ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..! | Samantha Ruth Prabhu Shares Teaser Of Health Podcast Take 20 | Sakshi
Sakshi News home page

ఆరోగ్య చిట్కాలు చెప్పనున్న సమంత.. అందుకోసం..!

Published Sat, Feb 17 2024 4:02 PM | Last Updated on Sat, Feb 17 2024 4:36 PM

Samantha Ruth Prabhu Shares Teaser Of Health Podcast Take 20 - Sakshi

టాలీవుడ్‌ సెన్సెషన్‌ నటి సమంత రూత్‌ ప్రభు 2022లో కండరాల క్షీణతకు సంబంధించిన మయోసిటిస్‌తో తీవ్రంగా బాధపడిన సంగతి తెలిసిందే. అందుకోసం అమెరికా, దక్షిణకొరియాలకు వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకుంది కూడా. ప్రస్తుతం  కొంతవరకు కోలుకున్న సమంత మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొని ఇదివరకటిలా యాక్టివ్‌గా పనిచేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమంత సోషల్‌ మీడియాలో ఒక వీడియోని కూడా పోస్ట్‌ చేశారు.

అందులో త్వరలో తాను ఆరోగ్య చిట్కాలను అందించే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించనట్లు పేర్కొన్నారు. అంతేగాదు 'టేక్‌ 20' పేరుతో ప్రారంభించనున్న యూట్యూబ్‌ టీజర్‌కి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్‌ చేశారు. అందులో పోషకాహార నిపుణుడు అల్కేష్‌ షరోత్రితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ టేక్‌ 20లో దైనందిన జీవితానికి అవసరమయ్యే నాణ్యతతో కూడిన ఆరోగ్యవంతమైన ఫుడ్‌కి సంబంధించిన సమాచారం అందించాలనేది తమ ప్రయత్నం అని సమంత వివరించింది. అలాగే ఇందులోని కంటెంట్‌ సమాజంలో ఉన్న అందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుందని నమ్మకంగా చెప్పింది. 

అంతేగాదు ఆరోగ్య చిట్కాలకు సంబంధించిన తొలి వీడియో తొలి వీడియో ఈ నెల (ఫిబ్రవరి) 19 విడుదల కానున్నట్లు తెలిపింది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో కనిపించి సందడి చేసిన సమంతా రూత్ ప్రభు మళ్లీ ఈ తాజా వీడియోతో తన పునరాగమనం గురించి వెల్లడించింది. ఇక ఆమె తన సంస్థ ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా పిల్లల భవిష్యత్తుకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక తన చీర బ్రాండ్ అయిన సాకితో నేత కార్మికులకు, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కళాకారులకు తన వంతుగా సాయం అందిస్తోంది సమంత!. 

(చదవండి: వావ్‌!..వాట్‌ ఏ డ్రై ఫ్రూట్‌ జ్యువెలరీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement