చేస్తున్న పనిలో సవాళ్లు లేకుంటే.. కొందరు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, నచ్చినపని చేస్తూ.. కొందరికి సాయపడాలనుకుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'నిశ్చా షా' (Nischa Shah). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతంలో ఎందుకు ఉద్యోగం వదిలేశారు. ఇరులకు ఎలా సాయం చేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..
'నిశ్చా షా' ఒకప్పుడు లండన్‌లో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. ఈ రంగంలో ఈమెకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా, క్రెడిట్ అగ్రికోల్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఏడాది రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వేతనం తీసుకునేది. చేస్తున్న పనిలో సవాళ్లు కనిపించకపోవడంతో జాబ్ వదిలేయాలనుకుంది. అనుకున్న విధంగా ఉద్యోగం వైదిలేసి యూట్యూబ్ ఛానల్ చెస్ట్ చేసింది.
ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించిన నిశ్చా షా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను చెబుతూ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తింది. దీనికోసం 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం.
ప్రారంభంలో అనుకున్న విధంగా చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు.. వెయ్యిమంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించడానికి 11 నెలల సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో నిశ్చా షా పేర్కొన్నారు. ఆ సమయంలో పొదుపు చేసుకున్న డబ్బును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో 50వేలమంది సబ్‌స్క్రైబర్‌లను పొందేలా చేసింది. అప్పుడు ఒకేసారి రూ.3 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!
ఇప్పుడు నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ 1.16 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. దీంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అనుకున్నది సాధించడానికి ఉన్న ఉద్యోగం వదిలి సక్సెస్ సాధించింది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి వాటికి పూనుకునే ముందు పదిసార్లు ఆలోచించడం మంచింది.
Comments
Please login to add a commentAdd a comment