YouTube channel
-
యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!
వ్యూస్ పెంచుకునేందుకు వీడియో అప్లోడర్లు చేస్తున్న అనైతిక ప్రయత్నాలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. వీడియోను ఎక్కువ మంది వీక్షించాలనే ఉద్దేశంతో చాలామంది యూట్యూబర్లు ఆకర్షణీయ థంబ్‌నేల్స్ పెడుతుంటారు. అలా పెట్టడం తప్పుకాదు.. కానీ, అసలు వీడియోలో ఉన్న కంటెంట్‌తో సంబంధం లేకుండా కొందరు థంబ్‌నేల్స్ పెట్టి వీక్షకులను మభ్యపెడుతుంటారు. అలాంటి వారిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గతంలో జరిగిన అంశాలు, ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న సమాచారం.. వంటి ఎన్నో అంశాలను వక్రీకరించి యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేస్తున్నారు. దాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ త్వరలో కొత్తగా నిబంధనలు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేసింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్లోడ్ చేయడం, తప్పుడు సమాచారం ఉన్న థంబ్‌నేల్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహనకొత్తగా తీసుకురాబోయే నిబంధనలు పాటించని వారి వీడియోలను ప్రైమరీగా డిలీట్ చేస్తామని పేర్కొంది. రెండోసారి తిరిగి అలాగే నిబంధనలను విస్మరిస్తే ఛానల్‌ను తాత్కాలికంగా నిలిపేయబోతున్నట్లు(ఛానల్ స్ట్రైక్) హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే కంటెంట్ ద్వారా యూట్యూబ్‌పై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉన్నట్లు కంపెనీ వివరించింది. వీక్షకుల్లో విశ్వాసం నింపాలంటే స్పష్టమైన, వాస్తవమైన, ఉల్లంఘనలు అతిక్రమించని, తప్పుదోవ పట్టించని కంటెంట్‌ను అప్లోడ్ చేయాలని యూట్యూబర్లకు సూచించింది. -
యూట్యూబ్ కోసం రూ.8 లక్షల ఖర్చు.. ఎంత వచ్చిందంటే?
టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తూ.. యూట్యూబ్ మీద పడుతున్నారు. నేడు చాలామందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొందరు లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తుంటే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నళిని ఉనగర్'. ఇంతకీ ఈమె ఎవరు? యూట్యూబ్ కోసం ఎంత వెచ్చించింది? ఎందుకు ఫెయిల్ అయిందనే.. వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నళిని ఉనగర్.. 'నలినీస్ కిచెన్ రెసిపీ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు నడిపింది. అయితే ఈమెకు యూట్యూబ్ ద్వారా ఏ మాత్రం ఆదాయం రాలేదు. కానీ నళిని.. స్టూడియో, కిచెన్ సెటప్ చేసుకోవడానికి, ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.మూడేళ్ల పాటు సుమారు 250 వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. దీంతో విసుగెత్తి.. యూట్యూబ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా కిచెన్ వస్తువులను, స్టూడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. నేను నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పింది.I failed in my YouTube career, so I’m selling all my kitchen accessories and studio equipment. If anyone is interested in buying, please let me know. 😭 pic.twitter.com/3ew6opJjpL— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024మూడు సంవత్సరాల్లో 250 వీడియోలు చేసాను, 2450 సబ్‌స్కైబర్లు మాత్రమే వచ్చారు. ఎంత కష్టపడినా.. యూట్యూబ్ కొన్ని రకాల కంటెంట్లకు మాత్రమే ఫేవర్ చేస్తుందని నళిని ఆరోపించింది. నేను మూడేళ్ళలో సంపాదించిన మొత్తం 'సున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ ఛానల్ ప్రారంభించాడని డబ్బు, సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను.. అని ఒక ట్వీట్లో వెల్లడించింది. కానీ నాకు యూట్యూబ్ ఎలాంటి ప్రతిఫలాన్ని అందించలేదని వాపోయింది.I’m honestly angry with YouTube. I spent my money, time, and even risked my career to build my channel, but in return, YouTube gave me nothing. It feels like the platform favors certain channels and specific types of videos, leaving others with no recognition despite the hard…— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024యూట్యూబర్స్ ఎదుర్కోవాల్సిన సవాళ్లుయూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట నిజమే. కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అందరూ డబ్బు సంపాదిస్తారు అని అనుకోవడం మూర్కత్వమే. ఎందుకంటే యూట్యూబ్‌లో అందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. డబ్బు రావడం అనేది సబ్‌స్కైబర్లు, వాచ్ అవర్స్, వ్యూవ్స్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి యూట్యూబర్స్ వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగి.. ఓపిగ్గా నిలబడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. -
యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడా
సామాజిక మాధ్యమాల సాయంతో స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడే వారిపై సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంటోంది. సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా యూట్యూబ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ సాగిస్తున్న రవీంద్ర బాలు భారతి అనే వ్యక్తిపై చర్య తీసుకుంది. ఏప్రిల్ 4, 2025 వరకు సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా తాను సంపాదించిన మొత్తం రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.19 లక్షల మందికి సలహాలు..నిబంధనల ప్రకారం సెబీ రిజిస్టర్డ్ వ్యక్తులు, ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి. అందులోనూ చాలా నియామాలున్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా కొన్ని రోజులుగా రవీంద్ర బాలు భారతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టుబడి సలహాలు, స్టాక్ సిఫార్సులు చేస్తున్నట్లు సెబీ గుర్తించింది. దాంతో స్టాక్ మార్కెట్‌పై అనుభవం లేనివారే లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించినట్లు తెలిపింది. తనకు చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్‌ల్లో దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లతో పెద్దమొత్తంలో నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టుబడి సలహాలు ఇస్తూ భారీగా నగదు పోగు చేసినట్లు సెబీ పేర్కొంది.రూ.10 లక్షలు జరిమానారవీంద్ర సంపాదించిన డబ్బును రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్పై ఇన్వెస్ట్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఏప్రిల్ 2025 వరకు ఎలాంటి సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా భారతి, అతని సంస్థ, తన సహచరులపై సెబీ నిషేధం విధించింది. రవీంద్ర, తన సహచరులకు రూ.10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ మోసాలతో సంపాదించిన రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణస్వతహాగా నేర్చుకోవడం ఉండదు..సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా, బంధువులు, స్నేహితులు చెబుతున్నారని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తాత్కాలికంగా డబ్బులు వచ్చినట్లు కనిపించినా దీర్ఘకాలంలో చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంతో ఎదుటి వ్యక్తులు, వీడియోలపైనే ఎక్కువగా ఆధారపడే స్వభావం అలవడుతుందని అంటున్నారు. దాంతో మార్కెట్ గురించి స్వతహాగా నేర్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వీడియోలు చూసి ట్రేడింగ్ చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్
మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? మీ కంటెంట్‌ను వీరే భాషల్లో వినిపించాలనుకుంటున్నారా? ‘అవును.. కానీ, ఆ భాషలో అంతగా ప్రావీణ్యం లేదు’ అని అధైర్య పడకండి. యూట్యూబ్ మీలాంటి వారికోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు తన బ్లాగ్‌పోస్ట్‌లో వివరాలు వెల్లడించింది.సినిమాలే కాదు, భాష రాకపోయినా ఇకపై యూట్యూబ్ వీడియోలను ఖండాంతరాలను దాటించి ఏంచక్కా మీ కంటెంట్‌ను విదేశాల్లోని వారికి వినిపించవచ్చు. ఇందుకోసం యూట్యూట్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చించి. ఈ ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. దాంతో కంటెంట్ క్రియేటర్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వీడియోను ఇతర భాషల్లో పోస్ట్ చేసే వీలుంటుంది. స్లైడ్స్, వీడియో బిట్స్‌తో కంటెంట్ ఇచ్చేవారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.అన్ని భాషల్లోకి మారుతుందా..?ప్రాథమికంగా ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియోలోని వాయిస్ పైన తెలిపిన ఏ భాషల్లో ఉన్నా ముందుగా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది. ఈ వీడియోపై ఆటో డబ్బ్‌డ్ అనే మార్కు ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఏఐ డబ్ చేసిన వాయిస్ వద్దనుకుంటే, ఒరిజినల్ వాయిస్ వినాలనిపిస్తే వీడియోపై ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి అసలు వాయిస్‌ను వినొచ్చు. ప్రాథమికంగా ప్రస్తుతానికి పైన తెలిపిన భాషల్లోనే వాయిస్ డబ్ అవుతుంది. యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఇందులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ తెలిపింది.ఎలా వినియోగించాలంటే..కంటెంట్ క్రియేటర్లు వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్‌గా వాయిస్‌ని గుర్తించి అది సపోర్ట్ చేసే భాషల్లోకి కంటెంట్‌ను డబ్ చేస్తుంది. ఫైనల్‌గా అప్లోడ్ చేయడానికి ముందు రివ్యూ చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్లో డబ్బ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. వైటీ స్టూడియోలోని ప్రతి వీడియోను నియంత్రించే అధికారం మాత్రం కంటెంట్ క్రియేటర్లకే ఉంటుంది.ఇదీ చదవండి: 3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీఈ ఫీచర్ ఎప్పుడు పని చేయదంటే..కొన్ని సందర్భాల్లో వాయిస్ క్లారిటీ లేకపోయినా, లేదంటే ఏదైనా కారణాలతో వాయిస్ గుర్తించలేకపోయినా డబ్బింగ్ పని చేయదని యూట్యూబ్ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ డబ్బింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే మాత్రం ఇంగ్లీష్ వాయిస్ క్లారిటీగా ఉండడంతోపాటు రికార్డింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. ఇప్పటివరకు ఇంగ్లీష్ కంటెంట్‌ను అప్లోడ్ చేసే రిజినల్ కంటెంట్ క్రియేటర్ల సంపాదన ఈ ఫీచర్‌తో పెరగబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఇండియాలోని టాప్ యూట్యూబర్లలో ఒకరామె..జస్ట్ పాక నైపుణ్యంతో ఏకంగా..!
యూట్యూబ్ అంటే కొందరికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టే వేదిక. మరికొందరికి అదొక సరదా కాలక్షేపం. అయితే కొంతమంది మాత్రం దీంతో మంచి పేరు తోపాటు కోట్లు ఆర్జించి మిలియనీర్లుగా మారారు. అచ్చం అలానే మంచి నేమ్, డబ్బు సంపాదించి స్టార్ యూట్యూబర్‌గా ఎదిగింది 65 ఏళ్ల మహిళ. ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు సరదాగా మొదలు పెట్టిన యూట్యూబ్ ఛానెల్ విలియన్లమంది ఫాలోవవర్లు, లక్షల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక యూట్యూబర్లలో ఒకరిగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎవరామె..? ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..!ఆమె పేరు నిషా మధులిక. 2009లో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భారతీయ శైలి వంటకాలకు ఫేమస్. ఆమెకు చిన్న వయసు నుంచి వివిధ వంటకాలపై ఉన్న ఆసక్తితో రకరకాల రెసిపీలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో దాదాపు రెండు వేలకు పైగా వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 14.5 మంది మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఆరోగ్యకరమైన వంటకాలతో ప్రతి ఇల్లు ఐక్యతతో సంతోషభరితంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని అంటోంది నిషా. ఆమెకు ఈ యూట్యూబ్ తోపాటు ఫేస్బుక్లో 5.7 మిలియన్లు, ఇన్‌స్టాలో 3.41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషా నేపథ్యం..నిషా ఆగస్టు 24, 1959న ఉత్తరప్రదేశ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ తదనంతరం.. కొన్నాళ్లు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లితో నోయిడాకు వెళ్లిపోయింది. అక్కడ తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇక ఆ బాధ్యతలు తీరి ఒంటరితనం వేధించడంతో.. చిన్ననాటి వంటకాల ఆసక్తితో ఆ లోటుని భర్తి చేసింది. ఆ ఇష్టంతోనే యూట్యూబ్ ఛానెల్లో అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి.. విశేష జనాదరణ సంపాదించుకుంది. ఒకరకంగా ఆ అభిరుచి ఆమెకు మంచి పేరు, డబ్బులు తెచ్చిపెట్టాయి. రెస్ట్ తీసుకునే వయసులో కాలక్షేపం కోసం మొదలు పెట్టి.. దేశంలోనే టాప్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు నవంబర్ 2017లో సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్‌గా గౌరవాన్ని పొందింది. జస్ట్ తన పాకనైపుణ్యాలతో ఏకంగా రూ. 43 కోట్ల నికర విలువతో భారీ సంపాదనను ఆర్జిస్తోంది నిషా. అంతేగాదు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న టాటా ట్రస్ట్‌ల ప్రాజెక్ట్ డ్రూవ్తో సహా అనేక ఇతర ప్రయత్నాలకు తన వంతు సహాయసహకారాలు అందించి సేవదృక్పథంలో కూడా మేటి అనిపించుకుంది. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
యూట్యూబ్ ఛానళ్లపై విడదల రజిని కంప్లైంట్
-
ఆయన్ని ఎప్పటికీ ఆ పని చేయనివ్వను..!
షబానా అజ్మీ జగద్విఖ్యాత ఫెమినిస్ట్. 74 ఏళ్ల ఈ వయసులోనూ ఆమె నవ్వులో హుషారు ఉంటుంది. ఆమె మంచి నటి, చురుకైన సోషల్ యాక్టివిస్ట్ కూడా అయినప్పటికీ.. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో ఆమెను ఫెమినిజం గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. బయట ఆమెకు తారసపడే యువతులు కూడా... ‘మేడమ్.. ఫెమినిజం అంటే మీ ఉద్దేశంలో ఏమిటి?‘ అని ప్రాథమిక స్థాయి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్నకు షబానా నవ్వేస్తుంటారు. ‘ఈ అమ్మాయిలున్నారే.. తాము ఫెమినిస్ట్లము కాదు అని గర్వంగా చెప్పుకుంటారు, మళ్లీ ‘బ్రా – బర్నింగ్‘ మూవ్ మెంట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు’ అంటారు షబానా. (పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ, అందుకు సంకేతంగా 60 లలో ఆనాటి మహిళా యాక్టివిస్టులు బ్రా లను మంటల్లో వేసి తగలబెట్టిన మూవ్‌మెంటే ‘బ్రా బర్నింగ్‘ ఉద్యమం). ఫాయే డి సౌజా యూట్యూబ్ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిజానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు షబానా. ఓసారి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు జావేద్ (అఖ్తర్) కుర్తాను ఇస్త్రీ చేస్తూ ఉండగా చూసిన ఒక తెలిసినావిడ.. ‘మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటారు. మీరేమో మీ భర్త దుస్తుల్ని ఇస్త్రీ చేస్తున్నారు?!‘ అని అన్నారు. షబానా నవ్వుతూ, ‘దీనికి దానికీ సంబంధం ఏమిటి?!‘ అని అడిగారు. అందుకు ఆవిడ... ‘మరైతే మీ వారు మీ శారీని ఇస్త్రీ చేస్తారా?!‘ అన్నారు.‘లేదు. నేను ఎప్పటికీ ఆయన్ని ఆ పని చేయనివ్వను‘ అన్నారు షబానా. డిసౌజాకు ఈ సంగతి చెప్పినప్పుడు... డిసౌజా కూడా షబానాను ఇదే ప్రశ్న అడిగారు. ‘మరి మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏమిటి?! అని. ప్రపంచాన్ని మనం చూసే దృష్టిలో ఉండేదే ఫెమినిజం. స్త్రీ పురుషులు వేర్వేరు. అంతే తప్ప ఎక్కువా కాదు, తక్కువా కాదు. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పురుషుడి దృష్టి కోణం నుంచే పరిష్కారం వెతుకుతూ వస్తోంది. పరిష్కారం కోసం స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించటమే ఫెమినిజం’ అని చెప్పారు షబానా. ఇంతకుమించిన నిర్వచనం ఉంటుందా స్త్రీవాదానికి? ఎంతైనా షబానా కదా! -
యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గం
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'యూట్యూబ్' భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లు మరింత ఆదాయాన్ని పొందడానికి సరికొత్త మార్గాన్ని పరిచయం చేసింది. 'షాపింగ్ ప్రోగ్రామ్' పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ వీడియోలలో ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు ఆర్జించవచ్చు.ఇప్పటికే ఈ షాపింగ్ ప్రోగ్రామ్ అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు దీనిని భారతీయ కంటెంట్ క్రియేటర్ల కోసం పరిచయం చేసింది. దీనికోసం యూట్యూబ్ ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హులైన వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్ కోసం కంటెంట్ క్రియేటర్లు.. యూట్యూబ్ షాపింగ్‌లో సైనప్ అవ్వాలి. మీ అప్లికేషన్‌ను ప్లాట్‌ఫామ్ ఆమోదించిన తరువాత షాపింగ్ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు క్రియేట్ చేసే వీడియోలలో, షార్ట్స్, లైవ్ స్టీమ్ వంటి వాటిలో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు, ఒక వీడియోకు సుమారు 30 ఉత్పత్తులను ట్యాగ్ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తులు యూజర్లకు కనిపిస్తాయి.యూజర్లు ఈ ఉత్పత్తులను చూసి, వారికి నచినట్లయితే దానిపైన క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు, అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేయడంతో యూట్యూబర్లకు కమీషన్ వస్తుంది. యూజర్ ఒక ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే.. ఎంత కమీషన్ వస్తుందనే వివరాలను కూడా క్రియేటర్ అక్కడే చూడవచ్చు.ఇదీ చదవండి: ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్ యాక్సెస్ పొందాలంటే.. కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 10,000 సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అన్ని అర్హతలు ఉన్న క్రియేటర్లు సేల్స్ కమీషన్ పొందవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ఆదాయంలో వాటా తీసుకోవాలని యూట్యూబ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. పిల్లల కోసం రూపోందించిన యూట్యూబ్ చానళ్లకు, మ్యూజిక్ చానళ్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. -
అనగనగా మునగ
సంప్రదాయేతర పంటల సాగు ద్వారా ఏజెన్సీ రైతులు అధిక ఆదాయం సాధించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా యూట్యూబ్ చానల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ చానల్ ద్వారా ప్రత్యేక వీడియోలు అప్లోడ్ చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంమునగ అంటే మొదటి మెట్టు‘కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం’పేరుతో ఉన్న యూట్యూబ్ చానల్లో జితేశ్ వి.పాటిల్ 40 నిమిషాల నిడివి గల వీడియోను ఈనెల 23న అప్లోడ్ చేశారు. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారని, ఈ సంప్రదాయ పంటల సాగు వల్ల ఎకరానికి రూ.20 వేలకు మించి ఆదాయం రావడం లేదని ఆ వీడియోలో కలెక్టర్ స్పష్టం చేశారు. మునగ సాగు చేయడం ద్వారా కనిష్టంగా రూ.75 వేలు, గింజలు, ఆకుల అమ్మకం ద్వారా మరో రూ.25 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరంగా చెప్పారు.ఖర్చు లేకుండా సాగుఎకరంలో వెయ్యి మునగ చెట్లు నాటొచ్చని కలెక్టర్ పాటిల్ తెలిపారు. మొక్క నాటింది మొదలు దిగుబడి వచ్చే వరకు రైతులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, రైతులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటనేవి వివరించారు. విత్తనాలు, మెటీరియల్ కాంపోనెంట్ అంతా కలిపి ఎకరానికి రూ.33 వేల దాకా ఖర్చు వస్తుందని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ఉపాధి హామీ పథకం తోడైతే రూ.34,500 వరకు రైతుకు సాయం అందుతుందన్నారు. మునగ సాగుకు ఉపాధి హామీ పథకం వర్తించాలంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులై ఉండాలని చెప్పారు.మార్కెటింగ్ ఈజీఒక మునగ చెట్టుకు కనిష్టంగా 180.. గరిష్టంగా 500కు పైగా కాయలు వస్తాయని తెలిపారు. ఒక చెట్టుకు 180 కాయల దిగుబడి అనుకుంటే... రూపాయికి రెండు కాయల వంతున అమ్మినా ఎకరం మీద రూ.75 వేల ఆదాయం కచ్చితంగా వస్తుందన్నారు. తక్కువ రేటుకు అమ్మితే హైదరాబాద్ నుంచి వ్యాపారులే వచ్చి మునగ కాయలు తీసుకెళతారని, మార్కెటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదని చెప్పారు.నవంబర్‌లో మొదలునవంబర్ రెండో వారంలో విత్తనాల కొనుగోలుతో మొదలయ్యే ‘మిషన్ మునగ’జూన్ చివరి వారంలో దిగుబడి తీసుకునే వరకు కొనసాగనుంది. ప్రతీ నెల, ప్రతీ వారం ఏ పని చేయాలనే అంశంపై రూపొందించిన రూట్‌మ్యాప్‌ను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి పంపారు. రాబోయే రబీ సీజన్లో జిల్లాలో కనీసం పది వేల ఎకరాల్లో మునగ సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలెక్టర్ ఆలోచనలు ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇప్పుడు ఉంది. అవగాహన తెచ్చుకొనిభద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా ఈ ఏడాది జూన్ 15న జితేశ్ వి.పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అశ్వారావుపేట మండలంలో పెద్దవాగుకు గండిపడింది. బాధిత రైతులతో మాట్లాడుతున్న సందర్భంలోనే జిల్లా రైతులు తక్కువ ఆదాయం పొందుతున్న అంశాన్ని కలెక్టర్ గుర్తించారు. అప్పటి నుంచి జిల్లాలో సాగు జరుగుతున్న తీరుతెన్నులు ఆయన పరిశీలించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులకు అధిక ఆదాయం రావాలంటే మునగ సాగే మేలనే నిర్ణయానికి వచ్చారు. అంతటితో ఆగిపోకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించారు. మలిదశలో మునగ సాగుతో పాటు రెండు ఎకరాల పొలంలో మునగ, వెదురు సాగుతో పాటు చేపలు, తేరో టీగల పెంపకంపై దృష్టి పెట్టనున్నారు. -
బిగ్‌బాస్‌ను వదిలిపెట్టనంటున్న సోనియా.. కొత్తగా ఏం చేసిందంటే?
బిగ్‌బాస్ షో వల్ల నెగెటివ్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే తాను కరెక్ట్‌గా ఉన్నానని.. కానీ, బిగ్‌బాసే తప్పుగా చూపించాడని ఫైర్ అయింది సోనియా ఆకుల. తన మాటల్ని, ప్రవర్తనని మరో కోణంలో ప్రేక్షకులకు చూపించాడని, అందువల్లే జనాలు తనను విమర్శిస్తున్నారంటోంది. ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం ఛాన్స్ దొరికినా బిగ్‌బాస్‌ను తిడుతూనే ఉంది. కొత్త యూట్యూబ్ ఛానల్..మితిమీరిన హగ్గులు, పర్సనల్ టార్గెట్ వంటి స్వయంకృతపరాధాలను సైతం ఒప్పుకోకపోవడం గమనార్హం. తాజాగా ఈ బిగ్‌బాస్ (ఎనిమిదో సీజన్) బ్యూటీ తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు వెల్లడించింది. సామాజిక సేవ నుంచి బిగ్‌బాస్ వరకు మీరు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ మరింత దగ్గరయ్యేందుకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఒక్కటేం ఖర్మ.. అన్నీ ఉంటాయ్యువర్స్ సోనియా.. ఇక్కడ బిగ్‌బాస్ షోలో ఎపిసోడ్ వెనకాల జరిగిన స్టోరీలను, నా యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించిన కథనాలను, వ్యక్తిగత విషయాలను, లైఫ్‌స్టైల్ కంటెంట్.. ఇలా అన్నీ మీతో పంచుకుంటాను. అలాగే సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కచ్చితంగా సపోర్ట్ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిన్ను బిగ్‌బాస్‌లోనే చూడలేకపోయాం.. ఇంకా యూట్యూబ్‌లో ఏం చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్
దేశంలో రోజురోజుకీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, అధికారులు, కంపెనీలు ఇలా అన్నీ సైబర్లో వలలో చి కుటున్నాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ శుక్రవారం హ్యాక్‌కు గురైంది. యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్టు చేశారు.సాధారణంగా ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే వాటితో పాటు కొన్ని కీలక కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆ వీడియోలకు బదులుగా అందులో ప్రస్తుతం అమెరికాకు చెందిన రిపిల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేసే వీడియోలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది. -
బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..
చేస్తున్న పనిలో సవాళ్లు లేకుంటే.. కొందరు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, నచ్చినపని చేస్తూ.. కొందరికి సాయపడాలనుకుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'నిశ్చా షా' (Nischa Shah). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతంలో ఎందుకు ఉద్యోగం వదిలేశారు. ఇరులకు ఎలా సాయం చేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..'నిశ్చా షా' ఒకప్పుడు లండన్‌లో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఈ రంగంలో ఈమెకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా, క్రెడిట్ అగ్రికోల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఏడాది రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వేతనం తీసుకునేది. చేస్తున్న పనిలో సవాళ్లు కనిపించకపోవడంతో జాబ్ వదిలేయాలనుకుంది. అనుకున్న విధంగా ఉద్యోగం వైదిలేసి యూట్యూబ్ ఛానల్ చెస్ట్ చేసింది.ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించిన నిశ్చా షా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను చెబుతూ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తింది. దీనికోసం 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం.ప్రారంభంలో అనుకున్న విధంగా చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు.. వెయ్యిమంది సబ్స్క్రైబర్లను సంపాదించడానికి 11 నెలల సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో నిశ్చా షా పేర్కొన్నారు. ఆ సమయంలో పొదుపు చేసుకున్న డబ్బును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో 50వేలమంది సబ్స్క్రైబర్లను పొందేలా చేసింది. అప్పుడు ఒకేసారి రూ.3 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే! ఇప్పుడు నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ 1.16 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. దీంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అనుకున్నది సాధించడానికి ఉన్న ఉద్యోగం వదిలి సక్సెస్ సాధించింది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి వాటికి పూనుకునే ముందు పదిసార్లు ఆలోచించడం మంచింది. -
ఆ మీడియాలకు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కుట్రతో తనపైన, తన కుటుంబంపైన అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ చానళ్లతో పాటు యూట్యూబ్ సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివరం లీగల్ నోటీసులు పంపించారు. పక్కా ప్రణాళికతో తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే ఈ చానళ్లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆయన తాను పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా ముసుగులో పక్కా ఎజెండాతో సాగిస్తున్న కుట్రలో భాగంగా తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేర్లను, ఫొటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుకొంటున్నారని, ఈ చానళ్లపై తగిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. వెంటనే ఆ వీడియోలను తొలగించండి తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ చానళ్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ చానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని, అలాంటి వీడియోలను, కంటెంట్‌ను తీసివేసినట్లు చెప్పాయని కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా చానళ్లు, యూట్యూబ్ చానల్స్ ఇలాంటి కంటెంట్ ని తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. యూట్యూబ్‌కి సైతం నోటీసులు కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్‌కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!
టాలీవుడ్ సెన్సెషన్ నటి సమంత రూత్ ప్రభు 2022లో కండరాల క్షీణతకు సంబంధించిన మయోసిటిస్‌తో తీవ్రంగా బాధపడిన సంగతి తెలిసిందే. అందుకోసం అమెరికా, దక్షిణకొరియాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంది కూడా. ప్రస్తుతం కొంతవరకు కోలుకున్న సమంత మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొని ఇదివరకటిలా యాక్టివ్‌గా పనిచేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. అందులో త్వరలో తాను ఆరోగ్య చిట్కాలను అందించే ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించనట్లు పేర్కొన్నారు. అంతేగాదు 'టేక్ 20' పేరుతో ప్రారంభించనున్న యూట్యూబ్ టీజర్‌కి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు. అందులో పోషకాహార నిపుణుడు అల్కేష్ షరోత్రితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ టేక్ 20లో దైనందిన జీవితానికి అవసరమయ్యే నాణ్యతతో కూడిన ఆరోగ్యవంతమైన ఫుడ్‌కి సంబంధించిన సమాచారం అందించాలనేది తమ ప్రయత్నం అని సమంత వివరించింది. అలాగే ఇందులోని కంటెంట్ సమాజంలో ఉన్న అందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుందని నమ్మకంగా చెప్పింది. అంతేగాదు ఆరోగ్య చిట్కాలకు సంబంధించిన తొలి వీడియో తొలి వీడియో ఈ నెల (ఫిబ్రవరి) 19 విడుదల కానున్నట్లు తెలిపింది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో కనిపించి సందడి చేసిన సమంతా రూత్ ప్రభు మళ్లీ ఈ తాజా వీడియోతో తన పునరాగమనం గురించి వెల్లడించింది. ఇక ఆమె తన సంస్థ ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పిల్లల భవిష్యత్తుకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక తన చీర బ్రాండ్ అయిన సాకితో నేత కార్మికులకు, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కళాకారులకు తన వంతుగా సాయం అందిస్తోంది సమంత!. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!) -
ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ మరో రికార్డు!
అయోధ్యలోని నూతన రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ ఈ రికార్డులలో అగ్రస్థానంలో నిలిచింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది. రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా తొమ్మిది మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలలో ఇదే అత్యధిక రికార్డ్‌గా నిలిచింది. నరేంద్ర మోదీ ఛానెల్లో రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక ‘PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’ and ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ టైటిల్స్‌తో ప్రత్యక్ష ప్రసారమైంది. నరేంద్రమోదీ ఛానెల్లోని ఈ లైవ్‌కి ఇప్పటివరకు మొత్తం ఒక కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఇదే ఛానల్లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల మందికి పైగా జనం వీక్షించారు. ఈ రికార్డులలో మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2023 మ్యాచ్, నాలుగవ స్థానంలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిలిచాయి. నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇప్పటివరకూ ఈ ఛానల్లో మొత్తం 23,750 వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ వీడియోల మొత్తం వీక్షణలు 472 కోట్లు. యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లను దక్కించుకున్న ప్రపంచంలోని మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. -
నేటి నుంచి ప్రజల ముందుకు సాక్షి లైఫ్
-
సాక్షి మీడియా నుంచి సాక్షి లైఫ్ హెల్త్ పోర్టల్
-
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్‌లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్‌లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్‌లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
‘ఓల్డ్ బట్ గోల్డ్’ యూట్యూబ్ చానల్‌తో.. షోమ్ మ్యూజికల్ జర్నీ..
'షహన షోమ్' మ్యూజికల్ జర్నీ తన అధికార యూట్యూబ్ చానల్ ‘వోల్డ్ బట్ గోల్డ్’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్ టైమ్‌లెస్ మెలోడిస్‌ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్ కర్నే వాలే’ లాంటి క్లాసిక్‌తో పాటు ‘సేవ్ ది గర్ల్‌చైల్డ్’ ‘ఎడ్యుకేషన్ ఫర్ ది అండర్ప్రివిలేజ్డ్’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్ గజల్స్, కీర్తనలు పాడేది. ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్‌లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్‌హిట్ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్మెషిన్లో గతంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన. ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం -
డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్‌పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్‌ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్‌లో అప్లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు. 1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసారు. శాఖల వారీగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్‌ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు ‘ఆర్బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్‌గా వీక్షిస్తుంటాను. సీజన్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్‌కు వ్యూయర్షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఛానల్ సబ్స్రైబర్లు రెండు కోట్లు దాటారు. ప్రపంచంలో ఈ ఘనత దక్కిన నేత నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో మోదీ ఈ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు దీనిని వినియోగిస్తూనే ఉన్నారు. ఇందులో పోస్టు చేసిన వీడియోలకు 450 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఛానల్ సబ్‌స్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో 64 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. వ్యూస్ అంశంలో మోదీ తర్వాత ఉక్సెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు. జెలెన్ స్కీ పోస్టు చేసిన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది ఉన్నారు. ఇదీ చదవండి: అఫీషియల్: మణిపూర్ నుంచి ముంబై దాకా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయయాత్ర’ -
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్‌కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్‌ఫోన్ ‘2021లో స్మార్ట్‌ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
ప్రముఖ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో లీక్.. ఇంటర్నెట్లో వైరల్
ఇంటర్నెట్, సోషల్ మీడియా రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అనేక సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అలీజా సహర్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలీజా సహర్ పాకిస్థాన్‌లో ఉన్న ప్రముఖ యూట్యూబర్. అలీజా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్థాన్ పల్లెటూరి జీవితాన్ని చూపించేది. ఈ యూట్యూబర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. పాకిస్థానీ యూట్యూబర్ ప్రైవేట్ వీడియో వైరల్ అలీజా సహర్ ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాకిస్తాన్ గ్రామీణ జీవితాన్ని చూపించేది. దీంతో ఆమె ఈ ఛానెల్ ద్వారా ప్రజాదరణ పొందింది. యూట్యూబ్, టిక్‌టాక్ ద్వారానే దాదాపు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. వారందరి కోసం పాకిస్తానీ గ్రామ ప్రజల జీవితం, వంట పద్ధతి, సంస్కృతి వంటి కంటెంట్‌ను చూపించేది. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అలీజా సహర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: కల్పికతో ఎఫైర్ లేదు.. ఆమె చేసిన రచ్చకు కారణం ఇదే: అభినవ్ గోమటం) ఏం జరిగింది..? అలీజా సహర్ ఒక వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడింది. ఆ సమయంలో జరిగిన కొన్ని కార్యకలాపాలు వీడియో కాల్లో రికార్డ్ చేయబడ్డాయి. దానిని ఆ వ్యక్తి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆమె తెలుపుతుంది. నివేదికల ప్రకారం ఆ వీడియో కాల్లో అలీజా సహర్ తన దుస్తులు తొలగించి శరీరాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలతో పాటు కొంత అసభ్యకరమైన మాటలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్ చిక్కుల్లో పడింది. అయితే, అలీజా సహర్ ఇప్పటికీ దీని గురించి స్పందించి అందులో ఉండేది తాను కాదని ఎవరో వీడియోను ఎడిట్ చేశారంటూ ఆమె పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెళ్లింది. కానీ నెటిజన్లు మాత్రం వీడియోలో ఉండేది పక్కాగా ఆమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ అలీజా సహర్ పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ని ఆశ్రయించి.. తన ప్రైవేట్ వీడియోను లీక్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఖతార్‌లో నివసిస్తున్న అతన్ని ఎఫ్ఐఏ గుర్తించినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని అలీజా తన వీక్షకులకు చెప్పింది. సైబర్ క్రైమ్ టీమ్ కూడా తనకు సహాయం చేసేందుకు వచ్చిందని ఆమె తెలిపింది. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఆన్లైన్ కమ్యూనిటీకి తన యూట్యూబ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. View this post on Instagram A post shared by Aliza Sehar Official (@aliza.sehar.official) -
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్‌లో ఉంటే.. అక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్‌షిప్‌తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్‌షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్‌ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్‌లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్‌ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్‌కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్‌లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్‌కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్‌పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్‌కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్‌సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
మీ పిల్లలు సైన్స్ అంటే భయపడుతున్నారా? ఈమె పాఠాలు వినిపించండి..
‘సరిగా అర్థం చేసుకోవడం నుంచే ప్రతిభకు బీజాలు పడతాయి’ అంటారు. ‘నాకు అర్థం కాలేదు’ అన్నంత మాత్రాన ఆ స్టూడెంట్ తెలివి తక్కువ అని కాదు. ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవడానికి, అవడానికి మధ్య ఏదో గ్యాప్ ఉండి ఉండవచ్చు. ఆ ఖాళీని పూరించగలిగితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ‘స్టెమాన్స్టర్’ద్వారా నిరూపించింది బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ సోనాలి గుప్తా... ఆరోజు స్కూలు నుంచి వచ్చిన శ్రిష్టి తల్లి సోనాలిని ఒక డౌట్ అడిగింది.‘లోహంతో తయారు చేసిన ఓడ నీటిలో ఎలా తేలుతుంది?’నాల్గవ తరగతి చదువుతున్న శ్రిష్టి ఇలాంటి సందేహాలెన్నో తల్లిని అడుగుతుంటుంది. అప్పటికప్పుడు జవాబు చెప్పి చిన్నారి సందేహాన్ని తీరుస్తుంటుంది సోనాలి. ఇంట్లో శ్రిష్టి కోసం ఒక ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ను పరిశీలించడం ద్వారా శ్రిష్టిలో శాస్త్రీయ విషయాలపై ఆసక్తి పెంచాలనేది సోనాలి కోరిక. ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన సోనాలికి కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అత్యంత సులువైన పని. మరి శాస్త్రీయ విషయాలపై అవగాహన లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఓడకు సంబంధించిన కుమార్తె సందేహాన్ని ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే చెప్పింది సోనాలి. తాను అలా చెప్పడం వల్ల శ్రిష్టికి సులభంగా అర్థమైంది. ఇదే విధానంలో ఇతర పిల్లలకు చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన లాక్డౌన్ టైమ్‌లో పట్టాలకెక్కింది. ‘అది నా జీవితంలో చెప్పుకోదగిన ముఖ్య సందర్భం’ అంటుంది సోనాలి. ‘లెర్నింగ్ బై డూయింగ్’ అనే నినాదంతో పిల్లలకు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచడానికి హ్యాండ్స్–ఆన్ లెర్నింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘స్టెమాన్స్టర్’కు శ్రీకారం చుట్టింది. రకరకాల సందేహాలను తీర్చేలా వాట్సాప్ వేదికగా ఎన్నో వీడియోలు చేసింది. సంప్రదాయ బోధన ఎలా మెరుగుపడాలో చెబుతున్నట్లుగా ఉండేవి ఆ వీడియోలు. పరిచితులు, అపరిచితులు, మిత్రుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ‘మీ వీడియోలు అంటే మా పిల్లలకు ఎంతో ఇష్టం’ అని ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చెప్పినప్పుడల్లా సోనాలికి ఉత్సాహంగా ఉండేది. ‘చాలా స్కూళ్లలో సైన్స్ అనేది సూత్రాలు, నిర్వచనాల పరిధి దాటి బయటికి రాదు. నిర్వచనాలు నిర్వచనాలలాగే చెప్పడం వల్ల అందరు పిల్లలకు అర్థం కాకపోవచ్చు. అందుకే అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్‌గా చెప్పాలి. ప్రపంచంలో గొప్ప ల్యాబ్స్ అని చెప్పుకోదగ్గ ఎన్నో ల్యాబ్స్‌లో పనిచేశాను. ఎందరో పిల్లలు ఆ ల్యాబ్స్‌లో కనిపించేవారు. పిల్లలకు సైన్స్‌పై ఆసక్తి అక్కడినుంచే మొదలవుతుంది’ అంటుంది సోనాలి. ‘స్టెమాన్స్టర్’ ద్వారా సైన్స్, గణితానికి సంబంధించి జటిలమైన కాన్సెప్ట్‌ల గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి చెబుతున్నారు. ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించారు. ‘పిల్లలు నా నుంచి మాత్రమే కాదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు’ నవ్వుతూ అంటుంది సోనాలి. అయిదవ తరగతి చదువుతున్న ఆర్యన్ కేజ్రీవాల్‌కు సౌరవ్యవస్థ అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘స్టెమాన్స్టర్’ ΄ప్లాట్‌ఫామ్ ద్వారా తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాడు. ‘నేను ఒరిగామి స్టార్స్ తయారు చేస్తాను. వాటి ద్వారా ఎన్నో సైన్స్ విషయాలు ఫ్రెండ్స్‌కు చెబుతుంటాను’ అంటాడు ఆర్యన్. ‘మా అబ్బాయిలో ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ వాడి ఫేవరెట్ సబ్జెక్ట్‌లు’ అంటుంది ఆనందంగా ఆర్యన్ తల్లి ఆంచల్. ప్రశ్న–జవాబుల నుంచి వర్క్‌షాప్‌ల వరకు ‘స్టెమాన్స్టర్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఆస్క్, డూ, లెర్న్, రిపీట్’ అంటూ పిల్లలకు దగ్గరవుతోంది స్టెమోన్స్టర్.