YouTube channels
-
ఆ యూట్యూబర్‌పై శివ బాలాజీ ఫిర్యాదు
చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్‌కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
RaGa: మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్‌ను పాలించాలనుకోవడం అవివేకమన్నారు. గత వారం ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా విద్యారి్థనులతో రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు ఇక రాహుల్‌గాంధీ నిత్యం ఎదుర్కొనే అత్యంత పెద్ద ప్రశ్నను విద్యారి్థనుల నుంచి మరోసారి ఎదుర్కొన్నారు. సంభాషణలో భాగంగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి గురించి విద్యార్థులను ఆయన అడగ్గా.. వెంటనే వారు రాహుల్‌ను అదే ప్రశ్న అడిగారు. అయితే తాను 20, 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా ఆ ఒత్తిడిని అధిగమించానని చె ప్పారు. పెళ్లి చేసుకుంటారా? అని మరో విద్యారి్థని అడగ్గా.. ‘ఇప్పటికైతే ఆలోచన చేయలేదు.. భవిష్యత్‌లో చెప్పలేను’అని సమాధానమిచ్చారు. చేసుకుంటే మాత్రం మమ్మల్ని ఆహ్వానించండంటూ విద్యార్థినులంతా ఒకేసారి కోరారు. ‘తప్పకుండా’అని చెప్పడంతో విద్యార్థుల నవ్వులతో ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఒక రాష్ట్రం నుంచి రాష్ట్ర హోదాను తొలగించడం భారత చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. అది చేసిన విధానం తమకు నచ్చలేదని, రాష్ట్ర హోదాను తిరిగి పొందడం, అందులో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు ప్రాతినిధ్యం ఉండటం తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ను, జమ్మూను నడపాలనుకోవడంలో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటా వినరు. మొదటి నుంచి తాము చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అదే అసలు సమస్య. తనది తప్పని చూపించినా ఒప్పుకోరు. అలాంటి వ్యక్తులు నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. తాము చెప్పిందే కరెక్ట్ అనుకోవడం బలం కాదు.. బలహీనత. ఆత్మన్యూనత నుంచే ఇలాంటివి వస్తాయి’’అని రాహుల్ విద్యార్థులతో వ్యాఖ్యానించారు. The women of Kashmir have strength, resilience, wisdom and a whole lot to say. But are we giving them a chance for their voices to be heard? pic.twitter.com/11Te8MM5fH— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2024యూట్యూబ్ ఛానల్లో వీడియో... ఇదే వీడియోను రాహుల్‌గాంధీ తన వ్యక్తిగత యూట్యూబ్ చానల్లోనూ పోస్టు చేశారు. వివిధ కళాశాలల్లో లా, ఫిజిక్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులను చదువుతున్న విద్యార్థుల సమస్యలను, ఆకాంక్షలను తాను లోతుగా అర్థం చేసుకున్నానని రాహుల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో మహిళలపై వేధింపుల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడానని, ఇటువంటి ఘటనలు వ్యవస్థాగత సమస్యలను ఎలా ప్రతిబింబిస్తాయి, ప్రాంతాలకతీతంగా మహిళల భద్రత, గౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని విద్యార్థులు తమ ఆందోళనలను పంచుకున్నారని వెల్లడించారు. కశీ్మర్ మహిళలకు గొప్ప శక్తి, నిలదొక్కుకునే ధైర్యం, వివేకం ఉన్నాయని, ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతారని కొనియాడారు. వారికి గౌరవం, భద్రతతోపాటు సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కి చెప్పారు. -
'మా' దూకుడు.. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చెప్పినట్లుగానే కఠిన చర్యలు చేపట్టింది. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మూవీ ఆర్టిస్టులపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారికి గట్టి షాకిచ్చింది. తాజాగా అలాంటి కంటెంట్ ప్రసారం చేస్తున్న 18 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించినట్లు మా అసోసియేషన్ ట్వీట్ చేసింది. అంతకుముందే అలాంటి వీడియోలను 48 గంటల్లోగా తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. బ్రహ్మి ట్రోల్స్ 3.0, టీకే క్రియేషన్స్, డాక్టర్ ట్రోల్స్, ట్రోలింగ్ పోరడు, అప్డేట్ ట్రోల్స్, నేను మీ జాను, కామెడీ ట్రోలింగ్, మై ఛానెల్ మై రూల్స్ లాంటి ఛానెల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. కాగా.. అంతకుముందే మొదట ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను బ్లాక్ చేయించారు.ఈ సందర్భంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లకు మరోసారి మా హెచ్చరికలు పంపింది. పరువు నష్టం కలిగించేలా ఉన్న ట్రోల్ వీడియోలపై సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదిక అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దయచేసి మీ ఛానెల్స్ నుంచి అలాంటి కంటెంట్ వెంటనే తొలగించాలని మరోసారి మా విజ్ఞప్తి చేసింది. On behalf of #MAA, we urge all YouTubers and social media trollers to take a note. We are preparing to report defamatory troll videos to Cyber Crime office. Kindly remove such content from your channels and profiles to avoid complications.#RespectOurArtists— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024As part of our ongoing efforts on terminating the YouTube channels for posting derogatory content on our artists.We have blocked an additional 18 channels that spread harmful content.Stay tuned for further updates.#MAA #RespectOurArtists pic.twitter.com/rDnCJbDVHX— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024 -
టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 10 సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లతో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు. కేవలం ఒక కుట్ర, ఎజెండాలో భాగంగా తమపై ఈ ప్రచారం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. గతంలోనూ తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఆయా సంస్థలు తప్పును సరిదిద్దుకొని, అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని ప్రకటించాయి. ఇదీ చదవండి.. కడియంకు బీఆర్ఎస్ చెక్ -
అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగతంగా తనతోపాటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న చానళ్లపై ఇప్పటికే యూట్యూబ్, గూగుల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. ఈ తరహా చానళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరిట పచ్చి అబద్ధాలను చూపిస్తున్నాయి. మాపై గుడ్డి వ్యతిరేకత లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలు, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోంది. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యలుగా వీటిని భావిస్తున్నాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారిపై చర్యలు తప్పవు ‘గతంలో మాపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రస్తుతం చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పటికైనా ఈ చానళ్లు తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. -
వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..?
రోజంతా ఏదో సమయంలో యూట్యూబ్ చూడకుండా ఉండని వారుండరంటే అతిశయోక్తి కాదు. ట్రైలరనో, టీజరనో.. ఎంటర్టైన్మెంట్ వీడియోలకోసమో, ఇన్ఫ్లూయెన్సర్ల షార్ట్స్ కోసమో.. రివ్యూలకనో, ప్రముఖుల వ్యూస్కనో.. మనం నిత్యం యూట్యూబ్‌పై ఆధారపడుతుంటాం. అయితే అలా వస్తున్న కంటెంట్‌లో నిజమెంత..? ఆ కంటెంట్‌లోని ఫొటోలు, వీడియో క్లిప్‌లు, వాయిస్‌లు నిజంగా ఆ వీడియో అప్లోడర్లవేనా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేలా యూట్యూబ్ కొత్త నియమావళిని తీసుకురాబోతుంది. కృత్రిమ మేధ(ఏఐ) పురోగమిస్తున్నందున అది తయారుచేసే కంటెంట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంటెంట్‌కు సంబంధించి వాస్తవాలు ఎంతనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏఐ సృష్టిస్తున్న సమాచారాన్ని ఎలా నిర్ధారించాలో ఒకింత సవాలుగా మారుతోంది. ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్‌ల రూపంలో ఏఐ మోడల్‌ల ద్వారా వచ్చిన డేటాను స్పష్టంగా గుర్తించడంలో కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఆ వార్తల సారాంశం ప్రకారం.. కృత్రిమ మేధతో రూపొందించిన వీడియోలకు సంబంధించి యూట్యూబ్ నియమాలను ప్రకటించనుంది. యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసేముందు కొన్ని జనరేటివ్ ఏఐ క్లిప్‌లు, వాస్తవికతకు దగ్గరగా ఉండే కృత్రిమంగా సృష్టించిన వీడియోలను జోడిస్తుంటారు. వీక్షకులు దాన్ని ఇన్ఫ్లూయెన్సర్ల నిజమైన కంటెంట్ అని భ్రమపడే అవకాశం ఉంది. అలాంటి వారు ఇకపై తమ వీడియోలకు లేబులింగ్ ఇవ్వాలని యూట్యూబ్ కొత్త నియమాల్లో పేర్కొననుంది. వీడియో ఫుటేజీలో మార్పులు చేస్తున్నవారు, ఇతర పద్ధతుల్లో వాడుకుంటున్నవారు, రియల్ వాయిస్నుమర్చి సింథటిక్ వెర్షన్లను వినియోగిస్తున్నవారు తమ వీడియోలో లేబుల్‌ని చేర్చాల్సి ఉంటుంది. వీడియోలోని కంటెంట్ మార్పులు, ఫుటేజీ వివరాలు, సింథటిక్ అంశాలను పేర్కొంటూ విజువల్స్ రూపంలో లేదా వీడియో డిస్క్రిప్షన్ రూపంలో ఇవ్వాలి. లేదంటే వాయిస్ రూపంలో అయినా తెలియజేయాలి. ఇదీ చదవండి: బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా.. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే యూట్యూబ్ చర్యలు తీసుకోబుతున్నట్లు తెలిసింది. ఈ నిబంధనలు మొబైల్ యాప్, డెస్క్‌టాప్, టెలివిజన్ ఇంటర్ఫేస్ వినియోగదారులందరికీ వర్తింపజేయనుంది. వార్తలు, ఎన్నికలు, ఫైనాన్స్, ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు యూట్యూబ్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
YouTube: మీకు మీరే బాస్
ఒక్క వీడియో వైరల్‌గా మారినా.. లక్షలాది రూపాయలు వచ్చి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. యూజర్లు నచ్చే, మెచ్చే అలాంటి వీడియోలను మరిన్ని అందిస్తూ వెళితే మంచి పేరు, గుర్తింపు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఇదంతా యూట్యూబ్ ప్రపంచం గురించే. నేడు వయసుతో సంబంధం లేకుండా యూట్యూబర్ కావాలనే అభిలాష చాలామందిలో కనిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ ద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష కూడా కనిపిస్తోంది. కానీ ఎలా..? ఎలాంటి సందేహం వచి్చనా, ఆరోగ్యం లేదా ఆహారం, విద్య, వృత్తి, వినోదం, విహారం, యోగాభ్యాసం ఇలా అన్నింటికీ చిరునామాగా యూట్యూబ్ మారిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కళ్ల ముందుంచుతుంది. వీక్షకులకు కావాల్సినంత సమాచారం, వినోదం. పంచే వారికి పండంటి ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు 2023లో వారంలో 17 గంటల చొప్పున వీడియోలను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ మంది సమాచారాన్ని వీడియోల రూపంలోనే పొందుతున్నారు. కనుక యూట్యూబ్ వినోదం లేదా సమాచార వేదికగానే మిగిలిపోవడం లేదు. ఉపాధిని వెతుక్కునే అవకాశాలకు చిరునామాగా మారిపోయింది. ప్రతి నెలా రూ.లక్షలాది రూపాయలు సంపాదించే తెలుగు యూట్యూబర్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా చేరిపోవాలంటే..? ఏమి కావాలి..? ఎలాంటి పెట్టుబడి లేకుండా యూట్యూబ్ చానల్ ఆరంభించడం చాలా మందిని ఆకర్షిస్తున్న అంశం. ఓ మంచి ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో ఎడిటింగ్ టూల్ (ఉచిత), రూ.150 పెట్టుబడితో వచ్చే మైక్ ఉంటే చాలు. ఇక్కడ ధన పరమైన పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ప్రయత్నం, కృషి, అంకిత భావం వంటి వనరులు కావాలి. వీలైనంత సమయాన్ని వెచి్చంచాలి. ‘‘నేను నా కుటుంబంతో గడిపే దానికంటే పది రెట్లు అధిక సమయాన్ని యూట్యూబ్ కోసం ఆరంభంలో వెచ్చించాల్సి వచ్చేది. వీడియో చేయాలంటే అందుకు సంబంధించిన కంటెంట్ (సమాచారం) సిద్ధం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ అనంతరం పబ్లిష్ చేయాలి. ఇందుకు ఎంతో సమయం పట్టేది. ప్రతిరోజూ ఒక వీడియో అంటే అది అసాధ్యం. దీనికంటే వారానికి రెండు, మూడు వీడియోలకు కుదించుకోవడం మంచిది. ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం నిర్ధిష్ట సమయంలో వీడియోలను అప్లోడ్ చేయడం వల్ల యూజర్లకు మరింత చేరువ కావచ్చు’’అని యూట్యూబర్ రతీష్ (‘రతీష్‌ఆర్‌మీనన్’) తెలిపారు. వ్యక్తిగతంగా ఒక నెలలో 8 వీడియోలకు మించి చేయడానికి సమయం సరిపోదన్నది అతడి అభిప్రాయం. బాగా పాపులర్ అయి, సబ్ర్‌స్కయిబర్లు మిలియన్ దాటిపోతే, అప్పుడు సహాయకులను పెట్టుకుని పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మరిన్ని వీడియోలు చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ, ఆరంభంలో పరిమాణం కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేయాలి. యూజర్లతో బలమైన బాండింగ్ అవసరం. ఆరంభం ఇలా.. ► 18 ఏళ్లు నిండి, భారత్‌లో నివసించే స్థానికులు ఎవరైనా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో నమోదుకు అర్హులే. చానల్ ప్రారంభించి వీడియోల పోస్టింగ్ అనంతరం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ► వైపీపీలో చేరాలంటే కనీస చందాదారులను సంపాదించి ఉండాలి. ‘నోటిఫై మీ వెన్ ఐ యామ్ ఎలిజబుల్’ నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకుంటే చాలు. మీ చానల్‌కు అర్హత లభించిన వెంటనే యూబ్యూబ్ నుంచి ఆహా్వనం వస్తుంది. ► ఒక్కసారి మీ చానల్ వైపీపీ కోసం ఎంపిక అయిందంటే అప్పుడు నియమ, నిబంధనలకు అంగీకరిస్తూ, మానిటైజేషన్ ఫీచర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పని చేస్తుంది..? యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయాలంటే అందుకు సంబంధించి నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి. అశ్లీల, హానికారక, తప్పుదోవ పట్టించే, అవాస్తవ, కల్పిత సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. వీడియోలు పోస్ట్ చేసే విషయంలో పరిమితి లేదు. వాటిపై ఆదాయం కోరుకునేట్టు అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవాలి. యూట్యూబ్ చానల్‌కు ఎంత మంది సబ్‌్రస్కయిబర్లు (సభ్యులు) ఉన్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఒకరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ మాడ్యూల్ ఆధారంగా ఆర్జించే మొత్తం ఆధారపడి ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు యూట్యూబ్ మద్దతు పలుకుతుంది. సృజనాత్మకత ఎలా ఉన్నా సరే దాన్ని యూజర్లకు చేరువ చేసి వారికి తగిన ప్రతిఫలం అందించడమే మా లక్ష్యం. భారత్‌లో 2008లో పార్ట్నర్ (భాగస్వామి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీడియో క్రియేటర్లు కంటెంట్ ద్వారా ఆర్జించడం మొదలైంది. క్రియేటర్ల విజయంపైనే ప్రకటనల ఆదాయం ముడిపడి ఉంటుంది’’అని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ వివరించారు. చానల్ సక్సెస్ కోసం..? ఏదైనా ఒక రంగం/విభాగం/సబ్జెక్ట్/కళలో నైపుణ్యాలు ఉంటే, దాన్ని యూజర్లకు అందించొచ్చు. మంచి సృజనాత్మకత ఉండాలి. లేదా సాధారణ విషయాలను సైతం కళాత్మకంగా పంచుకునే నైపుణ్యాలు కావాలి. విలువైన, ఉపయోగకరమైన కంటెంట్‌తో వీడియోలు పోస్ట్ చేయడమే కాదు.. వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఛానల్ నుంచి కొత్త వీడియోలు ఎప్పుడు పోస్ట్ అవుతాయనే స్పష్టత యూజర్లలో ఉండాలి. రోజుకు ఒకటా? వారానికి ఒకటా లేదా రెండా..? ఏ సమయంలో వస్తుందనే స్పష్టత ఇవ్వాలి. వీడియోలను పోస్ట్ చేసిన తర్వాత వీక్షకులతో అనుసంధానం కావాలి. వీలైతే కామెంట్లను చదివి, వారి అభిప్రాయాలు అర్థం చేసుకోవడం, వారికి నచ్చేలా కంటెంట్‌ను అందించడంపై దృష్టి పెట్టాలి. వీలు చేసు కుని సబ్్రస్కయిబర్లతో చాట్, సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల బాండింగ్, బ్రాండింగ్ పెరుగుతుంది. అనలైసిస్ టూల్ వాడు కోవాలి. ఆరంభంలో ప్రయోగాలకు వెనుకాడకూడదు. సమయం చాలడం లేదని నాణ్యతలో రాజీపడకూడదు. మరింత మంది యూజర్లను చేరుకునేందుకు, అప్పటికే పాపులర్ అయిన యూట్యూబర్ల సాయం తీసుకోవచ్చు. యూజర్లను పెంచుకునే విషయంలో యూట్యూబ్ సైతం కావాల్సినంత సహకారం, మద్దతును అందిస్తుంది. యూజర్లకు చేరువ అయితే, ఆదాయం అదే వస్తుంది. ఆదాయం ఏ రూపంలో..? యూట్యూబ్‌లో కొత్తగా చేరిన వారు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. చానల్ సభ్యులు నెలవారీగా చెల్లించే మొత్తం నుంచి కొంత యూట్యూబ్ పంచుతుంది. సూపర్ చాట్, సూపర్ స్టికర్స్ కోసం సభ్యులు చెల్లింపులు చేస్తారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మన్దీప్ సింగ్ 2021లో ‘డేటాసైన్స్డైరీస్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచాడు. కృత్రిమ మేధకు సంబంధించి కంటెంట్‌ను ఇది అందిస్తుంటుంది. చందాదారులు కేవలం 1,500 మందే ఉన్నారు. దీంతో ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా కొన్ని వేల రూపాయల చొప్పున ఆదాయం సంపాదించే వాడు. అదే ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ రతీష్ ఆర్ మీనన్ ‘రతీష్‌ఆర్‌మీనన్’ పేరుతో 2012 నుంచి చానల్ నడుపుతుండగా, ప్రస్తుతం చందాదారులు 11.2 లక్షలకు చేరుకున్నారు. మూడు మార్గాల ద్వారా అతడికి ఆదాయం వస్తోంది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంతోపాటు, స్పాన్సర్డ్ ప్రకటనలు, అఫిలియేట్ మార్కెటింగ్ కమీషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఒక్కటే నేరుగా యూట్యూబ్ నుంచి వచ్చేది. మిగిలిన రెండూ థర్డ్ పారీ్టల రూపంలో వస్తుంది. స్పాన్సర్డ్ ప్రకటనలకు సంబంధించి కంపెనీలు, బ్రాండ్లతో నేరుగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చు. ఇక అఫిలియేట్ మార్కెటింగ్ అంటే.. చానల్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం. ఉదాహరణకుఒక ఉత్పత్తికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను వీడియో డి్రస్కిప్షన్లో ఉంచడం. ఎవరైనా యూజర్ ఆ లింక్‌ను క్లిక్ చేసి, సంబంధిత ఉత్పత్తి కొనుగోలు చేస్తే, దానిపై 2–5 శాతం కమీషన్‌గా లభిస్తుంది. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లో తనకు వచ్చే ఆదాయం నుంచి 70 శాతాన్ని యూట్యూబ్ చెల్లిస్తుంది. షార్ట్‌లకు సంబంధించి వ్యూస్ ఆధారంగా (ఎంత మంది వీక్షించారు) ఆదాయంలో 45 శాతాన్ని చెల్లిస్తుంది. వీడియోల్లో ప్రదర్శించే ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో 55 శాతాన్ని చెల్లిస్తుంది. యూట్యూబ్‌కు ప్రీమియం మెంబర్షిప్ ద్వారా కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయంలోనూ కొంత వాటాను.. ఛానల్ కంటెంట్‌ను ఏ మేరకు యూజర్లు చూశారనే దాని ఆధారంగా యూట్యూబర్‌కు పంచుతుంది. రెగ్యులర్ ఆదాయానికి ప్రత్యామ్నాయమా..? తమ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్త వీక్షకులు యూట్యూబ్ వల్లే సాధ్యమైనట్టు మెజారిటీ యూట్యూబర్లు అంగీకరిస్తున్నారు. కంటెంట్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం లభించినట్టు 80 శాతం మంది చెబుతున్నారు. ఇతర వృత్తి, ఉద్యోగాన్ని విడిచి పెట్టేసి యూట్యూబ్‌ను ప్రధాన ఆదాయ మార్గంగా చేసుకుందామని అనుకుంటున్నారా..? ఆచరణలో అదంత సులభమైన పని కాదు. యూట్యూబ్ ప్రపంచంలో ప్యాసివ్ ఆదాయం కోసం (రెండో ఆదాయ మార్గం) చానళ్లను నడిపిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తమ కంటెంట్‌కు ఆదరణ వస్తూ, ఆదాయం పెరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో యూట్యూబర్‌గా మారుతున్నారు. కనుక ప్రస్తుతం చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం లేదా జాబ్ కొనసాగిస్తూనే.. తమకున్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా యూట్యూబ్ ఛానల్‌ను ఆరంభించి, ఖాళీ సమయాన్ని కంటెంట్ క్రియేషన్‌పై వెచి్చంచడం మంచి ఆలోచన అవుతుంది. యూజర్లను ఎలా ఆకర్షించాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి? తదితర విషయాలన్నీ తెలియడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. కనుక అప్పటి వరకు ఇతర ఆదాయ మార్గాలను ఎందుకు కాదనుకోవాలి. ఒకవైపు వృత్తి లేదా ఉద్యోగం చేస్తూ, మరోవైపు యూట్యూబ్ వీడియోల కోసం కావాల్సినంత సమయాన్ని వెచి్చంచడం కూడా కష్టమైన టాస్కే. అందుకే ఆరంభంలో కాస్తంత సమతుల్యం చేసుకుని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. సమయాన్ని పొదుపుగా వినియోగించుకున్న వారికే ఇది సాధ్యపడుతుంది. అసలు వీలు చేసుకోవడమే పెద్ద సమస్య అని కార్పొరేట్ ట్రైనర్ అయిన నిధి సైని పేర్కొన్నారు. ‘నిధిసైని2808’ పేరుతో ఆమె 2020లో యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. 2,690 మంది యూజర్లే ఉన్నారు. అయినా కానీ తన చానల్‌ను మానిటైజ్ (ఆదాయం పొందడం) చేసుకోలేదు. కంటెంట్‌ను అందించేందుకు తగినంత సమయాన్ని వెచి్చంచలేనన్నది ఆమె అభిప్రాయం. కనీసం 1,000 మంది సబ్ర్‌స్కయిబర్లు, 4,000 గంటల వాచ్ అవర్స్ (గడిచిన ఏడాది కాలంలో) ఉంటే ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడినట్టేనని రతీష్ అంటున్నారు. యూట్యూబ్ ప్రపంచంలో స్వల్ప మొత్తాన్ని ఆర్జించే వారే ఎక్కువ. యూట్యూబ్‌నే ప్రధాన వృత్తిగా మలుచుకుని, కావాల్సినంత ఆదాయం సంపాదించే వారు తక్కువ. యూట్యూబ్ ఛానల్ ఆరంభించి వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే ఆదాయం మొదలు కాదు. ఎంత మంది చూశారు? ఎన్ని గంటల పాటు చూశారు? తదితర పారామీటర్ల ఆధారంగా ఆదాయం మొదలు కావడానికి సమయం తీసుకోవచ్చు. రతీష్‌ఆర్‌మీనన్ 2011లో చానల్ ప్రారంభించగా, నెల రోజుల్లోనే అతడికి ఆదాయం రావడం మొదలైంది. కాకపోతే అప్పట్లో నిబంధనలు ఇప్పటి మాదిరి కఠినంగా లేవు. 2014లో తన చానల్‌ను రీబ్రాండింగ్ చేసుకోగా, ఏడాదిన్నర క్రితమే ఒక మిలియన్ సబ్స్క్రయిబర్ల మార్క్ దాటింది. టెక్ వీడియోలు అప్లోడ్ చేసే రతీష్, ట్రావెల్ వీడియోలను కూడా పోస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఒక వీడియోకి 20,000 వీక్షణలు ఉంటే, టెక్ క్రియేటర్లకు నెలవారీ 500 డాలర్ల వరకు ఆదాయం (రూ.41,000) ప్రకటనల రూపంలో వస్తుందని చెప్పారు. అదే ఎంటర్టైన్మెంట్ చానల్ అయి, ఒక మిలియన్ వ్యూస్ ఉంటే నెలవారీ ఆదాయం రూ.2–3 లక్షల మధ్య ఉంటుందట. ఏమిటి మార్గం..? చానల్‌పై ఎంత సమయం వెచి్చంచగలరనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు తెలుసుకోవాలి. మరిన్ని వీడియోలు అందించే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించొచ్చు. కానీ, దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకోవడానికి ఎంతో సహనం, సమయం కావాలి. పెట్టిన చానల్, పోస్ట్ చేసే వీడియోలు ఆదరణ సంపాదించలేకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే, అప్పుడు ప్లాన్ బీ కూడా ఉండాలి. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపివేసిన వెంటనే, ఆదాయ మార్గం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ వ్యాపారస్థులు కస్టమర్లను చేరుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లను వినియోగించుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలతో కస్టమర్లకు చేరువ అవుతున్నారు. సంగీతం, ఇతర కళల్లో పట్టున్న వారు యూట్యూబ్ చానళ్లు తెరిచి యూట్యూబ్ సాయంతో అభిమానులను పెంచుకుంటున్నారు. ఫలానా అనే కాకుండా, ప్రస్తుత మీ ఉపాధి, వృత్తి నైపుణ్యాలను విస్తరించుకునేందుకు సైతం యూట్యూబ్‌ను వేదికగా చేసుకోవచ్చు. -
అన్నం కూడా తిననియలే.. నాకు చాలా బాధగా ఉంది: ప్రశాంత్
ఈ ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచారు. విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్‌కు అతని అభిమానులు ఘనస్వాగతం పలికారు. అదేక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలివచ్చిన కొందరు ఫ్యాన్స్ శృతిమించి అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే ఏకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్‌పై కార్లపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ట్రోఫీ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన సొంత ఊర్లో అడుగుపెట్టారు. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచిన ప్రశాంత్‌కు ఘనస్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్‌పై పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'అన్న నేను మళ్లా వచ్చినా. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికింది. అన్నా.. మీడియా మిత్రులు మీరే చూసిర్రు. ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిర్రా అన్న సంతోషంలో ఉన్నా. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామంటే నీరు నెగెటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు 60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చిర్రు. నా కోసం వచ్చిన వారందరికీ ఫోటోలు, వీడియోలు ఇచ్చినా. నేను అన్నం కూడా తినలే. అయినా కొంతమంది మీడియా మిత్రులు వచ్చి.. అన్నా 5 నిమిషాలు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంటపడ్డారు. నేను కూడా మనిషినే కదా అన్నా. నా వల్ల అయితలేదు అని చెప్పినా వినరా అన్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక చాలామంది ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించారు. -
దాడికి కారణమేంటి?
మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్పదమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడేవాడని స్థానికులు చెప్తున్నారు. కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నారు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమిటన్నది అంతుపట్టడం లేదని అంటున్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. -
అవధుల్లేని ఆనందం
డబ్బుల సంగతేమో కానీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 114 మిలియన్ల యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. అంటే 11 కోట్లకు పైగానే. ఈ విశ్వంలోని సుమారు 800 కోట్ల జనాభాలో సగటున ప్రతి 72 మందికి ఒక చానల్ అన్నమాట. ఇటీవల విడుదలైన రజినీకాంత్ సినిమా ‘జైలర్’లో రజినీ ఐదేళ్ల మనవడు రుత్విక్ కూడా ఓ చానల్ నడుపుతుంటాడు. వీడియో చిత్రీకరణకు తాత రజినీ సాయం తీసుకుంటుంటాడు. ‘ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసెయ్..’ అని తాత సలహా ఇస్తే.. ‘బాగోలేని వీడియోలకు సంబంధించి కామెంట్స్‌లో జనం ఎలా గడ్డి పెడతారో చూడు’ అని సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు తమ గురించి, తమకు తెలిసింది ప్రజలకు తెలియజేసి, వారి మెప్పు పొందాలని ఉబలాట పడుతుండటం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలా నిర్ణయించుకున్న మరుక్షణమే యూ ట్యూబ్ చానల్ పెట్టేస్తున్నారు. ఇలా ఆవిర్భవించిన చానళ్ల ద్వారా వంటింట్లో వంటలు మొదలు రాకెట్ తయారీ వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇట్టే సమాధానం దొరుకుతోంది. ఏ చానల్‌కు సంబంధించిన వీడియోను ఎంత ఎక్కువ మంది చూస్తారో ఆ చానల్ పెట్టిన వాళ్లకు అంతగా డబ్బులొస్తాయి. ఇదంతా ఎవరు ఏ అంశానికి అత్యంత ప్రభావితమవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో మన ఇండియన్స్, ప్రత్యేకించి పలువురు తెలుగు యూ ట్యూబర్స్ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చానళ్లు, వీడియోలు వీక్షిస్తున్న వారి అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఆశ్చర్యంగొలుపుతున్నాయి. – వీఏవీ రంగాచార్యులు, ఏపీ సెంట్రల్ డెస్క్ కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి.. కొందరేమో లక్షలు, కోట్లకు పడగలెత్తుతుంటే మరికొందరు మాత్రం నెలలు, ఏళ్ల తరబడి కష్టపడుతున్నా, కనీసం మానిటైజేషన్‌కు నోచుకోవడం లేదు. ఎలాగోలా మానిటైజేషన్ అయినా వారు అప్లోడ్ చేసే వీడియోలు వైరల్ కావడం లేదంటూ వాపోతుంటారు. ఇందుకు వారు యూ ట్యూబ్ ఆల్గారిథమ్ ఫాలో కాకపోవడమే. ఏ తరహా కంటెంట్‌ను జనం కోరుకుంటున్నారనేది గమనించి.. వీడియోలు రూపొందించుకోవాలి. ఒక్కోసారి సీరియస్ అంశాలు సైతం వైరల్ అవుతుంటాయి. అయితే అది ప్రజల అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు స్పోకెన్ ఇంగ్లిష్‌కు సంబంధించి మన తెలుగు కుర్రాడు స్టార్ట్ చేసిన ‘వశిష్ట 360’ చానల్ విశేష ఆదరణ పొందింది. ఆ వీడియోల ఆధారంగా ప్రచురించిన పుస్తకాల ద్వారా అతను కోట్లాది రూపాయలు ఆర్జించాడు. వరల్డ్ నంబర్ వన్ మిస్టర్ బీస్ట్ అనే యువకుడు (అసలు పేరు జిమ్మి డొనాల్డ్సన్) తన 13వ ఏట చానల్ స్టార్ట్ చేశాడు. మొదట్లో ‘ఐ పుట్ 100 మిలియన్ ఆర్బీజ్ ఇన్ మై ఫ్రెండ్స్ బ్యాక్ యార్డ్’ అనే వీడియోకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రతి వీడియోకు సగటున 150 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సముద్రంలో ఒంటరిగా ఏడు రోజులు గడపడం, షోల రీ క్రియేషన్, ఒక డాలర్ నుంచి ఒక మిలియన్ డాలర్స్ వరకు హోటల్ గదులు.. ఇలా ప్రతి వీడియో కొత్తదనంతో, విచిత్రంగా ఉండటం విశేషం. ఉదాహరణకు.. పేద్ద మాల్‌లోకి వెళ్లి.. 15 నిమిషాల్లో ఎవరేం కావాలన్నా కొనుక్కుని బిల్లింగ్ కోసం లైన్లో నిలుచుంటే ఆ బిల్లు తానే చెల్లిస్తానని చెప్పడం.. నిజంగానే చెల్లించడం. ఇతడి ప్రతి వీడియో రియాలిటీతో స్ట్రెయిట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్తుంది. ఎక్కడా సుత్తి ఉండదు. ఒక్కో వీడియో షూటింగ్‌కు వారం పది రోజులు కష్టపడినా, తుదకు ఆ వీడియో నిడివి కేవలం 15–20 నిమిషాలే ఉంటుంది. ఇతను తన వీడియోల ద్వారా వచ్చే మొత్తంలో చాలా వరకు పేద ప్రజల కోసమే వెచ్చిస్తాడు. పాతికేళ్ల ఈ యువకుడు గత ఏడాది యూ ట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఏకంగా 82 మిలియన్ డాలర్లు సంపాదించారు. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.700 కోట్లు పైమాటే. అంటే రోజుకు దాదాపు రూ.2 కోట్లు. ఫోర్బ్స్ 2023 టాప్ క్రియేటర్స్ ఇన్ వరల్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అభిరుచుల్లో మార్పు ♦ ప్రపంచాన్ని అన్వేషించడం అనేది ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం చాలా మంది సామాజిక మాధ్యమాలను ఫాలోఅవుతున్నారు. ♦ ఈ విషయంలో ఇప్పటిదాకా యూ ట్యూబ్ అతిపెద్ద ఫ్లాట్‌ఫాం. ఈ స్థానాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆక్రమించేస్తోంది. యువతరం అంతా ఇన్స్టాలోనే మునిగి తేలుతోంది. ♦ 40–50 శాతం యువత స్క్రీన్ టైమ్ సగటున రోజూ 4 నుంచి 10 గంటలు ఉంటోంది. ఇంత సమయం స్క్రీన్ కోసం కేటాయించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది న్యూరో, కంటి, మానసిక సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ♦ యువ దంపతుల దాంపత్య జీవితంలోనూ ఇది చిచ్చు రేపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నెగెటివ్ అంశాల పట్ల మనసు మళ్లడం సహజమే అయినా అస్తమానం అదే అలవాటుగా మారి అనుకరించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ♦ ఇలా విద్యార్థుల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పాఠ్యాంశాల పట్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతోంది. ♦ఈ సమస్యలన్నింటికీ స్వీయ నియంత్రణే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అది డోపమైన్ ఎఫెక్ట్ జనరేషన్, జనరేషన్‌కు ప్రజల అభిప్రాయాలు, అభిరుచులు మారుతుంటాయి. ఇందుకు సహజంగా 15 ఏళ్లు పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో టెక్నాలజీలో మార్పుల∙ప్రభావం వల్ల రెండేళ్లలోనే అభిరుచులు మారిపోతున్నాయి. ఇదివరకు బాగా కష్టపడే వాళ్లు మాత్రమే డబ్బు సంపాదించే వారు. మనం ఇన్నాళ్లు చెత్తా, చెదారం అనుకున్న కంటెంట్‌తో కూడా రూ.లక్షలు, కోట్లు సంపాదించేస్తున్నారు. యాలకలు, లవంగాలు అంటూ చేస్తున్న వీడియోలకు కూడా లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. ఇదంతా ‘హ్యాపీనెస్’ అనే సూత్రం. ఉదాహరణకు ఒక రోజంతా కష్టపడి ఒక పుస్తకం చదివితే ఎంత ఆనందం వస్తుందో.. ఒక నిమిషం పాటి రీల్/షాట్ చూస్తే అంతే ఆనందం వస్తుంది. కొన్ని పిచ్చి పనులను చూసినప్పుడు కూడా కొందరి మనసు అలానే స్పందించి డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటర్ హార్మోన్ రిలీజ్ అవుతోంది. ఈ తరహా డోపమైన్‌కు జనం అలవాటు పడిపోయారు. – విశేష్ , సైకాలజిస్ట్ -
దేశంలో యూట్యూబ్ తోపులు వీళ్లే!
యూట్యూబ్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యాబ్‌ను వీక్షిస్తున్నారు. భారతదేశంలోనూ కోట్ల మంది యూట్యూబ్ వీక్షకులు ఉన్నారు. ఇందుకు తగినట్లే యూట్యూబర్లు, యూట్యాబ్ ఛానళ్లు సైతం ఇటీవల పెద్ద సంఖ్యలో పెరిగాయి. యూజర్లు కంటెంట్‌ని వినియోగించే విధానంలో యూట్యాబ్ విప్లవాత్మక మార్పులు చేసింది. దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్ కొత్త తరం డిజిటల్ సెలబ్రిటీలకు జన్మనిచ్చింది. కామెడీ స్కెచ్‌ల నుంచి టెక్నికల్ రివ్యూల వరకు దేశంలోని ఈ టాప్ యూట్యూబర్లు దూసుకుపోతున్నారు. 2008లో భారతదేశంలో యూట్యూబ్ అరంగేట్రం కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలకే పరిమితమైన యూట్యూబ్ అనతి కాలంలోనే దేశంలోని యూట్యూబర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అతిపెద్ద వేదికగా మారింది. వర్ధమాన చిత్రనిర్మాతల నుంచి గృహిణుల వరకు యూట్యూబ్ కోట్లాది మంది గొంతుగా మారింది. 2023లో దాదాపు 467 మిలియన్ల మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లను దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని టాప్ 10 యూట్యూబర్లు భారతదేశంలో డిజిటల్ సూపర్స్టార్లు ఈ టాప్ 10 యూట్యూబర్లు. యూట్యూబ్‌లో యూజర్లను పెంచుకోవడం మామూలు విషయం కాదు. యూట్యూబ్ అల్గారిథంను అవపోసన పట్టి యూజర్ల నాడిని తెలుసుకుని అందుకు తగిన కంటెంట్‌ను క్రియేట్ చేసే వాళ్లే ఇక్కడ టాప్‌లో నిలుస్తారు. అలా యూజర్లపరంగా టాప్ 10లో ఉన్న యూట్యాబర్లు, వారి చానళ్లు, ఏ రకమైన కంటెంట్ అందిస్తున్నారో తెలుసుకుందాం.. క్యారీమినాటి, 39.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, రోస్టింగ్, కామెడీ కంటెంట్ టోటల్ గేమింగ్, 35.7 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ టెక్నో గేమర్స్, 34.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్, 32.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, లైఫ్ హ్యాక్స్, ప్రయోగాలు రౌండ్2హెల్, 30.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు ఆశిష్ చంచలానీ, 29.8 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు, వ్లాగ్‌లు సందీప్ మహేశ్వరి, 27.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, మోటివేషనల్ స్పీకింగ్ బీబీకి వైన్స్, 26.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం అమిత్ భదానా, 24.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం టెక్నికల్ గురూజీ, 23.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, టెక్నాలజీ రివ్యూస్ -
రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొద్దిరోజుల క్రితం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసింది. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: 'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్) ఈ సందర్భంగా తను శిష్యులు అయినటువంటి శేఖర్ మాస్టర్‌తో పాటు సత్య మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. రాకేష్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మరణం తర్వాత శేఖర్ మాస్టర్ తొలిసారి ఇలా గుర్తుచేసుకున్నారు. 'నేను, సత్య ఇద్దరం విజయవాడలో డ్యాన్స్‌కు సంబంధించి బేసిక్స్ వరకు నేర్చుకున్నాం. డ్యాన్స్ అంటే మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాం. మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు రాకేష్మాస్టర్ ఆశ్రయం కల్పించి, డ్యాన్స్ నేర్పించారు. రాకేశ్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. మాది 8 ఏళ్ల అనుబంధం. మీరు యూట్యూబ్‌లో ఆయన డ్యాన్స్‌ను చూసింది 5 శాతమే. ఆయనకు ఉన్న టాలెంట్ చాలామందికి తెలియదు. మొదట్లో నేను ప్రభుదేవా మాస్టర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాకేశ్ మాస్టర్ని అభిమానించడం ప్రారంభించా. ఆయన మా గురవు అని చెప్పుకుంనేందకు ఎప్పటికీ గర్వంగానే ఫీలవుతాము. ఆ రోజుల్లో డ్యాన్స్ తప్పా మాకు మరో ప్రపంచం లేదు. అప్పట్లో ఆయన పెళ్లి కూడా మేమే చేశాం. ఎప్పుడూ రాకేశ్ మాస్టర్ దగ్గరే ఉండేవాళ్లం. ఆయన ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వాళ్లం, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతలా ఆయనతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టి ఏదేదో రాసేస్తున్నారు. దయచేసి మీకు వాస్తవాలు తెలిస్తేనే రాయండి. లేదంటే రాయకండి. ప్లీజ్.. ఇకనైనా ఆపేయండి' అని శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) -
రూ.120 కోసం యువతి కక్కుర్తి.. రూ.7.23 లక్షలు మాయం!
ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేలా పని చేయడంలో తప్పులేదు. కానీ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం ఫోన్‌కాల్, మెసేజ్‌లతో ఆమాయకులకు ‘ఆశ’ చూపిస్తూ అందిన కాడికి దోచేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఓ యువతి పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మేడం మీరు ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఈ సువర్ణావకం మీకోసమే. మేం చెప్పిన పని మీరు చేస్తే కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకు మీరు ఇంట్లోకూర్చొని యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే. అలా చేస్తే డబ్బు సంపాదించవచ్చు’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో ఆ యువతి తనకు వచ్చిన పార్ట్‌టైమ్ జాబ్ మెసేజ్‌కు సంతోష పడింది. సైబర్ కేటుగాళ్లు పంపిన రెండు యూట్యూబ్ ఛానల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. అందుకు గాను సైబర్ నేరస్తులు ఆమెకు రూ.120 పంపారు. ఆ సంతోషం రెట్టింపైంది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువ లేదు. స్కామర్లు తెలివిగా ఆమె సబ్‌స్క్రైబ్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల స్క్రీన్షాట్లను పంపమని అడిగారు. అనంతరం 'జాబ్ కోడ్' కూడా పంపారు. ఆ కోడ్‌ను టెలిగ్రామ్ అకౌంట్ పంపమని కోరారు. పైన పేర్కొన్న టెలిగ్రామ్ ఖాతాకు ఆమె జాబ్ కోడ్‌ను పంపిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ యువతి బ్యాంకు వివరాలను సేకరించారు. వాళ్లు వివరాలు అడిగారని వెనకముందా అలోచించకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, జాబ్ కోడ్ పంపడంతో నిందితులు పని మొదలు పెట్టారు. ముందుగా ఆమె నమ్మేలా పార్ట్‌టైమ్ జాబ్ చేసినందుకు రెండు రోజుల వ్యవధిలో పలు మార్లు ఆమె అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. నమ్మకం కుదిరాక అమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.7,23,889 మొత్తాన్ని నాలుగు వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బుల్ని మాయం చేశారు. పాపం తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సురక్షితంగా ఉండడం ఎలా? ఇటువంటి మోసాల నుండి సురక్షితంగా ఉండేలా లింక్డ్న్, నౌకరీ, ఇండీడ్ మొదలైన గుర్తింపు పొందిన పోర్టల్స్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో మీకు జాబ్ ఆఫర్ చేస్తే సదరు వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి పేరు, వారి కంపెనీ పేరు మొదలైన వివరాలను అడగాలి. ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి ఆన్లైన్లో సమాచారం సేకరించండి. అలాగే, పేరు, ఫోన్ నంబర్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపడం, లేదంటే బ్యాంక్ వివరాలను షేర్ చేయడం వంటివి చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..
సోషల్ మీడియా ఈ రోజు ప్రపంచాన్ని ఏలేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటితో ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. ఆలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన 'జిమ్మీ డొనాల్డ్సన్'. ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్‌గా ప్రసిద్ధి చెందిన 'జిమ్మీ డొనాల్డ్సన్' యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి. ప్రస్తుతం తన ఛానెల్‌కి 139 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్ కలిగి ఉన్నారు. ఎంతో ఆసక్తికరమైన కంటెంట్స్ సృష్టించడంలో ఆరితేరిన మిస్టర్ బీస్ట్ అద్భుతమైన విన్యాసాలు, ఛాలెంజ్‌లు, విరాళాలను అందించడం ద్వారా బాగా పేమస్ అయ్యాడు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న యువకులలో డొనాల్డ్సన్ కూడా ఒకరు కావడం గమనార్హం. 2021లో అతడు ఏకంగా 54 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు తెలిసింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 400 కోట్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!) 1998 మే 1న నార్త్ కరోలినాలోని గ్రీన్విల్లేలో జన్మించిన జిమ్మీ డొనాల్డ్సన్ 2012లో మిస్టర్ బీస్ట్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. గేమింగ్, కామెంటరీ వంటి వాటితో మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను ఎంతగానో ఆకట్టుకునే స్టంట్స్ మొదలైనవి ప్రారభించి ఎక్కువమందిని ఆకర్శించాడు. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ చాలా వేగంగా లెక్కకు మించిన సబ్స్క్రైబర్స్ పొందగలిగింది. అయితే ఇతని ఛానెల్ కోసం కొన్ని సంస్థలు బిలియన్ డాలర్లను ఆఫర్ చేసినప్పటికీ వాటన్నింటిని తిరస్కరించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికి కూడా అతడు సొంతంగానే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. (ఇదీ చదవండి: మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!) బిలియన్ డాలర్ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మిస్టర్ బెస్ట్ అత్యంత విజయవంతమైన కంటెంట్ సృష్టికర్తలలో ఒకరుగా కొనసాగుతున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్స్ జాబితాలో డొనాల్డ్సన్ 40వ స్థానం పొందాడు. -
యూట్యూబర్లూ బీ కేర్‌పుల్: నటుడికి, ఆయన భార్యకు సెబీ షాక్
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్ , స్టాక్ సంబంధిత అంశాలపై తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్న యూ ట్యూబర్లకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాకిచ్చింది. సోషల్ మీడియా ద్వారా మార్కెట్ మానిప్యులేషన్‌కు పా ల్పడుతున్న సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లతో సహా, 31 యూట్యూబర్లను గురువారం బ్యాన్ చేసింది. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ చర్య తీసుకుంది. అమాయక పెట్టుబడిదారులను మోసంచేస్తూ యూట్యూబర్లు కుమ్మక్కయ్యారని మండిపడింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను మానిప్యులేట్ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టిని కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ పేర్కొంది. అంతేకాదు ఆయా సంస్థలనుంచి రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను రెగ్యులేటర్ స్వాధీనం చేసుకుంది. షేర్ పంప్ అండ్ డంప్ స్కీమ్‌లో అర్షద్‌తో సహా 45 మంది యూట్యూబర్లను సెబీ దోషులుగా గుర్తించింది. నిందితుడు అర్షద్ వార్సీతో సహా చాలా మంది యూట్యూబర్లు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా వారి వాల్యూమ్‌ను పెంచుతున్నారని తద్వారా ప్రతి నెలా రూ.75 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెబీ తెలిపింది. యూట్యూబ్ క్రియేటర్లతో కలిసి స్టాక్లను షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ షేర్ల మానిప్యులేషన్స్‌కు పాల్పడుతున్నారంటూ 24 ఎంటిటీలను కూడా స్టాక్ మార్కెట్ నుండి సెబీ నిషేధించింది. షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ స్క్రిప్‌లో ఏప్రిల్ నుండి ఆగస్టు 2022 వరకు తప్పుడు వాల్యూమ్లకు దారితీసిందనీ, దీంతో కొంతమంది వాటాదారులు భారీ లాభాలను బుక్ చేసుకున్నారని , ఇది ట్రేడ్ ప్రాక్టీస్ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది. సాధనా బ్రాడ్‌కాస్ట్‌కి సంబంధించి ఏప్రిల్ 27, 2022 నుండి సెప్టెంబర్ 30, 2022, షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ ఏప్రిల్ 12, 2022 నుండి ఆగస్టు 19, 2022 మధ్య లావాదేవీలను సెబీ విచారించింది. సెబీ తన రెండు మధ్యంతర ఉత్తర్వుల్లో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నేరస్తులందరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానైనా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయకుండా నిరోధించింది. అలాగే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లలో వారు ఏదైనా ఓపెన్ పొజిషన్లు ఉంటే ఈ ఆర్డర్ తేదీ నుండి లేదా అటువంటి కాంట్రాక్టుల గడువు ముగిసే మూడు నెలలలోపు, ఏది ముందుగా అయితే, అటువంటి పొజిషన్లను మూసివేయవచ్చు/స్క్వేర్ ఆఫ్ చేయాలని కూడా ఆదేశించింది. కాగా సెబీ చాలా కాలంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించేందుకు సిద్దమవుతోంది. రెండేళ్ల క్రితమే ఈ విషయంలో నిబంధనల రూపకల్పన కసరత్తు మొదలైంది. -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
నరేష్ మూడో భార్యపై ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది. యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. -
నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది?
మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. జపాన్‌లో మంచి ఆదరణ ఉన్న వీట్యూబింగ్ (వర్చువల్ యూట్యూబ్ స్టార్స్) మన దేశంలోకి ప్రవేశించింది. పాపులర్ కావడానికి రెడీగా ఉంది... వెండిరంగు జుట్టు, వెరైటీ కళ్లద్దాలతో ఆకట్టుకునే జాక్నిఎక్స్ తన యూట్యూబ్ చానల్లో పాపులర్ వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. జాక్నిఎక్స్కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతడి ఆటను, మాటను అమితంగా ఇష్టపడుతుంటారు. నిజానికి జాక్నిఎక్స్ నిజం కాదు. దక్షిణాదికి చెందిక ఒక స్టూడెంట్ సృష్టించిన డిజిటల్ అవతార్! మన దేశంలో 90కి పైగా వీట్యూబ్ అవతార్స్ ఉన్నాయి. సాధారణంగా వీట్యూబ్ అవతార్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ ఫీచర్స్‌తో కనిపిస్తుంటాయి. ‘వీట్యూబింగ్’ అనేది 2016లో జపాన్‌కు పరిచయమైంది. స్ట్రీమ్గేమ్స్, ఇంటర్నెట్ ట్రెండ్స్, మ్యూజిక్, ఆర్ట్...ఇలా రకరకాల విభాగాల్లో వీట్యూబ్ అవతార్స్ వీక్షకులను వినోదపరుస్తున్నాయి. ‘వీట్యూబర్స్’ అనే పదం జపాన్‌లోనే పుట్టింది. రికు తజుమితో జపాన్‌లో ‘వీట్యూబర్స్’ ట్రెండ్ అగ్రస్థాయికి చేరుకుంది. 26 సంవత్సరాల రికు తజుమి జపాన్‌లోని యంగెస్ట్ బిలియనీర్లలో ఒకరు కావడానికి కారణం ‘ఎనీ కలర్’ అనే స్టార్టప్. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే 21 సంవత్సరాల వయసులో ఇచికర (శూన్యం నుంచి) అనే ఎంటర్టైన్మెంట్ స్టార్టప్‌ను మొదలు పెట్టాడు రికు. ఆ తరువాత దీని పేరును ‘ఎనీ కలర్’గా మార్చాడు. వీట్యూబర్స్ ప్రపంచంలో ‘ఎనీ కలర్’ అగ్రస్థానంలోకి దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘ఏ న్యూ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్’ అనే నినాదంతో నిజజీవితానికి చెందిన వందమంది వర్చువల్ క్యారెక్టర్స్‌ను ఇది సృష్టించింది. యూజర్స్, క్రియేటర్స్‌కు మధ్య సరిహద్దులు లేకుండా చేయడమే తన విధానం అని చెబుతోంది. ఎన్నో వీట్యూబర్స్ ఏజెన్సీలకు ‘ఎనీ కలర్’ మాతృసంస్థగా ఉంది. ‘కోవిడ్ సమయంలో మన దేశంలో ఊపందుకున్న వర్చువల్ యూట్యూబర్ ధోరణి మెయిన్‌స్ట్రీమ్ పాపులారిటీకి దగ్గరలో ఉంది’ అంటున్నాడు వీట్యూబర్ టాలెంట్ ఏజెన్సీ ‘ప్రాజెక్ట్ స్టార్‌స్కేప్’ ఫౌండర్ వేణు జీ జోషి. ‘వీట్యూబింగ్ అనేది ప్రైవసీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖం బాగాలేదు, మీ గొంతు బాగలేదు... వంటి విషపూరితమైన ట్రోలింగ్ నుంచి బయటపడవచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఏమో అనే సంశయం లేకుండా ధైర్యంగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు’ అంటుంది అసలు పేరే ఏమిటో తెలియని దిల్లీకి చెందిన వర్చువల్ అవతార్ సకుర. వర్చువల్ అవతార్స్ పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అవతార్ పరిచయం ఇలా ఉంటుంది: ‘రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఈ బాలికకు అపారమైన మాంత్రిక శక్తులు ఉన్నాయి’ చాలామంది మోడల్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తుండగా కొందరు మాత్రం పురాణాలలోని చిత్ర విచిత్ర పాత్రలను ఎంచుకుంటున్నారు. 19 సంవత్సరాల వీట్యూబర్ ‘మియో’ సగం మనిషి, సగం భూతంతో కూడిన అవతార్‌ను సృష్టించుకుంది. కొందరు తమ అవతార్లకు తామే గొంతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం గొంతులో వైవిధ్యం కోసం వాయిస్ మాడ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్ వీట్యూబ్ కమ్యూనిటీస్ కోసం రెడిట్‌లో ప్రత్యేకమైన పేజీ నిర్వహిస్తున్న హర్ష్ ‘వీట్యూబర్స్’కు వీరాభిమాని. ‘వీట్యూబర్ను చూస్తే స్నేహితుడిని చూసినట్లుగానే ఉంటుంది. వారి షోలో భాగమైతే రియాలిటీ షోలో భాగమైనట్లు అనిపిస్తుంది’ అంటున్నాడు హర్ష్. అభిమానం, విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్ వీట్యూబర్స్ కోసం ‘వర్చువలిజం’లాంటి కంపెనీలు వచ్చాయి. వీట్యూబర్గా మారాలని, తమను తాము నిరూపించుకోవాలనే ఆసక్తి యూత్‌లో పెరిగింది. ఇదీ చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’ -
యూట్యూబ్ క్రియేటర్స్‌కి బంపర్ ఆఫర్
-
8 యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్ చేసిన ఐటీశాఖ
-
కేంద్రం సీరియస్.. యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్తాన్‌కు చెందినది. ఇదిలా ఉండగా.. కేంద్రం అంతకు ముందు కూడా 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్‌ను బ్లాక్ చేసింది. ఇక, గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది. ఇక, ఈ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్.. దాదాపు 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. .@MIB_India blocks 8 YouTube channels for spreading disinformation related to India’s national security, foreign relations and public order, 7 Indian and 1 Pakistan based YouTube news channels blocked under IT Rules, 2021#YouTube #channels#blocked #MIB pic.twitter.com/rHVSHTX2Ou — BIKASH KUMAR ROUTRAY (@Bikash_Media) August 18, 2022 ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం -
అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు
-
94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం
న్యూఢిల్లీ: 2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్‌కు సంబంధించి వ్యాపింపజేసే తప్పుడు సమాచారాన్ని కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ కోవిడ్‌కు సంబంధించిన, చర్యలు తీసుకోదగ్గ 34,125 ప్రశ్నలకు స్పందించిందన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో నకిలీ వార్తలకు సంబంధించిన 875 పోస్ట్‌లను తొలగించిందని ఠాకూర్ తెలిపారు. -
రాబడుల కోసం.. మీ రూట్ ఎటు?
కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో సోషల్ మీడియా పాత్ర మరింత విస్తరించింది. యూట్యూబ్‌లో ఎంతో మంది పెట్టుబడి సలహాదారుల పాత్రను పోషిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి పేజీలకు లెక్కేలేదు. ఎక్కడైనా మంచి చెడు కలసి సహవాసం చేస్తాయన్నట్టే.. ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇలాంటి సోషల్ మీడియా చానళ్లలో లభించే కంటెంట్ ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, కచ్చితమైనదేనా..? ఆ విచక్షణ పెట్టుబడిదారులదే అవుతుంది. రిస్క్ కూడా పెట్టుబడిదారులదే. చానళ్లలో బోలెడు కంటెంట్‌ను ఊదరగొట్టేవారిది కాదని గుర్తుంచుకోవాలి. సంప్రదాయ టీవీ మాధ్యమంతో పోలిస్తే సోషల్ మీడియా చానళ్లు కొన్ని వినూత్నంగా కంటెంట్ అందించొచ్చు. మరీ ముఖ్యంగా స్థానిక భాషల్లో ఇవి కంటెంట్‌ను అందించడం సానుకూలమే. దీన్ని అధ్యయనానికి ఇన్పుట్గానే చూడాలి. దాన్నే ఆధారంగా చేసుకుని పెట్టుబడి పెడతానంటే..? రిస్క్‌ను ఆహ్వానించినట్టు అవుతుంది. ఇలాంటి సోషల్ మీడియా సలహాలు, సూచనలు, కంటెంట్ విషయంలో పెట్టుబడిదారులు అనుసరించాల్సిన మార్గంపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం. మార్కెటింగ్ చేస్తున్నారా/విజ్ఞానం పంచుతున్నారా..? అనుమతించని సాధనాలు..: గడిచిన ఏడాది కాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక రంగానికి ముప్పు అంటూ, ఏ ఒక్కరో నియంత్రించలేని అలాంటి సాధనాలను దేశంలో అనుమతించొద్దని ఆర్బీఐ కేంద్రానికి సూచించింది. క్రిప్టోల్లో పెట్టుబడులతో పూర్తిగా నష్టపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దంటూ ఇన్వెస్టర్లను ఎన్నో సార్లు హెచ్చరించింది కూడా. కానీ, ఈ సూచలను తలకెక్కించుకున్న ఇన్వెస్టర్లు ఎంత మంది..? పైగా పేరొందిన నిపుణులు, ఆర్థిక సాధనాలపై అవగాహన కలిగిన వారు తమ యూట్యూబ్ చానళ్లలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా..? ఏ ప్లాట్‌ఫామ్‌లు అనుకూలం? క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీల్లో వేటికి భవిష్యత్తు ఉంటుంది? ఇలాంటి వీడియోలు ఎన్నింటినో వీక్షకులకు వదిలారు. చట్టబద్ధం కాని సాధనాల్లో పెట్టుబడులకు మార్గాలను చెప్పడం దేనికి సంకేతం..?. కాయిన్ డీసీఎక్స్, వాజిర్ఎక్స్ తదితర క్రిప్టో ఎక్సే్ఛంజ్‌ల ద్వారా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో సూచిస్తూ వీడియోలు పెట్టారు. కొందరు ప్రముఖ క్రిప్టోలైన బిట్‌కాయిన్, ఎథీరియం, పాలీగాన్ (మాటిక్) వంటి వాటికే వీడియోలను పరిమితం చేశారు. ఇలాంటి వారి సూచనలను నమ్ముకుని గత ఏడాది కాలంలో క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటి..? నిండా నష్టపోయే ఉంటారు. ఏడాది కాలంలో బిట్‌కాయిన్ 60 శాతానికి పైగా పతనం అయింది. 2021 నవంబర్‌లో 67,000 డాలర్లకు పైగా వెళ్లిన బిట్‌కాయిన్ ఇప్పుడు 24,000 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఎథీరియం 60 శాతం, మ్యాటిక్ 80 శాతానికి పైనే వాటి విలువను కోల్పోయాయి. క్రిప్టోల్లో పెట్టుబడులను నిరుత్సాహ పరిచేందుకు, నల్లధనాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు లాభం నుంచి ఎక్సే్ఛంజ్లే 1 శాతం టీడీఎస్ కింద మినహాయించాల్సి ఉంటుంది. అనుమతి లేని వేదికలు: నియంత్రణలేని, సెబీ లైసెన్స్ లేని ఆర్థిక సలహాదారులే ఎక్కువ. సోషల్ మీడియా వేదికల్లో 99 శాతం ఇలా అనుమతి లేని వారు నిర్వహించేవే. కాకపోతే, ఒక్క డిస్‌క్లెయిమర్ ఇచ్చి తమకు సంబంధం లేదన్నట్టు వీరు వ్యవహరిస్తుంటారు. డిజిటల్ గోల్డ్ తదితర సాధనాలను కూడా ప్రోత్సహించడాన్ని గమనించొచ్చు. ఇవి స్పెక్యులేటివ్ ట్రేడ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. బ్రైట్‌కామ్ స్టాక్ ఇందుకు ఒక ఉదాహరణ. దీని పూర్వపు పేరు లైకోస్ ఇంటర్నెట్. అంతే కాదు.. వైబ్రంట్ డిజిటల్, లాంకో గ్లోబల్ కూడా దీని పూర్వపు నామాలే. ఇలా అవతారాలు మార్చుకుంటూ వచ్చిన ఈ స్టాక్ గతేడాది సోషల్ మీడియా ఫేవరెట్‌గా మారిపోయింది. 2021 మేలో రూ.10 దగ్గరున్న స్టాక్ ధర అదే ఏడాది డిసెంబర్ నాటికి రూ.123కు పెరిగిపోయింది. యాడ్టెక్నాలజీ కంపెనీ అయిన బ్రైట్‌కామ్ సూపర్ మల్టీబ్యాగర్ అంటూ ఎన్నో సోషల్ మీడియా వేదికలు తెగ ప్రచారం కల్పించాయి. కానీ, ఇక్కడ స్పష్టమైన సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఒక కంపెనీ అన్ని సార్లు పేర్లు ఎందుకు మార్చుకుంది? సీఎఫ్‌వో రాజీనామా వెనుక కారణం ఏంటి? బోనస్ షేర్లు క్రెడిట్ చేయడంతో జాప్యం ఎందుకు? 2019–20లో ఆస్తుల విలువ తరిగిపోవడంపై సెబీ ఫోరెన్సిక్‌కు ఆదేశించడం..? ఇలాంటి సమాధానాల్లేని సందేహాలతో ఈ స్టాక్ ఇప్పుడు అమ్మకాల ఒత్తిడి చూస్తోంది. గరిష్టం నుంచి సగానికి పైగా పతనం అయింది. ప్రమోటర్ల వాటా 18 శాతానికి దిగొచ్చింది. ఇవన్నీ కలసి ఇప్పుడు ఈ స్టాక్ రిటైల్ ఇన్వెస్టర్లకు బోర్ కొట్టేసింది. ఇది కేవలం ఒకే ఉదాహరణ. మైక్రోక్యాప్ విభాగం నుంచి ఎన్నో స్టాక్స్ విషయంలో ఇలాంటి ప్రచారమే నడుస్తుంటుంది. ఒక సోషల్ మీడియా వేదికల ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యవహారాల పట్ల, చానళ్ల పట్ల ఇన్వెస్టర్లు అవగాహన కలిగి, వివేకంగా వ్యవహరించకపోతే వారి కష్టార్జితమే కరిగిపోతుంది. ఎఫ్‌అండ్‌వో ఊరింపు: కరోనా లాక్డౌన్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఏర్పాటైంది. ఖాళీ సమయంలో ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి అధికమైంది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఎఫ్‌అండ్‌వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లో పెరిగిపోయింది. సెబీ దీన్ని గమనించి మార్జిన్ల విషయంలో నిబంధనలను కఠినం చేసింది. కానీ, 2020 మార్చి పతనం తర్వాత నుంచి ఈక్విటీ మార్కెట్లు ఏకరీతిన పెరిగిపోవడం ఇన్వెస్టర్లకు తెగ ఉత్సాహాన్నిచ్చింది. దీన్ని అనుకూలంగా మలుచుకుని ఎన్నో ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ చానళ్లు ఎఫ్‌అండ్‌వో ట్రేడ్స్ సిఫారసులపై ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. కొందరు 99.9 శాతం కచ్చి తత్వం రేటుతో కాల్స్ ఇస్తామంటూ పెద్ద మొత్తంలో సబ్స్క్రిప్షన్స్ కూడా రాబట్టారు. మీ పెట్టుబడిని రోజులో 12 శాతం వృద్ధి చేస్తామని ఆశ పెట్టిన ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇలాంటి ఊరించే ప్రకటనలతో తమ చందాదారుల సంఖ్యను పెంచుకునేవి కొన్ని అయితే, చందా వసూలు చేసుకునేవి కొన్ని. రెండు విధాల వారికి లాభమే. చందాదారులు పెరిగే కొద్దీ ఆయా చానళ్లకు ప్రకటనల ఆదాయం వస్తుంది. ఇంక మార్కెట్లో రాబడుల విజయ సూత్రాలు చెబుతామంటూ వెబినార్లు, వర్క్‌షాపులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.30,000 వరకు వసూలు చేశారు. బుల్ మార్కెట్లో ఇలాంటి ధోరణులే ఎక్కువగా చెలామణి అవుతుంటాయి. వీరిని నమ్ముకుని ఎఫ్‌అండ్‌వోలో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయిన వారే ఎక్కువ. నియంత్రణ పాత్ర సెబీ ‘ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రెగ్యులేషన్స్ 2013’ పేరుతో కఠిన నిబంధనలను ఎప్పుడో తీసుకొచ్చింది. ఆర్థిక సలహాదారుల (ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/రిసెర్చ్ అనలిస్ట్) పాత్ర పోషించాలంటే కావాల్సిన అర్హతలు, నెట్‌వర్త్, వారికి ఉండే బాధ్యతలు, రిజిస్ట్రేషన్ నిబంధనలను స్పష్టంగా నిర్వచించింది. ప్రయోజన వివాదాలకు చోటు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఏ రూపంలో అయినా కమీషన్, ప్రోత్సాహకాలు తీసుకోకుండా నిషేధించింది. అయితే, సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న వేదికల్లో 99 శాతం ఈ నిబంధనలను పాటించడం లేదు. కొందరు తమ వీడియోలు, పోస్టుల్లో డిస్‌క్లెయిమర్‌కు చోటిస్తున్నారు. దీన్ని ఎటువంటి రికమండేషన్గా భావించొద్దని, కేవలం సమాచారమేనని చెబుతున్నారు. ‘దీని ఆధారంగా మీరు స్వయంగా అధ్యయనం చేసిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు. వాటిల్లో ఉండే రిస్క్‌లు కూడా తెలియజేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇలా డిస్‌క్లెయిమర్ తప్పనిసరి. అడ్వర్టైజ్మెంట్ లేదా పెయిడ్ ప్రమోషన్, స్పాన్సర్డ్, కొలాబరేషన్, పార్ట్నర్షిప్ ఇలా ఏదైనా చెప్పాల్సిందే. అందుకని మీరు అనుసరిస్తున్నది.. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా అనలిస్ట్ అవునా? కాదా అన్నది ముందు తెలుసుకోవాలి. సెబీ అనుమతి లేని వారి సూచనలను అనుసరిస్తే అది పూర్తిగా మీ అభీష్టమే అవుతుంది. వేటిని అనుసరించాలి..? సోషల్ మీడియాలో మనం చూసే కంటెంట్ ఎంత మాత్రం నిజమైనది? పరిశీలిస్తే, విశ్లేషణ కోణం నుంచి చూస్తే తెలుస్తుంది. కొన్ని వేదికలు మంచి కంటెంట్‌ను అందిస్తున్నాయి. వాటి సాయంతో ఎంతో నేర్చుకునే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక సాధనాలు, ఈక్విటీలపై పట్టు పెంచుకునేందుకు మంచి వేదికలను అనుసరించడం ప్రయోజనమే. ఫండ్ మేనేజర్లు, సీఈవోలతో ఇంటర్వ్యూలను అందిస్తున్న వేదికలు కూడా ఉన్నాయి. సెబీ అనుమతి లేకపోయినా కానీ.. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ఉత్పత్తులకు సంబంధించి చక్కటి సమాచారం అందిస్తున్నవీ ఉన్నాయి. కాకపోతే పెయిడ్, స్పాన్సర్డ్ కంటెంట్‌ను ఫిల్టర్ చేసుకోగలిగితే చాలు. అది అధ్యయనం, పరిశీలన మీద వస్తుంది. పేరున్న సోషల్ మీడియా వేదికలకు నకళ్లు ఎన్నో తయారయ్యాయి. ప్రాచుర్యం పొందిన ఆయా వ్యక్తులు, చానళ్ల పేరుతో నకిలీలు తెరిచి మోసం చేయడమే వారి లక్ష్యం. ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి ప్రభావానికి లోను కానంత వరకు సోషల్ మీడియా వేదికలు అధ్యయనానికి అద్భుతమైన వేదికలే. వాటిల్లోని సమాచారాన్ని చూసి వెంటనే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం చేయరాదు. కొన్ని సందర్భాల్లో సానుకూల ఫలితాలు రావచ్చు. కానీ, బెడిసికొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. వీటిని రాబడుల టిప్స్ వేదికలుగా చూడొద్దు. అధ్యయన, అవగాహన మార్గాలుగానే చూడాలి. కచ్చితంగా స్వీయ అధ్యయనం తోడవ్వాలి. అంత అవగాహన లేకపోతే ఫీజు చెల్లించి నేరుగా నిపుణులను సంప్రదించాలి. ఇవేవీ అనుసరించలేకపోతే.. కనీసం రూ.1,000–2,000 పెట్టుబడితో ముందుగా ఒకటి రెండేళ్లపాటు పెట్టుబడుల్లోని సానుకూల, ప్రతికూలతలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీనివల్ల పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. పెయిడ్ పోస్టుల మాయలో పడొద్దు... లైసెన్స్ కలిగిన ఆర్థిక సలహాలు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ సేవలకు ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉచితంగా వచ్చేవి కావు. కానీ, ఉచిత సమాచారంపై ఆధారపడే ఇన్వెస్టర్ల ధోరణి వారిని నష్టాల వైపు నడిపిస్తోందని చెప్పుకోవాలి. ఆర్థిక నిపుణుల్లో ఎంత మంది తమ విలువైన సమయాన్ని వెచ్చించి విలువైన కంటెంట్‌ను రోజువారీగా, వారం వారీ ఇవ్వగలరు? ఏదో ప్యాషన్‌గా పనిచేసుకునే వారు (వందల్లో కూడా ఉండరు) తప్పించి విలువైన కంటెంట్‌ను ఉచితంగా అందించే వారు పెద్దగా ఉండరు. ‘ఒక ఉత్పత్తి కోసం మీరు చెల్లించకపోతే.. మీరే ఉత్పత్తిగా మారతారు’ అన్న ప్రముఖ కొటేషన్ గుర్తు చేసుకోవాలి. సీజనల్ ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు సోషల్ మీడియాలో కొంత సమయం వెచ్చిస్తుంటారు. వారికున్న పరిజ్ఞానం, అనుభవాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతోనే కొంత సమయం కేటాయిస్తుంటారు. కానీ, దీన్నే వ్యాపకంగా, ఆదాయ మార్గంగా పెట్టుకుని అర్హతలేని వారు నిర్వహించే వేదికలే ఎక్కువ. ఒక పద్ధతి ప్రకారం వీరు చానళ్లను ఏర్పాటు చేసి, కంటెంట్‌తో మిలియన్ల మందిని ఆకర్షించే మార్గంలో వెళుతుంటారు. ఆ కంటెంట్ రూపంలో ఆదాయాన్ని పొందడమే వారు ఎంచుకున్న మార్గం. కొన్ని ప్రముఖ సోషల్ మీడియా చానళ్ల నిర్వాహకులకు ఇలా భారీ ఆదాయమే వస్తోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ఆర్థిక సంస్థల ప్రకటలను వారు అనుమతిస్తుంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూ ఉంటారు. తమ కంటెంట్‌లో ఫలానా బ్రాండ్ పేరుకు చోటు ఇచ్చినందుకు కొంత వసూలు చేస్తుంటారు. ఆయా కంపెనీల ఉత్పత్తులను అనుసంధానించే వెబ్ లింక్‌ను పోస్ట్ చేస్తుంటారు. ఈ లింక్‌లను ఎంత మంది క్లిక్ చేసి విజిట్ చేస్తే వారికి అంత ఆదాయం కమీషన్ రూపంలో సమకూరుతుంది. ఇదంతా స్వేచ్ఛగా జరిగే వ్యవహారమే. ఇందులో గుట్టేమీ లేదు. కానీ, వారు అందిస్తున్న కంటెంట్‌లో ప్రచారం కోసమా..? లేక అవగాహన కోసం పెడుతున్న కంటెంటా? అన్న నిజాన్ని ఎక్కువ మంది తెలుసుకోలేరు. పెయిడ్ ప్రచారం అని చెప్పేవారు బహుశా అతి కొద్ది మందే ఉన్నారు. కొందరు ఒక కంపెనీ లేదా బ్రాండ్‌కు ప్రచారం కల్పిస్తూ తమ యూట్యూబ్ చానల్లో వీడియో పోస్ట్ చేయడానికి లేదా ఫేస్బుక్ పోస్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం భారీ ఫీజును వసూలు చేస్తుంటారు. సాధారణంగా ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనే దాన్ని బట్టి వసూలు చేసే మొత్తం ఆధారపడి ఉంటుంది. మిలియన్ల సబ్స్క్రయిబర్లు/ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ చానల్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక్కో పోస్ట్‌కు రూ.4–15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రాయోజిత ట్వీట్లకు లక్షలు తీసుకునే వారున్నారు. ఒక కంపెనీ రైట్స్ ఇష్యూ సబ్ స్క్రయిబ్ చేసుకోవాలంటూ.. ఒక మైక్రోక్యాప్ స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా ఒకటికి మించి ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ చానళ్లు ఊదరగొడుతున్నాయంటే..? అవి పెయిడ్ పోస్ట్‌లుగా సందేహించాల్సిందే. ఆయా కంపెనీలు లేదా స్టాక్ ఆపరేటర్లు వాటి వెనుక ఉండొచ్చు. ‘పంప్ అండ్ డంప్’ ఆపరేటర్లకు ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికలుగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ప్రచారం కల్పించి, రిటైల్ ఇన్వెస్టర్లతో కొనిపించేలా చేయడమే వారి వ్యూహం. చౌక ధరకు పోగు చేసిన ఆయా స్టాక్స్‌ను అనైతిక, అసత్య ప్రచారంతో తెలియని, ఆశతో కూడిన ఇన్వెస్టర్లకు అండగట్టి వారు లాభాలతో బయటకు వెళ్లిపోతుంటారు.