యూట్యూబ్‌ కోసం రూ.8 లక్షల ఖర్చు.. ఎంత వచ్చిందంటే? | India Women YouTubers Quit After 3 Years And Investing Rs 8 Lakh For Channel | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ కోసం రూ.8 లక్షల ఖర్చు.. ఎంత వచ్చిందంటే?

Dec 20 2024 4:26 PM | Updated on Dec 20 2024 4:49 PM

India Women YouTubers Quit After 3 Years And Investing Rs 8 Lakh For Channel

టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తూ.. యూట్యూబ్ మీద పడుతున్నారు. నేడు చాలామందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొందరు లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తుంటే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నళిని ఉనగర్'. ఇంతకీ ఈమె ఎవరు? యూట్యూబ్ కోసం ఎంత వెచ్చించింది? ఎందుకు ఫెయిల్ అయిందనే.. వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నళిని ఉనగర్.. 'నలినీస్ కిచెన్ రెసిపీ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు నడిపింది. అయితే ఈమెకు యూట్యూబ్ ద్వారా ఏ మాత్రం ఆదాయం రాలేదు. కానీ నళిని.. స్టూడియో, కిచెన్ సెటప్ చేసుకోవడానికి, ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

మూడేళ్ల పాటు సుమారు 250 వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. దీంతో విసుగెత్తి.. యూట్యూబ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా కిచెన్ వస్తువులను, స్టూడియో ఎక్విప్​మెంట్స్ అన్నీ కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. నేను నా యూట్యూబ్ కెరీర్​లో ఫెయిల్ అయ్యాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పింది.

మూడు సంవత్సరాల్లో 250 వీడియోలు చేసాను, 2450 సబ్​స్కైబర్లు మాత్రమే వచ్చారు. ఎంత కష్టపడినా.. యూట్యూబ్ కొన్ని రకాల కంటెంట్‌లకు మాత్రమే ఫేవర్ చేస్తుందని నళిని ఆరోపించింది. నేను మూడేళ్ళలో సంపాదించిన మొత్తం 'సున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.

నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ ఛానల్ ప్రారంభించాడని డబ్బు, సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను.. అని ఒక ట్వీట్‌లో వెల్లడించింది. కానీ నాకు యూట్యూబ్ ఎలాంటి ప్రతిఫలాన్ని అందించలేదని వాపోయింది.

యూట్యూబర్స్ ఎదుర్కోవాల్సిన సవాళ్లు
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట నిజమే. కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అందరూ డబ్బు సంపాదిస్తారు అని అనుకోవడం మూర్కత్వమే. ఎందుకంటే యూట్యూబ్​లో అందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. డబ్బు రావడం అనేది సబ్‌స్కైబర్లు, వాచ్ అవర్స్, వ్యూవ్స్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి యూట్యూబర్స్ వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగి.. ఓపిగ్గా నిలబడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement