వ్యూస్ పెంచుకునేందుకు వీడియో అప్‌లోడర్లు చేస్తున్న అనైతిక ప్రయత్నాలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. వీడియోను ఎక్కువ మంది వీక్షించాలనే ఉద్దేశంతో చాలామంది యూట్యూబర్లు ఆకర్షణీయ థంబ్‌నేల్స్ పెడుతుంటారు. అలా పెట్టడం తప్పుకాదు.. కానీ, అసలు వీడియోలో ఉన్న కంటెంట్‌తో సంబంధం లేకుండా కొందరు థంబ్‌నేల్స్ పెట్టి వీక్షకులను మభ్యపెడుతుంటారు. అలాంటి వారిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గతంలో జరిగిన అంశాలు, ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న సమాచారం.. వంటి ఎన్నో అంశాలను వక్రీకరించి యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేస్తున్నారు. దాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ త్వరలో కొత్తగా నిబంధనలు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేసింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్‌లోడ్ చేయడం, తప్పుడు సమాచారం ఉన్న థంబ్‌నేల్స్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన
కొత్తగా తీసుకురాబోయే నిబంధనలు పాటించని వారి వీడియోలను ప్రైమరీగా డిలీట్ చేస్తామని పేర్కొంది. రెండోసారి తిరిగి అలాగే నిబంధనలను విస్మరిస్తే ఛానల్‌ను తాత్కాలికంగా నిలిపేయబోతున్నట్లు(ఛానల్ స్ట్రైక్) హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే కంటెంట్ ద్వారా యూట్యూబ్‌పై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉన్నట్లు కంపెనీ వివరించింది. వీక్షకుల్లో విశ్వాసం నింపాలంటే స్పష్టమైన, వాస్తవమైన, ఉల్లంఘనలు అతిక్రమించని, తప్పుదోవ పట్టించని కంటెంట్‌ను అప్‌లోడ్ చేయాలని యూట్యూబర్లకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment