మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? మీ కంటెంట్‌ను వీరే భాషల్లో వినిపించాలనుకుంటున్నారా? ‘అవును.. కానీ, ఆ భాషలో అంతగా ప్రావీణ్యం లేదు’ అని అధైర్య పడకండి. యూట్యూబ్ మీలాంటి వారికోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు తన బ్లాగ్‌పోస్ట్‌లో వివరాలు వెల్లడించింది.
సినిమాలే కాదు, భాష రాకపోయినా ఇకపై యూట్యూబ్ వీడియోలను ఖండాంతరాలను దాటించి ఏంచక్కా మీ కంటెంట్‌ను విదేశాల్లోని వారికి వినిపించవచ్చు. ఇందుకోసం యూట్యూట్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చించి. ఈ ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. దాంతో కంటెంట్ క్రియేటర్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వీడియోను ఇతర భాషల్లో పోస్ట్ చేసే వీలుంటుంది. స్లైడ్స్, వీడియో బిట్స్‌తో కంటెంట్ ఇచ్చేవారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అన్ని భాషల్లోకి మారుతుందా..?
ప్రాథమికంగా ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియోలోని వాయిస్ పైన తెలిపిన ఏ భాషల్లో ఉన్నా ముందుగా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది. ఈ వీడియోపై ఆటో డబ్బ్‌డ్ అనే మార్కు ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఏఐ డబ్ చేసిన వాయిస్ వద్దనుకుంటే, ఒరిజినల్ వాయిస్ వినాలనిపిస్తే వీడియోపై ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి అసలు వాయిస్‌ను వినొచ్చు. ప్రాథమికంగా ప్రస్తుతానికి పైన తెలిపిన భాషల్లోనే వాయిస్ డబ్ అవుతుంది. యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఇందులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ తెలిపింది.
ఎలా వినియోగించాలంటే..
కంటెంట్ క్రియేటర్లు వీడియో అప్‌లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్‌గా వాయిస్‌ని గుర్తించి అది సపోర్ట్ చేసే భాషల్లోకి కంటెంట్‌ను డబ్ చేస్తుంది. ఫైనల్‌గా అప్‌లోడ్ చేయడానికి ముందు రివ్యూ చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్‌లో డబ్బ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. వైటీ స్టూడియోలోని ప్రతి వీడియోను నియంత్రించే అధికారం మాత్రం కంటెంట్ క్రియేటర్లకే ఉంటుంది.
ఇదీ చదవండి: 3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ
ఈ ఫీచర్ ఎప్పుడు పని చేయదంటే..
కొన్ని సందర్భాల్లో వాయిస్ క్లారిటీ లేకపోయినా, లేదంటే ఏదైనా కారణాలతో వాయిస్ గుర్తించలేకపోయినా డబ్బింగ్ పని చేయదని యూట్యూబ్ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ డబ్బింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే మాత్రం ఇంగ్లీష్ వాయిస్ క్లారిటీగా ఉండడంతోపాటు రికార్డింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. ఇప్పటివరకు ఇంగ్లీష్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే రిజినల్ కంటెంట్ క్రియేటర్ల సంపాదన ఈ ఫీచర్‌తో పెరగబోతుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment