YouTube Shorts
-
యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!
వ్యూస్ పెంచుకునేందుకు వీడియో అప్లోడర్లు చేస్తున్న అనైతిక ప్రయత్నాలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. వీడియోను ఎక్కువ మంది వీక్షించాలనే ఉద్దేశంతో చాలామంది యూట్యూబర్లు ఆకర్షణీయ థంబ్‌నేల్స్ పెడుతుంటారు. అలా పెట్టడం తప్పుకాదు.. కానీ, అసలు వీడియోలో ఉన్న కంటెంట్‌తో సంబంధం లేకుండా కొందరు థంబ్‌నేల్స్ పెట్టి వీక్షకులను మభ్యపెడుతుంటారు. అలాంటి వారిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గతంలో జరిగిన అంశాలు, ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న సమాచారం.. వంటి ఎన్నో అంశాలను వక్రీకరించి యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేస్తున్నారు. దాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ త్వరలో కొత్తగా నిబంధనలు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేసింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్లోడ్ చేయడం, తప్పుడు సమాచారం ఉన్న థంబ్‌నేల్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహనకొత్తగా తీసుకురాబోయే నిబంధనలు పాటించని వారి వీడియోలను ప్రైమరీగా డిలీట్ చేస్తామని పేర్కొంది. రెండోసారి తిరిగి అలాగే నిబంధనలను విస్మరిస్తే ఛానల్‌ను తాత్కాలికంగా నిలిపేయబోతున్నట్లు(ఛానల్ స్ట్రైక్) హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే కంటెంట్ ద్వారా యూట్యూబ్‌పై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉన్నట్లు కంపెనీ వివరించింది. వీక్షకుల్లో విశ్వాసం నింపాలంటే స్పష్టమైన, వాస్తవమైన, ఉల్లంఘనలు అతిక్రమించని, తప్పుదోవ పట్టించని కంటెంట్‌ను అప్లోడ్ చేయాలని యూట్యూబర్లకు సూచించింది. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
యూట్యూబ్ క్రియేటర్స్‌కి బంపర్ ఆఫర్
-
మోస్ట్ ఎలిజిబుల్ క్రియేటర్స్
తాజా సినిమా ‘కేజీఎఫ్’లో విలన్ నోటి నుంచి వచ్చిన చిన్న డైలాగుకు పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఆ డైలాగ్ ఇలా ఉంటుంది... ‘ఎర వెంట పరుగెడుతూ చేప దాన్ని వేటాడుతున్నాను అనుకుంటుంది. గాలానికి చిక్కిన తరువాత గానీ తెలియదు తానే వేటాడబడ్డానని!’ డైలాగ్ నుంచి డప్పు సౌండ్ వరకు ‘ఆహా’ అనిపిస్తే, చప్పట్లు కొట్టిస్తే అదే క్రియేటివిటి. ఇప్పుడు యూత్‌కి ఇది పెట్టుబడి. తమను తాము మెరుగు పర్చుకొని ఎప్పటికప్పుడూ కొత్త పాఠాలు నేర్చుకునే బడి.... టిక్.. టాక్ నిషేధం తరువాత యూట్యూబ్ ‘షార్ట్స్’ ఊపందుకున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం కలిగించడానికి యూట్యూబ్ ‘షార్ట్స్ ఫండ్’ ప్రకటించింది. ‘భలే ఛాన్సు’ అనుకుంది యువతరం. అయితే ఆ ఛాన్సు ఊరకే చేతికి చిక్కదు. బరిలో ఉన్న పదిమంది కంటే ముందుండాలి. డబ్బుల సంగతి పక్కన పెడితే, ఇలాంటి ప్రోత్సాహక ఫండ్స్ ద్వారా రకరకాలుగా తమలోని సృజనకు పదును పెట్టుకునే అవకాశం యువతరానికి వచ్చింది. ‘2021– 2022 షార్ట్ఫండ్స్’ ద్వారా ఎలిజిబుల్ క్రియేటర్స్‌కు రివార్డ్‌లు ఇస్తుంది యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్లే బోనస్ ప్రొగ్రాం, స్నాప్‌చాట్ ‘స్పాట్లైట్ చాలెంజ్’ ద్వారా క్రియేటర్స్‌కు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నాయి. ‘సుత్తి వద్దు సూటిగా చెప్పు’ అనేది 15 నుంచి 60 సెకండ్ల ఈ వీడియోల ప్రధాన లక్షణం. ఇక్కడ కెమెరాలను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ముందు మనసును నమ్ముకోవాలి. అందులో సృజనాత్మక మథనం జరగాలి. ఏ టాపిక్ ఎంచుకోవాలి? చూసీ చూడగానే మళ్లీ మళ్లీ చూసేలా ఎలా చిత్రీకరించాలి... ఇలా ఎన్నో దశల తరువాత ‘షార్ట్స్’ తయారవుతుంది. చిన్న వీడియో అయినా సరే, యూ ట్యూబ్ బిల్ట్–ఇన్–క్రియేషన్ టూల్స్ సమర్థంగా ఉపయోగించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఎడిట్ చేయడం, సోని, యూనివర్సల్, వార్నర్ లాంటి మేజర్ లేబుల్స్ నుంచి మ్యూజిక్ సెట్ చేయడం, సందర్భానికి తగినట్లు యానిమేటెడ్ టెక్ట్స్ జత చేయడం, ఫుటేజి కంట్రోల్... ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమకు తాముగా ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతున్నారు. సాంకేతికశక్తిని దృఢతరం చేసుకోగలుగుతున్నారు. తమ వీడియోను ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు చూసే ‘హుక్’ ఏమిటో క్రియేటర్‌కు తెలియాలి. అది ఎలా తెలియాలి? బెస్ట్ యూట్యూబర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా కాకలు తీరిన విజేతల అంతరంగాలకు తమ బ్లాగ్‌లో స్థానం కల్పిస్తుంది యూట్యూబ్. యువతరానికి అవి ఇష్టమైన పాఠాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు లైనా. అర్జెంటీనాకు చెందిన లైనా సింగర్, సాంగ్ రైటర్. యూట్యూబ్‌లో లాటిన్ అమెరికా దేశాల్లో ఆమెకు అపారమైన అభిమానగణం ఉంది. ఆమె మాటల్లో కొన్ని... ‘వీడియో మేకింగ్‌ను ముందు మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారు. మొదట్లో నేను తీవ్రమైన ఒత్తిడికి గురవుతుండేదాన్ని. ఆ ఫలితం వీడియోలపై కనిపించేది. ప్రేక్షకులు రకరకాల కామెంట్స్‌తో వెక్కిరించేవారు. వీడియోలలో పూర్–క్వాలిటీ ఉండకూడదనుకుంటే ముందు మనలో నుంచి ఒత్తిడిని పూర్తిగా బయటికి పంపించాలి’ ‘మనం క్రియేటర్స్ అయినప్పటికీ ప్రేక్షకుల కంటే ఒక మెట్టు పైన ఉన్నాం అని ఎప్పుడూ అనుకోకూడదు. వారి మాటలను ఓపికగా వినాలి. వారి నుంచి తెలుసుకోవాలి. చివరికి వారి చేతే ప్రశంసలు పొందాలి’ ‘పోటీ లేకపోతే నేనే రాజు అనుకుంటాం. బలమైన పోటీ ఉంటే ‘బంటు’ స్థానంలోకి వెళ్లి సింహాసనాన్ని చేరుకోవడానికి కష్టడతాం. ఆ క్రమంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకుంటాం’. -
ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా?
►నిన్న మొన్నటివరకూ ఇంటర్నెట్ సామ్రాజ్యంలో యూట్యూబ్ అంటే కేవలం కాలక్షేపం కోసం నెటిజన్లు వీక్షించే ఓ వినోద సాధనమే. ► మరి నేడు... వీక్షకులకు వినోదం, విజ్ఞానాన్ని అందిస్తూనే యూట్యూబర్లకు కోట్లాది మంది సబ్స్క్రైబర్లను, అంతకన్నా మించి భారీగా ఆదాయాన్ని సంపాదించిపెట్టే కల్పతరువు! ప్రతి నిమిషం ఈ ప్రసార మాధ్యమంలో ఏకంగా 30 లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయంటే యూట్యూబ్ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి... ►ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏమిటి? ►భారత్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకున్నదెవరు? చార్ట్‌లు బద్దలు కొట్టిన పాటలేమిటి? ►వినోదం పంచిన వెబ్‌సిరీస్, గేమ్‌లు ఏవి? ఓసారి పరిశీలిద్దాం.. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది యూట్యూబ్‌లో వినూత్నమైన ఆలోచనలతో సృష్టించిన వీడియోలు మంచి ఆదరణ పొందాయి. ‘ఏ2మోటివేషన్స్’, ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’ వంటి చానళ్లు.. అద్భుతం, వినూత్నం, విచిత్రం అనిపించే విషయాలను నిమిషం, రెండు నిమిషాల వీడియోలైన ‘షార్ట్స్’లో బంధించాయి. అలాగే ‘క్రేజీ ఎక్స్‌వైజెడ్’, ‘మిస్టర్ ఇండియన్హ్యాకర్’ వంటి చానళ్ల నిర్వాహకులు విచిత్రమైన పనులు చేసి పాపులారిటీ, సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. తెలుగు యూట్యూబ్ చానళ్లు ఫిల్మీమోజీ, ఫన్మోజీలు అనిమోజీ పేరుతో అవతార్ ఆధారిత కంటెంట్ సృష్టించి ట్రెండింగ్ చార్టుల్లో పైకి చేరితే.. భువన్ బామ్ (బీబీ కి వైన్స్) తన కామెడీ వీడియోలను ‘ధిండోరా’ పేరుతో వెబ్ సిరీస్‌గా మార్చి 2.49 కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. గేమింగ్ విషయానికొస్తే ఇందులోనూ మూసపోకడలకు స్వస్తిపలికి కామెడీ, ప్రాంక్స్, సవాళ్లు వంటి అనేక అంశాల ఆధారంగా కొత్త గేమ్‌లు సిద్ధమయ్యాయి. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఇప్పుడు నగర ప్రాంతాలను దాటిపోవడం ఇంకో విశేషం. కోవిడ్ కారణంగా సినిమాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది వీడియో పాటలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే విడుదలయ్యాయి. అంకుశ్ రజా, శిల్పి రాజ్ వంటివారు తమ భోజ్‌పురి సంగీతంతో ఈ ఏడాది టాప్ స్థానాల్లో నిలిచారు. మహిళల మ్యూజిక్ వీడియోల్లో తమిళ సింగర్లు అరివు, ఢీల వీడియో ‘ఎంజాయ్ ఎంజామీ’ చార్ట్‌లలో టాప్‌గా నిలిచింది. చదవండి: Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్ ఇవే.. ‘ఈ తరం’ వెబ్ సిరీస్‌లు.. తెలుగు విషయానికి వస్తే... షణ్ముక్ జశ్వంత్ హీరోగా నటిస్తున్న యూట్యూబ్ సిరీస్ ‘సూర్యా’తోపాటు ‘గర్ల్ ఫార్ములా’ రూపొందించిన ‘30 వెడ్స్ 21’ ఆకట్టుకోగా.. దేశంలో యువతరం సమస్యలను, అనుభవాలను వినూత్నమైన పద్ధతుల్లో అందుబాటులోకి తెచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ‘ద వైరల్ ఫీవర్’ నిర్మించిన కొత్త సిరీస్ ఆస్పిరెంట్స్.... యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆశనిరాశలను ప్రతిబంబించింది. అలాగే డైస్ మీడియా వైద్యవిద్యార్థుల జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన ‘ఆపరేషన్ ఎంబీబీఎస్’, గేమింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న వారిపై రూపొందించిన ‘క్లచ్’ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. బుల్లి వీడియోలు భలేభలే... యూట్యూబ్ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన చిన్న వీడియో విభాగం ‘షార్ట్స్’కూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. నిమిషం కంటే తక్కువ నిడివి ఉండే ‘షార్ట్స్’ వీడియోలను ఇప్పుడు చాలా మాంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. 2021లో సృష్టించిన కొత్త, వినూత్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు మొదలుకొని కుటుంబ సంబంధాలు, స్ఫూర్తిదాయకమైనవి, పురుషుల సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడేవి కూడా బోలెడు ఉన్నాయి. ‘ఏ2మోటివేషన్’ తొలిస్థానంలో నిలివగా ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’, ‘శివమ్ మాలిక్’, ‘లిటిల్గ్లవ్’, ‘ఇంగ్లిష్ కనెక్షన్’, ‘బసీర్ గేమింగ్’, ‘అజయ్ శర్మ’, ‘దుష్యంత్ కుక్రేజా’ వంటివి టాప్–10లో ఉన్నాయి. -
గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్‌లో యూట్యూబ్ షార్ట్స్ టైమ్ డ్యూరేషన్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌లో టైమ్ డ్యూరేషన్ తక్కువే 2020 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ షార్ట్స్ లో ఇన్సిడెంట్ ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్న చందంగా 60 సెకన్ల వ్యవధి వీడియోను చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షార్ట్స్ వీడియోస్‌లో 15 సెకన్లు, అంతకంటే తక్కువ టైమ్ డ్యూరేషన్ ఉన్న వీడియోల్ని చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఈరోజు జరిగిన ఓ ఈవెంట్లో గూగుల్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌తో లాభాలు యూట్యూబ్ షార్ట్స్ వల్ల నిర్వహకులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఈ ప్లాట్ ఫాం సువర్ణ అవకాశమనే చెప్పుకోవాలి. నిమిషాల వ్యవధి వీడియోల కంటే సెకన్ల వ్యవధి వీడియో చేయడం చాలా ఈజీ. అదే సమయంలో వ్యూస్, ఛానల్ బ్రాండింగ్ వేగం పెరిగిపోతుంది. ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో సహాయపడుతుంది. క్రియేటర్లకు వంద మిలియన్ డాలర్లు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా డబ్బులు సంపాదించుకోవచ్చు. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు మనదేశంలో టిక్... టాక్ లేకపోవడంతో చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని మరింత ప్రోత్సహించేందుకు గూగుల్ భారీ ఎత్తున ఫండ్‌ను కేటాయించింది. చదవండి: హాయ్ గైస్...నేను మీ షెర్రీని..!!