Orissa
-
ఫిట్‌లెస్ సెంటర్
శ్రీకాకుళం రూరల్: ఇటీవల ఓ ప్రైవేట్ బస్సు కొందరు పాసింజర్లతో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తుండగా మార్గమధ్యంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో తుప్పల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. అంతకు వారం రోజు ల కిందటే బస్సుకు ఫిట్నెస్ పరీక్ష చేయించినట్లు డ్రైవర్ తెలిపారు. ఆరా తీస్తే ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది శ్రీకాకుళం శివారులోని ఓ ఫిట్నెస్ సెంటర్ అని తెలిసింది. ఎవరూ టెస్ట్ డ్రైవ్ చేయకుండా, మిషన్లతో పూర్తిస్థాయిలో పరీక్షించకుండా కేవలం మాన్యువల్‌గా పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇదే ప్రమాదానికి కారణం. ఆర్టీఏ అధికారులెక్కడ..? ఒకప్పుడు బస్సుకు గానీ, లారీలకు గానీ చివరికి ఆటోలకు సైతం ఫిట్నెస్లు చేయించాలంటే నేరు గా అనుభవం ఉన్న ఆర్టీఏ అధికారి ఆ వాహనాన్ని కొంతమేర డ్రైవింగ్ చేసేవారు. తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్య సంస్థలు లోపాలు గుర్తించడం లేదు. నామమాత్రంగా కొన్ని టెస్టులు చేసి అనుమతులు ఇచ్చేస్తున్నారు. నగరంలోని నాగావళి నదీ తీరాన, ఫాజుల్‌బేగ్ ప్రాంతం అగ్రికల్చర్ కార్యాలయం పరిధిలో వాహ న ఫిట్నెస్ సెంటర్లకు కొన్ని నెలల కిందట అనుమతులు ఇచ్చారు. ఇక్కడ వివిధ రకాలైన ట్రాన్స్‌పోర్టు (ఎల్లోబోర్డు) వాహనాలన్నింటికీ మిషనరీతోనే బండి కండీషన్లకు పర్మిషన్లు ఇస్తున్నాయి. ఇక్కడ అనుభజ్ఞులైన ఆర్టీఏ అధికారులంటూ ఎవ్వరూ లేరు. ప్రైవేట్ యాజమాన్య సంస్థ పెట్టుకున్న సిబ్బందితోనే తూతూ మంత్రంగా వాహనాలకు ఫిట్నెస్లు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆటో నుంచి తోక లారీ వరకూ ఎలాంటి వాహనానికై నా ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని అనుమతులు ఆ ప్రైవేట్ యాజమాన్య సంస్థే ఫిట్నెస్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఆర్టీఎ అధికారుల పాత్ర, అప్రూవుల్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఏజెంట్లకు పండగే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఏజెంట్ల ఆశలు చిగురించాయి. వారు ఇచ్చిన టోకెన్ నంబర్ ఆధారంగానే ఏదైనా బండికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు త్వరితగతిన వచ్చేస్తున్నాయి. పొరపాటున నేరుగా ఆన్లైన్ ద్వారా ఎఫ్ఫీకు సంబంధించిన స్లాట్‌ను వాహన యజ మాని బుక్ చేసుకుంటే అది పూర్తిగా ఫెయిల్ అవ్వాల్సిందే. ప్రభుత్వ ఆధీనంలో ఫిట్నెస్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే రెండోరోజుకు కూడా మా ర్చుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఫిట్నెస్ సెంటర్లో ఆ పరిస్థితి లేకుండా పోయింది. భారీ దోపిడీ కేంద్రంలో వివిధ రకాలైన వాహనాలపై భారీ దోపిడీ జరుగుతోంది. ఇదంతా ఏజెంట్ల ద్వారానే కమిషన్ పద్ధతిలో నడుస్తోంది. స్థానికంగా ఏర్పాటు చేసిన రేట్లు కంటే అధిక రేట్లకు ముందస్తుగానే ఏజెంట్ ద్వారా డబ్బులు లాగేస్తున్నారు. ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్ల జారీ వాస్తవంగా ఏదైనా బండి ఫిట్నెస్ కేంద్రానికి వెళ్తే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి. ఇది బండి కొన్న నెలరోజులకే షోరూంకు వస్తుంది. కానీ ఫిట్నెస్ కేంద్రంలో ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేస్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు రూ. 20 విలువ చేసే రిఫ్లెక్టివ్ రెడ్ టేపును బండికి అంటించడానికి రూ. 300 నుంచి రూ.500 వరకూ దోచేస్తున్నారు. శ్రీకాకుళం శివారులో వాహన ఫిట్నెస్ సెంటర్ ఏజెంట్ కోడ్‌తో బుక్ చేసుకుంటేనే ఫిట్నెస్ మంజూరు ఆర్టీఏ అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ పేరుతో పత్రాల జారీ పట్టించుకోని రవాణాశాఖ అధికారులు ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి ఫిట్నెస్ కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గ తంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నపుడు బండి కండీషన్ చూస్తూ ఫిట్నెస్ సర్టిఫికేట్లు అందించేవాళ్లం. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ప్రైవేట్ పరం చేశారు. మా పాత్ర అంటూ ఏమీ లేదు. – విజయ సారథి, డీటీసీ టోకెన్ తీసుకున్నాం ఆటో ఫిట్నెస్ కోసం ఏజెంట్‌కు రూ.3000 డబ్బులు ఇచ్చి ఫిట్నెస్ టోకెన్ తీసుకున్నాం. ఉదయం 10 గంటలకు ఫిట్నెస్ కేంద్రంలో బండి పెట్టాను. మధ్యాహ్నం 3 గంటలకు బండి ఇచ్చారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో బండి ఫిట్నెస్ చేసుకుంటే రూ.1000తోనే సరిపోయేది. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ ప్రతి దానికి అధికంగా డబ్బులు కట్టాల్సిందే. – మురళి, ఆటో డ్రైవర్ -
భారీగా ఆవుల అక్రమ రవాణా
కొరాపుట్: ఆవుల అక్రమ రవాణాని ప్రజలు అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్ పట్టణం లో జయనగర్ మీదుగా వరుసగా వాహనాలతో ఆవులు తరలించడాన్ని స్థానికులు గమనించారు. ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి వాహనాలు అడ్డగించారు. అప్పటికే రెండు వ్యాన్లు ప్రజలను చూసి వేగంగా వెళ్లిపోయాయి. వెనుక ఉన్న 9 వ్యాన్లను ప్రజలు అదుపులోకి తీసుకున్నారు. వాటిని నడుపుతున్న డ్రైవర్లపై దాడికి దిగారు. ఇది తెలిసి హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళకు దిగారు. పోలీసు బలగాలు చేరుకుని ప్రజల నుంచి వాహన డ్రైవర్లను రక్షించారు. ఈ వాహనాలు కొరాపుట్ జిల్లాలోని జయంత్ గిరి నుంచి ఆంధ్రా బోర్డర్ లోని పాడువకి తరలిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. -
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య డిమాండ్ చేసింది. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం మేడే కరపత్రాల ను ఆవిష్కరించారు. అన్ని ఊరూవాడల్లో కార్మిక పతాకాలను ఆవిష్కరించి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయా లని కోరారు. అలాగే కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలన్నారు. కనీసం వేతనం రూ.26వేలు చెల్లించాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి శీల కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధనరావు, అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, దాసరి నారాయణమూర్తి, మామిడి గణపతి, గూడ మన్మధ, డొక్కర లక్ష్మణ, తామాడ గంగయ్య, మురిపింటి గంగయ్య, దాసర దానేశు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు అడుగుల పుస్తకం ఆవిష్కరణ
గార: తెలుగు భాషా విజ్ఞానానికి సంబంధించి ఆరు అడుగుల పెద్ద పుస్తకాన్ని బుధవారం ఉపాధ్యాయు లు, విద్యార్థులు ఆవిష్కరించారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అంపోలు పంచాయతీ ఆడవరం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం భోగెల ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాన్ని తయారు చేశారు. వీటిలో అక్షర వర్ణమాల, గుణింత పేర్లు, పదాలు, పద్యాలు, గురజాడ, గిడుగు, వేమన వంటి సాహిత్య కవుల చరిత్రలు, పాఠశాల ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. పుస్తక జ్ఞానంలో మనిషి విద్యావంతుడు అవుతాడన్నారు. -
పునరావృతం కాకుండా చూడాలి
గార: శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్లు దహనం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. బుధవారం కూర్మనాథాలయానికి జనసేన నాయకుల తో కలసి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాబేళ్ల మరణానికి గల కారణాలు విశ్లేషించాలని, దహనం చేయడంలో ఎవరు చేశారన్నది త్వరగా విచారించాలని కోరారు. కార్యక్రమంలో పైడి వేణుగోపాలరావు, శివ్వాన ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, పండి యోగీశ్వరరావు, పైడి సిందూర, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్‌లో ప్రసవం
మందస: మందస మండలం కుడుమాసాయ్ గిరిజన గ్రామంలో ఓ మహిళ అంబులెన్స్‌లో ప్రసవించారు. ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో నొప్పులు అధికం కావడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇద్దరినీ హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలెట్ రామచంద్రారెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యవేక్షించారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న సభ, హెలీప్యాడ్ ఏర్పాటు, వాహ నాలు పార్కింగ్, మత్స్యకారులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. పుస్తక ప్రదర్శన శ్రీకాకుళం అర్బన్: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కా ర్యదర్శి బి.కుమార్రాజు మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పించడం జరిగిందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు. ఈ ప్రదర్శనలో రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, నాటికలు, ఇయర్ బుక్స్, నిఘంటువులు, పోటీ పరీక్షలకు సంబంధించిన 200 రకాల పుస్తకాలు ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప గ్రంథాలయాధికారి వీవీజీఎస్ శంకరరావు, పై.మురళీ కృష్ణ, యు.కల్యాణి, టి. రాంబాబు, పి.రామ్మోహన్ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. కందుకూరి పురస్కార గ్రహీతలకు సత్కారాలు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని వాసవీ కల్యాణ మండపంలో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ఇటీవల కందుకూరి పురస్కారాలు అందుకున్న కళాకారులను బుధవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. పురస్కారాలు అందుకున్న మెట్ట పోలినాయుడు, గుత్తు చిన్నారావులకు జ్ఞాపికలు, సన్మాన పత్రాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులు, సుమిత్రా కళాసమితి సభ్యులు పాల్గొన్నారు. ఇంటి బాట.. టెక్కలి: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులంతా ఇంటి బాట పట్టారు. బుధవారం తరగతుల నిర్వహణ చివరి రోజు కావడంతో, సుదూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులంతా వసతి గృహాల వద్దకు చేరుకుని వారి పిల్లలకు సంబంధించి సామ గ్రితో ఇంటి బాట పట్టారు. మళ్లీ జూన్ 12 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. -
ఉగ్రదాడి హేయకరమైన చర్య
భువనేశ్వర్: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటనలో రాష్ట్రానికి చెందిన ప్రశాంత శత్పతి మరణం పట్ల రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి సమావేశం వాయిదా వేసినట్లు అధ్యక్షడు భక్త చరణ్ దాస్ ప్రకటించారు. ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ దుఃఖ సమయంలో బాలసోర్ రెముణాకు చెందిన ప్రశాంత్ శత్పతి కుటుంబానికి పీసీసీ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ లల్లూ, పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పీసీసీ మాజీ అధ్యక్షులు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా, శరత్ పట్నాయక్, ప్రసాద్ హరిచందన్, శ్రీకాంత్ జెనా తదితరులు పాల్గొన్నారు. జయపూర్ ఎయిర్‌పోర్టులో అప్రమత్తత కొరాపుట్: టెర్రరిస్ట్ దాడుల నేపథ్యంలో జయపూర్ ఎయిర్ పోర్టులో ముందస్తు అప్రమత్తత ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడులు, విమానాల హైజాక్ వంటి ఘటనల సమయంలో ఎలా వ్యవహరించాలో ప్రయాణికులకు తెలియజేశారు. కొట్పాడ్లో అమరులకు నివాళులు.. పెహల్గాంలో టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన వారికి కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ పట్టణంలో నివాళులు అర్పించారు. సిద్దార్ధ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో నేలకు మేలు
పాతపట్నం: ప్రకృతి సాగుతో అటు నేలకు, ఇటు పంటకు ఎంతో మేలు జరుగుతుందని తద్వారా రైతుకు ఆదాయం సమకూరుతుందని ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ధనుంజయ అన్నారు. మండలంలోని మెట్టుపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి సహజ సిద్ధ ఆహారంపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి నుంచి పండించే బెల్లం, వేరు శనగ, కొర్రెలు, కారం, రాగులు, చింతపండు వంటి పదార్థాలు తీసుకోవడం వద్ద కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. ప్రకృతి వ్యవసా యం చేస్తూ మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని రైతులకు, మహిళా సంఘాలకు వివరించారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ రేణుక, గోవిందరెడ్డి, శివాజీ, సువర్ణరావు, శ్రావ్య, భారతి, రైతులు పాల్గొన్నారు. -
మహేంద్రతనయలో పడి వృద్ధుడు మృతి
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి మచ్చమర గ్రామంలో మహేంద్రతనయ నదిలో బుధవారం మధ్యాహ్నం ఒక వృద్ధుడు స్నానానికి వెళ్లి మునిగి మృతిచెందాడు. ఉప్పలాడ పంచాయతీ మచ్చమర గ్రామానికి చెందిన హనుమంత బాలకృష్ణ (62) నదికి స్నానం కోసం వెళ్లి మునిగి మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న గురండి పోలీసు ఐఐసీ ఓం ప్రకాష్ పాత్రో మచ్చమర గ్రామానికి విచ్చేసి అగ్నిమాపక దళం సిబ్బంది ద్వారా మృతదేహాన్ని బయటకు తీయించి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్మాణ ప్రాజెక్ట్ మానిటరింగ్ డాష్‌బోర్డు ప్రారంభం భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పనుల శాఖ ప్రాజెక్ట్ మానిటరింగ్ డాష్‌బోర్డ్’ను బుధవారం ప్రారంభించారు. ఇది వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వాస్తవ కార్యాచరణ (రియల్–టైమ్) పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్టుల దోషరహిత అమలును నిర్ధారించి సామర్థ్యం మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అధునాతన ఏఐ డాష్‌బోర్డ్ అన్ని ప్రధాన ప్రాజెక్టులతో సహా ప్రభుత్వ ఆస్తులు, కొనసాగుతున్న ప్రాజెక్టుల తాజా వీక్షణను అందిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో ప్రాజెక్టుల గురించి వివరణాత్మక సమాచారం అనుక్షణం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు కచ్చితమైన స్థానాలను గుర్తించడానికి సమాచారానికి సంబంధించిన ఉపగ్రహ పటాలు చూసేందుకు వీలవుతుంది. -
తాగునీటి కష్టాలను పట్టించుకోరా?
రాయగడ : ఓ వైపు భానుడి ప్రతాపం..మరోవైపు తాగునీటి ఎద్దడితో ప్రజలు విలవిల్లాడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు లేఖ పంపించారు. కొద్దిరోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి మండుతున్న ఎండల నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారని, అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మిరావలి గ్రామంలోని ఆదివాసీ, గౌడ వీధుల్లో సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు. గొట్టపు బావులు పాడై నెలలు గడిచినా పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
మరణించిన మూడు రోజులకు అంత్యక్రియలు
కొరాపుట్: ఓ గర్భిణి మరణించిన మూడు రోజులకు అంత్యక్రియలు జరిగాయి. మంగళవారం రాత్రి కొరాపుట్ జిల్లా దఽశమంత్పూర్ సమితి లుల్లా గ్రామ పంచాయతీ నెర్కాగుడ గ్రామానికి చెందిన మహేశ్వర్ పరజ భార్య ధనుమతి ముదలి (27) అంత్యక్రియలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన 5నెలల గర్భిణి అయిన ధనుమతి పై భర్త మహేశ్వర్ తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ధనుమతి పరిస్థితి విషమించింది. దాంతో భయపడి ఆమెని దశమంత్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ కోలుకోకపోవడంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య శాలలో చేర్పించాడు. ఈ నెల 20వ తేదీన ధనుమతి మృతి చెందింది. 21న మృతదేహాన్ని గ్రామానికి తెచ్చిన మహేశ్వర్ గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో గ్రామ సరిహద్దులో మృతదేహం వదలి పారిపోయాడు. గ్రామస్తులు మృతదేహంతో గ్రామంలో ఆందోళనకి దిగాడు. చివరకు పోలీసులు చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో మంగళవారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి. -
యువజన కాంగ్రెస్ నేతలకు పరామర్శ
కొరాపుట్: భువనేశ్వర్ జైలులో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరామర్శించారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముట్టడి నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో క్యాడర్లో మనోధైర్యం పెంచడానికి ముఖ్య నాయకులు జైలును సందర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అజయ్‌కుమార్ లలూ మాట్లాడుతూ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. అంతకుముందు లలూకు భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో సీఎల్పీ నాయకుడు రాం చంద్ర ఖడం, జయదేవ్ జెన్నాలు స్వాగతం పలికారు. జయపూర్ యువతికి సివిల్స్‌లో 48వ ర్యాంక్ కొరాపుట్: సివిల్స్ ఫలితాలలో జయపూర్‌కు చెందిన రిథిక రథ్‌కు 48వ ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కొరాపుట్ కలెక్టర్‌కు అభినందన కొరాపుట్: కొరాపుట్ కలెక్టర్‌ను సీఎం మోహన్ చరణ్ మఝి, ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా అభినందించారు. బుధవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో సీఎం, డిప్యూటి సీఎంలను కలెక్టర్ వి.కీర్తివాసన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కొరాపుట్ జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డుని పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ అందుకున్న విషయం విధితమే. ఈ అవార్డుతో కలెక్టర్ వచ్చారు. దీంతో కలెక్టర్‌ను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు. పెహల్గామ్ మృతులకు నివాళులు రాయగడ: జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రమూకల దాడిలో చనిపోయిన వారికి స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య, నాగరిక మంచ్ తదితర సేవా సంస్థలు నివాళులు అర్పించాయి. ఈ మేరకు గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కళింగ వైశ్యసంఘానికి చెందిన సభ్యులు క్యాండిల్ వెలిగించి నీరాజనాలు పలికారు. ఉగ్రమూకల ఉన్మాదాన్ని ప్రముఖులు ఖండించారు. విషం తాగి మహిళ మృతి మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి మారివాఢ పంచాయతీ ఎంవీపీ 18 గ్రామానికి చెందిన సంజయ్ బిశ్వాస్ భర్య అపరజితా బిశ్వాస్ (32) మంగళవారం రాత్రి విషం తాగి మృతి చెందారు. సోమవారం సంజయ్‌కు అపరాజితకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె మంగళవారం విషం తాగేశారు. భర్త స్థానికుల సాయంతో ఆమెను కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మల్కన్‌గిరి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. అయితే అపరాజిత తండ్రీ విద్యాన్ మండల్ మాత్రం భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసి హిమాంశు శేఖర్ బారిక్ కేసు నమోద్ చేసి దర్యాపతు చేస్తున్నారు. పోస్టుమార్టం అయ్యాక వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. -
హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం ప్రారంభం
కొరాపుట్: కేంద్ర, రాష్ట్రాలలో మత సామరస్యమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీకి చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. జయపూర్ పట్టణంలోని సంధ్యా పంక్షన్ హాలులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో తొలిసారిగా కొరాపుట్‌లో ప్రభుత్వం హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 36 మంది యాత్రికులకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జయపూర్ ముస్లిం అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాఫా బేగ్, బీజేపీ నేత హిమాంశు మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
బావిలో మునిగి ఇద్దరు యువకుల దుర్మరణం
రాయగడ : బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. మృతులు చంద్రపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందిరి గ్రామంలో బుధవారం తేతే టంగరంగ(25), చిత్తరంజన్ టంగరంగ(28)లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకుతీశారు. కలిమావీధిలోని తాగునీటి బావిలో చెత్త పేరుకుపోవడంతో శుభ్రం చేసేందుకు చిత్తరంజన్, తేతేలు లోపలికి దిగారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఊపిరాడక విలవిల్లాడారు. బయటకు రాలేకపొవడంతో మృతి చెందారు. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . -
ఘటమెత్తిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కేంద్రంలో జరిగిన ముత్యాలమ్మ ఘట జాతరలో స్థానిక ఎమ్మెల్యే పవిత్ర శాంత ఘటం ఎత్తారు. ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మొక్కుబడిగా ఘటం మోశారు. స్థానిక కళాకారులతో కలిసి నృత్యం చేశారు. పూరీలో పర్యటన కొరాపుట్: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పూరిలో పర్యటిస్తోంది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క నేతృత్వంలో కమిటీ ఆయా ప్రాంతాలను సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణా ప్రాంతాల్లో అమలవుతున్న తీరుపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. దివ్యాంగులకు బ్రెయిలీ ఉపకరణాలు కొరాపుట్: దివ్యాంగులకు బ్రెయిలీ డివైజ్‌ల పంపిణీ జరిగింది. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని కలక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో స్వయంగా దివ్యాంగ బాలలకు అందజేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాయంతో అన్నై స్మార్ట్ బ్రెయిలీ డివైజ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. -
రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై దృష్టి
మల్కన్‌గిరి: రైల్వే ప్రాజెక్టుల వేగవంతానికి అధికారులు కృషి చేయాలని నవరంగపూర్ ఎంపీ బోలభద్ర మాఝి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి కార్యకలాపాల సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, జిల్లా అదనపు ఎస్పీ తాపాన్ నారాయణ్ రోతో, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రతాప్ కొత్తపల్లి, జిల్లా అదనపు కలెక్టర్ వేద్భర్ ప్రధాన్, జిల్లా అబివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సభరో, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి తదితరులు పాల్గొన్నారు. -
భువనేశ్వర్ – పూరీ హైవే విస్తరణ
భువనేశ్వర్: భువనేశ్వర్–పూరీ హైవే విస్తరణకు మార్గం సుగమం అయింది. ఈ మార్గం 6 వరుసలుగా విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం మేరకు ఈ విస్తరణ వ్యయ ప్రణాళిక రూ.1,200 కోట్లు. దీని వల్ల ఈ మార్గంలో ప్రయాణ సమయం ముప్పావు గంటకు పరిమితం అవుతుంది. ఈ మార్గం 8 వరుసల విస్తరణతో సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనివల్ల భువనేశ్వర్ పూరి మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గుతుంది. రాష్ట్ర రహదారులు త్వరలో అత్యున్నత నాణ్యత, స్థాయిలో అమెరికా రహదారులకు సమానంగా ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భువనేశ్వర్, పూరీ మధ్య 8 లైన్ల రహదారి రాబోయే 100 ఏళ్ల అవసరాలను తీర్చగలదు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు ప్రతిపాదిత తీరప్రాంత రహదారిని 4 వరుసలుగా విస్తరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. -
ఒడిశా వాసి మృతి
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పెహల్గామ్లో..భువనేశ్వర్: కాశ్మీర్లో సంభవించిన ఉగ్రవాదుల ఊచకోతలో రాష్ట్రానికి చెందిన శత్పతి (41) మృతి చెందారు. బైసరన్ గడ్డి మైదానంలో తన భార్య, తొమ్మిదేళ్ల కొడుకు కళ్ల ఎదురుగా ఉగ్రవాదులు ఆయనని కాల్చి చంపడంతో విషాదం నుంచి కోలుకోలేని పరిస్థితిలో కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. బాలాసోర్ జిల్లాలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ శత్పతి ఎల్టీసీపై తన భార్య, కొడుకుతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ప్రశాంత్ బాలసోర్ జిలా రెముణ మండలం ఇషానీ గ్రామస్తుడు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. బైసారన్లోని రోప్‌వే నుంచి కుటుంబీకులతో కలిసి దిగుతుండగా ప్రశాంత్ శత్పతి తలకు గురి పెట్టి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గంట తర్వాత సైన్యం వచ్చింది అని అతని భార్య ప్రియ దర్శిని ఆచార్య తెలిపారు. ఊచకోతకు ఏబీవీపీ ఖండన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రశాంత శత్పతి మృతిపై ఏబీవీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు. స్థానిక ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ఆవరణలో గుమిగూడి ఉగ్రవాద చర్యల పరిస్థితిని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం త్వరగా, సమర్థంగా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు నినాదాలు చేశారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. న్యాయం జరిగేలా భారత ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.న్యూస్‌రీల్ -
రోడ్డుకు అడ్డంగా గ్రానైట్ లారీ
మెళియాపుట్టి: మండలంలోని చింతలపోలూరు వద్ద గ్రానైట్ రాయితో వెళుతున్న లారీ సాంకేతిక కారణంగా రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. సాయంత్రం సమయం కావడం, అధిక సంఖ్యలో రాకపోకలు కొనసాగించే రహదారి కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీనబంధుపురం గ్రామ పంచాయతీలో సుమారు 20కి పైగా గ్రానైట్ క్వారీలు ఉండటంతో రాకపోకలు సాగించే వాహనాల శబ్దాలతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంజాయి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష మెళియాపుట్టి : మెళియాపుట్టి కూడలిలో 2023 ఏప్రిల్ 25న గంజాయితో పట్టుబడిన బులుమాలి అనే వ్యక్తికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు వెలువరిచింది. నిందితుడిది ఒడిశా రాష్ట్రం చడియాపడ గ్రామమని పోలీసులు తెలిపారు. న్యాయమూర్తులకు బదిలీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. శ్రీకాకుళం ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి భరణికి నర్సీపట్నం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యింది. ఆమదాలవలస జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్.మణికి కాకినాడ, నరసన్నపేట కోర్టు న్యాయమూర్తికి పాలకొండకు బదిలీ అయ్యింది. పాలకోండ కోర్టు న్యాయమూర్తి విజయ్రాజ్కి విజయనగరం జూనియర్ డివిజన్ సివిల్ కోర్టుకు, సోంపేట కోర్టు న్యాయమూర్తి ఎ.రాముకు విశాఖపట్నం బదిలీ చేశారు. టెక్కలి కోర్టు న్యాయమూర్తి హెచ్ఆర్ తేజా చక్రవర్తికి విజయనగరం బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి కె.శ్రీనివాస్ సోంపేట కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నుంచి ఎస్.వాణి నరసన్నపేట కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 27న జిల్లా బీచ్ కబడ్డీ జట్లు ఎంపిక శ్రీకాకుళం అర్బన్: జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 27న నిర్వహిస్తున్నట్టు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీ స్విమ్మింగ్ ఫూల్, ఇండోర్ స్టేడియం వద్ద నాగావళి రివర్ నదీతీరాన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పురుషులు 85 కేజీలు, మహిళలు 75 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జట్లు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడలో జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలలో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ సాధు శ్రీనివాసరావు (సెల్: 9441914214)ను సంప్రదించాలని వారు కోరారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంకు కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని మంగళవారం ఉదయం 10.30 టాటా లగేజీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో బి.సీతారాం అనే వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పల్ల శివాజి, రేగాన వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జె.ఆర్.పురం ఏఎస్సై డి.రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్షతగాత్రులు లావేరు మండలం పైడియ్యవలసకు చెందినవారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఎస్పీలతో డీఐజీ సమీక్ష శ్రీకాకుళం క్రైమ్ : విశాఖ రేంజి పరిధిలోని ఎస్పీలు, ఇతర అధికారులతో డీఐజీ గోపినాథ్ జెట్టి మంగళవారం సమీక్ష నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు తదితర అంశాలపై చర్చించాచారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా, విస్తృత తనిఖీలు నిర్వహించాలని, తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టు చేసి వారిపై ఉన్న నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు తక్షణమే జారీ చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల మనస్తత్వాన్ని మార్చలేం
● చెత్తను బయటపడేస్తారు.. కుళాయిలు విరిచేస్తారు.. ● జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో ఎమ్మెల్యే కూన వ్యాఖ్యలు శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయమై మాట్లాడుతూ మహిళలు ఇంట్లో చెత్తను తీసుకువచ్చి బయట పడేస్తున్నారని, పరిసరాలు ఎలా ఉన్నా వారికి అనవసరమని చెప్పారు. తాగునీటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వీధి కుళాయిలు వద్దని, ఇంటింటి కుళాయిలే మంచివని చెబుతూ ఆడవాళ్లు కుళాయిల ట్యాపులు కట్టకుండా వదిలేసి వెళ్లిపోతారని, అవసరమైతే కుళాయిలను విరిచేస్తారని చెప్పారు. ఈ రెండు వ్యాఖ్యానాలు చేసిన అనంతరం మహిళలను కించపర్చటం తన ఉద్దేశం కాదంటూనే వారి మనస్తత్వం ఇలా ఉంటుందని, వారిని మార్చటం సాధ్యం కాదన్నారు. గ్రంథాలయ వ్యవస్థ వృథా.. పంచాయతీలకు వచ్చే ఆదాయంలో గ్రంథాలయ పన్ను పోతుందని అంటూ గ్రంథాలయ వ్యవస్థే పనికిరానిదని కూన పేర్కొన్నారు. ఆ వ్యవస్థకు ఒక చైర్మన్, జీతం, ఇతర ఖర్చులు కూడా వృథాయేనని చెప్పారు. ఈ వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రగతి పథంలో నడిపించాలి.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో చేపడుతున్న సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, పింఛన్లు తదితర ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. పన్నులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహనరావు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
● అనుమానాస్పదంగా విద్యార్థి మృతి ● లొద్దపుట్టి ఆర్‌హెచ్ కాలనీలో విషాదం ఇచ్ఛాపురం రూరల్: ‘అమ్మా...ఈ రోజు ఇంటికి వస్తున్నాను...’ అని కన్న కొడుకు తల్లికి ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో ఆ తల్లి కొడుకుకు ఇష్టమైన వంటకాలు చేసి వేయి కళ్లతో ఎదురు చూడటం ప్రారంభించింది. ఉదయం ఫోన్ చేసిన కొడుకు రాత్రి పన్నెండు గంటలైనా ఇంటికి చేరకపోవడంతో ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైంది. తెల్లారితే... కొడుకు చదువుతున్న కళాశాలకు ఫోన్ చేస్తే మృతి చెందాడన్న పిడుగులాంటి వార్తను చేరవేయడంతో ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన నెయ్యిల నీలాద్రి(లడ్డూ), ఢిల్లేశ్వరీల కుమారుడు గోపాల్(19). విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో సెకెండియర్ చదువుతున్నాడు. తండ్రి నీలాద్రి గల్ఫ్‌లో కూలి పనులు చేస్తున్నాడు. సోమవారం తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా....ఈ రోజు ఇంటికి వస్తున్నాను’ అంటూ చెప్పిన గోపాల్ అర్థరాత్రి వరకు ఇంటికి చేరక పోవడంతో మంగళవారం ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసింది. గోపాల్ విజయనగరంలోని రైలు కింద పడి మృతి చెందినట్లు చెప్పడంతో తల్లి కుప్పకూలిపోయింది. కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసేకునేంత పిరికి వాడు కాదని, కుమారుడు మృతి వెనుక కుట్రదాగి ఉందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యార్థి గోపాల్ మృతితో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి. -
చరిత్ర తిరగరాద్దాం!
పుస్తకం తిరగేద్దాం.. శ్రీకాకుళం కల్చరల్: నేటి సాంకేతిక యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడంతో పుస్తకాలు చదివేవారు బాగా తగ్గిపోయింది. మనలో ఒంటరితనాన్ని పోగొట్టి మరో ప్రపంచంలోకి విహరింపజేసే పుస్తకాలే మనకు నిజమైన నేస్తాలని విద్యావేత్తలు చెబుతున్నారు. రోజులో కొంత సమయమైనా పుస్తక పఠనానికి కేటాయించాలని కోరుతున్నారు. నేటి తరంవారికి పుస్తకాలు చదవడం అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం అనే అభిప్రాయం ఉంది. అందుకే సాధారణ పుస్తకాల చదవడం మానేశారు. ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతునే ఉన్నారు. తాము కొనుగోలు చేసిన, సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజులో సగభాగం అందులోనే గుడుపుతుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. జ్ఞాపిక శక్తి, భాషా పరిరక్షణకు పుస్తకాలే కీలకం పుస్తక పఠనం పెరగాలంటున్న విద్యావేత్తలు నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం ఏకాగ్రత కోసం.. ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అవలవాటు చేసుకోవాలి. పుస్తకాలు మన ఆలొచనా దృక్పథాన్ని పెంచుతాయి. నేటి తరం యువత కూడా సాహిత్యం చదవడంపై శ్రద్ధ పెంచాలి. – ముట్నూరు ఉపేంద్రశర్మ, ప్రభుత్వ అధ్యాపకుడు, శ్రీకాకుళం ఏకై క నేస్తం.. మన వ్యక్తిత్వానికి, వికాసానికి అద్దం పట్టేది పుస్తకం. పుస్తక పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు. అత్యంత ఉత్తమ సమాచార, ప్రచార, ప్రసాద సాధనం, మాధ్యమం పుస్తకమే. – జంధ్యాల శరత్‌బాబు, రచయిత -
విశ్రాంత ఉద్యోగుల ధర్నా
పర్లాకిమిడి: ఒడిషా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు, పెన్షన్‌దారుల సంఘం అధ్యక్షుడు అశ్వినీ కుమార్ పాఢి, కార్యదర్శి సురేష్ చంద్ర బెహరా, బిచిత్రా నందబెబర్తా, ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాత పెన్షన్ పధ్ధతి (ఓ.పి.యస్.), ఎన్.పి.యస్., యు.పి.యస్.అని ప్రభుత్వం విభజించి ఉద్యోగుల మధ్య వ్యత్యాసాలు సృష్టించారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల సమాఖ్య, ఒడిషా రాష్ట్ర రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్రంలో అన్ని జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం కలెక్టర్‌కు గజపతి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున వినతిపత్రాన్ని అందజేశారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న పూలే పార్కు వద్ద శనివారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ రాజీవ్, జి.రాఘవ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లపై కుట్ర శ్రీకాకుళం: ఓవైపు పాత పెన్షన్ అమలు కోసం ఉద్యోగులు కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే ఇవేవీ పట్టని కేంద్ర ప్రభుత్వం పాత ఫించన్‌దారులకు హానికలిగించేలా పెన్షన్ సవరణ బిల్లు తీసుకురావడం దారుణమని ఎన్డీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ దాసరి క్రాంతి భవన్ వద్ద లోక్‌సభలో పెన్షన్ సవరణ బిల్లు ఆమోదంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకష్ణ, చింతల రామారావు, శ్రీనివాసరావు, తిరుమలరావు, జి.శ్రీనివాసరావు, హెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎస్.వి.రమణమూర్తి -
ఐదు కిలోల గంజాయి స్వాధీనం
పాతపట్నం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న గార మండలం పొగాకువానిపేట గ్రామానికి చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియాస్ సాయి అనే యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాతపట్నం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వి.రామారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గార మండలం పొగాకువానిపేటకు చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియాస్ సాయి ఐటీఐ చదువుతూ మధ్యలో మానేసి వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నెల్లూరు జిల్లాకు తరలించేందుకు 5.662 కిలోల గంజాయిని 3 ప్యాకెట్లుగా తయారు చేసి బ్యాగ్‌తో ఒడిశా నుంచి నడిచి వస్తుండగా పాతపట్నం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తికి అప్పగించేందుకు గంజాయిని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సాయిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐ బి.లావణ్య, ఏఎస్ఐ సింహాచలం, పోలీసులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర సాగునీటి కల సాకారమే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి భవితవ్యాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పాత, కొత్త ప్రాజెక్టులన్నింటినీ సమాన ప్రాధాన్యతతో పూర్తి చేసి, ప్రతి చివరి భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వంశధారపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరడి సైడ్ వియర్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలను వెంటనే తొలగించి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌కు నిరంతరాయంగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనులు ఆలస్యం చేస్తున్న ఏజెన్సీలకు తక్షణమే నోటీసులు జారీ చేసి, టెండర్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులకు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్ట ఎత్తిపోతల పథకం పూర్తయితే 12 టీఎంసీల నీరు హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చని, ఇది కీలకమైన ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. గొట్ట బ్యారేజ్ ఆప్రాన్ పనుల కోసం రూ.12.81 కోట్ల టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు. షట్టర్ల కుంభకోణంపై చర్చ సందర్భంగా, కోర్టు అనుమతి పొంది వెంటనే షట్టర్లను స్వాధీనం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నాగావళి–వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. రణస్థలం పైడి భీమవరం పారిశ్రామికవాడకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నిరంతరాయంగా నీటి సరఫరా ఉండేలా చొరవ చూపాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు కోరారు. కళింగపట్నం, అంబల్లవలస ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంత్రిని కోరారు. -
సాంఘిక సంక్షేమ శాఖ డీడీపై దర్యాప్తు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం కలెక్టరేట్లోని కేఆర్‌సీసీ కార్యాలయంలో ఎస్డీసీ బి.పద్మావతి విచారణ చేపట్టారు. తనకు సాంఘిక సంక్షేమ శాఖలోని వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని డీడీ విశ్వమోహన్‌రెడ్డి రూ.2,50,000 లంచం అడగ్గా దఫదఫాలుగా రూ.2,30,000 ఇచ్చినట్టు కొత్తూరు మండలానికి చెందిన దళిత యువకుడు ఎస్.ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. అదనంగా రూ.20 వేలు ఇవ్వనందున డీడీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇటీవల ఇదే శాఖలో ఎనిమిది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను డీడీ చేపట్టారని, అందులో తన పేరు లేకపోవడంపై ప్రశ్నించగా తనతో పాటు గజేంద్ర, పవన్ అనే యువకులపైనా కులదూషణ చేసినట్లు తెలిపాడు. తమ డబ్బులు ఇచ్చేయాలని ప్రసాద్ తల్లి దమయంతి నిలదీయగా, ఆమెను కూడా దూషించినట్లు చెప్పాడు. కాగా, బాధితులు మాత్రం విచారణ సంతృప్తికరంగా లేదని, ఏకపక్షంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
రాజధానిలో కిడ్నాప్ కలకలం
భువనేశ్వర్: నగరంలో మంగళవారం ఉదయం సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి మైనరు బాలుడిని దుండుగులు అపహరించుకు పోయారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్రంగా కలవరపడ్డారు. స్థానిక ఎయిర్ ఫీల్డ్ పోలీస్ ఠాణా పరిధిలోని పంచగావ్ సమీపంలో తుపాకీతో బెదిరించి పిల్లవాడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు తలపై తుపాకీతో బెదిరించి బాలుడిని బలవంతంగా నల్లటి కారులోకి ఎత్తుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత కిడ్నాపర్లు ఆ చిన్నారి కుటుంబానికి ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే బాలుడిని సురక్షితంగా అప్పగిస్తామని చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక నిఘా, స్థానిక నిఘా, వాహన ట్రాకింగ్ వ్యవస్థలను ప్రయోగించి చిన్నారిని సురక్షితంగా గుర్తించారు. పోలీసుల రాక గుర్తించి కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. తుపాకీతో బెదిరించి బాలుడిని అపహరించిన దుండగులు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడ్ని వదిలి పరారైన కిడ్నాపర్లు -
అక్రమంగా గ్రావెల్ తరలింపు
సారవకోట: మండలంలోని జమచక్రం గ్రామం నుంచి సత్రాం పంచాయతీ గొల్లపేట వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 42 కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ మార్గంలో కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు వినియోగించుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్లు పక్కనే ఉన్న కొండ నుంచి గ్రావెల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుంటున్నారు. ప్రస్తుతం అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న కొండ నుంచి సచివాలయం కూత వేటులోనే ఉన్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరించడం విచారకరం. దీనిపై స్థానిక వీఆర్వో రామును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
110 గ్రామాల్లో నాటుసారా ప్రభావం
టెక్కలి: జిల్లాలో 6 ఎకై ్సజ్ కార్యాలయాల పరిధిలో 110 గ్రామాల్లో నాటు సారా ప్రభావం ఉన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ పి.రామచంద్రరావు వెల్లడించారు. సోమవారం టెక్కలి ఎకై ్స జ్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించి విలేకర్లతో మా ట్లాడారు. కొత్తూరు, హిరమండలం, నందిగాం, మెళియాపుట్టి, పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో నాటు సారా ప్రభావం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా సోంపేట, టెక్కలి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో గల మండలాల్లో 70 గ్రామాల్లో నాటు సారా ప్రభావం ఉందన్నారు. జూన్ నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేకంగా నవోదయం కా ర్యక్రమంతో ఇప్పటికే 190 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏసీ పేర్కొన్నారు. గతంలో నాటుసారా అమ్మకాలు చేసిన 1224 మందిని గు ర్తించి వారిలో 724 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నాటు సారా తయారీ, విక్రయాలను మానేస్తే అలాంటి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే నాటుసారాకు అవసరమైన బెల్లం ఊటలను విక్రయించేవారిలో 58 మందిని గుర్తించామని వారిలో 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఏసీ రామచంద్రరావు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 838 బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకున్నామని, వాటిలో భాగంగా 1314 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలా సలో అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేసిన దుకాణంపై రూ.5 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. నాటు సారా అమ్మకాలు, అధిక ధరలకు మద్యం అమ్మకాలు, ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తరలింపు, బెల్టు దుకాణాలు నిర్వహిస్తే తక్షణమే 14405 టోల్‌ఫ్రీ నంబరుకు గాని, 94409 02332 ఫోన్ నంబరుకు సమాచారం అందజేయాలని కోరారు. ఆయనతో పాటు టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్, సిబ్బంది ఉన్నారు. -
రోడ్డెక్కిన ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనం పెంచాలని, వేధింపులు ఆపా లని డిమాండ్ చేస్తూ వారంతా సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు డచ్ భవనం వద్ద సమావేశం నిర్వహించి ధర్నా చేశారు. ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లను సీఎం, డిప్యూటీ సీఎంలు మోసం చేశారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ను ఉద్యోగులుగా గుర్తించడం లేదని, 2016 నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయన్నారు. చెప్పిన పనులు చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నార ని ఆరోపించారు. మరో పది రోజుల్లో తమ సమస్య లు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామన్నా రు. ఈ నెల 16 నుంచి దశల వారీగా అధికారులకు తమ గోడు వినిపిస్తున్నామని, ఈ నెల 28 నుంచి విధులను పూర్తిగా బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, పి.రామస్వామి, ధర్మారావు, సూర్యచంద్ర, పెద్ద ఎత్తున ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. ● 28 నుంచి సమ్మెకు సిద్ధం -
మంచం కింద భార్య శవం
కొరాపుట్: మంచం కింద పెట్టెలో భార్య శవం పెట్టి భర్త పరారైన సంఘటన సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి హల్ది గ్రామంలో వెలుగు చూసింది. రెండు రోజుల నుంచి తమ కూతురు అనితా స్వయ్ (25) నుంచి సమాచారం లేదని ఆమె బంధువులు చందాహండి పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు గ్రామస్తుల సమక్షంలో రెండు రోజులుగా తాళం వేసి ఉన్న ఆమె ఇంటిని బలవంతంగా తీసి లోపలకి వెళ్లారు. అక్కడ మంచం కింద అనిత మృతదేహం కనిపించింది. ఆమె భర్త దుష్మంత్ నాయక్ రెండు రోజులుగా పరారీలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సఫాయి కార్మికుడు మృతి
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో మల్కన్‌గిరిలో నివాసముంటున్న సఫాయి కార్మికుడు డోంబురు గరడ (55) గుండెపోటుతో సోమవారం వేకువజామున మృతిచెందాడు. ఇతనికి వివాహం కాలేదు. మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరెంట్ కూడా లేని ఓ చిన్న ఇంట్లో నివాసముంటున్నాడు. మృతి సమాచారం తెలిసి హాజరైన బంధువులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ బ్యాగు నిండా నోట్ల కట్టలు కనిపించాయి. కొంత బంగారం కూడా గుర్తించారు. ● ఇంట్లో వెలుగు చూసిన నోట్ల కట్టలు -
పరిమితి పెరిగిందోచ్
నరసన్నపేట: ఖరీఫ్, రబీల్లో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్) ఖరారైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అన్ని పంటలకు రుణ పరిమితి 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఏటా వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతుండటంతో బ్యాంకు రుణాల పరిమితిని కూడా పెంచుతున్నారు. దీంట్లో భాగంగా రానున్న ఖరీఫ్, రబీ సీజన్లకు గరిష్ట రుణపరిమితి నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బ్యాంకుల్లో కొత్త రుణాల పంపిణీ, పాత రుణాలు రెన్యువల్స్‌ను బ్యాంకర్లు ప్రారంభించారు. పంటల వారీగా రుణపరిమితి ఇలా.. వర్షాధారం, నీటి వసతి కింద ఉన్న పొలాలకు వేర్వేరుగా పరిమితిని నిర్ధారించారు. వరికి గత సంవత్సరంలో ఎకరాకు రూ.46 వేలు రుణం ఇవ్వగా, దీన్ని ఈ ఖరీఫ్‌కు రూ.52వేలు చేశారు. రబీలో అయితే రూ.55 వేలు, విత్తన వరికి అయితే రూ.55 వేలు ఇవ్వనున్నారు. అలాగే వేరు శనగకు వర్షాధారం అయితే ఎకరాకు రూ.38 వేలు, కాలువ కింద పొలాలు అయితే రూ.41 వేలు, పత్తికి రూ.51 వేలు, మొక్క జొన్నకు రూ.47 వేలు, మినుము పంటకు రూ.30 వేలు, పెసలకు రూ.24వేలు, ఆయిల్ పామ్‌కు రూ. 70 వేలు, పచ్చి మిరపకు రూ.1.10 లక్షలు, రెడ్ మిరపకు రూ. 1.75 లక్షలు, చెరుకుకు రూ.80 వేలు, హైబ్రీడ్ టమాటాకు రూ.78 వేలు, వంకాయకు రూ.54 వేలు, బెండకు రూ.36 వేలు, అరటి ఎకరాకు రూ.1.10 లక్షలు, కొబ్బరికి రూ.70 వేలు, గడ్డి సాగుకు రూ.36 వేలు, బంతి పూల సాగుకు రూ.55 వేలు, వాటర్ మిలన్కు రూ.54 వేలు ఇలా మొత్తం 110 పంటలకు రుణ పరమితిని నిర్ధారించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి రూ. 52 వేలు వరకు రుణానికి అవకాశం మొక్కజొన్నకు రూ.47 వేలు వేరు శనగకు రూ.41 వేలు బ్యాంకుల్లో ప్రారంభమైన పంటరుణాల రెన్యువల్స్ బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాం పెరిగిన రుణపరిమితి వివరాలపై బ్యాంకులకు సమాచారం ఇచ్చాం. దీని ప్రకారం బ్యాంకర్లు రుణాలు రెన్యువల్ చేయడం, కొత్తవి ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది మరింత విరివిగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వనున్నాం. – సూర్యకిరణ్, ఎల్డీఎం -
25న టేకు కలప బహిరంగ వేలం
టెక్కలి: ఈ నెల 25న టెక్కలి కోర్టు సముదా యంలో టేకు కలప బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు కోర్టు వర్గాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపాయి. వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.47,872 (ప్రభుత్వ విలువ) విలువ కలిగిన 21 రకాల వివిధ సైజులు కలిగి న టేకును బహిరంగ వేలం వేస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ సివిల్ జడ్జి ఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి మల్ల సమక్షంలో ఉదయం 10:30 గంటల నుంచి నిర్వహిస్తున్న ఈ వేలంలో ఆసక్తి కలిగిన వారు పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. 12 మందికి శ్రీశ్రీ వేదిక పురస్కారాలు శ్రీకాకుళం కల్చరల్: సాహిత్య, కళా రంగాల్లో పలు రికార్డులు సాధించిన 12 మందికి శ్రీశ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించబోయే ప్రపంచ తెలుగు సంబరాల్లో శ్రీశ్రీ వేదిక పురస్కారాలను అందిస్తున్నారు. మే నెల 10,11 తేదీల్లో నిర్వహించే ఈ సంబరాలకు జిల్లా నుంచి 12మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ సమన్వయకర్త ఈవేమన ఓ ప్రకటనలో తెలిపారు. జంధ్యాల శరత్ బాబు (తెలుగు భాష), కుమారనాయక్, ఎం. శ్రీరాములు (తెలుగు కీర్తి), రఘుపాత్రుని శివ, పి. ముకుందరావు (యువకీర్తి), గౌరీపతిశాస్త్రి (అక్షర తేజం), జె.వి.తిరుమలాచార్యులు (కళా కిరీటి), మహ్మద్ రఫీ (కళారత్న), మూల తాత య్య (శ్రీశ్రీ ప్రతిభా పురస్కారం), మాతృదేవో భవ పురస్కారాలను బోడవరపు వెంకటలక్ష్మీ, గంపా శ్రీదేవి, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవిలకు ప్రకటించారని తెలిపారు. 26న ముఖ్యమంత్రి పర్యటన ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని బుడగుట్లపాలెం మత్స్యకార గ్రామంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఈ నెల 26న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీఓ సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, తహసీల్దార్ బి.గోపాలరావుతో కూడిన అధికారులు సోమవారం ఏర్పాట్లపై సమీక్షించారు. స్థలం పరిశీలించి సభ ఏర్పాటుపై చర్చించారు. రెండు గంటల నిరీక్షణ కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద ప్రయాణికులు సోమవారం నరకయాతన పడ్డారు. రైలు పట్టాల కింద కొత్త స్లీపర్లు వేశారు. దీని కోసం ప్రత్యేకమైన రైలు రావడంతో సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంట ల వరకు పనులు చేపట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వాహనదారులు అంత సేపూ వేచి ఉండాల్సి వచ్చింది. ఆఖరుకు నర్సిపురం, కిష్టుపురం ప్రాంతాల మీదుగా ప్రయాణించారు. బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేటీ రోడ్డు మోర్ స్టోర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యు టర్న్ తీసుకునే సమయంలో రెండు బైక్‌లు ఎదురెదుగా ఢీకొట్టడంతో చిత్రాడ దేవరాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తక్షణమే స్థానికులు 108 ప్రభుత్వ వాహనానికి సమాచారం ఇవ్వడంతో క్షతగా త్రుడిని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. డీఎస్పీ మూర్తికి సత్కారం శ్రీకాకుళం క్రైమ్: విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయని, అలాంటి క్రమశిక్షణ నిబద్ధత గల అధికారి డీఎస్పి డిఎస్ఆర్వీ ఎస్ఎన్ మూర్తి అని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. టెక్కలిలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన మూర్తిని నగరంలోని ఓ హోటల్లో సోమవారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, వీవీ అప్పారావు, శేషాద్రి పాల్గొన్నారు. -
రాష్ట్రపతి పాలన విధించాలి
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్లో హిందువులపై అత్యాచారాలు, దాడులు ఆపాలని, అక్కడ శాంతిభద్రతలు క్షీణించడం వలన రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ శ్రేణులు కోరాయి. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. హిందువులపై దాడులు జరుగుతున్నా, అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు లోకనాథ మిశ్రా, అధ్యక్షుడు కై లాస్ చంద్ర గౌడో, కూర్మారెడ్డి, హరిమోహన్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లోకి ముఖ్యమంత్రి
● తొలిసారి రాజధాని బయట గ్రీవెన్స్న్సెల్ ● సంబల్పూర్లో వినతులు స్వీకరించిన సీఎం మోహన్‌చరణ్ మాఝి ● హాజరైన 11 మంది క్యాబినెట్ మంత్రులునిర్వహిస్తామన్నారు. భారీగా ఏర్పాట్లు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోహన్ చరణ్ మాఝి తొలిసారి బయట ప్రాంతంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి కనకవర్దన్సింగ్దేవ్, 10 మంది క్యాబినెట్ మంత్రులు, పదుల సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై సామాన్య ప్రజలకు సేవలందించారు. సంబల్‌పూర్‌తో పాటు పశ్చిమ ఒడిశాలో అనేక జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరై సమస్యలు విన్నవించుకున్నారు. దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి సీఎం సమస్యలు వినడం ప్రత్యేకంగా నిలిచింది. మంత్రులు కూడా సాధారణ ప్రభుత్వ సిబ్బంది వలే పెన్నులు తీసుకొని వివరాలు నమోదు చేసుకోవడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి కనక వర్దన్ సింగ్ దేవ్, మంత్రులు సూరజ్ సూర్యవంశీ, నిత్యానంద గొండో తదితరులు సిఎం పక్కనే ఉండి సహాయం చేశారు.కొరాపుట్: ప్రజల కోసమే రాజధాని వదిలి సంబల్పూర్ వచ్చామని ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మాఝి ప్రకటించారు. సోమవారం సంబల్పూర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో సీఎంను కలవాలంటే మహానుభావులకే తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. తాము మాత్రం సీఎంను కలవలేని వారి కోసం ప్రజల్లోకే వచ్చామన్నారు. ఒక్కరోజే సుమారు 6 వేల మంది సమస్యలు పరిష్కరించామన్నారు. ఎక్కువగా సంబల్పూర్, బరగడ్ జిల్లాల ప్రజల నుంచే వచ్చాయన్నారు. ఇప్పటి వరకు తాను సీఎం అయిన తర్వాత 10 నెలలలో రాజధానిలో తొమ్మిది సార్లు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతిసారీ వెయ్యికి పైగా సమస్యలు పరిష్కరించామన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రజల్లోకి వచ్చి వినతులు స్వీకరించడం ఇదే తొలిసారన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సంబల్పూర్ సమలేశ్వరి దేవి కృతజ్ఞతగా ఉంటానన్నారు. భవిష్యత్‌లో ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్‌సెల్ -
ప్రధాని చేతులమీదుగా కొరాపుట్ కలెక్టర్‌కు అవార్డు
కొరాపుట్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ అవార్డు అందుకున్నారు. సోమవారం సివిల్ సర్వీస్ డే సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వేదిక మీద ద ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ఎక్సెలెన్స్ అవార్డుని ప్రధాని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 11 పథకాలను జిల్లాలో ప్రజల వద్దకు చేర్చడంలో కీర్తివాసన్ కృషి చేసినందుకు ఈ అవార్డు లభించింది.వంశధారలో చేప పిల్లల విడుదల రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న వంశధార నదిలో సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 7.50 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో హాజరయ్యారు. దీనివలన చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న ఎంతోమందికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రప్రథమంగా ఈ తరహా ప్రక్రియను మత్స్యశాఖ చేపట్టడంతో అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, సమితి సభ్యులు, స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.దివ్యాంగుడి నిరసన పర్లాకిమిడి: ఈ నెల 11న పర్లాకిమిడి నుంచి గురండి గ్రామానికి మారుతి అనే ప్రైవేటు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్‌పై రాయితీ ఇవ్వలేదని ప్రశ్నించినందుకు బస్సు నుంచి గెంటేశారని, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపిస్తూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన దివ్యాంగుడు వి.జేమ్స్ సోమవారం ఆదర్శ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు. పర్లాకిమిడి తహశీల్దారు, గురండీ పోలీసులు తనపై అన్యాయంగా కేసులు పెట్టి హింసించినందుకు వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.చోరీ కేసులో నలుగురు అరెస్టు రాయగడ: జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో నివసిస్తున్న వసతి గృహంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో చింతాడ చిరంజీవి, సామల్ స్వయి, బి.సంతోష్ కుమార్, ఉలక సంతోష్‌లు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఐఐసీ కేకేబీకే కుహరో తెలిపిన వివరాల మేరకు ఈనెల 15వ తేదీన స్థానిక రాణిగుడఫారం సమీపంలోని జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో నివసిస్తున్న ప్రభుత్వ వసతి గృహంలో గుర్తు తెలియని దుండగులు చోరీయత్నం చేశారు. వసతి గృహం గేట్‌ను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే బయట అలికిడి జరగడంతో దుండగులు వెళ్లిపోయారు. సమాచారం తెలు సుకున్న అదనపు కలెక్టర్ కుహరో ఈ మేరకు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు జయపురం: జయపురంలో దొంగతనంగా గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి వర్గాలు నేడు తెలిపాయి. జయపురం సూర్యమహల్ ప్రాంతానికి చెందిన సూరజ్ సింగ్(20)ను ఐదుగురు సభ్యులు గల ఒక టీమ్ ఆదివారం జయపురం స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశం మేరకు సూరజ్‌ను తమిళనాడుకు తీసుకు పోయారు. 2024 డిసెంబర్లో జరిగిన వాహన తనిఖీల్లో సూరజ్ పోలీసులకు దొరికాడు. అప్పట్లో తమిళనాడు పోలీసుల నుంచి అతడు తప్పించుకుని పారిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు దొరికాడు. -
సమస్యల కొలువు
మంచం కింద భార్య శవం హల్ది గ్రామంలో మంచం కింద భార్య శవం దొరికింది. భర్త పరారీలో ఉన్నాడు. –8లోuపూర్తయిన డబ్లింగ్ కొత్తవలస–కిరండోల్ మధ్య డబ్లింగ్ పూర్తయ్యాయి. 85 కిలోమీటర్ల మేర పనులు జరిగాయి. –8లోuరాయగడ: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన సమితిగా గుర్తింపు పొందిన కాసీపూర్‌లో సమస్యలు కొలువుదీరాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు లభించడం లేదు. సమితిలో సుమారు 482 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాజెక్టులు, పథకాలు అమలు చేస్తున్నా వాటి వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే ఈ సమితిలో సరైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. గొడుబల్లి పంచాయతీలోని తిడిగుడ, పొడులుగుడ, లేఖాపాయి గ్రామాల్లో తాగునీటికి హాహాకారాలు చేస్తున్నారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు వందకు పైబడిన ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. అసలే వేసవికాలం కావడంతో వాగునీటిపై ఆధారపడే ఈ గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. వేసవి తీవ్రతకు వాగులు ఎండిపోవడంతో గుక్కెడు నీటికి కటకటలాడుతున్నారు. అదేవిధంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు వీరి దరికి చేరలేకపోతున్నాయి. పీడీఎస్ బియ్యం, పెన్షన్ వంటివి తీసుకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకే వీరికి శరణ్యం. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామాల వరకు చేరడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
విప్పపువ్వు అక్రమ రవాణా
రాయగడ: బియ్యం బస్తాల మాటున విప్పపువ్వును అక్రమంగా తరలిస్తున్న ఒక పికప్ వ్యాన్‌ను ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ చంద్రగొరడను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎకై ్సజ్ శాఖ ఓఐసీ సంజయ్ కుమార్ ప్రధాన్ తెలిపిన వివరాల మేరకు.. నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వు అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు స్థానిక మజ్జిగౌరి మందిరం వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాయగడ మీదుగా శశిఖాల్ వైపు వెళ్తున్న ఒక పికప్ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో 600 క్వింటాళ్ల బియ్యం బస్తాలు కనిపించాయి. అయితే అధికారులు లోతుగా తనిఖీ చేయగా బియ్యం బస్తాల కింద 900 క్వింటాళ్ల విప్పపువ్వు బస్తాలు బయటపడ్డాయి. అదేవిధంగా తనిఖీల్లో భాగంగా మందిరం చెక్‌గేట్ వద్ద నాటుసారా తరలిస్తున్న కె.అనిల్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎ.అప్పలరాజు అనే వ్యక్తి విదేశీ మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 7 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. -
ఉద్యమాలతోనే వైద్య కళాశాల సాధించాం
కొరాపుట్: ఉద్యమాలతోనే కొరాపుట్‌లో ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల సాఽధించామని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ప్రకటించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో జరిగిన వైద్య విద్యార్థుల యూనియన్ నిర్వహించిన వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కళాశాల ఏర్పాటు కోసం తాము అనేక ఉద్యమాలు చేశామన్నారు. నాడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 7 రోజులు ఆందోళన చేసిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం కళాశాల సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థులు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో ఉన్న లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేదిక మీద ఒడిస్సీ నృత్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో కళాశాల డీన్ సుకాంత్ సాహు, డాక్టర్ జయంత్ పండా, యూనియన్ సలహాదారుడు డాక్టర్ ప్రతిప్ కుమార్ జెన్నా, విద్యార్థి సంఘం అధ్యక్షుడు బాదల్ కుమార్, కార్యదర్శి హిమాంశ్ దాస్ పాల్గొన్నారు. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
కొరాపుట్: కొత్తవలస – కిరండోల్ రైల్వేమార్గంలో మరోసారి రైళ్ల రాకపొకలకు అంతరాయం ఏర్పడింది. జగదల్పూర్ – జయపూర్ స్టేషన్ల మధ్య కొడప రైల్వేస్టేషన్ సమీపంలో విద్యుత్ వైర్లపై చెట్లు పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ని కుసిమి వద్ద నిలిపివేశారు. సహాయక చర్యల అనంతరం మరలా రైళ్లని పునరుద్ధరించారు. సుమారు 3 గంటల పాటు రైలు ఆలస్యం కావడంతో జయపూర్, కొరాపుట్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. గత నాలుగు రోజుల్లో కొరాపుట్, రాయగడ జిల్లాల్లో వరుసగా 3 సార్లు ఇదే సమస్యలతో రైళ్లు నిలిచిపోయాయి. -
నూర్పు చేస్తుండగా మంటలు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం పంచాయతీ శాలిపేట గ్రామంలో ఆదివారం వరి చేను నూర్పు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. మరో వైపు మంటల ధాటికి వరి చేను కూడా కాలిపోయింది. హరిశ్చంద్రాపురం గ్రామానికి చెందిన బల్లి అప్పలరాజు తన ట్రాక్టర్, నూర్పు యంత్రంతో శాలిపేట గ్రామానికి చెందిన మార్పు భూషణం అనే రైతుకు చెందిన సుమారు 2 ఎకరాల వరిచేనును నూర్పు చేస్తుండగా, అకస్మాత్తుగా ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనతో అంతా పరుగులు తీశారు. ఒక్క సారిగా మంటలు వ్యాపించి ట్రాక్టర్ ఇంజిన్ మొత్తం అగ్నికి ఆహుతి కాగా మరో వైపు వరి చేను కాలిపోయింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోగా అంతా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఒక వైపు ట్రాక్టర్ యజమాని అప్పలరాజు, మరో వైపు రైతు భూషణం తమకు జరిగిన భారీ నష్టంతో బోరున విలపించారు. -
యువతి హత్య కేసులో నిందితుడి అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి పరిధిలోని రంగాభంద్ గ్రామ అడవిలో ఇటీవల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మల్కన్‌గిరి పోలీసు ఐఐసీ రీగాన్‌కీండో కేసు దర్యాప్తు చేయగా.. ఆదివారం ఓ యువకుడిని అరెస్టు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం పాండామ్కు చెందిన 23 ఏళ్ల ఉమేష్ నాగ్ మంగళదేయి నాగ్ (25) ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆమె గర్భవతి కాగా.. ఉమేష్ ఆమెను మల్కన్‌గిరి ఆస్పత్రికి వెళ్లి అబార్షన్ చేసుకోమని సూచించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మల్కన్‌గిరి సమితి ఛలాన్‌గూఢ గ్రామం వద్ద ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసి మృతదేహాన్ని రంగాబంద్ అటవీ ప్రాంతంలో పడేశాడని ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యం
కొరాపుట్: జయపూర్ పట్టణంలో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు సమష్టిగా కృషి చేయాలన్నారు.మద్యం విక్రయాలపై వివాదం కొరాపుట్: లక్ష్మీపూర్ సమితి కేంద్రంలో మద్యం విక్రయాలపై వివాదం చెలరేగింది. ఆదివారం బీజేపీ కార్యదర్శి, లక్ష్మీపూర్ నియోజకవర్గ సమన్వయకర్త అగస్తి హల్వ నేతృత్వంలో నిరసన చేపట్టారు. లక్ష్మీపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం విక్రయశాల నిర్వహిస్తుండటంపై మీడియాతో మాట్లాడారు. ఎంఆర్పీ కంటే ఎక్కవ ధరకు మద్యం అమ్ముతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని, ఇక్కడ ఎక్కువగా విదేశీ నకిలీ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. దీనిని తాగడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు స్థానికులు కూడా ఈ మద్యం షాపు అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషం తాగి యువకుడి మృతిమల్కన్గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి నీలిగూఢ పంచాయతీ దుర్మాగూఢ గ్రామంలో శనివారం రాత్రి ముయ పోడియామి (22) అనే వ్యక్తి విషం తాగి మృతి చెందాడు. ముయ పోడియామి శనివారం ఉదయం నుంచి కేందుకులుకు సమీపంలోని అడవికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో గూటిలో ఉన్న పురుగు మందు తాగి పడిపోయాడు. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోడియాను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోడియా పోలీసులు కేసు నమోదు చేశారు. లెట్రిన్ ట్యాంక్‌లో ఆవు కొరాపుట్: జయపూర్ పట్టణంలో ఇరిగేషన్ కాలనీలో లెట్రిన్ ట్యాంకులో ఆవు పడటంతో నరకయాతన అనుభవించింది. పాడుబడ్డ ట్యాంక్ పైకప్పు ఊడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆవును సురక్షితంగా బయటకు తీసారు. అనంతరం పశువుల ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. -
మురుగు పారదు.. దుర్గంధం వదలదు
మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ పరిధిలోని హీరాపురం గ్రామంలోని కాలువలు మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. కాలువలు నిండి మురుగునీరు పారకపోవడంతో దుర్గంధం వెదజల్లతూ అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, మురుగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా పంచాయతీ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి టెక్కలి రూరల్: ఇంట్లో కరెంట్ లేదని దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్ వచ్చి పోతుండటంతో స్విచ్ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. ఆటో..బైక్ ఢీ: విద్యార్థికి గాయాలు మెళియాపుట్టి: ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో మండలంలోని పెద్దమడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పడాల విజయ్ అనే విద్యార్థి గాయాల పాలయ్యాడు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్ ఆదివారం తన మామయ్య శ్రీనుతో కలిసి బైక్‌పై మెళియాపుట్టి నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. మెళియాపుట్టి గ్రామ శివార్లలో వస్తున్న ఆటోని బైక్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న విజయ్ దూరంగా ఎగిరిపడ్డాడు. దీంతో అతడి కాలికి గాయమైంది. వాహనం నడుపుతున్న శ్రీనుకు సైతం గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇద్దరినీ టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం తరలించినట్టు తెలిపారు. ఆశాజనకంగా చోడి పంట నరసన్నపేట: మండలంలో చోడి పంట ఆశాజనకంగా ఉంది. మెట్ట భూములతో పాటు సాగునీటి వసతులు ఉన్న పొలాల్లో రైతులు చోడిని వేశారు. రావులవలస, బొరిగివలస, బుచ్చిపేట, మడపాం, నడగాం, జమ్ము, తామరాపల్లితో పాటు గ్రామాల్లో రైతులు చోడిని వేశారు. మండలంలో 90 ఎకరాల్లో చోడి పంట ఉన్నట్లు వ్యవసాయ అదికారులు లెక్కలు తెలుపుతున్నాయి. గతంలో పోల్చితే చోడి పిండి వినియోగం ఆరోగ్య రీత్యా పెరగడంతో రైతులకు ఆదాయం వస్తుంది. సత్యనారాయణ నేత్రదానం శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్వీ మొహెర్ సుధాకర్, ఎన్వీ సురేష్, ఎన్వీ రవికిషోర్, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు కాల్చేయాలని కోరారు. -
అంబరాన్నంటిన ఆరాధనోత్సవం
పర్లాకిమిడి: చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో స్థానిక బిజూ కల్యాణ మండపంలో ఘంటసాల ఆరాధనోత్సవాలను సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రారంభించారు. కార్యక్రమంలో హైటెక్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహికూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం మెగా మెడికల్ క్యాంపును కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో 150మంది హృద్రోగ, మధుమేహాం, బి.పి. ఇతర వ్యాధులను తనిఖీలు చేయించుకున్నారు. విశాఖపట్నం నుండి డాక్టర్ కె.రామ్మూర్తి, కార్డియోలజిస్టు డాక్టర్ జి.మహేష్, పల్మనాలజిస్టు డాక్టర్ జి.శ్రీధర్, డాక్టర్ శరత్ కుమార్‌లు విచ్చేసి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని చైతన్య ఆధ్వర్యంలో డాక్టర్ సయ్యద్ రహింతుల్లా పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటసాల పాటలు, గానావధానం, కోలాటం, ఘంటసాల పాటలు ఆకట్టుకున్నాయి. కళాకారులకు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఆచార్య డి.ఎన్.రావు, తిరుపతి పాణిగ్రాహి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. -
గడువు తీరిన మందులను చట్టబద్ధంగా కాల్చుతాం
శ్రీకాకుళం క్రైమ్: గడువు తీరిన మందులను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందిన బయోవేస్ట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా కాల్చుతామని జిల్లా డ్రగ్ ఏడీ చంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇదివరకు ఏవైనా గడువు తీరిన (ఎకై ్స్పరీ) మందులు కొన్నింటికి కంపెనీలు రిటర్న్ పాలసీ కింద డబ్బులు చెల్లించేవని, మరికొన్నింటికి పాలసీ లేకపోవడంతో సంబంధిత ఫార్మా, జనరిక్, పీసీడీ డిస్ట్రిబ్యూటర్స్ బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా పెట్టి కాల్చేయడమో.. లేదంటే పూడ్చేయడమో చేసేవారన్నారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి, మానవ మనుగడకి ప్రమాదమని అన్నారు. తాజాగా జిల్లాలోని లావేరులో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీస్‌తో ఒప్పందం అయ్యిందని, బయో వేస్ట్ వెహికల్లో అక్కడికి తీసుకెళ్లి కాల్చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారి మన జిల్లాలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టామని, త్వరలోనే డిస్ట్రిబ్యూటర్స్, మందుల దుకాణాల వారితో సమావేశంలో అంతా వివరిస్తామన్నారు. రెయిన్బో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టు నేత దివాకర్ నాయిక్ మృతి
జయపురం: కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు దివాకర్ నాయిక్ మృతి పార్టీకి తీరని లోటని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కార్మిక నేత ప్రమోద్‌కుమార్ మహంతి అన్నారు. ఆదివారం కార్మిక భవనంలో కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా పరిషత్ నిర్వహించిన దివాకర్ సంతాప సభలో మహంతి మాట్లాడుతూ దివాకర నాయిక్ శనివారం రాత్రి 11.10 గంటలకు భువనేశ్వర్‌లో మరణించారని తెలిపారు. దివాకర్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, సహాయక కార్యదర్శి రామకృష్ణ దాస్, పార్టీ నేతలు బసంత బెహరా, జయరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
● ఇద్దరు ఒడిశా ఇంజినీర్లు మృతికొరాపుట్: హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందారు. ఆదివారం వేకువజామున ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో జయపూర్ బొయివీధికి చెందిన గిడుతూరి భానుప్రకాష్ (37), రౌర్కెలాకి చెందిన నళీని బిశ్వాల్ (33) మృతి చెందారు. వీరిద్దరూ కారులో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భానుప్రకాష్ తండ్రి జి.రాధాకృష్ణ జయపూర్ డీఐసీలో విశ్రాంత ఉద్యోగి. మృతులిద్దరూ స్నేహితులు కావడంతో హైదరాబాధ్లో ఒకేచోట ఉంటున్నారు. భాను ప్రకాష్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. నళినీ బిశ్వాల్కి తలిదండ్రులు లేరు. దీంతో ఇద్దరి మృతదేహాలను జయపూర్ తీసుకొస్తున్నారు. -
‘విశ్వ విద్యాలయంగా ఆమోదించాలి’
పర్లాకిమిడి: శ్రీకృష్ణచంద్ర గజపతి (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు పూర్వవైభవం రావాలంటే విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం అమోదించాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఆదివారం ఎస్.కె.సి. జి.కళాశాల పూర్వపు విద్యార్థుల సంఘం రెండవ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే రూపేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి గౌరవ అతిథులుగా విశ్రాంత ప్రొఫెసర్ బిపిన్ నాయక్, పూర్వపు విద్యార్థుల సంఘం కార్యదర్శి డాక్టర్ శంకర్ ప్రసాద్ భక్షి, చికిటి ఎమ్మెల్యే మనోరంజన్ గ్యాన్ సామంతరాయ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జితేంద్ర పట్నాయిక్, నాజిర్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ప్రొఫెసర్ బిపిన్ నాయక్‌ను ఎమ్మెల్యే చేతులమీదుగా సన్మానించారు. అలాగే అంతర్జాతీయ, రాష్ట్ర ఖ్యాతి గాంచిన అథ్లెట్ కిశోర్ చంద్ర రథ్, బిష్ణుమోహన్ అధికారిని అధికారులు సత్కరించారు. -
యోగాతో మానసిక ఉల్లాసం
రాయగడ: యోగాతో మానసిక ఉల్లాసం లభిస్తుందని సంబల్పూర్కు యోగా శిక్షకురాలు సులోచన అన్నారు. స్థానిక రైతుల కాలనీలోని నవ జీవన్ ట్రస్టులో ఆదివాసీ విద్యార్థులకు యోగాపై శిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. ప్రతీ విద్యార్థి యోగాను నిత్యకృత్యంగా అభ్యసించాలన్నారు. యోగా వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఆరోగ్యకరమైన శరీరం సొంతమవుతుందని తెలియజేశారు. ఆశ్రమాల్లోని విద్యార్థులకు నిర్వాహకులు యోగాపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నవజీవన్ ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తదితరులు పాల్గొన్నారు. -
● హజ్ యాత్రికులకు వీడ్కోలు
కొరాపుట్: హజ్ యాత్రకు వెళ్లే వారికి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం జయపూర్ పట్టణంలోని సంధ్యా ఫంక్షన్ హాల్ లో ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న 11 మంది హజ్ యాత్రికులను పిలిపించి సన్మానం చేశారు.అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి గతం లో వెళ్లి వచ్చిన హజ్ యాత్రికులు (హజీజ్) లు వచ్చి బహుమతులు అందజేశారు. ఈ నెల 22వ తేదీన అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం జరగనుంది. మే 13 నుంచి విడతల వారీగా హజ్ యాత్రికులు బయల్దేరి వెళ్లనున్నారు. ముస్లిం మత పెద్దలు ఎండీ హజర్ బేగ్, కేఎం ఇషాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ సామూహిక ప్రార్థనలు చేశారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కొరాపుట్: తమ సమస్యలు పరిష్కరించాలని బీడీ ఆకులు సేకరించే కార్మికులు కోరారు. ఈ మేరకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో ఒడిశా కెందు పత్ర కర్మచారా సంఘం అధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజిత్ మహంతి మాట్లాడుతూ బీడీ ఆకుల సేకరణపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీడీ ఆకులు సేకరించే కార్మికుల ఇంట్లో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం కెందు బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందించేందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సహాయాన్ని నిలుపుదల చేస్తుందనే ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో బీడీ ఆకుల సేకరణపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రభుత్వం మానవతా దృష్టితో బీడీ ఆకులు సేకరించే కార్మికులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీఎఫ్‌వో (కెందు లీప్) కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నబరంగ్‌పూర్, కొరాపుట్ జిల్లాల సలహాదారుడు కున్ని అధికారి తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ సండే
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025రుణాలు సద్వినియోగం చేసుకోవాలిసోనియా, రాహుల్‌లపై బీజేవైఎం ఆగ్రహం కొరాపుట్: రాష్ట్ర రాజధానిలో భారతీయ జనతా పార్టీ యువజన మోర్ఛా కార్యకర్తలు ఆదివారం భారీ ఆందోళన చేశారు. భువనేశ్వర్‌లోని మాస్టర్ క్యాంటీన్ చౌక్ వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చిత్ర పటాలతో నిరసన చేశారు. తక్షణం ఈడీ ముందు హాజరు కావాలన్నారు. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖేల్ ఇండియా సెంటర్లు ప్రారంభం కొరాపుట్: రాష్ట్ర వ్యాప్తంగా ఖేల్ ఇండియా సెంటర్స్‌ని రాష్ట్ర ఉన్నత విద్య, స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్ మంత్రి సూరజ్ సూర్యవంశీ ప్రారంభించారు. ఆదివారం భువనేశ్వర్‌లోని తన కార్యాలయంలో వర్చువల్ విధానంలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. తొలి విడతగా ప్రతి జిల్లాకు ఇదే వేదిక మీద రు.5 లక్షలు చొప్పున విడుదల చేశారు.లక్ష్మీపూర్‌లో సైబర్ మోసం కొరాపుట్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైబర్ మోసానికి గురయ్యారు. లక్ష్మీపూర్ సమితి కార్యాలయ సమీపంలో నివాసముంటున్న టీచర్ త్రినాథ్ మహాపాత్రోకి ఆదివారం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. హెడీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, డెబిట్ కార్డుకి లింక్ పంపుతున్నామని, ఓటీపీ చెప్పాలని కోరారు. బాధితుడు ఓటీపీ చెప్పిన వెంటనే క్షణాల్లో రూ.19,600 అతని అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.జయపురంలో ఆదివారం ఈస్టర్ సండే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 5 గంటలకు వందలాది మంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. క్రీస్తు పునరుత్థానాన్ని తెలిపే కరపత్రాలు పంచారు. సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. – జయపురంపర్లాకిమిడి: అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరం పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద ఒక చైతన్య రథాన్ని జిల్లా పాలనాధికారి బిజయ కుమార్ దాస్ పచ్చజెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. సహకార సంఘాలు ఏర్పాటు వల్ల రైతులకు రుణాలు మంజూరు చేయడానికి జిల్లాలో ఉన్న 50 ప్యాక్స్, ల్యాంప్స్లు 100కి పెరిగాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ప్యాక్స్ (ప్రాథమిక పరపతి సంఘం) ద్వారా రూ.5 లక్షల రుణం ప్రభుత్వం అందజేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ హరిహర శెఠి తదితరులు పాల్గొన్నారు.న్యూస్‌రీల్ -
బిజూ ఆరోగ్య సంక్షేమ కార్డులకు మంగళం..?
జయపురం: గత ప్రభుత్వం ప్రజలకు సమకూర్చిన బిజూ ఆరోగ్య పథకం కార్డులు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులు ఆమోదించడం లేదని కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరాపుట్ జిల్లాలో ఆధునిక సౌకర్యాలు లేక ఈ జిల్లాకు చెందిన రోగులు మెరుగైన వైద్యం కోసం రాష్ట్రంలోని కటక్, లేదా బరంపురంతో పాటు విశాఖ వెళ్తుంటారు. ఎక్కువ మంది విశాఖ వెళ్తారు. గతంలో బిజూ ఆరోగ్య సంక్షేమ కార్డులపై విశాఖలో చికిత్స చేయించుకునే వాళ్లమని, కానీ ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైన తేదీ నుంచి బిజూ కార్డులు అనుమతించడం లేదని తెలిపారు. చాలా మంది ఈ కార్డులు పట్టుకుని వైజాగ్ వెళ్లి చికిత్స చేయించుకోలేక ఆపసోపాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం బొయిపరిగుడలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పడు బిజూ పట్నాయిక్ ఆరోగ్య పథకం స్థానంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ కార్డులు, గోపబంధు జన ఆరోగ్య పథకాలు వచ్చాయని, పాత కార్డులు రద్దయ్యాయని తెలిపారు. పై రెండు పథకాలకు సాఫ్ట్వేర్ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే కొత్త కార్డులు వచ్చే వరకు పాత కార్డులపై చికిత్స పొందే అవకాశం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. -
సీఎంతో సుదర్శన్ పట్నాయక్ భేటీ
కొరాపుట్: సీఎం మోహన్ చరణ్ మఝితో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ భేటీ అయ్యారు. ఇటీవల యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన పోటీల్లో సుదర్శన్‌కి శాండ్ మాస్టర్ అవార్డు లభించింది. అవార్డుతో ఇండియా వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిని కలిశారు. సుదర్శన్‌ను సీఎం శాలువ కప్పి సత్కరించారు. సీఎంతో స్పెయిన్ అంబాసిడర్ చర్చలు కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మఝితో స్పెయిన్ అంబాసిడర్ జువాన్ ఆంటోనియో మార్చ్ పౌజల్ చర్చలు జరిపారు. లోక్ సేవా భవన్లో ఆయన సీఎంను కలిశారు. స్పె యిన్–ఇండియా సంబంధాలపై మాట్లాడారు. ఈడీ ఆఫీసు ముందు ఆందోళన కొరాపుట్: భువనేశ్వర్‌లోని ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. తమ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్రం కక్ష కట్టి అక్రమ కేసులు మోపుతోందని అన్నారు. ఈ వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీణీపతి హాజరయ్యారు. -
ఘాట్ రోడ్డులో జారిపడిన భారీ యంత్రం
కొరాపుట్: కొరాపుట్–జయపూర్ పట్టణాల మధ్య జాతీయ రహదారి–26పై భారీ యంత్రం జారి పడింది. శనివారం వేకువ జామున దేవఘాట్ వద్ద కొరాపుట్ నుంచి వస్తున్న భారీ ట్రాలీ మలుపు వద్ద అదుపు తప్పింది. వేగంతో పక్కకు ఒరిగిపోయింది. దానిపై ఉన్న భారీ యంత్రం రోడ్డు మధ్యన పడింది. ఘటన జరిగి 14 గంటలైనా అధికారుల నుంచి స్పందన లేదు. రోడ్డుపై ఉన్న యంత్రాన్ని ఏదైనా వాహనం ఢీకొడితే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ దీనిని తొలగించడం గానీ, ప్రమాద హెచ్చరిక గానీ లేకపోవడంతో వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో నిత్యం భారీ వాహనాలు తిరుగుతుంటాయి. యంత్రాన్ని తొలగించే లోపు వర్షం పడినా, చికటి పడినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. -
అభివృద్ధి పథకాల అమలుపై ఆరా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్, జిల్లా నోడల్ అధికారి బిజయ్ కేతన్ ఉపాధ్యాయ క్షేత్ర పరిశీలన చేశారు. శనివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో ప్రతి ఏడాది జరిగే మండయ్ ఉత్సవాల గ్రౌండ్‌ను పరిశీలించారు. ఆ ప్రాంతంలో శాశ్వతంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. శాసన, అగ్నిపూర్ గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. మహుల్ పొదర్, సన్న మసిగాం జీడి పరిశ్రమ కేంద్రాల్లో పర్యటించారు. సన్న మసిగాం గ్రామంలో 20 మంది మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం ద్వారా ఉపాధి పొందుతున్న చేనేత పరిశ్రమలో మహిళలతో మాట్లాడారు. తంగజారి, బాసిని గ్రామాల్లో ప్రభుత్వ సహాయంతో గిరిజనులు పండిస్తున్న స్ట్రా బెర్రీ ఉత్పత్తులను పరిశీలించారు. లిమబట్ట, కొకొడి సెమ్లా గ్రామాల్లో హస్త కళల ఉత్పత్తి కేంద్ర కళాకారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయంపై ఆరా తీశారు. మిషన్ శక్తి వ్యవహారాలు, మెగా వాటర్ ప్లాంట్ నిర్మాణాలను జిల్లా వ్యాప్తంగా పరిశీలించారు. ఈ పర్యటనలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, అన్ని శాఖలు అధికారులు పాల్గొన్నారు. -
ఆరో తరగతి బాలికకు గర్భం
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్‌లో ఆరో తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆమెను మోసగించాడు. ఇతడు ప్లస్ టూ చదువుతున్నాడు. బాలిక శరీరంలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయగా ఆమె గర్భం దాల్చినట్లు తేలింది. ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు కల్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. సారాతో ఇద్దరు అరెస్టు జయపురం: సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు జయపురం అబ్కారి విభాగ అధికారి శుబ్రత్ కేశరి హిరన్ శనివారం తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ ఉందని వెల్లడించారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామని, బైలు మంజూరు కాకపోవటం వలన వారిని జైలుకు పంపామన్నారు. శుక్రవారం సాయంత్రం అబ్కారి సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుంగా నరసింహ, ఓ మహిళ జయనగర్ గ్రామం సమీపంలో సారా తీసుకువస్తుండగా పట్టుబడ్డారన్నారు. ఎ.ఎస్.ఐ బలరాం దాస్, అబ్కారి సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు అరెస్టు పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి ఉప్పలాడ గ్రామం శబరనగర్ వద్ద నిషేధిత అటవి పందిని వేటాడి మాంసం అమ్ముతున్న సమాచారం అందుకున్న దేవగిరి రేంజ్, కోర్సండ్ బీట్ అటవీ అధికారులు ఇద్దరు వేటగాళ్లను పట్టుకుని శనివారం కోర్టుకు తరలించారు. ఇద్దరు నిందితులు ఇప్రియం శోబోరో, ఏసాకో భుయ్యాన్ వద్ద 8 కిలోల అడవి పంది మాంసం, ఒక మోటార్ సైకిల్, అయిదు కత్తులు, కీప్యాడ్ మొబైల్‌ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యమృగాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు డీఎఫ్ఏ కె.నాగరాజు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన అరసవల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిబ్బంది శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సంఘ జిల్లా అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో ఆరోగ్యమందిర్‌లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 573 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. నియామకాలు జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇన్సెంటివ్‌తో పాటు ఏటా 5 శాతం ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
● క్రికెట్ విజేత కలహండి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని దొరగుడ వద్ద గల ఉత్కళ అల్యూమినియం ఇంటర్ నేషనల్ కర్మాగారం ఆధ్వర్యంలో ఉషాపడు టౌన్ షిప్ మైదానంలో శనివారం స్టేక్ హోల్డర్ ఫ్రెండ్ షిప్ ఒక్కరోజు క్రికెట్ టోర్నమెంటు జరిగింది. జిల్లా ఎస్పీ స్వాతి ముఖ్యఅతిథిగా, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్, ఏఎస్పీ బిష్ణు ప్రసాద్ పాత్రోలు గౌర అతిథులుగా హాజరయ్యారు. 5 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌కు మ్యాచ్ కలహండి –11, రాయగడ –11 కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జట్లు చేరుకున్నాయి. ఫైనల్లో కలహండి–11 జట్టు విజేతగా నిలిచింది. కర్మాగారం యూనిట్ హెడ్ మజూర్ బేగ్, జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ అలీనూర్, కలహండి జిల్లా క్రీడాశాఖ అధికారి రమేష్ కుమార్ పాడి తదితరులు విజేత జట్టుకు ట్రోఫీని అందించారు. -
క్రికెట్ మైదానంలో గంజాయి ఒప్పందాలు
● ఇద్దరు ఒడిశా యువకులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు ● 10 కేజీల గంజాయి స్వాధీనంకాశీబుగ్గ: క్రికెట్ గ్రౌండ్లో ఆ యువకులకు పరిచయం ఏర్పడింది. ఓవైపు ఆడుతూనే.. మరోవైపు అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా తండిగుడ, తాళ్లబంద గ్రామాలకు చెందిన తపాన్ బెబారత, మాననిత్ సింగ్ ఇరుగుపొరుగు గ్రామాల యువకులు. తరచూ క్రికెట్ గ్రౌండ్లో కలుసుకునేవారు. పది కేజీల గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తే రూ.10 వేలు వస్తుందని ఒప్పందం కుదరడంతో ఇద్దరూ పలాసలోని రైలు నిలయానికి వచ్చారు. బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 10.39 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రైలు నుంచి జారిపడి వలస కార్మికుడి మృతి
రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇచ్ఛాపూర్ పంచాయతీలోని కాసెర గ్రామానికి చెందిన కును గౌడ (17) అనే యువకుడు ప్రమాదవసాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. గత కొద్ది నెలల క్రితం కును తన స్నేహితులతో కలిసి ఉపాధి కోసం కేరళకు వెళ్లాడు. పనులు ముగించుకుని శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేందుకు ట్రైన్లో బయలు దేరాడు. తిరుచూర్–పాలకాడ్ రైలులో డొర్ వద్ద నిలబడి ఉండటంతో ప్రమాదవసాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు.. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమయ్యే డబ్బులు లేకపొవడంతో జిల్లా కార్మిక శాఖ అధికారులకు కును తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అధికారులు అవసరమయ్యే ఖర్చులు భరించి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు హామీ ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టడం తగదు శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పాలన సాగిస్తోందని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనిని ఎదురిస్తున్న కాంగ్రెస్ నాయకులను మట్టు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తులు మీద, పార్టీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేయడం విడ్డూరమన్నారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదన్నారు. బీజేపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. -
40 యూనిట్ల రక్తం సేకరణ
పర్లాకిమిడి: స్థానిక డోలాట్యాంకు రోడ్డు సెయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చిలో గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగ సందర్భంగా శనివారం రక్తదానం శిబిరంను ఫాదర్ అజిత్ కుమార్ నాయక్ ఏర్పాటుచేశారు. ఈ శిబిరానికి ఎస్పీ జితేంద్రనాథ్ పండా ప్రారంభించగా, జిల్లా ప్రజారోగ్య అధికారి డాక్టర్ రబినారాయణ దాస్, డాక్టర్ షబ్నా పర్వీన్, సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహరా, పింకి పాఢి, జి.ప్రవీన్ సహకరించారు. పలువురు క్రైస్తవ సోదరులు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం 40 యూనిట్ల రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకుకు తరలించారు. -
నూతన భవనం ప్రారంభం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలో మ్యూజియం సమీపంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఎనాలిటికల్ ట్రైబల్ స్టడీస్ (కోట్స్) ప్రాంగణంలో నూతన భవనాన్ని కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ ప్రారంభించారు. ఓఎంసీ కేటాయించిన రూ..8 లక్షలతో ఈ భవనం నిర్మితమైంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి కొరాపుట్: కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి డెంగాగుడ–కలిమా గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చికాంబర్ గ్రామానికి చెందిన ధర్మేంధ ముదలి (25) అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ, మలుపు దాటుతుండగా బైక్ అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్నటువంటి గోతులోకి బైక్ దూసుకుపోవడంతో రాళ్లని ఢీకొని మృతి చెందాడు. దశమంత్‌పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.రాయగడలో చోరీ రాయగడ: పట్టణంలోని కరణం వీధిలో నివసిస్తున్న కె.సుభాష్ చంద్కర బెహర అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి బీరువా విరగ్గొట్టి రూ.2.50 లక్షల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు సదరు పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి ఇంట్లోని అందరూ నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో సుభాష్‌కు మెలకువ వచ్చి వాష్ రూమ్‌కి వెళ్లేందుకు చూశాడు. అయితే అప్పటికే ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అనంతరం ఇంట్లోని ఒక గదిలో ఉన్న బీరువా తలుపులు తెరిచి ఉండడం గమనించి అక్కడికి వెళ్లి చూడగా అందులోని నగదు కనిపించలేదు. దీంతో తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గాయపడిన సర్పాలకు రక్షణ
కొరాపుట్: గాయాలపాలైన భయంకరమైన కోబ్రా పాములను స్నేక్ హెల్పర్లు రక్షించారు. శనివారం కొరాపుట్ జిల్లా జయపూర్ సమీపంలోని డొంగ్రురు చించి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిలుపదల చేసిన జేసీబీ వాహనంలో రెండు కోబ్రా పాములు బుసలు కొట్టడం స్థానికులు గమనించారు. వాటిని అదిలించడానికి ప్రయత్నం చేసినా పడగ ఎత్తుతూ బుసలు కొట్టాయి. జాగ్రత్తగా గమనిస్తే అవి యంత్రంలో చిక్కుకున్నాయని గమనించారు. వెంటనే జయపూర్ లో ఉన్న స్నేక్ హెల్పర్ కృష్ణ కేశవ షడంగి కి సమాచారం ఇచ్చారు. కేశవ తన టీమ్ సభ్యుడు చందన్ తో కలసి సంఘటన స్ధలానికి చేరుకున్నాడు. నేర్పుగా వాటిని బయటకు తీయగా ఒక సర్పంకి మెడ మీద, మరోక దానికి నడుం మీద తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించారు. వెంటనే వాటిని పశువైద్యాధికారి శౌభ్యాగ్య వద్ద చికిత్స చేయించారు. అనంతరం వాటిని జయపూర్ రేంజ్ అటవీ శాఖా అధికారి సచ్చి పరిడాకి అప్పగించారు. కేశవ్ బృందాన్ని అటవీ శాఖ అధికారులు అభినందించారు. వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి కోలుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో వదలి పెడతామని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. -
మావోల డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పిలిమామ్మిడి గ్రామ అడవిలో శుక్రవారం రాత్రి నుంచి రెండో బెటాలియాన్ బీఎస్ఎఫ్ జవాన్ల్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం తిరిగి వస్తున్న సమయంలో ఓ కొండపై రాయి మధ్యన ఓ నల్లని క్యారీ బ్యాగ్‌లో జవాన్లను టార్గెట్ చేస్తూ ఉంచి మావోల సామగ్రి జవాన్ల కంట పడింది. అందులో రెండు బర్మన్ తుపాకులు, గన్ పౌడర్ తదితర వస్తువులు గుర్తించారు. చోరీ సొత్తు స్వాధీనం కొరాపుట్: ఒక చోరీ కేసులో సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిమిలిగుడ పోలీసులు ప్రకటించారు. శనివారం సిమిలిగుడ ఇన్చార్జి ఐఐసీ అనితా కుజుర్ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం సిమిలిగుడ పోలీసుస్టేషన్ పరిధి కై లాష్ నగర్ 10వ లైన్లో నివసిస్తున్న ప్రబీర్ కుమార్ దాస్ ఒక శుభకార్యానికి సునాబెడా వెళ్లారు. అయితే రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడినట్లు గమనించారు. వెంటనే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో జయపూర్ సదర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రూ.22,500ల నగదు, వెండి వస్తువులు, స్టేషనరీ సామాన్లు ఉన్నాయని ప్రకటించారు.300 కేజీల గంజాయి స్వాధీనం కొరాపుట్: అక్రమంగా రవాణా చేస్తున్న 300 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీసులకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు శనివారం సమాచారం వచ్చింది. దీంతో పెట్రోలింగ్ చేపట్టారు. దీనిలో భాగంగా హికింపుట్ గ్రామం వద్ద నిలుపుదల చేసిన ఒక కారుని పరిశీలించారు. అందులో భారీగా గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కారు యజమాని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారు పాడువా నుంచి సిమిలిగుడ వైపు వస్తున్నట్లు పేర్కొన్నారు. విజిలెన్స్ వలలో అడిషనల్ తహసీల్దార్ కొరాపుట్: విజిలెన్స్ వలలో అడిషనల్ తహసీల్దార్ పడ్డా. శని వారం సంబల్పూర్ జిల్లా మానేశ్వర్ తహసీల్ కార్యాలయంలో అదనపు తహసిల్దార్‌గా పనిచేస్తున్న భుభనానంద సాహు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. వ్యవసాయ భూమిని గృహ నిర్మాణ భూమిగా మార్చడానికి రూ.10వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు విజిలెన్స్ వారిని సంప్రదించగా వారు మాటు వేసి పట్టుకున్నారు. గ్రామస్తుల చేతికి చిక్కిన దొంగ కొరాపుట్: దొంగతనం చేయడానికి వెళ్లి గ్రామస్తుల చేతికి చిక్కిన ఓ దొంగ దొరికిపోయాడు. శనివారం వేకువ జామున కొరాపుట్ జిల్లా కేంద్రానికి సమీపంలో మస్తీపుట్ గ్రామ పంచాయితీ రుండియా గ్రామంలోనికి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. ఒక దుకాణంలో దొంగతనం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రామ యువకులు కొరాపుట్ పట్టణం నుంచి తిరిగి వచ్చారు. దొంగలు పడినట్లు గుర్తించి వారిపై దాడి చేశారు. ఇద్దరు పారిపోగా.. ఒకడిని పోలీసులకు అప్పగించారు.స్వాధీనం చేసుకున్న తుపాకులతో కలిమెల పోలీస్ స్టేషన్ వద్ద జవాన్లు -
నవీన్‌కు 9వ సారి పట్టాభిషేకం
బిజూ ఆశయాలలో నడుస్తాం తమ నాయకుడు దివంగత బిజూ పట్నాయక్ ఆశయాలలో తమంతా నడుస్తామని నవీన్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2000–24 వరకు ప్రజలు ఇచ్చిన అవకాశంతో బీజేడీ పార్టీ ఒడిశా రాష్ట్రానికి చేసిన సేవ చరిత్రాత్మకం అని అన్నారు. ప్రస్తుతం కార్యకర్తలు పార్టీ ఉన్నతి కోసం పని చేయాలన్నారు. ప్రజల లోనికి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేవలం కొద్ది ఓట్ల తేడాతో అనేక సీట్లు కోల్పోవడం ద్వారా అధికారం కోల్పోయామన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు. మనపై దుష్ప్రచారాలు చేయడం తప్ప, ప్రత్యర్థులకు మరేం పని లేదన్నారు. అభినందనలు వేదిక మీద ఉన్న నవీన్‌కి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పూలగుచ్ఛాలు, శాలువాలతో అభినందించారు. చాలా కాలం తర్వాత నాయకులు ఒకరినొకరు ఎదురు పడడంతో పలకరింపులతో ఆ ప్రాంతం కళకళ లాడింది. మహిళా నాయకులు ప్రత్యేకంగా నవీన్‌తో ఫొటోలు దిగారు.కొరాపుట్: సార్వత్రిక ఎన్నికల తర్వాత వెలవెలబోయిన బీజేడీ పార్టీ రాష్ట్ర కార్యాలయం తొలిసారిగా కళకళలాడింది. శనివారం పార్టీ అధ్యక్షునిగా నవీన్ పట్నాయక్ 9వ సారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంపై ముందుగా సమాచారం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ముందే తరలి వచ్చారు. దద్దరిల్లిన శంఖ్ భవన్.. పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి నవీన్ కారులో శంఖ్ భవన్ చేరుతున్నప్పుడు కార్యకర్తల నినాదాలతో శంఖ్ భవన్ దద్దరిల్లింది. పార్టీ ముఖ్య నేతలు వరుస క్రమంలో నించుని అధినేతకి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో ప్రేక్షకులు గ్యాలరీలో ముందు వరుసలో నవీన్ కూర్చున్నారు. పార్టీ ఎన్నికల రాష్ట్ర రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ప్రతాప్ కేసరి దేవ్ తొలుత ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నవీన్ ఒక్కరే నామినేషన్ వేసినందున అధ్యక్షునిగా ప్రకటిస్తున్నానని చెప్పారు. వెంటనే శంఖ్ భవన్ చప్పట్లతో దద్దరిల్లింది. ప్రతాప్ కేసరి నవీన్ వద్దకు వచ్చి వేదిక మీదకు తీసుకొని వెళ్లారు. -
నిలిచిపోయిన రైళ్లు
కొరాపుట్: కొత్తవలస – కిరండోల్ రైల్వేమార్గంలో కొరాపుట్–జయపూర్ రైల్వేస్టేషన్ల మధ్య జరతి రైల్వేస్టేషన్లో ప్రమాదం జరగడంతో రైళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. గంగవరం పోర్టు నుంచి గూడ్స్ రైలు ఛత్తీష్‌గడ్‌లోని బచేలి నుంచి ముడి ఇనుప రజను తీసుకొని రావడానికి వెళ్తోంది. అయితే ఆ సమయంలో గుర్తు తెలియని వస్తువు ఢీకొనడంతో ఒక విద్యుత్ స్తంభం ముందుకు కదిలింది. దీంతో 350 మీటర్ల విద్యుత్ వైరు తెగిపడింది. ఫలితంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైళ్లు నిలిచిపోయాయి. వెంటనే కొరాపుట్, జయపూర్ స్టేషన్ల నుంచి రైల్వే నిపుణులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ పునరుద్ధరించారు. దీంతో జగదల్పూర్–రౌర్కెలా, జగదల్పూర్–భువనేశ్వర్ రైళ్లని జయపూర్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని జిల్లాలొని కొలనార పంచాయితీలొని కెవుటిగుడ గ్రామానికి చెందిన రాకేష్ ఒటక (19) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలొ చదువుతున్న రాకేష్ బైకుపై వ్యక్తి గత పనుల కోసం కెవుటిగుడ నుంచి జేకే పూర్‌కు శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ఒంటామడ వద్ద గల పార్వతీనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని ఒక వాహనం ఢీకొని వెళ్లిపొయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై రాకేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. -
బ్యాంకులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
రాయగడ: బ్యాంకుకు రెండు నెలల పసికందును మోసుకుంటూ వెళ్లిన ఆ మహిళ బ్యాంకు లావాదేవీల్లో ఉండగా అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైన ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ ఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలోని ఫకేరి గ్రామంలో నివసిస్తున్న డొంగిరియా తెగలకు చెందిన 20 మంది మహిళలు తమ బ్యాంకు ఖాతాలకు సంబంఽధించి లావాదేవీల కోసం కళ్యాణసింగుపూర్‌లో గల ఒక బ్యాంకుకు వెళ్లారు. తమ గ్రామం నుంచి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపొవడంతో సుమారు 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ అంతా కలసి పర్శాలికి చేరుకుని అక్కడి నుంచి ఒక ఆటో సాయంతో కల్యాణసింగుపూర్కు బయల్దేరారు. వీరితో పాటు కొనే సికక అనే మహిళ కూడా తన నెండు నెలల పసికందును వెంట తీసుకువెళ్లింది. ఈ క్రమంలో బ్యాంకుకు చేరే సరికి కొద్ది సమయం తర్వాత పసికందు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే అక్కడ గల ఆస్పత్రికి తరలించగా అప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కన్నీరు మున్నీరైన ఆమె మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లింది. -
మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు
రూర్కేలా: ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘర్ జిల్లాలో మురికివాడల్లో నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృత్యువాత పడగా, 19 మంద గాయపడ్డారు. గాయపడిన వారిలో అదనపు తహసీల్దార్ కూడా ఉన్నారు. సుందర్ ఘర్ జిల్లాలోని బర్కానీ ఏరియాలో నివాసముండే మురికివాడ నిర్వాసితులను ఖాళీ చేయించే క్రమంలో అధికారులు అక్కడ వచ్చారు. ఈ క్రమంలోనే వారు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పడంతో అటు పోలీసులకు మురికివాడ నిర్వాసితులకు ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేయగా, దాన్ని వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం మీదుగా రైల్వే లైన్ మంజూరు కావడంతో అక్కడ ఉండే వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు పూనుకున్నారు. దీనిలో భాగంగా పోలీసుల్ని తీసుకునిన అక్కడకు వెళ్లగా అక్కడ ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకుంది. -
జాతీయ సెమినార్ ప్రారంభం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వద్యాలయంలో సైన్స్ ఫర్ సోషియేటెడ్ అప్లికేషన్స్ అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల జాతీయ సెమినార్ ప్రారంభమయ్యింది. వర్సిటీ ఫిజిక్స్, కెమిస్టీ విభాగం ఐఓపీ, ఐఎఎన్సీఎఎస్,–ఈఆర్సీ భువనేశ్వర్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో కార్యదర్శి డాక్టర్ బి.మల్లిక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఈఆర్సీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె.కె.నంద, ముంబై బీఆర్సీ డాక్టర్ ఆర్.ఆచార్య విశ్వవిద్యాలయ పి.జి కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్‌కుమార్ పాత్ర, యూనివర్శిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్రనాయిక్, యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దేవీప్రసాద్ మిశ్రా, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్ఞాన రంజన్ మహంతి, హెచ్ఓడీ డాక్టర్ సుజిత్ కుమార్ దెహురి, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బీబీ నంద, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి బాలుడు బలి
కొరాపుట్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలైపోయాడు. శుక్రవారం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కనేజువా గ్రామ సరిహద్దులో జీడి తోటలో విద్యుత్ వైరు తగిలి కై లాష్ గదవ (10) అనే బాలుడు మృతి చెందాడు. ఈ ప్రాంతంలో విద్యుత్ వైరు తెగినప్పటికీ కరెంట్ ప్రవహిస్తుందని గిరిజనులు విద్యుత్ శాఖకి ఫిర్యాదు చేశారు. కానీ మూడు రోజులుగా పట్టించుకోలేదు. జీడి తోటలో పిక్కలు ఏరుకోవడానికి బాలుడు వెళ్లగా విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సాధించాడు
మన గణేశుడు ● డొంకలపర్త వాసి అరుదైన రికార్డు ● సముద్రంలో 28 కిలోమీటర్ల దూరాన్ని 10.30 గంటల్లో ఈదిన వైనం ● తెలుగు రాష్ట్రాల నుంచి పారా స్విమ్మర్‌గా చారిత్రాత్మక ఘనత ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేస్తున్న బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన బలగ గణేష్ రాష్ట్రంలో తొలి పారా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించారు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారతదేశంలో ధనుష్కోటి వరకు 28 కిలోమీటర్ల దూరాన్ని పది గంటల 30 నిమిషాల్లో ఈది తెలుగు రాష్ట్రాల నుంచి తొలి పారా స్విమ్మర్‌గా నిలిచారు. శుక్రవారం ఉదయం 5.50కు ప్రారంభించిన ఈ ప్రయాణాన్ని సాయంత్రం 4.20 గంటలకు పూర్తి చేశారు. ఈ అసాధారణ రికార్డుపై స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ ప్రతినిధులు, శాప్ ఎండీ గిరీశ పీఎస్, డొంకలపర్త గ్రామస్తులు అభినందనలు తెలిపారు. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
రైతుల కోసం రాజీలేని పోరాటం
కొరాపుట్: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కట్రగుడ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై కూడా మహిళలు, రైతుల తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది రైతులే ఉన్నారని, వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ నెల 22 నుంచి రంగు మార్చి కొత్త రేషన్ కార్డుల పేరిట ప్రభుత్వం పంపిణీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
టన్నెల్‌ను సందర్శించిన సీఎల్పీ నేత
కొరాపుట్: భారత్‌మాల సొరంగ మార్గాన్ని(టన్నెల్) కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు రాంచంద్ర ఖడం శుక్రవారం సందర్శించారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకీ సమీపంలోని అంపావల్లి గ్రామం వద్ద సొరంగ మార్గంలోనికి అనుచరులతో కలిసి ప్రవేశించారు. నిర్మాణ వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. సుమారు రూ.20 వేల కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కి ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్( భారత మాల జాతీయ రహదారి) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.లోయలో పడిన లారీ ● డ్రైవర్, క్లినర్‌కు గాయాలు పర్లాకిమిడి: గజపతి–గంజాం జిల్లాల సరిహద్దు తప్తపాణి ఘాటి వద్ద రాయగడ నుంచి బరంపురం వెళ్తున్న 16 చక్రాల లారీ (ట్రక్కు) అదుపుతప్పి 20 అడుగుల లోయలో పడిపోయిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పేపరు లోడుతో ఉన్న లారీ అదుపుతప్పి తప్తపాణిఘాటి జకరపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లినర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పుడామర్రి పోలీసు ఠానా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గతంలో పలు సార్లు ఇదే ఘాటి మలుపు వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
కనువిందు చేస్తున్న చెంగల్వ పూలు
ఎల్ఎన్ పేట: మండలంలోని మురగడలోవ గిరిజన గ్రామంలో ఈ ఏడాది ముందే పూతకు వచ్చిన చెంగల్వ పూలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఏటా మే నెలలో పూతకు వచ్చే చెంగల్వ పూలు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విరబూశాయి. అరుదుగా కనిపించే చెంగల్వ పూల మొక్కకు చెందిన దుంపలు భూమిలో ఉంటాయి. దుంప నుంచి కాడలా పెరిగిన మొక్క ఒక్కో కాడ నుంచి అనేక పూలు పూస్తుందని గిరిజనులు సవర చిరంజీవి, సవర సింహాచలం తెలిపారు. ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకుందాం గార: ప్రాచీన వారసత్వ సంపదలను కాపాడుకుందామని ఇంటాక్ బృందం కన్వీనర్ నూక సన్యాసిరావు, అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హెరిటేజ్ వాక్ పేరిట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో పర్యటించారు. షేర్ మహమ్మద్ ఖాన్ పాలనా కాలంలో అతిపెద్ద మెట్ల బావి నిర్మాణం చేశారన్నారు. గ్రామస్తులతో అడగి పలు వివరాలు తెలుసుకున్నారు. 25 ఏళ్ల కిందటి వరకు ఈ బావి నీరు తాగడానికి వాడేవారమని గ్రామస్తులు తెలి పారు. అప్పట్లో నిర్మించిన పురాతన భవనాలు కూడా ఇప్పటీకీ చెక్కుచెదురుకుండా ఉండటాన్ని గుర్తించారు. ఈ భవనాలను, బావిని పర్యాటక కేంద్రంగా మలచడానికి అవకాశం ఉందని బృంద సభ్యులు అభిప్రాయపడ్డారు. పరిశీలనలో ఇంటాక్ మెంబర్లు కొమ్ము రమణమూర్తి, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, తర్లాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. డీలర్ కుటుంబంపై దాడి చేసిన వారిపై కేసు నమోదుఎచ్చెర్ల: లావేరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రమణమ్మ కుటుంబంపై దాడి చేసిన వారిపై శుక్రవారం లావేరు పోలీసులు కేసు నమోదుచేశారు. డీలర్ రమణమ్మ రిమ్స్‌లో ఎంఎల్సీకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోర పారోతి, పరపతి రాము, రమణమ్మ, గాలి రమణ, బోర అసిరినా యుడు, వాకాడ గణేష్, బోర గణేష్, దుర్గారావు, హరీష్‌లపై కేసు నమోదు చేశారు. పిడుగుపాటుకు విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం కంచిలి: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిడుగులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో విద్యుత్ ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. మండలంలోని గోకర్ణపురం పంచాయతీ పరిధి గోకర్ణపురం, జె.నారాయణపురం గ్రామాల సమీపంలో పడిన పిడుగుల ధాటికి పలు ఇళ్లల్లో విద్యుత్ ఉపకరణాలు పాడయ్యాయి. జె.నారాయణపురం గ్రామానికి చెందిన శ్రీ సిద్ధభైరవి కేబుల్ నెట్వర్క్ పరిధిలో ఆపరేటింగ్ సిస్టంలో ట్రాన్స్‌మీటర్, సెటాఫ్ బాక్సులు, ఎల్ఈటీ టీవీ తదితర పరికరాలు పాడయ్యాయని యజమాని రత్నాల డొంబురు తెలిపారు. గ్రామంలో రత్నాల గురునాథం, సీర దమయంతి, సీర పార్వతి, యారడి దీనబంధు, డి.హిమావతి తదితరుల ఇళ్లల్లో సెటాఫ్ బాక్సులతోపాటు విద్యుత్ ఉపకరణాలు పిడుగుపాటుకు కాలిపోయాయి. పిడుగు పాటుకు మూగజీవి మృత్యువాత వజ్రపుకొత్తూరు రూరల్: మండలం గరుడబద్ర పంచాయతీ పరిధిలోని గల మర్రిపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి ఆవు మృత్యువాత పడింది. -
● డ్రైనేజీలా.. డంపింగ్ యార్డులా?
పర్లాకిమిడి పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెత్తను సేకరించడానికి వాహనాలు ఉదయం పూట ప్రతి వార్డులో తిరుగుతుంటాయి. ప్రజలు నెలనెలా యూజర్ చార్జీలు చెల్లిస్తారు. అయితే కొందరు వాహనాల్లో చెత్త వేయకుండా డ్రైనేజీల్లో చెత్త, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పడవేయడంతో పురపాలక సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇటీవల వర్షం పడిన సమయంలో కాలువలు పూడికతో నిండటంతో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వచ్చింది. ఇప్పటికై నా పౌరులు బాధ్యతగా వ్యవహరిస్తూ చెత్తను కాలువల్లో పడేయకుండా సంబంధిత వాహనాలకు అందజేయాలని సిబ్బంది కోరుతున్నారు. – పర్లాకిమిడి -
గవర్నమెంట్ డీఏవీ కాలేజ్‌గా పేరు మార్పు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ కాలేజీని మరలా గవర్నమెంట్ డీఏవీ కాలేజీగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ట్రైబుల్ మ్యూజియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురాం మచ్చో మాట్లాడుతూ 1967లో దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) ద్వారా ఈ కళాశాల ఏర్పాటైందన్నారు. 13 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లి గవర్నమెంట్ కాలేజీగా మారిందని గుర్తు చేశారు. నాటి నుంచి పూర్వ విద్యార్థులు అనేక పోరాటాల ద్వారా పేరు మార్పు కోసం ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. ఉన్నత విద్యాశాఖమంత్రి సూరజ్ సూర్యవంశీకి వినతిపత్రాలు అందజేశారని గుర్తు చేశారు. తాను సైతం ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించడంతో ఎట్టకేలకు పాత పేరు వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏవీ పూర్వ విద్యార్థులు, కొరాపుట్ మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రాయగడ: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. జిల్లాలోని చంద్రపూర్ సమితి ఖెలొపొడియా వద్ద శుక్రవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చంద్రపూర్ ప్రాథమిక ఆరొగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కొసం వారిని బరంపురం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చంద్రపూర్ సమితి బిజాపూర్ పంచాయతీలొని ఖిలుండి గ్రామానికి చెందిన మిలిపావుగండ, శ్వేతొ పావుగండలు బైకుపై మునిగుడ వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో కుట్రాగుడ నుంచి చంద్రపూర్ వైపు బైకులో వెళ్తున్న కిరణ్ మలిబిసొయి, తిక్తొ బెహరాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
టిప్పర్ కింద నరకయాతన
కొరాపుట్: కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి–326 పై నంగర్పొఖాన్ గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ ట్రక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్ కింద డ్రైవర్ భువనేశ్వర్ కుమార్ చిక్కుకుపోయాడు. ఈ ట్రక్ లో భారీ ఇనుప స్క్రాప్ ఉండడంతో మరింత బరువుతో ట్రక్ కిందకు వంగిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న వారు బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందజేశారు. ఇదే సమయంలో ఆ పరిధిలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంప్‌కి సమాచారం రావడంతో జవానులు ట్రక్కు రక్షణగా నిలిచారు. బొయిపరిగుడ నుంచి ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకొని డ్రైవర్ని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే అతను బతికే ఉన్నట్లు తెలియడంతో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపూర్ అగ్ని మాపక కేంద్ర అధికారి సురేష్ బారిక్ తన సిబ్బంది అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో స్పందించే క్విక్ యాక్షన్ సభ్యులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్న్, హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా బాధితుడిని బయటకు తీసారు. ఐదు గంటలకుపైగా మృత్యువుతో పోరాడిన భువనేశ్వర్ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. బాధితుడు ట్రక్ నుంచి క్షేమంగా బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రాంతమంతా చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం క్షతగాత్రుడిని బొయిపరిగుడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫైర్ సిబ్బందికి ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. -
● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. మోహన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి సెయింట్ పీటర్స్ చర్చి వరకూ శిలువను పట్టుకుని క్రిస్టియన్లు శోభాయాత్ర జరిపారు. ఈ శోభాయాత్రలో ఫాదర్ ఇసాక్ నాయక్‌తో పాటు అనేక మంది పాల్గొన్నారు. జిల్లాలోని పిండికి, బోడోపద, గుమ్మా, పర్లాకిమిడిలో పురుషోత్తం బాప్టిస్టు చర్చి, రామన్ కాథలిక్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జయపురంలో.. జయపురం: జయపురంలో జేఈఎల్జీ చర్చ్‌లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు జరిగాయి. ఏసుక్రీస్తును శిలువ వేసిన దినంగా గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటామని ఫాదర్ తెలిపారు. -
పురాతన జైన విగ్రహం అదృశ్యం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కెచ్చల ప్రాంతంలో కొండ మీద ఉండే 7 పురాతన జైన విగ్రహాల్లో ఒకటి అదృశ్యమైంది. ఇది గమనించిన గిరిజనులు కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. 6 శతాబ్దంలో కొరాపుట్ జిల్లాలో నందపూర్ నుంచి బి.సింగ్‌పూర్ వరకు జైన సంస్కృతి కొనసాగిందని చరిత్ర చెబుతోంది. కెచ్చల ప్రాంతంలో విగ్రహాలు కొలాడ్ రిజర్వాయర్ ప్రారంభమైనప్పుడు నీటిలో మునిగిపోయాయి. అనంతరం గిరిజనులు వాటిని తీసుకువచ్చి పూజిస్తున్నారు. అందులో పెద్ద విగ్రహం ఇప్పుడు అదృశ్యమైంది. సమాధి పూడ్చివేత కొరాపుట్: మత వివాదంగా మారిన సమాధి సమస్య పరిష్కారమైంది. శుక్రవారం రెండు మతాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కుమిలి గ్రామ పంచాయతీ మాల్బెడ గ్రామంలో మతం మార్చుకున్నందుకు అంత్య క్రియల విషయంలో వివాదం రేగిన విషయం పాఠకులకు విధితమే. సొంత పొలంలో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసేందుకు కూడా ప్రయత్నించారు. తాజాగా ప్రస్తుత ఒప్పంద ప్రకారం తిరిగి హిందూ మతానికి రావడానికి బాధిత కుటుంబం అంగీకరించింది. దాంతో ఇరు వర్గాలు రాజీ పడ్డాయి. సగం మట్టి తీసిన సమాధిని తిరిగి మట్టి పోసి కప్పారు. -
అద్దె తగ్గింపునకు అంగీకారం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ స్టాల్స్ అద్దెలు తగ్గించడానికి కౌన్సిల్ అంగీకరించింది. శుక్రవారం చాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో వ్యాపారుల బృందం కౌన్సిల్‌కి తరలివెళ్లి విజ్ఞప్తులు చేయగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో స్టాల్‌కు రు.840 వరకు అద్దె ఉండేది. పొడవు, వెడల్పులకు సంబంధం లేకుండా ఈ అద్దె వసూలు చేసేవారు. ఇది అసమంజసంగా భావించి చదరపు అడుగుకు రూ.9 చొప్పున అద్దె వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయం చేసింది. దాంతో వ్యాపారులు ఈ అద్దె భారం అవుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ కునునాయక్తో చర్చలు జరపగా ఇకపై చదరపు అడుగుకు రు.7గా నిర్ణయించారు. సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు కనుదాస్, టి.ఎల్.మూర్తి, ఈఓ సమ్రేష్ మహంతి, కౌన్సిలర్ ఏ.సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
భువనేశ్వర్, కటక్పై కాల వైశాఖి ప్రభావం
కొరాపుట్: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌తో పాటు జంట పట్టణమైన కటక్పై కాల వైశాఖి విజృంభించింది. శుక్రవారం ఉదయం తీవ్రమైన ఉరుములు,మెరుపులతో గాలులు వీచి భారీ వర్షం పడింది. దాంతో కొద్ది గంటల పాటు జనజీవనం అల్లాడి పోయింది. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఉదయమే ఈ ప్రళయం చూసి ప్రజలు భయకంపితులయ్యారు.వెను వెంటనే ఒడ్రాఫ్,అగ్ని మాపక బృందాలు రంగంలోనికి దిగి చెట్లని తొలగించాయి. విద్యుత్ శాఖ సిబ్బంది వర్షంలోనే విద్యుత్ పునరుద్ధరించారు. బలంగీర్, డెంకనాల్, నబరంగ్‌పూర్ జిల్లాలలో కాల వైశాఖి ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. -
27న సిల్వర్ జూబ్లీ వేడుకలు
కొరాపుట్: ఈ నెల 27న జయపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని చాంబర్ అధ్యక్షుడు వి.ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం జయపూర్ పట్టణంలోని వేదిక ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంస్థ ఏర్పడి అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా పది మంది సీనియర్ సభ్యులను సన్మానం చేస్తామన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 900 మంది వ్యాపారవేత్తలు ఉన్నారని, వారంతా రెండో పూట వర్తక, వాణిజ్య సంస్థలు మూసి వేసి హాజరుకావాలని కోరారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి డి.మాధవ, సభ్యులు పాల్గొన్నారు.సాహితీ ఉత్సవాలకు ఆహ్వానం జయపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో మే 10,11వ తేదీల్లో శ్రీశ్రీ కళా వేదిక నేతృత్వంలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ ఉత్సవాలకు జయపురం కవి, పాత్రికేయులు సింహాద్రి శ్రీనివాసరావుకు ఆహ్వానం అందింది. ఉత్సవాలకు హాజరై తెలుగు భాషా పురష్కారాన్ని అందుకోవాల్సిందిగా శ్రీశ్రీ కళా వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ డాక్టర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథిలు ఆహ్వానం పంపించారని శ్రీనివాసరావు శుక్రవారం పేర్కొన్నారు. లయన్స్ క్లబ్లో రక్తదానం రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్లో ఒడిశా డిప్లొమా ఇంజినీర్స్ సంఘం, ఆమో ఒడిశా సంస్థలు సంయుక్తంగా శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్లొమా ఇంజనీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్లొమా ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.సోమేశ్వరరావు, ఆమో ఒడిశా ప్రతినిధి శివప్రసాద్ దొర, ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధి విభాగం ఇన్చార్జి డాక్టర్ గౌతం పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. భార్యను హతమార్చిన భర్తరాయగడ: భార్యను గొంతు నులిమి భర్త హత్య చేసిన ఉదంతం జిల్లాలొని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చందిలి గ్రామంలొ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందిలి గ్రామంలో నివసిస్తున్న లలిత సునా, దుర్యోధన్ సునాలు భార్యాభర్తలు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. బుధవారం నాడు ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతొ కోపోద్రిక్తుడైన దుర్యోధన తన భార్య లిలిత గొంతు నులిమి దాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను జేకేపూర్‌లో గల ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న లలిత కుటుంబ సభ్యులు చందిలి గ్రామానికి చేరుకున్నారు. తన చెల్లెలిని తన బావ హత్య చేశాడని చందిలి పోలీస్ స్టేషన్లో మృతురాలి అన్నయ్య సానిబ్ నాయక్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గురువారం దుర్యోధన సునాను అదుపులోకి తీసుకున్నారు. నదిలో పడి వృద్ధురాలి మృతి పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి బొమ్మిక గ్రామం వద్ద గల మహేంద్రతనయ నదికి గురువారం సాయంత్రం స్నానానికి వెళ్లిన వృద్ధురాలు మునిగి చనిపోయిన ఘటన జరిగింది. బృందా రౌళో (60)గా గ్రామస్తులు గుర్తించారు. మృతురాలి భర్త సహదేవ్ రౌళో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురండి పోలీసు అధికారి ఓంనారాయణ పాత్రో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. -
హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో తొలిసారిగా హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం జరగనుంది. శుక్రవారం జయపూర్ ముస్లిం అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాఫా బేగ్ ఈ వివరాలు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన జయపూర్ పట్టణం లోని సంధ్యా ఫంక్షన్ హాల్లో ఈ శిబిరం ప్రారంభిస్తామన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి మెత్తం 41 మంది ఈ ఏడాది హజ్ యాత్రకి వెళ్తున్నారని తెలిపారు. అందులో నబరంగ్‌పూర్ జిల్లా నుంచి 11 మంది, కొరాపుట్ జిల్లా నుంచి 21 మంది, రాయగడ జిల్లా నుంచి ఆరుగురు, మల్కన్ గిరి జిల్లా నుండి ముగ్గురు ఉన్నారని తెలిపారు. వీరు మే 13న హజ్ బయల్దేరి 42 రోజులు యాత్ర చేస్తారని తెలిపారు. ఒడిశా బోర్డు ఆఫ్ వక్ఫ్ కటక్ నుంచి నలుగురు నిపుణులు వచ్చి యాత్రికులకు శిక్షణ ఇస్తారన్నారు. యాత్రలో గుర్తింపు కార్డుల రక్షించుకోవడం, ప్రార్థన స్థలాలు కేటాయించిన భవనాల వద్దకు చేరుకోవడం, సౌదీలో నియమాలు గురించి యాత్రికులకు శిక్షణ ఇస్తారని ముస్తఫా పేర్కొన్నారు. -
7, 8 తేదీల్లో ఏఐవైఎఫ్ సభలు
జయపురం: మే 7, 8వ తేదీల్లో కొరాపుట్ టౌన్ హాలులో జరిగే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) మహాసభలు విజయవంతం చేయాలని రాష్ట్ర విభాగ అధ్యక్షుడు ప్రదీప్ శెట్టి, రాష్ట్ర సాధారణ కార్యదర్శి సత్య రంజన్ మహంతి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కార్మిక భవనంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి రోజు ర్యాలీ అనంతరం సభ ప్రారంభమవుతుందని, యూత్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఆర్.అరుణ మల్లయ రామన్న (తమిళనాడు), కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పండా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి ఆశిశ్ కనుంగో, బీహార్ రాష్ట్ర యువనేత విశ్వజిత్ కుమార్ తదితరులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర పరిషత్ సభ్యులు వికాశ ముదులి, జిల్లా నేతలు కుమార జాని, పవన్ మహురియ, అజిత్ పట్నాయక్, బుద్ర బొడొనాయిక్, ప్రమోద్ కుమార్ మహంతి, జుధిష్టర్ రౌళొ, రామకృష్ణదాస్, కామదేవ్ నాహక్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
రాయగడ: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా శ్రమదానంతో రహదారిని నిర్మించుకున్నారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై తమ గ్రామానికి రోడ్డు వేసుకున్నారు. జిల్లాలోని బిసంకటక్ సమితి కంకుబడి పంచాయతీలోని జంబుగుడలో ఈ ఘటన జరిగింది. జంబుగుడ గ్రామానికి చెందిన ధీరేన్ కడ్రక అనే యువకుడికి పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలో పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతొ తన పెళ్లికి రాబోయే బంధువులు, ఆత్మీయులు ఇబ్బందులు పడతారని భావించి పెళ్లికి ముందే గ్రామస్తులతో కలసి మూడు కిలోమీటర్ల రహదారికి అవసరమయ్యే ఖర్చును భరించి స్వయంగా గ్రామస్తులతో కలిసి రహదారిని నిర్మించేందుకు సన్నద్ధమయ్యాడు. అందుకు గ్రామస్తుల అనుమతి కూడా తీసుకున్నాడు. దీంతో అందరూ కలిసి వారం రోజుల పాటు శ్రమించి రోడ్డు వేసుకున్నారు. -
బిజూ విగ్రహ ప్రతిష్టపై తొలగిన వివాదం
కొరాపుట్: బిజూ పట్నాయక్ విగ్రహ ప్రతిష్టపై ఎట్టకేలకు జయపూర్‌లో వివాదం తొలగిపొయింది. ఈ విగ్రహం ప్రతిష్ట పై ఈ నెల 17వ తేదీ లోపు చర్యలు ప్రారంభించకపోతే ఆందోళనకి దిగుతామని బీజేడీ పార్టీకి చెందిన మాజీ మంత్రి రబి నారాయణ నందో హెచ్చరించిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత తాము సూచించిన స్థల ప్రతిపాదనలపై మున్సిపల్ ఈఓ చార్జిలో ఉన్న సబ్ కలెక్టర్ ఆకవరం శశ్యా రెడ్డికి లేఖ రాశారు. దీనికి సబ్ కలెక్టర్ అంగీకరిస్తున్నట్లు బదులిచ్చారు. 15 నుంచి 20 రోజుల్లోపు విగ్రహ ప్రతిష్ట పూర్తి చేస్తామన్నారు. గురువారం జయపూర్ విక్రం నగర్ లో బీజేడి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రబీ నందో, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ బాలారాయ్ లు మాట్లాడారు. ఈ స్థల సేకరణతో పాటు ప్రతిష్ట పనులు ప్రారంభించినందుకు వైస్ చైర్మన్ బి.సునీతతో పాటు బీజేడి కౌన్సిలర్లను అభినందించారు. దీంతో వివాదానికి తెర పడింది. మరో వైపు గురువారం ఉదయం బీ.సునీత నేతృత్వంలో కౌన్సిలర్ల బృందం పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో విగ్రహ ప్రతిష్ట చేయాల్సిన ప్రదేశంలో జరిగిన పనులు పర్యవేక్షించారు. ఈ బృందంలో కౌన్సిలర్లు పద్మా రెడ్డి, లక్ష్మీ నారాయణ చౌదరి, దేవో చౌదరి, సుశ్మా మహాపాత్రో, అజిత్ బెహరా ఉన్నారు. -
రెంగాలో బీజేపీ నాయకుల పర్యటన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి రెంగా గ్రామంలో బీజేపీ నాయకులు గురువారం పర్యటించారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విభాగం ఉపాధ్యక్షులు కాళీరాం మాఝి, జిల్లా కన్వీనర్ దుష్మంత్ కుమార్ సింగ్ దేవ్, నీలాద్రీబిహారి పాత్రో, తదితరులు పర్యటించి అక్కడి వారితో మాట్లాడారు. గ్రామానికి కనీసం సరైన రహదారి కూడా లేదని నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. వంద కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో ఆవాస్ గృహాలు ఇంతవరకు ఎవ్వరికీ మంజూరు చేయలేదన్నారు. తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతీ గ్రామంలో పర్యటించి మౌలిక సౌకర్యాలు, సమస్యలను తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని మాఝి తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సోంపేట: మండలంలోని బేసి రామచంద్రాపురం జాతీయ రహదారి వద్ద గురువారం ఉదయం జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు రుద్రశెట్టి (23) మృతి చెందాడు. బారువ పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సోదరులు రుద్రశెట్టి, బబ్లూ శెట్టి గుంటూరులో క్వారీ పని చేస్తున్నారు. స్వగ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. బేసిరామచంద్రాపురం వద్దకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన డంతో రుద్రశెట్టి ఘటనా స్థలంలోనే మృతి చెందా డు. బబ్లూశెట్టికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి కి తరలించారు. బారువ ఎస్.ఐ హరిబాబునాయు డు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
కొరాపుట్: ప్రతి ఒక్కరికీ అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరమని అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బారిక్ అన్నారు. జయపూర్ మెయిన్ రోడ్డులోని కలకత్తా బజార్ వద్ద రోడ్డుపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద భవనాల్లో అగ్ని ప్రమాదాల నుంచి రక్షించుకోవడం కోసం అనేక భద్రతా ఏర్పాట్ల ఉంటాయన్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ప్రాణ భయంతో వాటిని మర్చిపోతారని పేర్కొన్నారు. అందువలన ఆందోళన చెందకుండా భద్రతా ఏర్పాట్లను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం తన సిబ్బందితో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. తాగునీటికి కటకట పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ ఎస్.కోరడాసింగి గ్రామ పంచాయతీలో బోండా, భుయ్యా సాహి, సన్నో లోబ తదితర గ్రామాల్లో సాగునీరు, తాగునీటి వనరులు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. ఇటీవల అధిక ఎండలు కారణంగా తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కలెక్టర్ బిజయకుమార్ దాస్‌కు ఆయా గ్రామ ప్రజలు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. రాయఘడ బ్లాక్ డంబాపూర్ వద్ద మహేంద్రతనయ నదిపై ఆనకట్ట పూర్తిచేయాలని ఆయా గ్రామప్రజలు, న్వాయవది ప్రశాంత్ కుమార్ ప్రధాన్ కలెక్టర్‌ను కోరారు. పది దుకాణాలకు నోటీసులు జయపురం: ఉత్కళ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 14వ తేదీలోగా అన్ని ప్రైవేట్ వ్యాపార వాణిజ్య సంస్థలకు నేమ్ బోర్డులు ఒడియాలో రాయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒడియా భాషలో నేమ్ బోర్డులు రాయాలని విస్తృత ప్రచారం చేశారు. చట్టాన్ని, ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణపై జయపురం లేబర్ విభాగ అధికారి సబిత కుమారి నాయక్ పట్టణంలోని 10 దుకాణాలకు గురువారం నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయక పోతే ఆయా దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసి, కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒడియాలో బోర్డులు రాయని వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రభుత్వ విభాగాలలో ఎక్కువ మంది ఒడియా భాషేతరులు ఉండటం వలన ఒడియా బోర్డులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎం.వి 17 గ్రామం వద్ద గురువారం వ్యాన్‌లో ఆంధ్రాకు ఆవులను అక్రమంగా తరలించడాన్ని చూసి యువకులు వాహనాన్ని ఆపారు. మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఐఐసీ రీగాన్ కీండో తన సిబ్బందితో వచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బిత్తరబందలో దొంగల హల్చల్ మందస: మండలంలోని సాబకోట గిరిజన పంచాయతీ బిత్తరబందలో దొంగలు హల్చల్ సృష్టించారు. బుధవారం రాత్రి కారు, రెండు ద్విచక్ర వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సవర మల్లిక అనేక మహిళపై దాడి చేసి చెవికి ఉన్న బంగారపు రింగులను పట్టుకుపోయారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించగా కత్తితో దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు అవకాశం శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్‌ను గానీ, రాగోలు జెమ్స్ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్‌ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
భారీగా బెల్లం ఊట ధ్వంసం
మెళియాపుట్టి/పాతపట్నం: గిరిజన గ్రా మాల్లో నాటు సారా స్థావరాలపై దాడులు ముమ్మరం చేస్తున్నట్లు టెక్కలి ఎకై ్స జ్ సీఐ షేక్ మీరా సాహెబ్ అన్నారు. గురువారం మెళియాపుట్టి మండలం ఎగువబగడ గ్రామంలో ఎకై ్సజ్ సిబ్బంది సారా తయారీ స్థావరాలపై గురువారం దాడులు నిర్వహించారు. 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 60 లీటర్ల సారా, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పలువురు సిబ్బంది ఉన్నారు. అదే విధంగా పాతపట్నం మండలం చాపరాయిగూడ పరిధిలో సారా బట్టీలపై దాడులు జరిపారు. 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది సోమనాథం, వాసుదేవరావు, శివ పాల్గొన్నారు. -
జడలు విప్పిన మూఢ విశ్వాసం
కొరాపుట్: మత మూఢ విశ్వాసం జడలు విప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కుమిలి గ్రామ పంచాయతీ మాల్బెడ గ్రామానికి చెందిన శ్రావణ్ గొండో (30) మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. అయితే ఇటీవల శ్రావణ్ మతం మార్చుకున్నాడు. అంత్యక్రియలు కోసం గ్రామ శ్మశానికి తీసుకెళ్లగా గిరిజనులు అడ్డుకున్నారు. తమ మతం కాని వ్యక్తిని ఇక్కడ సమాధి చేయడానికి వీల్లేదని, అతని మతానికి చెందిన శ్మశానం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలని సూచించారు. దీంతో మృతుని కుటుంబీకులు శవాన్ని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చారు. అప్పటికే గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది తెలిసి రాయగర్ నుంచి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. అర్ధరాత్రి వరకు సమస్య కొలిక్కి రాకపోవడంతో మృతుని బంధువులు తమ సొంత భూమిలోనే సమాధి చేశారు. ఇది తెలిసి గ్రామస్తులు మృతుని ఇంటిపై దాడి చేశారు. తిరిగి ఆ మృతదేహాన్ని బయటకు తీసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆఖరకు మృతదేహాన్ని బయటకు తీయడం కూడా ప్రారంభించారు. ఇది తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతునికి కుటుంబానికి అండగా నిలిచారు. గురువారం రోజంతా గ్రామస్తులతో అధికారులు చర్చలు జరిపారు. సగం తవ్విన సమాధి వద్ద మృతుని కుటుంబీకులు, పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్లటూన్ పోలీసులను అదనంగా గ్రామంలో మోహరించారు. -
6 అంబులెన్స్‌ల వితరణ
కొరాపుట్: జిల్లా ప్రజలకు సేవలు అందించడానికి నాల్కో 6 అంబులెన్స్‌లు వితరణగా అందజేసింది. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వి.కీర్తివాసన్ జెండా ఊపి ఈ అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొరాపుట్ జిల్లాలోని దమంజోడిలో భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) పరిశ్రమ బాకై ్సట్ పరిశ్రమ ఉంది. నాల్కో ఫెరిఫెరి డవలప్మెంట్ నిధులను కేటాయించడంతో అంబులెన్స్ వాహనాలు జిల్లా అధికార యంత్రాంగ్రానికి అందాయి. కార్యక్రమంలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక, ఎమ్మెల్యేలు తారాప్రసాద్ బాహిణీపతి, పవిత్ర శాంత, రఘురాం మచ్చో, రుఫుదర్ బొత్రాలు పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి నవీన్ నామినేషన్కొరాపుట్: బిజూ జనతా దళ్ అధ్యక్ష పదవికి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎన్నికల రాష్ట్ర రిటర్నింగ్ అధికారి ప్రతాప్ కేసరి దేవ్‌కి నామినేషన్ పత్రాలు అందజేశారు. నవీన్ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 1997లో దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మృతి చెందారు. అనంతరం నవీన్ పట్నాయక్ జనతా దళ్ పార్టీ నుంచి బయటకు వచ్చి 1998లో బీజేడీని స్థాపించారు. అప్పటినుంచి ఆయనే అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. తమ అధినేత నవీన్ ఇది వరుసగా 9వసారి నామినేషన్ దాఖలు చేయడమని సీనియర్ నాయకుడు బృగు భక్షిపాత్రో పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బబి దాస్, దేవి మిశ్ర, సంజయ్ దాస్ వర్మ, చంద్రశేఖర్ సాహు, ప్రమిలా మాలిక్, విక్రమ అరుఖ్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో వలస కార్మికుడు మృతి పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ హరిజన వీధికి చెందిన ఉశాంత్ కుమార్ మల్లి (38) అనే వలస కార్మికుడు కేరళలో కోచి జిల్లా అటోని వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పేద కుటుంబానికి చెందిన ఉశాంత్ కుమార్ మల్లి కొన్ని నెలలుగా కేరళ రాష్ట్రం కోచిలోని ఒక ప్రైవేటు హోటల్లో పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని జిల్లా శ్రామిక అధికారి, మోహానా అధికారుల ఆర్థిక సాయంతో గురువారం హరిజన వీధికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. పేద కుటుంబానికి చెందిన ఉశాంత్ కుమార్ మల్లి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్‌ను మృతుని కుటుంబీకులు కోరుతున్నారు. కింగ్‌కోబ్రా కలకలం రాయగడ: జిల్లాలోని కొలనారలోని ఓ స్టోన్‌క్రషర్ పవర్ జనరేటర్ గదిలో కింగ్‌కోబ్రా కలకలం సృష్టించింది. గురువారం ఉదయం ఎప్పటిలాగే క్రషర్ మెషీన్‌ను ఆపరేట్ చేసేందుకు జనరేటర్ గదిలోకి వెళ్లిన సిబ్బందికి గదిలో ఓ మూల పాము బుసలు కొడుతూ కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పామును చూసి బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానిక స్నేక్ స్నేచర్ ప్రదీప్ సేనాపతి సంఘటన స్థలానికి చేరుకుని సుమారు గంటపాటుగా శ్రమించి పాముని పట్టుకున్నాడు. సమారు 13 అడుగుల కింగ్ కోబ్రా పాముగా గుర్తించారు. పట్టుకున్న అనంతరం సమీపంలొ గల అడవుల్లో విడిచిపెట్టినట్లు సేనాపతి తెలియజేశారు. -
‘ఆ పవర్ ప్లాంట్ కొరాపుట్‌లో లేదు’
కొరాపుట్: ప్రైవేట్ పవర్ ప్లాంట్ కొరాపుట్ జిల్లాలో లేదని గిరిజనులకు జిల్లా అధికారులు వివరించారు. గురువారం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి దండాబడి గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం దండాబడి గ్రామస్తులు జిల్లా అధికారులకు ప్రైవేటు పవర్ ప్లాంట్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తులో ఆ రెండో ప్లాంట్ కొరాపుట్ జిల్లా పరిధిలో రావడం లేదని స్పష్టం చేశారు. మల్కన్‌గిరి జిల్లాకి చెందుతుందని ప్రకటించారు. ఇది తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. అందువల్ల ప్లాంట్ యాజమాన్యంపై తమకు అధికారాలు లేవని పేర్కొన్నారు. ఇదే సభలో పాల్గొన్న ప్లాంట్ ప్రతినిధులు ఈ సమస్య యజమాన్యం దృష్టికి తెచ్చి అందులో దండాబడి గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో బొయిపరిగుడ అభిమన్యు కబి సత్పతి,జయపూర్ పారెస్ట్ రిజర్వ్ అఽధికారి ప్రతాప్ కుమార్ బెహరా పాల్గొన్నారు. -
ఆత్మీయ నివాళి
శ్రమదానంతో రోడ్డు.. జంబుగుడలో స్థానికులే రోడ్డు వేసుకున్నారు. ఓ యువకుడు నాయకత్వం వహించాడు. తొలగిన వివాదం బిజూ విగ్రహ ప్రతిష్టపై వివాదం తొలగింది. విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. –10లోuబిజూ పట్నాయక్‌కు.. అమ్మవారి పండుగలు పర్లామిడిలోని పలు ప్రాంతాల్లో అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కొరాపుట్: ఉత్కళ వర పుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నయక్ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా బిజూను అంతా స్మరించుకున్నారు. రాజధాని భువనేశ్వర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి, ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్ దేవ్, ప్రబాతి పరిడా లో బిజూ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీ శ్రేణులతో కలసి వెళ్లి నివాళులర్పించారు. కొరాపుట్,నబరంగ్‌పూర్ జిల్లాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. రాయగడలో.. రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిశా వరపుత్రుడు బిజు పట్నాయక్ 28 వ వర్ధంతిని ఆ పార్టీ శ్రేణులు గురువారం జరుపుకున్నారు. స్థానిక కొత్తీ బస్టాండు వద్ద గల బిజు విగ్రహానికి రాజ్యసభ మాజీ ఎంపి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలొ పాల్గొని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను నెక్కంటి ఈ సందర్భంగా కొనియాడారు. జయపురంలో.. జయపురం: ఉత్కళ వరపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిజూ పట్నాయిక్ వర్ధంతి గురువారం జయపురం బీజేడీ శ్రేణులు జరుపుకున్నాయి. స్థానిక బిజూ భవనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి రబినారాయణ నందో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయిక్ 28వ వర్ధంతి సభను బీజేడీ పార్టీ శ్రేణులు పర్లాకిమిడిలో జరుపుకున్నారు. తొలుత మహేంద్రతనయ నది వద్ద బిజూ పట్నాయిక్ ఆత్మకు శాంతిచేకూరాలని తర్పణాలు విడిచారు. అనంతరం హైస్కూల్ జంక్షన్ వద్ద బిజూ పట్నాయక్ విగ్రహానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నీలమ్మ గుడి వెనుక ఉన్న బీజేడీ పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి సభలో పాల్గొన్నారు. బిజూ పట్నాయిక్ ఒడిశా వరపుత్రుడని రాష్ట్రంలో ప్రగతి ప్రధాన నడిపించిన మహా నేతని సీనియర్ బీజేడీ నాయకులు ఎస్.గజపతి రావు అన్నారు. న్యూస్‌రీల్ -
ప్రజా సమస్యల కోసం పోరాడాలి
రాయగడ: ప్రజా సమస్యపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు పిలుపునిచ్చారు. స్థానిక తేజస్వీ మైదానం వద్దనున్న బీజేడీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు దశాబ్ధాలుగా ప్రజల ఆదరణతో పాలించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. అయితే అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పథకాలు పేర్లు మాత్రమే మార్పులు చేస్తోందన్నారు. సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. అన్యాయం జరిగిన చోట తాము ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర ప్రజల వరపుత్రుడిగా పిలువబడే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత బిజూ పట్నాయక్ విగ్రహాన్ని తగలబెట్టడం, మొండెం వేరు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడినవారిపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, దీనికి తగిన సమాధానం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ప్రణాళికతో ముందుకెళ్లాలి రాష్ట్రంలో బీజేడీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతోందని నెక్కంటి అన్నారు. కార్యకర్తలు ఏమాత్రం అసహనానికి గురవ్వకుండా ప్రణాళికతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, బి.తిరుపతి, సుజాత పాలో, కాసీపూర్ సమితి అధ్యక్షుడు కంఠొ మాఝి, రాయగడ సమితి ఉపాధ్యక్షుడు హర ప్రసాద్ హెప్రుక తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి -
ఆర్థిక నేరాలకు ఈడీ విచారణ అవసరం లేదు
భువనేశ్వర్: ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అవసరం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెప్పారు. విచారణ కోసం ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఈడీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈడీ ఇప్పుడు ఎన్నో రకాలుగా వివాదాల్లో చిక్కుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను పక్కనపెట్టడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరాలపై విచారణకు ఆదాయపు పన్ను శాఖ వంటి విభాగాలు ఉండగా ఈడీ ఎందుకని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ బుధవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈడీ అవసరం ఇప్పుడు లేదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భుశనేశ్వర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ జెనా నివాసానికి అఖిలేష్ వెళ్లారు. దీంతో శ్రీకాంత్ జెనా సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అందులో వాస్తవం లేదని వారిద్దరూ స్పష్టతనిచ్చారు. -
మహిళలపై దాడులు అరికట్టాలి
జయపురం: రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళ వారం రాత్రి మశాల(దివిటీ) జాతర నిర్వహించారు. కొరాపుట్ మహిళా కాంగ్రెస్ అద్యక్షురా లు నళినీ రథ్ నేృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శశిభూషణ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. మవులి మా జాతర ప్రారంభం జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ శాశనసభ నియోజకవర్గ పరిధి ఛతర్ల గ్రామ పంచాయతీ పటకికుంబ గ్రామం ప్రాంతంలో గల మవులి కోట మందిరంలో మవులి మా జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ జాతరలో కొట్‌పాడ్, కుంఽద్ర సమితుల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ జాతరలో ప్రముఖ కాంగ్రెస్ నేత, కొట్‌పాడ్ సమితి మాజీ అధ్యక్షుడు నీలకంఠ పూజారి, మాజీ కౌన్సిలర్లు దేవీప్రసాద్ నాయక్, నరేంద్ర మఝి, యువజన కాంగ్రెస్ నాయకుడు కాళీ కృష్ణ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. కమసాయి బిశాయి, బుద్ర సిరా, జగన్నాథ్ గౌడ, రామచంద్ర దురువ, వార్డు మెంబర్ రామ భూమియ తదితరులు మవులి మా జాతరను నిర్వహించారు. ఈ జాతరలో పలు ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు పాల్గొని మవులి మాకు పూజలు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం జయపురం: పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశా ల జయపురంలో బుధవారం ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించారు. హెచ్ఎం ప్రకాశ చంద్ర పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయపురం బ్లాక్ ఎడ్యుకేష న్ ఆఫీసర్ (బీఈఓ)చందన కుమార్ నాయక్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా డాక్టర్ మ నోజ్ బిశ్వాల్, డాక్టర్ సునీత సాహు పాల్గొన్నా రు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎటువంటి శ్రద్ధ తీసుకోవా లో, వ్యాధుల నుంచి ఎలా రక్షించుకోవాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు వివరించారు. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నారు. విద్యార్థులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హైవేపై అక్రమ వసూళ్లు! ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని బెల్లుపడ సమీపంలో పాత టోల్‌గేటు వద్ద అనధికార వ్యక్తులు వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుతో అక్రమ వసూళ్ల దందా సాగిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరిట రసీదు బుక్ చూపించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఇంటిగ్రేడ్ చెక్‌పోస్టు ఉన్నప్పుడు అక్రమంగా వస్తువులు రవాణా చేస్తే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసేవారు. ఇంటిగ్రేడ్ చెక్‌పోస్టు తొలగించాక అపరాధ రుసుం వసూలు చేయడం ఆగిపోయింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలో కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, తోటపని చేసే వారు హైవేపై వ్యవసాయ ఉత్పత్తుల లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికులు, అధికారులు వచ్చే సమయంలో ఏమీ తెలియనట్లు పక్కకు జారుకుంటున్నారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆంద్రయ్య వద్ద ప్రస్తావించగా గతంలో కవిటి మండలం కరాపాడు టోల్‌గేటు వద్ద లారీలు ఆపి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే లారీల నుంచి పన్ను వసూలు జరిగేదని, టోల్ గేట్ వారు అభ్యంతరం చెప్పడంతో పాత టోల్‌గేటు వద్దకు మార్చామని చెప్పారు.సూపర్వైజర్లు, ఇతర అధికారులే పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పెన్షనర్ల సమస్యలపై వినతి శ్రీకాకుళం అర్బన్: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షు డు సుబ్బరాయన్ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు, జనరల్ సెక్రటరీ సతీష్‌కుమా ర్ కోరారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాష్ట్ర సెక్రటేరియేట్‌లో కలిసి వినతిపత్రం అందించారు. పశువుల పట్టివేత టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నారాయణవలస సమీపంలో వ్యాన్‌లో 13 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేర కు కోట బొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను ఆపగా 12 మగదూడలు, ఒక ఆవు ఉన్నట్లు గుర్తించి వాటిని విజయనగరం జిల్లా కొత్తవలస గోశాల కు తరలించారు. అనంతరం ఆవులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
● కె.కుపాసుకుద్ది గ్రామ యువకుడు దుర్మరణం ఇచ్ఛాపురం : ఈదుపురం రోడ్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిటి మండలం కె.కపాసుకుద్ది గ్రామానికి చెందిన గోకిడి రవి(25) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కె.కుపాసుకుద్ది గ్రామానికి చెందిన గోకిడి మాధవరావు, వేణు దంపతుల కుమారుడు రవి విదేశాల్లో వెల్డింగ్ పనుల చేసుకొంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇరాక్ నుంచి నెల రోజుల కిందట ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి ఇచ్ఛాపురంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈదుపురం రోడ్డులోని ఇటుకల బట్టీ సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి గుంతలో పడిపోయాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. దీంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఉదయం అటువైపుగా వెళ్తున్న వారు మృతదేహాన్ని గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తండ్రి మాధవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికందిన కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కొరాపుట్ : జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై జిల్లా పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవా రం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సమావేశ మందిరంలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహీణిపతి మాట్లాడుతూ స్మార్ట్‌మీటర్లు పెట్టి ప్రజలను దోచుకుంటున్నారని, విద్యుత్ సమస్యలపై ప్రజల ఫిర్యాదులు పట్టించుకోవడం లేదన్నారు. వేసవిలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాగునీటి సమస్యపై గ్రామాల్లో ప్రజలు తమను నిలదీస్తున్నారని వాపోయారు. సమావేశంలో కలెక్టర్ వీ.కీర్తివాసన్, ఎమ్మెల్యేలు పవిత్ర శాంత (లక్ష్మీపూర్), రఘురాం మచ్చో (కొరాపుట్), రుపుధర్ బోత్ర(కొట్‌పాడ్), జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
వైద్యసౌకర్యాలు మెరుగుపర్చాలి
● జెడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు రాయగడ: ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం వైద్యసేవలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, బిసంకటక్ ఎమ్మెల్యే నీల మాధవ హికక, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరస్వతీ మాఝిలు ఈ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కాసీపూర్‌లోని గోర ఖ్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొర త వేధిస్తోందన్నారు. దీనిపై జిల్లా ముఖ్య వైద్యాధి కారి డాక్టర్ లాల్మోహన్ రౌత్రాయ్ మాట్లాడుతూ మునిగుడ సమితి రఘుబారి గ్రామానికి సరైన రహ దారి లేకపొవడంతో అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు పొందలేకపోతున్నారని చెప్పారు. 312 వైద్యుల పోస్టులు ఖాళీ.. జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని వైద్య కేంద్రాల్లో డాక్టర్ల కొరత ఉన్నట్లు జిల్లా ముఖ్యవైద్యాధికారి రౌత్రాయ్ వివరించారు. 461మంది వైద్యులు అవసరం కాగా, ప్రస్తుతం 149 మంది వైద్యులు మాత్రమే ఉన్నారని చెప్పారు. దీంతో సకాలంలో వైద్య సౌకర్యాలను ప్రజలు పొందలేకపొతున్నారని వివరించారు. జిల్లాలో 14 వంతెనల నిర్మాణం.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలను సుగ మం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రాయగడ, గుణుపూర్ సబ్ డివిజన్లలో బిజు సేతు పథకంలో భాగంగా 3579 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వంతెనల నిర్మాణ పనులు పూర్తయ్యాయ ని చెప్పారు. మరో 14 చోట్ల వంతెన పనులు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి సడక్ యోజనలో భాగంగా 18 రహదారుల పనులకు శ్రీకారం చుట్టగా ఇందు లొ 10 పూర్తయ్యాయని, మిగతా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పెండింగ్ పనులు వేగవంతం.. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వా రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల కు రహదారి, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు అందించే విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. -
బీచ్ ఫెస్టివల్‌కు సన్నద్ధం
సోంపేట: బారువలో ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బారువ బీచ్‌ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్‌కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు హాజరవుతారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెడతామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా బీచ్ క్లీనింగ్ జరుగుతుందన్నారు. క్రీడాపోటీలు, వీలైతే బోటింగ్ పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ, పర్యాటక, అగ్నిమాపక, రహదారులు భవనాలు, అటవీశాఖ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
ట్రక్ యజమానుల ఆందోళన
కొరాపుట్: ట్రక్ యజమానుల ఆందోళనతో పేదల కు పంచాల్సిన పీడీఎస్ బియ్యం రవాణా నిలిచి పో యింది. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్కో ట్ పట్టణంలోని పీడీఎస్ గొడౌన్ ముందు ఉమ్మర్‌కోట్ ట్రక్ యజమానుల సంఘం ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. బియ్యం రవాణాను కాంట్రాక్టర్లు చేస్తున్నారన్నారు. తాము రవాణా చేయాల్సిన బియ్యాన్ని పీడీఎస్ కాంట్రాక్టర్లు చేయడం తగదన్నా రు. తమ ట్రక్లు అనుమతించే వరకు గేట్లు తెరవనివ్వమన్నారు. దీంతో లోపల ఉన్న కాంట్రక్టర్ల ట్రక్ లు నిలిచిపోవడంతో బియ్యం రవాణా ఆగిపోయింది. ఈ నెలాఖరు నాటికి 40 వేల క్వింటాళ్ల బియ్యం పంచాయతీ కేంద్రాలకు చేరాల్సి ఉండగా.. ఇప్పటి కి కేవలం వెయ్యి క్వింటాళ్ల బియ్యం మాత్రమే రవాణా జరిగింది. -
జనావాసాల్లోకి హైనా
కొరాపుట్: జననావాసాల్లోకి హైనా ప్రవేశించి దూడపై దాడికి పాల్పడింది. బుధవారం వేకువజామున కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి బీజాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన గోశాలలో ఆవుదూడపై దాడి జరగడంతో అరుపులకు గ్రామస్తులు మేల్కొన్నారు. దీంతో హైనా అటవీ ప్రాంతంలోనికి పారిపోయింది. ఇదే నెలలో మూడు మేక పిల్లలను హైనా ఎత్తుకుపోయిందని గ్రామస్తులు వాపోయారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని పశు వైద్య సిబ్బంది ద్వారా దూడకు చికిత్స అందించారు. -
వసతి గృహంలో చోరీయత్నం
రాయగడ: జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో ఉంటున్న ప్రభుత్వ వసతి గృహంలో చోరీయత్నం జరిగింది. దుండగులు ఇంటి ప్రవేశ ద్వారానికి ఉన్నటువంటి తాళాలను విరగ్గొట్టి లోపలకి ప్రవేశించారు. అక్కడ మరో తలుపును కూడా పగలుగొట్టారు. మంగళవారం విధులపై బయటకు వెళ్లిన ఆయన ఇంటి తలుపులను వేశారు. అయితే ఇంటి ముందు ఏదో అలికిడి వినిపించడంతో అక్కడ నుంచి దుండగులు పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న కుహరో తన ఇంట్లో చోరీకి యత్నం జరిగిందని సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
ఆక్రమణలు తొలగింపు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కోట్పాడ్ పట్టణంలో భారీగా ఆక్రమణలు తొలగించారు. బుధవారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి కుసిమి రోడ్దులో ఉన్న అనేక నిర్మాణాలు కూల్చివేశారు. చాలాకాలంగా ఈ రోడ్డులో భారీగా ఆక్రమణలు జరిగాయి. దీంతో వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు పెరిగాయి. అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. పురపాలక శాఖ సిబ్బంది పెద్దఎత్తున పోలీసు బలగాలను ఉదయం మెహరించారు. కూల్చివేతలు గుర్తించిన నిర్మాణాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు దూకుడుగా వ్యవహరించి కూల్చివేతలు కొనసాగించారు. దీంతో భయపడిన ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను తరలించడం ప్రారంభించారు. పలు హోర్డింగ్‌లు, సిమ్మెంట్ నిర్మాణాలు జేసీబీలతో కూల్చివేశారు. -
554 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఒసారిగుడి అడవుల్లో పోలీసులు 554 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు ఒసారిగుడ అడవుల్లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా రవాణాకు సిద్ధంగా ఉండే గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అందిన సమాచారం మేరకు, పద్మపూర్ ఐఐసీ ధరణీధర్ ప్రధాన్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులను నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి రవాణాదారులు బస్తాలను వదిలి పరారయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూరీకి ఓఎస్ఆర్టీసీ ప్రారంభం కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కేంద్రం నుంచి పూరీ దివ్యక్షేత్రానికి ఓఎస్ఆర్టీసీ జగన్నాథ ఓల్వో బస్సును బుధవారం ప్రారంభించారు. ఈ బస్సు సాయంత్రం 5 గంటలకు రాయిఘర్ నుంచి ప్రారంభమై పపడాహండి, భవానీపట్న, జునాఘడ్, బలిగుడ, భువనేశ్వర్ మీదుగా పూరి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం పూరీలో 5 గంటలకు బయల్దేదేరి ఉదయం 7 గంటలకు రాయిఘర్ చేరుతుంది. ఈ బస్సులో మహిళలకు 50 శాతం రాయితీ కల్పించనున్నారు. గజపతి బీజేడీ అధ్యక్షుడిగా ప్రదీప్ నాయక్ పర్లాకిమిడి: విపక్ష బీజేడీ పార్టీ రాష్ట్రంలోని 19 జిల్లాలకు నూతన అధ్యక్షుల జాబితాను మంగళవారం రాత్రి ప్రకటించింది. వారిలో గజపతి జిల్లా బీజేడీ అధ్యక్షుడిగా ప్రదీప్ నాయక్ నియామకమయ్యారు. ప్రదీప్ నాయక్ అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇది మూడోసారి. ఆయన నియామకంపై పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు, తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, బీజేడీ యువజన అధ్యక్షుడు శాసనం లింగరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంత పోరిచ్చా, పురపాలక సంఘ అధ్యక్షురాలు నిర్మలా శెఠి, గుసాని సమితి అధ్యక్షుడు ఎన్.వీర్రాజు, కాశీనగర్ ఎన్ఏసీ అధ్యక్షురాలు మేడిబోయిన సుధారాణి, కాశీనగర్ బీజేడీ నాయకుడు మధు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలి పర్లాకిమిడి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి దండపాణి రైయితో స్థానిక మహారాజా బాలుర హైస్కూల్ కూడలి వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువులపై భారం పడుతోందని, కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారుకు ఓటువేస్తే అనేక పన్నులు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన రూ.50 ఉపసంహరించుకోకుంటే ఆందోళన తప్పదని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం లిబరేషన్ నాయకులు శ్రీనివాస బెహరా, మోహిత్ మిశాల్, అల్యాన భాస్కరరావు, ఎ.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం కేంద్రంపై దాడులు
కొరాపుట్: నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎకై ్సజ్ పోలీసు అధికారులు దాడి చేశారు. పట్టణంలోని బెడావీధిలో విదేశీ మద్యం తయారవుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. అనుమానిత ఇంటి నుంచి ఇప్పిలి సంతోష్ అనే వ్యక్తి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా భారీ రాకెట్ బయటపడింది. నిందితుడు నకిలీ మద్యం తయారీ విధానం చూసి ఎకై ్సజ్ పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని వద్ద నుంచి ప్రముఖ బ్రాండ్స్ స్టిక్కర్లు, బాటిల్స్ మూతలు, స్పిరిట్, వివిధ రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎకై ్సజ్ కార్యాలయంలో మీడియా నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఖరీదైన బ్రాండ్ల మద్యాన్ని మీడియా ముందు తయారు చేసి నిందితుడు చూపించాడు. ఇన్స్పెక్టర్ శశికాంత్ దత్త మాట్లాడుతూ నిందితుడు చాలాకాలంగా ఇలా మద్యం తయారు చేసి, అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడన్నారు. ఈ కేసులో మరికొందరు హస్తం ఉందని, వారిని కూడా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. -
వివాదం!
–8లోuవిగ్రహం.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై జిల్లా పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఘనంగా బెంగాలీ చైత్రమాస వేడుకలు మల్కన్‌గిరి జిల్లా కేంద్రం మల్కన్‌గిరిలో బుధవారం బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు(చైత్రమాస వేడుకలు) ఘనంగా నిర్వహించారు. వైద్యసౌకర్యాలు మెరుగుపర్చాలి ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లాలో ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కొరాపుట్: బీజూ పట్నాయక్ విగ్రహం ప్రతిష్టాపన వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఇది బీజేడీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గురువారం బీజూ పట్నాయక్ 28వ వర్ధంతి అందుకు వేదిక కానుంది. ఇదీ వివాదం.. జయపూర్ పట్టణంలో ఆరు అడుగుల బీజూ పట్నాయక్ విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు తగ్గట్లు మూడేళ్ల క్రితం విగ్రహం తీసుకొచ్చారు. అయితే ముఖంలో బీజూ రూపురేఖలు లేవని అత్యధికులు అభిప్రాయపడటంతో దానిని వెనక్కి పంపించారు. మరలా రెండేళ్ల క్రితం మరో విగ్రహం తీసుకొచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఆ విగ్రమాన్ని నేటికీ ప్రతిష్టాపన చేయలేదు. కార్యాలయం వెనుక భాగంలోనే విగ్రహం పడి ఉంది. ఈ విగ్రహ ప్రతిష్ట కోసం వివాదం చెలరేగింది. మున్సిపల్ కౌన్సిల్లో ఏకాభిప్రాయం.. జయపూర్ మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ నరేంద్ర మహంతి కాంగ్రేస్ పార్టీకి చెందిన్పటికీ వారికి 13 మంది సభ్యులు ఉన్నారు. వైస్ చైర్మన్ బి.సునీత బీజేడీ పార్టీకి చెందినప్పటికి వారికి 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బలాబలాలలో తేడా, పార్టీల మధ్య విబేధాలు ఉన్నప్పటికీ విగ్రహ ప్రతిష్ట విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అయినా రెండేళ్లపైగా విగ్రహం మూలనే పడి ఉంది. రబినారాయణ నందో అల్టిమేటం.. బిజూ విగ్రహం రెండేళ్లుగా ప్రతిష్ట కాకపోవడం తీవ్ర విచారకరమని బీజేడీకి చెందిన మాజీ మంత్రి న్యూస్రీల్రబినందో ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 17లోగా ప్రతిష్ట పనులు ప్రారంభం కాకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. తమ నాయకుడు విగ్రహ ప్రతిష్ట సత్వరం జరిగేలా చర్యలు తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. -
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార శిబిరాలైన గ్రీవెన్స్ సెల్‌ను అధికారులు నిర్వహించారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి కేంద్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో గ్రీవెన్స్ నిర్వహించారు. 45 ఫిర్యాదులు రాగా.. వీటిలో 37 వ్యక్తిగతం, 8 సామూహిక ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నలుగురు దివ్యాంగులకు వీల్చైర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మిహిర్ పండా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కేంద్రంలో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ గ్రివెన్స్ నిర్వహించి ప్రజాసమస్యలను పరిష్కరించారు. గుడారిలో.. రాయగడ: జిల్లాలోని గుడారిలో జిల్లా యంత్రాంగం మంగళవారం వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్, ఎస్పీ స్వాతి, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ పాడి తదితరులు పాల్గొన్నారు. గుడారి సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 16 వ్యక్తిగత సమస్యలు, ఒకటి గ్రామ సమస్యగా గుర్తించారు. జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ పాల్గొన్నారు. మాత్తిలి సమితిలో.. మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ గ్రీవెన్స్ నిర్వహించారు. మాత్తిలి సమితిలో పలు పంచాయతీలకు చెందిన వారు తమ సమస్యలను కలెక్టర్‌కు అందజేశారు. 28 వినతులను స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ తాపాన్ నారాయణ్ రోతో, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, మత్తిలి సమితి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. అబార్సింగిలో.. పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ అబార్సింగి గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం గ్రీవెన్స్ సెల్‌కు కలెక్టర్ బిజయకుమార్ దాస్ విచ్చేశారు. జిల్లా ఎస్పీ జితేంద్రనాథ్ పండా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సీడీఎం శంకర్ కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో వినతులు స్వీకరించారు. మొత్తం 48 వినతులు అందాయి. ఆర్.ఉదయగిరి సమితి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ శోబోరో, బీడీఓ లారీమాన్ ఖర్సల్, తహసీల్దార్ జ్యోతిర్మయ దాస్, జిల్లా జనస్వస్థ్య అధికారి, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులపై తేనెటీగల దాడి
కొరాపుట్: తేనెటీగలపై కోతుల దాడి చేయడంతో అవి చెలరేగి భక్తులపై దాడి చేశాయి. మంగళవారం సాయంత్రం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి కేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో భీర్కంభ అమ్మవారి దేవాలయంలో జాతర జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇక్కడకు సమీపంలో ఉన్న తేనె పట్టులపై కోతులు దాడి చేశాయి. దీంతో తేనె తుట్ట కదిలి తేనెటీగలన్నీ భక్తులపై దాడి చేశాయి. సుమారు 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని బొయిపరిగుడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. దేవాలయ పూజారి కృష్ణ నాయక్, నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన అశ్విని పట్నాయక్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. -
గ్యాస్ ధరలు తగ్గించాలని ఆందోళన
జయపురం: పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. 26 వ జాతీయ రహదారి జయపురం కూడలి వద్ద ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళన చేశాయి. జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో మాట్లాడుతూ నేడు కేంద్రంలోను, రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని, వీరి వల్ల ప్రజలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నో హామీలు గుప్పించిందని, వాటిని తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త ఇంటిముందు హుండీలు ఏర్పాటు చేసి చందాలు వసూలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 25 వ తేదీన పట్టణంలో నిధి సంగ్రహ అభిజాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆందోళనలో రాష్ట్ర కమ్యూనిస్టు నేత ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, అజిత్ పట్నాయిక్,ప్రినాథ్ టంగా, దామోదర పంగి, లక్ష్మణ పంగి, సుకుమార్ పొరజ, మనోహర హరిజన్ మొదలగు వారు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
కొరాపుట్: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జయపూర్ పట్టణంలో జాతీయ రహదారి–26పై సోమవారం నిరసన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేయడం దారుణమన్నారు. నిత్యావసర సరుకుల ధర లు, గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన జుదిష్ట రౌవులో, ప్రమెద్ మహంతి తదితరులు పాల్గొన్నారు. ఆటో..బైక్ ఢీ: నలుగురికి గాయాలు రాయగడ: ఆటో బైకు ఢీకొన్న ఘటనలో నలుగురు గాయపడ్డారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి బుడాగుడ కూడలిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో నాగేశ్వర కంజిక, ఇలాయి కడ్రక,చందు కడ్రక, త్రినాథ కడ్రకలు గాయపడ్డారు. సొమవారం ఒకే బైకు పై వీరంతా కొరపా పంచాయతీలోని బలిపొదొరి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఒక ఆటోను అదుపు తప్పి ఢీకొన్నారు. ఈ ఘటనలొ బైకు పై ప్రయాణించే వారంతా గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి సమీప ఆస్పత్రికి తరలించారు. భారీగా హిందూ ఏక్తా వాహిని ర్యాలీ కొరాపుట్: హిందూ ఏక్తా వాహిని వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించింది. సోమవారం రాత్రి నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఈ బల ప్రదర్శన జరిగింది. ఏటా ఒడియా నూతన సంవత్సరం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రదేశ్,ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా కళాకారులు ర్యాలీలో పాల్గొన్నారు. పలు చోట్ల ముస్లిం సంస్థల ప్రతి నిధులు హిందువులకు మిఠాయి తినిపించారు. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేడీ శ్రేణుల నిరసన రాయగడ: స్థానిక కపిలాస్ కూడలి వద్ద బీజేడీ శ్రేణులు సోమవారం నిరసన చేపట్టాయి. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, బీజేడీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెక్కంటి మాట్లాడుతూ.. ఒడిశా ప్రజలు దివంగత బిజూ పట్నాయక్‌ను వరపుత్రునిగా ఆరాధిస్తుండేవారు. కానీ బీజేపీ ప్రభుత్వం అటువంటి మహానాయకుడిని అవమానించడం సరికాదన్నారు.ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పాట్నాఘడ్లో బిజూ పట్నాయక్ విగ్రహాన్ని తగులబెట్టడం వంటి దుశ్చర్యకు పాల్పడడం దారుణమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. -
29న కలెక్టర్ ద్వారా ప్రధానికి మెమొరాండం సమర్పణ
జయపురం: ప్రధాన మంత్రి పలు వాగ్దానాలు చేస్తూ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారని, అయితే ఆ వాగ్దానాలు అమలు చేయటం లేదని ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి విమర్శించారు. మంగళవారం స్థానిక యాదవ భవనంలో కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పెన్షన్ దారుల సమావేశంలో మహంతి అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నళినీ కాంత రథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి పెన్షన్లు పెంచుతామని, కనీస పెన్షన్ పెరుగుతాయని ఆశలు చూపారని అయితే ఆ వాగ్దానాలు అమలు చేయటం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో మెజారిటీ గల ఆయన వామపక్షాల ఎంపీలతో ప్రధాన మంత్రి ఇచ్చిన వాగ్దానాలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ రూ.213 కోట్లు జమ అయిందని దానికి వచ్చే వడ్డీలో కొంతైనా కార్మికులకు ఇస్తే నష్టం లేదని, అయినా ఇచ్చేందుకు ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. కార్మికులకు రూ.9వేలు పెన్షన్ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను మరోసారి ప్రధాన మంత్రికి తెలిపేందుకు ఈ నెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధాన మంత్రికి మెమొరాండం సమర్పించేందకు మహంతి ప్రతి పాదించగా అందుకు సమావేశం సమ్మతించింది. సమావేశంలో బసంత బెహర, ముధిరత్, దండపాణి పాత్రో, కేసీ పండా, రామ శంకర పట్నాయిక్, సర్వేశ్వర పండ, సుభాష్ బెహర, సరోజ్ పండ, జి.ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థులకు బంగారు పతకాలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు బంగారు పతాకాలు, మరో పది మంది విద్యార్థులు వెండి పతకాలు సాధించారు. విజయవాడలో ఈ నెల 5న డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 12వ ఆల్ ఇండియా చిల్డ్రన్ అండ్ యూత్ ఆర్ట్ కాంపిటీషన్, ఎగ్జిబిషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు కంచిలి గురుకుల విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ను పంపించారు. వాటిలో ఎంపిక కావడంతో మంగళవారం ప్రపంచ ఆర్ట్ దినోత్సవం సందర్భంగా గురుకుల ప్రిన్సిపాల్ బమ్మిడి అప్పారావు చేతుల మీదుగా పతకాలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబర్చిన మరో 80 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. గురుకుల కళాశాల ఆర్ట్స్ ఉపాధ్యాయుడు దిక్కల మన్మథరావుకు జాతీయ బాల ఉత్తమ చిత్రకళ అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ పైల గణపతిరావు, డి.మల్లికార్జునరావు, సూపరిండెంట్ గేదెల జయరాం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఆర్ట్ టీచర్‌కు షీల్డ్‌లు అందజేస్తున్న ప్రిన్సిపాల్ -
రసవత్తరంగా కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్ష పదవి
కొరాపుట్: ప్రతి పక్ష బీజేడి పార్టీకి కొరాపుట్ జిల్లా అధ్యక్ష పదవి కోసం రసవత్తర పోరు జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సగం జిల్లాలకు అధ్యక్ష స్థానాల ఎంపిక పూర్తయ్యింది. ఏ జిల్లాలోనూ ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పూర్తి బలంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక కష్టమవుతోంది. కొరాపుట్ జిల్లాలో విభిన్నం కొరాపుట్ జిల్లాలో ఈ పదవికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకు కారణం మాజీ మంత్రి రబినారాయణ నందో ఆసక్తి చూపడమే. ఆర్థికంగా బలంగా ఉన్న నందో దంపతులు అనూహ్యంగా ఈ పదవి పై ఆసక్తి చూపారు. దాంతో అందరి దృష్టి ఈ పదవి పై పడింది. గత నాలుగు నెలలుగా నందో దంపతులు తమదైన శైలి లో లాబీలు చేస్తున్నారు. తాము ఓడిపొయినా పార్టీని నమ్ముకొని దశాబ్ద కాలంగా పని చేస్తున్నామన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో రబినందోకి టికెట్ కేటాయించకుండా అతని సతీమణి ఇందిరా నందోకి టిక్కెట్ ఇచ్చి భారీ మూల్యం పార్టీ చెల్లించింది. దాంతో నందో కుటుంబం పై అధిష్టానం పెద్దలకు దృష్టి పడింది. తనకు పదవి ఇస్తే ఈ నాలుగేళ్లు జిల్లా వ్యాప్తంగా పార్టీ కోసం తిరిగి పని చేస్తానని రబినందో తేల్చి చెబుతున్నారు. కిం కర్తవ్యం.. అవిభక్త కొరాపుట్ జిల్లాలో గత దశాబ్దకాలంగా కీలకమైన నేతగా ఈశ్వర్ చంద్ర పాణిగ్రహీ కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా ఈశ్వర్ కి పదవికి ఢోకా లేదు. ప్రస్తుతం అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆర్థికంగా శక్తి వంతమైన కొరాపుట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అందువల్ల నాలుగు జిల్లాలు తరచూ పర్యటిస్తున్నారు. దాంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పై ఆసక్తి చూపడం లేదు. కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఇష్టం లేక పోయినా అధ్యక్ష పదవి స్వీకరించాల్సి ఉంటుంది. బద్ద శత్రుత్వం రబినందో దంపతులు, ఈశ్వర్ పాణిగ్రహీలు ఒకే కమ్యూనిటీకి చెందినప్పటికీ బద్ద వైరం ఉంది. ఈ వైరం గత 27 ఏళ్లుగా కొనసాగుతోంది. రబినందో మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 15 ఏళ్ల పాటు ఈశ్వర్‌ను పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారని చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా ఈశ్వర్ హవా కొనసాగుతున్న సమయం లో నందో కుటుంబంకి రాజకీయ వేధింపులు జరిగాయని అంటున్నారు. వీరిద్దరి అంతర్గంత పోరుతో అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడింది. మధ్యే మార్గం అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానం ఆదేశాలు అందరికి శిరోధార్యం. కానీ ప్రస్తుతం పార్టీ ప్రతి పక్షంలో ఉంది. రబి నందో కి పదవి ఇస్తే ఈశ్వర్ వర్గంకి కోపం వస్తుంది. ఇవ్వక పోతే నందో దంపతుల నిర్ణయం ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేక పోతున్నారు. దాంతో అధిష్టానం ఏ నిర్ణయం చేయలేక మధ్యే మార్గం గా మాజీ ఎంపీ జిన్ను హిక్క ని అధ్యక్షునిగా చేస్తారని సంకేతాలు వస్తున్నాయి. గతంలో జిన్ను అధ్యక్ష పదవిలో కొనసాగారు. అందువల్ల మళ్లీ జిన్నునే కొనసాగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెం ఫ్లై ఓవర్ వంతెన కింద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగడ చిన్నలచ్చయ్య (74) బస్సులో ప్రయాణిస్తూ చిలకపాలెం వద్ద దిగాడు. లావేరు మండలం బుడుమూరు సంతకు వెళ్లే క్రమంలో ఫ్లై ఓవర్‌ను దాటుతుండగా.. చిలకపాలెం వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో వృద్ధుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్సీడీఆర్సీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)లో ఇద్దరు సభ్యుల ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ వినియోగదారుల శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు జడ్జి/పదేళ్ల అనుభవం గల జిల్లా జడ్జి/జిల్లా అదనపు జడ్జి/వ్యాపార న్యాయ ఆర్థిక అకౌంటింగ్ తదితర రంగాలలో 25 ఏళ్ల పైబడి అనుభవము కలిగిన 50 ఏళ్ల పైబడిన వారు అర్హులని పేర్కొన్నారు. -
తండ్రీకుమార్తెలపై దాడి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామంలో తండ్రీకుమార్తెలపై దాడి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ట పాపారావు ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తె లక్ష్మిప్రియతో కలిసి స్కూటీపై బోరుభద్రలో ఉన్న వివేకానంద పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన పిట్ట ముఖలింగం ఇనుప రాడ్డుతో వెనుక నుంచి దాడి చేయడంతో పాపారావుతో పాటు కుమార్తె కింద పడిపోయారు. కిందపడిన తండ్రీకుమార్తెలపై ముఖలింగంతో పాటు పిట్ట లక్ష్మణరావు, రామారావులు కర్రలతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకొని బాధితులకు సపర్యలు చేసి 108 అంబులెన్సులో కోటబొమ్మాళి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత, ఆస్తి తగదా వల్లే దాడి జరిగిందని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
జి.సిగడాం: మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబొమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్‌తో తొమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. దినేష్ సచివాలయ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాలఖండ్యాంలోని పుట్టింటికి వెళ్లిన భవానీ ఈ నెల 14న సంతవురిటి వచ్చింది. అదే రోజు రాత్రి మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో భవానీ సోదరుడు నాగరాజుకు దినేష్ ఫోన్ చేసి భవానీ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. సోదరుడు వెళ్లి చూసేసరికి భవానీ విగతజీవిగా కనిపించింది. భవానీ మృతికి అల్లుడు దినేష్, అత్తింటి వారే కారణమని బంధువులు ఆరోపించారు. భవానీ మెడపై గాయాలు ఉండటంతో దినేష్ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ధారభోయిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జె.ఆర్.పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మణరావు, క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త దినేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. అత్తవారే కారణమంటున్న మృతురాలి బంధువులు భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
ముగిసిన శ్రీరామ నవమి ఉత్సవాలు
జయపురం: స్థానిక జమాల్ లైన్ శ్రీరామ మందిరంలో చేపట్టిన శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. దీనిలో భాగంగా ఉదయం పూర్ణాహుతి హోమం చేపట్టారు. అలాగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోరపల్లి నాగరాజు, కార్యదర్శి సానా జగదీష్, ఉపాధ్యక్షుడు సీహెచ్ శేఖరరావు, సహాయ కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్, కోశాధికారి వారణాసి రమేష్, సభ్యులు బి.వెంకట రమణ, కళింగ వైశ్య కుల పెద్ద వారణాసి సత్యనారాయణ, వారణాసి శివప్రసాద్, ఎస్.ఈశ్వరరావు, ఎ.తిరుమలరావు, ఎస్.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
నబరంగ్‌ఫూర్ బీజేడీ అధ్యక్షుడిగా మనోహర్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా బీజేడీ అధ్యక్షుడిగా డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారిని పార్టీ నియమించింది. మంగళవారం రాత్రి పార్టీ అధిష్టానం తొలి విడతగా 18 జిల్లాల అధ్యక్షుల జాబితాని విడుదల చేసింది. పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్న ప్రతాప్ కేసరి దేవ్ ఈ వివరాలు ప్రకటించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి కేవలం మనోహర్ రంధారి ఒక్కరే బీజేడీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించాలి మల్కన్‌గిరి: జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం మా అమ్మ గౌరవం–మన గర్వం అనే నినాదంతో భారీ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 నెలల్లో 20 వేల మంది మహిళలు, చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు జరిగాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోవింద పాత్రో, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్‌లోకి పులువురి చేరిక రాయగడ: జిల్లాలోని మునిగుడలో బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక ఆధ్వర్యంలో మంగళవారం బీజేడీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిసంకటక్ ఐబీ ప్రాంగణంలో జరిగిన ఈ చేరికల్లో శివపదర్ పంచాయతీకి చెందిన గొపాల కృష్ణ మాఝి, రాజు క్రడక, రాజారావు పొలకియ, రవీద్ర మహానందియా, మున్నా జకసిక, దీప జకసిక, సుశాంత్ మాఝి, మహేంద్ర మాఝి తదితర ప్రముఖులు కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు పలువురు బీజేడీ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. బాక్సింగ్ పోటీల్లో చరణ్‌కు కాంస్యం శ్రీకాకుళం న్యూకాలనీ: యూత్ బాక్సింగ్ పోటీల్లో సిక్కోలు కుర్రాడు ఎ.చరణ్‌కుమార్ సత్తాచాటాడు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 తేదీల్లో జరిగిన 7వ ఏపీ రాష్ట్రస్థాయి యూత్ మెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో లైట్ మిడిల్ వెయిట్ విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. శ్రీకాకుళంలోని మాస్టర్స్ మైండ్స్ వారియర్స్(ఎంఎండబ్ల్యూ) బాక్సింగ్ క్లబ్‌కు చెందిన ఈ కుర్రాడు కోచ్ కె.పురుషోత్తంరావు పర్యవేక్షణలో ఇటీవల అనేక బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించాడు. తాజాగా కాంస్య పతకం సాధించడం పట్ల బాక్సింగ్‌క్లబ్ అధ్యక్షుడు టి.తారకనాథ్, కార్యదర్శి బి.సురేష్‌కుమార్, కోచ్ పురుషోత్తం, క్లబ్ ప్రతినిధులు, డీఎస్డీఓ డాక్టర్ శ్రీధర్‌రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు. సన్నధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే పోలాకి: ‘చిన్నబోయిన సన్నాలు’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో పలు మిల్లుల్లో సన్నధాన్యం, బియ్యం, నూకలు తదితర స్టాకులను తనిఖీ చేశారు. వాటా, నిల్వ తదితర అంశాలను తెలియజేసే ఏ, బి రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా వ్యవసాయశాఖ అధికారులకు సైతం క్షేత్రస్థాయిలో వార్తకు సంబంధించిన అంశంపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. కాగా, రబీకి అందివచ్చిన సన్నధాన్యం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు లేవని అధికారులు తెలిపారు. ఏదిఏమైనా ప్రభుత్వం ఎగుమతులకు అనుమతిస్తే తప్ప ధాన్యం కొనుగోలులో అనుకున్న స్థాయి మార్కెట్‌ధర పలకదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. -
షైన్ అవార్డులకు సిక్కోలు విద్యార్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ : సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అదరహో అనిపించి స్టేట్ అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో చదువుతూ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు షైన్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. టాపర్లను ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడ/గుంటూరులో సత్కరించేలా ఏర్పాట్లు చేసింది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని దామోదర స్వప్న ఎంపీహెచ్‌డబ్ల్యూ ఒకేషనల్ కోర్సులో 1000 మార్కులకు 989 మార్కులతో రాష్ట్రంలో టాపర్‌గా నిలిచింది. ప్రిన్సిపాల్ బి.శ్యామ్‌సుందర్, అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాణించింది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థిని ఎ.సేవేంద్రకుమార్ సీజీఏ ఒకేషనల్ కోర్సులో 1000 మార్కులకు 958 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ప్రిన్సిపాల్ పి.దుర్గారావు, అధ్యాపకులతో నిరంతరం ప్రోత్సాహంతో రాణించింది. బూర్జ మండలం ఓవీ పేట మోడల్ స్కూల్ విద్యార్థిని కర్ని ధరణి ఎంపీసీ జనరల్ కోర్సులో 1000 మార్కులకు 984 మార్కులు సాధించి శభాష్ అనిపించింది. ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు, తల్లిదండ్రులు, పీజీటీల ప్రేరణ మరువలేనిదని చెబుతోంది. -
ఐక్యంగా పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం
● జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దేశానికి స్వాతంత్య్రం వచ్చినా బీసీలు బతుకులు అగ్రకుల పెత్తందారుల కబందహస్తాల మధ్యనే నలిగిపోతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు అన్నారు. బీసీలు రాజ్యాధికారం సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఏ ఉద్యమానికై నా శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుడితేనే విజయవంతమవుతుందన్నారు. శ్రీకాకుళం నగరంలో బీసీ నాయకులతో కలిసి ఓ ప్రయివేటు భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.25 నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పి బీసీలకు న్యాయం చేసే పాలకుల్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యతగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని, లేకుంటే జీవితకాలం అగ్రకులాల చేతుల్లో కీలు బొమ్మల్లా ఉండిపోవాల్సి వస్తుందన్నారు. త్వరలో విజయవాడలో బీసీలందరితో కలిసి సభ ఏర్పాటుచేస్తామని చెప్పారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు కిల్లాన శ్రీనివాసరావు, ఆవు నరసింహరావు, ఎంఏ బేగ్, గద్దిబోయిన కృష్ణయాదవ్, నర్తు నరేంద్రయాదవ్, బి.రాజేష్, బాడాన దేవభూషణ్, గురునాథ్‌యాదవ్, కిల్లాన మాధవరావు, కిల్లాన దిలీప్, నాగేశ్వరరావు, లక్ష్మి, పి.రామకృష్ణ, కలగ కేశవరావు, శాలిన లక్ష్మణరావు, అలపాన త్రినాథరెడ్డి, వాన కృష్ణచంద్, ఆగూరు ఉమామహే శ్వరరావు, బి.సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణా
● అన్నదమ్ములు అరెస్టు కొరాపుట్: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో విశాఖపట్నం వెళ్లడానికి కిరండోల్ రైలు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగుల్లో తనిఖీలు చేపట్టగా 20 కేజీల గంజాయి పట్టుబడింది. వీరిద్దరూ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విశాల్ దుబే, భరత్ దుబేలుగా గుర్తించారు. వీరు సిమిలిగుడలో గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రక్తదాన శిబిరం కొరాపుట్: జిల్లా కేంద్రంలో బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. శిబిరాన్ని బీఎస్ఎఫ్ సెక్టార్ కేంద్రంలో డీఐజీ సత్యవాన్ ప్రారంభించారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక పోరాటంలో బీఎస్ఎఫ్ జవాన్లు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. వారి త్యాగాలు మరింత ముందుకు తీసుకొని వెళ్లడానికే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మొత్తం 50 మంది జవాన్లు రక్తదానం చేశారు. జయపురం వచ్చిన అఖండ దీపం జయపురం: హరిద్వార్ శాంతికుంజ్ గాయిత్రీ తీర్థం ద్వారా పరిక్రమిస్తున్న అఖండ దీపం రథం సోమవారం జయపురం చేరుకుంది. మల్కన్‌గిరి నుంచి జయపురం చేరిన అఖండ దీపానికి భక్తులు ఘన స్వాగతం పలికారు. హరిద్వార్ శాంతికుంజ్ గాయిత్రీ తీర్థంలో 1926లో ఏర్పాటు చేసిన ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉంది. ఇది 2026 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటుదని అఖండ దీప రథంతో సోమవారం జయపురం వచ్చినవారు తెలియజేశారు. అనంతరం నవరంగపూర్ మీదుగా కలహండి వెళ్తుందని వెల్లడించారు. ముగిసిన గంగమ్మ తల్లి ఉత్సవాలు జయపురం: పట్టణంలోని గంగమ్మ తల్లి ఘటజాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 7వ తేదీన పూర్ణఘడ్ గంగమ్మ మందిరం నుంచి అంచమాల తీసుకోని రావడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని కమిటీ సభ్యులు తెలియజేశరాఉ. ఆరోజు నుంచి అమ్మవారు భక్తుల నుంచి పెద్ద ఎత్తున పూజలందుకున్నారు. 100 కిలోల గంజాయి పట్టివేత మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా ఎకై ్సజ్ పోలీసు అధికారి బింభధర్ పండా ఆదేశాలతో సోమవారం మల్కన్‌గిరి ఎకై ్సజ్ పోలీసులు చలాన్గుడ పంచాయతీ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించారు. ఓ ఆటో అతివేగంగా రావడంతో ఆపి తనిఖీ చేయగా గంజాయి బస్తాలు కనిపించాయి. వెంటనే స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నీలాపరి గ్రామానికి చెందిన ప్రశాంత్ ఖోరగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి తూకం వేయగా 100 కిలోలు వచ్చింది. -
వైభవంగా హనుమాన్ జయంతి
రాయగడ: స్థానిక డైలీ మార్కెట్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ధ్యానాంజనేయ మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరిగాయి. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: ఒడియా వారికి నూతన సంవత్సరం వృషభ సంక్రాంతి, హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో పలు ఆంజనేయస్వామి మందిరాలకు ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. స్థానిక గుండిచా మందిరం వద్ద పురాతన హనుమాన్ మందిరం వద్ద భక్తులు దీపారాధన చేసి అఖండదీపాలు వెలిగించారు. తెలుగు సొండి వీధి అభయాంజనేయస్వామి మందిరం వద్ద ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణంలో కేవుటి వీధి, బెత్తగుడ వద్ద ఆంజనేయస్వామి, గాజుల వీధిలో ఉచిత అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు. కొరాపుట్‌లో.. కొరాపుట్: కొరాపుట్,నబరంగ్‌పూర్ జిల్లాలలో హనుమాన్,రామ,బాలాజీ,శివ మందిరాలు కిటకిటలాడాయి. విశ్వ సంక్రాంతి సందర్భంగా రోడ్ల పై పానకాలు పంపిణీ చేస్తూ పొణ సంక్రాంతి జరుపుకున్నారు. జయపూర్ డైలీ మార్కెట్లో హనుమాన్‌ని దర్శించుకుంటున్న మాజీ మంత్రి రబినందో, శివ పట్నాయక్ -
గవర్నర్‌ను కలిసిన మల్కన్‌గిరి ఎమ్మెల్యే
మల్కన్‌గిరి: భువనేశ్వర్‌లో గవర్నర్ హరిబాబును మల్కన్‌గిరి ఎమ్మెల్యే సోమవారం కలిసి ఒడియా నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఉన్న పలు గిరిజన తెగలకు అందాల్సిన సంక్షేమ పథకాలు గూర్చి చర్చించారు. వారి అభివృద్ధికి జిల్లాలో పర్యటించాలని ఆహ్వానించారు మూడు ఇళ్లల్లో ఒకేసారి దోపిడీ పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ సమితి గోరిబంద పంచాయతీ కురిగాం గ్రామంలో మూడు ఇళ్లల్లో ఆదివారం ఒకేసారి చోరీ జరిగింది. బంగారం, నగదు దోచుకున్నట్టు కాశీనగర్ ఐఐసీ సునీల్ కుమార్ బెహరా సోమవారం తెలియజేశారు. గోరిబంద పంచాయతీ ఖురిగాంలోని ఆర్.సావిత్రి ఇంట్లో రాత్రి దోంగలు పడి మహిళ మెడలో రెండు తులాల మంగళసూత్రం దోచుకున్నారు. బి.తవిటినాయుడు, పి.కళావతి ఇళ్లల్లో రూ.40 వేల నగదు, బంగారం దోచుకుని పారిపోయారు. దీనిపై కాశీనగర్ పోలీసు ఠాణా అధికారి సునీల్ కుమార్ బెహరా సంఘటనా స్థలానికి విచ్చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై కాశీనగర్ పోలీసు ష్టేసన్లో కేసు నమోదు చేశారు. చలివేంద్రం ఏర్పాటు రాయగడ: జేకేపూర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో గల రిలయన్స్ మార్ట్ వద్ద స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాటసారులకు తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ కుమార్, కె.రమేష్, కె.ధర్మరాజు, తదితరులు ప్రారంభించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని క్లబ్ సభ్యులు తెలిపారు. సామాజిక న్యాయమే లక్ష్యం ఎచ్చెర్ల క్యాంపస్: సామాజిక న్యాయమే లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ముందుకు సాగారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఐసీఎస్ఎస్ఆర్ (ఎస్ఆర్సీ) హానరీ ప్రొఫెసర్ బి.సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘విస్మరించబడిన వర్గాలకు సాధికారిత’ అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ మార్గం అనుసరణీయమన్నారు. ప్రపంచ మేధావుల్లో అంబేడ్కర్ అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో వీసీ రజిని, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. బొలెరో ఢీకొని వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక మండపొలం కాలనీ సమీపంలో పాత జాతీయ రహదారిపై సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చేరివీధికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జి.సింహాద్రి సైకిల్‌పై మండపొలం కాలనీ నుంచి తన వీధి వైపు వెళ్తుండగా వెనుక నుంచి బొలెరొ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సింహాద్రికి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జి ల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
వంట బిల్లులు వెంటనే చెల్లించాలి
ఎచ్చెర్ల : మధ్యాహ్న భోజనం పథకం వంట కార్మికులకు పది వేల రూపాయల వేతనం, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్నబోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర డిమాండ్‌చేశారు. మండల కేంద్రం లావేరులో సోమవారం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ముందుగా స్కూల్ ఆవరణలోని అంబే డ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యా హ్న భోజన కార్మికులు రూ.3 వేల జీతంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరుగుతున్నా వేతనాలు, మెనూ చార్జీలు మాత్రం పెరగడం లేదన్నారు. ప్రాథమిక విద్యార్థులకు రూ.6.12 పైసలు, హైస్కూల్ విద్యార్థులకు రూ.9.29 పైసలతో నాణ్యమైన పౌష్టికాహారం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీ రూ.20కు పెంచాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, మౌలిక సదుపాయాలని కల్పించాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌లోకి పలువురి చేరిక
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితిలో గల పలువురు బీజేడీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రేస్‌లోకి సోమవారం చేరారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్‌దాస్ సమక్షంలో చేశారు. జిల్లాలోని గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండా తదితరుల సమక్షంలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో పద్మపూర్ సమితి మాజీ చైర్మన్ రమాకాంత్ మాఝి, సర్పంచ్ అగాదు సబర్, జుగల్ మాఝి, రాజేష్ సబర్, డొంబురు నుండ్రుక తదితర ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు దాస్ వారిని పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. భవిష్యత్‌లో పార్టీ అభివృద్ధికి కలసి కట్టుగా కృషి చేయాలన్నారు. -
ఘనంగా నివాళి
అంబేడ్కర్‌కు ..పర్లాకిమిడి: బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొత్త బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎస్పీ జితేంద్ర నాథ్పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, డీఆర్డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, రాయగడ బ్లాక్ శిక్షాధికారి యస్.పాపారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి కొత్త బస్టాండు వరకూ మోటారు సైకిల్ ర్యాలీ జరిపారు. అనంతరం దండుమాలవీధిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కొరాపుట్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఘనంగా జరిగింది. సోమవారం కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మల్కన్‌గిరి: స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ పూలమాలాలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ చేసిన కృషిని వివరించారు. స్థానిక శిశుమందిర్ పాఠశాలలోనూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, డీపీఐఆర్ఓ ప్రమిళ మాఝి, మున్సిపల్ అధికారి ఆశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా యంత్రాంగం పూలమాలలు వేసి నివాళులర్పించింది. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, ఆ పార్టీ నాయకుడు యాల కొండబాబు, బసంత ఉలక, కాళీరాం మాఝి తదితరులు స్థానిక కొత్త బస్టాండు వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గుణుపూర్‌లో సీపీఐ (ఎంఎల్) జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగొ ఆధ్వర్యంలో పట్టణలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి బహమతులు అందజేశారు. జయపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు వాడవాడలా జరిగాయి. జయపురం సమితి జయంతిగిరి గ్రామంలో జయంతిగిరి కూడలి వద్ద గల అంబేడ్కర్ ప్రతిమకు పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజళి ఘటించారు. జయపురంలో దళిత సమాజ్ శ్రేణులు స్థానిక పారాబెడ కూడలిలో ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, పుష్పమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆమెతో పాటు జయపురం ఎడిపిఆర్ఓ యశోద గదబ, పలువురు అధికారులు,జయపురం ప్రభుత్వ మహిళా కళాశాల, మహిళా ఉన్నత పాఠశాల విద్యార్ధిణీ విద్యార్ధులు, జయపురం అంబేడ్కర్ సమితి కార్యకర్తలు, బిజేపి నేతలు పారాబెడ కూడలి వద్దగల డా,అంబేడ్కర్ కు నివాళులు అర్పించారు. -
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు
శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు రాగోలు జెమ్స్ ఆస్పత్రి బొల్లినేని మెడిస్కిల్స్‌లో జీడీఏ, ఐసీయూ, ఓటీ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కు బీఎస్సీ డిప్లమా పారామెడికల్ నర్సింగ్ బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించాలని కోరారు. మాజీ సైనికుల భవనానికి శంకుస్థాపన శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగోలు పంచాయతీ రాయిపాడులో సైనిక్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు సోమవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులతో కలిపి రూ.2 కోట్ల 92 లక్షల నిధులతో ఈ భవనాన్ని నూతనంగా సైనిక్ భవన్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, సైనిక్ సంక్షేమ సంచాలకులు వెంకటరెడ్డి, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు ఆక్రమణల తొలగింపు శ్రీకాకుళం రూరల్: నగర పరిధిలోని డీసీసీబీ కాలనీలో భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, నర్సస్ కాలనీకి వెళ్లే రహదారి ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పలు ప్రజాసంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు మున్సిపల్ యంత్రాంగం దిగొచ్చింది. అధికారులు సోమవారం ఉదయం జేసీబీతో వెళ్లి ఆక్రమణలు తొలగించారు. దీంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. శ్రీనివాస్‌కు సాహితీ లహరి పురస్కారం శ్రీకాకుళం కల్చరల్ : నగరానికి చెందిన ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు చాడ శ్రీనివాస్‌కు సాహితీ పురస్కారం దక్కింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సూర్యాపీఠం సమావేశ మందిరంలో సాహితీ లహరి, మంచిపల్లి సేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్, మాజీ ఎంపీ డి.వి.జి.శంకరరావు, పక్కి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆటోడ్రైవర్ ఆత్మహత్య సోంపేట: సోంపేట పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ జి.ధర్మారావు (42)సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. ధర్మారావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద గొడవ పడి బయట కు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం పట్టణంలోని గొల్ల వాని చెరువు సమీపంలోని తోటలో ఆటో తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతోభార్య మోహిని, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ లవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య టెక్కలి రూరల్: కోటబొమ్మాళి స్టేట్ బ్యాంకు వెనుక ప్రకాష్ నగ ర్ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కోరాడ వాసుదేవరావు(58) మృతి చెందాడు. విషయం తెలుసుకు న్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుమారుడు పవన్‌కు సమాచారం అందించారు. వాసుదేవరావు ప్రకాష్నగర్లోనే ఉంటూ చిన్న చిన్న వంటపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. -
ఘనంగా ఉత్కళ నూతన సంవత్సరం
జయపురం: పొణ సంక్రాంతిలో పూజలు అందుకుంటున్న దేవతా మూర్తులు మల్కన్‌గిరి: మహిళలు చేసిన ఒడియా పిండివంటలను పరిశీలిస్తున్న అధికారులు మల్కన్‌గిరి: జగన్నాథ మందిరం వద్ద ఒడియా వంటకాలను పరిశీలిస్తున్న అధికారులు రాయగడ: పానకాన్ని పంచుతున్న దృశ్యం కొరాపుట్: ఉత్కళ ప్రజల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలలో ఉత్కళ కవులు, మేధావులు సదస్సులు, చర్చాగోష్టిలు ఏర్పాటు చేశారు. రాయగడలో.. రాయగడ: ఒడియా ప్రజల కొత్త సంవత్సరం పొణా సంక్రాంతిని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పొణా (పాణకం) ను పంపిణీ చేశారు. అదేవిధంగా వాకర్స్ క్లబ్, ఇంటర్నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ కు చెందిన సభ్యులు పొణాను పంపిణీ చేశారు. మల్కన్‌గిరిలో.. మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన సోమవారం ఒడియా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లా అనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధాన్ మాట్లాడుతూ పక్షోత్సవంలో చివరి రోజు మన ఒడియా నూతన సంవత్సరం కావడం విశేషమన్నారు. ఈ సందర్భంగా కొన్ని వంటకాలను ప్రదర్శించారు. స్థానిక జగన్నాథ మందిరంలో ఆదివారం ఆహార దినోత్సవం నిర్వహించారు. జయపురంలో.. జయపురం: ఒడియ సంప్రదాయ ప్రజల కొత్త సంవత్సరం పొణ సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి ప్రతి ఇంటివారు దేవతలకు పూజలు భక్తి శ్రద్దలతో జరిపారు. -
గనుల తవ్వకాలపై ఎంపీ ఆగ్రహం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో కొడింగా మాలిలో గనుల తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రామ సభ, పల్లె సభ తీర్మానాలను ఉల్లంఘించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. గత తీర్మానాలను పక్కన పెట్టి తవ్వకాల పరిధిని పెంచారన్నారు. అందుకు కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో మోహన్ మజ్జి ప్రభుత్వాలు గనుల తవ్వాకాలకు రాజ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. గిరిజనులకు మిగిలేది కేవలం కాలుష్యమేనన్నారు. తాము అంబెడ్కర్ ఆశయాల సాధన కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో బలహీన వర్గాలకు అండగా నిలబడతామన్నారు. కొడింగా మాలిలో బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఎంపీ సప్తగిరి ఉల్క హెచ్చరించారు. ఈ సమావేశంలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్యలు పాల్గొన్నారు. అంతకు ముందు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అంబెడ్కర్ సంఘాలతో సమావేశమయ్యారు. -
నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టొద్దు
కొరాపుట్: నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టవద్దని బీజేడీ ఎంపీ, ఒడియా సినీ హీరో ముజిబుల్లా ఖాన్ (మున్నా) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి సెమిఖొడ్ర పంచాయతీ ఖండ గ్రామంలో జన జాగృతి మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గిరిజన మహిళలనుద్దేశించి ప్రసంగించారు. అప్పుడే పుట్టిన శిశువుల పొట్టలపై కొడవలిని కాల్చి వాతలు పెట్టడంతో అనాగరికమన్నారు. నబరంగ్‌పూర్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఇటువంటి వాతలు పెట్టే మంత్రగత్తెలను పొలీసులు అరెస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో సయాద్ కాజం మదాని తదితరులు పాల్గొన్నారు. -
కొరాపుట్ జిల్లా మహిళా క్రికెట్ టీమ్ ఎంపిక
జయపురం: కొరాపుట్ జిల్లా మహిళా క్రికెట్ టీమ్‌ను ఆదివారం ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళా క్రికెట్ క్రీడాకారులకు నిర్వహించిన పోటీలో 17 మందిని ఎంపిక చేశారు. ప్రియాంక వర్మ (కెప్టెన్), సొమరి హోంజరియ, నమ్రత్ ఎడ్డింగ్, సాలు బరోల్, సునీత ఖిలో, జానకి చలాన్, సుంబాల పర్విన్, డోళీ అంపొడియ, అమ్రిత డ్యుయెల్పొడియ, గంగా హంజారియ, సుదురుతి రౌత్, దిబ్యశ్రీ జెన, భవాన బర్మ, ప్రియాంక పాత్రో, జశ్వినీ మహంతిని ఎంపిక చేశామని జయపురం సబ్‌డివిజనల్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయక్ వెల్లడించారు. గౌరీ ప్రధాని, గీతాంజలి రిషిలను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మహిళా క్రీడాకారుల మద్య నిర్వహించిన పోటీలను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనూప్ కుమార్ పాత్రో, జి.ప్రసాద్, జి.సత్యనారాయణ నిర్వహించి, ఉత్తమ మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారని వెల్లడించారు.ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడాయి. ఎండ తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో ఆలయం తరఫున మంచినీటిని పంపిణీ చేసినప్పటికీ..భక్తుల దాహం తీర్చలేకపోయారనే విమర్శలు వినిపించా యి. పలువురు వీఐపీలు ఆదిత్యుని దర్శనానికి రావడంతో గౌరవ స్వాగతాలు, ప్రత్యేక దర్శనాల ఏర్పా ట్లు చేశారు. దేవదాయశాఖ మాజీ కార్యదర్శి సుందరకుమార్ కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ చాగంటి సన్యాసిరాజు నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులుకు విరాళ నగదును అందజేయగా అందు కు తగిన రశీదును ఆయన దాతలకు అందజేశారు. వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.2,67,800, విరాళాల ద్వారా రూ. 78,417, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1.80 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు. -
వైభవంగా భక్తిసంగీత విభావరి
పర్లాకిమిడి: స్థానిక రాజవీధి అర్బన్ బ్యాంకు గ్రౌండ్స్‌లో శనివారం రాత్రి భక్తి సంగీత సంసద్ ఆధ్వర్యంలో 45వ భజన సమారోహన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎస్పీ జితేంద్రనాథ్ పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, మహాంత రామానంద దాస్జీ, ఉపాధ్యక్షులు ప్రదీప్ నాయక్, భరత్ భూషణ్ మహంతిలు అతిథులుగా విచ్చేశారు. ఒడియా సినీ సంగీత దర్శకులు ప్రశాంత్ పాఢి, గాయకులు శుభజ్యోతి, ప్రభుప్రశాంత్ మహంతి, స్వస్థిక్ పాఢి తదితరులు జగన్నాథ భక్తి సంగీత గేయాలను శ్రావ్యంగా ఆలపించి శ్రోతలను అలరించారు. హార్మోనిస్టు కై లాస్ చంద్ర పట్నాయిక్, ఉపాధ్యాయులు మనోజ్ పట్నాయిక్, ప్రసన్న కుమార్ రథ్, తిరుపతి పండా, అర్చనా రోథో తదితరులకు ఎమ్మెల్యే చేతులమీదుగా అవార్డులు అందజేశారు. గౌరీ ప్రసాద్ రథ్, ఎస్.ఎన్.రథ్ తదితరులు పర్యవేక్షించారు. -
9 మందికి రిమాండ్
సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నవోదయం 2.0 లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 12వ తేదీ వరకు 5 నాటు సారా కేసులు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ బేబి తెలిపారు. పై కేసుల్లో 68 లీటర్ల నాటు సారా సీజ్ చేసి, 1800 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో పలువురు సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. ఏరియా ఆస్పత్రికి కొత్త ఎక్స్‌రే మిషన్ నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రికి కొత్త ఎక్స్‌రే యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ పాత ఎక్స్‌రే యూనిట్ నే వినియోగిస్తూ వచ్చారు. రూ. 7 లక్షల విలువ కలిగిన ఎక్స్‌రే యూనిట్ ఆస్పత్రికి మంజూరు కావడం యూనిట్ రావడంతో దాన్ని వెంటనే వినియోగం లోనికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్ని రకాల ఎక్స్‌రేలు ఈ కొత్త మిషన్‌లో తీయవచ్చని యూనిట్ ఇన్చార్జి కృష్ణమూర్తి తెలిపారు. రోగులు వినియోగించుకోవాలని కోరారు. ప్రజల కష్టాలపై కవులు స్పందించాలి శ్రీకాకుళం కల్చరల్: దేశంలో అరాచక ఫాసిస్టు మూకలు రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని, ఈ దశలో అంబేడ్కర్ ఆశయాలను తలకెత్తుకుని ప్రజానీకం అంతా ఐక్యంగా ముందుకు సాగాలని కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. ఆదివారం ఇలిసిపురంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో సాహితీ స్రవంతి శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో సమతాభారత్ కవితా గోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలపై కవులు స్పందించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.ఉదయ్‌కిరణ్ త్రిభాషా సూత్రం మాతృభాష అనే అంశంపై ప్రసంగించారు. 2020 నూతన విద్యావిధానం ద్వారా హిందీబాషను రుద్దాలని చూస్తున్నారని, మాతృభాషలో విద్యాబోధన విద్యార్థి ప్రాథమిక హక్కు అని అన్నారు. ఇతర భాషలు నేర్చుకొవడం ఐచ్ఛికమన్నారు. సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలు, స్వాతంత్రోద్యమ లక్ష్యాలు నీరు గారకుండా గళం ఎత్తి కలాలకు పదును పెట్టాలని పిలుపు నిచ్చారు. ‘సిలబస్ భారం తగ్గాల్సిందే’ శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్య, ఉన్నత తరగతుల్లో సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని లేకుంటే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్ జిల్లా శాఖ ప్రతినిధులు మక్కా శ్రీనివాసరావు, బాడాన రాజు, ఎల్.గుణశేఖర్, సీ.హెచ్.సుబ్బలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల్లో సాంఘిక శాస్త్రంలో సిలబస్ భారం, విషయ భారం అధికంగా ఉండడం విద్యార్థులకు పెను భారంగా ఉందని అన్నారు. ఒక సగటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పదిహేను పాఠ్యపుస్తకాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను పునఃపరిశీలించి అసంబద్ధ విషయాంశాలు తొలగించి సిలబస్ భారం లేకుండా కుదించాలని విన్నవించారు. ఆ అవకాశం లేనిపక్షంలో భూగోళ, అర్ధశాస్త్రాల బోధనకు ఒక ఉపాధ్యాయుడు, చరిత్ర, పౌరశాస్త్రాల బోధనకు మరొక ఉపాధ్యాయుడు చొప్పున ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు నరసన్నపేట: జాతీయ రహదారిపై తామరాపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం పాత జడూరుకు చెందిన డి.హేమలరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ద్విచక్ర వాహనంపై నరసన్నపేట వైపు నుంచి స్వగ్రామం పాత జడూరుకు వెళ్తుండగా ఎదురుగా మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీ కట్లు ఊడి పోతుండటంతో ప్రమాదం జరుగుతుందని గమనించి లారీ డ్రైవర్‌కు చెప్పడానికి ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని 108 లో ఆస్పత్రికి తరలించారు. -
ఫుట్‌బాల్ చాంపియన్‌గా జీబా టైగర్స్
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి సీఎం ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్స్‌లో నువాగడ, జీబా టైగర్స్ మధ్య పోటీ జరిగింది. నువాగడ ఫైటర్స్‌పై నాలుగు పాయింట్ల తేడాతో జీబా టైగర్స్ విజేతగా నిలిచింది. జీబా టైగర్స్‌కు భువనేశ్వర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్టోర్స్ అకాడమీలో చేర్చి ఫుట్‌బాల్‌లో కోచింగ్ ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తుంది. జీబా టైగర్స్‌లో అందరూ 15 ఏళ్ల వయస్సు గలవారే. జిల్లాలో 8 క్లబ్‌లకు చెందిన క్రీడాకారులు అండర్ 15 గ్రూప్‌లో 176 మంది ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఆడారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, గౌరవ అతిథి డీఈఓ మాయాధర్ సాహు, విద్యాలయాల పీఈటీ సురేంద్ర పాత్రో హాజరయ్యారు. ట్రోఫీని జీబా టైగర్స్ జట్టుకు ఎమ్మెల్యే అందజేయగా, నువాగడ ఫైటర్స్ జట్టుకు రన్నర్స్ ట్రోఫీని జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ విద్యాలయాల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలలో విద్యాలయాల క్రీడా శిక్షకులు ధర్మేంద్ర సామల్, సంతోష్ పట్నాయక్, ప్రియదర్శి మిశ్రా, రేఖారాణి దేవ్, శివరాం భుయ్యాన్, కె.వి.రెడ్డి, కిశోర్ సామల్ పర్యవేక్షించారు. -
జూన్ 2 నుంచి బురదల పోలమ్మ ఉత్సవాలు
రాయగడ: గ్రామదేవతగా పూజలందుకుంటున్న స్థానిక భైరవ వీధిలో బురదల పోలమ్మ ఉత్సవాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శనివారం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా బార్జి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా ఎద్దు శ్రీహరి, కోశాధికారిగా బొచ్చ శ్రీనివాసరావు, పలువురు సభ్యులు నియమితులయ్యారు. జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్ బస్సుసర్వీసు ప్రారంభం కొరాపుట్: రాష్ట్రంలో చివరి సమితి నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి నుంచి బ్రహ్మపురకు ఓఎస్ఆర్టీసీ ఆదివారం జగన్నాథ ఎక్స్‌ప్రెస్ ఓల్వో బస్సు సర్వీసును ప్రారంభించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు చందాహండిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటకు బ్రహ్మపుర చేరుకుంటుంది. అదే విధంగా బ్రహ్మపురలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఉదయం 6 గంటలకు చందాహండి చేరుకుంటుంది. చందాహండి, నబరంగ్‌పూర్, జయపూర్, రాయగడ, దిగపొండిల మీదుగా బ్రహ్మపురకు రాకపోకలు సాగిస్తుంటుంది. బ్రహ్మపురలోని ఎంకేసీజీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి వెళ్లే రోగులకు ఈ బస్సు సర్వీసు ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో మహిళలకు సగం ధరకె టికెట్లు ఇవ్వనున్నారు. పింగిపుట్లో వైద్య శిబిరం రాయగడ: సదరు సమితి పరిధిలోని తడమ పంచాయతీ సింగిపుట్ గ్రామంలో సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఉత్కల్ కుమార్ రథ్, డాక్టర్ జి.వి.రమణ, డాక్టర్ సుకుమార్ త్రిపాఠి, ఫార్మసిస్ట్ ప్రమోద్‌కుమార్ సాహు తదితరులు హాజరై 101 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి 12 మందికి కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరిని పితామహాల్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు రిఫర్ చేసినట్లు డాక్టర్ ఎల్ఎన్ సాహు తెలిపారు. వైద్యపరీక్షల్లో భాగంగా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి ఆత్మహత్య మల్కన్‌గిరి: మ ల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బోఢపోదర్ పంచాయతీ బారడబందో గ్రామంలోని అడవిలో ఓ యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గ్రామస్తులు కొందరు కట్టెల కోసం అడవికి వెళ్లగా అడవి సమీపంలో చిన్న వంతెన వద్ద ఓ బ్యాగు, చెప్పులు కనిపించాయి. అటుగా వెళ్లగా ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు సర్పంచ్ స్వప్నఖిలోకు విషయం తెలియజేశారు. ఆమె చిత్రకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ముకుందో మేల్క తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దింపి బ్యాగ్ తనిఖీ చేయగా అందులో ఆధార్ కార్డులో వివరాలు కనిపించాయి. యువకుడు మేరు రమేశ్ చంద్ర ఆలాంగ్ అని ఉంది. అతడిని బలిమెల సమీపంలోని సోమనాథ్పురం పంచాయతీ అలాంగుడ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, స్నేహితులతో కలిసే ఈ ప్రాంతానికి వచ్చాడని మృతుడి తండ్రి శుకదేవ్ ఆరోపించారు. -
భారీగా గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల, చిత్రకొండ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో 860 కిలోల గంజాయిను పట్టుకున్నారు. కలిమెల సమితి నుంచి అక్రమంగా చిత్రకొండ వైపునకు ట్రక్‌లో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని కలిమెల పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. కలిమెల చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ ట్రక్ అతివేగంగా రావడంతో దాన్ని ఆపి తనిఖీ చేశారు. గంజాయి కనిపించడంతో బండిలో ఉన్న హరియాణాకు చెందిన రాజ్‌కుమార్(26), సోను సింగ్ (23)లను అరెస్టు చేశారు. కలిమెల ఐఐసీ చంద్రకాంత్ తండ కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. దొరికిన గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే చిత్రకొండ సమితి మంత్రీ పూట్ గ్రామం రహదారిలో ఆదివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అడవిలో కొన్ని బస్తాలు కనిపించాయి. తీసి చూస్తే గంజాయి ఉంది. 360 కిలోల బరువు ఉన్న ఈ గంజాయి విలువ రూ.36 లక్షల వరకు ఉంటుందని చిత్రకొండ ఐఐసి ముకుందో మేళ్క తెలిపారు. -
వెళ్లకండి మాస్టారూ..
కొరాపుట్: బదిలీపై వెళ్లిపోతున్న హెచ్ఎంను వెళ్లనివ్వకుండా విద్యార్థుల కన్నీళ్లతో అడ్డుకున్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కొసాగుమడ సమితి బడఅమడ పంచాయతీకేంద్రంలో అక్కడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంజన్ కుమార్ బెహరాకు బదిలీ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. రంజన్‌కుమార్ ఇక్కడి వారికి బాగా దగ్గరైపోయారు. చక్కగా చదువు చెబుతుండడంతో గ్రామస్తులు కూడా టీచర్‌ను ఇష్టపడేవారు. పాఠశాల ప్రాంగణం అంతా కూరగాయల మెక్కలు పెంచి వాటిని విద్యార్థులకు వితరణగా ఇచ్చేవారు. వ్యవసాయంపై అవగాహన కల్పించేవారు. సొంత ఖర్చుతో పిల్లలకు భోజనాలు కూడా పెట్టేవారు. పాఠశాలకు రాని పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. గత ఏడాది ఈ బడికి ఉత్తమ పాఠశాల అవార్డు కూడా వచ్చింది. అలాంటి టీచర్‌కు బదిలీ కావడంతో విద్యార్థులతో పాటు స్థానికులు కూడా కంటతడి పెట్టారు. -
సంప్రదాయ వంటల ప్రదర్శన
రాయగడ: రాష్ట్రావతరణ పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక సంసృతి భవన ప్రాంగణంలో ఆదివారం ఒడిశా సంప్రదాయ వంటల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో జిల్లాలొని 12 స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్రాపండ, కౌన్సిలర్ మంజులా మినియాకలు అతిథులుగా వచ్చి వంటల ప్రదర్శనను తిలకించారు. అదిరిన రుచులు పర్లాకిమిడి: ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా పర్లాకిమిడి డీఆర్డీఏ పంచాయతీ రిసోర్సు భవనంలో ఆదివారం ఉదయం ఒడియా పిండివంటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 13 మందికి పైగా స్వయం సహాయక మహిళా గ్రూపులు పాల్గొని రాగి సున్నండలు, కేకులు, పాయసం, కక్కరాలు, గారెలు తదితర వంటకాలు ప్రదర్శించారు. పోటీల్లో ప్రథమ బహుమతి రిమా సహా గెలుపోందగా, ద్వితీయ, తృతీయ బహుమతులు సునితా ప్రధాన్, రీనా మహారాణాలు గెలుపొందారు. -
ఘనంగా స్వర్ణక్షేత్ర ఉత్సవం
కొరాపుట్: ఉత్కళ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణక్షేత్ర ఉత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కొసాగుమ్డ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒడియా సాహిత్యంపై పద్య పోటీలు నిర్వహించారు. ఉత్కళ కవితా రంగంపై అద్భుత ప్రభావం చూపుతున్న తులసి మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మా భాష మాది అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భాషా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ భాషా కవులు కై లాష్ చంద్ర నాయక్, ప్రపుల్ల కుమార్ రౌత్, పవిత్ర కుమార్ హల్ధార్, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి బాలాజీ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన మజ్జిగౌరమ్మ చైత్రోత్సవాలు
రాయగడ: ఐదు రోజులుగా కొనసాగుతున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన పూజారి నిప్పులపై నడక, ముళ్ల కంపలపై కూర్చుని ఊయలూగడం వంటి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయ ప్రధాన పూజారి చంద్ర శేఖర్ బెరుకొ మందిర ప్రాంగణంలో ఖాళీ స్థలంలొ అగ్నిగుండాన్ని వెలిగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను మోసుకొచ్చారు. నిత్యం అమ్మవారి సన్నిధిలో పూజలందుకునే కత్తి (ఖడ్గం)ని పూజారి చేతపట్టుకుని మండుతున్న నిప్పులపై నడిచారు. అనంతరం చండీహోమంతో పూర్ణాహుతి కార్యక్రమాలు ముగిశాయి. ఆదివారం ఉదయం అమ్మవారి సన్నిధిలో ఉంచిన పాదాలను యథాస్థానానికి (పాదాల గుడి) తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. -
మహనీయుల జీవితం ఆదర్శం
పర్లాకిమిడి: ఒడిశా భాషా పక్షోత్సవాలు సందర్భంగా ఒడిశా సాహిత్య అకాడమీ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో ప్రముఖుల జీవిత చరిత్రపై పలువురు వక్తలు చర్చించారు. పట్టణంలోని 50 మందికి పైగా వయోవృద్ధులు, ఒడిశా భాష, సాహిత్యం, సంస్కృతిని వివరించారు. పండిత గోపబంధుదాస్, గోదావరి దాస్, పండిత మధుసూదన్ దాస్, సత్యనారాయణ రాజగురు, అప్పన్న పోరిచ్చా, అప్పన్న పాణిగ్రాహి, భక్తకవి జయదేవ్ వంటి మహామహుల జీవిత చరిత్రపై ఉత్కళ హితేషినీ కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో, బినోద్ జెన్నా, ఒడిషా సాహిత్య అకాడమీ, మాజీ సభ్యులు బిచిత్రానంద బెబర్తా తదితరులు వేదికపై మాట్లాడారు. డీఆర్డీఏ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీఆర్డీఏ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ డాక్టర్ భారతీ పాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు. -
కరిగిపోతున్న అడవులు!
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ అటవీ రేంజ్లో అడవులు మాఫియా పిడికిలో చిక్కుకొని మరుభూమిగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దట్టమైన అడవులు గల గుప్తేశ్వర్ ప్రాంతంలో కొంతమంది బరితెగించి విలువైన చెట్లను నరికేసి తరలించుకుపోతున్నారు. దీంతో దట్టమైన అటవీ ప్రాంతం ఉనికని కోల్పోతుంది. అడవులకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుప్తేశ్వర్ ప్రాంతంలో గతంలో అనేక రకాల వృక్షాలు ఉండేవని వాటిని పరిరక్షించేందుకు అటవీ విభాగ సిబ్బంది పర్యవేక్షిస్తుండేవారన్నారు. అయితే ప్రస్తుతం అడవుల పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బంది లేరు. దీన్ని అదునుగా చేసుకొని మాఫీయా పెట్రేగిపోతోంది. రేయింబవళ్లు తేడాలేకుండా విలువైన చెట్లను నరికేసి కలపను తరలించుకుపోతున్నారు. ప్రధానంగా విలువైన ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఇప్పుడు అడవిలో లేకుండా పోయాయి. పోడు వ్యవసాయం కోసం కొంతమంది అడవులకు నిప్పు అంటిస్తూ కాల్చి వేస్తున్నా అటవీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో గుప్తేశ్వర్ ప్రాంతం మరుభూమిగా మారుతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అటవీ విభాగ అధికారులు చర్యలు చేపట్టి అడవులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మరుభూములుగా మారుతున్న.. గుప్తేశ్వర అటవీ ప్రాంతం! పట్టించుకోని అటవీ అధికారులు -
కన్నుల పండువగా తెప్పోత్సవం
పొందూరు: మండల పరిధిలోని లైదాం శ్రీరామధామంలో సీతారాముల మహాయజ్ఞంలో భాగంగా తెప్పోత్సవం కార్యక్రమం శనివారం రాత్రి 7 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత సీతారామ చంద్రప్రభువుల వారికి రథోత్సవం చేపట్టారు. వారిని పల్లకిలో గ్రామంలో ఊరేగించారు. మహిళలు హారతులు పట్టి పూజలు చేశారు. అనంతరం కొలనులో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. చిక్కోలుకు వన్నెతెచ్చిన ‘గాయకుడు ఆనంద్’ శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం జిల్లాకు వన్నెతెచ్చిన వ్యక్తి సినీ గాయకుడు జి.ఆనంద్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో ఘంటసాల, బాలు, జి.ఆనంద్ (జీబీఏ) స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ, ఆనంద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆనంద్ విగ్రహాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి దివిలి హేమచందర్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, గొండు స్వాతి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, గేదెల వీర్రాజు, వావిలపల్లి జగన్నాథం నాయుడు, డోల జగన్, ఎం.వి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.