నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్‌పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment