టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా.. 27 రోజులుగా పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఎట్టకేలకు మంగళవారం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.