. కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటాను తస్కరించడమే కాక, దాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులో తెలిపింది. రవిప్రకాశ్‌కు టీవీ9లో 20 లక్షల షేర్లుండగా (8%) దాన్లో 40 వేల షేర్లు తనకు విక్రయించడానికి 2018 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుని డబ్బులు చెల్లించానని, ఏడాదిలోగా బదిలీ చేయాల్సి ఉన్నా రకరకాల సాకులతో చేయలేదని, ఏబీసీఎల్ యాజమాన్య మార్పులపై తనకు నిజాలు చెప్పలేదని ఆరోపిస్తూ శివాజీ ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కు వెళ్లటం తెలిసిందే. ఏదో ఒక వివాదాన్ని సృష్టించి.. కొత్త యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించటమే శివాజీ ఉద్దేశమని అలందా పేర్కొంది. శివాజీ చెబుతున్న షేర్ పర్ఛేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం ఇక్కడ గమనార్హం. అడ్డుకున్నది ఆయనేనా? చిత్రమేంటంటే టీవీ9లో తన వాటాను విక్రయించడానికి శ్రీనిరాజు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా డీల్స్ కుదిరిన తర్వాత కూడా చివర్లో బెడిసి కొట్టేవి. దీనివెనక రవిప్రకాశ్ ప్రమేయం ఉందనేది ఏబీసీఎల్ యాజమాన్య వర్గాల మాట. కొన్నేళ్లుగా టీవీ9 నిర్వహణలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలున్నాయని, అవి బయటపడతాయనే భయంతోనే కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాశ్ అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పైపెచ్చు డబ్బులు తీసుకుని షేర్లు ఇవ్వకపోతే రవిప్రకాశ్‌పై శివాజీ కేసు పెట్టాలి తప్ప ఏబీసీఎల్‌ను వివాదాల్లోకి లాగటం కూడా ఈ అనుమానాలకు ఊతమిచ్చేదే. ఉద్వాసన తర్వాత కూడా టీవీ9లో రవిప్రకాశ్! సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప.. ఫోర్జరీ వంటి ఆరోపణలపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. దీనిపై కొత్త యాజమాన్యం స్పందిస్తూ.. ‘మేం 90% వాటా కొనటం అబద్ధమా? మెజార్టీ వాటా ఉన్నా మా డైరెక్టర్లకు రవిప్రకాశ్ అడ్డుపడటం అబద్ధమా? తన సంతకం ఫోర్జరీ చేశారంటూ కంపెనీ సెక్రటరీ ఫిర్యాదు చేయటం నిజం కాదా? ఆ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేయడం వాస్తవం కాదా?’అని ప్రశ్నించింది. మీపై నమ్మకముంచి చానల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన కంపెనీకి మీరు చేసిందేమిటని నిలదీసింది. -
రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ9 నుంచి ఉద్వాసనకు గురైన రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గత రెండురోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీవీ చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరికి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి టీవీ9 యాజమాన్యం తొలగించింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో 406, 467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. చదవండి: టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు నటుడు శివాజీ నివాసంలో సోదాలు.. అలాగే టీవీ9లో తనకు వాటా ఉందంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నారాయణగూడ, హిమాయత్ నగర్‌లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఏబీసీఎల్లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు. చదవండి: టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన అయితే, ఏబీసీఎల్లో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ ఎన్సీఎల్టీ వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. దానికి రవి ప్రకాశ్ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి ఎన్సీఎల్టీ జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. -
నటి విజయలక్ష్మిపై రవిప్రకాశ్ ఫిర్యాదు
సాక్షి బెంగళూరు: తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నటుడు రవి ప్రకాశ్‌పై నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆమెపై కర్ణాటక వాణిజ్య మండలిలో రవి ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న ఆమెకు తాను నగదు సాయం చేశారని తెలిపారు. అంతేకానీ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కష్ట సమయంలో సహాయం చేయాలని కోరితే డబ్బులను ఇచ్చినట్లు తెలిపారు. కానీ విజయలక్ష్మి మాత్రం తనను అవమానం చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తోందని చెప్పారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
సాయం చేసి వేధించారు.. నటుడుపై నటి ఫిర్యాదు
యశవంతపుర (కర్ణాటక): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటి విజయలక్ష్మీ.. తనను నటుడు రవి ప్రకాశ్ మానసికంగా లైంగికంగా వేధించిన్నట్లు పుట్టేనహళ్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. తను కొద్దిరోజుల నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఫిబ్రవరి 27న నటుడు రవిప్రకాశ్ ఆస్పత్రికీ వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. అనంతరం ప్రతిరోజూ ఐసీయూకు రావడం, పదేపదే ఫోన్ మేసెజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారన్నారు. ఈ మేరకు ఆమె కన్నీరు పెట్టుకుని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది. వేధించలేదు: రవిప్రకాశ్ ఆమె ఆరోపణలను నటుడు రవి ప్రకాశ్ ఖండించారు. మీడియాలో సాయం చేయాలని కోరటం వల్ల ఆమెకు లక్ష రూపాయలను సాయం చేశాను గానీ లైంగికంగా వేధించలేదని చెప్పారు. ఆమెతో తను మాట్లాడిన కాల్ రికార్డ్ ఉందన్నారు. కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయటమే తప్పా అన్నారు. -
మార్చి 15న ‘ఆ నిమిషం’ రిలీజ్
వేంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకం పై నూతన నటీనటులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ బండారు హరితేజ నిర్మించిన సినిమా ‘ఆ నిమిషం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫిలిం చాంబర్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళా రాజేష్ మాట్లాడుతూ.. ఆడపిల్లని స్వాగతించండి వారిని సంరక్షించండి ఆడపిల్ల ఏ దేశానికైనా నిజమైన ఆస్తి. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. నేడు ఆడపిల్ల విలాస వస్తువుగా చూస్తున్న వాళ్ళు ఆడపిల్ల పుడితే పురిటీలోనే గొంతు నొక్కుతున్నారు. ఆడపిల్లల బర్త్ రేటు గణనీయంగా తగ్గుతుంది. సమాజంలో ఎన్నో మార్పులొస్తున్నా కూడా ఆడపిల్లని పురిటీలోనే చంపేయడం అనేది చాలా దారుణం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సమాజానికి భవిష్యత్ అనేది ఉండదు. విద్యా సంస్థలలో పనిచేస్తున్న నేను నా మిత్రులు కలసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అన్నారు. నటులు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్, ట్రైలర్స్ బాగున్నాయి. దర్శకుడు నిర్మాత అంతా కొత్త వారు అయినా... మంచి కథతో నేడు సమాజం ఎదుర్కొంటున్న బర్నింగ్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. బేబీ రోహి సంజన, బేబీ నన్నీనటన ఆకట్టుకుంటుంది. మార్చి 15న విడుదలవుతున్న ఈ సినిమా మంచి హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను అన్నారు. మా తొలి ప్రయత్నం సక్సెస్ కావాలని సినిమా ఘన విజయంసాధించాలని హీరో ప్రసాద్ రెడ్డి చెప్పారు. -
డాక్టర్నయ్యాకే యాక్టర్నయ్యా!
సింహాచలం (పెందుర్తి) : సినీ రంగంలోకి అనుకోకుండా వచ్చా.. సాధారణంగా డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడంటారు. నేను మాత్రం డాక్టర్నయ్యాకే యాక్టర్నయ్యానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక మీడియాతో కొంతసేపు మాట్లాడారు. విశాఖ మా సొంత ఊరని, లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాలో జరిగిందన్నారు. విశాఖ వేలీ స్కూల్లో పన్నెండో తరగతి వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్ మాస్కోలో చేశానని తెలిపారు. కొంతకాలం హైదరాబాద్‌లో ప్రాక్టిస్ చేశానన్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు చెబితే అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. అలా 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా పరిచయం అయ్యానన్నారు. అప్పటి నుంచి సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ప్రేక్షకులు అందించారన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 చిత్రాల్లో నటించానన్నారు. ప్రస్తుతం సమంత, ఆదిపినిశెట్టి జంటగా నటిస్తున్న యూటర్న్ సినిమాలోను, తాప్సి, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న నీవెవరు అనే చిత్రంలోను, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజే హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలోనూ నటిస్తున్నాన్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందన్నారు. దర్శనార్థం వచ్చిన రవిప్రకాష్ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. -
ప్రవాసులకు అత్యవసర సమయాల్లో చేయూతగా..
కాలిఫోర్నియా : ప్రవాస భారతీయులకు అత్యవసర సమయాల్లో చేయూత ఇవ్వాలనే సంకల్పంతో టీం ఎయిడ్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్ ప్రకటించారు. ఈ సంస్థ గురించి అవగాహన కలిగించేదుకు బే ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నదనీ, తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావిస్తోన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బే ఏరియాలోని వివిధ రాష్ట్రాల సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్ ఛైర్మన దిలీప్ కొండిపర్తి మాట్లాడుతూ.. ‘ఎంతటి వివేకవంతులైనా ఆపద సమయాల్లో అయోమయంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో పడతారని, అలాంటివాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం తోటి ప్రవాసుల నైతిక బాధ్యత. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కన్నా వేరే సేవ ఉండదు. టీం ఎయిడ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సిలికానాంధ్ర తమ జగమంత కుటుంబంతో ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని పేర్కొన్నారు. ‘బంగారు భవిష్యత్తును ఆశిస్తూ స్వదేశాన్ని విడిచి వచ్చిన వారికి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా భుజం తట్టి సహాయం చేయాలనే సదుద్దేశంతో టీం ఎయిడ్ ప్రారంభించాము. టీం ఎయిడ్.. ఏ ఇతర కమ్యూనిటీ సంస్థలకు పోటీ కాదు. అమెరికా పోలీసులతో పాటు, విదేశాంగ ప్రతినిధులతో, భారతదేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తుంది. అమెరికాలోని భారతీయ సంస్థలన్నిటినీ కలుపుకుంటూ, ఒక కేంద్రీయ సహాయ కేంద్రంగా పనిచేస్తుంది. ఆపద సమయాల్లో సమయం వృధా కాకుడదు, ఎంత త్వరగా మేలుచేస్తే అంతటి ఊరట కలుగుతుంది. అందుకే ఈ సంస్థను ఏర్పాటుచేస్తున్నాము' అని నన్నపనేని ఈ సంస్థ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, సీ ఈ ఓ రాజు చమర్తి, సీఎఫ్ఓ దీనబాబు కొండుభట్ల, రవిప్రకాష్ ఇంకా ఇతర సభ్యులు పాల్గొన్నారు. రాజ్ భనోత్ (హిందూ టెంపుల్ అండ్ కమ్యునిటీ సెంటర్), నీరజ్ భాటియా (ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) తో పాటు బే ఏరియాలోని బే ఏరియా తమిళ్మాండ్రమ్, మలయాళీ అసోసియేషన్ మాన్కా, బే మలయాళీ అసోసియేషన్, మైత్రీ , సన్నీవేల్ హిందూ టెంపుల్, స్పెక్ట్రమ్ చర్చ్, శాన్ జోస్ గురుద్వార, బే ఏరియా ఫభసి( బెంగాలీ అసోసియేషన్), ఉప్మా( ఉత్తరప్రదేశ్ అసోసియేషన్), మహారాష్ట్ర మండల్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఒరిస్సా అసోసియేషన్, భువనేశ్వర్ సిస్టిర్ సిటీస్ ఆఫ్ కూపర్టినో, కాశ్మీరీ అసోసియేషన్, ఇండియన్ ముస్లీం అండ్ చారీటీస్ (ఐఎమ్ఆర్సీ), పంజాబ్ షౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, అప్పప, రాణా ( రాజాస్థాన్ అసోసియేషన్) సింధీ అసోసియేషన్, అకాలీ దళ్ (పంజాబీ) సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యి తమ సంఘీభావాన్ని తెలిపారు. టీమ్ ఎయిడ్‌తో కలిసి పనిచేయడం తమకు ఆనందంగా ఉందని, సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతామని, టీమ్ ఎయిడ్స్‌కు విస్తృత ప్రచారం కల్పించి అవసరమైన వారికి సహాయం అందించేందకు సహాకారం చేస్తామని అన్నారు. -
అమరావతి కేంద్రంగా జరిగిన కుట్రపై విచారించాలి: పవన్
సాక్షి, అమరావతి: గత 6 నెలలుగా తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న కుట్ర అమరావతి కేంద్రంగానే జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ పునరుద్ఘాటించారు. దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలపై మంగళవారం కూడా పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఈ కుట్రలో టీడీపీకి మద్దతుగా ఉన్న మీడియా చానల్స్ అధినేతలు, వాటి భాగస్వాములు, పెట్టుబడిదారులకు, బోర్డులకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు. దీనికి సమాధానం ఇవ్వడానికి వారికి సరిపడా సమయం ఇస్తానని తెలిపారు. అలాగే టీవీ 9 సీఈవో రవిప్రకాశ్‌కు వ్యతిరేకంగా గతంలో ఓ వ్యక్తి రాసిన బహిరంగ లేఖలను మంగళవారం ఉదయం పవన్ ట్వీటర్లో ఉంచారు. ఈ వార్తలపై కూడా టీవీ 9లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
మరో ట్వీట్ పేల్చిన పవన్ కళ్యాణ్
-
సంచలనం సృష్టిస్తున్న పవన్ కల్యాణ్ ట్వీట్
-
కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధం
సాక్షి, అమరావతి: తన తల్లిని నడిబజారులోకి లాగి తిట్టించడం వెనుక దాగి ఉన్న కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, అతని స్నేహితుడితో పాటు కొన్ని మీడియా సంస్థల వారు తన తల్లిని తిట్టించారని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని తన ఇంటి వద్దకు చేరుకున్న అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆవేశపడొద్దని అభిమానులకు సూచించారు. సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ‘వాళ్లు తప్పు చేసి మళ్లీ నా పైనే కేసులు వేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయపోరాటం చేస్తాను’ అని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులతో పాటు తాను కూడా నిస్సహాయుడినని వివరణ ఇచ్చారు. ‘వాళ్లు నెలల తరబడి తిట్టి తిట్టి.. ఆఖరికి నా తల్లిని బజారుకీడ్చారు. అలాంటి పరిస్థితిలో నేనంటే అభిమానించే మీకు చిన్నపాటి కోపం రాకూడదా. వాళ్లే ఇష్టమొచ్చినట్టు పచ్చిబూతులు మాట్లాడి.. మీరు నిగ్రహంగా ఉండాలంటే ఎలా? అసలు ప్రేరేపించిన వారు ఎవరు? అయినా కూడా మీరు(అభిమానులు) ఆవేశపడొద్దు. వాళ్లు కుట్రపూరితంగా ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తారు. జాగ్రత్తగా ఉండాలి’ అని పవన్ సూచించారు. కాగా, ఏబీఎన్, టీవీ9కు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ ట్వీట్ల దాడి రెండో రోజు కూడా కొనసాగింది. టీవీ9 ప్రతినిధి రవిప్రకాశ్‌ను రియల్ ‘అజ్ఞాతవాసి’గా పేర్కొన్నారు. ఆ అజ్ఞాతవాసిని ముఖ్యమంత్రే స్వయంగా.. ‘వాడో బ్లాక్‌మెయిలర్’ అంటూ వ్యాఖ్యానించారని విమర్శించారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలంటూ ఆ టీవీ చానల్ ప్రసారం చేస్తోందని.. అసలు ఆ స్లోగన్ వెనక కథకు, ఈ నినాదానికి సంబంధమేంటి? నిజాలను నిగ్గుతేల్చుదామంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశించి పవన్ మరో ట్వీట్ చేశారు. తన తల్లిని తిట్టిస్తూ ప్రసారం చేసిన వీడియోను సీఎం చంద్రబాబుతో పాటు లోకేశ్‌కు, మీ కుటుంబంలోని మహిళలకు చూపించాలని రాధాకృష్ణకు సూచించారు. వారి అభిప్రాయం ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. కాగా, టీవీ9 యజమాని శ్రీనిరాజు పంపించిన లీగల్ నోటీస్పైన కూడా పవన్ స్పందించారు. ‘నీకు శ్రీసిటీతో లబ్ధిచేకూర్చిన నీ పొలిటికల్ బాస్‌లతో కుమ్మక్కైన.. మీ చానల్ సీఈవో రవిప్రకాశ్ నా తల్లిని తిట్టించిన దానికి, నువ్వు పంపిన లీగల్ లెటర్‌కు తేడా ఏం లేదు’ అని శ్రీనిరాజును ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు. కాగా, శనివారం రాత్రి రవిప్రకాశ్‌పై పవన్ ట్వీట్ల దాడి తీవ్రతరం చేశారు. ఓ వ్యక్తి రవిప్రకాశ్ కాళ్ల మీద పడి వేడుకుంటున్నట్లుగా ఉన్న ఓ వీడియోను కూడా పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని కూడా ప్రసారం చేసుకొని మీ చానల్‌ను నడుపుకోండి అంటూ ఎద్దేవా చేశారు. -
సారీ రవిప్రకాష్.. పవన్ వ్యంగ్య ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి టీవీ9 ఛానల్ సీఈవో రవిప్రకాష్ అని వెల్లడించిన పవన్.. వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. 'రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు. అందుకు కొంత సమయం ఇవ్వు. కొద్దిసేపు వేచి చూడు. రవిప్రకాష్.. నీకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపిస్తానంటూ' పవన్ తన తాజా ట్వీట్లో పోస్ట్ చేశారు. మరోవైపు తన అభిమానులనుద్దేశించి సందేశం పంపారు పవన్. ఈ వివాదంలో ఆవేశపడొద్దదంటూ అభిమానులకు సూచించారు. అభిమానులందరూ సంయమనంతో ఉండాలని కోరారు. వాళ్లు తప్పు చేసి తనపై కేసులు వేస్తున్నారని.. కానీ తాను ఏ తప్పు చేయలేదన్నారు. న్యాయపోరాటం చేస్తానని మరోసారి పేర్కొన్నారు. నిన్న మీడియాపై జరిగిన దాడిలో పోలీసులతో పాటు తాను కూడా నిస్సహాయుడినని సోషల్ మీడియా ద్వారా వివరించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన అంశం అనూహ్య మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం.. ఆపై తానే దూషించమని చెప్పానంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరపైకి రావడంతో వివాదం మరింత పెద్దదైంది. వ్యక్తిగత దూషణలు, తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడం వెనుక టీడీపీ అనుకూల మీడియా, నారా లోకేశ్ కుట్ర ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. Raviprakash ,I will text to you separately .. give me sometime.kindly wait! Apologies for making you wai!🙏😊 — Pawan Kalyan (@PawanKalyan) 21 April 2018 -
సివిల్ కేసులు కోర్టుల్లో పరిష్కరించుకోండి
ఏలూరు అర్బన్: సివిల్ తగాదాలను కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఫిర్యాదుదారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఎస్పీ రవిప్రకాష్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి సత్వరం విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా మంది సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోకుండా నేరుగా మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారని, అదేవిధంగా పలువురు సివిల్ తగదాలపై ఫిర్యాదు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. ఇలా చేయడం వల్ల బాధితులు వ్యయప్రయాలకు లోనవుతున్నారని, దీంతో న్యాయం చేయడంలో జాప్యం జరిగే అవకాశముందని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఎస్పీ దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు ఇలా.. ∙జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీఆర్పీఎస్) జిల్లా అధ్యక్షుడు పాము శామ్యూల్ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ను కోరారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ నాయకులు కె.ఆనందరావు, ఉప్పే ధనుంజయరావు తదితరులు ఎస్పీని కలిసిన వారి లో ఉన్నారు. ∙గరగపర్రు గ్రామంలో శాంతిభద్రలను కాపాడాలని, దళితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ జిల్లాలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సమితి నాయకులు మాత్రపు లోకేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
అదుపులో 124 మంది, 60 మంది హౌస్ అరెస్ట్
బంద్ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనల్లేవు కోనసీమపై ప్రత్యేక నిఘా 144, 30 సెక్షన్లు ఉల్లంఘిస్తే క్షమించేది లేదు అమలాపురం టౌన్ : ముద్రగడ పద్మనాభం అరెస్టు తర్వాత శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాపై పడకుండా 144 సెక్షన్, సెక్షన్ 30లతో వ్యాపారులు స్వేచ్ఛగా దుకాణాలు తెరుచుకునే ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ అన్నారు. బంద్ సందర్భంగా జిల్లాలో 144, 30 సెక్షన్లు ఉల్లంఘించిన 124 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60 మంది నాయకులను హౌస్ అరెస్టు చేశామన్నారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బంద్ వల్ల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, జిల్లాలో శాంతిభద్రతలు పూర్తి అదుపులోనే ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. ముద్రగడ రాజమండ్రి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. ఈ పరిణామక్రమాల్లో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇతర జిల్లాల నుంచే అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపామని చెప్పారు. రాపిడ్ యాక్షన్ ఫోర్సు (ఆర్ఏఎఫ్), పారా మిలటరీ బలగాలను కూడా రప్పించామన్నారు. ఇప్పటికే ఏఎన్ఎస్, సీఆర్పీఎఫ్ వంటి బలగాలు కూడా జిల్లా బందోబస్తులో ఉన్నాయని చెప్పారు. గోదావరి జిల్లాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో జక్కంపూడి రాజా, పిఠాపురంలో పెండెం దొరబాబు, తణకులో చీర్ల రాధయ్య, పెదపాడులో అప్పన ప్రసాద్‌తో పాటు పలువురిని ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు. కోనసీమపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈ సీమకు ఉన్న గత నేర చరిత్రపై అధ్యయనం చేసి గుర్తించిన ప్రాంతాల్లో నిఘా పెంచామని, ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో కొందరు ఈ అవకాశం ముసుగులో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తారని, ముఖ్యంగా జిల్లా ప్రజలు ఎలాంటి వదంతలు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. బంద్ తదితర అసౌకర్యాలకు వ్యాపారులు భయపడ వద్దని, వారికి పోలీసు వైపు పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం విజయనగరం ఏఎస్పీ ఏవీ రమణ, అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీబీ సీఐడీ డీఎస్పీ వెంకటరత్నం, అమలాపురం సీఐలు వైఆర్కే శ్రీనివాస్, జి.దేవకుమార్లతో సమీక్షించారు. -
మావోయిస్టు దళ సభ్యుని అరెస్ట్
మావోస్టు శబరి ఏరియా కమిటీ దళ సభ్యుడు ముచ్చిక అడమయ్యను అరెస్టు చేసినట్టు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. గురువారం ఎటపాక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాత్రి ఎటపాక మండల పరిధిలోని గొల్లగుప్ప అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా అడమయ్య పట్టుబడ్డాడని తెలియజేశారు. అడమయ్య చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని లంకపల్లికి చెందినవాడని, ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివి వ్యవసాయం చేసుకుంటున్న అతడు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ ప్రోద్బలంతో మావోయిస్టుల కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడని వివరించారు. అడమయ్యకు 2014లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి ఈ ఏడాది దళంలో చేర్చుకుని 303 వెపన్ ఇచ్చారని తెలిపారు. ఇటీవల జరిగిన లక్ష్మీపురం చర్చి పాస్టర్ తనయుడి కిడ్నాప్‌లో, మారాయిగూడెం సమీపంలో సీఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపి ఒకరిని హత్య చేసిన ఘటనలో అడమయ్య పాల్గొన్నాడన్నారు. పోస్టర్లు వేయటం, రహదారులు తవ్వటం వంటి పనుల్లో చురుకుగా పాల్గొనే వాడని తెలిపారు. -
మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
కాకినాడ క్రైం : ‘తూర్పు’ ఏజెన్సీ ప్రాంతంలో 34 మంది మావోయిస్టు సానుభూతిపరులు బుధవారం రాజవొమ్మంగిలో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల ప్రాంతాలకు చెందిన 13 మంది, రాజవొమ్మంగి స్టేషన్ పరిధికి చెందిన 21 మంది దశాబ్దం నుంచి మావోయిస్టు సానుభూతిపరులుగా ఉంటూ వారికి భోజనాల ఏర్పాటు, సమాచార సేకరణ, మందులు, సరుకులు సమకూర్చడం, సమావేశాలకు జన సమీకరణ, బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాల్లో బ్యానర్లు కట్టడం, కరపత్రాల పంపిణీ వంటివి చేస్తున్నారు. కాగా లొంగిపోయిన ఆ 34 మందికీ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. వారి పిల్లల చదువులు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేలా శిక్షణ కూడా ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభావితమై లొంగిపోతున్నట్లు తెలిపారన్నారు. ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడి, సీఐ కేఎన్ మోహన్‌రెడ్డి, రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్సై పాల్గొన్నారు. -
రాత్రి గస్తీ.. రాబడి జాస్తి
దృష్టి సారిస్తాం నైట్ బీట్ కానిస్టేబుళ్లు సొమ్ములు వసూలు చేస్తుండడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిఘా పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసు సిబ్బంది వల్ల ఇబ్బందులు ఎదురైతే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. - ఎం. రవిప్రకాష్, జిల్లా ఎస్పీ కాకినాడ క్రైం :‘ఏ పుట్టలో ఏ పాముందో’ అన్నది పాత నానుడే కాగా.. ‘ఏ దారిలో ఏ పోలీసు మాటేశాడో’నన్నది వాహనదారుల నానుడిగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు రోడ్లపై రక్షకభటుల జాడ కనిపిస్తేనే.. ’అయ్యబాబోయ్.. పోలీసులు’ అనుకుని గడగడలాడిపోతున్నారు. రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట, తిమ్మాపురం, అచ్చంపేట జంక్షన్, పిఠాపురం, కత్తిపూడి, తుని, యానాం-ఎదుర్లంక వంతెన, మురమళ్ల, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు ప్రతి రాత్రి గస్తీ కాస్తుంటారు. నేరాలు, ప్రమాదాల నిరోధానికి కృషి చేయడం, జరిగితే తక్షణ చర్యలకు ఉపక్రమించడం వారి విధి. కాగా.. ఆ డ్యూటీ మాటున వారు వాహనదారుల జేబులకు చిల్లి పెడుతున్నారు. గస్తీ అంటేనే రాబడి జాస్తి’ అన్నట్టు.. తమ బారి నుంచి తప్పించుకోజూసే వాహన చోదకులను వెంటాడి మరీ భారీగా మామూళ్లు దండుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడ్డ సంఘటనలూ ఉన్నాయి. రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్లో, సామర్లకోట నుంచి కాకినాడ బీచ్ రోడ్డు వరకూ ఉన్న ఏడీబీ రోడ్లో ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్ల కానిస్టేబుళ్లు రాత్రి పహారా కాస్తూ వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణం ఓ గండంగా మారిందని, గత్యంతరం లేక వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. వాహనదారులు మద్యం తాగి ఉన్నా, వ్యభిచారం వంటి కార్యకలాపాలపై వెళుతున్నారనుకున్నా బెదిరించి సొమ్ములు గుంజుతున్నారు. ఇక లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు వంటి వాహనాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ‘పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ’ అనుకుంటూ భారీ వాహనాల డ్రైవర్లు వారు ఆపిక ప్రతి చోటా రూ.50 చొప్పున సమర్పించుకుంటున్నారు. సరుకులనూ దండుకుంటారు.. ప్రయాణం సాఫీగా సాగుతుందని చాలా మంది వ్యాపారులు, వాహనదారులు సరుకుల రవాణాను రాత్రి పూట చేస్తుంటారు. దానిని కూడా గస్తీ కానిస్టేబుళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. చేతికి వచ్చిన సరుకులను తీసుకుంటున్నారని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి సరుకులు తగ్గడంతో వ్యాపారులు కిరాయి తగ్గించి ఇస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. కానిస్టేబుళ్లకు ఎదురు చెపితే ఏదో ఒకసాకుతో వాహనాలు నిలిపివేసి సమయం వృథా చేస్తారని భావించి చాలా మంది సొమ్ములు ఇచ్చి బెడద తప్పించుకుంటున్నారు. సాధారణంగా వాహనాలు తనిఖీ చేసే అధికారం కానిస్టేబుళ్లకు లేకపోయినా.. దండుకోవడానికే హద్దు మీరుతున్నారని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అయినా ఆగని అక్రమార్జన గతంలో పెద్దాపురం ఏడీబీ రోడ్లో చెక్‌పోస్ట్ వద్ద భారీ మొత్తంలో సొమ్ములు గుంజుతున్నారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో రెక్కీ నిర్వహించారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోం గార్డు (జీపు డ్రైవర్)ను సస్పెండ్ చేశారు. అనంతరం కానిస్టేబుళ్ల హవాపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఉన్నతాధికారులు రాత్రి పూట పోలీసు దందాపై దృష్టి సారించడం మానివేశారు. దీంతో గస్తీ కానిస్టేబుళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. గస్తీ లక్ష్యాన్ని విస్మరించిన కానిస్టేబుళ్లు కాసుల వేటలో నిమగ్నమవుతున్నారు. అసాంఘిక శక్తులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. కానిస్టేబుళ్లను ప్రధాన సెంటర్లు, రహదారుల్లో కాక జనావాస ప్రాంతాల్లో గస్తీకి నియమిస్తే చోరీలు, హత్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి గస్తీ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగానే 90 శాతం అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు, హత్యలు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గస్తీ కానిస్టేబుళ్ల దందాను అరికట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. -
లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రిని, అసెంబ్లీని కించపరిచే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కేసులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రూ.25వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ఉద్యోగుల ష్యూరిటీతోపాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు కండీషన్ బెయిలు మంజూరు చేశారు. తెలంగాణ అసెంబ్లీని కించపరిచేలా టీవీ9 కథనాలు ప్రసారం చేసిందంటూ న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్
హైదరాబాద్: టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఈరోజు ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్‌చానల్‌పై, ఆ సంస్థ సీఈఓ రవిప్రకాష్‌పైన జూన్‌లో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 12వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేశారని ఆరోపిస్తూ 18న ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిసేపు అతనిని ప్రశ్నించారు. ఆ తరువాత అతనిని పంపించివేశారు. -
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్
-
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు
రంపచోడవరం, మారేడుమిల్లి:న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వస్తే వెంటనే కేసు నమోదు చేయాలని, అలా చేయకుండా సెటిల్మెంట్లు చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు. రంపచోడవరం డివిజన్లో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తూర్పు సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయని గాలికొండ, కోరుకొండ దళాలు సరిహద్దులో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు ఏజెన్సీలో 2008 నుంచి మవోల కదలికలు పూర్తిగా తగ్గాయని, ప్రస్తుతం గుర్తేడు ఏరియాలో మావోల కదలికలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టుల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రాలో విలీనమైన మండలాల నుంచి ఆరు పోలీస్ స్టేషన్లు తూర్పు పరిధిలోకి వచ్చాయని, కొత్తగా మరో సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం ఏర్పాటు అవసరం ఉందన్నారు. మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్గడ్ కుంట ఏరియాలో శబరి ప్లాటూన్ సంచారం ఉందని, మావోలకు చెక్ పెట్టేందుకు కూంబింగ్ జరుగుతుందని, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. విలీన ప్రాంతంలో పోలీస్ సిబ్బంది నియమకానికి సమయం పడుతుందని, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం గుర్తేడులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని ఎస్పీ చెప్పారు. గిరిజన యువత మావోల ఉద్యమంవైపు ఆకర్షితులు కావడం లేదని, ఇందుకు ఉపాధి అవకాశాలు పెరగడం చైతన్యం రావడమే కారణమని పేర్కొన్నారు. మావోల ప్రభావిత ప్రాంతాల్లో ఐఏపీ నిధులతో చేపట్టిన పనుల ప్రగతిపై పరిశీలించామని, గిరిజన యువత చైతన్యానికి వివిధ అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. తూర్పు సరిహద్దులోని గ్రామాల్లో గంజాయి సాగు చేస్తూ ఏజెన్సీ ప్రాంతం మీదుగా బయటకు రవాణా చేస్తున్నారని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసులు గంజాయి అక్రమార్కులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సి.హెచ్.విజయరావు ఉన్నారు. అనంతరం ఆగస్టు 15 సందర్భంగా రంపచోడవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి పోలీస్ మీట్ విజేతలకు ఎస్పీ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు కృష్ణారావు, రాంబాబు, ఉమర్, ముక్తేశ్వరరావు, ఎస్సై విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరుస్తూ కథనం ప్రసారం చేసిన కేసులో టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బలుసు శివశంకరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ డజనుకుపైగా షరతులు విధించారు. టీవీ 9 కథనంపై న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయటం తెలిసిందే. -
ఛాలెంజింగ్‌గా ఉంది
కాకినాడ క్రైం :కోనసీమ, మెట్ట, మైదాన ప్రాంతాలతో వైవిధ్యానికి నెలవైన తూర్పు గోదావరి జిల్లాకు రావడం ఛాలెంజింగ్‌గా ఉందని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కరణం సత్యనారాయ ణ నుంచి సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతామన్నారు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే కోనసీమలో అలాంటిది పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్లోని ఆరు మండలాలు విలీనం కావడంతో జిల్లాపై మావోయిస్టుల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలతోనూ చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అవసరమని, రిక్రూట్మెంట్ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగలతో పాటు మెట్ట ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంపచోడవరం ఏఎస్పీతో దీనిపై ఇప్పటికే చర్చించిన ట్టు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణీని అరికడతాం.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి నకిలీ కరెన్సీ రాకపై నిఘా మరింత పెంచుతామని, స్థానికంగా జిరాక్స్ తీసి దొంగనోట్లు చలామణీ చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పెట్రో కారిడార్, సెజ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలను సామరస్యంగా పరిష్కరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్, ఈవ్‌టీజింగ్ నిరోధంతో పా టు విజిబుల్ పోలీసింగ్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. స్టేషన్లలో సుహృద్భావ వాతావరణ ం ఉండేలా, ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసేలా చూస్తామని చెప్పారు. వివిధ శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ముందు కు వెళ్తామన్నారు. జిల్లా 78వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాష్‌ను ఓ ఎస్డీ ప్రకాష్ జాదవ్, డీఎస్పీలు ఆర్.విజయభాస్కర రెడ్డి, ఎం.వీరారెడ్డి, వి.అరవింద్‌బాబు, బి.రవీంద్రనాథ్, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ చానెల్ ప్రసారాలను మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎమ్మెస్వో) నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఆ చానెల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని, సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎమ్మెస్వోలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాదని, చట్టబద్ద సంస్థ కాదని, కాబట్టి వారికి ఈ కేసులో తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. రవిప్రకాశ్ కోర్టు హాజరు కోసం పిటీషన్... తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతున్న టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్‌ను కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశించాలని కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 438 (1బి) కింద పీపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు శుక్రవారం విచారించారు. పీపీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రవిప్రకాశ్‌కు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: రవిప్రకాశ్
హైకోర్టులో టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్.బి.నగర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీవీ-9 సీఈవో రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. కిందికోర్టులో తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రావడంలేదని, అందువల్ల కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు భయంగా ఉందని, ఆ కారణంతోనే నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని ఆ పిటిషన్లో వివరించారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారించారు. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.