
వసతి గృహంలో చోరీయత్నం
రాయగడ: జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో ఉంటున్న ప్రభుత్వ వసతి గృహంలో చోరీయత్నం జరిగింది. దుండగులు ఇంటి ప్రవేశ ద్వారానికి ఉన్నటువంటి తాళాలను విరగ్గొట్టి లోపలకి ప్రవేశించారు. అక్కడ మరో తలుపును కూడా పగలుగొట్టారు. మంగళవారం విధులపై బయటకు వెళ్లిన ఆయన ఇంటి తలుపులను వేశారు. అయితే ఇంటి ముందు ఏదో అలికిడి వినిపించడంతో అక్కడ నుంచి దుండగులు పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న కుహరో తన ఇంట్లో చోరీకి యత్నం జరిగిందని సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

వసతి గృహంలో చోరీయత్నం