TV9
-
రవిప్రకాశ్‌పై కేసు ఉపసంహరణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం, ఫోర్జరీలకు పాల్పడ్డారంటూ టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్‌పై నమోదైన కేసు ఉపసంహరణకు అనుమతించిన కూకట్‌పల్లిలోని మేజి్రస్టేట్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి.కౌశిక్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రవి ప్రకాశ్‌పై కేసు ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2024, మార్చి 15న జీవో 158 జారీ చేసింది. దీని ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమో దాఖలు చేయగా, కూకట్పల్లి కోర్టు తీర్పునిచి్చంది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కౌశిక్‌రావు కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసును మార్చిలో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని ఆధారంగా అనుమతిస్తూ మేజి్రస్టేట్ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. కేసు పూర్వాపరాలను, ఇతర అంశాలను పరిశీలించకుండానే ఉత్తర్వుల జారీ సరికాదు. క్రిమినల్ కేసు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?.. కారణాలు ఏమైనా ఉన్నాయా?.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంతో పడే ప్రభావాన్ని, చార్జిషీట్లోని ఆధారాలను, సాక్షుల స్టేట్మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. మేజి్రస్టేట్ కూడా ఎలాంటి కారణాలను పేర్కొనకుండా మెమోను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. రవిప్రకాశ్.. నిందితుడిగా ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, మోసానికి పాల్పడటం లాంటి పనులు చేశారని సాక్షులు వాంగ్మూలంలో పేర్కొ న్నారు. యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయకూడదన్న సత్యాన్ని మేజి్రస్టేట్ పాటించలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టు ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, రవిప్రకాశ్, సొంటినేని శివాజీ, జె. కనకరాజు, జె. తేజవర్మ, మహేశ్ గాం«దీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 5కి వాయిదా వేశారు. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు
-
రవిప్రకాశ్‌పై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి భారీగా నిధులను రవిప్రకాశ్ విత్ డ్రా చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల రూపాయల నిధులను రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు విత్ డ్రా చేశారని కేసు నమోదు కావడంతో దానిపై విచారణ చేపట్టారు.గతంలోనే ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో సహా పలువురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ విత్ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు. -
హిందూ దేవతలను కించపరిచారని టీవీ9పై ఫిర్యాదు
మల్కాజిగిరి: టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌లో హిందూ దేవతలను కించ పరిచారని బీజేపీ నాయకులు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 14వ తేదీన ఉదయం ఇస్మార్ట్ న్యూస్‌లో గ్రామ దేవతను కరో నా అమ్మవారిగా (ఫొటో) మార్చి పూజలు చేసే దృశ్యాలు ప్రసారం చేశారని లేఖలో పేర్కొన్నారు. దీనిని ప్రసారం చేసిన సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, సదానంద్, ధర్మతేజ, భరత్‌యాదవ్ పాల్గొన్నారు. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
రవిప్రకాశ్ కస్టడీపై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు రవిప్రకాష్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయనీ, పది రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించింది. రవిప్రకాశ్ తన అధికార దుర్వినియోగంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్‌గ్రేషియా నిధులను అక్రమంగా మళ్లించారని, దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని కోర్టుకు సమర్పిస్తున్నామని ఈ మేరకు తెలిపింది. అలాగే అతడు డ్రా చేసిన నగదు లావాదేవీల పూర్తి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగిందని వివరించింది. రవిప్రకాశ్‌పై ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), హైకోర్టులోని కేసులకు.. ఈ కేసుకు సంబంధం లేదనీ, 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరింది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్, ఏ-2గా ఆర్థిక వ్యవహారాలు చూసే మూర్తిగా గుర్తించారు. కాగా ప్రస్తుతం మూర్తి పరారీలో ఉన్నాడు. -
రవిప్రకాశ్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి: టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ అలియాస్ రవిబాబు రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐ) ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌కి తాజాగా లేఖ రాశారు. రవిప్రకాశ్, ఆయన భార్య దేవిక, ఇతరుల అక్రమార్జన, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను కూడా జతచేసి సీజేఐకి పంపించారు. అడ్డగోలు సంపాదన ‘‘ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్న రవిప్రకాశ్ తన పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులను సంపాదించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం(వీఎంఎల్ఏ), ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం(ఫెమా), ఆర్బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్‌బాబుకు రవిప్రకాశ్ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్‌ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు. ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు చెందిన సుకేష్ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అంతేకాక ఈ విధంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్‌కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్ఎక్స్టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో కోరారు. -
రవిప్రకాశ్‌పై సుప్రీం సీజేకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఆస్తులపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రవిప్రకాశ్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఫెమ, మనీలాండరింగ్, ఐటీ నిబంధనల్ని రవిప్రకాశ్ ఉల్లంఘించారని ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి పలువురిని మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించారని తెలిపారు. హవాలా సొమ్ముతో కెన్యా, ఉగాండాలోని కంపాల సిటీకేబుల్‌లో రవిప్రకాశ్ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్ అక్రమ వ్యాపారాలు, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను జతచేసి ఆధారాలతో సహా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాసినట్టు తెలిసింది. -
సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో రవిప్రకాశ్
-
మెరుగైన మోసం
-
రవిప్రకాశ్ అరెస్ట్...
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో ఆ టీవీ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల కం పెనీ లాభాలకు సమానంగా బోనస్, ఎక్స్ గ్రేషియాల కింద రూ.18,31,75,000 నగదు డ్రా చేశారని, అయితే టీడీఎస్ మినహాయింపుల తర్వాత రూ.11,74,51,808గా బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తోందని అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌టైమ్ డైరెక్టర్ జి.సింగారావు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. టీవీ9 లోని 90.54 శాతం మెజారిటీ షేర్‌హోల్డింగ్‌ను ఈ ఏడాది ఆగస్టు 27 నాటికి అలందా మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కొత్త బోర్డు డైరెక్టర్లు సంస్థ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించగా, రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తిలు మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని తేలింది. 2018 సెప్టెంబర్ 18న , 2019 మార్చి 3న,మే 8న రవిప్రకాశ్ రూ.6,36,000, 2018 అక్టోబర్ 24, డిసెంబర్ 10, 2019 మే 8న ఎంవీకేఎన్ మూర్తి రూ.5,97,87,000లు, కంపెనీ డైరెక్టర్ క్రిఫర్డ్ పెరీరా 2018 అక్టోబర్ 24, డిసెంబర్ 10, 2019 మే 8న రూ.5,97,87,000 డ్రా చేసినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి కింద రూ.18,31,75,000 డ్రా చేశారని రికార్డులను బట్టి తెలిసింది. కంపెనీకి నష్టం కలిగించడంతో పాటు మోసపూరితంగా చేసిన లావాదేవీలను బోనస్, ఎక్స్‌గ్రేషియా రంగుపులిమే ప్రయత్నం చేశారు. బోర్డు తీర్మానం లేకుండా అలాంటివి ఇచ్చే వీలుండదు. కంపెనీ షేర్‌హోల్డర్స్ జనరల్ మీటింగ్‌లో ఆమోదం తీసుకోకుండానే బోనస్, ఎక్స్‌గ్రేషియాగా రికార్డు చేయాలని అకౌంటెంట్లకు వారు సూచించినట్లు తెలిసింది. ‘సెప్టెంబర్ 24న జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఈ మోసపూరిత లావాదేవీలపై పూర్తిస్థాయి చర్చలు జరిగాకే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ నగదును తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాం’అని ఫిర్యాదులో జి.సింగారావు పేర్కొన్నారు. పోలీసులతో వాగ్వాదం.. బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, మీరెవరంటూ రవి ప్రకాశ్ ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్ వరకు తన కారులోనే వస్తానని చెప్పగా పోలీసు వాహనాన్ని ఎస్కార్టుగా పెట్టి స్టేషన్‌కు తరలించారు. అనంతరం రవిప్రకాశ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కూడా టీవీ9కు సంబంధించిందని గతంలోనే అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీతాఫల్మండిలో మేజిస్ట్రేట్ ముందు ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం చంచలగూడ జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై ఈ నెల 9న విచారణకు రానుంది. కస్టడీలోకి తీసుకుంటాం: వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి సొంత అవసరాల కోసం భారీ మొత్తంలో కంపెనీ నగదు డ్రా చేసుకున్న రవిప్రకాశ్‌ను పోలీసు కస్టడీకి తీసుకుంటాం. టీవీ9 తాజాగా సమర్పించిన రికార్డుల ఆధారంగా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశాం. రవిప్రకాశ్‌ను విచారిస్తే పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయి. -
రవిప్రకాశ్‌ను విచారిస్తున్న పోలీసులు
-
రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేశాం: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు. రవిప్రకాశ్‌తో పాటు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్(ఏబీసీఎల్) మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఏబీసీఎల్ కంపెనీ చెందిన దాదాపు రూ.18 కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి ప్రశ్నించినట్టు తెలిపారు. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు ఫిర్యాదు పేర్కొన్నట్టు వెల్లడించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని డీసీపీ సుమతి తెలిపారు. -
పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
-
పోలీసుల అదుపులో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏబీసీఎల్ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు. సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో పాటు ఏబీసీఎల్ మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తిపై బంజరాహిల్స్ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వి రవిప్రకాశ్ మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్ డ్రా చేశారు. అలాగే డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నారు. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్ అండ్ కోపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
అరెస్టయితే బయటకు రాలేడు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 లోగో కంపెనీ పేరిటే రిజిస్టర్ అయిందని, ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ వ్యక్తిగతం కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. లిటిగేషన్ కోసమే రూ.వంద కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99 వేలకే రవిప్రకాశ్ అమ్మేశారని చెప్పారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన రిట్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రకటించారు. టీవీ9 లోగోను 15 ఏళ్లపాటు వాడుకున్నందుకు 4% వాటా ఉంటుందనే వాదనలో అర్థం లేదని ప్రతాప్‌రెడ్డి వాదించారు. టీవీ9 చానల్ కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయన్న రవిప్రకాశ్ ఆరోపణను ఖండించారు. రూ.500 కోట్లు బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయన్నారు. కొత్త యాజమాన్యం చట్ట ప్రకారం డైరెక్టర్లను నియమించిందని, అయితే రవిప్రకాశ్ ఫోర్జరీ పత్రాలు తయారు చేసి వాటా బదిలీ అయినట్లు చేశారన్నారు. రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరైతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టమని ఆయన తరఫు న్యాయవాది దిల్జీత్‌సింగ్ అహ్లూవాలియా వాదించారు. ముందస్తు బెయిల్ ఇస్తే పోలీసుల దర్యాప్తుకు రవిప్రకాశ్ సహకరిస్తారని, అందుకు ఎలాంటి కఠిన షరతులు పెట్టినా ఫర్వాలేదన్నారు. కావాలని మూడు కేసుల్లో ఇరికించినప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని, సుప్రీం కోర్టు సిబ్బియా కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో నిందితుడైన ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా వాదించింది. బెయిల్ మంజూరు చేస్తే రవిప్రకాశ్ సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని, పైగా మరో నిందితుడు నటుడు శివాజీ పరారీలో ఉన్నారని, దీంతో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు బాగా ఉన్నాయంది. కింది కోర్టే కాకుండా సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వలేదని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. ఇప్పటికే కింది కోర్టు రవిప్రకాశ్ బెయిల్ దరఖాస్తును కొట్టివేసిందని, సుప్రీంకోర్టుకు వెళితే అరెస్ట్ నోటీసుకు 48 గంటల గడువు ఇవ్వాలని పేర్కొందని హరేన్ రావల్ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కింది కోర్టు ఉత్తర్వులకు ఇక్కడ సంబంధం లేదు. సుప్రీంకోర్టు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు’అని వ్యాఖ్యానించారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు పేర్కొనలేదని, 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని మాత్రమే చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. ఏబీసీఎల్లో రవిప్రకాశ్‌కు పది శాతమే వాటా ఉందని, 40 వేల షేర్లను రూ.20 లక్షలకు నటుడు శివాజీకి అమ్మినట్లుగా గత ఏడాది తప్పుడు పత్రాలు సృష్టించారని హరేన్ రావల్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే వాటాల్ని విక్రయించడం నిజమైతే ఆ విషయాల్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేసిన రిటర్న్‌లో ఎందుకు పేర్కొనలేదన్నారు. షేర్ల అమ్మకాల గురించిగానీ, తద్వారా వచ్చిన రూ.20 లక్షల సొమ్ము గురించిగానీ రవిప్రకాశ్ లేదా శివాజీ ఆదాయపు పన్ను పత్రాల్లోనే కాకుండా రికార్డుల్లో కూడా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. రూ.140 కోట్లతో 90 శాతం టీవీ9 వాటాల కొనుగోలుకు ఏబీసీఎల్, అలందాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే, ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాల్ని సృష్టించి అమ్మకాలను అడ్డుకునేందుకు రవిప్రకాశ్ కుట్ర పన్నారని ఆరోపించారు. టీవీ9, బ్రాండ్ పేరును రవిప్రకాశ్ రూ.99 వేలకు చట్ట వ్యతిరేకంగా అమ్మేయడమే కాకుండా మరో మీడియా సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించారని పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే రవిప్రకాశ్ తప్పించుకు తిరిగారని, ఇప్పటికీ శివాజీ పరారీలో ఉన్నారని హరేన్ రావల్ వాదించారు. కేసు విచారణకు హాజరుకాకుండా కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ మంజూరు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాక పోలీసుల దర్యాప్తునకు రావ డం ప్రారంభించారని పేర్కొన్నారు. దర్యాప్తులో కూడా పొంతనలేని జవాబులు చెబుతున్నారని, మీడియా రంగంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చని, ఈ దశలో రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని రావల్ వాదించారు. మౌనంగా ఉండటమూ హక్కే.. తొలుత రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దిల్జిత్ సింగ్ అహ్లూవాలియా వాదిస్తూ.. బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. పోలీసులు 40 గంటలపాటు విచారించారని, పోలీసులు తాము కోరుకున్న జవాబులు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా హక్కేనని చెప్పారు. టీవీ9లో శ్రీనిరాజుకు ఉన్న 90 శాతం వాటాను కొనుగోలుకు సైఫ్ మారిషస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ నుంచి సైఫ్ మారిషస్ స్టే ఉత్తర్వులు ఉన్నా వేరే వారికి రూ.500 కోట్లకు విక్రయించారని తెలిపారు. ఒక్కసారిగా సైఫ్ మారిషస్ ఆ కేసును వెనక్కి తీసుకుందని, దీని వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారని, రూ.294 కోట్లు టెర్రరిస్టుల్లాంటి వారికి అందే హవాలా తరహాలో బదిలీలు జరిగాయని, దీనిపై రవిప్రకాశ్ సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన వెంటపడిందని చెప్పారు. ఈ కేసుల వెనుక కుట్ర ఉందని, ఒక కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాకుండా ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారని చెప్పగా, హరేన్ రావల్ కల్పించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈ విధంగా విచారించే వీలుందన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
రవి ప్రకాష్ బయట ఒకలా.. లోపల ఒకలా..
సైబరాబాద్ : టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాష్ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా.. లోపల ఒకలా వ్యవహరిస్తున్నారని బంజారాహిల్స్ పోలీసు అధికారులు తెలిపారు. రవి ప్రకాష్‌ను గత మూడు రోజులుగా విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. విచారణకు ముందు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చే రవి ప్రకాష్‌ను విచారించామన్నారు. ఆయనను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అలంద మీడియా ఇచ్చిన కేసుపైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్‌ను ప్రశ్నించామన్నారు. రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపారు. నటుడు గరుడ శివాజీకి కూడా ఈ మధ్యనే నోటీసులు పంపామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, రవి ప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టే రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేయాలా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. -
అమ్మే హక్కుంది... విక్రయించలేదు!
సాక్షి, హైదరాబాద్: టీవీ–9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు చుక్కలు చూపించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ విషయం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలిసింది. శుక్రవారం 6 గంటల పాటు ప్రశ్నించినా రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో శనివారం సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని రావాల్సిందిగా ఆదేశిస్తూ రవిప్రకాశ్‌ను ఇంటికి పంపారు. టీవీ–9 కొత్త యాజమాన్యానికి లోగో దక్కకూడదనే కుట్రతోనే రవిప్రకాశ్ ఈ వ్యవహారం నడిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.99 వేలకు టీవీ–9 లోగోను మోజో టీవీకి అక్రమంగా విక్రయించినట్లు ఫోర్జరీ పత్రాలు, తప్పుడు సంతకాలతో మోసం చేశాడంటూ అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు గత నెలలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌కు ‘సీఆర్పీసీ 41 (ఎ)’సెక్షన్ కింద 2 నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసును బేఖాతరు చేసిన రవిప్రకాశ్ గురువారం అందుకున్న రెండో నోటీసుతో దిగివచ్చాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఏసీపీ కేఎస్ రావ్, ఇన్స్పెక్టర్ కళింగ్‌రావుతో కూడిన బృందం ఆయన్ను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. టీవీ–9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టాలని కుట్ర పన్నారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. లోగోను ఎలా విక్రయించారనే ప్రశ్నకు ‘అది నా సంస్థ. ఆ హక్కు నాకు ఉంది’అంటూ సమాధానం ఇచ్చారని తెలిసింది. దీంతో తీవ్రంగా స్పందించిన పోలీసులు అదే నిజమనుకున్నా... రూ.100 కోట్ల విలువైన సంస్థ లోగోను కేవలం రూ.99 వేలకే అమ్మారంటే నమ్మవచ్చా? అని ప్రశ్నించగా... తాను ఎవరికీ విక్రయించలేదంటూ చెప్పిన రవిప్రకాశ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా పొంతన లేని సమాధానాలు చెబుతూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. సాయంత్రం వరకు విచారించి ఆపై ఆ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తీసుకుని శనివారం రమ్మని పంపారు. శుక్రవారం నాటి విచారణలో రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అటు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు, ఇటు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుల విచారణలను తప్పించుకోవడానికి రవిప్రకాశ్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు అందుకు చెక్ చెప్పడానికి రవిప్రకాశ్ గతంలో అజ్ఞాతంలో ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎలా తలదాచుకున్నారు? సహకరించింది ఎవరు? అనే అంశాలను సాంకేతికంగా సంగ్రహిస్తున్నట్లు సమాచారం. రవిప్రకాశ్ అరెస్టు నేడు! ఫోర్జరీ, నిధుల మళ్లింపు వ్యవహారంలో పోలీసులు కేసు వేగవంతం చేశారు. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా కూడా అడిగిన పోలీసులు శనివారం అరెస్టుపై నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం సైబరాబాద్ పోలీసు విచారణ సందర్భంగా రవిప్రకాశ్ పోలీసులనే బెదిరించడం సంచలనం రేపుతోంది. ‘‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది’’అని బెదిరించే ప్రయత్నం చేయడం గమనార్హం. పోలీసులపై పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తూ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడన్న కారణంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులు మీడియా పాయింట్‌ను ఎత్తేశారు. దీంతో రవిప్రకాశ్ నేరుగా తమపైనే బెదిరింపులకు దిగాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో సీరియస్ అయిన పోలీసులు సీపీ సజ్జనార్‌తో సమావేశమై, అరెస్టు విషయమై చర్చించారని సమాచారం. ఫోర్జరీ ఆరోపణ అంగీకారం.. మొత్తం 3 రోజుల సైబరాబాద్ విచారణలో రవిప్రకాశ్ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఫోర్జరీ కేసులో సంతకాన్ని తానే ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. ఎలా ఫోర్జరీకి పాల్పడిందీ.. పోలీసులకు వివరించాడు. ఈ పనికి ఎందుకు పాల్ప డ్డావంటే మాత్రం సమాధానం దాటవేశాడు. అతని మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు పోలీసులు నిందితుడి చేతిరాతను సేకరించారు. ఫోర్జరీ కేసులో ఈ చేతిరాతను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. విచారణనంతా పోలీ సులు వీడియో రికార్డింగ్ చేశారు. మొత్తానికి ఈ కేసులో శనివారం పలు కీలక మలుపులు చోటుచేసుకోనున్నాయి. -
రవి ప్రకాష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని సమాచారం. ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో రవి ప్రకాష్నుంచి కీలక ఆధారాలను రాబట్టిన పోలీసులు ఆరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం. రవి ప్రకాష్ ఈ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజుల విచారణలో పోలీసులకు సహకరించని రవి ప్రకాష్ నాల్గవ రోజు కూడా తన పంథాను కొనసాగించారు. యాజమాన్యం మార్పిడి తర్వాత టీవీ9 లోగో కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవి ప్రకాష్ కుట్ర పన్నారు. లోగో అక్రమ విక్రయం కేసులో రవి ప్రకాష్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. టీవీ9 లోగోను సీఈఓ స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఎలా విక్రయించాలనుకున్నారని, లోగోను అమ్మేయాలనుకుంటే యాజమాన్యానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మూడు రోజులపాటు విచారించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. మూడు రోజుల విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. రవి ప్రకాష్‌కు పెన్ను, పేపర్ ఇచ్చి గంట సేపు పరిశీలించారు. అతడు పేపర్‌పై రాసిన విధానాన్ని బట్టి అతని మానసిక స్థితిని, చేతి రాతను పరిశీలించారు. ఫోర్జరీ విషయంలో రవి ప్రకాష్ చేతి వ్రాతను సేకరించారు. దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ఎస్ఎల్కు పంపారు. రవి ప్రకాష్ ఇన్ని రోజులు ఎక్కడ తలదాచుకున్నారో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పూర్తి సమాచారం దొరికింది. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ నిమిత్తం గత మూడు రోజులుగా సైబర్ క్రైం పోలీసుల ఎదుట ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అయితే, సైబర్ క్రైం పోలీసులకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. మొదటి రోజు దాదాపు 5 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించగా.. ఆయన నోరు మెదపలేదు. దీంతో నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక రెండో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్ కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చారు. డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. ఫోర్జరీ చేసిన విధానం కూడా వివరించారు. కానీ, దేనికోసం ఫోర్జరీ చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇక మూడో రోజు విచారణకు గురువారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. నిన్న కూడా తీరు మారలేదు. రవిప్రకాశ్ పోలీసుల ప్రశ్నలకు స్పందించలేదు. పైగా విచారణ అధికారులను బెదిరించే యత్నం చేశారు. ‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు మీకూ టైమ్ వస్తుంది’ అన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. -
మూడోరోజు విచారణకు రవిప్రకాశ్
-
మూడోరోజు విచారణకు హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మూడోరోజు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10 గంటలు సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఆయనను 5 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే, రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక రెండోరోజు కూడా ఆయన తీరు మారలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. (రెండోరోజూ అదే తీరు!) ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. -
రవిప్రకాశ్‌కు పోలీసుల ప్రశ్నల పరంపర
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. రవిప్రకాశ్‌ను మంగళవారం ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక సైబర్ క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం స్టేషన్లోకి వెళ్లారు. ఆయనకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. (సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్) కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించడానికి కారణాలేంటి..? శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు చీట్ చేశారు ? మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా..! టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా..? టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా..? యాజమాన్యానికి తెలియకుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..? లేదా..? ఒకవేళ మీరు ఎలాంటి తప్పులు చేయనప్పుడు నెలరోజులుగా ఎందుకు తప్పించుకు తిరిగారు...పోలీసులకు ఎప్పుడో లొంగిపోయి వివరణ ఇస్తే అయిపోయేది కదా.. అని పోలీసులు రవిప్రకాశ్‌కు పలు ప్రశ్నలు సందించారు. -
రెండోరోజు విచారణకు రవిప్రకాశ్..