Cyber Crime Police
-
అల్లు అర్జున్ అరెస్ట్: సోషల్ మీడియా పోస్ట్‌లపై పలు కేసులు
సాక్షి,హైదరాబాద్ : అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం, పలువురు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లపై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐటి యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది..?పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.అయితే, దిల్సుఖ్నగర్ శివలింగనగర్కు చెందిన మగుడంపల్లి భాస్కర్ (40) తన భార్య రేవతి (39), కొడుకు శ్రీతేజ్ (9)తో కలిసి 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమాకు వెళ్లారు. వీరు థియేటర్లోని లోయర్ బాల్కనీలో ఉండగా.. 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన భద్రతా సిబ్బంది ప్రేక్షకుల గుంపును తొలగిస్తూ ముందుకు రావడంతో రేవతి, శ్రీతేజ్ కిందపడిపోయారు. అప్పటికే రేవతి మరణించగా, స్పృహ కోల్పోయిన శ్రీతేజ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసులో ట్విస్టు
ముంబై: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై Dhruv Rathee మహారాష్ట్ర సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన పేరిట ఉన్న ఆ అకౌంట్ పేరడీదని, దానితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని పోలీసులు గుర్తించారు. దీంతో అకౌంట్ ఎవరది అనేది ధృవీకరణ చేసుకోవాల్సి ఉందని పోలీసులు అంటుఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి.. యూపీఎస్సీ పరీక్షకు హాజరవ్వకుండానే పాసయ్యినట్లు సంబంధిత ‘ఎక్స్’ ఖాతాలో తప్పుడు సమాచారం పోస్టు చేసినట్లు సైబర్ విభాగం వెల్లడించింది. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. అయితే తొలుత అది ధ్రువ్ రాఠీ ఖాతా అనుకున్నారంతా. అయితే ఆ ‘ఎక్స్’ అకౌంట్ బయోలో మాత్రం ‘‘ఇది ఫ్యాన్, పేరడీ ఖాతా. ధ్రువ్ రాఠీ అసలైన అకౌంట్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదు’’ అని రాసి ఉంది. దీంతో పోలీసులు ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. మరోవైపు ఆ ఖాతా నుంచి శనివారం మరో ట్వీట్ పోస్ట్ అయ్యింది. ‘‘సైబర్ విభాగం సూచనల మేరకు సంబంధిత పోస్టులు, వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను. వాస్తవాల గురించి తెలియక వేరొకరి ట్వీట్లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు’’ అనే సందేశం ఉంది.As directed by @MahaCyber1, I have deleted all my posts and comments on Anjali Birla, I will like to apologize as I was unaware about the facts and copied someone else' tweets and shared it.🙏🙏 pic.twitter.com/Lbr3c9oGZV— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) July 13, 2024 -
ఫ్యామిలీ స్టార్‌పై నెగెటివ్ ప్రచారం.. విజయ్ ఫిర్యాదుపై క్లారిటీ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్- విజయ్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంపై నెగెటివీటి కూడా పెద్దఎత్తున వైరలైంది. కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేయడంతో ఏకంగా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే స్వయంగా థియేటర్ల వద్దకు వెళ్లి ఆడియన్స్‌ను కలిసి రివ్యూలు తీసుకున్నారు. మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై సోషల్ మీడియా ఖాతాలపై విజయ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మాదాపూర్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఓ ఫోటో నెట్టింట వైరలవుతోంది. అయితే దీనిపై విజయ్ను ఆరా తీయగా.. అలాంటిదేం లేదని బదులిచ్చారు. ఆ ఫోటో కొవిడ్ టైంలో ఓ కార్యక్రమంలో తీసిందని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Checked with @TheDeverakonda. Fake report pic.twitter.com/AFTDe2pylv — Haricharan Pudipeddi (@pudiharicharan) April 10, 2024 -
పెళ్లి పేరుతో రూ.70 లక్షలు దోచేశాడు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి రూ.70 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీయల్ రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు. జూదం, విలాసాలకు బానిసై డబ్బు కోసం మ్యాట్రిమోనీ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఈక్రమంలో గతేడాది ఏప్రిల్‌లో తెలుగు మ్యాట్రిమోనీ యాప్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. రోజూ వాట్సాప్‌లో సంభాషణలు, చాటింగ్‌లతో ఆమెకు మాయమాటలు చెబుతూ నమ్మించాడు. ఈక్రమంలో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పూర్తిగా విశ్వసించి.. ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడదామని కోరింది. దీంతో తన తల్లిదండ్రులు, తమ్ముడు కృష్ణా జిల్లాలో నివాసం ఉంటున్నారని, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. సహాయం చేయాలని కోరడంతో ఆమె గతేడాది ఏప్రిల్ 30న రూ.2 లక్షలు నగదు ఇచి్చంది. దీంతో ఇద్దరూ ప్రకాశ్‌నగర్‌లోని ఓ హోటల్లో కలిశారు. ఇక అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సొమ్ముతో జూదం, క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ చేసేవాడు. అప్పు చేసి మరీ.. ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం రుణం, రూ.52 లక్షలు గృహరుణంతో పాటు మనీవ్యూ, పోస్ట్‌పే వంటి వ్యక్తిగత రుణ యాప్‌లలో లోన్లు తీసుకొని మొత్తం రూ.70 లక్షలు రాజేశ్‌కు ఇచ్చింది. అనంతరం నిందితుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి, అతని నుంచి రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. -
హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా రౌడీ హీరోపై ఓ వ్యక్తి.. యూట్యూబ్ ఛానెల్ వేదికగా కొన్ని అసభ్యకర వార్తలు ప్రసారం చేశాడు. దీంతో ఆ వ్యక్తిని ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?) ఇంతకీ ఏం జరిగింది? అనంతపురంకు చెందిన వెంకట కిరణ్.. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయ్ దేవరకొండని అవమానిస్తూ ఫేక్ వార్తల్ని ప్రసారం చేశాడు. విజయ్ గౌరవాన్ని కించపరిచేలా, ఆయన సినిమాల్లోని హీరోయిన్లని అవమానించేలా ఈ వీడియోలు ఉన్నాయి. వీటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే అసత్య వార్తల్ని ప్రసారం చేసిన వెంకట్ కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్‌ని డిలీట్ చేయించారు. భవిష్యత్‌లో ఇలా మరోసారి చేయకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. టార్గెటెడ్‌గా ఎవరు ఇలాంటి కామెంట్స్ చేసినా, అవమానిస్తున్నట్లు న్యూస్ టెలికాస్ట్ చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. (ఇదీ చదవండి: కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..) -
‘పార్సిల్ స్కాం పసిగట్టండి ఇలా..’
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయని వస్తువుల పేరుతో పార్సిల్ వచ్చిదంటూ అమాయకులకు ఫోన్లు చేసి డబ్బు గుంజుతున్నారని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించి ఆ వివరాలతో వారికి పార్సిల్ వచ్చిందంటూ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఇలా అపరిచిత వ్యక్తులు పంపే పార్సిళ్లలో కొన్ని అక్రమ పదార్థాలు, వస్తువులు ఉంటున్నాయని... అడిగినంత డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బ్లాక్మెయిల్ చేస్తూ వీలైనంత డబ్బు గుంజుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలా గుర్తించాలంటే... ♦ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చే అనుమానాస్పద వివరాలను, ఆర్డర్ చేయని వస్తువులు పార్సిల్‌గా వచ్చాయంటూ వచ్చే ఫోన్స్‌కాల్స్‌ను నమ్మొద్దు. ♦ మీకు పార్సిల్స్ వచ్చాయంటూ వచ్చే ఈ–మెయిల్స్‌లో పార్సిల్ పంపిన వారి అడ్రస్, ఫోన్ నంబర్లు పరిశీలించాలి. అనుమానాస్పద నంబర్ల నుంచి పార్సిళ్లకు సంబంధించిన మెసేజ్‌లు వస్తే అవి నకిలీవని గుర్తించాలి. మెసేజ్‌లు, ఈ–మెయిల్స్‌లో అక్షర దోషాలు, అచ్చు తప్పులను గుర్తించాలి. అలాంటివి నకిలీవని గుర్తుంచుకోవాలి. ♦ మీరు ఆర్డర్ చేయని పార్సిళ్లకు, మీ పేరిట వచ్చిన పార్సిల్లో ఏవైనా అక్రమ వస్తువులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బు డిమాండ్ చేసినా డబ్బు పంపొద్దు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చి ఫిర్యాదు చేయాలి. -
ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు
సాక్షి, హైదరాబాద్: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. ఆ పది జిల్లాలే ఎందుకు? సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైం హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ.. అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్), ఏపీ (చిత్తూర్), బిహార్ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్), ఢిల్లీ (అశోక్‌నగర్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, న్యూఅశోక్‌నగర్, హర్కేష్ నగర్ ఓక్లా, ఆర్కే పురం, ఆజాద్పురా), గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్), హరియాణా (బివాని, మనోత, హసన్‌పుర్, పల్వల్), జార్ఖండ్ (లటేహర్, ధన్‌బాద్, సంత్పాల్ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్‌కనల్, జజ్‌పుర్, మయూర్భంజ్), పంజాబ్ (ఫజికా, మొహలి), రాజస్థాన్ (బిదర్కా, బర్మార్, జైపూర్), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్‌నగర్), త్రిపుర (ధలాయ్), ఉత్తరప్రదేశ్ (బులందర్‌షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్), పశ్చిమ బెంగాల్ (పుర్బ బర్దామన్, దుల్చండ్రియ, భద్రల్, దక్షిణ్ దినాజ్‌పుర్, బిర్భూమ్, బరున్పురా, కోల్‌కతా, మల్దా, బరంపూర్). ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్ నేరాలు చేస్తున్నారు? రాజస్తాన్: సెక్స్టార్షన్ (సోషల్ ఇంజనీరింగ్ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి మోసగించడం), ఓఎల్ఎక్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్. జార్ఖండ్: ఓటీపీ స్కామ్‌లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్డేషన్, విద్యుత్ బిల్లుల పేరిట, కౌన్ బనేగా కరోడ్‌పతి పేరిట మోసాలు. ఢిల్లీ: ఆన్లైన్ లోన్‌యాప్‌ల పేరిట వేధింపులు, ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, విద్యుత్ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు. ఉత్తరప్రదేశ్: ఫేక్ లింకులు (ఫిషింగ్), ఓటీపీ మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు. -
ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావును టార్గెట్ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట డబ్బు కాజేయాలని చూశాను. కానీ, వీహెచ్ తెలివిగా వ్యవహరించి.. కేటుగాళ్లకు టోకరా ఇచ్చారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియన్ నేత వీహెచ్‌ను మోసగించేందుకు ఓ సైబర్ నేరగాడు యత్నించాడు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. ఆపదలో ఉన్నానని, గూగుల్‌పే ద్వారా డబ్బు పంపాలని సదరు వ్యక్తి అభ్యర్థించాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి వీహెచ్.. హరిరామ జోగయ్య ఇంటికి ఓ వ్యక్తిని పంపించారు. అలాంటిదేమీ లేదని తేలడంతో ఫేక్ కాల్ అని వీహెచ్ నిర్ధారించుకున్నారు. అనంతరం.. ఫేక్ కాల్‌పై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాడు ఖమ్మం నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల ద్వారా సైబర్ కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా.. రేఖా నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్ -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
ఇన్స్టాల్ చేసే యాప్‌తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్‌మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్‌మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్‌ఫోన్‌ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్‌ఫోన్‌కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్‌లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
16.8 కోట్ల మంది డేటా చోరీ!
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల వివరాలు క్రిమినల్స్ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్‌క్రైం పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్ విద్యార్థులు, డీమ్యాట్ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీ ఎన్సీఆర్ డేటాబేస్)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్ డయల్ అనే సెర్చ్ ఇంజన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. నిందితులు వీరే... యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో అనే కంపెనీల (కాల్‌సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్ నితీష్ భూషణ్‌తోపాటు టెలికాలర్ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుశీల్ తోమర్, క్రెడిట్ కార్డుల డేటా విక్రయించే అతుల్ సింగ్, ఎంఎస్ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్ హసన్, గ్లోబల్ డేటాఆర్ట్స్‌లో జస్ట్ డయల్ ద్వారా డేటాను విక్రయించే సందీప్ పాల్, బల్క్ మెసేజ్‌లు పంపే జియా ఉర్ రెహమాన్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్ క్రిమినల్స్‌కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్‌క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. భారీగా డేటా చోరీ... నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్ వాయిస్ డేటాబేస్ 3.47 కోట్లు, మొబైల్ నంబర్ల డేటాబేస్ 3 కోట్లు, స్టూడెంట్ డేటాబేస్ 2 కోట్లు, వాట్సాప్ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్ సీకర్స్ డేటాబేస్ 40 లక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 10.6 లక్షలు, వెబ్సైట్ ఓనర్స్ 17.4 లక్షలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన అంశాలు... ► పలు ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా, జస్ట్ డయల్ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. ► జస్ట్ డయల్ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. పోలీసుల సూచనలు... ► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. ► క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. ► మొబైల్, కంప్యూటర్, యాప్‌లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేసు దర్యాప్తు సిట్‌కు బదిలీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ నేతృత్వంలో ‘సిట్’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్‌లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. క్రెడిట్ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్ గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రెడిట్ కార్డుల వెరిఫికేషన్ చేస్తున్న థర్డ్ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్ అహ్మద్, మహ్మద్ సమాల్, మహ్మద్ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్ వాలియా, ఆకాశ్‌నిర్వాన్, విరాట్ పురి, అతీత్ దాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 సెల్పోన్లు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు. -
నంబర్ ఇక్కడ..వాట్సాప్ అక్కడ!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ డీపీలతో టోపీ వేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బేసిక్ ఫోన్లలో ఉన్న సెల్ నంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వాట్సాప్‌ను తమ స్మార్ట్ఫోన్లలో యాక్టివేట్ చేసుకుంటున్నారు. వైఫై ద్వారా కథ నడుపుతూ డబ్బు, గిఫ్ట్ వోచర్ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ‘డీపీ ఫ్రాడ్స్’పై అధ్యయనం చేసిన హైదరాబాద్ సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు.. రెండు రకాలుగా ఇతరుల వాట్సాప్‌లు సైబర్ నేరగాళ్ల వద్దకు వెళ్తున్నాయని గుర్తించారు. కొన్నాళ్లకు వినియోగించడం మానేసి.. ఒకరి పేరుతో ఉన్న సెల్ నంబర్‌కు సంబంధించిన వాట్సాప్‌ను వినియోగించుకోవడానికి సైబర్ నేరగాళ్లు వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.నకిలీ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో సిమ్‌కార్డులు కొని వాటి ద్వారా వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆపై కొన్నిరోజులకు ఆ నంబర్‌ను నేరుగా వాడటం మానేసి కేవలం వైఫై ద్వారానే వాట్సాప్ వాడుతున్నారు. దీంతో నిర్ణీతకాలం తర్వాత సర్విస్ ప్రొవైడర్లు ఆ నంబర్‌ను మరొకరికి కేటాయిస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్లు ఈ నంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోకున్నా లేదా బేసిక్ ఫోన్లు వాడుతున్నా వాట్సాప్ నంబర్ పాత యజమాని వద్దే ఉండిపోతోంది. సాధారణ ఫోన్లలో ఉన్నవి గుర్తిస్తూ.. సైబర్ నేరాల కోసం మరొకరి వాట్సాప్‌ను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ సిరీస్‌లోని నంబర్లను తమ స్మార్ట్ఫోన్లలో వేర్వేరు పేర్లతో సేవ్ చేసుకొని వాటిల్లో వాట్సాప్ యాక్టివేట్ అయిందో లేదో తెలుసుకుంటున్నారు. యాక్టివేట్ కాని వాటిని వైఫై ద్వారా వాడే తమ స్మార్ట్ఫోన్లలో వాడటానికి ఓటీపీ అవసరం. దీంతో సేల్స్, కాల్‌సెంటర్ల పేర్లతో వారికి ఫోన్లుచేసి ఓటీపీ తెలుసుకుంటున్నారు. ఇది ఎంటర్ చేయడంతోనే అవతలి వారి నంబర్‌తో వాట్సాప్ వీరి ఫోన్లలో యాక్టివేట్ అవుతోంది. విషయం ఫోన్‌నంబర్ వాడే వారికి తెలియట్లేదు. కష్టసాధ్యంగా దర్యాప్తు.. ఈ వాట్సాప్‌లను వాడి ప్రముఖులు, అధికారుల ఫొటోలు డీపీలుగా పెడుతున్న సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ద్వారా వారి సంబందీకుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వాళ్లకు వారి బాస్‌లు, ప్రముఖుల మాదిరిగా వాట్సాప్ సందేశాలు పంపి డబ్బు, గిఫ్ట్ వోచర్లు డిమాండ్ చేసి కాజేస్తున్నారు. దీనిపై కేసులు నమోదవుతున్నా వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబరే దర్యాప్తునకు ఆధారంగా మారుతోంది. అలా ముందుకు వెళుతున్న అధికారులకు దాని యజమానుల ఆచూకీ లభిస్తోంది తప్ప వాట్సాప్ యాక్టివేట్ చేసుకొని వినియోగిస్తున్న వారు పట్టుబడట్లేదు. వారిని కనిపెట్టడం కూడా కష్టంగా మారడంతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. ఆన్లైన్లో నగదు కాజేసిన కేసుల్లో నిందితులు దొరకడం అరుదు కాగా.. గిఫ్ట్ వోచర్ల రూపంలో కొల్లగొట్టిన వాళ్లు చిక్కడం దుర్లభమవుతోంది. నేరుగా సంప్రదించడం ఉత్తమం.. వాట్సాప్ మోసాల బారినపడకుండా ప్రతి ఒక్కరూ కనీ స జాగ్రత్తలు తీసుకోవాలి. సందేశం వచ్చిన వెంటనే కేవలం డీపీ ఆధారంగా కాకుండా ఫోన్‌నంబర్ చూశా కే ఎదుటి వ్యక్తి ఎవరన్నది ఖరారు చేసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేసి లేదా నేరుగా సంప్రదించాకే లావాదేవీలు చేయాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ -
ఓటీపీ..డబ్బంతా లూటీ
ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్ వచ్చి.. మీకేదో ఆర్డర్ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయిందని’ ఆ మోసగాడు నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు. సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తతే రక్షా కవచం మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు స్మార్ట్ ఫోన్లు వచి్చన తరువాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దర్, ఎస్పీ (సైబర్ క్రైమ్) సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు : ఏపీ సైబర్ మిత్ర : 91212 11100 (వాట్సాప్ నంబర్) టోల్ ఫ్రీ నంబర్లు: 100, 112 జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్: 1930 -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్‌తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
సిటీ కంపెనీలకు ‘హిడెన్‌బర్గ్ బూచి’
సాక్షి, సిటీబ్యూరో: ‘హిడెన్‌బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
HYD: టోఫెల్లో మాస్ కాపీయింగ్‌పై దర్యాప్తు!
సాక్షి, హైదరాబాద్: టోఫెల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. ఆధారాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది. రూ. 25 వేలు ఇస్తే టోఫెల్లో టాప్ స్కోర్ ఇస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందెందుకు రాసే టోఫెల్లో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్కో విద్యార్థి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుని.. పరీక్ష గదిలోనే వాట్సాప్ ద్వారా ఆన్సర్స్ లీక్ చేస్తోంది ముఠా. హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్ లో ఈటీఎస్( ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా ) ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విచారణ ముగిసింది. బుధవారం సుమారు మూడు గంటలపాటు ఆయన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ వార్ రూం కు నేనే ఇంఛార్జి గా ఉన్నాను. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు అని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ వార్ రూం ఇన్ఛార్జిగా తానే ఉన్నానని, అక్కడ జరిగే వ్యవహారాలన్నింటికి తానే బాధ్యుడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ‘‘కాంగ్రెస్ వార్ ద్వారా పోస్ట్ అవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగులు చేస్తున్నాం. ఎవరినీ కించపరచ్చాలనే ఉద్దేశం మాకు లేదు. పైగా నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నాం. అలాగే.. సునీల్ కనుగోలుకు, వార్ రూంకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మల్లు రవి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ.. కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏం జరుగుతోంది? -
‘స్మాల్ క్రెడిట్–బడ్డీ క్యాష్’ యాప్‌ను నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ లోన్‌యాప్‌ల దురాగతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చాలామంది యువత, నిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఈ లోన్‌యాప్‌లకు చిక్కుకుంటున్నారు. తమకు తెలియకుండానే ఈ యాప్‌లకు వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు ఇస్తున్నారు. అప్పు తీర్చిన తర్వాత కూడా ఈ యాప్ నిర్వాహకులు అదనపు డబ్బు కోసం మానసికవ్యథకు గురిచేస్తున్నారు. అయితే, ఇదే తరహాకు చెందిన ఒక యాప్ గురించి తెలంగాణ సైబర్ క్రైం పోలీసు విభాగం హెచ్చరిక జారీ చేసింది. ‘స్మాల్ క్రెడిట్–బడ్డీ క్యాష్’యాప్ మోసపూరితమైందని సైబర్ క్రైం కోఆర్డినేషన్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్‌ను పెట్టింది. ‘ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ వ్యక్తిగత వివరాలు దొంగిలించి, మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేస్తారు’అని ఆ ట్వీట్లో సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. సైబర్ క్రైం ఫిర్యాదులకుగాను 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని వారు సూచించారు. -
నాపై కేసు పెట్టిన విషయం తెలియదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు ఇవాళ హాజరుకాలేనంటూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సమాచారమిచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు నాకు మీటింగ్ ఉంది. అందుకే ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సైబర్ క్రైం పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చారు. 'సంక్రాంతి పండగ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. 41 సీఆర్పీసీ నోటీసుకు కొంత వెసులుబాటు ఉంటుంది. నాపై కేసు పెట్టిన విషయం తెలియదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదు' అని మల్లు రవి చెప్పారు. చదవండి: (కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్) -
కాంగ్రెస్ వార్ రూం కేసు.. మల్లు రవిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్మెంట్ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు మల్లు రవి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం హాజరు కావాల్సిందిగా ఇచ్చిన నోటీసులపై ఆయన వివరణ కోరగా.. గురువారం విచారణ కోసం వచ్చినప్పుడే చెప్తామని అధికారులు బదులు ఇచ్చారు. ఈ క్రమంలో.. బుధవారం ఈ సీనియర్ నేత పేరును నిందితుడిగా చేర్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. సాక్షి టివీ చేతిలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ‘‘కాంగ్రెస్ వార్ రూంతో నాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్‌కు వ్యూహాలు మాత్రమే చెప్తాను. వార్ రూం ఇంఛార్జి మల్లు రవి. మల్లు రవి చెప్పింది మాత్రమే మా టీం చేస్తుంది’’ :::పోలీసులకు సునీల్ కనుగోలు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా. ఇక సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్‌ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘వార్ రూమ్’ కేసులో మల్లు రవి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవిని నిందితుడిగా చేర్చాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ‘నా వాంగ్మూలం నమోదు చేయండి’ అంటూ మల్లు రవి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాయడం, సోమవారం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్టేట్మెంట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మల్లు రవి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుపై అక్కడి అధికారులను వివరాలు కోరారు. దానికి సంబంధించిన వివరాలు అందించిన అధికారులు గురువారం విచారణకు హాజరవ్వాలని చెప్పారు. అది ముగిసిన తర్వాత ఈ కేసులో మల్లు రవిని ఐదో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మాజీ ఎంపీ మల్లు రవికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినంటూ ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండగా, వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు సోమవారం హాజరయ్యారు. గంట పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నేను సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్‌గా మార్చకండి -
వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. – సాక్షి, హైదరాబాద్ ఇలా జరిగితే అప్రమత్తం కావాలి మీకు తెలియకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్ చేసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఆధార్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో ఆధార్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ►ఏఈపీఎస్ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. ►మీ బయోమెట్రిక్ దుర్వినియోగం కాకుండా ఆధార్ వెబ్సైట్లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్‌కార్డ్ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్‌కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్డ్ ఆధార్ (ఆధార్ నంబర్పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. ►సైబర్ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి. ►అనధికార వెబ్సైట్లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు. మాస్క్డ్ ఆధార్ అంటే? ఆధార్ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మాస్క్ ఆధార్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన ఆధార్‌కార్డు ఆన్లైన్లో ఎవరు డౌన్లోడ్ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఏఈపీఎస్ అంటే..? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏపీపీఎస్) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్ ఏజెంట్ అయినా ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్లైన్లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్ ఖాతాకు లింకైన ఆధార్ నంబర్, ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది. సదరు ఖాతాదారుడు ఏఈపీస్ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. -
ఇవాళ సునీల్ కనుగోలు టీమ్ సభ్యుల విచారణ
-
కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ ఆఫీస్‌ను సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (ఎస్కే) కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్టాప్లను సీజ్ చేశారు. తన ఆఫీస్ నుంచి సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. సోదాల సమయంలో సునీల్ కార్యాలయంలోని సిబ్బందితో సెల్ఫోన్లు ఆఫ్ చేయించారు. గత కొంత కాలంగా ఎస్కే టీమ్ తెలంగాణ కాంగ్రెస్‌కు పని చేస్తోంది. చదవండి: (ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ) -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
హలో మేము సైబర్ క్రైమ్ పోలీసులం అంటూ..రూ.35 వేలు కాజేశారు!
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్లో అప్లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్‌పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
నరేష్, పవిత్ర ఫిర్యాదు.. యూట్యూబ్ జర్నలిస్టుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సినీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్‌ల వ్యక్తిగత జీవితంపై పలు వార్తలను టెలికాస్ట్ చేసిన ‘ఇమండి రామారావు’ చానల్ జర్నలిస్టు రామారావుకు సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర ఇటీవల సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రామారావుకు నోటీసులిచ్చారు. మరిన్ని చానళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారికి కూడా నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తల వెనుక రమ్య రఘుపతి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆమెకు కూడా నోటీసులిచ్చేందుకు వెనుకాడబోమని సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. చదవండి: అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీనటి పవిత్ర
-
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి పవిత్ర
-
బాధితులే నిందితులుగా..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్ దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్‌లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్‌తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ విన్‌తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్తో కూడిన గేమ్‌లను అనేక యాప్‌లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి. నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్‌లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్ యాప్‌ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్‌లోని అలెన్‌కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్‌లో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్ యోతో సంబంధాలున్నా యి. బాధితుల చిట్టా అందుకున్న అలెన్.. దాన్ని చుచున్‌కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్ బ్యాంకింగ్ వివరాలు, లింకై ఉన్న ఫోన్ నంబర్ సిమ్ కార్డు ముంబైలో ఉన్న చుచున్‌కు చేరతాయి. అతను వాటిని అలెన్‌కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్‌ల ద్వారా సంప్రదించే అలెన్ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్ ఇస్తున్నాడు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు చెందిన నాగప్రసాద్ గేమింగ్ యాప్‌లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్ ద్వారా అలెన్ వల్లో పడి ముంబైలో ఉన్న చున్ ద్వారా తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్ అనే బాధి తు డు తన బావమరిది అనిల్ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్ తన స్నేహితుడైన శ్రీనివాస్ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్‌ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు. చున్ విచారణ, అతడి ఫోన్ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్‌ను అరెస్టు చేశారు. చుక్తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్ ఖాతాదారులు సయ్యద్ సుల్తాన్, మిర్జా నదీమ్ బేగ్, పర్వేజ్ పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఉంటున్న ఇమ్రాన్ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇమ్రాన్ దుబాయ్ నుంచి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్‌తో అలెన్ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, తైవాన్ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్‌లు హవాలా మార్గంలో దుబాయ్‌కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్ అరోరా, భూపేష్ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్‌లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్ ఈడీ అధికారులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్ మనీ చేంజింగ్ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్‌పోర్ట్ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్‌నీత్ కౌశిక్ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు. కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్‌గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
వేలల్లో రుణం.. లక్షల్లో వసూళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజమహేంద్రవరానికి చెందిన దుర్గారావు దంపతులు, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన శివ రుణ యాప్‌ల వేధింపులు తాళలేక ఇటీవల చేసుకోవడం రాష్ట్ర వాప్తంగా కలకలం సృష్టించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది యాప్‌ల నిర్వాహకులు పంపిన అసభ్యకర మార్ఫింగ్ వీడియోలకు జడిసి అర్ధంతరంగా తనువు చాలించడం చర్చనీయాంశమైంది. కొంత మంది బాధితులు మాత్రమే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోనూ ఒక మహిళ తాను తీసుకున్న రూ.5 వేల రుణానికి రూ.12 వేలకుపైగా చెల్లించినా.. అసభ్య వీడియోలతో బెదిరించడంతో విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో విశాఖ పోలీసుల విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చాయి. రుణయాప్‌ను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మన ఫోన్చ్లోని కాంటాక్ట్ నంబర్లు, గ్యాలరీలోని ఫొటోలకు యాక్సెస్‌ను తీసుకుంటారు. తద్వారా మన కాంటాక్ట్‌లోని నంబర్లకు రుణం తీసుకున్న వారి గురించి చెడుగా ప్రచారం చేయడంతో పాటు గ్యాలరీలో నుంచి కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకుని మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి భయపెడుతున్నారు. చైనా నుంచి ఆపరేట్ అవుతున్న ఈ రుణయాప్‌ల స్థావరాలు నేపాల్, బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో, దేశంలో స్థానికంగా ఉండే వివిధ వ్యక్తుల నుంచి కరెంట్, ఫర్మ్ బ్యాంకు అకౌంట్లను కొనుగోలు చేసి.. వీటి ద్వారా మొత్తం ఆర్థిక వ్యవహారాలను సాగిస్తున్నారు. తక్కువ రుణం ఇచ్చి, భారీగా వసూలు చేసి.. అందులో కొంత మొత్తాన్ని ఇక్కడ తమకు ఫర్మ్, కరెంటు అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్ కింద చెల్లిస్తున్నారు. మిగిలిన భారీ మొత్తాన్ని డాలర్లలోకి మార్చుకుని బిట్ కాయిన్స్ రూపంలో చైనాకు తరలిస్తున్నారు. ఈ అకౌంట్లన్నింటినీ ఆన్లైన్లో చైనా నుంచే నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ అకౌంట్ల నిర్వహణకు ఇక్కడి వారి నుంచి ఓటీపీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు హాంకాంగ్‌కు చెందిన కెవిన్ అనే వ్యక్తి సూత్రధారిగా తేలింది. ఇతనికి బ్యాంకు అకౌంట్లు విక్రయించిన వారు సుమారు 250 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ఒక్కొక్కరి అకౌంట్ల ద్వారా రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లోన్ యాప్‌లు.. విష వలయాలు విశాఖకు చెందిన గిరి ఒక ఆటోడ్రైవర్. తొలుత ఒక రుణయాప్ నుంచి రూ.5 వేలు ఫిబ్రవరిలో రుణం తీసుకున్నాడు. అయితే, ఆయనకు నికరంగా డిపాజిట్ అయ్యింది రూ.3,500 మాత్రమే. అనంతరం వారి రుణాన్ని వారంలోగా చెల్లించేందుకు మరో రుణ యాప్ ద్వారా మరికొంత రుణం తీసుకున్నాడు. అయితే రుణం తీర్చినప్పటికీ మరింత చెల్లించాల్సిందేనంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపిస్తామంటూ బెదిరించసాగారు. దీంతో మొత్తం 13 రుణయాప్‌ల నుంచి సుమారు లక్ష రూపాయల మేర రుణం తీసుకున్నాడు. వీరికి ఏకంగా రూ.3,65,000 మేర చెల్లించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఆగస్టులో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఒక రుణయాప్‌లో తీసుకున్న రుణానికి మించి భారీగా చెల్లించాల్సి రావడంతో మరొక రుణయాప్‌ను ఆశ్రయించేలా ఓ పథకం ప్రకారం వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. కెవిన్ లాంటి వారు సృష్టించిన విష వలయంలో ఎంత మేర ఇండియా కరెన్సీ బిట్‌కాయిన్స్ రూపంలో చైనాకు తరలిపోతోందో అంచనాలకు అందడం లేదు. 2 వేల మంది ఉద్యోగులు వాస్తవానికి మొదట్లో చైనా నుంచి ఆపరేట్ చేస్తున్న రుణయాప్‌ల నిర్వాహకులు శ్రీలంకలో కార్యాలయాలను ప్రారంభించారు. అయితే శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తమ స్థావరాలను నేపాల్, బంగ్లాదేశ్‌లకు మార్చారు. ఏకంగా 2 వేల మంది ఉద్యోగులతో పనిచేసే కార్యాలయాన్ని నేపాల్‌లో నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కూడా ఇదే తరహాలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక సెంటర్ నుంచి నిరంతరాయంగా రుణం తీసుకున్న వారికి బెదిరింపు కాల్స్ వెళుతుంటాయి. మరో సెంటర్ నుంచి రుణం తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలను పంపుతున్నారు. ఇక్కడ పని చేసే వారిలో అనేక మంది భారత్ నుంచి వెళ్లిన వారే. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ అన్నీ ఇండియా సిమ్‌కార్డుల నుంచే వస్తుండటం గమనార్హం. ఇండియా సిమ్స్‌ను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ రుణ యాప్‌లను ఎవరూ ఆశ్రయించకుండా అవగాహన కల్పించడమే ప్రస్తుతం ప్రాధాన్యత అంశమని విశాఖ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. -
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్‌కు వేధింపులు
-
నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న ఆకతాయి
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, విద్యావేత్త నైనా జైస్వాల్ సోషల్ మీడియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి పదే పదే మెసేజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నైనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. పీజీ పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం నైన జైస్వాల్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో మెసేజ్‌లు చేశాడు. ఆ మెసేజ్‌లు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆమె శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పలు పేర్లతో ఫేక్ ఖాతాలు సృష్టించి నైనా పోస్ట్ చేసిన పోస్టులకు అసభ్య కామెంట్లు పెడుతున్నాడు. దీనిపై అప్పట్లో తండ్రి అశ్విన్జైస్వాల్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్, అతని తండ్రిని, సోదరుడిని పిలిచిన పోలీసులు రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ సుమారు 30–50 క్రియేట్ చేసి కామెంట్ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో మరోమారు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి శ్రీకాంత్ అరెస్టు చేసినట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా.. చదువుల తల్లిగానూ పేరొందింది. 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తద్వారా ఆసియాలోనే పిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఘనత దక్కించుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గానూ రాణిస్తున్న నైనా జైశ్వాల్ ఇటీవలే తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీలో చేరగా.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది. చదవండి: Chess Olympiad 2022: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్‌కు మహేందర్‌రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్ నంబర్‌ను బ్లాక్ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు. -
జూనియర్ ఆర్టిస్టుల పేరుతో 95 మంది దుబాయ్‌కి.. తీరా అక్కడకు వెళ్తే..
బెంగళూరు: విదేశాల్లో అధిక వేతనంతో ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. 7 మందితో కూడిన అక్రమ ముఠాను అరెస్ట్ చేశారు. కొప్పళ కంప్లివాసి బసవరాజశంకరప్ప కళసద్, మైసూరు నజరాబాద్ ఆదర్శ అలియాస్ ఆది, తమిళనాడు సేలం రాజేంద్రనాచి ముత్తు, చెన్నై మారియప్పన్, పాండిచ్చేరి అశోక్, తిరువళ్లువర్ రాజీవ్, జేపీనగర చందు నిందితులని నగర జాయింట్ పోలీస్‌కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి 95 మంది మహిళలను జూనియర్ ఆర్టిస్టుల పేరుతో పాస్‌పోర్టులు తయారుచేయించి దుబాయ్‌కి పంపించారు. అక్కడ యజమానులు వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు రావడంతో గాలింపు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 17 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ప్రేమించిన అత్త కూతురు కోసం దొంగతనానికి పాల్పడి..) -
‘ట్యాంపరింగ్’ కేసు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్‌లో వెలుగుచూసిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు, రికార్డులు అందించాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు ఆదేశించారు. డాక్టర్ల రిజిస్ట్రేషన్ విధివిధానాలు, డేటాబేస్ నిర్వహణ, సాంకేతిక అంశాలను తమకు సమర్పించాలని టీఎస్ఎంసీకి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. వివరాలన్నీ అందితేనే సాంకేతికంగా దర్యాప్తు చేయడానికి, కేసులో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని నంబర్ పొందిన ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్ల రికార్డులను కొందరు ‘ఇంటిదొంగలు’ ట్యాంపర్ చేసి వేరే వ్యక్తుల పేర్లతో డేటాబేస్‌లో నమోదు చేసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. డాక్టర్ నాగమణి అర్హతల విషయంలో తొలుత గందరగోళం ఏర్పడటంతో ఆమె వివరాలు ట్యాంపర్ అయినట్లు తొలుత భావించిన కౌన్సిల్... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అంశాన్నీ చేర్చింది. అయితే నాగమణి దరఖాస్తులో పొరపాటు రావడం వల్లే అలా జరిగిందని, ఆమె అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని శుక్రవారం స్పష్టమైంది. -
నకిలీ డాక్టర్లా.. ‘విదేశీ’ వైద్యులా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ డేటాబేస్ ట్యాంపరింగ్ నకిలీ వైద్యుల కోసమా? లేక విదేశాల్లో విద్యనభ్యసించి వచ్చిన డాక్టర్ల కోసమా? ఇంటి దొంగలు ఎవరు? అనే కోణంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ హన్మంతరావు ఫిర్యాదు మేరకు బుధవారం నమోదైన ఈ కేసును ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కౌన్సిల్‌కు వెళ్లి సర్వర్‌ను పరిశీలించాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు కచ్చితంగా ఈ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని, ప్రత్యేక నంబర్ తీసుకున్న తర్వాతే ప్రాక్టీసుకు అర్హులు అవుతారు. ఈ వైద్యులు ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవడంతో పాటు తమ విద్యార్హతలు పెంచుకున్నప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఈ డేటాబేస్‌ను మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తుంటుంది. కాగా వైద్య విద్య పూర్తి చేసిన సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డి 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా తదనంతర కాలంలో ఈ డేటాబేస్‌ను ట్యాంపర్ చేసిన ఇంటి దొంగలు కొందరు సుభాష్, రామిరెడ్డి పేర్లను తొలగించి శివానంద్, దిలీప్‌కుమార్ అనే వారి పేర్లను చేర్చారు. అలాగే నాగమణి విద్యార్హతలు, శ్రీనివాస్ ఫొటో అవే పేర్లు గల కొత్తవారితో మార్చేశారు. ఈ నలుగురినీ 2016లో సుభాష్, నాగమణి, శ్రీనివాసులు, రామిరెడ్డిలకు కేటాయించిన నంబర్లను వినియోగించి కౌన్సిల్లో చేర్చేశారు. ఇలా వెలుగులోకి..: ఇటీవల ఓ వైద్యుడు తన పీజీని అప్డేట్ చేయించుకో వడానికి, మరో ముగ్గురు ఐదేళ్లు పూర్తి కావడంతో రెన్యువల్ కోసం వచ్చారు. అయితే వీరి దరఖాస్తుల్లోని వివరాలు, ఫొటో.. అప్పటికే డేటాబేస్‌లో ఉన్న వాటితో సరిపోలకపోవడంతో ట్యాంపరింగ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ పట్టాలు పొందిన వైద్యులు నేరుగా రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నిస్తే బండారం బయటపడే ప్రమాదం ఉంటుంది. అలాగే చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చిన వాళ్లు నేరుగా ఇక్కడ రిజిస్టర్ చేసుకుని, ప్రాక్టీసు మొదలుపెట్టే అవకాశం లేదు. మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కోవలకు చెందినవారే ఇంటి దొంగల సాయంతో డేటా బేస్ ట్యాంపరింగ్ చేయించి ఉంటారని, ఈ విధంగా మరెన్నో పేర్లు ట్యాంపర్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించాలంటే కౌన్సిల్‌లోని కంప్యూటర్లు, సర్వర్‌తో పాటు దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. 2016 తర్వాతే ఈ వ్యవహారం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు గడిచిన ఆరేళ్ల కాలంలో ఆ పేర్లతో రిజిస్టర్ అయిన, నమోదు చేసుకున్న డాక్టర్ల వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘రొమేనియా ఐపీ’.. బ్యాంకుకు టోపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంలో కీలకాంశాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూరోపియన్ దేశమైన రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్‌తో జావా స్క్రిప్ట్ ఫైల్(జేఎస్‌డబ్ల్యూ) పంపడం ద్వారా ఈ పని చేసినట్లు తేల్చారు. బ్యాంక్ డబ్బును ‘పంచుకున్న’గ్యాంగ్స్‌లో రెండింటిని పట్టుకున్న అధికారులు మరో రెండింటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అడ్మిన్ మెయిల్‌ను స్ఫూఫ్ చేసి... లక్నోకు చెందిన లక్కీ డార్క్ నెట్లో చేసిన ప్రకటనతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరిలో గతేడాది జూలైలో తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.1,96,88,136 కాజేసిన నైజీరియన్లు ఉన్నారు. అలా వీరికి హైదరాబాద్‌లోని కో–ఆపరేటివ్ బ్యాంకులపై అవగాహన ఉండటంతో ప్రాథమిక పరిశీలన చేసి మహేష్ బ్యాంక్ ను ఎంచుకున్నారు. రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్‌తో అంతర్జాతీయంగా సేవలు అందించే ఎం247 సంస్థ వీపీఎన్‌ను వాడుకున్నారు. వీటి ద్వారా గతేడాది నవంబర్‌లో మహేష్ బ్యాంకునకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోని కంప్యూటర్లకూ ఒకేసారి కీ–లాగర్స్ పంపారు. ఆ బ్యాంక్ అడ్మిన్ మెయిల్ ఐడీని స్ఫూఫ్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని నుంచి ఆర్టీజీఎస్ అప్డేట్ పేరుతో జేఎస్‌డబ్ల్యూ ఫైల్ పంపారు. బ్యాంక్ నెట్‌వర్క్‌కు సరైన ఫైర్‌వాల్స్ లేకపోవడంతో ఈ కీ–లాగర్స్‌తో కూడిన మెయిల్ కంప్యూటర్ల వరకు చేరింది. అక్కడ పనిచేసే సిబ్బందికి సైతం సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోవడంతో ప్రొసీడ్ అని కొట్టడంతో కీ–లాగర్స్ వారి కంప్యూటర్లలో ఇన్స్టాల్ అయిపోయాయి. దీని ద్వారానే గత నెల 22, 23 తేదీల్లో బ్యాంక్ చెస్ట్ ఖాతాకు సంబంధించిన రూ.12.93 కోట్లను స్వాహా చేశారు. పరారీలో నగరానికి చెందిన గ్యాంగ్స్... ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణుల సాయంతో ఆ రెండు కంప్యూటర్లనూ స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి హ్యాకర్లకు సంబంధించిన ఆ«ధారాలు సేకరించారు. యూపీ వాసి లక్కీతో పాటు నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కేపీహెచ్‌బీలోని ఫార్మాహౌస్లకు చెందిన కరెంట్ ఖాతాలను వినియోగించిన రెండు ముఠాలను ఇప్పటికే అరెస్టు చేశారు. మరో రెండు గ్యాంగ్స్ పరారీలో ఉన్నాయి. అంతర్జాతీయ దర్యాప్తు అవసరం అపెక్స్ బ్యాంక్, మహేష్ బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేయడానికి వాడిన ఐపీ అడ్రస్‌లు, వీపీఎన్ సర్వీస్‌లు ఒకటే. దాని కోసం అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. తొలుత ఎం247 సంస్థ నుంచి లాగిన్ వివరాలు తెలియాలి. అది కూడా అంతర్జాతీయ సంస్థ అయినందున ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. – నగర పోలీసు ఉన్నతాధికారి -
జారుకుందామని జారిపడ్డాడు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసు దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఒక నైజీరియన్ దాడి చేసిన విషయం విదితమే. తాజాగా శుక్రవారం అదుపులో ఉన్న మరో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌లోని మూడో అంతస్తు బాల్కనీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు. దీంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో పోలీసు అధికారులు గత నెల 22, 23 తేదీల్లో చోటు చేసుకున్న మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్‌పై.. అధికారుల ఫిర్యాదు మేరకు 24న కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేయడం మినహా అరెస్టుల విషయంలో కీలక పురోగతి సాధించలేకపోయారు. నగదు బదిలీ అయిన ఖాతాదారులను, సూత్రధారులకు సహకరించిన వారిని మాత్రమే పట్టుకోగలిగారు. సూత్రధారులను పట్టుకోలేకపోవడం, తాజా పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు విభాగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. కీలకపాత్ర పోషించిన నైజీరియన్లు.. ఈ కేసులో ఆద్యంతం నైజీరియన్లు కీలకపాత్ర పోషించారు. సూత్రధారులు–పాత్రధారులు–ఖాతాదారుల మధ్య వీరే మధ్యవర్తిత్వం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బెంగళూరులో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌లతో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీ, ముంబైల్లోనూ కొందరు నైజీరియన్లను అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం ఢిల్లీలో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందం మరికొందరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుంది. వీరిలో కొందరిని ఇప్పటికే నగరానికి పంపగా.. ఓ వ్యక్తిని మాత్రం తాము బస చేసిన తెలంగాణ భవన్‌లోని రూమ్ నం. 401లో ఉంచింది. కీలకం కావడంతో తప్పించుకోవాలని... ఢిల్లీలోని ఓ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కిన ఇతడు అత్యంత కీలక నిందితుడిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇతడిని శుక్రవారం ఢిల్లీలోని కోర్టులో హాజరుపరచడంతో పాటు అనుచరులను పట్టుకోవాలని ప్రత్యేక బృందం భావించింది. అయితే శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లిన నిందితుడు అక్కడ నుంచి ఎలాగో బాల్కనీలోకి వెళ్లి వాటర్ పైపుల ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే కింద ఉన్న పోలీసులు గుర్తించి అరవడంతో కంగారుపడ్డ నిందితుడు పట్టుతప్పి అక్కడున్న చెట్టు కొమ్మకు తగులుతూ కింద పడిపోయాడు. గాయపడిన అతన్ని పోలీసులు..పక్కనే ఏపీ భవన్లో అందుబాటులో ఉన్న 108 వాహనం మొరాయించడంతో ఆటోలో రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సదరు వ్యక్తి నైజీరియన్ కాదని, ఢిల్లీ (ఘజియాబాద్)కే చెందినవాడని చెప్తున్న పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. -
డార్క్ నెట్లో దండోరా వేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి సూత్రధారిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. బ్యాంక్ సర్వర్లు హ్యాక్ చేయాలంటూ ఇతగాడు డార్క్ నెట్ ద్వారా నైజీరియన్లకు ఎర వేశాడని, వాళ్లు మరికొందరికీ విషయం చెప్పి తమతో కలుపుకున్నారని తేలింది. ఈ నేపథ్యంలోనే 128 బ్యాంకు ఖాతాల సమీకరణ జరిగిందని లక్కీ చెప్పాడు. మహేశ్ బ్యాంక్ స్కామ్ మొత్తం తన ద్వారానే జరిగితే ఎక్కువ గిట్టుబాటు అవుతుందని భావించానని, అయితే నైజీరియన్ హ్యాకర్ల ‘దండోరా’ వల్ల వాటాలు పెరిగిపోయాయన్నారు. ఇతడి సమాచారంతో సేవింగ్స్ ఖాతా తెరిచి ఈ నేరానికి సహకరించిన గోల్కొండ వాసి షానాజ్ బేగంను ముంబైలో పట్టుకున్నారు. లోపం గుర్తించాకే ఖాతాలు.. మహేశ్ బ్యాంకు విషయంపై నైజీరియన్లు డార్క్ నెట్ ద్వారానే లక్కీతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయగలమన్నారు. ఇందుకోసం ఉత్తరాదికి చెందిన మరికొందరు నైజీరియన్లనూ ఎంగేజ్ చేశారు. అంతటితో ఆగకుండా డార్క్ నెట్‌లోని అనేక క్రిమినల్ గ్రూపుల్లో తాము త్వరలో మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేయబోతున్నామని, దాని ఖాతాదారులను తీసుకొచ్చే వాళ్లకు ‘లాభం’ ఉంటుందని ప్రకటించారు. దీంతో చాలామంది డార్క్‌నెట్ యూజర్లు ఎవరికి వారుగా రంగంలోకి దిగారు. కర్నూలుకు చెందిన వారి ద్వారా కేపీహెచ్బీలో ఫార్మా హౌస్ సంస్థను నిర్వహిస్తున్న సంపత్ కుమార్‌ను లక్కీ సంప్రదించగా.. మరో గ్యాంగ్ చెన్నైకి చెందిన వారి ద్వారా నాగోల్‌లోని శాన్విక ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు నవీన్‌కు టచ్‌లోకి వచ్చారు. వీరితో ఖాతాలు ఓపెన్ చేయించడంతోపాటు ఎవరికి వారుగా డబ్బు బదిలీ చేయడానికి ఖాతాలు సిద్ధం చేసుకున్నారు. ఇలా బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి 4 ఖాతాలకు వచ్చిన డబ్బు 128 ఖాతాలకు బదిలీ అయింది. బిట్ కాయిన్ల రూపంలో హ్యాకర్లకు.. 128 మందిని ఎంపిక చేసుకున్న లక్కీ, ఇతరులు వాళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి వారు తమ వద్దే ఉంచుకున్నారు. ప్రధాన హ్యాకర్లకు సంపత్‌కుమార్, షానాజ్ బేగం ఖాతాల వివరాలను లక్కీ అందించాడు. చెన్నై గ్యాంగ్ నవీన్ ఖాతా వివరాలిచ్చింది. ఇలానే వినోద్‌కుమార్ ఖాతా వివరాలను మరో ముఠా ఇచ్చింది. అలా ఏ ముఠాకు ఆ ముఠా చెస్ట్ ఖాతా నుంచి డబ్బును వీటిలో జమ చేయించుకున్నాడు. ఆపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఖాతాల్లోకి బదిలీ చేశారు. లక్కీ సహా ఇతర ముఠా నాయకులందరూ హ్యాకర్లకు చెల్లించాల్సిన వాటాను బిట్ కాయిన్ల రూపంలో పంపేశారు. ముగ్గురు నైజీరియన్లతో ఒప్పందం లక్కీకి అనేక సైబర్ నేరాలతో సంబంధం ఉంది. ఇంటర్నెట్లో ఉన్న డార్క్‌నెట్ పైనా పట్టుంది. గతంలో అనేకసార్లు వివిధ డేటాలను అందులో కొన్నాడు. ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో డార్క్‌నెట్‌లో ఉండే గ్రూపుల్లో ఓ సవాల్ విసిరాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాలు కొల్లగొట్టే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇలా ఇతడికి ముగ్గురు నైజీరియన్లతో పరిచయమైంది. సర్వర్‌ను హ్యాక్ చేసే సామర్థ్యం ఉందని, కొట్టేసే మొత్తంలో కమీషన్ ఇస్తే పని చేసి పెడతామని వాళ్లు చెప్పారు. ఆపై ఓ ప్రత్యేక కీలాగర్స్‌ను రూపొందించి అనేక బ్యాంకులకు ఈ–మెయిల్ రూపంలో పంపారు. మహేశ్ బ్యాంక్ కంప్యూటర్లలోకి అది తేలిగ్గా ప్రవేశించడం, వాటిలో నిక్షిప్తం కావడంతో సైబర్ సెక్యూరిటీలో ఉన్న లోపం నైజీరియన్లకు తెలిసింది. -
సైబర్ క్రిమినల్స్ కేరాఫ్ రాజస్తాన్
రాజస్తాన్ రాష్ట్రం సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్ కాప్స్ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు. అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు సైబర్ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ చేయించి బ్లాక్ మెయిల్ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో... పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు. ఓటీపీలతో జార్ఖండ్ నేరగాళ్ల టోపీ బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తార యువత ఇప్పుడు ‘కాల్ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. -
క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను..
సాక్షి, హిమాయత్‌నగర్: క్రికెట్ టోర్నీల్లో చాన్స్ ఇస్తామంటూ తనని ఓ వ్యక్తి మోసం చేశాడని మహిళా క్రికెటర్ ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 29వ తేదీన క్రికెటర్ ఓ వ్యక్తి వాట్సప్ కాల్ చేశాడు. మీరు చాలా బాగా క్రికెట్ ఆడతారని, మీ ఆట గురించి కొందరి కోచ్‌ల నుంచి సమాచారం తెలుసుకుని కాంటాక్టు అయ్యానన్నాడు. స్టేట్ లెవెల్, ఇంటర్ స్టేట్ లెవెల్ లీగ్‌లో చాన్స్ ఇస్తామని, కొంత ఖర్చు అవుతుందని మాయ మాటలు చెప్పి దఫాలుగా రూ.1లక్షా 25వేలు కాజేశారు. మూడు నెలల్లో ఒక్క మ్యాచ్‌కు చాన్స్ ఇవ్వకపోగా మరిన్ని డబ్బులు కావాలంటూ వేధిస్తున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. -
పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. వారిపై ఫిర్యాదు!
బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్-5 కంటెస్టెంట్ రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొందరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ రావడంతో భరించలేక పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగ, బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న టాప్ 5లో శ్రీరామ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. -
పునీత్ మరణంపై అవమానకర పోస్టులు, యువకుడి అరెస్ట్
Bengaluru Man Arrested For Offensive Comments On Puneeth rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 29) పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అప్పుకు నివాళులు అర్పిస్తుంటే.. మరికొందరూ ఆకతాయిలు ఆయన మరణంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! మద్యం సీసాతో పునీత్ మరణాన్ని అపహస్యం చేస్తూ రిత్విక్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ వరుస పోస్టులు పెట్టాడు. అది గమనించిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషన్ కమల్ పంత్ స్పందిస్తూ.. ‘ఇప్పటికే ఓ యువకుడిని అరెస్టు చేశాం. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ట్విటర్లో వెల్లడించారు. కాగా శుక్రవారం పునీత్ గుండెపోటుతో మృతి చెందిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించిన విషయం విధితమే. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక అలాగే నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై నిందితుడు మద్యం సీసాను చేతిలో పట్టుకొని ‘రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర.. ’అంటూ అవమానకర రీతిలో పోస్ట్ పెట్టాడు. దీంతో పునీత్ ఫ్యాన్స్ సదరు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The accused has been arrested and further legal action is being taken. https://t.co/uIEHFryfUk — Kamal Pant, IPS (@CPBlr) November 1, 2021 -
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేస్తూ.. ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న ఓ ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షలు, మూడు సెల్ఫోన్లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్ తాను వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. డీఆర్డీవోకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటానని, గ్రూప్–1 ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ కొంత కాలంగా పలువురిని మోసం చేస్తూ వస్తున్నాడు. తాజాగా విజయవాడ నగరానికి చెందిన న్యాయవాది కనకదుర్గకు భారీ స్థాయిలో టోకరా వేశాడు. తన ఇద్దరు పిల్లలకు డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో కనకదుర్గ పలు దఫాలుగా రూ.65 లక్షలను ఆన్లైన్ ద్వారా విద్యాసాగర్ బ్యాంక్ ఖాతాకు పంపింది. నగదు తీసుకున్న తరువాత విద్యాసాగర్ కొన్నాళ్లు పత్తా లేకపోవడంతో అనుమానం వచ్చిన కనకదుర్గ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు విజయవాడలో తిరుగుతున్న విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. బతుకంతా మోసాల మయమే.. మాయమాటలతో ప్రజలను మోసం చేయడమే జీవనాధారంగా చేసుకున్న విద్యాసాగర్ గతంలో పలువురిని ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2014లో నకిలీ భూమి దస్తావేజులను సృష్టించి నగరంలోని పలువురిని మోసం చేశాడు. దీనిపై ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదయింది. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసి రూ.17 లక్షలు కాజేశాడు. అదేవిధంగా డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరి నుంచి విద్యాసాగర్ నగదు వసూలు చేసినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. రైస్ పుల్లింగ్ యంత్రాలను సైతం కొందరికి విక్రయించి దుర్గాప్రసాద్ సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు సంబంధం లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంతటితో ఆవివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించింది అని పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును గాయపరిచాయని తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ చేసింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. నేరం ఏమీ చేయకపోవడంతో ఆర్య సానుకూలంగా పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు. విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సప్ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్ చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా) ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచిందని తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్ చేశాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషాసైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. I would like to thank Commissioner of Police @chennaipolice_ Additional Commissioner of Police-Central Crime Branch and Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗 — Arya (@arya_offl) August 24, 2021 -
గేమింగ్ గోల్మాల్
చిత్తూరు అర్బన్: కరోనా కాలంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మి పలువురు మహిళలు మోసపోయారు. ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతూ అందులో పెట్టుబడి పెట్టి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. వీరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారించిన చిత్తూరు పోలీసులు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జి.శివకేశవ్ (33), రాగాల కృష్ణ చైతన్య (35), బచ్చు కిరణ్ (29), పరస శివప్రసాద్ (32)లను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను చిత్తూరు క్రైమ్ సీఐ రమేష్ మీడియాకు గురువారం వివరించారు. మోసాలకు పాల్పడతారు ఇలా... గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిషోర్ అనే యువకుడు ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఇతను పలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌ను (ఏపీకే ఫైల్స్) రూపొందించాడు. ఇంట్లో ఉంటూ వర్క్‌ఫ్రమ్ చేసుకుంటూ ఆదాయానిచ్చే మార్గాలు చెబుతానంటూ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. వాటిని గమనించిన పలువురు మహిళలు వాట్సాప్ మెసేజ్ ద్వారా నవకిషోర్‌ను సంప్రదించగా ఓ ఆండ్రాయిడ్ ఫైల్‌ను పంపి, లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ గేమింగ్‌లోకి ప్రవేశించేలా చేశాడు. ఇక్కడ తొలుత రూ.10, రూ.50 పెట్టుబడి పెట్టమని చెబుతూ బెట్టింగులు ఆడిస్తూ రూ.700 వరకు లాభం వచ్చేలా..ఈ మొత్తం గేమింగ్ ఆడేవారి బ్యాంకు ఖాతా ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాడు. ఓ దశలో గేమింగ్ ఆడేవారి వద్ద రూ.50 వేలు ఉన్నా..దాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఈ మొత్తం విత్‌డ్రా కావాలంటే బెట్టింగ్ కొద్దిగా పెంచాలని చెబుతూ దశల వారీగా రూ.వేలకు వేలు గేమింగ్‌లో పెట్టుబడి పెట్టించాడు. అరెస్టైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్ బాధితులు గేమింగ్‌లో పెట్టిన డబ్బులను కాజేయడానికి ఫిలిప్పీన్స్‌లో పైలట్ శిక్షణ తీసుకుని ఇటీవల తన సొంతూరుకు వచ్చిన ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన జి.శివకేశవ్‌ను రంగంలోకి దించాడు. బీటెక్ చదువుకున్న శివకేశవ్ తన స్నేహితులైన కృష్ణచైతన్య, కిరణ్ ద్వారా చీరాలలో షెల్‌టైల్ ఇన్ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించి దాదాపు 100 మంది నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా వారిపేరిట సిమ్‌కార్డులు కూడా తీసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామంటూ ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు తెరచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నవకిషోర్కు అందజేశాడు. ఇలా చేసినందుకు ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చొప్పున నవకిషోర్ ద్వారా శివకేశవ్ అతని స్నేహితులకు అందింది. తుదిగా గేమింగ్‌లో బాధితులు జమచేసిన నగదును ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా నవకిషోర్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ గేమింగ్ ఉచ్చులోకి చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన మానస, బంగారుపాళ్యంకు చెందిన టి.హేమలత, చిత్తూరుకు చెందిన హర్షితలు చిక్కుకుని గత నాలుగు నెలల్లో రూ.3.10 లక్షలు మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ విభాగం నిందితులైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్‌లను చిత్తూరులో అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరైన మానస వెచ్చించిన రూ.61,500ను తిరిగి ఆమె ఖాతాకే పోలీసులు వేయించారు. నకిలీ ఖాతాల్లో ఉన్న రూ.5.13 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు నవకిషోర్‌ను అరెస్టు చేయడానికి లుక్ అవుట్ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో బాధితులు, మోసగాళ్లకు అసలు పరిచయాలు లేకపోవడం, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడుకోకపోవడం కొసమెరుపు. -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్‌లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్‌ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్‌ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
ఇన్సూరెన్స్ ఫ్రాడ్: పాలసీ క్లైమ్లు మార్చుకోండి.. లేదంటే?
సాక్షి, సిటీబ్యరో: ఢిల్లీ కేంద్రంగా నగరానికి చెందిన ఇద్దరిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని ఇన్సూరెన్స్ ఫ్రాడ్‌లో, మరొకరిని జాబ్ ఫ్రాడ్‌లో పట్టుకున్నారు. ఇరువురినీ మంగళవారం సిటీకి తరలించిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన భానుప్రతాప్ సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఇతడి వద్దకు దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీ హోల్డర్ల వివరాలు వచ్చి చేరేవి. వీటి ఆధారంగా 2019లో నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు. ఈమె 2012లో రెండు బ్యాంకుల నుంచి ఆరు పాలసీలు తీసుకుని ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చారు. బాధితురాలితో మాట్లాడిన భాను ప్రతాప్ మీ పాలసీలకు సంబంధించిన క్లైమ్లు ఇప్పటికీ కంపెనీల పేరుతో ఉన్నాయని, తప్పనిసరిగా మీ పేరుతో మార్చుకోవాలంటూ చెప్పాడు. దానికోసం ముందుగా కొంత మొత్తం చెల్లించాలంటూ అసలు కథ మొదలెట్టాడు. దఫదఫాలుగా రూ.50 లక్షలు ఆమె నుంచి కాజేశాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం భాను ప్రతాప్ ఆచూకీని ఢిల్లీలో కనిపెట్టింది. అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చింది. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలంటూ... ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వివిధ రకాలైన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి మోసం చేసిన కేసులో ఢిల్లీకే చెందిన రప్ కిషోర్‌ను సి టీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతగాడు నగరానికి చెందిన ఇద్దరి నుంచి ర.1.39 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా మో సాల కు పాల్పడిన ఇతడిని సైతం ఢిల్లీలో అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తీసుకువచ్చి రి మాండ్‌కు పంపింది. ఇతడితో పాటు ఇన్సూరెన్స్ ఫ్రాడ్‌లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్‌ను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకు ని విచారించాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. -
తీన్మార్ మల్లన్నకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. ఆ నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు. -
ప్రియాంక ఫిర్యాదు.. పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ చానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నతో పాటు క్యూ న్యూస్ చానల్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ సంస్థ కార్యాలయం నుంచి కొన్ని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా క్యూ న్యూస్ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ప్రవీణ్ అందులో మల్లన్నపై అవినీతితోపాటు పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మల్లన్న ఆదివారం న్యూస్‌లో కొన్ని ప్రత్యారోపణలు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీకి ప్రియాంక ఫిర్యాదు.. ఈ నేపథ్యంలోనే మల్లన్న.. ప్రవీణ్‌తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. వాటిలో ప్రియాంక ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. క్యూ న్యూస్‌లో మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. సైబర్ క్రైమ్ పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారిస్తామని, ఆపై అరెస్టు చేయాలా? నోటీసులు జారీ చేయాలా? అనేది నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు మల్లన్న అభిమానులు క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ గందరగోళం నెలకొంది. -
తప్పుడు ఆధార్‌తో ఖాతా తెరిచి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ. 1,96,88,136 కాజేసిన కేసులో సుప్రియ ఎలిజబెత్ హెడింగ్ కీలక నిందితురాలని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్‌లోని బ్రాంచ్‌లో ఖాతా తెరిచేందుకు ఆమె సమర్పించిన ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసినదిగా తేలింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న సుప్రియ కోసం గాలిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్‌ను ఆన్లైన్లో దోచే యడానికి స్కెచ్ వేసిన సైబర్ నేరగాళ్లు ఈ నెల 2న సుప్రియ ఎలిజబెత్ అనే మహిళతో సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఖాతా తెరిపించారు. అందులో పద్మారావునగర్ అడ్రస్ పొందుపరుస్తూ తన ఆధార్‌కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా ఇచ్చింది. దీన్ని సరిగ్గా పరిశీలించ కుండానే బ్యాంకు అధికారులు ఆమోదించేశారు. కర్ణాటకకు చెందిన ఆధార్‌కార్డును స్కాన్ చేసి, అందులో ముందు వైపు సుప్రియ పేరు, వెనుక వైపు చిరునామా ఉండే చోట పద్మారావునగర్ను చేర్చి ప్రింటౌట్ తీసినట్లు పోలీసులు తేల్చారు. కాజేసిన డబ్బు పది బ్యాంకుల్లోకి తరలించి.. అపెక్స్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని 102 లావాదేవీల్లో కాజేశారు. కొన్ని రోజులపాటు ఈ బదిలీలు జరిగాయి. అయితే రోజూ బ్యాంక్ అధికారులు తీసే బ్యాలెన్స్ షీట్లో తేడాలు కనిపించకుండా హ్యాకర్‌గా వ్యవహరించిన నైజీరియన్ జాగ్రత్తలు తీసు కున్నారు. ఆ లావాదేవీలు బ్యాలెన్స్ షీట్లోకి రాకుండా డిలీట్ చేసేయడంతో బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. కాజేసిన మొత్తంలో రూ.1.94, 88,136 హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్సీ, కోటక్ బ్యాంకుల్లో ఉన్న 10 ఖాతాల్లోకి మళ్లించి విత్ డ్రా చేసేశారు. వీటిలో బెంగళూరు, ఎర్నాకుళంలోని ఖాతాలు సుప్రియ పేరుతో, ఢిల్లీ లోని ఖాతా ఆమె తండ్రిగా ఆధార్‌కార్డులో పొందుపరిచి ఉన్న జార్జ్ హెడింగ్ పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరితోపాటు నగరంలో ఉండి వెళ్లిన నైజీరియన్ విల్సన్ కోసమూ ముమ్మరంగా గాలిస్తున్నారు. -
యూఎస్ కాన్సులేట్ కేసులో క్లారిటీ!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో అమెరికా వీసా కోసం స్లాట్ బుక్ చేస్తున్న కొందరు తమ వెబ్‌సైట్‌ను యాక్సస్ చేస్తున్నట్లు అనుమానం ఉందంటూ యూఎస్ కాన్సులేట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని నమోదు చేశారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు అప్పట్లో వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ఆన్లైన్ దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించిన నేపథ్యంలోనే స్లాట్ దొరికిందంటూ చెప్పారు. దీని నిమిత్తం తాము వారికి రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున చెల్లించామని కాన్సులేట్ అధికారులతో పేర్కొన్నారు. దీంతో తమ అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సస్ చేస్తున్న కొందరు వీసా స్లాట్స్ బుక్ చేస్తున్నారని, ఆ దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటూ మైఖేల్ పీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. వీసా స్లాట్స్ బుకింగ్ వెనుక.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేజ, కృష్ణ జిల్లావాసి ప్రభాకర్‌లు ఇలా దరఖాస్తులు నింపినట్లు గుర్తించారు. వీరిద్దరినీ ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీసా స్లాట్స్ బుకింగ్ వెనుక ఎలాంటి నేరం లేదని బయటపడింది. బీటెక్ పూర్తి చేసిన వీళ్లు గూగుల్ క్రోమ్‌లో అందుబాటులో ఉండే అలెర్ట్ వ్యవస్థను వాడుకున్నారు. వీసా స్లాట్స్‌ను విడుదల చేసిన యూఎస్ కాన్సులేట్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తుంది. దీన్ని క్రోమ్ ద్వారా గుర్తించే గూగుల్ వీరికి అలెర్ట్ ఇస్తోంది. ఆ సమయంలో తమ వద్ద ఉన్న దరఖాస్తుదారుల వివరాలతో ఆన్లైన్లో అప్లై చేస్తున్న వీరిద్దరూ స్లాట్స్ ఇప్పిస్తున్నారు. దీనికోసం కొంత రుసుము తీసుకుంటున్నారు. ఒక్కోసారి క్రోమ్ అలెర్ట్ కాని సందర్భాల్లో తాము రోజుకు 17 గంటలు కంప్యూటర్ ముందే, కాన్సలేట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని గడుపుతామని వెల్లడించారు. కాన్సులేట్ అధికారులను సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు పిలిపించిన దర్యాప్తు అధికారులు ఈ క్రోమ్ అలెర్ట్ విధానంపై వీరిద్దరితో డెమో ఇప్పించారు. నేరమా? కాదా? ఈ నేపథ్యంలోనే ఇందులో ఎక్కడా తమ వెబ్‌సైట్‌ను యాక్సస్ చేయడం లేదని కాన్సులేట్ అధికారులకు స్పష్టమైంది. అయితే స్లాట్స్ ఇప్పించి, దరఖాస్తు పూర్తి చేస్తున్నందుకు రుసుము వసూలు చేయడంపై మాత్రం కాన్సులేట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేని నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు తేజ, ప్రభాకర్లకు నోటీసులు ఇచ్చి పంపారు. ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి న్యాయ నిపుణుల అభిప్రాయానికి పంపాలని నిర్ణయించారు. వీరి నుంచి వచి్చన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. -
అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలని..
ఇల్లు కట్టుకునేందుకు ఆ దంపతులు రూ. కోటికి పైగా అప్పులు చేశారు. కరోనాతో వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయడంతో చేసేదిలేక ఒక్కో కిడ్నీ అమ్మడానికి నిర్ణయించుకున్నారు. కిడ్నీ అవసరమైన వాళ్ల నెంబర్‌కోసం గూగుల్‌ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకుని రూ. 40 లక్షలు పోగొట్టుకున్నారు. దెబ్బమీద దెబ్బపడటంతో ఆ దంపతులు విలవిల్లాడుతున్నారు. హిమాయత్‌నగర్: ఎం.ఎస్.మక్తాలో నివసించే మోడీ వెంకటేష్, లావణ్యలకు ఇద్దరు పిల్లలు. బుక్‌స్టాల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తాము ఉండే ప్రదేశంలో ఓ ఖరీదైన ఇల్లును నిర్మించుకున్నారు. దీనికి రూ.కోటి పైనే అప్పులు చేశారు. గత ఏడాది, ఈ ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో బుక్‌స్టాల్ వ్యాపారం మూతపడింది. దీంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. చేసేది లేక ఆ దంపతులు తమ ఒక్కో కిడ్నీని అమ్మి, కష్టాల నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి... కిడ్నీ అవసరమైన వాళ్లకోసం ఆ దంపతులు గూగుల్‌లో సెర్చ్ చేయగా ఓ ఫోన్ నంబర్ దొరికింది. అతడికి కాల్ చేయగా.. ఢిల్లీలోని ‘హోప్ కిడ్నీ సెంటర్’లో మీ కిడ్నీ తీసుకునేలా ఏర్పాటు చేస్తాను, ఒక్కో కిడ్నీకి రూ.5 కోట్లు వచ్చేలా సహకరిస్తానని నమ్మించాడు. ఇందుకు గాను ప్రాసెసింగ్, వైద్యుల కమీషన్ తదితర వాటికి రూ.4 లక్షలు ఇవ్వమని కోరాడు. దీంతో ఆ దంపతులు ఆ మొత్తం చెల్లించారు. అనంతరం మరోసారి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి డబ్బు పంపించడం మానుకున్నారు. అనంతరం మరోసారి గూగుల్లోనే వెతికి ఇంకో నంబర్‌ను సంప్రదించారు. అతను కూడా వీరిని నమ్మించి రూ.9 లక్షలు కాజేశాడు. ఇలా నాలుగు పర్యాయాలు ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల ఖాతాలో రూ.40 లక్షలు జమచేశారు. చివరకు మోసపోయామని గ్రహించి మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డేటింగ్ యాప్‌లో ఫొటోతో నటికి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కొందరు పోకిరీలు తన ఫొటోను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ సినీ నటి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్‌లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయింది. తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. చదవండి: నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2! -
‘సేఫ్’ జోన్లోకి సైబర్ వాంటెడ్స్
సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడిక్కడ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. ఏ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో తెలియని స్థితి.. ఏ రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధానిలోని మూడు కమిషనరేట్లలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ఉత్తరాది నిందితులు తాత్కాలికంగా సేఫ్ జోన్లోకి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టు కోసం బయటి ప్రాంతాలకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం సైబర్ క్రైమ్ అధికారులే కాదు.. టాస్‌్కఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో మూడు రకాలవే ఎక్కువగా ఉంటాయి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) క్రైమ్స్‌తో పాటు కాల్ సెంటర్ ఫ్రాడ్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే నిందితులుగా ఉంటున్నారు. కేవలం వ్యక్తిగత కక్షలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలో రిజిస్టరయ్యే అతి తక్కువ కేసుల్లో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటారు. ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్పూర్... ఓటీపీ ఫ్రాడ్ స్టర్స్‌కు ఝార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్.. కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్‌కతా అడ్డాలుగా మారాయి. ఇలాంటి కేసుల్లో సూత్రధారులు చిక్కడం కష్టసాధ్యమైనా కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చేవారిని ఎక్కువగా అరెస్టు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఈశాన్య రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, బెంగళూరు, పశి్చమ బెంగాల్లో ఉన్న చిత్తరంజన్, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి మూడు కమిషనరేట్లకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్తూనే ఉండేవారు. ప్రతి నెలా కనీసం పది పదిహేను రోజులు ఏదో ఒక బృందం అక్కడ గాలింపులు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేసుకువచ్చేది. ప్రస్తుతం కరోనా కేసుల విజృంభణ, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆంక్షలు, లాక్డౌన్లు అమలులోకి వస్తాయో తెలియని పరిస్థితులతో దర్యాప్తు, అరెస్టుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అత్యవసర, కీలక కేసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి ఇప్పటి వరకు దాదాపు 600 మంది వరకు సెకండ్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు. ఇప్పటికే ఇద్దరు అధికారులు కన్నుమూశారు. ఇప్పటి వరకు పాజిటివ్ వచి్చన వారిలో వాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల్లో నిందితుల్ని అరెస్టు చేసే విషయంలో టాస్‌్కఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. అరెస్టు చేసిన ప్రతి నిందితుడికీ పీపీఈ కిట్ ధరింపజేయడం తప్పనిసరి చేశారు. -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్‌లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్‌కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్‌కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్‌లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్‌కతా సమీపంలోని డమ్‌డమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్‌కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
రూ.5 కాయిన్‌కు రూ.5 లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు. నగదు చెల్లించిన తర్వాత అది మోసమని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాత కరెన్సీ నాణేలు, నోట్లు ఖరీదు చేస్తామని నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల ఓ బల్క్ సందేశం వచ్చింది. నాణెం వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన రూ.5 నాణేన్ని రూ.5 లక్షలకు, రూ.10 నాణేన్ని రూ.10 లక్షలకు ఖరీదు చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో తన వద్ద రూ.5 నాణేలు 4 ఉన్నాయంటూ నగరవాసి చెప్పడంతో నగదు బదిలీ చేయడానికి ముందుగా పన్నులు చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు. దీనికి నగరవాసి అంగీకరించడంతో జీఎస్టీ సహా వివిధ పేర్లు చెప్పి రూ.39 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో.. నగరానికి చెందిన మరో వ్యక్తి తన వద్ద ఉన్న పట్టు చీరలు విక్రయించేందుకు ఈ– యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్లో దాని ఫొటోతో ప్రకటన ఇచ్చారు. సదరు చీరను రూ.8300 విక్రయిస్తానంటూ అందులో పేర్కొన్నారు. ఆ చీరను తాను ఖరీదు చేస్తానని సైబర్ నేరగాడు చెప్పాడు. నగదు మొత్తాన్ని గూగుల్ పే రూపంలో పంపిస్తానని నమ్మబలికాడు. ఇలా ఓ క్యూఆర్ కోడ్‌ను పంపి స్కాన్ చేయాలంటూ చెప్పాడు. నగరవాసి అలాగే చేయడంతో ఇతడి ఖాతాలోకి నగదు రావడానికి బదులు.. ఖాతా నుంచి డబ్బు కట్ అయి సైబర్ నేరగాడికి చేరిపోయింది. ఇలా మొత్తం రూ.84 వేలు కాజేశాడు. బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్‌కాల్.. -
పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్ దర్శకుడు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ డైరెక్టర్ వీరస్వామి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ సినిమా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరస్వామి డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా ఏప్రిల్ 28 ఏం జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించారు. సినిమా దర్శకుడు వీర స్వామి చదవండి: ట్రోలింగ్: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్ తీసుకున్నావ్.. 100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’ -
‘వీసా అప్లికేషన్ల’పై డబ్బుల వసూలు
సాక్షి, హైదరాబాద్: అన్లైన్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు నింపుతున్న అనేకమంది డబ్బు వసూలు చేస్తున్నారంటూ అమెరికా కాన్సులేట్ అధికారులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మైఖేల్ పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్ కాన్సులేట్ ప్రత్యేకంగా వెబ్సైట్ నిర్వహిస్తోంది. స్టూడెంట్ వీసా కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వూ్యకు హాజరయ్యారు. దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించుకుని రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్లో వీసా దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నేరమంటూ మైఖేల్ పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో పూర్తి చేయించుకుని డబ్బు చెల్లించిన కొందరి ఫోన్ నంబర్లు జతచేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెపుతున్నారు. పాస్‌పోర్ట్ పొందడానికి, రెన్యువల్ చేసుకోవడానికి అనేక ఈ, మీ–సేవ కేంద్రాలు సైతం ఈ సేవల్ని అందిస్తున్నాయి. దరఖాస్తు నింపడం తెలియని, ఇబ్బందిగా భావించేవాళ్లు వీటిని ఆశ్రయించి స్లాట్లు బుక్ చేసుకుంటారు. దీని కోసం నిర్ణీత మొత్తాలను చెల్లిస్తారు. ఇది నేరం కానప్పుడు యూఎస్ వీసాకు ఆన్లైన్లో దరఖాస్తును వేరే వ్యక్తుల ద్వారా పూర్తి చేయించడం ఎలా తప్పవుతుందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా విద్యార్థులతో మాట్లాడాలని నిర్ణయించారు. తామే ఇతరులను ఆశ్రయించి దరఖాస్తును ఇష్టపూర్వకంగా పూర్తిచేయించుకున్నామని చెప్తే కేసు నిలబడదని అధికారులు చెపుతున్నారు. -
పుట్టగొడుగుల్లా ‘పాస్‌పోర్ట్ సైట్స్’
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ పొందాలని, రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని టార్గెట్‌గా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను పెద్ద సంఖ్యలో రూపొందించారు. ప్రధానంగా పాస్‌పోర్టులను రెన్యువల్ చేయించుకోవడానికి వీటిని ఆశ్రయిస్తున్న నగరవాసులు మోసపోతున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు రోజుకు ఒకటి చొప్పున వస్తున్నాయని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యక్తి నకిలీ వెబ్సైట్ వల్లోపడి రూ.2999 నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాస్‌పోర్టులను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న నగరవాసులు నేరుగా రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే పాస్‌పోర్ట్ విభాగానికి ప్రత్యేక వెబ్సైట్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సర్వర్ ఆధారంగా పని చేస్తుండటంతో (www.passportindia.gov.in) అనే అడ్రస్‌తో పని చేస్తుంటుంది. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు (www.indianpassport.com), (www.indiapassport.ind.in), (passportindianonline.com),(onlinepassportservice.com) పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించారు. పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇవే నిజమైనవిగా భావిస్తున్న నగరవాసులు వాటిలోకి ప్రవేశిస్తే... కొన్నిసార్లు ఆయా సైట్లకు వేరే వాటికి డైరెక్ట్ చేస్తున్నాయి. ఆ సైట్స్ లోకి వెళ్తున్న బాధితులు తన పూర్తి వివరాలు పొందుపరచడంతో పాటు రుసుము చెల్లించేస్తున్నారు. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని తేడాలు కనిపించడంతో బాధితులు ఆయా సైట్స్ నకిలీవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా 40 మంది మోసపోతే ఒక్కరే ఫిర్యాదు చేస్తుంటారని అధికారులు తెలిపారు. అత్యధికులు నష్టపోయింది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా బాధితులు డబ్బు కోల్పోవడమే కాకుండా విలువైన వ్యక్తిగత డే టాను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ వెబ్సైట్ల మూలాలు కనుక్కోవడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం, రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వెబ్సైట్లను పూర్తిగా సరిచూసుకున్నానే వివరాలు నింపడం, రుసుము చెల్లించడం చేయాలని సూచిస్తున్నారు. -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్‌గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్‌ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్‌తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్‌కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్‌లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌లేటర్ ఇంద్రజిత్‌ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు) -
సెల్ఫోన్లు కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో పెట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు. ఇదీ అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా పని. వీరిని ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న తెల్లవారుజామున 119 సెల్ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 113 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్‌లతో కలిసి సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. ⇔ ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ తాబ్రేజ్ దావూద్ షేక్ నాగ్‌పూర్‌లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్, మహమ్మద్ షుఫియాన్ షేక్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ⇔ కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్ఫోన్లు, సూరత్‌లోని ఓ మొబైల్ షాప్‌లో 180 సెల్ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో హైదరాబాద్‌కు అద్దె వాహనం (ఇన్నోవా)లో వచ్చారు. ⇔ నంబర్ ప్లేట్‌ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంట సెల్‌ఫోన్ షాప్‌లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్ షాప్ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్ఫోన్లు సంచిలో వేసుకొని కారులో వెళ్లారు. ⇔ పంజాగుట్ట ఓ షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్‌చెరులోని వైన్స్ దుకాణం షెట్టర్ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముంబై పోలీసుల సహకారంతో... ⇔ సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ⇔ షోలాపూర్ టోల్‌ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు బృందాలు ఏర్పడి 20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు. ⇔ ‘గతంలో చోరీ చేసిన సెల్ఫోన్లను ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు. -
డేటింగ్ యాప్: అందమైన అమ్మాయిలతో..!
సాక్షి, గచ్చిబౌలి : డేటింగ్ అంటూ యాప్‌లో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి చీటింగ్‌కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీపీ వి.సి.సజ్జనార్ వెల్లడించారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ డేటింగ్ యాప్‌ను ఓపెన్ చేశారు. పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి. కొద్ది సేపటికే రీమా అనే యువతి ఫోన్ చేసి విదేశీయులకు సహాయంగా వెళ్లేందుకు మేల్ ఎస్కార్ట్ జాబ్ ఉందని చెప్పింది. మాటల్లో పెట్టి డేటింగ్ కోసం అందమైన అమ్మాయిలను పంపుతామని నమ్మించింది. యువతి మాయమాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి మొదట రూ. 2,500 ఆన్లైన్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాయినింగ్ ఫీజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, వీఐపీ మెంబర్‌షిప్‌లు, ప్రోడక్ట్ పర్చేజ్ ఫీజ్, లేట్ పీజ్, ఇన్సూ్యరెన్స్, రీఫండ్ అమౌంట్ పేరిట ఏకంగా రూ. 13,83,643 ఆన్లైన్లో చెల్లించారు. చదవండి: ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా.. డేటింగ్ కోసం మీ ప్రాంతంలో అమ్మాయిలు అందుబాటులో లేరని బుకాయిండంతో తన వెనక్కు ఇవ్వాలని అడిగారు. చెల్లిస్తామని చెప్పి ఫోన్ పెట్టేసిన తరువాత ఆ ఫోన్ కలవక పోవడంతో మోసాన్ని బాధితుడు సెప్టెంబర్ 18న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ చెందిన మరో వ్యక్తి ఆ వెబ్సైట్ ఓసెన్ చేసి మొబైల్ నంబర్, పేరు ఎంటర్ చేశారు. త్రిష అనే యువతి మాట్లాడి మొదట ఎస్కార్ట్ జాబ్ ఇస్తామని, తరువాత మాటల్లో పెట్టి అమ్మాయిలను డేటింగ్‌కు పంపిస్తామని నమ్మబలికింది. రూ. 1,500 ఆన్లైన్లో చెల్లించాడు. మెంబర్ షిప్, జీఎస్టీ అంటూ వివిధ పేర్లు చెప్పి బ్యాంక్ అకౌంట్‌కు ఆన్లైన్లో రూ. 1,15,700 చెల్లించాడు. మాయ మాటలుగా గుర్తించి అక్టోబర్ ఒకటిన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి అమ్మాయిలతో కాల్‌సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్ రెండు వారాలపాటు రెక్కీ.. ఐదుగురు అరెస్ట్ పోలీసులు తమ విచారణలో వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురి కేంద్రంగా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం సిలిగురి వెళ్లి రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించి ఏబీసీ ఫైనాన్స్ బోర్డు పెట్టుకొని కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పర్యవేక్షకులుగా పని చేస్తున్న సిలిగురికి చెందిన బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్‌నూర్ అలమ్ అన్సారీ, మేనేజేర్లు దీప హల్దార్(27), షికా హల్దార్(22)లను స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 11న అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ల్యాప్ టాప్, 31 సెల్ ఫోన్లు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు సంతు దాస్, అమిత్ పాల్, శశాంక్ కుమార్‌లు పరారీలో ఉన్నారు. రోజుకు రూ. కోటి మేర మోసం డేటింగ్.. చీటింగ్ కేసులో నేపాల్‌కు చెందిన సంతుదాస్ కింగ్ పిన్‌గా వ్యవహరిస్తున్నాడు. నేపాల్ నుంచి వచ్చి సిలిగురిలో నివాసం ఉంటున్నాడు. డేటింగ్ పేరిట చీటింగ్‌కు పాల్పడే 35 కాల్ సెంటర్లు సిలిగురిలో నిర్వహిస్తూ రోజు దాదాపు కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడుతున్నారని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. భవనం అద్దెకు తీసుకొని బిజయ్, బినోద్ పర్యవేక్షణలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఫోన్లో మాట్లాడే యువతులకు రోజు చేసే బిజినెస్‌లో 10 శాతం ఇస్తారు. బిజయ్ కుమార్ అకౌంట్లోకి డబ్బు వచ్చిన వెంటనే తమకు రావాల్సిన మొత్తం ఉంచుకొని మిగతా డబ్బును వెంటనే సంతుదాస్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తారు. కస్టమర్లతో మాట్లాడిన సిమ్‌లను తీసి పడేస్తారు. పోలీసులు విచారణ చేస్తున్నారని చిన్నపాటి అనుమానం వచ్చినా కాల్ సెంటర్లు మూసివేసి సంతుదాస్ నేపాల్‌కు వెళ్లి పరిస్థితులు చక్కబడే వరకు తలదాచుకుంటాడు. ప్రధాన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. డేటింగ్ యాప్‌లను ఓపెన్ చేయొద్దు.. డేటింగ్ యాప్‌లను ఓపెన్ చేయవద్దని, తెలియని వ్యక్తులకు వ్యక్తి గత సమాచారం ఇవ్వొద్దని, ఆన్లైన్ డబ్బులు చెల్లించవద్దని కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సైబర్ క్రైం బృందాన్ని అభినందించి రివార్డు అందజేశామన్నారు. సమాశంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్ఐ రాజేంద్ర, ఏఎస్ఐ శ్యామ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అశ్లీల వీడియో లింక్ పంపిన అటెండర్ తొలగింపు
తిరుపతి సెంట్రల్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఒకరు ఓ భక్తుడికి మెయిల్ ద్వారా అశ్లీల వీడియో లింక్‌లను పంపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పాలక మండలి సదరు సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి దీనిపై తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించడంతో సైబర్ క్రైం పోలీసు బృందం రంగంలోకి దిగింది. శతమానం భవతి వివరాలు కోరగా.. ఎస్వీబీసీ ప్రసారం చేసే శతమానం భవతి కార్యక్రమం ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభ సందర్భాల్లో పురోహితులు ఆశీర్వచనాలు అందిస్తారు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఈ కార్యక్రమం వివరాలు పంపాలని కోరగా ఎస్వీబీసీ కార్యాలయం సిబ్బంది ఒకరు అశ్లీల వీడియో లింక్ పంపినట్లు గుర్తించారు. మెయిల్ తెరిచి చూసి నిర్ఘాంతపోయిన భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేయడంతో తక్షణమే విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ తిరుపతి అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి సుమారు 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షుణ్నంగా విచారణ కొనసాగుతోంది. కంప్యూటర్ల సెక్యూరిటీ ఆడిట్.. అశ్లీల వీడియోను మెయిల్ చేసిన అటెండర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎస్వీబీసీ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో భాగంగా ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ముగ్గురు నలుగురు సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైబర్ సెల్ టీం విచారణలో ప్రాథమికంగా తేలిందని, పూర్తి వివరాలు పరిశీలించాక విధుల నుంచి తప్పించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక టీటీడీ పర్యవేక్షణలో.. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ విభాగాన్ని టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు సీఈవో ప్రకటించారు. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్‌కు పాస్వర్డ్ ఏర్పాటు చేసి ఎవరు వినియోగిస్తున్నారో నమోదు చేస్తామన్నారు. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోకి తెస్తామని చెప్పారు. -
రాజస్తాన్ గ్యాంగ్; హైదరాబాద్ పోలీసుల సాహసం!
సాక్షి, హైదరాబాద్: ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రాజస్తాన్‌కు వెళ్లారు. స్థానిక భరత్పూర్ జిల్లాలోని కళ్యాణ్పురి, చౌ వేరా గ్రామాల్లో ఉన్న నిందితుల ఇళ్లపై అర్ధరాత్రి దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ముఠా ఓఎల్ఎక్స్లో వాహనాల ఫొటోలు పెట్టి, తక్కువ ధరకే అమ్ముతామంటూ మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఎంతోమంది బాధితులు మోసానికి బలైపోయారు. ఈ క్రమంలో నేరగాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు, వారిని వెదుక్కుంటూ రాజస్తాన్‌కు వెళ్లారు. పది మంది సభ్యులు గల ఈ బృందానికి భరత్పూర్ జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేసే వంద మంది స్థానిక పోలీసులు కూడా జతకలిశారు.(చదవండి: ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు) వీరంతా కలిసి, కళ్యాణ్పురి, చౌ వేరా గ్రామాల్లో తలదాచుకున్న నిందితుల ఇళ్లపై రైడ్ చేశారు. విషయం తెలుసుకున్న నేరగాళ్ల ముఠా, వారి కుటుంబ సభ్యులు పోలీసులపై ఎదురుదాడికి దిగి, వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో, అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బృందాలు, వాజిత్ ఖాన్, సాహిల్, సత్యవీర్ సింగ్, మోహన్ సింగ్ ఇర్ఫాన్, రాహుల్, అజరుద్దీన్, తారీఫ్ ఖాన్, ఉమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల క్రితం 8 మందిని అరెస్టు చేయగా, నేడు 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
అమ్మాయిలతో కాల్‌సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో ఉన్న కాల్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 మంది యువతులకు 41 సీఆర్పీ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు. ఆనంద్కర్, బుద్దపాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 24 సెల్ఫోన్లు, 51 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్ అమ్మకాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న భరత్పూర్ గ్యాంగ్‌ను సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ మార్కెటింగ్‌ల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు. (చదవండి: పాదరసం.. అంతా మోసం ) -
లాక్‌డౌన్‌లోనూ ‘పవర్’ ఫుల్ గేమ్!
సాక్షి, హైదరాబాద్: ‘కలర్ ప్రిడిక్షన్’ పేరుతో భారీ ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడిన బీజింగ్ టీ పవర్ సంస్థ లాక్డౌన్ సమయంలోనూ కాసులవేటను సక్సెస్ ఫుల్‌గా కొనసాగించింది. గత ఏడాది జరిగిన లావాదేవీల కంటే ఈ ఏడాది తొలి ఏడున్నర నెలల్లో జరిగినవే అత్యధికమని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్ హూతోపాటు ఢిల్లీకి చెందిన అంకిత్, ధీరజ్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. బీజింగ్ టీ పవర్ సంస్థ గుర్గావ్ కేంద్రంగా 2019–20ల్లో దాదాపు 40 డమ్మీ కంపెనీలను రిజిస్టర్ చేయించింది. వీటిలో 90 శాతం భారతీయ డైరెక్టర్లు ఉండగా.. 10 శాతం చైనావాళ్ళు ఉన్నారు. ఈ 40 కంపెనీల్లోనూ కామన్‌గా ఉన్న డైరెక్టర్ల సంఖ్యే ఎక్కువ. ఈ సంస్థలు గత ఏడాది రూ.500 కోట్ల మేర దందా చేయగా ఈ ఏడాది ఆగస్టు మొదటి వారానికే రూ.1100 కోట్లకు చేరింది. ఈ కంపెనీలు దళారుల సహకారంతో, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అత్యధికంగా యువకులు, గృహిణుల్ని ఆకర్షించి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సొమ్ము బీజింగ్ టీ పవర్ సంస్థతోపాటు బీజింగ్ టుమారో సంస్థకూ వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఎవరు? అనే అంశాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. యాన్ హూ అరెస్టు విషయం తెలిసిన వెంటనే చైనాకు చెందిన డైరెక్టర్లు దేశం విడిచి పారిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు చైనా కంపెనీలకు పేమెంట్ గేట్ వేలుగా వ్యవహరించిన పేటీఎం, క్యాష్ ఫ్రీ సంస్థల ప్రతినిధులు సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయా సంస్థలు చట్టబద్ధంగా ఈ–కామర్స్ వ్యాపారం అని చెప్పడంతోనే తాము సేవలు అందించామంటూ వీరు సమాధానం ఇచ్చారు. తమ పేమెంట్ గేట్ వేస్ను ఆ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం లేదని వివరించారు. మరోపక్క చంచల్‌గూడ జైల్లో ఉన్న యాన్ హూ, అంకిత్, ధీరజ్‌లను నాలుగు రోజుల విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంస్థలకు సంబంధించి 30 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.50 కోట్లను ఫ్రీజ్ చేశారు. -
కత్తి మహేష్‌పై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు శుక్రవారం మరోసారి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జాంబాగ్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కత్తి మహేష్‌ను పిటీ వారెంట్‌పై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కత్తి మహేష్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. గతంలో శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కేసులో కత్తి మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. కొద్దిరోజుల క్రితం ట్విటర్లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కత్తి మహేశ్‌ను ఆగస్టు 15న సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి : శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు) -
ఢిల్లీ టు చైనా.. వయా కెనడా
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడిక్షన్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న యేహూ అనే చైనీయుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. మరో కీలక నిందితుడు హేమంత్ కోసం గాలిస్తున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ ఈ కలర్ ప్రిడిక్షన్ గేమ్ వెనుక ఉంది. దీనికి అనుబంధంగా ఢిల్లీలోని గుర్గావ్లో ఓ కార్యాలయం పని చేస్తోంది. చైనాకు చెందిన యే హూను తమ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా బీజింగ్ టీ పవర్ సంస్థ నియమించింది. ఇతడు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ–కామర్స్ సంస్థల పేరుతో అప్పటికే ఢిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదై ఉన్న గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రెవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రెవేట్ లిమిటెడ్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, డాకీపే ప్రెవేట్ లిమిటెడ్, స్పాట్‌పే ప్రెవేట్ లిమిటెడ్, డైసీలింగ్ ఫైనాన్షియల్ ప్రెవేట్ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్ ప్రెవేట్ లిమిటెడ్‌ల కార్యకలాపాలు ఇతడు పర్యవేక్షిస్తున్నాడు. ఢిల్లీవాసులు హేమంత్, ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో..: కలర్ ప్రిడిక్షన్ గేమ్ వలలో చిక్కి నష్టపోయిన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఇటీవల కేసులు నమోదయ్యాయి. ప్రాథమికంగా దర్యాప్తు అధికారులు పేమెంట్ గేట్వేస్పై దృష్టి పెట్టారు. పేటీఎం, గూగుల్ పేల ద్వారా జరిగిన లావాదేవీలను విశ్లేషించారు. బెట్టింగ్‌కు సంబంధించిన నగదు తొలుత డాకీ పే సంస్థకు, అక్కడ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆ బ్యాంక్‌కు లేఖ రాసిన దర్యాప్తు అధికారులు రూ.30 కోట్ల బ్యాలెన్స్ ఉన్న రెండు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. తమ కార్యకలాపాలపై పోలీసుల కన్ను పడిందని తెలుసుకున్న అతడు తక్షణం తమ దేశానికి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో... కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ నుంచి చైనాకు విమాన సర్వీసులు నడవట్లేదు. దీంతో కెనడాకు టికెట్ బుక్ చేసుకున్న యేహూ అక్కడ నుంచి చైనా వెళ్లాలని పథకం వేశాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీ విమానా శ్రయంలో సిటీ సైబర్ క్రైమ్ బృందానికి చిక్కాడు. మరోపక్క ఈ కలర్ ప్రిడిక్షన్ నిర్వాహక సంస్థ బీజింగ్ టీ పవర్ సంస్థ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి యేహూను తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1,100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించిన నేపథ్యంలో మనీలాండరింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ–కామర్స్ పేరుతో బెట్టింగ్ నిర్వహించిన ఆ ఎనిమిది సంస్థలూ జీఎస్టీ లేదా ఆదాయపుపన్ను చెల్లించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయా విభాగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. -
శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టు ప్రభావం బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హైదరా బాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతూ సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం కత్తి మహేశ్ శ్రీరాముడిపై ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా సుమోటో కేసు నమోదు చేసి మహేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. మహేశ్‌పై గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బాలల అశ్లీలతకు సంబంధించిన అంశాలు, చిత్రాలు, వీడియోల కోసం ఇంటర్నెట్లో వెతికారంటే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఇలాంటి అంశాలను పరిశీలించేందుకు ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ (ఎస్సీఆర్బీ)లో ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. గూగుల్‌లో చైల్డ్పోర్న్కు సంబంధించిన కీ వర్డ్స్ తో సర్చ్ చేసినా, బాలల అశ్లీలతకు సంబంధించిన వెబ్సైట్లలోకి వెళ్లినా వెంటనే ఈ సెల్ సదురు ఐపీ(ఇంటర్నెట్ ప్రొటోకాల్)ని గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన ఐపీలను ఆయా రాష్ట్రాల్లోని సీఐడీ విభాగానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఆయా నగరాలు, పట్టణాలకు ఆయా సమాచారాన్ని పంపించి, నిందితులను పట్టుకుంటున్నారు. ఇలా హైద్రాబాద్‌లో గురువారం ఇద్దరు యువకులను సిటీ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ మోహన్రావ్ బృందం అరెస్ట్ చేసింది. తార్నాకకు చెందిన మహ్మద్ ఫిరోజ్ వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. అశ్లీల వెబ్సైట్లలోకి వెళ్లి బాలలకు సంబంధించిన వీడియోలను డౌన్లోడ్ చేశాడు, వాటిని తన ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నాడు. అలాగే కాచిగూడకు చెందిన ప్రశాంత్‌కుమార్ ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అశ్లీల వెబ్సైట్లలోకి వెళ్లి అక్కడ బాలలకు సంబంధించిన అశ్లీల ఫోలోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి వాటిని ఇతర సైట్లలో అప్లోడ్ చేశాడు. ఆయా ఐపీలను రికార్డ్ చేసిన ఎన్‌సిఆర్‌బీ వాటిని రాష్ట్ర సీఐడీకి పంపించింది. ఆ సమాచారం హైద్రాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు అందడంతో ఐపీ చిరునామాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన సైబర్‌క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మరో 12 మందికి సంబంధించిన ఐపీలపై కూడా సైబర్‌క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో శోధన చేసే వారికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఎన్సీఆర్బీకి ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయి. ఇంటర్నెట్ వాడేవారు ఈ కీవర్డ్స్ పై తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
అతడు.. ఆమె.. ఓ అన్న!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి యువతిగా ‘మారాడు’.. ఆ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఎర వేశాడు... తన ఫొటోలు అంటూ డమ్మీవి పంపించి.. బాధితుడి నుంచి ‘అసలైనవి’ సంగ్రహించాడు.. ఇవి చేజిక్కిన తర్వాత పెళ్లి ప్రస్తావనతీసుకువచ్చి బెదిరించాడు... ఆపై తన అన్న అంటూ తానే మరో పాత్రలో ప్రవేశించి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు... చివరకు బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు కాజేసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇవీ.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా తెరిచాడు. దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ రిక్వెస్ట్ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఓ దశలో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతూ కొన్ని ‘ఫొటోలు’ పంపిస్తానంటూ యువతిగానే చెప్పాడు. దానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంగీకరించడంతో ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను తనవే అంటూ పంపించాడు. వీటిని బాధితుడు చూశాడని నిర్ధారించుకున్న తర్వాత చాటింగ్ కొనసాగించాడు. ఆపై పెళ్లి ప్రస్తావన.. చాటింగ్ గారడీ ద్వారానే బాధితుడు సైతం తనంత తానుగా అతడికి చెందిన కొన్ని అలాంటి ఫొటోలే తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో పంపేలా చేసుకున్నాడు. ఆపై అసలు కథను ప్రారంభించాడు పవన్ కిరణ్. ఉద్దేశపూర్వకంగా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నిన్నే పూర్తిగా నమ్మానని, అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్ చేశానంటూ చాటింగ్ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి పేరుతో ఉన్న పవన్ కిరణ్ ఖాతాను బ్లాక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. మూడో పాత్రలోకి దిగి.. ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడు వినియోగించిన ఫోన్నంబర్ల ద్వారా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారి గురువారం పవన్‌కిరణ్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ఫోన్ హ్యాక్.. #*#4636#*#* ఇది డయల్ చేస్తే
కుత్బుల్లాపూర్: కరోనా మహమ్మారితో కలవరపడుతున్న ప్రజలను సైబర్ క్రైమ్స్ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు కుదేలవడం వంటి పరిమాణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిలో కొంత మందికి వచ్చే కాల్స్‌తో వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. ఫోన్, ఈ–మెయిల్, క్యూఆర్ కోడ్స్, ఓటీపీ హ్యాక్.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఎంతలా అంటే 2019 సంవత్సర కాలంలో సైబర్ కేసులు మొత్తం 477 నమోదైతే 2020లో గడిచిన ఐదు నెలలో 485 కేసులు నమోదవడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్లో ఎక్కువగా కేసులు పెరిగాయి. 2016 నుంచి ఇప్పటి వరకు నమోదైన 1,636 సైబర్ కేసుల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. వీటిలో బాధితులు అసలు మాకు బ్యాంక్ ఓటీపీ రాలేదని, అయినా మా ఖాతాలు ఖాళీ అయ్యాయని చెప్పడం చూస్తుంటే మనం వాడే ఫోన్‌ని సైతం ఎలా హ్యాక్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ము బదిలీ కావాలంటే ముఖ్యమైంది బ్యాంక్ వారు పంపే ‘ఓటీపీ’నే. అయితే ఈ ఓటీపీ మన ఫోన్‌కు రాకుండానే ఖాతా ఖాళీ అవుతుందంటే మన ఫోన్ హ్యాక్ అయ్యిందా అన్నది ఓ సారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన ఫోన్ హ్యాక్ అయ్యిందా..? అవలేదా..? అయితే ఎలా మళ్లీ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి..? వంటి సెక్యూరిటీ అంశాలు మీ కోసం.. ఇలా తెలుసుకోండి.. #*#4636#*#* : ఇది డయల్ చేస్తే మన ఫోన్లోని పూర్తి టెక్నికల్ వివరాలు అంటే సిగ్నల్ స్ట్రెంత్, మొబైల్ సెక్యూరిటీ, కాల్ ఫార్వడింగ్ వివరాలు, బ్యాండ్ విడ్త్, లోకల్ ఏరియా వివరాలు ఇలా మీ ఫోన్లో ఉన్న చిన్నచిన్న వివరాలు అన్ని చూపిస్తుంది. ఈ కోడ్ ద్వారా మన ఫోన్ సిమ్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. నోట్: ఈ కోడ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కో ఫోన్లో ఒక్కో మోడల్‌ను అనుసరించి ఫ్లాష్ మెసేజ్‌లు కనిపిస్తాయి. తదనుగుణంగా మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా పైకోడ్స్లో ఏవి డయల్ చేసినా ‘ఎనబల్’ అని కనిపిస్తే ఫార్వర్డింగ్‌లో ఉన్నట్లు లెక్క.. అయితే కాల్ ఫార్వర్డింగ్ వేన్ నాట్ రీచబల్ అని వస్తే సదరు నెంబరును సరి చూసేకుని అది మీకు సంబంధించినది అయితే అలాగే కంటిన్యూ అవ్వవచ్చు. ఇలా తెలుసుకోండి.. ♦ మన ఫోన్ నుంచి మనకు తెలియకుండా ఎవరికైనా కాల్ ఫార్వర్డ్ అవుతుండటం, ఎస్ఎంఎస్లు వెళ్తుండటం వంటి విషయాలను డయల్ ప్యాడ్ నుంచి కొన్ని కోడ్స్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ♦ #21# ఈ కోడ్ ఎంటర్ చేసి డయల్ చేస్తే మీ ఫోన్ కాల్ ఫార్వర్డ్ అవుతుందా? కాల్ డైవర్షన్ వంటివి జరుగుతున్నాయా లేదో తెలుసుకోవచ్చు. డయల్ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్‌పై ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్ బాక్స్‌లో మన సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఫార్వడింగ్ అని వస్తే మీ మొబైల్ హ్యాక్ అయిపోయినట్లే. ♦ #62# ఫార్వడింగ్ అని వస్తే ఈ కోడ్ డయల్ చేయాలి. ఈ కోడ్‌ని రిపిటెడ్‌గా మూడుసార్లు చేస్తే మీ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు ఏమైనా ఫార్వడింగ్ ఆగిపోతాయి. ♦ #002# ఈ కోడ్‌ని డయల్ చేస్తే ఎప్పటికీ మన ఫోన్ నుంచి కాల్స్ ఫార్వర్డ్ అవ్వవు. ముఖ్యంగా సిమ్ అప్పుడప్పుడు వాడే వారు, రోమింగ్‌లో వేరే ఫోన్ నంబరు వాడే వారికి ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఏమైనా కాల్ ఫార్వడింగ్ ఉంటే అన్ని ఎరైస్ అయిపోతాయి. -
కేటీఆర్ ఆదేశం: మీరా ఫిర్యాదుపై దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హీరోయిన్ మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమెను ఎక్కువగా ట్రోల్ చేస్తున్న 15 ట్విటర్ హ్యాండిల్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అకౌంట్లను ఉపయోగిస్తున్న సభ్యులకు నోటీసులు పంపించారు. అంతేకాకుండా అసభ్యకర ట్వీట్లు చేసిన ఆ 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు) తాజాగా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు ట్విటర్ వేదికగా ఈ నటి ఫిర్యాదు చేశారు. ‘మీ రాష్ట్రానికి చెందిన కొందరు నాపై సామూహిత అత్యాచారం, యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళలకు రక్షణ కల్పిస్తారని, దీనిపై విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ కేటీఆర్, కవితలకు మీరా చోప్రా ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ చేసిన ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా జతచేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘మేడమ్ మీరిచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్‌శాఖను కోరాను’ అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ స్పందనపై ఆనందం వ్యక్తం చేసిన మీరా చోప్రా మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని మరోసారి విజ్ఞప్తి చేశారు. (మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా) ఇంతకీ ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ మీరా చోప్రాకు అండగా నిలిచారు. (ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న నటుడు) Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB — KTR (@KTRTRS) June 5, 2020 -
మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మీరాచోప్రా
సాక్షి, హైదరాబాద్ : గత నాలుగైదు రోజులుగా మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై మీరాచోప్రా మరోసారి మంత్రి కేటీఆర్, కవితకు ట్విటర్ ద్వారా ట్వీట్ చేశారు. ' నన్ను గ్యాంగ్ రేప్ చేస్తామని, యాసిడ్ దాడి చేస్తామంటూ బూతులు తిడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్‌కు ఫిర్యాదు చేశాను. మహిళలకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా' అంటూ తెలిపారు (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హీరోయిన్ మీరా ఫిర్యాదు) Ma’m, I have requested @TelanganaDGP and @CPHydCity to take stern action as per law based on your complaint https://t.co/mbKzVAe5fB — KTR (@KTRTRS) June 5, 2020 కాగా దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు.' మేడం.. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. మీ ఫిర్యాదు ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఆదేశించాను.' అంటూ తెలిపారు. కేటీఆర్ ట్వీట్‌కు మీరాచోప్రా రీట్వీట్ చేస్తూ..'థ్యాంక్యూ కేటీఆర్ సార్.. మహిళల భద్రతకు ఇది చాలా ముఖ్యం. మహిళలపై నేరాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను స్వేచ్ఛగా ఉంచకూడదు!' అంటూ పేర్కొన్నారు. మీరా చోప్రా ట్వీట్ల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ట్విటర్లో చేసిన అసభ్యకరమైన ట్వీట్లను పోలీసులు తొలగించారు. అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విటర్ అకౌంట్స్ ని గుర్తించి వారిపై 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపై ట్విటర్లో అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలుసులు పేర్కొన్నారు. Thanks sir, it really means a lot. This is very important for women safety. These people should not be left free to do crimes on women! 🙏🙏 https://t.co/HzQcRHPEAd — meera chopra (@MeerraChopra) June 5, 2020 అసలు ఏం జరిగిందంటే.. జూన్ 1న మీరా చోప్రా ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు.