
సైబరాబాద్ : టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాష్ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా.. లోపల ఒకలా వ్యవహరిస్తున్నారని బంజారాహిల్స్ పోలీసు అధికారులు తెలిపారు. రవి ప్రకాష్‌ను గత మూడు రోజులుగా విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. విచారణకు ముందు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చే రవి ప్రకాష్‌ను విచారించామన్నారు. ఆయనను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అలంద మీడియా ఇచ్చిన కేసుపైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్‌ను ప్రశ్నించామన్నారు.
రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపారు. నటుడు గరుడ శివాజీకి కూడా ఈ మధ్యనే నోటీసులు పంపామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, రవి ప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టే రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేయాలా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment