Odisha News
-
కమ్యునిటీ సర్వీస్ సెంటర్ ప్రారంభం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి కేంద్రంలోని గునయిపొడ ల్యాంప్స్ కార్యాలయంలో కమ్యునిటీ సర్వీస్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. కొరాపుట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణీగ్రాహీ రిబ్బన్ కత్తిరించి ఈ విభాగం ప్రారంభించారు. ఇందులో ఖాతాదారులకు 23 రకాల సేవలు అందనున్నాయి. వెనుకబడిన లమ్తాపుట్లో ఇటు వంటి సేవలు అందించడంపై ఈశ్వర్ పాణీగ్రాహీ హర్షం వ్యక్తం చేసారు. మద్యం మత్తులో హల్చల్ శ్రీకాకుళం ౖక్రైమ్ : జిల్లాకేంద్రంలోని మంగువారితోటలో శుక్రవారం ఓ సస్పెక్ట్ షీటర్ మద్యం తాగి హల్చల్ సృష్టించినట్లు ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపారు. బొమ్మలాట ఢిల్లీ అలియాస్ ఢిల్లీశ్వరరావు అనే యువకుడు శుక్రవారం ఉదయం మంగువారితోట బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి ఆ మైకంలో అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించాడని, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బందితో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా నాటక దినోత్సవం
పర్లాకిమిడి: పట్టణంలోని కరణం వీధిలో విజయా క్లబ్లో ప్రపంచ నాటక దినోత్సవాన్ని ప్రగతి శీల నాట్యరంగస్థలం ‘తరంగరంగ్’ ఆధ్వర్యంలో సాధారణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తరంగరంగ సంస్థ అధ్యక్షులు దేవేంద్రదాస్ అధ్యక్షతన జరుగగా, క్రియేటివ్ ఆర్ట్స్ అధ్యక్షులు నృసింహాచరణ్ పట్నాయక్, ఒడిశా సంగీత నాటక అకాడమి సభ్యులు రఘునాథ పాత్రో, రంగస్థల నటులు ఆదర్శదాస్ పాల్గొన్నారు. ఒడిశాలో గజపతిలో పర్లాఖిముండిలో రఘునాథ పోరిచ్చా నాటకం తొలుత ప్రదర్శించబడిందని దేవేంద్ర దాస్ అన్నారు. పర్లాకిమిడి మట్టిని ఏ రంగస్థల కళాకారులు మరిచిపోలేదన్నారు. రోజురోజుకు ఆదరణ తగ్గుతున్న రంగస్థల నాటక మండలిని ముందుకు నడిపించేందుకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాటక మహోత్సవాలు జరుపుతామని ఆదర్శదాస్ అన్నారు. సమావేశంలో నాట్యకళాకారులు మనోజ్ పాఢి, మంచ్ అధినేత ఫృధ్వీరాజ్, కళాకారిణి మాతాంగినీ గురు, మమతా పాఢి, శుభాంశు శేఖర్ పట్నాయిక్, సత్యపాఢియారీ పాల్గొన్నారు. -
21
యూడీఐడీ.. సేవలు రెడీ ● దివ్యాంగులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్ ● కొత్తపోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం ● ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా సులువుగా సేవలు పొందే అవకాశం ● ప్రయాస లేకుండా రైల్వేపాస్ పొందే సదుపాయం ●దివ్వాంగులకు వరం.. దివ్యాంగులకు ఆధార్ కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీని ప్రవేశపెట్టింది. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని ఐడీ నంబర్ పొందవచ్చు. ప్రత్యేక కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. – కె.కవిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ, శ్రీకాకుళం నరసన్నపేట: దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, ఇతర ప్రయోజనాలు, సదరం శిబిరాల సమాచారం తదితర సేవలను సులభంగా పొందేందుకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ) అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ దివ్యాంగులకు వరంలా మారనుంది. ఈ పోర్టల్ ద్వారా పొందిన ఐడీ నంబర్ ఆధారంగా దివ్యాంగులు రైల్వేపాస్‌లను కూడా పొందవచ్చు. గతంలో సదరం సర్టిఫికెట్లు పొందాలంటే స్లాట్ బుకింగ్ కోసం మీ–సేవ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై యూడీఐడీ నంబర్ ద్వారా దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే శ్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. యూడీఐడీ పొందాలంటే.. హెచ్‌టీటీపీ://ఎస్డబ్ల్యూఏవీఎల్ఏఎంబీఏఎన్సీఏఆర్డీ.జీఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా దివ్యాంగులు నేరుగా ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ–సేవా కేంద్రాల నుంచే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు.. ●కొత్తగా అందుబాటులోని తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ ద్వారా సేవలు సులభతరం కానున్నా యి. సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యపరీక్షలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో వస్తుంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ●ఇప్పటి వరకూ ఐదు రకాల సేవల వైకల్యం ఉన్న వారికే ఈ–సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖా స్తు చేసుకొనే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల సేవల వైకల్యాలను చేర్చారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ●శిబిరంలో వైకల్య నిర్థారణ పూర్తయ్యాక స్మార్ట్‌కార్డును పోస్టల్ శాఖ ద్వారా ఇంటికే పంపిస్తారు. ఈ కార్డు పింఛన్‌తో పాటు రైల్వేపాస్‌లు, ఇతర సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. ●యూడీఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. దరఖాస్తు ఇలా.. ఆన్లైన్లో స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్లయ్ బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అంగీకరిస్తూ సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అడిగిన సమాచారం నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వైద్య పరీక్షలు అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు. -
పోక్సో చట్టంతో చిన్నారులకు రక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల రక్షణకు పోక్సో చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫస్ట్ అడిషనల్ జడ్జి కె.ఎం.జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తలే లక్ష్మణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడతారని, బాధితులకు న్యాయ సహాయం అందించడం, వారి గుర్తింపును రహస్యంగా ఉంచడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు. తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో మరణశిక్ష సైతం విధించే అవకాశం ఉందని చెప్పారు. పిల్లలకు మంచి చెడులను వివరించడం, వారికి అవగాహన కల్పించడం సమాజం బాధ్యతని పేర్కొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కారం
కొరాపుట్: జిల్లాలోని బందుగాం సమితి గిరిడి గ్రామంలో సాగునీటి సమస్య పరిష్కారమైందని జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక తెలిపారు. ఈనెల 22వ తేదీన ఆమె వాహనాన్ని గ్రామస్తులు అడ్డగించడంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. శుక్రవారం ఉదయం గ్రామానికి తాగునీటి పైపుల ద్వారా నీరు వచ్చింది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించనున్నట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్చార్జి డీన్ డాక్టర్ పి.పద్మారావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కేంద్రంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 21 వరకు పరీక్షలు జరుగుతాయని 53 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఫిబ్రవరిలో జరగాల్సిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు మే చివరి వారంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ రెండో సెమిస్టర్ ఫీజులు స్వీకరిస్తున్నామని, ఏప్రిల్ 5లోపు అదనపు రుసం లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. యువకుడు అరెస్టు సోంపేట: మండలంలోని బేసిరామచంద్రాపురంలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసినట్లు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు శుక్రవారం తెలిపారు. దివ్యాంగురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శృంగారపు ప్రసాద్ ఆచారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 30, 31న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు యథాతథం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఈ నెల 30, 31 సెలవు దినాలైనప్పటికీ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని డీఐజీ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, అమ్మకందారులు రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. ఫిషరీస్ డీడీకి పదోన్నతి అరసవల్లి: జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాలోనే వివిధ హోదాల్లో శ్రీనివాసరావు విధులు నిర్వర్తించారు. తాజా పదోన్నతుల్లో ఈయనకు క్యాడర్ పెరగడంతో పాటు బదిలీ చేశారు. పలాసలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు జిల్లా ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. సమగ్ర విచారణకు డిమాండ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: పాస్టర్ ప్రవీణ్‌కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిషప్ బర్నబాస్ బింకం, ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఒంపూరు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 24న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ మృతిచెందారని, దీనిపై పలు అనుమానాలు ఉన్నందున విచారణ జరిపి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని, క్రైస్తవుల రక్షణకు భద్రత కల్పించాలని కోరారు. జేసీని కలిసిన వారిలో సీఎస్ఎస్ నాయకులు, పాస్టర్లు ఎం.షడ్రక్‌బాబు, జి.శామ్యూల్ అరుణ్‌కుమార్, టి.పేతురు, ఇ.శామ్యూల్ జాన్, ప్రత్తిపాటి ప్రసాద్, ఎ.ఎ.పాల్, అల్లు ఇమ్మానుయేల్, ఆశిర్కుమార్, అహరోన్ తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్‌కు ఫిర్యాదు
కొరాపుట్: పార్లమెంట్ సభ్యునిగా తనకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం ఏర్పిడిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. శుక్ర వారం భారత పార్లమెంట్‌కి ఫిర్యాదు అందించారు. ఈ నెల 26వ తేదీన తాను ఒడిశాలోని భువనేశ్వర్‌లో అసెంబ్లీకి వెళ్తుండగా రిజర్వ్ ఆఫీసు వద్ద ముడు గంటల పాటు పోలీసులు దిగ్బంధించారన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడినని, తాను అసెంబ్లీకి వెళ్లడానికి అన్ని హక్కులు ఉన్నాయని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదన్నారు. ఇవి గౌరవ పార్లమెంట్ సభ్యునికి జరిగిన హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఆర్టికల్ 105, రూల్ 222 ప్రకారం ఇది ఎంతో నేరంగా పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి ఒడిశా భుబనేశ్వర్ డిసిపిలపై చర్యలు తీసుకోవాలని సప్తగిరి ఉల్క విజ్ఞప్తి చేసారు. -
అంగన్వాడీల వేతనాల్లో కోత తగదు
శ్రీకాకుళం అర్బన్: ఫేస్‌యాప్ పేరుతో అంగన్వాడీల వేతనాలలో కోత విధించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతినెలా ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అధికారులు ఒత్తిడి, వేతనాలలో కోత మానుకోవాలన్నారు. ఇప్పటికే యాప్ మొరాయిస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఎన్నో అవస్థలు పడి పని పూర్తి చేస్తుంటే మరింతగా పనిభారం పెంచడం తగదన్నారు. వేతనాల కోత, మెమోల జారీతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, వి.హేమలత, జె.కాంచన, డి.మోహిని, పి.బాలేశ్వరి, ఎల్.దుర్గ పాల్గొన్నారు. -
మూడు రోజులకే మూలకు..?
జయపురం: ముఖ్యమంత్రి బస్సు సేవా పథకంలో భాగంగా మూడు రోజుల క్రితం ప్రవేశపెట్టిన 50 సీట్ల ఏసీ బస్సులు అప్పుడే మూలకు చేరాయి. ఈ బస్సుౖలు నడపడంపై రాష్ట్ర ప్రైవేట్ బస్సుల యాజమాన్య అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిందని, దీంతో తర్వాత ఉత్తర్వులు విడుదల చేసేవరకు బస్సులను నిలిపి వేయాలని ఒడిశా స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఓఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా జయపురం పాత బస్టాండ్‌లో 7 ఏసీ బస్సులు నిలిపివేశారు. గతంలో లక్ష్మి ఏసీ బస్సులు సెమిలిగుడ ప్రభుత్వ బస్టాండ్‌లో పడి ఉండేవి, అయితే ముఖ్యమంత్రి బస్సుసేవా పథకంలో వీటిని మూడు రోజుల క్రితం గుణుపూర్‌కు రెండు బస్సులు, జయపురం–కాశీపూర్, జయపురం– మల్కన్‌గిరి, జయపురం–కలహండి(కెటాగాం), జయపురం –కొటియా, జయపురం – భవాణీపట్నలకు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ మరలా నిలిపివేయడంతో సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
నేటినుంచి బ్యాడ్మింటన్ పోటీలు
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ అండర్–19 విభాగంగాలో బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని డీపీ అకాడమీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సంబంధిత ప్రతినిధి నిమయి చరణ దాస్ వెల్లడించారు. ఈ పోటీలలో 94 మంది బాల బాలికలు పాల్గొంటారన్నారు. 15 మంది పర్యవేక్షిస్తారన్నారు. పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రలో పలు ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లు, వారితో వచ్చిన సహాయకులకు వసతి, భోజన సౌకర్యాలు అకాడమి కల్పిస్తోందన్నారు. సమావేశంలో డీపీ అకాడమీ సభ్యులు దేవ దత్త దాస్, సుభ్రత కుమార్ పండ, గౌరీ పట్నాయక్ పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి
జయపురం: విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలని జయపురం బ్లాక్ ఎడ్యు కేషన్ అధికారి చందన కుమార్ నాయిక్ అన్నారు. విద్యార్థుల్లో నిఘూడమై ఉన్న ప్రతిభ ప్రతిభింబించేది ఉత్సవాల్లోనేనని.. అందుకే ప్రతి పాఠశాలలో వార్షికోత్సవాలు జరుపుతారన్నారు. స్థానిక గౌఢవీధి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని సబితా బెహర అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. విద్యార్థులు మనసు పెట్టి చదువుకోవాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలని ఉద్బోంధించారు. గౌరవ అతిథిగా అదనపు బీఈవో కై ళాస చంద్రశతపతి, సీఆర్సీసీ జ్యోతీ శంకర త్రిపాఠీ, జయపురం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు త్రినాథ్ సింగ్‌లాల్, సీనియర్ న్యాయవాది శశి పట్నాయక్, లక్ష్మీ కుమారి పట్నాయక్ పాల్గొన్నారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథులు చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. -
ఉగాది పోటీలు
ఉత్సాహంగారాయగడ: స్థానిక తేజస్వీ ఓపెన్ గ్రౌండ్లో రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో ఈ నెల 30, 31 తేదీల్లో ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం వివిధ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ ప్రముఖులు రాఘవ కుముంధాన్, గౌరవ అతిథిగా సంఘం నాయుడు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే ఈ వేడుకలు గత 12 సంవత్సరాలుగా రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరావు రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట నిర్వహిస్తున్నారని కుముంధాన్ అన్నారు. అంతా ఏకమై ఉగాది సంబరాలను ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ ఏడాది కూడా ఆయన నేతృత్వంలో కొనసాగుతున్న వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీలకు అనూహ్య స్పందన లభించిందని అన్నారు. మహిళల మధ్య ముగ్గులు, రంగోలీ పోటీల్లో ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారు. అలరించిన ముగ్గులు పోటీ.. తేజస్వీ ఓపెన్ గ్రౌండ్లో నిర్వహించిన ముగ్గులు, మెహేందీ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 91 మంది మహిళలు, చిన్నారులు తలపడ్డారు. నిర్వహకులే రంగులను ఉచితంగా సరఫరా చేశారు. రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆకృతులలో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. విజేతల వివరాలు.. ముగ్గుల పోటీల్లో మొదటి మూడుస్థానాల్లో బిజయ లక్ష్మి,, ఎం.మౌనిక, జె.గంగాలు గెలుచుకోగా.. భవానీ బిడిక, గాయత్రి, పి.వర్షాలు ప్రోత్సాహక బహుమతులు దక్కించుకున్నారు. అలాగే మెహేందీ పోటీల్లొ మొత్తం 76 మంది మహిళలు పాల్గొనగా వీరిలో ప్రథమ బహుమతిని సొఫియా బెహర, ద్వితీయ బహుమతిని రాధారాణి కౌసల్య, తృతీయ బహుమతిని పి.వర్షితలు గెలుపొందగా సంజు పాఢి, వనితా పట్నాయక్, జె.గంగలు ప్రొత్సాహక బహుమతులను గెలుచుకున్నారు. పోటీల్లో పాల్గొన్నవారందరికీ నిర్వాహకులు పార్టిసిపేషన్ బహుమతులను అందజేశారు. కమిటీ సభ్యులు సుజాత పాలొ, రోజా, షర్మిష్టా పాఢి పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు ఉగాది సంబరాల్లో బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కాంగ్రెస్ బల ప్రదర్శన
శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు నగదు : రూ. 5,86,369 బంగారం : 1 గ్రాము 200 మిల్లీ గ్రాములు వెండి : 98 గ్రాముల 250 మిల్లీ గ్రాములు – భువనేశ్వర్/పూరీకొత్త ఉత్తేజం శాసన సభలో దీర్ఘకాలంగా బలం దిగజార్చుకున్న కాంగ్రెస్ భావి ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు తాజా ఆందోళన దోహదపడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా 13.4 శాతానికి దిగజారి కేవలం 14 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఓట్ల వాటా పెంపొందించేందుకు పార్టీ కొన్ని అత్యవసర చర్యలతో వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తు కార్యకర్తల్లో ఉత్త ఉత్తేజం ప్రేరేపిస్తుందన్నారు. కాంగ్రెస్‌లో సప్తగిరి ఉలాకా, నబజ్యోతి పట్నాయక్, సాగర్ చరణ్ దాస్, సోఫియా ఫిరదౌస్, మంగు ఖిలాతో మరికొంత మంది యువ నాయకుల్లో నాయకత్వ నైపుణ్యాలకు రాష్ట్ర కాంగ్రెస్ పదును పెడుతుంది. భక్త చరణ్ దాస్ నేతృత్వంలో 2025 సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ శిబిరంలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ● మహిళల భద్రత నినాదంతో భారీ ఉద్యమం ● ఘంటానాదంతో పాదయాత్ర భువనేశ్వర్: రాష్ట్రంలో కాంగ్రెస్ తన ఉనికిని బలపరచుకునే దిశలో సరికొత్త పంథాలో బల ప్రదర్శన చేస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసన సభ ముట్టడి తొలి ఉద్యమంగా కనిపించింది. దీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ ఈ తరహాలో భారీ ఉద్యమానికి శంఖారావం చేయడం విశేషం. ప్రధానంగా భక్త చరణ్ దాస్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన నుంచి పీసీసీ కార్యాచరణ వాడీవేడిగా కొనసాగుతుంది. మహిళల భద్రత నినాదంతో శాసన సభ లోపల, బయట తీవ్ర స్థాయిలో విజృంభించి అలజడి రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకరు సురమా పాఢి సస్పెన్షన్ వేటు వేశారు. అంచెలంచెలుగా సభలో కాంగ్రెస్ సభ్యులు అందరిని సభా కార్యకలాపాల నుంచి దూరం చేశారు. సభలో కాంగ్రెస్ బలం 14 మంది సభ్యులు కాగా వీరందర్ని స్పీకరు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. త్వరలో సభలో బడ్జెటు సమావేశాలు ముగియనున్నాయి. ఈ లోగా కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు తొలగించే అవకాశాలు కనిపించడం లేదు. 14 మంది సభ్యుల వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యల కింద స్పీకరు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో సభ కాంగ్రెస్ శూన్యంగా మారింది. ఈ చర్యని అప్రజాస్వామిక చర్యగా ప్రభావిత కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్టీ సభ్యుల సస్పెన్షన్ వ్యతిరేకంగా చేపట్టిన శాసన సభ ముట్టడి ఆందోళన తార స్థాయికి చేరింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హోరాహోరీ పోరు చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై వేరొకరు రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాత్రింబవళ్లు నిరసన సందర్భంగా పోలీసులు రాష్ట్ర శాసన సభ లోనికి ప్రవేశించడం రాష్ట్ర శాసన సభ చరిత్రలో కళంకం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరమైన కట్టుబాట్లను అధిగమించి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు మారణాంతక దాడికి పాల్పడ్డారని రాష్ట్ర పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం తథ్యమని పోలీసులు బాహాటంగా హెచ్చరించారు. స్థానిక క్యాపిటల్ పోలీస్ ఠాణాలో కాంగ్రెస్ ఆందోళనకారుల వ్యతిరేకంగా 3 వేర్వేరు ఫిర్యాదులు (ఎఫ్ఐఆర్) శుక్ర వారం నమోదు చేశారు. ఈ నెల 26న శాసన సభ తూర్పు ప్రవేశ మార్గం ఆవరణలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన వ్యతిరేకంగా ఒక కేసు నమోదు కాగా ఈ నెల 27న శాసన సభ ముట్టడి పురస్కరించుకుని పోలీసు వాహనాలకు నిప్పు అంటించిన ఆరోపణ కింద మరో కేసు నమోదు చేశారు. శాసన సభ ముట్టడి ఆందోళనలో శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఆరోపణ కింద మూడో కేసు నమోదు చేశారు. ఈ చర్యని రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుడు భక్త చరణ్ దాస్ పక్షపాత చర్యగా వ్యాఖ్యానించారు. పోలీసుల ఆరోపణ ప్రకారం రాళ్లు రువ్వి పోలీసుల్ని గాయపరచిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరని ఆయన స్పష్టం చేశారు. పలువురు కాంగ్రెసేతర వర్గాలు ఈ ఆందోళనలో కలిసిపోయిన విషయాన్ని పోలీసు వర్గాలు విస్మరించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కార్యకర్తల వ్యతిరేకంగా కేసులు బనాయించడం అన్యాయమని పేర్కొన్నారు. పోలీసుల చర్యలతో వెనుకంజ వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిర్విరామంగా కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు. ఆయన పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల స్వల్ప వ్యవధిలో శాసన సభ ముట్టడి ఆందోళన చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపారు. 2000 నుండి 2024 వరకు వరుసగా ఆరు ఎన్నికల్లో కాంగ్రెస్ నిరుత్సాహ ఫలితాలతో కార్యకర్తల వర్గం నిరుత్సాహం చెందింది. తాజా ఆందోళనతో కార్యకర్తల్లో కొత్త చురుకుదనంతో పోరాట స్ఫూర్తిని బలోపేతం చేసినట్లు రాష్ట్ర పీసీసీ కొత్త కార్యవర్గం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తుంది. ఉనికిని బలపరచుకునే దిశలో కాంగ్రెస్ నిరవధికంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. నాటక దినోత్సవం పర్లాకిమిడిలో నాటక దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. –IIలోuకొనసాగుతున్న నిరసన ఒక వైపు శాసన సభలో ప్రవేశం లేకుండా సస్పెన్షన్‌కు గురైన సభ్యులు శుక్రవారం నగరంలో దేవాలయాలు సందర్శించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారుకు మహా దేవుడు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ భవన్ నుంచి ఘంటానాదంతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పాదయాత్ర నిర్వహించారు. న్యూస్‌రీల్ -
మహిళా కళాశాలలో న్యాయ అవగాహన శిబిరం
జయపురం: స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు శుక్రవారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. శిబిరంలో జిల్లా న్యాయ సేవా ప్రధీకరణ కార్యదర్శి, లోక్ అదాలత్ శాశ్వత విచారపతి సుమన్ జెన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగాలలో, ఇతర పనులలో ఉండే మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు పైన,వాటి నివారణ చట్టాలపైన వివరించారు. బాధిత మహిళలకు చట్టపరిధిలో లభించే సహాయాలు వివరించారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో లైంగిక దాడుల నివారణ, వాటి పరిష్కారం తదితర విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిలర్ కె.దివాకర రావు, హరిశ్చంధ్ర ముదులి, అసిస్టెంట్ డిప్యూటీ టీగల్ ఆండ్ డిఫెన్స్ కౌన్సిలర్ గీతాంజళీ ధల్, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ వివేకానం సున, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డొంబురు దొర దాస్, డాక్టర్ దిగాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ గాంధీతో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క భేటీ
కొరాపుట్: ఒడిశా రాష్ట్ర పరిస్థితులను రాహుల్ గాంధీకి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క వివరించారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌తో ఉల్క భేటీ అయ్యారు. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. గత 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ క్యాడర్ భారీస్థాయిలో విరుచుకుపడడంపై బీజేపీ ప్రభుత్వం వణుకు పుట్టించిందన్నారు. మహిళలపై అత్యాచారాలు, అసెంబ్లీలో కాంగ్రెస్ పోరాటం, అసెంబ్లీ ముట్టడి, నెత్తురు చిందించిన కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం వివరించారు.విజిలెన్స్ వలలో అంగన్వాడీ సూపర్ వైజర్ కొరాపుట్: విజిలెన్స్ వలకు అంగన్వాడీ సూపర్ వైజర్ చిక్కారు. శుక్రవారం కొరాపుట్ విజిలెన్స్ విభాగం ఈ వివరాలు ప్రకటించింది. జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి బూర్జ గ్రామంలో అంగన్ వాడీ సూపర్ వైజర్ రేణుక పట్నాయిక్ రు.50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. తన పరిధిలో పని చేస్తున్న అంగన్ వాడీ వర్కర్ డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో అంగన్వాడీ వర్కర్ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించి పట్టించారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కాశీనగర్ రైల్వేట్రాక్ వద్ద మృతదేహం పర్లాకిమిడి: కాశీనగర్ రైల్వేట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఒకరు రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీసు అధికారులు తెలియజేశారు. మృతుడు కాశీనగర్ సమితి ఖండవ పంచాయతీలో పురుటిగుడ గ్రామానికి చెందిన మోహన రావు (40)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం వేకువజామున గుణుపురం నుంచి పూరీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుబండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల సమాచారం. కాశీనగర్‌లో శివ మోటారు గ్యారేజి బావమరిది అయిన మోహనరావుకు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు వారి బంధువులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు కేసును యూడీ కింద నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం పర్లాకిమిడి ప్రభుత్వ మెడికల్‌కు తరలించారు. బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద మృతి పర్లాకిమిడి: గజపతి జిలా మోహన బ్లాక్ చంద్రగిరిలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి తన నివాస గృహంలో అనుమానాస్పదంగా మృతిచెందినట్టు చంద్రగిరి పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడు భువనేశ్వర్‌కు చెందిన ప్రకాష్ కుమార్ మహారాణా (33)గా పోలీసులు గుర్తించారు. ఆయన బ్యాంకుకు శుక్రవారం విధులకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు బ్యాంకు మేనేజరుకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన నివాస గృహానికి వెళ్లి ఫోన్ చేసినా రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాష్ కుమార్ మహారాణా తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి మాసంలో ప్రకాష్ కుమార్ చంద్రగిరి బ్యాంకులో జాయిన్ అయ్యాడు. మృతుని బంధువులకు పోలీసులు సమాచారం అందజేసి, శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసును చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీతభత్యాల పెంపుదలకు ఎమ్మెల్యేల డిమాండ్
భువనేశ్వర్: జీతభత్యాలు పెంచాలని రాష్ట్ర శాసన సభ సభ్యులు డిమాండ్ చేశారు. భారత పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పింఛన్ పెంచారు. ఈ తరహాలో రాష్ట్రంలో సిటింగు ఎమ్మెల్యేల జీతభత్యాలు, మాజీల పింఛన్ పెంచాలని జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించారు. శుక్రవారం జీరో అవర్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బిజూ జనతా దళ్ శాసన సభలో ఎమ్మెల్యేల జీతభత్యాలతో మాజీ శాసన సభ్యుల ఫించను పెంచాలని డిమాండ్ చేశారు. సభలో ఈ అంశంపై ప్రస్తావన పురస్కరించుకుని ద్రవ్యోల్బణం, అధిక వైద్య ఖర్చుల దృష్ట్యా జీతం మరియు ఫించను పెంచడం అవసరమని విపక్ష బీజేడీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ్యుల జీతభత్యాలు, పింఛన్ పెంపుదల నేపథ్యంలో ఉదొలా నియోజక వర్గం ఎమ్మెల్యే భాస్కర్ మఢెయి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల జీతం, మాజీల పింఛన్ సవరణకు సిఫార్సులతో ఈ కమిటి తన నివేదికను సమర్పించిందని ప్రమీలా మల్లిక్ గుర్తు చేశారు. కమిటీ సిఫార్సులను ఆమోదించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేల జీతాలను చివరిసారిగా 2017 సంవత్సరంలో పెంచారు. దీర్ఘకాలంగా వీరి జీతభత్యాలు పెరుగుదలకు నోచుకోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల జీతభత్యాలతో మాజీల ఫించను పెంచడం అనివార్యంగా పేర్కొన్నారు. ప్రతిపక్ష డిప్యూటీ చీఫ్ విప్ ప్రతాప్ కేశరి దేబ్ కూడా ఇదే తరహాలో ఎమ్మెల్యేల జీతం, పింఛను పెంపును సిఫార్సు చేసే కమిటీ నివేదికను అమలు చేయడానికి ప్రభుత్వం త్వరిత చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దంపతుల ఆత్మహత్య కొరాపుట్: ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడంతో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం పోలీసుస్టేషన్ పరిధి జెట్టియా గ్రామానికి చెందిన దినొ జాని (20), జొరిగాం పోలీసుస్టేషన్ పరిధి డొక్నికి గ్రామానికి చెందిన పుర్ణిమా బేగ్(19)లు నెల రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన దంపతులు డాబుగాంలోని వారి నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. లైంగికదాడిపై కేసు నమోదు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో గత శివరాత్రి ఉత్సవాల మరుసటి రోజు ఓ 14 ఏళ్ల బాలికను నలుగురు యువకులు ఇంటి ముందు నుంచి బైక్‌పై కిడ్నాప్ చేసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు గురువారం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కోరుకొండ ఐఐసీ హిమాంశు శేఖర్ బారిక్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ నలుగురు యువకులు పరారీలో ఉన్నారని గుర్తించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
● ఘనంగా నాటక దినోత్సవాలు
జయపురం: స్థానిక గీతాంజలి కల్యాణ మండప ప్రాంగణంలో కొరాపుటియ కళలు, కళాకార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నాటక దినోత్సవాలు నిర్వహించారు. ప్రముఖ నాటక కళాకారుడు గోవింద చంద్ర సాహు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ముందుగా ఇటీవల అకాల మరణం చెందిన బాల కళాకారిణి సంతోషిణీ తరాశియకు నివాళులర్పించారు. జయపురం నాటక గత చరిత్ర, నేటి పరిస్థితి, భవిష్యత్‌లో నాటక కళను విస్తరింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కళాకారులు సత్య మిశ్ర, గోపాల కృష్ణ సామంతరాయ్, సుధాకర పట్నాయిక్, రవీంద్ర పాత్రోలు మాట్లాడుతూ.. నాటక ప్రదర్శనలు సమాజ చైతన్యానికి దోహదపడతాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సంగీత కళాకారుడు ధిరెన్ మోహన్ పట్నాయక్, కళాకారులు మనోజ్ కుమార్ పాత్రో, జయపురం ఆకాశవాణి విశ్రాంత అధికారి నరేంద్రనాథ్ పట్నాయక్, జయంత శాంత, గుప్తేశ్వర పాణిగ్రహి, రఘునాథ్ బిశ్వాల్, సత్యనారాయణ మిశ్ర తదితరులు పాల్గొన్నారు. -
గోహత్య నిషేధం బిల్లు అమలు చేయాలని డిమాండ్
పర్లాకిమిడి: ఒడిశా గోహాత్య నిషేధం బిల్లు 2024ను అమలు చేయాలని, గోవుల అక్రమరవాణా అరికట్టాలని, గోశాలలు నిర్మించాలని విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్ శ్రేణులు కలెక్టరేట్ ఆవరణలో నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్‌కు ఉద్దేశించి రాసిన వినతిని కలెక్టర్ బిజయకుమార్ దాస్‌కు జిల్లా గోరక్షణ పర్యవేక్షకులు లోకనాథ్ మిశ్రా, పరలా ధర్మ ప్రచారక ప్రేమీ సత్యనారాయణ సాహు, వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షులు కై లాష్ చంద్ర గౌడో అందజేశారు. ఈ ఆందోళనలో వి.హెచ్.పి. కోశాధికారి హారిమోహాన్ పట్నాయిక్, సౌమ్యరంజన్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు
● వెల్ఫేర్డేలో విజ్ఙాపనలు స్వీకరించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డేను ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ విజ్ఞాపనలు స్వీకరించి చర్యలు చేపట్టారు. లివిరి సమీపంలో ఏనుగుల గుంపుభామిని: మండలంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం మండలంలోని లివిరి పంట పొలాల్లో నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు నాఽశనం చేస్తున్నాయి. వంఽశదార నదీ తీరం వెంబడి ఏనుగుల గుంపు ప్రయాణం కొనసాగుతోంది. భామిని గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశిస్తుందని మండల కేంద్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఏనుగులు గుంపు పంటలన్నీ పాడుచేస్తున్నప్పటికీ అధికార కూటమి నాయకులు ఇచ్చిన హామీ మరిచి మౌనం వహించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిచ్చి కుక్క కరిచి 9 మందికి గాయాలువీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని బార్నాలవీధి రోడ్డులో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చిన 9 మందిపై పిచ్చి కుక్క దాడి చేయడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కోట శ్రీరాములు, జి.నాగరాజు, ఎం.ధరణి, సుజాత, జి.పార్వతి, పి.రామిశెట్టి, కె.గంగులు, బి.ధర్మారావు, కె.రవి ఉన్నారు. వారందరికీ వీరఘట్టం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. వారిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు బైక్‌లు ఢీకొని యువకుడు మృతి వేపాడ: మండలంలోని కొత్త బొద్దాం జంక్షన్లో గురువారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు ద్విచక్రవాహనం వెళ్తుండగా ఎల్.కోట నుంచి ఎస్.కోట వైపు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం కొత్త బొద్దాం జంక్షన్ దగ్గర ఢీకొన్నాయి. దీంతో ప్రమాదంలో రెండు వాహానాలపై ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న వాహనచోదకుడు బసవబోయిన కార్తీక్ (19) మృతిచెందాడు. ఎస్.కోట కోటవీధికి చెందిన కార్తీక్‌కు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు. 30, 31 తేదీల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు పార్వతీపురంటౌన్: ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్ పండగ సెలవురోజుల్లో జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో యథావిధిగా సేవలందిస్తామని జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మి పట్నాయక్ తెలిపారు. జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. సెలవు రోజున కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసినందుకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయమని తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి యూఎల్ఆర్ స్లాట్ బుకింగ్ అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. -
శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి విజయనగరం లీగల్: శాశ్వత లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే ఇరుపార్టీలకు మేలు చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో పాలీగల్ వలంటీర్స్‌కు, శాశ్వత లోక్ అదాలత్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి జి.దుర్గయ్య మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్‌లో వ్యాజ్యం వేయడం వల్ల ఎటువంటి కోర్టు ఫీజు ఉండదన్నారు. దీనిమీద తీర్పు చెప్పనున్నారని, ఇక్కడ తీర్పు చెప్పిన మీదట దానికి ఆపీల్ ఉండదని స్పష్టం చేశారు. హాజరైన పారా లీగల్ వలంటీర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వలంటీర్స్ అందరూ శాశ్వత లోక్ అదాలత్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, శాశ్వత లోక్ అదాలత్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. -
ఇదీ యంత్రాంగం తీరు..!
● కూటమి నేతల సిఫారసు ఉంటేనే వ్యవసాయ యంత్రాల మంజూరు ● కూటమి ఆదేశాలు అధికారులు అమలు చేస్తున్నారనే ఆరోపణలువిజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రంధి దేముడు. ఈయనది గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామం. వ్యవసాయ యంత్ర పనిముట్లు రాయితీపై ఇస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది చెప్పడంతో దుక్కిసెట్టు కోసం దరఖాస్తు చేశాడు. దుక్కిసెట్టు నిమిత్తం రైతు కట్టాల్సిన వాటాను చెల్లించడానికి రైతు సేవా కేంద్రం సిబ్బందిని అడిగితే మీకు దుక్కి సెట్టు మంజూరు చేయలేం అని తేల్చి చెప్పడంతో మిన్నుకుండిపోయాడు. ఈ పరిస్థితి ఈ ఒక్క రైతుదేకాదు. జిల్లాలోని అనేక మంది రైతులది. అందరికీ అన్నం పెట్టే రైతులతో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసిన రైతులు ఏపార్టీ వారా? అని అరా తీస్తున్నారు. కూటమి పార్టీకి చెందిన రైతులైతే వారికి యంత్ర పరికరాల మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తటస్థంగా ఉండే రైతులైతే వారికి యంత్ర పరికరాలు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన నేతల ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీకు తెలియంది ఏం ఉంది? అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయాల్సిందే కదా అంటూ వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి వాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతల వ్యవహార శైలి తెలిసిన చాలామంది రైతులు యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేసినా కూటమి నేతలు మంజూరు కానివ్వరనేది రైతుల భావన. 456 మంది దరఖాస్తు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు జిల్లావ్యాపంగా 456 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటికి సంబంధించి కూటమి నేతలు చెప్పి న లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేసిన ట్లు తెలిసింది. 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. దుక్కి సెట్లు, మోటార్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్వీటర్స్, రోటోవీడర్స్ యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీకి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.2.50 నిధులు కేటా యించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారుదరఖాస్తులు పరిశీలించి మంజూరు జిల్లాలో యంత్ర పరికరాల కోసం 456 మంది దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించి యంత్ర పరికరాలు మంజూరు చేయనున్నాం. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని సీహెచ్ బొడ్డవలస పంచాయతీ పరిధి కేశాయవలస గిరిజన గ్రామంలో టేకు మొక్కలకు నీళ్లుపోస్తున్న వాటర్ ట్యాంకు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాశీపేట గ్రామానికి చెందిన పెదిరెడ్డి పోలిరాజు(58)మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కేశాయవలస గ్రామానికి చెందిన కొండగొర్రె నీలమ్మ పొలంలో టేకు మొక్కలకు నీళ్లు పోసేందుకు వాటర్ట్యాంకర్తో వెళ్తున్న పోలిరాజు పొలంలో ఎత్తుపల్లాలను గమనించకపోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో పోలిరాజు ట్రాక్టర్ కింద పడగా అక్కడికక్కడే మృతిచెందాడని సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. మృతుడి కుమారుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించామని సీఐ తెలిపారు.మృతుడు పోలిరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి..భామిని: మండలం పసుకుడికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మువ్వల జయరాం(18) శుక్రవారం శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జయరాం ఇంటర్మీడియట్ సెకెండియర్ పరీక్షలు భామినిలో రాశాడు. పరీక్షల అనంతరం సరదాగా గడుపుతున్న జయరాం ఈ నెల 2న పసుకుడి నుంచి లివిరి డోలోత్సవ యాత్రకు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంజరిగి తీవ్రగాయాలపాలయ్యడు. వెంటనే 108 అంబులెన్సు లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించి శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు ఆద్వర్యంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. పసుకుడిలో జరిగిన అంతిమ సంస్కారంలో తోటి విద్యార్థులు, టీచర్లు, బంధువులు పాల్గొని జయరాంకు ఘనంగా నివాళులు అర్పించారు. అనుమానాస్పద స్థితిలో యువతి..సాలూరు రూరల్: మండలంలోని మర్రివానివలస గ్రామానికి చెందిన వాకాటి ఐశ్వర్య (20) చీపురువలస గ్రామసమీపంలో మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం విశాఖపట్నంలోని ఒక బట్టల షాపులో పనిచేస్తున్న ఆమె ఇటీవల ఇంటికి వచ్చి రెండురోజుల క్రితం పనికి వెళ్లింది. శుక్రవారం చీపురువలస గ్రామసమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్షయ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే జిల్లా టాప్
విజయనగరం ఫోర్ట్: క్షయవ్యాధి నియంత్రణలో విజయనగరం జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. క్షయ వ్యాధి నియంత్రణ ప్రత్యేక వందరోజుల ఉద్యమంలో దేశంలోనే అత్యధిక క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన జిల్లాగా గుర్తింపు పొందింది. క్షయవ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని 347 జిల్లాల్లో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా వంద రోజుల టీబీ నియంత్రణ కార్యక్రమానికి ఎంపికై ంది. దీనిలో భాగంగా క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, క్షయవ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టారు. వంద రోజుల కార్యక్రమానికి ఎంపికై న 347 జిల్లాల అన్నింటిలో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 45,195 క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ జేపీ నడ్డా నుంచి క్షయ నియంత్రణపై విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర బృందం ప్రతినిధి పి.రమేష్ అవార్డు స్వీకరించారని తెలిపారు. ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి, క్షయ నివారణ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. వైద్యారోగ్యశాఖను అభినందించిన కలెక్టర్ అంబేడ్కర్ -
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమ య్యాయి. ఈ మేరకు అధ్యక్షుడిగా నల్ల శ్రీనివాసరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బి.సత్యనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు పార్వతీపురం బార్ అసోసియేషన్‌కు 2025–26 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 17 నామినేషన్ వేసిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో ఉపాధ్యక్షుడిగా సూర్ల కృష్ణ, జనరల్ సెక్రటరీగా నీలం రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా ఎంవీ వెంకట రాఘవేంద్ర, కోశాధికారిగా మంత్ర పూడి వెంటకరమణలను ఎన్నుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. విజయనగరంలో.. విజయనగరం లీగల్: విజయనగరం జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. సంఘం అధ్యక్షుడిగా కలిశెట్టి రవిబాబు, సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామరాజు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రవిబాబు 58 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి ధవళ వెంకట రావుపై విజయం సాధించారు. కాగా సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామ రాజు తన ప్రత్యర్థి సారిక సతీష్‌పై కేవలం నాలుగు ఓట్లు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శిగా నలితం సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.శివప్రసాద్, కోశాధికారిగా కళ్ళెంపూడి వెంకట్రావు, లైబ్రరీ కార్యదర్శిగా తాడిరాజు, స్పోర్ట్స్ సెక్రటరీగా చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్లుగా తెర్లాం యువకులు
తెర్లాం: జిల్లాలోని తెర్లాం మండలం, తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత జ్యోతిస్వరూప్, తెర్లాం మండల కేంద్రానికి చెందిన చిప్పాడ హరీష్‌లు ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. ఆ యువకుల నేపథ్యం ఇలా ఉంది. చింత జ్యోతిస్వరూప్:. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత శంకరరావు, అరుణల కుమారుడు. విశాఖపట్నంలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో 390 మార్కులకుగాను 350 మార్కులు సాధించి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 836వ ర్యాంక్ సాధించి సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. జ్యోతిస్వరూప్ తండ్రి శంకరరావు విశాఖపట్నంలోని ఓ కోచింగ్ సెంటర్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. కుమారుడు జ్యోతిస్వరూప్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిప్పాడ హరీష్.. తెర్లాం గ్రామానికి చెందిన చిప్పాడ రమణ, మంగరత్నంల కుమారుడు. హరీష్ ప్రస్తుతం చైన్నెలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్‌గా ఏడాదిన్నగా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ ప్రవేశ పరీక్షకు హాజరై 390మార్కులకుగాను 346మార్కులు సాధించి ఆలిండియా ఓబీసీ కేటగిరీలో 1602 ర్యాంక్ కై వసం చేసుకుని సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. హరీష్ తండ్రి రమణ మండలంలోని పణుకువలస ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి మంగరత్నం తెర్లాంలోని శ్రీవేంకటేశ్వర విద్యాసంస్థల కరస్పాండెంట్. కుమారుడు హరీష్ సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. చిన్నయ్యపేటకు చెందిన జ్యోతిస్వరూప్ తెర్లాంకు చెందిన హరీష్ ఎంపిక -
అడుగంటిన మహేంద్ర తనయ
పర్లాకిమిడి: ప్రచండ ఎండలకు మహేంద్ర తనయలో నీరు అడుగంటింది. పర్లాకిమిడి, పాతపట్నం సరిహద్దుల్లో నీరు కనుమరుగైంది. పర్లాకిమిడి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు రోజుకు 12 మిలియన్ గ్యాలన్లు అవసరం వుండగా మహేంద్రతనయ నది నుంచి పంపుసెట్ల ద్వారా నీటిని తోడి 7 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని మాత్రమే ప్రజాఆరోగ్యశాఖ అందించగలుగుతోంది. గత ఏడు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు.తాగునీట సమస్యపై ఇటీవలే కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. -
అందరి సహకారంతోనే ఉగాది ఉత్సవాలు
రాయగడ: రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట గత 12 ఏళ్లుగా నిర్వహిస్తున్న వేడుకలను ఈసారి కూడా అందరి సహకారంతో ఘనంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు అన్నారు. స్థానిక తేజస్వీ ఒపెన్ గ్రౌండ్లో ఈ నెల 30, 31వ తేదీల్లొ జరగనున్న ఉగాది వేడుకల నిర్వహణకు సంబంధించి గురువారం రాణిగుడఫారంలో గల ఆయన స్వగృహంలో పట్టణ ప్రముఖులతో సమావేశమయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ ఉత్సవాలను భావితరాలు కూడా నిర్వహించేలా మనం ప్రోత్సాహించాలన్నారు. గత మూడేళ్లుగా ఈ ఉత్సవాలు రెండు వేదికల్లో నిర్వహించడంతో ప్రజలు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎన్నిచోట్ల ఉగాది వేడుకలు జరుగుతున్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలగకుండా చూడాలన్నారు. చందాల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేపట్టవద్దన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఉగాది వేడుకలకు సంబంధించి నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలను ప్రకటించారు. ఆదివారం స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి నిర్వహించనన్ను కలశ యాత్ర వివరాలను వివరించారు. చంద్రమౌళి కుముందాన్, రాఘవ కుముందాన్, ఎస్.జగన్నాథరావు, టి.త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.63 లక్షలు దోచేసి..
ఏటీఎం కార్డు మార్చేసి.. శ్రీకాకుళం క్రైమ్ : ఓ రిటైర్డ్ అధికారి వద్ద ఏటీఎం కార్డు మార్చేసి రూ. 1,63,900 కొట్టేసిన వైనం జిల్లా కేంద్రంలోని అరసవల్లి మిల్లు కూడలి సమీప ఎస్బీఐ ఏటీఎంలో చోటు చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం. హరికృష్ణ, బాధితుడు తెలిపిన వివరా ల ప్రకారం.. అరసవల్లి మిల్లు జంక్షన్ సమీపంలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు ఓ రిటైర్డ్ అధికారి వెళ్లి రూ.9 వేలు విత్‌డ్రా చేశారు. కార్డును మిషన్ నుంచి తీయకుండానే పక్కనే ఆ డబ్బులు లెక్కపెడుతుండగా వెనుకగా నిల్చొన్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. క్షణాల్లో అధికారి కార్డు తీసేసి తన కార్డును మిషన్‌లో పెట్టేశాడు. సార్ మీ కార్డు మిషన్‌లో ఉంచేశారు.. తీయండి అంటూ సాయం చేసినట్లు నటించి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడికి రెండు రోజుల తర్వాత ఎస్బీఐ యోనోయాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.1,63,900 ఎవరో ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసినట్లు అధికారి గ్రహించారు. వెంటనే తన వద్దనున్న ఏటీఎం కార్డు తీసుకెళ్లి తనిఖీ చేయ గా బ్యాలెన్స్ తక్కువగా కనిపించడంతో వెంటనే సంబంధిత మెయిన్ బ్రాంచి (ఎస్బీఐ) అధికారులను కలువగా కార్డును బ్లాక్ చేసి స్టేట్మెంట్ తీసి చూపించి పోలీసులను ఆశ్రయించాలన్నారు. పలుచోట్ల తీసి.. చివరికి ఒడిశాలో.. స్టేట్మెంట్లో మోసం చేసిన వ్యక్తి ముందుగా విశాఖపట్నం శ్రీ సంఘవి జ్యూయలర్ మాల్ ఏటీఎం వద్ద రూ.75 వేలు, అశీల్‌మెట్ట ఏటీఎం వద్ద రూ.10 వేలు, అదే చోట రెండుసార్లు రూ.10 వేలు, మరోసారి రూ.వెయ్యి తీశాడు. అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్లి బరంపురం సిటీ హాస్పిటల్ రోడ్డులో రూ.10 వేలు, అదేచోట మూడుసార్లు రూ. 10 వేలు చొప్పున, చివరికి గజపతి జిల్లా సూర్యా హాల్‌మార్క్ వద్ద రూ.17,900 తీశాడు. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి సింగిపురం గ్రామం వద్ద ఒడిశా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. కటక్ నుంచి గుణుపురం వెళ్తున్న బస్సు సింగిపురం గ్రామం వద్ద ఉదయం 4 గంటల సమయంలో అదుపు తప్పింది. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులను పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గంగా జలంతో బీజేడీ నిరసన భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభలో విపక్ష బిజూ జనతా దళ్ సభ్యులు గంగాజలంతో నిరసన తెలిపారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ సభ్యుల అప్రజాస్వామిక చర్యలతో సభా ప్రాంగణం అపవిత్రం అయిందని మండిపడ్డారు. సభని పవిత్రంగా పునరుజ్జీవం పోసేందుకు గంగా జలంతో శుద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గురువారం సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రదర్శన చోటు చేసుకుంది. బీజేడీ సభ్యులు ఇత్తడి కలశాలతో నీటిని తీసుకుని సభలోకి ప్రవేశించారు. సభలో నలువైపులా పవిత్ర జలాన్ని చల్లుతూ విభిన్న రీతిలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా స్పీకర్ సురమా పాఢి జోక్యం చేసుకొని శాసన సభ్యులు కలశాలను తీసుకొని సబ్ లోపలికి రావద్దని వారించారు. దీంతో సభ వెలుపల తమ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. పాత్రికేయుడికి గాయాలు భువనేశ్వర్: కాంగ్రెస్ కార్యకర్తల రాష్ట్ర శాసనసభ ముట్టడి ఆందోళన సందర్భంగా ఓ పాత్రికేయుడు గాయపడ్డాడు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ కవరేజీ చేస్తుండగా స్థానిక ప్రైవేటు టీవీ ఛానెల్ పాత్రికేయుడు చిక్కుకున్నాడు. గాయాలు కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 29లోగా నవోదయ విద్యార్థులు రిపోర్టు చేయాలి సరుబుజ్జిలి: జవహర్ నవోదయ ఫలితాలు విడులై న నేపథ్యంలో ఎంపికై న విద్యార్థులు ఈ నెల 29 లో గా ధ్రువపత్రాలను వెన్నెలవలస నవోదయ విద్యాలయానికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ డి.పరశురామయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకట న విడుదల చేశారు. కార్యాలయం పనివేళల్లో మాత్రమే సంప్రదించాలని పేర్కొన్నారు. పూరిల్లు దగ్ధం ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదుపురంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. కార్జివీధికి చెందిన యర్రమ్మ కుటుంబ సభ్యులతో కలిసి తన పూరింటిలో నిద్రపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోడలు శేషమ్మ మేల్కొని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి బయటకు పరుగులు తీశారు. అగ్ని కీలలు ఎగసిపడటంతో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నర్తు ప్రేమ్‌కుమార్ స్పందించి స్థానిక యువకుల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు రెండు లక్షల రూపాయల సామగ్రి, రూ.30వేలు నగదు కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గంజాయితో మహిళ అరెస్టు ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి తరలిస్తున్న మహిళను గురువా రం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ మొబైల్ సీఐ జి.వి.రమణ తెలిపారు. శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రంజువాలిక్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ చేయగా 10.3 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీల్లో సిబ్బంది విఠలేశ్వరరా వు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఊపిరి తీసుకున్న అన్న
కొనఊపిరితో తమ్ముడు.. ● వ్యాపారంలో నష్టాలు రావడంతో యాసిడ్ తాగేసిన తమ్ముడు ● బతకడం కష్టమన్న వైద్యులు ● మనస్థాపంతో ఉరి వేసుకున్న అన్నయ్య ● అలుదులో విషాదఛాయలు శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి బయట గదిలో ఓ వ్యక్తి గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన శెట్టిసూరి, ఉమామహేశ్వరావులు అన్నదమ్ములు. వీరిద్దరూ కలిసి గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం.. నష్టాలు రావడంతో కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల కిందట తమ్ముడు ఉమామహేశ్వరరావు తీవ్ర ఒత్తిడికి గురై యాసిడ్ తాగేశాడు. వెంటనే బాధితుడిని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. బతకడం కష్టమేనని వైద్యులు చెప్పడంతో మనస్థాపానికి గురై అన్నయ్య శెట్టి సూరి(40) ఆసుపత్రి బయట ఓ రూమును అద్దెకు తీసుకొని గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్‌కు వెళ్లిన సూరి ఎంతకూ తిరిగి రాకపోవడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బంధువులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. విషయాన్ని రూరల్ పోలీసులకు తెలియజేశారు. సూరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. -
పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తాం
పర్లాకిమిడి: దివ్యాంగులు పరిశ్రమల స్థాపనకు అనేక పథకాలు ఉన్నాయని, ఎవ్వరూ దరఖాస్తు చేసుకోవడం లేదని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సునరాం సింగ్ అన్నారు. గురువారం స్థానిక పాతపట్నం రోడ్డు సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగులకు జీవనోపాధి, ఉపాధి కల్పనపై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో మనోస్థైర్యం కల్పించి, వారికి పారాశ్రామిక సామర్థ్యం కల్పించే దిశగా సమర్థ్ దివ్యాంగుల సంస్థ పనిచేయాలన్నారు. గ్రామీణ ఉద్యోగ్ శిక్షణా సంస్థ జీవన్ దాస్, సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజు, జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ జీవన్ దాస్ హాజరయ్యారు. జిల్లాలో సమితి స్థాయిలో రాయగడలో జరిగిన ఉద్యోగ మేళాకు అర్హులైన దివ్యాంగులకు అవకాశం అధికారులు కల్పించలేదని సమర్థ్ దివ్యాంగుల సంస్థ కార్యదిర్శి సంతోష్ మహారాణా అన్నారు. ఇకపై జాబ్ మేళాలో చదువుకున్న దివ్యాంగులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, ఉపాధి కల్పించేవిధంగా ఏర్పాటు చేస్తామని సునారాం సింగ్ అన్నారు. జిల్లా పరిశ్రామిక శాఖ అధికారి సునారాం సింగ్ -
వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణ వెనక్కి తీసుకోవాలి
● కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు కరీం విజయనగరం ఫోర్ట్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వక్ఫబోర్డ్ చట్టాల సవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖబరస్థాన్ భూములు లాక్కునే ప్రయత్నంలో భాగమే చట్టసవరణ చేయడమని ఆరోపించారు. చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు టీడీపీ సెక్యులర్ పార్టీ అంటారని, వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లును ఆయన వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్కే. సమీర్, ఎ.రహమాన్, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాననెల్లిమర్ల రూరల్: వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాన శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నెల్లిమర్ల మండలంలోని సీతారామునిపేట గ్రామానికి చెందిన ఆయన గతంలో టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికి కృతజ్నతలు తెలిపారు. -
విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ ప్రత్యేక శిక్షణ
విజయనగరం క్రైమ్: ఆపద సమయంలో ఉన్న మహిళలు, విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ ఇస్తాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆత్మరక్షణకు అవసరమైన మెలకువలను శక్తి టీమ్స్ నేర్పుతాయన్నారు. వారిలో చైతన్యం నింపుతూ, ఆపద సమయాల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత పొందేందుకుఈ ‘శక్తి టీమ్స్‘ చర్యలు చేపడతాయని చెప్పారు. ఈ మేరకు శక్తి టీమ్స్ కళాశాలలు, పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్ధినులతో మమేకమవుతాయన్నారు. ఏదైనా ఆపద సమయం ఏర్పడినపుడు, మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన జరిగినప్పుడు భయపడకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మీ రక్షణ కోసం శక్తి టీమ్స్ పని చేస్తాయని దీంతో పాటు డయల్ 112,లేదా 100 నంబర్లకు కాల్ చేసి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. -
పోలీసుల పల్లెనిద్ర
● గ్రామస్తులతో మీతోనే మేము అంటున్న సీఐలు, ఎస్సైలు విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెల్లో నిద్ర చేసి మీతోనే మేము అని పల్లె వాసులకు భరోసా కల్పించారు. ఈ విధంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను విని, క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నారు. తద్వారా పల్లెల్లో స్థానికులతో మమేకమవడమే కాకుండా ఆయా గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పల్లెనిద్రతో ఓ కన్నేశారు. అలాగే గ్రామంలోకి వెళ్లి రాత్రి పడుకునే ముందు ఒకసారి గ్రామస్తులతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యావ్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. దీనిపై ఎస్పీ వకుల్ జిందల్ గురువారం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, శాంతిభద్రతల సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అడాప్షన్ కానిస్టేబుల్స్ వారి పరిధిలోని గ్రామాల్లో నెలలో రెండు సార్లు పల్లెనిద్ర చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులతో మమేకం కావాలని, గ్రామసమస్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యల గురించి వారితో చర్చించి, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రెండునెల్లో 72 గ్రామాల్లో పల్లెనిద్ర గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల నడవడికపై నిఘా పెట్టాలని, వారు జీవనం ఏవిధంగా సాగిస్తున్నది తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 10మంది సీఐలు, 30మంది ఎస్సైలు 72 గ్రామాల్లో పల్లెనిద్ర చేసి, గ్రామస్తులతో మమేకం కావడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల్లో పోలీసుశాఖ పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ట్రూఅప్, విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
విజయనగరం గంటస్తంభం: సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, సెకి విద్యుత్ ఒప్పందం రద్దు డిమాండ్లతో శుక్రవారం విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. ‘విద్యుత్ సాకులు’ అనే పుస్తకాన్ని విజయనగరం కోట జంక్షన్ వద్ద కార్మికులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచమని చెబుతూనే, ట్రూఅప్ చార్జీల పేరుతో ఇప్పటికే రూ.17 వేల కోట్లు ప్రజలపై భారం వేసిందన్నారు. మళ్లీ సెకి ఒప్పందం ప్రకారం విద్యుత్ భారాలు ప్రజలపై వేయడం దుర్మార్గమని, తక్షణమే సెకి ఒప్పందం, ట్రూఅప్ విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో విద్యుత్ ప్రజాపోరాటం జరగనుందని హెచ్చరించారు. విద్యుత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేసీ్త్ర రాజు, తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా -
మద్యం మత్తులో నీటిలో పడి మహిళ మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధి తేల్‌రాయి పంచాయతీ సమీప గ్రామంలో మద్యం మత్తులో ఒక మహిళా నీటిలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఇద్దరు తోటికోడళ్లు అయినటువంటి రామే మాడీ, బుచ్చి మాడీలు తమ పొలంలో ఉన్న ఇప్పచెట్టు పూల కోసం బుధవారం ఉదయం వెళ్లారు. వాటిని సేకరించి అమ్మిన తర్వాత ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం సేవించారు. అనంతరం డబ్బులు కోసం గొడవపడ్డారు. ఈ గోడవలో ఇద్దరూ చూసుకోకుండా సమీపంలో ఉన్న నీటి కాలువలో పడిపోయారు. దీంతో బుచ్చి(48) అక్కడిక్కక్కడే మృతి చెందింది. అయితే అటుగా వచ్చిన కొంతమంది రామేమాడీని రక్షించి వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్ఐ చందన్ బెహర ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. కాగా చికిత్స పొందుతున్న రామేమాడి ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. 177 కేజీల గంజాయి స్వాధీనం ● కారు వదిలేసి పరార్ జయపురం: జయపురం సమితి గొడొపొదర్ సమీప రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద నిలిపి ఉన్న ఒక కారులో 177 కేజీల గంజాయి సదర్ పోలీసులకు బుధవారం రాత్రి చిక్కింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.17 లక్షలకు పైనే ఉంటుందని గురువారం వెల్లడించారు. పోలీసు అధికారి ప్రదాన్ తెలిపిప వివరాల ప్రకారం.. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గగణాపూర్ పోలీసు పంటి అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ రాజకిశోర్ బారిక్ నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహించారు. గొడొపొదర్ మార్గంలో ఓ కారు నిలిచి ఉంది. కారులో ఎవరూ లేరు. కారు వద్ద గంజాయి వాసన రాగా అనుమానించిన పెట్రోలింగ్ పోలీసులు తనిఖీ చేశారు. కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని మెజిస్ట్రేట్ సమక్షంలో గంజాయి తూకం వేయగా 177 కేజీలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులను చూసి గంజాయి మాఫియా గ్యాంగ్ పరారై ఉంటారని పోలీసు అధికారి ప్రదాన్ వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రదాన్ తెలిపారు. జీవామృతం తయారీపై అవగాహన మల్కన్‌గిరి : జిల్లాలోని కలిమెల సమితి అటవీశాఖ సమావేశ మందిరంలో బుధవారం కలిమెల, మోటు అటవీశాఖ రక్షణ కమిటీ సభ్యులకు జీవామృతం వ్యవసాయంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వర్‌కు చెందిన గ్రామీణ ఉత్పత్తి వ్యాపార సంస్థ డైరెక్టర్ ప్రపుల్ల బిశ్వాయి మాట్లాడుతూ జీవామృతం తయారీపై అవగాహన కల్పించారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు సూచనలు అందించారు. అనంతరం కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అటవీ అధికారి మృత్యుంజయ శెఠి, శ్రీనివాస్ పాత్రో, అభిమన్యు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి స్పందన జయపురం: తెలుగు సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామచరణ్ పుట్టినరోజు సందర్భంగా జయపురం గ్లోబల్ స్టార్ రామచరణ్ యువత గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 యూనిట్ల రక్తం సేకరించినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా తెలిపారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జయపురం శాఖ ప్రెసిడెంట్ మల్లికార్జున నాయిక్, ఉపాధ్యక్షుడు జి.సతీష్, కార్యదర్శి అలోక్ కోశ్లా,సహాయ కార్యదర్శి కె.వినోద్ పాల్గొన్నారు. -
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సంతకాల సేకరణ
బొబ్బిలి: తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయమై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు స్థానిక పట్టణంలోని పారిశుధ్య కార్మికులతో సంతకాల సేకరణ గురువారం చేపట్టారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారి సేవలను గుర్తించాలని శంకరరావు కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వారిని పొగడడం కాదని వారి పట్ల చిత్తశుద్ధి నిబద్దత ఉంటే వారిని శాశ్వత ఉద్యోగులను చేయాలన్నారు. ఆప్కాస్ వంటి ప్రైవేటు ఏజెన్సీకి తమ ఉద్యోగాల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు కలిగిన వినతిపత్రాన్ని మున్సిపల్ శాఖామంత్రి నారాయణకు కూడా పంపిస్తామన్నారు. జి.గౌరి, జె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్.అనురాధ, ఇ.సుమంత్‌లు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు బీహార్ రాష్ట్రంలో జరగనున్న అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రంగారావుదొర, కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన.లక్ష్మణరావు, పీడీ వి.సౌదామిని అభినందించారు. రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్న ఇద్దరు క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. -
దద్దరిల్లిన దిగువ పీఎంజీ కూడలి
భువనేశ్వర్ : ముందస్తు వ్యూహం ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుల ఆధ్వర్యంలో గురువారం శాసన సభ ముట్టడి నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక రామ మందిరం ఆవరణ నుంచి భారీ ఊరేగింపుతో కాంగ్రెసు భవన్ ప్రాంగణం చేరారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ ప్రముఖులు ఆందోళనకు సంబంధించి భావోద్వేగ ప్రసంగాలు వినిపించారు. అనంతరం శాసన సభ ముట్టడి కోసం మూకుమ్మడిగా తరలివెళ్లారు. దీంతో దిగువ పీఎంజీ కూడలి గురువారం రణరంగంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణతో ఈ పరిస్థితి తాండవించింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పోలీసుల చర్యలపట్ల రెచ్చిపోయిన కాంగ్రెసు కార్యకర్తలు కుర్చీలు, గుడ్లు, టమాటాలు, వాటర్ బాటిల్లు రువ్వారు. ప్రతి చర్యగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వాటర్ స్ప్రే, భాష్ప వాయు ప్రయోగంతో నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు వ్యక్తులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. అంతకుముందు నిర్వహించిన సభలో ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థులకు భద్రత కల్పించేందుకు కార్యాచరణతో ముందుకు రావాలని, లేకుంటే నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
మరో మూడు రోజులే గడువు..!
● రేషన్ లబ్ధిదారుల్లో ఆందోళన ● ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించాలి ● జిల్లాలో 2,77, 153 రేషన్‌కార్డులు ● కార్డుల్లో సభ్యులు 8,23,638 మంది ● 7లక్షల మంది వరకు ఈకేవైసీ పూర్తిపార్వతీపురం: రేషన్ పంపిణీలో అక్రమాల కారణంగా చౌకదుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డుల్లోని సభ్యలంతా ఈకేవైసీ చేయించుకుని అర్హులైన వారికి మాత్రమే సబ్సిడీ బియ్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 2,77,153 రేషన్ కార్డులుండగా అందులో 8,23,638 మంది సభ్యులున్నారు. ఇంతవరకు లక్షమంది వరకు ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉండగా త్వరితగతిన ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. వలస దారుల ఆవేదన బతుకు తెరువుకోసం యువకులు, వ్యవసాయ కూలీలు హైదరాబాద్, విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. పండగలు, శుభకార్యాలకు, సొంత గ్రామాలకు వచ్చి తమ రేషన్ కార్డులో పేర్లను తొలగించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం ఇతర పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలోను, వృద్ధులకు వేలిముద్రలు పడని కారణంగా ఈకేవైసీ సమస్య తలెత్తుతోందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు దూరమవుతామని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. మొరాయిస్తున్న సర్వర్లు ఈకేవైసీ చేయించుకునేందుకు సర్వర్లు కూడా తరచూ మొరాయిస్తున్నాయి. అందరూ ఒకేసారి ఈకేవైసీ చేయించుకునేందుకు తరలివస్తున్న కారణంగా సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయ, రాత్రి సమయాల్లో సర్వర్ సమస్య లేనప్పటికీ మిగిలిన సమయాల్లో రేషన్ షాపులు, ఆధార్, మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనివేళల్లో ఎక్కువమంది ఈకేవైసీకి రావడంతో సర్వర్లకు లోడ్ ఎక్కువై మొరాయిస్తున్నట్లు సాంకేతిక విభాగ నిపుణులు చెబుతున్నారు. చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు కేవలం చౌక దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని భావించడం వల్ల కూడా సమస్య తలెత్తుతోందని పలువురు అంటున్నారు. ఈకేవైసీ చేయించుకోవాలి రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. మిగిలిన మూడు రోజుల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి. లబ్ధిదారులందరికీ ఈకేవైసీ చేసేలా సిబ్బందిని ఆదేశించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. లబ్ధిదారులంతా సమీపంలోని చౌక దుకాణాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయిచుకోవాలి. ఐ.రాజేశ్వరి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, పార్వతీపురం మన్యం జిల్లా -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి ముకుందపూర్ ఘాటీ మలుపులో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బరంపురం నుంచి టికిరి వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మందిలో 27 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. బరంపురం నుంచి బుధవారం రాత్రి 9 గంటలకు బయల్దేరిన బస్సు ముకుందపూర్ ఘాటికి చేరుకునేసరికి తెల్లవారుజామున 4 గంటలయ్యింది. ఘాటీ మలుపులో బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు పెద్ద కేకలు పెట్టారు. కాగా క్షతగాత్రుల వివరాలు తెలియడం లేదు. స్వల్పగాయాలు తగిలిన కొంతమంది చికిత్స అనంతరం వారి వారి ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారంప్రమాదపు మలుపు ముకుందపూర్ ఘాటీ మలుపులో తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం పరిపాటిగా మారింది. మలుపు వద్ద అత్యంత వేగంతో వచ్చే వాహనాలు ఇటువంటి తరహా ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం ప్రమాదాలను హెచ్చరించే విధంగా మలుపుల వద్ద బోర్డులను కూడా రవాణా శాఖ ఏర్పాటు చేసింది. అయినా అవేవీ పట్టించుకోని చోదకులు అతివేగంతో వాహనాలు నడపడం ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిలా ఉండగా గురువారం బస్సు బోల్తా ఘటనకు సంబంధించి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న లోయలో బస్సు పడి ఉంటే ప్రమాద తీవ్రత అంచనాలకు అందేది కాదని పలువురు పేర్కొంటున్నారు. ప్రైవేటు బస్సు బోల్తా 27 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం -
● ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టి
చిత్రంలో ఈగెల్ను చూశారా.. ఇది విజయనగరం ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టికి నిలువెత్తు రూపం. మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు 16 బైక్ చైన్స్, 2,500 చైన్ లింక్స్‌తో ఈగెల్ను సృష్టించారు. దీనిని గాజువాక సిటీ ఐటీఐలో డ్యూయల్ వీఈటీ (సీమెన్స్– టాటా స్ట్రైవ్ సంయుక్త) నిర్వహణలో బుధవారం నిర్వహించిన ‘ప్రాజెక్టు ఇన్నోవేషన్ చాలెంజ్ కాంపిటేషన్–2025 జోన్–1 పోటీల్లో ప్రదర్శించారు. మొత్తం 30 ప్రదర్శనల్లో ‘ఈగెల్’ ప్రాజెక్టు మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఎమ్మెల్సే చిరంజీవిరావు, కార్పొరేటర్ సరసింహపాత్రుడు, ప్రభుత్వ ఐటీఐ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీరమణ, ఐఎంసీ చైర్మన్ బాలాజీ, కోరమండల్ ప్రతినిధి శ్రీనివాసరావు, టాటా స్ట్రైవ్ ప్రతినిధులు రమేష్, మార్కండేయులు, సంతోష్, జోన్– ఐటీఐ ప్రిన్సిపాల్స్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతిని అందుకున్నారు. – విజయనగరం అర్బన్ -
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
● ‘మిస్ తెలుగు యుఎస్ఏ’ తుదిపోటీలకు సాయిసాత్విక ● ఆమెది తెర్లాం మండలం సోమిదవలస గ్రామం ● మే నెలలో జరగనున్న ఫైనల్ పోటీలు తెర్లాం: అమెరికా మెచ్చిన అందం మన తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి చందక సాయిసాత్విక సొంతం. ఓ వైపు చదువు.. మరోవైపు అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. ఎమ్మెస్సీ చదువుకోసం అమెరికా వెళ్లిన యువతి డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘మిస్ యూఎస్ఏ–2025’ పోటీల్లో తలపడి తుదిపోటీలకు ఎంపిక కావడం తెర్లాం మండలం సోమిదవలస వాసుల్లో ఆనందం నింపింది. మే 25న జరగనున్న ఫైనల్ పోటీల్లో తలపడనుంది. తను విజయం సాధించడానికి భారతీయులంతా తనకు ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిచేస్తోంది. సాయిసాత్విక తండ్రి చందక సూర్యకుమార్ మెకానికల్ ఇంజినీరు కాగా, తల్లి సబిత రేషన్ డీలర్. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాజాంలోని సెంట్ఆన్స్ పాఠశాలలో, బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో చదువుకుంది. డేటా ఎనలైటికల్ కోర్సులో ఎమ్మెస్సీ చదవడం కోసం అమెరికా వెళ్లింది. అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్ట్రిన్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అక్క సాయిసుస్మిత, బావ వద్ద ఉంటూ మిస్ తెలుగు యుఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 300 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొన్న పోటీల్లో ఫైనల్‌కు చేరుకుంది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావాలన్నది సాయిసాత్విక కోరికని, చిన్నతనం నుంచి వ్యాసరచన పోటీల్లో తలపడి బహుమతులు గెలుచుకుందని తల్లి సబిత తెలిపారు. అమెరికా తెలుగు అమ్మాయిల పోటీల్లో కుమార్తె విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. -
భక్తిశ్రద్ధలతో ధన్వంతరి హోమం
విజయనగరం టౌన్: స్థానిక మన్నార్ రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ర్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ (పండు) నేతృత్వంలో వేదపండితులు శ్రీ ధన్వంతరి హోమాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 60 మంది రుత్విక్కులు, 54 హోమగుండాలు, 163 మంది దంపతులతో అంగరంగ వైభవంగా యాగప్రక్రియ నిర్వహించారు. ఆరోగ్యప్రదాత శ్రీ ధన్వంతరికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభ్యులు సేవలందించారు. కార్యక్రమంలో సురేష్, రమేష్, గోపాల్ జగదీష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పోలీసుల పల్లెనిద్ర
● గ్రామస్తులతో మీతోనే మేము అంటున్న సీఐలు, ఎస్సైలు విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెల్లో నిద్ర చేసి మీతోనే మేము అని పల్లె వాసులకు భరోసా కల్పించారు. ఈ విధంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను విని, క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నారు. తద్వారా పల్లెల్లో స్థానికులతో మమేకమవడమే కాకుండా ఆయా గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పల్లెనిద్రతో ఓ కన్నేశారు. అలాగే గ్రామంలోకి వెళ్లి రాత్రి పడుకునే ముందు ఒకసారి గ్రామస్తులతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యావ్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. దీనిపై ఎస్పీ వకుల్ జిందల్ గురువారం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, శాంతిభద్రతల సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అడాప్షన్ కానిస్టేబుల్స్ వారి పరిధిలోని గ్రామాల్లో నెలలో రెండు సార్లు పల్లెనిద్ర చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులతో మమేకం కావాలని, గ్రామసమస్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యల గురించి వారితో చర్చించి, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రెండునెల్లో 72 గ్రామాల్లో పల్లెనిద్ర గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల నడవడికపై నిఘా పెట్టాలని, వారు జీవనం ఏవిధంగా సాగిస్తున్నది తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 10మంది సీఐలు, 30మంది ఎస్సైలు 72 గ్రామాల్లో పల్లెనిద్ర చేసి, గ్రామస్తులతో మమేకం కావడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల్లో పోలీసుశాఖ పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
గంజాయితో ఆరోగ్య కార్యకర్త అరెస్టు
రాయగడ: ఒక గంజాయి కేసులో ఆరోగ్య కార్యకర్తను జిల్లాలోని పద్మపూర్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. అరైస్టెన మహిళ కేంద్రపడ జిల్లాకు చెందిన జ్యోత్స్నరాణి శెఠిగా పోలీసులు గుర్తించారు. ఆమె నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పద్మపూర్ సమితి పరిధిలోని గులుగుడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు. దీనిలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న జ్యోత్స్న కొద్దికాలంగా అక్రమంగా గంజాయి క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బుధవారం సాయంత్రం ఆమె ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో దాడులు నిర్వహించారు. దీంతో గంజాయి బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకున్న వంటల పోటీలు
రాయగడ: స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో రాయగడ జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన వంటల పోటీల్లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతికి అద్దంపట్టే పిండివంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంట్లో స్వయంగా తయారు చేసుకొని వచ్చిన మహిళలు ఈ పోటీల్లో వాటిని ప్రదర్శించారు. స్థానిక సాయి ఇంటర్నేషనల్ చెఫ్ సత్యనారాయణ, ఆశాలత పట్నాయక్, ప్రణతి పాత్రోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రుచి, శుచి, అలంకరణ తదితరమైన వాటికి ప్రాధాన్యత కల్పించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో ప్రథమ బహుమతిని కె.సంతోషిణి, ద్వితీయ బహుమతిని పి.నాగమణి, తృతీయ బహుమతిని కె.సత్యలు గెలిపొందగా, ఎం.సోనాలి, పద్మావతి పాడి, ఎం.రేవతిలకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. విజేతలకు ఉగాది వేడుకల్లో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. -
టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం టౌన్: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో మే 1నుంచి జూన్ 11 వరకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 25వరకు ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 1 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 45ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో మే 1వ తేదీన హాజరు కావాలని సూచించారు. పోలమాంబ హుండీల ఆదాయం లెక్కింపుమక్కువ: E™èl¢-Æ>…{«§ýl$ÌS CÌS-ÐólË$µ Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ çßæ$…yîlÌS B§éĶæ*-°² VýS$Æý‡$-ÐéÆý‡… §ólÐ]l-§éĶæ$-Ô>Q íܺ¾…¨ ÌñæMìSP…^éÆý‡$. Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ 8,9 gê™èl-Æý‡-ÌS-ÌZ ¿ýæMýS$¢-Ë$ çßæ$…yîl-ÌZÏ çÜÐ]l$-ǵ…^èl$-MýS$¯]l² M>¯]l$-MýS-ÌS¯]l$ ÌñæMìSP…^èl-V> ₹4,11,188 B§éĶæ$… Ð]l_a…§ýl° DK çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-×æ ™ðlÍ´ëÆý‡$. çßæ$…yîlÌS ÌñæMìSP…ç³# M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$¯]lÅ… hÌêÏ §ólÐ]l-§éĶæ$ Ô>Q A«¨M>Ç G‹Ü.Æ>gêÆ>Ð]l#, {V>Ð]l$ çÜÆý‡µ…^Œl Ððl§ýl$âýæÏ íÜ…à^èl-ÌS-Ð]l$Ð]l$Ã, Eç³-çÜ-Æý‡µ…^Œl AË$Ï Ððl…MýS-rÆý‡-Ð]l$-×æ, Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS ç³Nyìl §éÍ ¯éĶæ¬yýl$, E™èlÞÐ]l MýSÑ$sîæ Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS O¯ðl§é¯]l çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-×æ, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. గడ్డి మందుతాగి వ్యక్తి ఆత్మహత్యగుర్ల: మండలంలోని నాగళ్లవలసకు చెందిన సంబర రమేష్ (51) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేక బుధవారం గడ్డి మందు తాగేశాడు. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుని భార్య ఉమ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కుమారుడు సూర్య ఉన్నాడు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. పక్కా డాక్యుమెంట్ రీ సర్వే జరగాలి ● జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభికకొమరాడ: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత రీ సర్వేలో డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని, సమగ్ర విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా రెండవ విడత రీ సర్వే పనులపై తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రీ సర్వే చేపడతున్న గ్రామల్లో ముందుగా రైతులకు సమాచారం అందించి తగు రశీదులను పొందాలని స్పష్టం చేశారు. భూముల రీసర్వేలో తలెత్తిన లోపాలను భూయజమానికి ముందుగా నోటీస్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలు ఆయా రిజిస్టర్లలో నమోదు చేయాలని చెప్పారు. రీ సర్వేలో ఎక్కడా లోపాలు ఉండరాదని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్డార్ శివయ్య మండల సర్వేయిర్ వంశీ తదితరులు పాల్గున్నారు. -
డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రయత్నం
● కందుల సాగుకు ప్రోత్సాహం ● తలసరి ఆదాయం పెంచే దిశగా చర్యలు ● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాను డోలీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడికి తెలిపారు. రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆయన జిల్లా ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉందని, కొండ ప్రాంతాల్లో రహాదారి సదుపాయం లేక డోలీలు వినియోగిస్తున్నారని, ఆ పరిస్థితి కనిపించకుండా ఉండేలా రహదారి సదుపాయం కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 250 మంది ప్రజలున్న ఆవాసాలకు కూడా రహదారి సదుపాయం కల్పించాలనే దిశగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అపరాల సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని తాన్ని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం రూ. 1.67 లక్షలుగా ఉందని దాన్ని వచ్చే 2025–56 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.94 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రగతికి పర్యాటరంగం ఎంతో దోహదపడుతుందని, పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించామని వివరించారు. జిల్లాలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజి నిర్మాణం 60 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు. -
ఏసీబీ వలకు చిక్కిన మత్స్యశాఖాధికారి
● సీడ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించినందుకు రూ.60 వేలు డిమాండ్ ● ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఏజెన్సీ నిర్వాహకుడు ● వలపన్ని పట్టుకున్న అధికారులుపార్వతీపురంటౌన్: బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులకు సీడ్ బిల్లుల చెల్లింపులో పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ మండలం టీడీ పురానికి చెందిన బొప్పన అప్పన్నదొరకు చెందిన కోటదుర్గ ఫిష్ సీడ్ సంస్థలోని విత్తన నిల్వలను తనిఖీ చేసి, రూ.60 లక్షల బిల్లు మంజూరు చేసినందుకు జిల్లా మత్స్యశాఖాధికారి వేముల తిరుపతయ్య రూ.60 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు అప్పన్నదొరకు లంచం ఇవ్వడం ఇష్టంలేక విజయనగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వలపన్నాం. బాధితుడి నుంచి పార్వతీపురంలోని మత్స్యశాఖ కార్యాలయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. ఆయనపై కేసు సమోదు చేసి, డబ్బులు సీజ్ చేశాం. నిందితుడిని విశాఖపట్టణంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో సీఐలు మహేశ్వరరావు, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలబాలికలను లైంగికంగా వేధిస్తే 20ఏళ్ల జైలుశిక్ష
● ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి విజయనగరం/నెల్లిమర్ల రూరల్: లైంగికంగా బాల,బాలికలను వేధించినా, అవమాన పరిచినా..నేరం చేసిన వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో బుధవారం ఆమె నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాం గ్రామంలో పోక్సో చట్టంపై న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దగ్గర వారే మన బాలికలపై నేరానికి పాల్పడుతుంటారని, అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్ల లపట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు టీనేజ్ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతుంటారని, ఇంటర్నెట్ ప్రభావానికి లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని చెప్పారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిణీరావు,, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డి.సీతారాం, కొండగుంపాం గ్రామసర్పంచ్ పి.అప్పన్న, నెల్లిమర్ల ఎస్సై ఎం.గణేష్, కొండగుంపాం గ్రామ సచివాలయ కార్యదర్శి ఎల్.తౌడు, సచివాలయ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సిబ్బంది, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. -
ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!
విజయనగరం ఫోర్ట్: ఇటీవల గజపతినగరం మండలంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● కొద్దినెలల క్రితం గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామంలో ఉన్న రైస్ మిల్లు గొడౌన్‌కు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో వీఆర్వో వెళ్లి రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని, తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ● ఇదే మండలంలో ఉన్న మరో మిల్లులో ిపీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు మిల్లు వద్దకు చేరుకుని పీడీఎస్ బియ్యం తరలించే వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 1500 కేజీలుగా గుర్తించారు. వాటిని అధికారులు సీజ్ చేసి మిల్లు యాజమానిపైన, తరలించిన వ్యక్తిపైన కేసులు నమోదు చేశారు. ● ఇలా ఈ మూడు చోట్లే కాదు. జిల్లాలోని అనేక చోట్ల పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని మిల్లులకు తరలిస్తూ మిల్లులో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటినే మళ్లీ ప్రజాపంపిణీ వ్యవస్థ గొడౌన్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్న అధికారులు పీడీఎస్ బియ్యం అధికారుల కళ్లముందే తరలిపోతున్నా తమకేమీ కనబడడం లేదన్న రీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పీడీఎస్ బియ్యం ఎక్కువగా పక్కదారి పట్టిస్తున్నా గ్రామాల్లో ఉండే వీఆర్వోలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం తరలిపోతున్నట్లు తెలుస్తోంది. 2024–25 లో 90 కేసులు నమోదు: 2024–25 లో పీడీఎస్ తరలించిన 90 మందిపై 6 ఎ కేసులు నమోద య్యాయి. 1959 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 2025–26లో 23 మందిపై 6 ఎ కేసులు నమోదయ్యాయి. 99.86 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. టన్నుల కొద్దీ తరలిస్తున్న వ్యాపారులు రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ మళ్లీ అవే బియ్యం పౌరసరఫరాల శాఖ గొడౌన్లకు తరలింపుఆకస్మిక తనిఖీలు చేస్తున్నాంపీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించకూడదు. సీ ఎస్డీటీలు ఆకసిక్మక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లయితే అటువంటి వారిపై 6ఎ కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెడతాం. కె.మధుసూదన్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
మట్టి తవ్వకాల అడ్డగింత
పలాస: మండలంలోని కేదారిపురంలో మంగళవారం రాత్రి పొలంలో అక్రమంగా మట్టిని తవ్వడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న మూడు ట్రిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. మట్టి తవ్వడానికి వాహనాలతో కొంతమంది వచ్చారని పలాస తహశీల్దారు టి.కళ్యాణచక్రవర్తికి సమాచారం రావడంతో రాత్రి 8 గంటల సమయంలో కాశీబుగ్గ పోలీసులతో వెళ్లారు. వాహనాలను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. బుధవారం సంబంధిత వ్యక్తులను పిలిపించి ట్రిప్పర్‌కు రూ.10వేలు చొప్పున రూ.30వేలను అపరాధ రుసుం విధించారు. ఈ దాడుల్లో ఆర్ఐ కై లాసం, కాశీబుగ్గ ఎస్ఐ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో జింకపిల్ల మృతి
ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలోని రత్తకన్న గ్రామంలో వీధి కుక్కల దాడిలో జింక పిల్ల మృతి చెందింది. సమీప కొండల నుంచి దారితప్పి గ్రామంలోనికి ప్రవేశించిన సమయంలో వీధికుక్కలు వెంటపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే గ్రామస్తులకు అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.మురళీకృష్ణనాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ అధికారి ఐ.రాము, ఫారెస్టు బీట్ అధికారులు సిబ్బంది మృతిచెందిన జింకను పరిశీలించారు. గ్రామస్తుల సమక్షంలో బెల్లుపడ వెటర్నరీ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని దహనం చేశారు. ఇదిలా ఉండగా రత్తకన్న సమీపంలోని ఎర్రమట్టి కొండల నుంచి గ్రావెల్‌ను కొందరు అక్రమంగా తవ్వేయడంతో కొండలు కరిగిపోతున్నాయని, అక్కడి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
వంటావార్పుతో కార్మికుల ఆందోళన
వేపాడ: మండలంలోని బొద్దాంలో చెక్‌పోస్టువద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు బుధవారం వంటావార్పుతో ఆందోళన నిర్వహించారు. చెక్‌పోస్టు ఎత్తివేయాలని లేదా వెసులుబాటు కల్పించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనపై స్పందించిన ఉత్తరాంధ్ర మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ ఎ.డి. అజయ్‌కుమార్ బొద్దాం చేరుకుని సమస్యపై ఆరాతీశారు. దీనిపై సీఐటీయూ జిల్లానేత చల్లాజగన్ మాట్లాడుతూ ప్రైవేట్ చెక్‌పోస్టు సిబ్బంది, విజిలెన్స్ బోర్డులు పెట్టుకుని అక్రమాలుచేస్తున్నారని ఎ.డికి వివరించారు. రైతులు సొంత పొలాల్లో నుంచి మట్టితోలుకున్నా, గృహనిర్మాణదారులు పునాదులు పూడ్చుకోవడానికి తెచ్చుకున్నా అక్రమంగా వసూలు చేస్తున్నారని ఈ ఇబ్బందుల నుంచి రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లకు విముక్తి కలిగించాలని కోరారు. దీనిపై ఎ.డి.అజయ్‌కుమార్ మాట్లాడుతూ మట్టి, కారురాయి తోలకాలకు మినహాయింపు కల్పిస్తామన్నారు. అయితే లే అవుట్ల వ్యాపారాలకు తోలేవాటికి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ చెక్‌పోస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దీంతో కార్మికులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఎ.జి.మల్లేశ్వర్రావు, బొద్దాం గ్రామపెద్ద ఎర్రా సన్యాసిరావు, యూనియన్ నాయకులు గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, శ్యామ్, కృష్ణ, రవి, శివప్రసాద్, రామకృష్ణ, బాలు, సన్నిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై దేవి, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
మెహందీ పోటీలకు విశేష స్పందన
రాయగడ: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో బుధవారం నిర్వహించిన మెహందీ పోటీలకు విశేష స్పందన లభించింది. మహిళలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మొత్తం 51 మంది పాల్గొన్నారు. మెహందీ పెట్టుకోవడంలో శుభ్రత, అందం, ఆధునిక డిజైన్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ నిర్వాహకులు విజేతలను ఎన్నుకున్నారు. పోటీల్లో ప్రథమ బహుమతిని రాధారాణి కౌసల్య గెలుచుకోగా, ద్వితీయ బహుమతిని బి.ప్రితి, తృతీయ బహుమతిని పాయల్ దలాల్లు సొంతం చేసుకున్నారు. ఎం.మౌనిక, ఎంపీ ఇందు, సీహెచ్ గాయత్రీలకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు. విజేతలకు ఈనెల 30, 31వ తేదీల్లో స్థానిక కొల్లిగుడ మైదానంలో జరగనున్న ఉత్సవాల్లో బహుమతులు ప్రదానం చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యాల్ల కొండబాబు తెలియజేశారు. -
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై మరోసారి దర్యాప్తు
రామభద్రపురం: మండలకేంద్రంలోని సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా బుదవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సులోచనరాణితో కలిసి దర్యాప్తు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏడాది క్రితం బీఎల్వో విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు అతడి సమాధానం కూడా బాగాలేదన్న ఉద్దేశంతో తహసీల్దార్ సులోచనరాణి ఆర్డీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఆర్డీవో కూడా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అప్పటి కలెక్టర్ సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌కు దాదాపు 6 నెలల క్రితం పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. అయితే అప్పట్లో దర్యాప్తు సక్రమంగా జరగలేదని, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ సులోచనరాణిని అప్పట్లో ఏం జరిగిందో ఎస్డీసీ ప్రమీలా గాంధీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం పాల్గొన్నారు. -
రైతుసేవా కేంద్రం పరిశీలన
విజయనగరం ఫోర్ట్: అపరాల (పెసర, మినుము) పంటలను రైతులు విక్రయించేసిన తరువాత ప్రభుత్వం అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్న అంశంపై సాక్షిలో బుధవారం ‘ఎవరి లాభం కోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్. వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు జామి మండలంలోని విజినిగిరిలో ఏర్పాటు చేసిన అపరాల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులు మాత్రమే అపరాలను విక్రయించుకోవాలని దళారులు ఎవరైనా అపరాలు విక్రయించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ విజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతి చెందిన నేపథ్యంలో పార్టీ నాయకురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తొలుత ఆమె మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు వైఎసా్‌స్‌ర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపుపాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఉదయం 10 గంటల నుంచి దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 23 రోజులకు గాను రూ.3,08,943 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. అలాగే 36 గ్రాముల బంగారం, 1900 గ్రాముల వెండి హుండీల్లో లభించిందని వివరించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిసాలూరు: రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన టి.గౌరమ్మ(47) సాలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస వద్ద చర్చికి ప్రార్థనలకు వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్ర యాణిస్తుండగా సాలూరులోని కోటవీధి జంక్షన్ వద్ద బైక్ మధ్యలో కూర్చున్న గౌరమ్మ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రైల్వే స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ ఆమైపె నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జ యి వెంటనే మరణించింది. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కోచింగ్ సెంటర్ ఎంపికకు గడువు పెంపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లో కోచింగ్ సెంటర్ ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు పొడిగించినట్లు డీడీ విశ్వమోహన రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్ విద్యార్థికి గాయం నరసన్నపేట: స్థానిక సెంట్క్లారెట్ స్కూల్లో పరీక్ష రాస్తున్న టెన్త్ విద్యార్థి బి.వెంకటరమణ గాయపడ్డాడు. స్కూల్లో గోడకు ఉన్న మేకు తలకు తగలడంతో రక్త స్రావమైంది. వెంటనే పీహెచ్సీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. బీపీ చెక్ చేసిన అనంతరం పరీక్షకు హజరయ్యాడు. జలుమూరు మండలం బసివాడకు చెందిన వెంకటరమణ నరసన్నపేట మండలం కంబకాయ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గుండెపోటుతో వీఆర్ఓ మృతి ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని బడివానిపేట వీఆర్వో పుట్ట రాజారావు (50) బుధవారం గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది సీపీఆర్ చేసి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. రాజారావు స్వస్థలం చిలకపాలెం. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా, రాజారావు పనిఒత్తిడి కారణంగానే మృతిచెందారని ఉద్యోగ సంఘాల నాయకులు, వీఆర్వోలు చెబుతున్నారు. రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ ఇలా అన్ని సర్వేలు, పనులు తమతోనే చేయిస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఎవరి పనిచేస్తున్నామో తమకే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కాగా, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్ గోపాలరావు బుధవారం రాత్రి రాజారావు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. మృతిపై ఆరా తీశారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య టెక్కలి రూరల్: మండంలోని చల్లపేట గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణారావు(59) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కృష్ణారావుకు భార్య బానమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి క్యాంగ్ పంచాయతీ పెద్ద సేరపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆశిష్ జలారి అనే పదకొండేళ్ల బాలుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెదికారు. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో బుధవారం ఉదయం మత్తిలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ దేవదత్తు మల్లిక్ వెంటనే స్పందించి సబ్ ఇన్స్పెక్టర్ మాడ మడ్కమి, సబ్ ఇన్స్పెక్టర్ విష్ణుకిశోర్ల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. అనంతరం వారు గాలించగా మత్తిలి సమీపంలోని ఒక చెట్టుకింద బాలుడు కూర్చొని ఉండడం గమినించి పట్టుకున్నాడు. అయితే బాలుడి మతిస్థిమితం సరిగా లేనట్లు గుర్తించారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పోలీసులు -
మట్టి మాఫియా ఆగడాలు
రామభద్రపురం: మండలంలో మట్టిమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామాల్లోని చెరువులు, చెరువు పోరంబోకు, గెడ్డ పోరంబోకుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ చోటామోటా నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు ఉండడం, ఒక వేళ ఫిర్యాదు వచ్చినా నామమాత్రంగా పరిశీలించి మిన్నకుండిపోవడంతో మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతూ అక్రమ రవాణా సాగిస్తోంది. ఎన్నడూలేని విధంగా రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నా అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని కూడా అధికార యంత్రాంగం చేయడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు తప్ప..అక్రమ రవాణాను అడ్డుకుందామన్న స్పృహ వారికి లేదని, ఒక వేళ అడ్డుకున్నా అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే వెనుదిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలో రేయింబవళ్లు చెరువు పోరంబోకు, చెరువులు, గెడ్డ పోరంబోకులో జేసీబీలతో విలువైన మట్టిని తవ్వి వందలాది ట్రాక్టర్లు, పెద్దపెద్ద ట్రక్కులు, లారీల ద్వారా మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన మాఫియా అక్రమంగా తరలిస్తున్నారు. రామభద్రపురం నుంచి సాలూరు వెళ్లే ఎన్‌హెచ్ 26 రోడ్డు పక్కన ఉన్న సైట్లు ఎత్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పడంతో పాటు స్థానిక టీడీపీ నాయకుడు, సాలూరుకు చెందిన ఓ చౌదరికి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.150 వరకు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మనదే అడ్డుకునేవారే లేరంటూ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం అడ్డుకోవడానికి కూడా వీల్లేదంటూ చోటా నాయకులు హుకుం జారీ చేసి మరీ మట్టి తవ్వకాలు నిర్వహించడం గమనార్హం. అక్రమార్కులు మట్టి ఎక్కడికి తరలిస్తున్నారో తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రకృతి సంపదను దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని గ్రామస్తులు ప్రత్యక్షంగా ఆందోళన చేసినా..లేక ఫిర్యాదు చేసినా అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ మమ అన్పిస్తున్నారు తప్ప కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్చగా రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగంఫిర్యాదు చేసినా స్పందన లేదు మూడు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వెళ్లి అడ్డుకుని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేశాను. కనీస స్పందన లేదు. మొన్న జూనియర్ అసిటెంట్ వచ్చి అడ్డుకుని జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎక్కడి నుంచో ఫోన్ రావడంతో వెంటనే వదిలేసి వెళ్లిపోయారు. మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు కానీ అడ్డుకోవడం లేదు. అలమండ ఆనందరావు, సీపీఐ జిల్లా జాయింట్ సెక్రటరీ, కొట్టక్కి సిబ్బందిని పంపి అడ్డుకుంటాం.. మాకు ఫిర్యాదు అందింది. కానీ వారి సొంత భూమిలో తవ్వుకుని, వారి పొలంలోనే వేసుకుంటున్నామని చెబుతున్నారు. మా అధికార సిబ్బందిని పంపించగా వెళ్లి పరిశీలించారు. తవ్వడం వాస్తవమే. అయితే వారి సొంత పొలం తవ్వుకుని వేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా నిబంధనల ప్రకారం ఎక్కడ తవ్వినా అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. మరోసారి సిబ్బందిని పంపించి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఎ సులోచనరాణి, తహసీల్దార్, రామభద్రపురం -
చాకలి రేవు నిర్మాణ పనులపై సమీక్ష
పర్లాకిమిడి: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న చాకలి రేవు చెరువు మట్టితీత పనులపై పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కంట్రాక్టర్లతో బుధవారం సమీక్షించారు. ఈ చెరువుపై పలు రజక కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. చెరువులో మట్టి, గుర్రపు డెక్క పేరుకుపోవడంతో రజక సంఘం నాయకులు చెరువు పునరుద్ధరించాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఈ పనులు గత కొన్ని రోజులుగా జరుగుతుండగా అకస్మాత్తుగా పరిశీలించారు. నిధుల సమస్య లేకుండా గ్రామీణ తాగునీరు, శానిటేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రతాప్ బెహరాతో మాట్లాడారు. పనులు వెంటనే చేపట్టినందుకు పురపాలక అధ్యక్షురాలు నిర్మలకు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు శాసనసభ ముట్టడి
భువనేశ్వర్: నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శాంతి భద్రతల పరిరక్షణ జంట నగరాల పోలీసు కమిషనరేట్‌కు పెను సవాల్‌గా మారింది. శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసన కట్టలు తెంచుకుంటోంది. బుధవారం నడి రోడ్డు మీద నిరసనకు దిగిన కాంగ్రెస్ సభ్యులకు మద్దతుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శాసనసభ వైపు దూసుకుపోయి ముట్టడించేందుకు పాల్పడ్డారు. సభా ప్రాంగణం భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు అధిగమించి సభా ప్రాంగణం ప్రవేశ ద్వారాల తాళాలు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేసి పోలీసు యంత్రాంగానికి ముప్పు తిప్పలు పెట్టారు. ఇదిలాఉండగా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ గురువారం శాసనసభ ముట్టడిస్తామని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లోగడ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆందోళనలు భారీ ఎత్తున విజయవంతం చేయాలనే లక్ష్యంతో స్థానిక కాంగ్రెస్ భవన్లో పార్టీ ప్రముఖుల వ్యూహ రచన చేశారు. కాంగ్రెసు భవన్ నుంచి శాసనసభ మార్గం ఉద్రిక్తంగా మారే ప్రమాదంపై జంట నగరాల పోలీసు కమిషనరేట్ ముందస్తుగా అప్రమత్తమైంది. రాకపోకల కట్టడి శాసనసభ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ప్రదర్శన తీవ్రత దృష్ట్యా పోలీసు కమిషనరేట్ నగరంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నిరసన కారణంగా మాస్టరు క్యాంటిన్ కూడలి నుంచి దిగువ పీఎంజీ మార్గం గుండా శాసనసభ వైపు ఉధృత పరిస్థితి తాండవిస్తుందని అంచనా. ఈ మార్గంలో వాహనాలు, సాధారణ ప్రజానీకం రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనల నివారణ కోసం గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ప్రధానంగా రాజ్ మహల్ స్క్వేర్ మరియు రూపాలి స్క్వేర్ మధ్య ప్రాంతాలు ముఖ్యంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిరసన ప్రదర్శన సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల గుండా రాకపోకలకు సర్దుబాటు చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ మార్గంలో మాస్టరు క్యాంటిన్ కూడలి నడి రోడ్డు మీద కాంగ్రెసు సభ్యుల నిరసన నిరవధికంగా కొనసాగుతోంది. రాత్రంతా ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఆందోళనకారుల వర్గం పేర్కొంది. -
డీఈఓను విధుల నుంచి తప్పించాలి
● ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ ● రెండోరోజూ కొనసాగిన నిరసన శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కుప్పిలి కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఘటనలో సస్పెండైన 14 మంది ఉపాధ్యాయులను వెంటనే విదుల్లోకి తీసుకోవాలని, ముందస్తు ప్రణాళికతో దాడిచేసి వ్యక్తిగత మైలేజ్ కోసం జిల్లా పరువు, ప్రతిష్టతలను మంటగలిపి ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేసిన డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే విధుల నుంచి తప్పించాలనికి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సస్పెండైన టీచర్లతోపాటు డిబారైన ఐదుగురు విద్యార్థులకు న్యాయం చేయాలని నినదించారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడివేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట రెండో రోజు బుధవారం కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉమ్మడి వేదిక ముఖ్య ప్రతినిధులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్మోహన్, డి.శివరాంప్రసాద్, పిసిని వసంతరావు తదితరులు మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2023 సాధారణ బదిలీల నుంచి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కుప్పిలి కేంద్రంలో జరిగిన సంఘటన అతిగా చిత్రీకరించి విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి ప్రశాంతంగా పరీక్షలు రాయటంలో తీవ్ర ఆటంకం కలుగజేసిన డీఈఓపై, దాడిలో పాల్గొన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది ఉపాధ్యాయులతో చేపట్టనున్న ఉపాధ్యాయుల పోరాట ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు కొప్పల భానుమూర్తి, బమ్మిడి శ్రీరామ్మూర్తి, గొంటి గిరిధర్, సంపతిరావు కిషోర్‌కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, బల్లెడ రవి, శీర రమేష్‌బాబు, ఎంవీ రమణ, ఎస్.సత్యనారాయణ, బలివాడ ధనుంజయ్, బోనెల రమేష్, కె.పద్మావతి, బి.మోహనరావు, పప్పల రాజశేఖర్, దామోదరావు, వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు. -
కదంతొక్కిన బీజేడీ
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, విపక్షాల ఆవేదనని అణచివేస్తూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందిని ఆరోపించింది. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న విపక్ష సభ్యులపై అరాచకత్వం ప్రదర్శిస్తోందని మండిపడింది. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరిగానే ఏదో యుద్ధం జరుగుతోందన్నట్లుగా సభలో నిరసన ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొట్టారని బీజేడీ సభ్యుడు డాక్టర్ అరుణ్ కుమార్ సాహూ పరిస్థితిని అంతర్జాతీయ సంఘర్షణలతో పోల్చారు. పోలీసులు బీజేడీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. 14 మంది సభ్యుల సస్పెన్షన్‌పై స్పీకర్ వైఖరి సభలో స్పష్టం చేయాలని బీజేడీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై స్పీకర్ వైఖరి కొరవడడంతో బీజేడీ శాసన సభ్యులంతా శాసనసభ నుంచి బయటకు వచ్చేశారు. స్పీకర్ ప్రకటన అనంతరం బీజేడీ సభ్యుల ఆందోళన మేరకు సభలో స్పీకర్ సురమా పాఢి వివరణ ప్రవేశపెట్టారు. ఈనెల 25వ తేదీ వరకు 12 పని రోజులు పాటు జరిగిన మలి విడత బడ్జెటు సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ నిడివిలో సమగ్రంగా రాష్ట్ర శాసనసభ కార్యకలాపాల్లో 39 గంటల 2 నిమిషాల పాటు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. సభలో సభ్యుల తీరుని చక్కదిద్దేందుకు పలుమార్లు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది అన్నారు. దీనిలో భాగంగా ఈనెల 10, 13, 24, 25 తేదీల్లో వరుసగా అఖిల పక్ష సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 21న డిప్యూటీ స్పీకర్ సభలో సభ్యులు మర్యాదపూర్వకంగా మెసులుకోవాలని అభ్యర్థించారని వెల్లడించారు. ఈ అభ్యర్థనపై నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు అంతరాయం నిరవధికంగా కొనసాగించారు. దీని ఫలితంగా మంగళవారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అయితే వారు అసెంబ్లీ ప్రాంగణాన్ని వదిలి వెళ్లడానికి నిరాకరించి రాత్రంతా ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. దీంతో శాసన సభ్యులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి 9 గంటలకు కాంగ్రెస్ సభ్యులు మరియు కార్యకర్తలు శాసనసభ ఆవరణలో మార్షల్స్, భద్రతా సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన సిబ్బందికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో సభలో కాంగ్రెసు సభ్యుల నిరసన హింసాత్మక రూపు దాల్చుకుంటున్న వైపరీత్యం దృష్ట్యా శాసనసభ మార్షల్ మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో సభ నుంచి బయటకు తొలగించారన్నారు. ముందస్తు ఆదేశాల మేరకు సిబ్బంది ఈ చర్యని చేపట్టినట్లు స్పీకర్ శాసనసభలో స్పష్టం చేశారు. -
గందరగోళం..!
–8లోuరెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025భువనేశ్వర్: బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకొని రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నిరవధికంగా కొనసాగుతోంది. ఇరుపక్షాలు ఎవరి పట్టుపై వారు నిశ్చలంగా ఉండడంతో సభా కార్యకలాపాలు సక్రమంగా కొనసాగలేదు. ప్రధానంగా రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. మైనర్ బాలికలకు విద్యా సంస్థల్లో మౌలిక రక్షణ కొరవడిందని దుమ్మెత్తిపోసింది. ఈ పరిస్థితిపై రాష్ట్ర హోమ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సభలో వివరణ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. మహిళలకు లోపించిన భద్రత పరిస్థితిపై విచారణకు సభా కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. అయితే దీనికి అధికార పక్షం ససేమిరా అనడంతో సభలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సభా కార్యకలాపాలకు విఘాతం రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సభలో ఉద్యమించిన కాంగ్రెసు సభ్యుల తీరును అధికార పక్షం తప్పు బట్టింది. ఈ వ్యవహారంలో సభలో సభ్యుల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బాహాటంగా విమర్శించింది. తదుపరి దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతిని సభ నుంచి 7 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ సురమా పాఢి ప్రకటించారు. దీంతో అకస్మాతుగా వ్యతిరేకత తారా స్థాయికి తాకింది. ఈ చర్యపై ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ కూడా విచారం వ్యక్తం చేసింది. ఇలా రోజులు గడుస్తున్నా వివాదం కొలిక్కి రాకపోవడంతో సభా కార్యకలాపాలకు తీవ్రంగా గండి పడింది. 12 మంది సస్పెన్షన్ మంగళవారం నాటికి ఈ పరిస్థితి మరింతగా రాజుకుంది. సభలో కాంగ్రెసు సభ్యుల బలం 14 మంది కాగా, అత్యధికంగా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో మిగిలిన ఇరువురు సభ్యులు సభలో తోటి సభ్యుల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ, సభా కమిటీ ఏర్పాటు నినాదంతో సభలో నిరసన ప్రదర్శన కొనసాగించారు. తమ న్యాయ సమ్మతమైన ప్రతిపాదనలపై సభ సానుకూలంగా స్పందించకుంటే రాత్రంతా సభలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. వీరి హెచ్చరికపై సభ పెడచెవి వైఖరి ప్రదర్శించడంతో మంగళవారం రాత్రంతా కాంగ్రెసు సభ్యులందరూ కలిసి సభలో నిరాహార దీక్ష చేపట్టారు. సభ బయట ఉద్రిక్తత సభ లోపల తోటి సభ్యుల నిరాహార దీక్ష స్థితిగతులను తెలుసుకునేందుకు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణానికి చేరారు. దీంతో లోపలికి వెళ్లకుండా వీరిని పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వేడెక్కింది. ఫలితంగా శాసనసభ బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమానుష చర్యలు సభలో నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెసు సభ్యులకు తాగునీరు, మరుగుదొడ్డి వంటి మౌలిక సౌకర్యాలు లేకుండా అధికారులు అమానుష చర్యలకు పాల్పడ్డారు. దీంతో క్రమంగా ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆరోగ్యం దిగజారింది. పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాంగ్రెసు ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు నెట్టేశారు. పదవిలో ఉన్న శాసనసభ్యులపై పోలీసుల జులుం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మరో ఇద్దరు సైతం సస్పెండ్ పరిస్థితి ఇలా కొనసాగుతుండగా మిగిలిన ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలను సైతం సభ నుంచి మరోసారి వారం రోజుల వరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ బుధవారం దేశాలు జారీ చేశారు. మరోవైపు తారా ప్రసాద్ బాహిణీపతికి రెడ్ కార్డు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణకు కనీస అవకాశం కల్పించకుండా సస్పెండ్ చేశారని తారా ప్రసాద్ బాహిణీపతి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిలువునా హతమార్చిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సభలో నిరసన ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించారు. నిరసన కొనసాగిస్తున్న తమపై చేయి చేసుకుని బలవంతంగా బయటకు నెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు తన గొలుసు లాక్కున్నారని ఆరోపించారు. న్యూస్‌రీల్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు రాత్రంతా శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల నిరసన శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులంతా సస్పెండ్ -
అమ్మవారికి ఇత్తడి సింహాల వితరణ
రాయగడ: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలిలో ఉన్న మహేశ్వరి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కోడిరామ్మూర్తి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంస్థల యజమాని రంబా చంద్రశేఖర్, సుగుణ దంపతులు మజ్జిగౌరి అమ్మవారికి ఇత్తడితో రూపొందించిన రెండు సింహాలమూర్తులను వితరణగా బుధవారం అందజేశారు. 300 కిలోల బరువు ఉన్న ఇత్తడితో రూపొందించిన ఈ సింహాలను అమ్మవారి ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు దాతలు బుధవారం ప్రత్యేక పూజలను అమ్మవారి మందిరం ప్రాంగణంలో నిర్వహించారు. కాగా ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమ్మవారి చైత్రోత్సవాల ప్రారంభ సమయంలో ఇత్తడి సింహాలను ప్రాణ ప్రతిష్టించిన అనంతరం, వాటిని ఏర్పాటు చేస్తామని ట్రస్టు సభ్యులు తెలియజేశారు. -
రామకృష్ణనగర్‌లో చోరీ
రాయగడ: స్థానిక రామకృష్ణనగర్‌లో మంగళవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒక ఇంట్లో చొరబడి బీరువాలను విరగ్గొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగిలించినట్లు బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామకృష్ణనగర్ పోస్టాఫీసు వీధిలో నివాసముంటున్న చంద్రమౌళి ప్రసాద్ బెహర అనే వ్యక్తి కొరాపుట్ వేళ్లేందుకు మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో నిద్రలేచి చూసేసరికి ఇంటి బయట ఎవరో ఉన్నట్లు గమనించాడు. దీంతో బయటకు వెళ్లి చూసి తిరిగి ఇంటి లోపలకి వెళ్లిపోయాడు. కొద్దిసేపు తర్వాత మరింత శబ్ధం వినిపించడంతో బయటకువచ్చి చూడగా తమ కింది ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. అప్పుడు ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని రెండు బీరువాలు, వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంత మొత్తం బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు అనేది తెలియలేదు. రాజధానికి కాంగ్రెస్ శ్రేణులు కొరాపుట్: ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజధాని భువనేశ్వర్‌కు బుధవారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. మరోవైపు నబరంగ్‌పూర్ జిల్లా నుంచి పిసిసి మాజీ ఉపాధ్యక్షుడు మున్నా త్రిపాఠి నేతృత్వం కాంగ్రెస్ కార్యకర్తలు బయల్దేరారు. గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యాక్రమంలో వీరు పాల్గోనున్నారు. -
ఏసీ లక్ష్మీ బస్సులు ప్రారంభం
జయపురం: ముఖ్యమంత్రి బస్సు సేవా పథకంలో భాగంగా జయపురం నుంచి ఏడు ఏసీ లక్ష్మీ బస్సులను బుధవారం ప్రారంభించారు. కొత్త బస్సులు జయపురం – గుణుపూర్, జయపురం– కాశీపూర్ వయా లక్ష్మీపూర్, జయపురం – మల్కన్‌గిరి, జయపురం – కొటియ, జయపురం – చందాహండి, జయపురం – భవానీపట్న, జయపురం – కొటాగాంకు వేశారు. ఒక్కొక్క బస్సులో 50 సీట్లు ఉంటాయని ఓఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. సర్వీసులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల పాత్ర గురుతరమైనది జయపురం: సహకార సంస్థల ప్రగతి, ఉద్యమంలో మహిళల పాత్ర గురుతమైనదని వక్తలు పేర్కొన్నారు. స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ సభా గృహంలో ‘సహకార సమృద్ధి – మహిళల భూమిక’పై బుధవారం వర్క్‌షాపు నిర్వహించారు. కేసీసీ బ్యాంక్ పరిచాలన కమిటీ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. సమాజంలో మహిళల ఆర్థిక, సామాజిక ఉన్నతి కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయని వివరించారు. సహకార ఆందోళనలో మహిళలు మమేకమైతే అది సమాజానికి మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. మహిళలు పశుపాలన, వ్యవసాయ యాజమాన్యంపై అవగాహన పొందాలని సూచించారు. అనంతరం పలు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు కేసీసీ బ్యాంకు రూ.5 లక్షల చొప్పున రుణాలు అందజేసింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సొశ్మిత మెలక, డీఆర్‌సీఎస్ భీమసేన్ సాహు, ఏఆర్సీఎస్ శొశానంద బెహర, డీఈవో కమల లోచన మఝి, ఏజీఎం హరిశ్చంద్ర బొనాగడి, కేసీసీ బ్యాంక్ డైరెక్టర్ రమాకాంత రౌలో పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండి రాయగడ: తమ సమస్యలు పరిష్కరించాలని ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఫరూల్ పట్వారీని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ట్రాక్టర్లు నడుపుతున్నప్పటికీ, ప్రభుత్వ విధానాల వలన పూట గడవడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గృహ, రహదారి నిర్మాణ పథకాలు కోసం ఇసుక, రాళ్లు వంటివి సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ, రాయల్టీ సరిగ్గా ఇవ్వడం లేదని వాపోయారు. ఇసుక లోడ్ కోసం అనుమతి ఇస్తే వై ఫారం (ట్రాన్జిట్ పాస్) జారీ చేసినప్పటికీ, అది కేవలం గంటన్నర వ్యవధి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఆ వ్యవధి దాటితే ట్రాక్టర్‌ను సీజ్ చేసి సుమారు రూ.40 వేల జరిమానా విధిస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవేళ సీజ్ చేస్తే తిరిగి చేతికి వచ్చేసరికి నెల రోజులు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ గోడు విని నిబంధనలు సడలించాలని కోరారు. వినతిపత్రం సమర్పించినవారిలో దూడల శ్రీనివాసరావు, వై.చంద్ర, కిషోర్ తదితరులు ఉన్నారు. గుండెపోటుతో బలరాం మటం మృతి కొరాపుట్: జిల్లాలోని నందపూర్ సమితి మాజీ చైర్మన్ బలరాం మటం(57) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఆయన 1997 నుంచి 2002 వరకు జనతాదళ్ పార్టీ మద్దతులో పదవిలో కొనసాగారు. పొడువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లురు గ్రామ పంచాయతీ దిమిరి ఖుతుబ్ గ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. బీజేడీ మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం పొడాల్, పీతం పాఢీ, ప్రపుల్ల పంగిలు సంతాపం తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో అటెండర్ మృతి
అరసవల్లి: ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఎస్ఈ కార్యాలయం నీటి కోసం మోటార్ స్విచ్ వేయడానికి వెళ్లిన కార్యాలయ అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు(47) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో అందరూ విధుల్లో ఉండగా ఈదుర్ఘటన జరగడంతో ఇటు ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అటు జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం మోటార్ వేయడానికి వెళ్లి ఇంకా రాలేదని మరో అటెండర్ శార్వాణి వెళ్లినప్పటికే అచేతనంగా ఆనందరావు పడి ఉండటంతో మిగిలిన సిబ్బందికి సమాచారాన్ని అందించింది. 108 వాహనం సిబ్బంది వచ్చేసరికే మృతి చెందినట్లు వారు ధృవీకరించారు.వన్‌టౌన్ ఎస్సై హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. స్థానిక దేశెల్ల వీధిలో నివాసముంటున్న ఆనందరావు స్వస్థలం నందిగాం మండలం కల్లాడ గ్రామం. భార్య దుర్గ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆనందరావు మృతి పట్ల జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, జెడ్పీ చైర్పర్సన్ కార్యాలయ సీసీ అప్పన్న, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రంగప్రసాద్, డీఈ లలితకుమారి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌తో విద్యార్థి దుర్మరణం బూర్జ: మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన బూరి మణికుమార్ (18) విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందాడు. మామయ్య నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇంటి గోడలను నీటితో తడుపుతూ ఇనుప నిచ్చెన తీస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేసరికే మృతిచెందాడు. మణికుమార్‌కు తల్లిదండ్రులు దుర్గారావు, కేసరి, సోదరి ఉన్నారు. చేతికందిన కుమారుడు విద్యుత్ షాక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీకాకుళం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఘటన కల్లాడలో విషాదఛాయలు -
సస్పెన్షన్ వేటు..!
నిరసనల ఘాటు..● 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ ● వారం రోజుల పాటు కొనసాగనున్న ఆదేశాలు ● క్రమశిక్షణ ఉల్లంఘించడంపై చర్యలు: స్పీకర్ సురమా పాఢీ భువనేశ్వర్: శాసనసభలో అనుచిత ప్రవర్తన ఆరోపణ కింద కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. స్పీకర్ సురమా పాఢి ఆదేశాల మేరకు 12 మంది కాంగ్రెస్ సభ్యులను సభా కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ఆదేశాలు వారం రోజుల పాటు నిరవధికంగా అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. సభలో బడ్జెటు సమావేశాల కార్యకలాపాల సమయంలో పదేపదే అంతరాయం ఏర్పరచి క్రమశిక్షణను ఉల్లంఘించడంతో ఈ చర్య అనివార్యమైనట్లు స్పీకర్ పేర్కొన్నారు. అధికార పక్షం చీఫ్ విప్ ప్రతిపాదన మేరకు చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ సభ్యుల నిరసన సస్పెన్షన్ చర్యకు నిరసనగా శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఘంటానాథం, తాళాల మోత, వేణు గానం తదితర వాద్యాలతో తమ నిరసనలు వ్యక్తం చేశారు. శాసనసభలో 14 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. వీరిలో 12 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో కాంగ్రెస్ శాసన సభా నాయకుడు రామచంద్ర కదం, అశోక్ కుమార్ దాస్, సత్యజిత్ గొమాంగో, పబిత్ర సంవుట, సాగర్ చరణ్ దాస్, నీల మాధబ్ హికాకా, ప్రఫుల్ల చంద్ర ప్రధాన్, సోఫియా ఫిరదౌస్, డాక్టర్ సి.ఎస్.రాజెన్ ఎక్కా, మంగు ఖిల్లా, దాశరథి గొమాంగో, కద్రక అప్పల స్వామి ఉన్నారు. కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ బాహిణీపతి మరియు రమేష్ జెనాలు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. మహిళల భద్రతపై ఆందోళన రాష్ట్రంలో మహిళల భద్రతపై కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో గత కొన్ని రోజులుగా ఆందోళన తెలుపుతున్నారు. మహిళల భద్రత స్థితిగతుల దృష్ట్యా సభా కమిటీ ఏర్పాటు చేసి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సభలో బడ్జెట్ సమావేశాలు ఆరంభం నుంచి ఇదే కొనసాగుతోంది. తమ డిమాండ్ మేరకు మహిళల భద్రతపై సభా కమిటీ ఏర్పాటు చేయనంతవరకు నిరసన నిరవధికంగా కొనసాగిస్తామని బాహాటంగా కాంగ్రెస్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రకటన జారీ చేసిన స్వల్ప వ్యవధిలో సభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్లు స్పీకర్ నిర్ణయం ప్రకటించడం రాజకీయ శిబిరాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. సస్పెన్షన్ దురదృష్టకరం సభలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో అన్నారు. స్పీకర్‌పై తాము సముచిత గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సభను సమర్ధవంతంగా నడపలేకపోతోందని ఆరోపించారు. మహిళల భద్రత అంశంపై సభా కమిటీ ఏర్పాటు డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని, రానున్న రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా మహిళల భద్రతపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ ప్రకారం అధికార పార్టీ అంగీకరించి సభా కమిటీని ఏర్పాటు చేసి ఉండాల్సిందని బీజేడీ ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ సాహూ ఏకీభవించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 12 మంది ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. గత 10 రోజులుగా సభలో కొనసాగుతున్న పరిస్థితులను సమర్దవంతంగా పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే శాసన సభలో సమావేశాలు పురస్కరించుకుని ప్రభుత్వం రోజుకు సగటున రూ.70 లక్షలు వెచ్చిస్తోందని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బాబు సింగ్ తెలిపారు. ప్రతిపక్షాలు కీలకమైన చర్చలను అడ్డుకొని అమూల్యమైన సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. విస్తృతంగా చర్చ ఒక వైపు శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల నిరంతర అంతరాయం, మరోవైపు అధికార పక్షం ఏకపక్షంగా 12 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై మేధావుల వర్గంలో చర్చలు జోరందుకున్నాయి. సమావేశాలు పురస్కరించుకుని ప్రజల అవసరాలు, సమస్యలపై నిర్మాణాత్మక సంభాషణలు, ప్రశ్నోత్తరాలు, చర్చలు కొనసాగించే పరిస్థితులు దాదాపు కనుమరుగైపోవడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. బీజేడీ శాంతియుత నిరసన మహిళల భద్రత అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన తారస్థాయికి చేరుకుంది. అయితే ఇదే శీర్షికతో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ హుందాగా నిరసన తెలిపింది. మంగళవారం సమావేశ హాలు ప్రధాన ప్రవేశ మార్గం ఆవరణలో ప్లకార్డులతో బైఠాయించి శాంతియుతంగా నిరసన ప్రదర్శించింది. అదేవిధంగా సభలో తాజా స్థితిగతులపై విపక్ష బిజూ జనతా దళ్ సభ్యురాలు ప్రమీల మల్లిక్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కాంగ్రెస్ సభ్యులపై తీసుకున్న చర్య ఆమోదయోగ్యం కాదని ఆమె తేటతెల్లం చేశారు. ఈ పరిస్థితిపై సీఎం మోహన్‌చరణ్ స్పందించాలని కోరారు. 12 మంది సభ్యులను సస్పెండ్ చేసే ముందు విపక్షాలతో చర్చించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన అమ్మవారికి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపారు. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అర్చకులు నేతేటి ప్రశాంత్ అమ్మవారిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. రాజీపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపుజియ్యమ్మవలస: మండలంలోని చింతలబెలగాం పంచాయతీ రాజీపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏనుగులు మంగళవారం దర్శనమిచ్చాయి. ఉదయం వెంకటరాజపురంలోని వరిపంటను ధ్వంసం చేసి సాయంత్రానికి వెంకటరాజపురం, బాసంగి మీదుగా చింతలబెలగాం, రాజీపేట గ్రామంలోకి జారుకున్నాయి. రాత్రి సమయమంలో గ్రామంలోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరిపంట, అరటి ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థినికి డీఈఓ అభినందనలుపాచిపెంట: లక్నోలో ఇటీవల జరిగిన 1500 మీటర్లు, 3వేల మీటర్ల పరుగుపందెంలో పాచిపెంట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని జోత్స్న పాల్గొంది. అండర్ 17 విభాగంలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిని డీఈఓ నాయుడు మంగళవారం అభినందించారు. విద్యార్థినికి పాఠశాల హెచ్ఎం ఈశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు అభినందనలు తెలిపారు. మహిళ మృతిపై కేసు నమోదురాజాం సిటీ: పట్టణ పరిధి మల్లికార్జునకాలనీ 7వ లైన్లో నివాసం ఉంటున్న కెల్ల లక్ష్మి (44) మృతిచెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. వీధిలో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఇంటి తలుపులు తీయగా ఇంటిలోపల ఆమె మృతదేహం కనిపించిందని ఎస్సై తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉంటుందని, ఇంట్లో ఒక్కతే ఉండేదని, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో ఉంటున్నాడని చెప్పారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సామాజిక, ఆర్థిక సర్వేల ఆధారంగా ప్రణాళికలు కొత్తవలస: జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించే సామాజిక, ఆర్థిక సర్వేల ఆధారంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తామని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజశేఖర్ తెలిపారు. మండలంలోని కంటకాపల్లి గ్రామంలో జాతీయ శాంపిల్ సర్వే వజ్రోత్సవాల నిర్వహణలో భాగంగా 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. గృహ వినియోగ, ఉద్యోగిత–నిరుద్యోగిత రేటు, సమయ వినియోగం, పంట దిగుబడి, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సర్వేలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ గణాంకాధికారులు ఎస్.పళ్లంరాజు, ఎస్.వెంకటేశ్వరరావు, కె.వి.సురేష్‌కుమార్, బి.శ్రీనివాసరావు, టి.వేణుగోపాల్, ఆర్.శ్రీనివాసరావు, తహసీల్దార్ బి.నీలకంఠరా వు, ఎంపీడీఓ ఎస్.రమణయ్య, సహాయ గణాంకాధికారి వారణాసి సన్యాసిరావు, గ్రామ పెద్దలు మదీన అప్పలరమణ పాల్గొన్నారు. -
ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడడం మనందరి బాధ్యత
● డీఎఫ్ఓ కొండలరావు పూసపాటిరేగ: సముద్రంలో నివసించే ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడడం మనందరి బాధ్యతని డీఎఫ్ఓ కొండలరావు అన్నారు. పూసపాటిరేగ మండలం పులిగెడ్డపేట తీరంలో 270 ఆలివ్‌రిడ్లే తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచిపెట్టా రు. ట్రీ ఫౌండేషన్, అటవీశాఖ ఆధ్వర్యంలో 10 రక్షణ కేంద్రాల్లో 517 తాబేళ్ల ద్వారా 56,065 గుడ్లను సంరక్షించినట్టు తెలిపారు. టేకు వలలు, నానాజాతి వలలను మత్స్యకారు లు చేపల వేటకు వినియోగించడంతో ఆలివ్రిడ్లేలకు ముప్పువాటిల్లుతోందన్నారు. సముద్ర తాబేళ్లను కాపాడడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యసంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి అప్పలరాజు, ఫారెస్టు సెక్షన్ అధికారి మధుమోహన్, ట్రీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ కామయ్య, తదితరులు పాల్గొన్నారు. రైతు ఉత్త్పతిదారుల సంఘాలకు నాబార్డు చేయూత నెల్లిమర్ల రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు నుంచి ఆర్థిక సహాయం అందజేస్తామని జిల్లా మేనేజర్ నాగార్జున తెలిపారు. మండలంలోని సతివాడ గ్రామంలో శుభోదయం రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో మంగళవారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల ఏర్పాటు, డ్రోన్ మిషన్లు, యాంత్రీకరణ పనిముట్లు కొనుగోలు కు సాయం అందజేస్తామన్నారు. రైతులంతా ఒకే మాటపై ఉండి సంఘ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ జోనల్ ఇన్చార్జి గోపాల్‌కృష్ణ గోఖులే, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, బీఆర్ఈడీఎస్ సీఈఓ రామకృష్ణరాజు, సీఈఓ పతివాడ సత్యనారాయణ, సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, నాయకులు జమ్ము అప్పలనాయుడు, పంచాది శ్రీరాములనాయుడు, దురగాశి ఎర్రంనాయుడు, మత్స శ్రీనివాసరావు, కంది శ్రీను, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
రైల్వేసేవా పురస్కారాలు ప్రదానం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం 69వ రైల్వే సేవా పురస్కారాల ప్రదానోత్సవం స్థానిక రెటాంగ్ కాలనీ కల్యాణ మండంలో మంగళవారం జరిగింది. మండల సీనియర్ కార్మిక అధికారి ఎస్డీపీవో ఆర్.ఎన్.ఎ.పరిడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల రైల్వే అధికారి డీఆర్ఎం హెచ్.ఎస్.బాజ్వా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర అతిథులుగా తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షురాలు గురు సిమ్రాన్ కౌర్, అదనపు మండల రైల్వే అధికారి ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) పి.కె.బెహెరా, ఏడీఆర్ఎం (ఇంఫ్రా) సుభ్రజ్యోతి మండల్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందజేసిన 56 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రటించిన ఉచిత ఇసుక విధానం కొంతమందికి కాసులు కురిపిస్తోంది. పగటి పూట అధికారులు దాడులు చేస్తారని భావించి రాత్రివేళల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు దర్జాగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల నుంచి ఇసుకను పాతపట్నం మీదుగా ఆల్ ఆంధ్రా రహదారిలో మెళియాపుట్టి గ్రామ వీధుల్లో నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు రూ.2000 చొప్పున అపరాధ రుసుం విధించారు. తర్వాత వారిని వదిలేయడంతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ సాయంత్రమైతే పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఒడిశాకు రాత్రివేళల్లో తరలించుకుపోతున్న వైనం ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు అడ్డుకుంటాం.. గతంలో ఇదేవిధంగా చేస్తే ఒడిశా బోర్డర్ వద్ద మా సిబ్బందితో కలిసి పరిశీలన చేయించాం. ఇసుక తరలిస్తున్న వారిని వీఆర్వోలు అడ్డుకున్నా ఆపకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు రాత్రివేళల్లో, సెలవురోజుల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సాయంతో అడ్డుకుంటాం.. – పాపారావు, మెళియాపుట్టి తహశీల్దార్ కట్టడి చేస్తాం.. ఇదివరకే మహేంద్రతనయ నదీ తీరంలో నిఘా పెట్టాం. మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మావంతు చర్యలు తీసుకుంటున్నాం. – రమేష్ బాబు, మెళియాపుట్టి ఎస్సై -
తరలిపోతున్న వృక్ష సంపద..!
● పట్టించుకోని రెవెన్యూ, అటవీశాఖ అధికారులుకొమరాడ: మండలం నుంచి వేలాది రూపాయల విలువ చేసే అటవీ సంపద రాత్రివేళ నాటుబళ్లు, ట్రాక్టర్ల సహాయంతో తరలిపోతోంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్ష సంపద నరికి వేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఒడిశా సరిహద్దు నుంచి టేకు కలప చడీచప్పుడు లేకుండా రవాణా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అక్రమ వ్యాపారులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. టేకుకలప తరలించాలంటే కచ్చితంగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కొమరాడ మండలం నుంచి పార్వతీపురం సా మిల్లులకు తరలించిన తరువాత అక్కడినుంచే సంబంధిత శాఖ అధికారులకు మామూళ్లు వెళ్తాయని సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పరీక్షలంటే భయాన్ని వీడండి
సాలూరు: విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడనాడాలని సబ్‌కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూసి మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు? ఏ విధమైన ప్రణాళిక ద్వారా చదువుతున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. పరీక్షల్లో ప్రణాళికా బద్ధంగా చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
పశువులకు ఆధునిక వైద్యం అవసరం
పర్లాకిమిడి: రోడ్లపై ప్లాస్టిక్ పదార్థాలను తినడం వలన పశువులు రోగాల బారిన పడుతున్నాయని, అందువలన వాటికి ఆధునిక వైద్యం అవసరమని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో పశువులకు ఆధునిక వైద్య విధాన శిక్షణ ఆస్కాడ్– 2025 తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పశువైద్యశాఖ అధికారి రమాకాంత రోణా మాట్లాడుతూ.. పశు వైద్యులు గ్రామాల్లో పర్యటించి చికిత్సలు అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. పాడి రైతులు అధిక పాల దిగుబడులు సాధించేలా సూచనలు అందించాలని సూచించారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఆస్కాడ్ పశువైద్యుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో తొమ్మిది జిల్లాల నుంచి పశువైద్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ కళాశాల డీన్ ఆర్.కె.స్వయిని, ట్రైనింగ్ కో–ఆర్డినేటర్ గిరీష్ మహంతి, సెంచూరియన్ వర్సిటీ డీన్ డా.అనితా పాత్రో, అగ్రికల్చర్ స్కూల్ డీన్ డాక్టర్ ఎస్పీ నందా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బిజయకుమార్ దాస్ -
● అక్రమ కలప స్వాధీనం
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి ఎంవీ 23 గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను జిల్లా అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని శ్రీనివాస్ బేపారి అనే వ్యక్తి ఇంట్లో కలప ఉన్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అటవీ అధికారుల బృందం మంగళవారం తెల్లవారుజామున ఆ ఇంటిపై దాడి చేశారు. వీరి రాకతో విషయం తెలుసుకున్న శ్రీనివాస్ పరారయ్యాడు. దీంతో నిల్వ ఉంచిన రూ.లక్షలు విలువజేసే కలప స్వాధీనం చేసుకున్నారు. దాడిలో రేంజర్ రమేష్ చంద్ర రౌత్, ఫారెస్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ దెబ్బ.. పేకాటరాయుళ్ల అబ్బా..!
విజయనగరం క్రైమ్: జిల్లాలో డ్రోన్స్ సహాయంతో పేకాట, కోడి పందాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. విజయనగరంలోని హుకుంపేట శివారు, పూసపాటిరేగ మండలం వెంపడాం వద్ద మంగళవారం పోలీసులు డ్రోన్స్ ఉపయోగించి పేకాట ఆడుతున్న, కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు సిబ్బంది హుకుంపేట శివారులో పార్కింగ్ చేసిన లారీలో పేకాట ఆడుతున్న వారిపైకి డ్రోన్‌ను వంపి, శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు నిర్ధారించుకుని, రైడ్ చేసి పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,600 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల శిబిరంపై దాడిఅలాగే జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్బీ పోలీసులకు వచ్చిన సమాచారంతో వారిపైకి డ్రోన్ పంపి, సుదూర ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకుని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్‌సిబ్బంది రైడ్ చేసి, కోడి పందాలు ఆడుతూ, పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,600 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్బంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్‌ను వినియోగిస్తున్నామని, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెడుతున్నామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
భారీగా గంజాయి పట్టివేత
జయపురం: జయపురం సదర్ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నట్లు కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ తెలిపారు. స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించబడిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సదర్ పోలీసులు జయపురం సమితి కంజాయి మాలిగుడ ప్రాంతంలో సోమవారం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో 4 కార్లు అతివేగంగా బొయిపరిగుడ వైపు నుంచి వస్తున్నాయి. దీంతో అనుమానం వచ్చిన పెట్రోలింగ్ సిబ్బంది వాటిని ఆపాలని ప్రయత్నించారు. అయితే వారు కార్లు ఆపకుండా పెట్రోలింగ్ జరుపుతున్న పోలీసు సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులు ఆ కార్లును వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 కార్లలో ఉన్నటువంటి 8 మందిని అరెస్టు చేశారు. అలాగే కార్లలో తీసుకెళ్తున్న 340.400 కేజీల గంజాయి, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, 5 నుబాఎమ్యూనేషన్స్, 10 సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. అరైస్టెనవారిలో ఉమ్మిరి గ్రామానికి చెందిన రంజిత్ బాగ్, కార్తీక్ బాగ్, కర్ణ హరిజన్, రబీంద్ర బారిక్‌లు ఉన్నారు. వీరిపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. అలాగే మిగతావారు గౌతమ్ బాగ్, రవీంద్ర సామల్, సోను మంగూరియ, రాహుల్ కుమార్‌లుగా పేర్కొన్నారు. సమావేశంలో జయపురం ఎస్డీపీవో కావ్యపే పార్థసారధి తదితరులు ఉన్నారు. -
చికిత్స పొందుతూ కళాకారిణి సంతోషిణి మృతి
జయపురం: తన నటనా కౌశల్యంతో ప్రజలను అలరించిన బాల కళాకారిణి సంతోషిణి తరాశియ(13) చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. జయపురం మున్సిపాలిటీలోని జయనగర్ పాయిక సాహికి చెందిన దుర్గా ప్రసాద్ తరాశియ ఏకై క కుమార్తె సంతోషిణి. ఈమె పాఠశాల ఉత్సవాలు, పట్టణంలో జరిగే వివిధ ఉత్సవ వేదికలపైన ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంది. జయపురంలో వివిధ సంస్థలు నిర్మించిన 15 చిన్న సినిమాల్లో నటించి ప్రశంసలు పొందింది. అయితే ఇటీవల ఆమె అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమెకు జయపురం, కొరాపుట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజే ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందింది. దీంతో జయపురంలో విషాదచాయలు అలముకున్నాయి. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు జయపురం: క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. సమితిలోని ఫష్త్రల్బెడ గ్రామంలో ఉన్న విజ్ఞాన ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవాన్ని పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ కుమార్ నాయిక్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గుణాత్మక విద్యనభ్యసించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఔషధ మొక్కల వనాన్ని ప్రారంభించారు. పాఠశాల వార్షిక ముఖపత్రం ‘సమాధాన్’ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయపురం న్యాయ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నిరంజన్ మిశ్ర, పాఠశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జయపురం: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించేందుకు ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం జయపురంలో మంగళవారం పర్యటించింది. వీరు టంకువ పంచాయతీ, జయపురం పట్టణంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం జయపురం మున్సిపల్ సభాగృహంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేపట్టారు. పట్టణ ప్రధాన మార్గం, రాజానగర్, ప్రధాన ట్రాఫిక్ కూడలి ప్రాంతాల్లో పీఎం ఎస్బీఎన్ నిధి నుంచి రుణాలు తీసుకున్న లబ్ధిదారులను కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం అవాస్ యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. పథకాలను ప్రజలంతా సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. వారితో పాటు కలెక్టర్ వి.కీర్తి వాసన్, జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్యారెడ్డి, జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, జిల్లా సివిల్ సప్లయ్ విభాగ అధికారి సూర్యకాంత బెహర తదితరులు పాల్గొన్నారు. విద్యాభ్యాసాలకు ఆహ్వానాలు పర్లాకిమిడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు సీఎం మోహన్ చరణ్ మాఝి పేరిట ఆహ్వాన పత్రికలను కలెక్టర్ బిజయ కుమార్దాస్ పర్లాకిమిడిలో మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో డీఈవో డా.మాయాధర్ సాహు, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
రాయగడ: వివాహేతర సంబంధంతో ఒక అవివాహిత, వివాహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సదరు పోలీస్‌స్టేషన్ పరిధి రైతుల కాలనీ ఏడోలైన్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైతుల కాలనీ 7వ లైన్లో నివసిస్తున్న కోడూరు రమేష్ అనే వివాహితుడు, తన ఇంటి పక్కనే నివసిస్తున్న ఒక అవివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వీరిద్దరూ ఒకే గదిలో ఉండడం గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని బయటపెట్టారు. దీంతో గది లోపలే ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు వారిద్దరినీ చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ హెచ్ఎం మృతి
బొబ్బిలి: పట్టణంలోని నాయుడు కాలనీలో గల ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామ్‌సుందర్(80) రెండో అంతస్తు నుంచి పడిపోయి మంగళవారం మృతిచెందారు. బాడంగి మండలం పాల్తేరులో హెచ్ఎంగా రిటైరైన ఆయన బొబ్బిలిలోని ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వై.విజయమోహన్ తండ్రి. మంగళవారం మేడపై ఉన్న ఆయన ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందికి పడిపోయినట్లు, ఆల్జీమర్స్‌తో కొద్దికాలంగా బాధపడుతున్నట్లు కోడలు గ్రేస్కుమారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్సై ఆర్.రమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై చెప్పారు. -
శాసనసభ నేటికి వాయిదా
భువనేశ్వర్: శాసనసభలో కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసిన అనంతరం సభా కార్యక్రమాలను బుధవారం నాటికి నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో రాత్రంతా నిరసన ప్రదర్శనలు చేపడతామని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడిందన్నారు. ఇదో కళంకిత చరిత్రగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు నిరవధికంగా పోరాడుతామని హెచ్చరించారు. అలాగే సభ్యుల సస్పెన్షన్‌పై 27న అసెంబ్లీ ముట్టడిస్తామని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ తెలియజేశారు. పోక్సో చట్టంపై అవగాహన శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ 4వ లైన్లో ట్రైబల్ హాస్టల్ల్లో పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–పోక్సోపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. అశ్లీల చిత్రాలు చూపించడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ.రాజారావు, ఆర్.అప్పలస్వామి, జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మల్కన్‌గిరిలో శుభాశర్మ పర్యటన
మల్కన్‌గిరి: జిల్లాలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శుభాశర్మ మంగళవారం పర్యటించారు. ఆమెకు కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు, తల్లిదండ్రులు తదితరులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో బాలికల భద్రతాపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే చిత్రకొండ సమితిలో పర్యటించి అక్కడి మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇరుగ్రామాల యాదవుల కొట్లాట
బాడంగి: గొర్రెల మేత విషయంలో ఇరుగ్రామాలకుచెందిన యాదవులు కొట్లాటకు దిగడంతో ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మండలంలో జరగ్గా గాయపడిన వారి బంధువులు తెలిపిన సమాచారం ఇలా ఉంది. మండలంలోని గొల్లాది, కామన్నవలస గ్రామాలకుచెందిన యాదవులు గొడవపడి కర్రలతో కొట్టుకోగా కామన్నవలసకు చెందిన పడాల లక్షుం, కామేశ్వరరావు, సింహాచలం, ఆదినారాయణలు, గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు, చప్పసత్యం గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని 108లో స్థానిక ఆస్పత్రికి తీసుకురాగా ప్రథమచికిత్స చేసిన డాక్టర్ హారిక వారిలో ఈపుఈశ్వరరావు, పడాల లక్షుంల పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు క్షతగాత్రుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తం
భామిని: ఆస్పత్రి ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చి,హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ భాస్కరరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన భామిని మండలంలోని బత్తిలి, భామిని, బాలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బత్తిలి పీహెచ్సీలో నిర్వహిస్తున్న నూట్రీ–గార్డెన్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. భామిని పీహెచ్సీలో మందుల నిల్వలు పరిశీలించి,ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలను గుర్తించారు. బాలేరు పీహెచ్సీలో వైద్యసిబ్బంది హాజరు పట్టీ పరిశీలించారు. డీఎంహెచ్ఓ వెంట బత్తిలి డాక్టర్లు రవీంద్ర, దామోదరరావు, భామిని వైద్యులు సోయల్, సంతోషిలక్ష్మి, బాలేరు వైద్యాధికారి శివకుమార్, సీహెచ్ఓ భాస్కరరావు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
ఉద్యోగులకు శిక్షణ తరగతులు
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ–ఆఫీస్ శిక్షణ తరగతులు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. డిజిటల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్రియాశీల, సరళీకృత, పారదర్శకత విధానంపై అవగాహనకు ఉద్యోగులు శిక్షణలో పాల్గొనాలని కోరారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన శిక్షకులు దీపక్ కుమార్ మల్లిక్, కవితారాణి రౌతో ఈ–ఆఫీస్ పని విధానాన్ని తెలియజేశారు. ఈ తరగతులు ఈనెల 28 వరకు జరుగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో, ఎన్ఐసీ జిల్లా అధికారి టి.బాలకృష్ణ మూర్తి, ఎన్ఐసీ డీఐవో రాజా ఆనంద్, సీఎంజీఐ కో–ఆర్డినేటర్ ప్రశాంత కుమార్ సాహు పాల్గొన్నారు. జగన్నాథుని సన్నిధిలో జస్టిస్ హరీష్ టండన్ భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయాన్ని జస్టిస్ హరీష్ టండన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజార్చనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక రోజు ముందుగా శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. బుధవారం రాష్ట్ర హైకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టండన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. -
నాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు
రాయగడ: తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్ స్పష్టం చేశారు. స్థానిక సిరిగుడలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోపై దురుసుగా ప్రవర్తించానని వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏడీఎంను కలిసి చర్చించిన మాట వాస్తవేమేనని, అయితే ఆ సమయంలో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివరాలను ఒక అధికారిని అడగడం తప్పా అని ప్రశ్నించారు. అలాగే వ్యాపారవేత్తలు, విద్యాసంస్థ యజమానుల వద్ద ఉగాది పేరిట చందాలు దౌర్జన్యంగా వసూళ్లు చేస్తున్నారన్న వచ్చినవి నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. మిల్లర్స్ అసోసియేషన్, జ్యూయలరీ షాప్ యజమానులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. తమపై ఎటువంటి ఒత్తిడి తీసుకొని రాలేదని స్వయాన ఆయా సంస్థలకు చెందినవారు తనకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారని వివరించారు. సమావేశంలో ఆయనతో పాటు బీజేపీ నాయకులు బసంత కుమార్ ఉలక, త్రినాథ్ గొమాంగో, జగన్నాథ నుండ్రుకలు పాల్గొన్నారు. బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్ -
ఉగాది పురస్కారాలకు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి ఆదిత్యానగర్ కాలనీలోని మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ (ఎంసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 30న విశ్వావసు నామ ఉగాది పురస్కారాలను వివిధ రంగాలలో ప్రముఖులకు అందజేస్తున్నట్లు నిర్వాహకులు భాగ్యలక్ష్మి, నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలరంజని సంస్థ ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాలలో ప్రతిభ సాధించిన బాలలకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.వాండ్రంగి కొండలరావు (సాహిత్యరత్న), బద్రి కూర్మారావు (సేవా రత్న), కంటు మురళీగోవింద్ (నాట్యరత్న), ఎర్రపాటి అప్పారావు (నటరత్న), నేరెళ్ల సత్యనారాయణ (గానరత్న), ఆచింటు లక్ష్మణరావు (వాయిద్యరత్న), వడగ సుబ్రహ్మణ్యం (హరికథారత్న), ఇంజరాపు మోహన్‌రావు (వైద్యరత్న), యాపార శ్రీనివాస్ (యువ సేవారత్న), ఎలినాటి ధరణి (బాలరత్న–కోలాటం), బి.సన్నిహిత్ (బాలరత్న–చిత్రలేఖనం), ఎం.లిప్సి శ్రీవల్లి జయదేవ్‌కుమార్ (కూచిపూడి, సంగీతం), శ్రీకాకుళం చిట్టి (బాలరత్న– ఇన్‌స్ట్రాగామ్), బిన్నాడ దీక్షిత్ (శ్లోకపఠనం)లకు పురస్కారాలు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, నగరంలోని సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షుడు ఉమాకవికి నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు విశిష్ట ధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారానికి ఎంపికై నట్లు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ ఒక ప్రకనటలో తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు రేపు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న ఉదయం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కార్యదర్శి, కోశాధికారి, క్రీడా, లైబ్రరీ కార్యదర్శుల పోస్టులకు ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవమయ్యాయి. కార్యదర్శిగా మోటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, లైబ్రరీ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నిక జరగనుంది. ఉప సర్పంచ్‌పై చర్యలకు వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచి మరో పార్టీలో చేరి ఇప్పుడు మేజర్ పంచాయతీ పరిపాలనకు ఆటంకంగా మారిన నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి సాయి ప్రత్యూషకు ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్‌పై పాలకవర్గంలోని 16 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ కోరాడ చంద్రభూషణ గుప్తా, మెంబర్లు వార్డు రఘుపాత్రుని శ్రీధర్, బంకుపల్లి శర్మ, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, ఎంపీటీసీ బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, మాజీ డైరెక్టర్ బబ్బోది ఈశ్వరరావు, సతివాడ రామినాయుడు, తోట భార్గవ్ తదితరులు ఉన్నారు. 14 కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు కాశీబుగ్గ: ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి నుంచి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన త్యాగు, విఘ్నేష్, అజిత్‌లు మంగళవారం పర్లాఖిమిడి నుంచి గంజాయి తెప్పించుకుని పలాసలో తమిళనాడు వెళ్లే రైలు కోసం వేచి ఉండగా సీసీ కెమెరాల్లో వారి కదలికలపై అనుమానం వచ్చిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు వారిని తణిఖీ చేశారు. వారి వద్ద రూ.74 వేలు విలువైన 14.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో మరో ముగ్గురు అరెస్టు ఆమదాలవలస: పట్టణంలోని కండ్రపేట వీధి వెనుక శ్మశానవాటిక గత ఏడాది అక్టోబర్ 27న ఐదు కిలోల గంజాయిని అప్పటి ఎస్ఐ కె.వెంకటేష్ నేతృత్వంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఏడుగురిలో నలుగురు పట్టుబడగా ముగ్గురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాకుళం నానుబాలవీధికి చెందిన తమ్మినేని సాయి, శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన మైపల్లి రాంబాబు, ఆమదాలవలస వాంబే కాలనీకి చెందిన పాలకొండ చిన్న నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపారు. నిందితులను ఆమదాలవలస సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. -
వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
విజయనగరం టౌన్: వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని ప్రతి జిల్లాలో కచ్చితంగా అమలుచేయాలని ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వయోశ్రేష్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో వయోశ్రేష్టుల రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సబ్‌డివిజనల్ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రెవెన్యూ సబ్ డివిజన్ స్ధాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని, కలెక్టర్ స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి జిల్లా స్థాయిలో వచ్చే వయోశ్రేష్టుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి జిల్లాలోనూ కమిటీలు వేసి మూడు నెలలకొకసారి కమిటీ సమావేశం నిర్వహించి వయోశ్రేష్టుల సంక్షేమంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వయోశ్రేష్టుల శేషజీవితం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి, కార్యదర్శి రామచంద్రరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, వెంకటరమణ, తదితరులు దివంగత కేపీ ఈశ్వర్ మృతిపట్ల మౌనం పాటించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎస్.కుప్పూరావు, ప్రతినిధులు త్రినాథప్రసాద్, బసవమూర్తి, జగన్నాథరావు, గిడుతూరి పైడితల్లి, అధిక సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫాస్ట్‌ఫుడ్ దుకాణంలో సిలిండర్ లీక్
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి కాట్రగుడ గ్రామంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో వంట గ్యాస్ లీకై ంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్లను బయటకు తీసి ప్రమాదాన్ని తప్పించారు. ప్రమాదంలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రం యజమాని సుశాంత్ తీవ్రంగా గాయ పడ్డారు. కత్తి చూపి గొలుసు దొంగతనం జయపురం: జయపురంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు స్నాచర్లు ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించి మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకు పోయారని ఫిర్యాదులు అందయాని స్థానిక పోలీసులు సోమవారం తెలిపారు. ఎంజీ రోడ్డు నివాసులు జి.రమణమ్మ, ఆమె స్నేహితురాలు పి.హేమ సోమవారం ఉదయం వాకింగ్ కోసం పూర్ణాఘడ్లో దక్షిణ కాళీ మందిరం వెళ్తుండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి వారికి కత్తితో బెదిరించి వారి మెడలలో ఉన్న బంగారు గొలుసులు దోచుకు పోయారు. దుండగులు ఏనుగుల శాల వైపు వెళ్లిపోయినట్టు బాధితులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రోగ నిర్ధారణ మిషన్ కోసం ఆర్థిక సాయం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో సికిల్ సెల్ అనీమియా, క్షయ రోగ నిర్ధారణ స్క్రీనింగ్ కోసం నవరత్న కంపెనీ నాల్కో ఫౌండేషన్ వారు సోమవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ కు 1కోటి 24లక్షల 70వేలు చెక్కును అందజేశారు. ఈ సాయంతో అతి త్వరలోనే వ్యాధి నిర్ధారణ మిషన్‌ను తీసుకువస్తామని తెలిపారు. బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి పూజారిగుడ పంచాయతీ బాసినీగుడలో గల సహిద్ లక్ష్మణ నాయక్ డిగ్రీ కళాశాలలో వేసవి శిబిరం ఆదివారం ప్రారంభించారు. ఈ క్యాంపులో బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ రాజేష్ మహురియ రాష్ట్ర పురస్కార గ్రహీత స్వచ్ఛంద సేవకులు సంతోష్ కుమార్‌లు పాల్గొని బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు. పైపులు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు మల్కన్‌గిరి: వుల్కన్గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెగా మంచినీటి ప్రాజెక్ట్ నుంచి ఇనుప పైపులను ఆదివారం రాత్రి చోరీ చేసిన ఇద్దరిని గ్రామస్తులు పట్టుకొని కలిమెల పోలీసులకు అప్పగించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో కూఢ ఎండీవీ 8 గ్రామానికి చెందిన దేవబ్రత హాల్దార్, ఎంపీవీ 17 గ్రామానికి చెందిన అమిత్ మండాళ్ ఉన్నారన్నారు. కలిమెల ఐఐసీ చంద్రకాంత్ తండి వీరిపై కేసు నమోదు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపు నేడుఅరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు. -
వంతెనను ఢీకొట్టిన లారీ
రాయగడ: రాయగడ నుంచి ఆంధ్రకు వెళ్లే ప్రధాన రహదారి మజ్జిగౌరి మందిర సమీపంలో ఉన్న వంతెనను లారీ ఢీకొనడంతో ఈ మార్గంలో రాకపొకలు నిలిచిపోయాయి. సోమవారం ఛత్తీస్‌ఘడ్ నుంచి ఆంధ్ర వైపు బొగ్గు లోడుతో వెళ్లున్న లారీ వంతెన మలుపులో అదుపుతప్పి ఢీకొంది. శనివారం ఆంధ్ర నుంచి రాయగడ మీదుగా వచ్చిన లారీ వంతెన మధ్యలో మరమ్మతులకు గురై నిలిచిపోవయింది. చిన్న మార్గం కావడంతో రకాపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతవరకు ఆ లారీని వేరే ప్రాంతానికి తరలించకపొవడంతోపాటు వంతెన మలుపు వద్ద లారీ ఢీకొని ఉండి పోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపొయింది. పోలీసులు చొరవ తీసుకుని రాయగడ మీదుగా ఆంధ్ర వైపు వెళ్లే భారీ వాహనాలను వ్యూ పాయింట్ మీదుగా వెళ్లేలా మరలించడంతో కొంతమేర సమస్య కొలిక్కి వచ్చింది. తరచూ ఈ వంతెన వద్ద ఇటువంటి సమస్యలు తలెత్తుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
గంజాయితో యువకుడు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తూ ఒక యువకుడు సోమవారం పట్టుబడినట్లు సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్, సబరాపల్లికి చెందిన ఆమద్ ఆనంద్ సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయితో పట్టుబడ్డాడు. స్వగ్రామం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకు తరలించేందుకు రూ.3 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, పలాస రైల్వేస్టేషన్ రన్నింగ్ రూం పక్కరోడ్డులో నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చే సమయంలో పోలీసులను చూసి రెండు బ్యాగులు వదిలి ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వెంబడించగా నిఖిల్ పాని తప్పించుకోగా, ఆమద్ అనంద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 21.7 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకందారులు, మధ్యవర్తులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. -
రాష్ట్రంలో నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు: సీఎం
● మూడేళ్లలో 5.92 లక్షల పైబడి ప్రధాన నేరాలు ● భువనేశ్వర్ యూపీడీలో 250కి పైగా క్రిమినల్ కేసులు భువనేశ్వర్: రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి శాసన సభలో సోమ వారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10 ప్రధాన నేరాల కేటగిరీల కింద మొత్తం 5,92,257 కేసులు నమోదైనట్లు ముఖ్య మంత్రి తెలిపారు. రౌర్కెలా ఎమ్మెల్యే శారద ప్రసాద్ నాయక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హత్య, దోపిడీ, దొంగతనం, మోసం, అల్లర్లు, అత్యాచారం, మోటారు వాహన ప్రమాదాలు వంటి 10 ప్రధాన నేర వర్గాలుగా పేర్కొన్నారు. ఈ వర్గాల కింద పెరుగుతున్న నేరాల రేటును పరిష్కరించడానికి ఒడిశా పోలీసులు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు ముఖ్యమంత్రి సభలో వివరించారు. అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ఈఆర్ఎస్ఎస్) రాత్రింబవళ్లు పని చేసే టోల్ ఫ్రీ నంబర్ 112 కు డయల్ చేయడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో సత్వర సేవల్ని అందజేసేందుకు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. నేర దర్యాప్తు వ్యవస్థని సమర్థం చేశామని, కటక్‌లోని రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్‌లోని దర్యాప్తు సహాయ విభాగం సమర్థవంతమైన నేర దర్యాప్తుల కోసం జూమ్ మరియు గూగుల్ మీట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం విశేషంగా పేర్కొన్నారు. లింగ ఆధారిత హింస నివారణ లింగ ఆధారిత హింసను నివారించడానికి సంపర్క్ టోల్–ఫ్రీ నంబర్ 1800–4191–831 ప్రవేశపెట్టారు. అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 633 పోలీస్ స్టేషన్లలో మహిళలు మరియు పిల్లల డెస్క్‌లు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. భువనేశ్వర్ అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ (యూపీడీ)లో గత 9 నెలల్లో 285 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. వీటిలో 52 హత్యలు, 97 అత్యాచారాలు, 10 వరకట్న హత్య కేసులు, 1 వరకట్న ఆత్మహత్య కేసు, 37 వరకట్న హింస కేసులు, 44 వరకట్నయేతర హింస కేసులు, 42 మైనర్ బాలికల అత్యాచార కేసులు, 2 సామూహిక అత్యాచార కేసులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖరియార్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మాఝి ఈ వివరాల్ని సభలో ప్రవేశ పెట్టారు. -
గుసాని సమితిలో చైన్ స్నాచింగ్
పర్లాకిమిడి: గుసాని సమితి ఏడోమైలు జంక్షన్ వద్ద చైన్‌స్నాచింగ్ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో మూడు తులాల బంగారం చైన్‌ను తెంచుకొని పరారయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏడో మైలు వద్ద బుసుకిడి పంచాయతీకి చెందిన మజ్జి బైరాగి మాస్టార్.. ఆయన భార్య ఎం.జానకమ్మ స్కూటీపై పర్లాకిమిడి మెడికల్‌కు వచ్చి పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. ఏడోమైలు సమీపంలో ముఖానికి మాస్క్ వేసుకుని వెనుకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు మజ్జి జానకమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కుని రాయగడ వైపు పారిపోయినట్టు బాధితురాలు విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూటీ పైనుంచి దంపతులిద్దరూ రోడ్డు మీద పడిపోయారు. గురండి పోలీసు ఐఐసీ ఓం నారాయణ పాత్రో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడో మైలు జంక్షన్ వద్ద తరచూ చైన్ స్నాచింగ్ సంఘటనలు జరుగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయండి కొరాపుట్: తమ గ్రామంలో తక్షణం ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా సునాబెడాలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి సోమవారం సిమిలిగుడ సమితి రాజ్పుట్ గ్రామ పంచాయతీ చలాన్పుట్ గ్రామస్తులు తరలివచ్చారు. తమ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని అధికారులు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. స్పందించిన విద్యుత్ ఽశాఖ అధికారులు మూడు రోజులలో ట్రాన్స్ఫారం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. యువకుడు ఆత్మహత్య కొరాపుట్: గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్కొట్ సమితి దండసోర్ గ్రామ సమీపంలోని అడవుల్లోని చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని అటుగా వెళ్లిన గిరిజనులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు మల్కన్‌గిరి: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కేంద్రం గోజియాగూడ గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిత్రకొండ సమితి బోడఫోదర్ పంచాయతీ రేఖపల్లి గయరామం గ్రామానికి చెందిన జమున ఖరా, కలిమెల సమితికి చెందిన నీలాంఛల్ సాహులు వాహనాలతో ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు గాయపడడంతో ప్రాథమిక వైద్యం అనంతరం నీలాంచల్‌ను మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చిత్రకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు ్త చేస్తున్నారు. -
కార్టూన్స్ పోటీలో ‘శేఖర్‌బాబు’కు అవార్డు
పర్లాకిమిడి: విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం(విశాఖ) తరఫున నిర్వహించిన అంతర్రాష్ట్ర కార్టూన్స్ పోటీలలో పర్లాకిమిడి (ఒడిశా) కు చెందిన కార్టూనిస్టు శేఖర్‌బాబుకు ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు వచ్చింది. విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ఆదివారం జరిగిన బహుమతి ప్రదాన ఉత్సవంలో ప్రముఖ సాహితీవేత్త కావూరి సత్యవతి ముఖ్యఅతిథిగా పాల్గొని వేదికపై శేఖర్‌బాబుకు మెమొంటో, రూ.1000లు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం అధ్యక్షులు పి.వి.రామశర్మ, యస్.లక్ష్మణరావు (లాల్), టి.రాజేంద్రబాబు, కె.బి.ఎన్.కళాశాల ప్రిన్సిపల్ డా.క్రిష్ణవేణి, క్రియేటివ్ కల్చరల్ కమిషన్, డైరక్టర్ ఆర్.మల్లి కార్జున రావు, కార్టూన్ పోటీల నిర్వాహకులు కె.వి.వి.సత్యన్నారాయణ, హాస్యానందం ఎడిటర్ రాము పండా తదితరులు పాల్గొన్నారు. -
విషాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి రామగిరి ప్రాంతంలో తులసీనగర్‌లో ఐదుగురు చిన్నారులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు రామగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రామగిరిలో చికిత్స పొందుతూ ఒక చిన్నారి తులసీ బోడమొండి (5) మృతిచెందగా, పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి గుణాబతి బోడమొండి (3) మృతి చెందినట్టు ఆర్.ఉదయగిరి పోలీసులు తెలియజేశారు. మిగతా ముగ్గురు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఇచ్చే ఛతువా పిండిలో మరేదో ఆహారం కలిపి తినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ డాక్టర్లు అనుమానిస్తున్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
కంచిలి: మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం అర్థరాత్రి ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు, రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన కప్పల జగదీష్ రెడ్డి అనే యువకుడు ఆదివారం కొల్లూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను జాడుపూడి వద్ద భోళా శంకర్ దాబాకు ఆదివారం రాత్రి డిన్నర్‌కు వచ్చాడు. డిన్నర్ పూర్తి చేసుకొని తన బైక్ మీద జాడుపూడి కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఇచ్ఛాపురం నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కప్పల జగదీష్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్‌లో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వేకువజామున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. -
దేబేంద్ర శర్మకు నివాళి
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో సభ్యులు సోమవారం కాసేపు మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ మృతిపై సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. విపక్ష నేత నవీన్ పట్నాయక్ తరఫున ప్రసన్న ఆచార్య ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సురమా పాఢి సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం సభలో సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించి దివంగత మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర శర్మకు నివాళులు అర్పించారు. పవిత్ర పుష్కరిణిలో తేలిన శవం భువనేశ్వర్: పూరీలోని పవిత్ర శ్వేత గంగ పుష్కరిణిలో మృత దేహం తేలింది. బాలాసోర్ బొస్తా ప్రాంతానికి చెందిన గోవింద బింధాని శవంగా గుర్తించారు. ఈ శవాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. శవ పరీక్ష కోసం సదరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శియ్యాళీలో గ్రీవెన్స్ పర్లాకిమిడి: కాశీనగర్ సమితి శియ్యాళీ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ ముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్‌కు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్పండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్పందన కార్యక్రమానికి మొత్తంగా 79 వినతులు అల్లడ, కిడిగాం, గోరిబంద, ఖండవ పంచాయతీల నుంచి అందాయి. వాటిలో ఒకటి అక్కడికక్కడే పరిష్కరించగా, గ్రామసమస్యలు 29, వ్యక్తిగతం 50 ఉన్నాయి. కార్యక్రమానికి గుసాని సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి డంబురధర మల్లిక్, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ ఎంఎం ఆలీ, డీఎస్ఎస్ఓ సంతోష్‌కుమార్ నాయక్, సర్పంచు, సమితి సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో ఉమ్మర్‌కోట్ సబ్ డివిజన్ జొరిగాం సమితి డోడ్రా, రాయిఘర్ సమితి జొడింగాలో 33/11 కేవీ విద్యుత్ స్టేషన్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ, విద్యాశాఖ మంత్రి సోమవారం ప్రారంభించారు. నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్రా పాల్గొన్నారు. కాలుష్యంతో అవస్థలు జయపురం: జయపురం పట్టణ సమీప మొకాపుట్ ప్రాంతలో పురపాలక పరిషత్ వారు పట్టణంలో చెత్తను పారవేసేందుకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులో సోమవారం మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రాంత వాసులు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ యార్డుకు సమీపంలోనే ఆశ్రమ పాఠశాల ఉంది. డంప్ యార్డు నుంచి వెలువడే దుర్ఘంధం వలన విద్యార్థులు అనారోగ్యానికి లోనవుతున్నారు. యార్డులో మంటలు రేగడం వల్ల వేడి గాలలు వీస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వినతుల స్వీకరణ మల్కన్‌గిరి: జిల్లా కోరుకొండ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. సమితిలోని పలు పంచాయతీలకు చెందినవారు వినతిపత్రాలను అందజేశారు. పాత చిత్తపరికి రహదారి నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరారు. మొత్తం 27 వినుతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ వినోద్ పటేల్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సబర్, కోరుకొండ సమితిలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రానైట్ టిప్పర్ స్వాధీనం పర్లాకిమిడి: గుసాని సమితి యం.యస్.పూర్ గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న గ్రానైట్ లోడ్‌ను జిల్లా మైన్స్ అధికారి దిపెన్ పరిడా సోమవారం ఉదయం పట్టుకుని స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్‌కు తరలించారు. గ్రానైట్ తరలిస్తున్న టిప్పర్‌కు ఎటువంటి మైన్స్‌కు సంబంధించి లీజు కాగితాలు లభించకపోవడంతో గ్రానైట్ కంపెనీ యాజమానికి ఒక లక్షా ఆరువేల రూపాయల జరిమానాను జిల్లా మైన్స్ అధికారి దీపెన్ పరిడా విధించారు. నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్‌గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు. -
దుప్పలపాడులో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం అల్లు మహేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అల్లు మహేశ్వరరావు, అతని భార్య లక్ష్మి ఇరువురు తమ ఇంటికి తాళం వేసి ఉదయం కూలి పనులకు వెళ్లిపోయారు. వారు సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడ్డారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న నగదుతో పాటు సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. -
ఎట్టకేలకు నిఖిలేష్ మృతదేహం వెలికితీత
జయపురం: కెనాల్లో గల్లంతైన స్థానిక మహారాణిపేట రామ్దాస్లైన్ యువకుడు పి.నిఖిలేష్ మృతదేహాన్ని దాదాపు 60 గంటల తర్వాత వెలికి తీశారు. ఈ సంఘటనపై జయపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోస్టుమార్టం తర్వాత అతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పట్టణ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి వెల్లడించారు. ఉదయం కుంధారగుడ సమీప ప్రధాన కెనాల్లో శవం తేలుతుండటం ప్రజల చూశారు. ఆ మృతదేహం ధన్పూర్ శాఖ కెనాల్ వరకు కొట్టుకువెళ్లి అక్కడి గేట్‌కు చిక్కుకుంది. ఆ ప్రాంత ప్రజలు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు, నిఖిలేష్ కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మృత దేహాన్ని బయటకు తీయగా కుటుంబ సభ్యులు గుర్తు పట్టారు. అనంతరం నిఖిలేష్ మృతదేహాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ యువకుడు సతిగుడ డేమ్ ఎల్లో బ్రిడ్జి వద్ద కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
నిఘా నడుమ టెన్త్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అధికారుల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో జరిగిన మ్యాథ్స్ పరీక్షకు రెగ్యులర్, న్రైవేటు కలిపి 28,584మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 28,384 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 199 మంది గైర్హాజరయ్యారు. సోమవారం మ్యాథ్స్ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈఓ స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు మస్తానయ్య కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలతో పాటు పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. డీఈవో డాక్టర్ తిరుమలచైతన్య జలుమూరు, సారవకోట మండల పరిధిలో ని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పిలిలో ప్రశాంతం ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గణితం పరీక్షను రాష్ట్ర పరిశీలకులు, మస్తానయ్య, మండల విద్యా శాఖ అధికారి కె.పున్నయ్య పరీక్ష పరిశీలించారు. ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 9 గదుల్లో 425 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు 21 మందిని మార్పు చేశారు. ిసట్టింగ్ స్క్వాడ్‌గా వ్యవహరించిన డీఈఓ సారవకోట: మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి లెక్కలు పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్‌గా డీఈఓ తిరుమల చైతన్య వ్యవహరించారు. ఇక్కడ పరీక్షలు జరుగుతున్న విధానంపై అనుమానం రావడంతో పాటు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పరీక్ష కేంద్రాన్ని తొలుత పరిశీలించి అనంతరం పరీక్ష ముగిసే వరకు అక్కడే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
జైలుకెళ్లినా తీరు మారలేదు
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): జైలుకెళ్లినా వారి తీరు మారలేదు. ఒకరు గంజాయి కేసులోనూ, మరొకరు దొంగతనం కేసులోనూ శిక్ష అనుభవించి ఈ నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు. మరలా పాత పంథాలోనే నేరాల బాట పట్టడంతో కటకటాల వెనక్కి వెళ్లారు. మండలంలో బత్తివానిపాలెం కూడలి వద్ద సోమవారం 12 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరి నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఆర్.ధనుంజయ్ వివరాల ప్రకారం... ఇక్కడ వాహనాలను తనిఖీ చేస్తుండగా, బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేశారు. వీరి వద్ద బ్యాగుల్లో 12 కిలోల గంజాయిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. వీరిది ఢిల్లీకి చెందిన శిబరాం ప్రధాన్, ఒడిశాకు చెందిన నందన్రాంగా గుర్తించారు. ఈ గంజాయిని ఒడిశాలోని జోలాపుట్ నుంచి బత్తివానిపాలెం కూడలి మీదుగా పెందుర్తి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో పట్టుబడ్డారు. బరంపురం జైల్లో శిబరాం ప్రధాన్ గంజాయి కేసులోను, నందన్రాం దొంగతనం కేసులో శిక్ష అనుభవించి ఈ నెలలోనే విడుదలయ్యారు. అక్కడ జైల్లో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరూ మరలా గంజాయి రవాణాకు పాల్పడుతూ పట్టుబడ్డారు. వీరిద్దరిపైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి విలువ రూ.60 వేలు ఉంటుందన్నారు. 12 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు నిందితులు -
నరకం
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 202512గంటల..కొరాపుట్: విశాఖపట్నం–రాయ్‌పూర్ జాతీయ రహదారి–26 పై ఆదివారం రాత్రి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు వివిధ సమయాల్లో సుమారు 12 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి సునాబెడా మధ్య మెహన్ పొడ గ్రామ సమీపంలో అత్యధికంగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు విస్తరణ పనులు గత 4 నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. అనేక చోట్ల గోతులు తీశారు. రోడ్డు మెత్తం మట్టి పనులు జరుగుతున్నాయి. కాల వైశాఖి ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీ వర్షం పడింది. దాంతో మట్టి బురదగా మారింది. సుమారు 12 కిలోమీటర్ల పరిధిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అనేక చోట్ల పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు కూడా ముందుకెళ్లలేక నిలిచిపోయాయి. ఈ మార్గం గుండా ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొరాపుట్, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌కు వెళ్తారు. రాయ్‌పూర్, భువనేశ్వర్, విజయవాడ, పూరి, రాజమండ్రి, విశాఖపట్నం తదితర పట్టణాలకు ఈ మార్గం గుండా రాత్రి పూట బస్సు సర్వీసులు నడుస్తాయి. దాంతో వందలాది మంది ప్రయాణికులు బస్సులలో ఉండి పోయి అవస్థలు పడ్డారు. ఉదయం పూట పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు బురద లోనే నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రతి అరగంటకు వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఈ వార్తలు దానావలంగా వ్యాపించడం తో విశాఖ పట్నం నుంచి వచ్చే వాహనాలు అరుకు,నందపూర్ మీదుగా జయపూర్ వైపు మళ్లాయి. భువనేశ్వర్ వైపు వెళ్లే వాహనాలు రాయగడ లేదా భవాని పట్న వైపు మరలాయి. న్యూస్‌రీల్ స్తంభించిపోయిన విశాఖపట్నం– రాయ్‌పూర్ జాతీయ రహదారి కొరాపుట్–సునాబెడాల మధ్య నిలిచిపోయిన వందలాది వాహనాలు -
ఘనంగా సరస్వతీ బాల మందిర వార్షికోత్సవం
జయపురం: విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులకు గురుతర బాధ్యత ఉందని జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన్ కుమార్ నాయక్ అన్నారు. జయపురంలోని సరస్వతీ బాల మందిర వార్షికోత్సవాన్ని సోమవారం స్థానిక సంఘం కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందన్‌కుమార్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక మైన విద్య నేర్పాలన్నారు. సరస్వతీ బాల విద్యామందిర్ పరిచాలన కమిటీ ఉపాధ్యక్షుడు నవీనచంద్ర మహంతి అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయులు ఓం ప్రకాశ్ మిశ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, ఆకాశవాణి జయపురం విభాగ విశ్రాంత అధికారి ఉదయ శంకర జానీ, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయక్, సహాయక కార్యదర్శి చంద్ర శేఖర మహాపాత్ర, కార్యదర్శి నిరంజన్ పాణిగ్రహి ప్రసంగించారు. క్రీడా, విచిత్ర వేషధారణ, తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాలలో ప్రతిభావంతులను సన్మానించారు. యోగా, నృత్య, సంగీత ప్రదర్శనలు అలరించాయి. కొంత మంది విద్యార్థులు కవితలు చదివి వినిపించారు. -
ఆలయంలో దేవుడి విగ్రహాల ధ్వంసం
● పునర్నిర్మాణ దశలో దుండగుల దుశ్చర్య ● బోడసింగిపేటలో ఘటన ● దుర్గాదేవి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో జాతీయ రహదారి 26కు ఆనుకోని పునర్నిర్మాణంలో ఉన్న సీతారామ ఆలయంలో దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గతంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా శ్రీకారం చుట్టారు. పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెద్దాపురానికి చెందిన శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతలోనే ఆలయం వెలుపల గోడకు ఆనుకోని నిర్మాణ తుది దశలో ఉన్న దుర్గాదేవి విగ్రహంతో పాటు గరుత్మంతుడు విగ్రహాల చేతులు, కాళ్లను దుండగలు ధ్వంసం చేశారు. రోజూలాగే ఆదివారం ఉదయం పనులకు వచ్చిన శిల్ప కళాకారులు విగ్రహాలు ధ్వంసం కావడం చూసి గ్రామ పెద్దలకు విష యం తెలిపారు. సర్పంచ్ కోరాడ జానకీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్ ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి ఆనుకొని రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మందుబాబులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాష్ట్ర చిన్న, మధ్య తరహ, ఎన్ఆర్ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి పరిశీలించారు. -
అప్రమత్తంగా లేకుంటే అక్షయం
● క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే కఫం పరీక్ష చేయించాలి ● 60 ఏళ్లు దాటిన వారు, పొగ తాగేవారికి పరీక్ష అవసరం ● 100 రోజుల క్షయ కార్యక్రమంలో 861 కొత్త కేసులు గుర్తింపు ● నేడు ప్రపంచ క్షయ దినోత్సవంవిజయనగరం ఫోర్ట్: ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి క్షయ. క్షయ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. క్షయ వ్యాధిని గుర్తించి 6 నెలల పాటు మందులు వాడడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అయితే వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారికి ప్రాణాలు మీదికి వస్తుంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాధి లక్షణాలు: రెండు వారాలకు మించి దగ్గు, రెండు వారాలకు మించిన జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండటం, మెడ వద్ద వాపులు క్షయ వ్యాధి లక్షణాలు. మైక్రో బాక్టీరియా చుబర్‌క్యూలోసిస్ అనే బాక్టీరియా వల్ల గాలి ద్వారా ఈ వ్యాప్తి చెందుతుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, సురక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులను పూర్తి కాలం పాటు వాడాలి. సాధారణ క్షయ వ్యాధికి 6 నెలల పాటు, మధ్యలో మానివేసి తిరిగి ప్రారంభిస్తే 8 -
ఈ వేడుక ఆదర్శం
● చెప్పడం కాదు.. చేసి చూపించారు... ● కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు ● అరటి ఆకుల్లో భోజనాలు ● మట్టి గ్లాసుల్లో తాగునీరు చీపురుపల్లి: మారిన ఆధునిక సమాజంలో సాంప్రదాయ పద్ధతుల నడుమ నూతన వస్త్రాలంకరణ మహోత్సవం జరిపి మిరియాల వారి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి పట్టణంలోని వంగపల్లిపేటకు చెందిన మిరియాల రాంబాబు, అనురాధ దంపతుల ఇంట నూతన వస్త్రాలంకరణ మహోత్సవం పేరిట ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, స్నేహితులను వందల సంఖ్యలో పిలిచారు. అందరూ వచ్చారు.. అక్కడ ఏర్పాట్లు చూసి ఒకింత మెచ్చుకున్నారు. వేడుకలు ఇలాగే చేస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని చర్చించుకున్నారు. వేడుకలో కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు వేశారు. అరటి ఆకుల్లో భోజనాలు పెట్టారు. మట్టి గ్లాసుల్లో నీరు పోశారు. ఆహ్వానాన్ని కూడా ఓ వస్త్రంపై రాసి ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వద్దు... కాగితం సంచులు ముద్దు... అంటూ నిత్యం ప్రకటనలిస్తూ.. పత్రికలకు ఫొజులిచ్చే వారికి కళ్లు తెరిచేలా ఎక్కడా ప్లాస్టిక్ వస్తువును వాడకుండా వేడుక నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకుండా చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దశాబ్దాల కిందట జరిగిన వేడుకలు గుర్తుకొచ్చేలా సాంప్రదాయంగా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. -
వాగ్దేవి సమారాధనం సంస్థ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం
● సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజయనగరం టౌన్: విద్యలనగరం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్యాశీస్సులతో సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణకు వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషిచేసి ఉంటారో అటువంటి పెద్దలను సముచిత రీతిలో సంస్థ వార్షికోత్సవం రోజున సత్కరించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వాగ్దేవి సమారాధనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ధర్మపురి రోడ్డులో ఉన్న సంస్థ ఆవరణలో ఆదివా రం వివరాలు వెల్లడించారు. ఉగాది పర్వదినం, సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట అనే పురస్కారంతో, డాక్టర్ బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారంతో సత్కరించుకుంటున్నామని తెలిపారు. సంస్ధ ప్రధానకార్యదర్శి డాక్టర్ నాగమల్లిక మా ట్లాడుతూ గురజాడ గ్రంథాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఉద యం 10 గంటల నుంచి నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాహిత్య పర్యవేక్షకులు సాహితి, రుగ్వేదాచార్యులు రాంభట్ల సన్యాసిరాజు, శంబర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పార్వతీపురం మన్యం జిల్లాలో 1451 క్షయ కేసులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో 20 పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేసి జిల్లాలో 49 డిజిగ్నేటేడ్ మైక్రోస్కోప్ సెంటర్లు, 7 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 1451 మందికి క్షయ పాజిటివ్‌గా గుర్తించారు. వారిలో 1117 మందికి చికిత్స పూర్తి చేశారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 507 మందిని గుర్తించి వారికి చికిత్స అందించారు. 700 మంది పౌష్టికాహారం కిట్లుప్రస్తుతం జిల్లాలో ఏడు వందల మంది పౌష్టికాహారం కిట్లు పొందుతున్నారని జిల్లా క్షయ నియంత్ర అధికారి డాక్టర్ ఎం.వినోద్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారిలో కనీసం 10 నుంచి 15 శాతం మందికి కఫం పరీక్షలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఏఎన్ఎం, అశ కార్యకర్తలు క్షయరోగులను పరామర్శించి, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి ‘కఫం’ పరీక్షకు పంపించాలని సూచించినట్లు చెప్పారు. -
గురుకులాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు
● సజావుగా పదోతరగతి పరీక్షలు ● గురుకుకాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్యబొబ్బిలి: రాష్ట్రంలోని 50 గురుకులాలు, మరో పది కళాశాలల్లో సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొబ్బిలిలోని గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో గురుకులానికీ 8 చొప్పున మొత్తం 480 కెమెరాలను అమర్చేందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడామని, త్వరలోనే కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ సులువవుతుందన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా ప్రిన్సిపాల్స్, పీఈటీ, పీడీలు విద్యార్థులకు క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు వీలవుతుందన్నారు. బొబ్బిలి గురుకులానికి ప్రహరీ, కంచెల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రహరీ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలో మిగిలిన కొద్దిపాటి భాగం కూడా దాతల సాయంతో నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మన బడి నాడు–నేడులో భాగంగా కొన్ని భవనాలు నిర్మించగా మిగిలిన పాత భవనాలను తొలగించాల్సి ఉందన్నారు. అలాగే గురుకులాల్లో రెసిడెన్షియల్ అనే పదానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం ఇక్కడ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్న కారణంగా పాత డార్మిటరీలను ఆధునికీకరించి కొద్దిమంది సిబ్బందినైనా స్థానికంగా ఉండేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై అక్కడికక్కడే సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడారు. కళాశాలగా ఎచ్చెర్ల గురుకులం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో ఉన్న గురుకులాన్ని కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. బొబ్బిలి గురుకులాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కళాశాలగా మార్చాలన్న డిమాండ్, ప్రతిపాదనలు ఉన్నందున, ఇక్కడి కమిటీలు, స్థానికులు మంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఎం పురం వద్ద ఉన్న గురుకులానికి చెందిన ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. మరో 11 ఎకరాలు మిగిలి ఉన్నందున దానిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు తాను పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నానని, పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ద్విగళ అష్టావధానం
పాలకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీ సూర్యచంద్ర కళాసాహితి ఆధ్వర్యంలో ద్విగళ అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొని అవధాని బంకుపల్లి రమేష్ శర్మ, అవధాన చంద్రమస శతావధాని చంద్రశేఖర శర్మ, అవధాన చంద్రమస శతావధాని సాయికుమార్ శర్మలను సన్మానించారు. విశ్వావసు నామసంవత్సర ఉగాధి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కణపాక చౌదరినాయుడు, సింహచలాచార్య, బౌరోతు శంకరరావు, దిలీప్‌కుమార్, సాహితి శ్రీనివాసరావు, వెలమల మన్మథరావు, కడగల రమణ, గారాల సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో రజతంవిజయనగరం: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సిల్వర్ మెడల్ కై వసం చేసుకుని జిల్లా పేరు మరోసారి మారు మోగించిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పారా క్రీడాకారులు పాల్గొన్నారని, టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందెంలో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ లలిత అసామాన్య ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, ఇది జాతీయస్థాయిలో జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. లలిత ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రా ష్ట్రకార్యదర్శి వి. రామస్వామి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, కలెక్టర్ డాక్టర్. బీఆర్. అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందించారని తెలియజేశారు. సీనియార్టీ జాబితా తయారీకి ఏకీకృత విధానం తప్పనిసరిపార్వతీపురంటౌన్: వివిధ జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు సీనియార్టీని రూపొందించడంతో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారం రూపొందించారని, బదిలీలకు రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బదిలీల్లో వ్యక్తిగతంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పనిచేసే పాఠశాల హెచ్ఆర్ఏ, పూర్తి సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తారన్నారు. బదిలీల పాయింట్లు సమానంగా వస్తే వయస్సును బట్టి సీనియార్టీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు సీనియార్టీ రూపొందించడంలో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సవరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగీత, సాహిత్యాలతో పైడితల్లికి ఘనంగా నీరాజనం విజయనగరం టౌన్: శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 22న గురజాడ కళాభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంస్థ వ్యవస్ధాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నా రు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత, సాహి త్య కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారికి ఘనంగా నీరాజనాలర్పిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలి పారు. అదే రోజు అమ్మవారి భక్తిగీతాలపపై భజన సీడీలను ఆవిష్కరిస్తామన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ పైడిమాంబ కళానికేతన్ సంస్ధ 27వ వార్షికోత్సవానికి ప్రముఖులతో పాటు, పలువురు పెద్దలు హాజరుకానున్నారన్నారు. ఆ రోజు వేకువజామునుంచి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో పలువురిని సముచితరీతిలో సత్కరిస్తామన్నారు. ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. శ్రీపైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్ధాపకుడు పాత్రో -
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
సాలూరు: మండలంలోని నెలిపర్తి పంచాయతీ వంగర గుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాలూరు పట్టణంలో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి రాము(51), గురిబారి(47)లు సాలూరు పట్టణానికి వచ్చి సొంత పనులు ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో పట్టణంలో బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద వారి బైక్‌ను ఒడిశా నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా ఆ భార్యాభర్తలు విజయవాడలో వలస పనులకు వెళ్లి ఇటీవలే తమ స్వగ్రామానికి వచ్చినట్లు తెలియవస్తోంది. -
● ఆఖరి చూపు కోసం..
జయపురం: జయపురం సతిగుడ కెనాల్ ఎల్లో డేమ్ వద్ద కెనాల్లో పడిన కుమారుడి ఆఖరి చూపు అయినాదక్కాలని తండ్రి మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. జయపురం మహారాణిపేట్ రాందాస్ లైన్ నివాసి పి.గౌరీశంకర్ చిన్న కుమారుడు పి.నిఖిలేష్(17) సతిగుడ నది ఎల్లో డేమ్ సమీపంలో గల కెనాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తండ్రి గౌరీశంకర్ తన కుమారుడు కెనాల్లో పడి కనిపించలేదని పోలీసులకు, అగ్నిమాపక విభానికి తెలియజేశారు. కెనాల్ వద్ద నిఖిలేష్ వస్తువులు ఉన్నాయి. వారు వచ్చి ఎంత గాలించినా ఏమీ దొరకలేదు. నిఖిలేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి గానీ, ఉపాధ్యాయులు గానీ నమ్మడం లేదు. కుమారుడి మృతదేహమైనా దొరుకుతుదని తండ్రి గౌరీశంకర కెనాల్ వద్ద ఆశగా ఎదురు చూడటం కనిపించింది. నిఖిలేష్ గత ఏడాది పరీక్షలో 95 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. గౌరీశంకర్ భార్య కొద్ది రోజుల కిందట మృతి చెందారు. ఇప్పుడు చిన్నకొడుకు కాలువలో గల్లంతైపోయాడు. ఆఖరి చూపైనా దక్కాలని కళ్లు కాయలు కాసేలా తండ్రి ఎదురు చూస్తున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లకు తీవ్ర గాయాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి సింద్రీమాల పంచాయతీ బందుగూఢ గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు గాయపడ్డారు. మల్కన్‌గిరి నుంచి ఏదో పని చూసుకుని తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్న వారిని ఓ టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఉడాపా గ్రామానికి చెందిన జగన్నాఽథ్ కాబాసి అతని చెల్లి హిరామాణి కబాసిలు మల్కన్‌గిరికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ డ్రైవర్ వెంటనే వారిని స్థానికుల సాయంతో మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోలీసులకు లొంగిపోయాడు. మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో కేసు నమోదు చేసి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నాడు. -
27న విధాన సభ ముట్టడికి సన్నద్ధం
జయపురం: రాష్ట్రంలో అధికార బీజేపీ చర్యలను ఖండిస్తూ ఈ నెల 27న విధాన సభ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిందని ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. స్థానిక బాబాసాహేబ్ కల్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శశిభూషణ పాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాహిణీపతి ప్రసంగిస్తూ బీజేపీ పాలకులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అందుకు ముఖ్యమంత్రి సభకు సమాధానం చెప్పాలని తాను డిమాండ్ చేసినందుకు బిజేపి ఎం.ఎల్.ఎ జయనారాయణ మిశ్ర తన పై దాడి చేశారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కొరాపుట్ జిల్లా నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ నెల 27న విధాన సభ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ మంత్రులను, నేతలను కొరాపుట్ జిల్లాలోనికి అనుమతించకూడదని నేతలు పిలుపునిచ్చారు. ప్రసంగించిన వారిలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, ఒడిశా కాంగ్రెస్ ప్రభారీ రజణీ మహంతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకులు అజిత్ దాస్‌తో పాటు కొరాపుట్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బినోద్ మహాపాత్ర, కోశాధి కారి నిహారంజన్ బిశాయి తదితరులు ఉన్నారు. -
ప్రహసనంగా ఎంజీ రోడ్డు విస్తరణ
జయపురం: జయపురం మహాత్మాగాంధీ రోడ్డులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు రోడ్డు విస్తరణకు గత నవంబర్‌లో శ్రీకారం చుట్టారు. 40 అడుగుల రోడ్డు ఏర్పాటు లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా 40 అడుగుల లోపున గల దుకాణాలను, ఇళ్లను కొలతలు కొలిచి ఆక్రమణలను బుల్డోజర్లతో తొలగించారు. రోడ్డు వెడల్పు అయి ట్రాఫిక్ సమస్య తీరుతుందని ప్రజలు సంతోషించారు. అయితే 2024 నవంబర్ నెలలో ఆక్రమణలను తొలగించిన అధికారులు, నాలుగు నెలలు గడిచినా వాటిని పట్టించుకోలేదు. అందువల్ల అటు వ్యాపారులు ఇటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్చ్ 23న రోడ్డుకు ఇరువైపులా కాలువల తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలు ఎంజీ రోడ్డు కమలా మెడికల్ కూడలి నుంచి జైలు రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు బ్లాక్ చేసి కాలువల తవ్వకాలు జరుపుతున్నారు. విస్తరణ ఎప్పటికి పూర్తవుతుందోనని స్థానికులు అంటున్నారు. విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదిన జరపాలని ప్రజలు కోరుతున్నారు. -
హత్య కేసులో ముగ్గురు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి సిరిపాయి పంచాయతీ బహరుదులుకి గ్రామంలో ఇటీవల ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గురిని శనివారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో హత్యకు గురైన యువకుడి భార్య సరస్వతి హలువ, మామయ్య సాధునాయక్, బావమరిది అజయ్ నాయక్‌లు ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి పిపిలపొదొరో పంచాయతీలోని లులుపొదొరో గ్రామానికి చెందిన కుమార స్వామి హలువ (40) తన అత్తవారు ఉంటున్న బహరుదులుకి గ్రామానికి వెళ్లాడు. శుక్రవారం రాత్రి అతని భార్య సరస్వతితోపాటు తండ్రి , అన్నయ్య సహాయంతో అత్యంత దారుణంగా కుమార స్వామి హలువను హత్య చేసి గ్రామానికి సమీపంలోని పొదలర్లో మృతదేహాన్ని పడేశారు. అ తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయారు. శనివారం అటువైపుగా బహిర్భూమికని వెళ్లిన కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇదిలాఉండగా కొన్నాళ్లుగా భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. తరచూ ఇద్దరి మధ్య తగాదాలకు విరక్తి చెందిన సరస్వతి తన భర్తను విడిచి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. తన భార్యను తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన కుమార స్వామిని పథకం ప్రకారం భార్య, బావమరిది, మామయ్యలు హతమార్చారు. ఈ విషయాన్ని పోలీసులు ముందు నిందితులు అంగీకరించారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
రాయగడలో ఉగాది ఉత్సవాలకు సన్నాహాలు
రాయగడ: పట్టణంలో ఈ ఏడాది ఉగాది ఉత్సవాలు పోటీపోటీగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట 12 ఏళ్లుగా ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం యాల్ల కొండబాబు నేతృత్వంలో రాయగడ జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వేరేగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలో రెండు వేదికల్లో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యాల్ల ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను పురష్కరించుకుని స్థానిక కొల్లిగుడ మైదానంలో ముహూర్తపు రాట వేశారు. తాజాగా ఆదివారం స్థానిక తేజస్వీ హోటల్ ఎదురు మైదానంలో నెక్కంటి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలకు ముహూర్తపు రాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, రాఘవ కుముందాన్, శిల్లా జగన్నాథ రావు, ఎన్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీగా బ్యానర్లు.. పట్టణం ఉగాది సంబరాల కోసం ముస్తాబవుతోంది. ప్రతి కూడలిలోనూ నిర్వాహకులు ఉత్సవాల బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సమాఖ్య ఉగాదిని పురష్కరించుకుని పోటీలను నిర్వహిస్తుండగా ఈ నెల 27, 28 తేదీల్లో నెక్కంటి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు సంబంధించి వివిధ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. చందాల వసూళ్లు..! తెలుగు సమైఖ్యత, సంస్కృతికి అద్దం పట్టే ఈ ఉగాది ఉత్సవాలు ఇదివరకు ఒకే వేదికపై నిర్వహించడంతో పట్టణ ప్రజలు ఉత్సవాలను ఆనందిస్తుండేవారు. క్రమేపీ రెండు గ్రూపులుగా జరుగుతుండటంతో చందాలు చెల్లించే విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉగాది ఉత్సవాల కోసం స్థానిక విద్యా సంస్థ యాజమాన్యాన్ని నిర్వాహక సంఘానికి చెందిన వ్యక్తి ఫోన్ చేసి పెద్ద మొత్తంలో చందా చెల్లించాలని ఫోన్ ద్వారా బెదిరించడం వంటి ఘటనలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి స్పందించారు. తెలుగు వారి సమైఖ్యతను చాటి చెప్పే ఈ వేడుకలకు చందాల వసూళ్ల పేరిట బెదిరిస్తుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి తప్ప బెదిరింపులకు పాల్పడటం తగదన్నారు. -
సిక్కిం కాంగ్రెస్ నేతలతో కొరాపుట్ ఎంపీ చర్చలు
కొరాపుట్: సిక్కిం కాంగ్రెస్ పార్టీ నేతలతో కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క చర్చలు జరిపారు. సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్లో సిక్కిం ప్రదేశ్‌కాంగ్రెస్ కార్యాలయాన్ని సప్తగిరి ఆదివారం సందర్శించారు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ సహచర విభాగాల నాయకులతో భేటీ అయ్యారు. ఎంపీ సప్తగిరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈశాన్య రాష్ట్రాల పార్టీ పరిశీలకుడిగా నియమించింది. దీంతో సప్తగిరి తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తున్నారు. మజ్జిగ, పుచ్చకాయల వితరణ రాయగడ: పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో తుంబిగుడ కూడలిలో బాటసారులకు మజ్జిగ, పుచ్చకాయలను ఆదివారం వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీశాఖ రాయగడ రేంజర్ కామేశ్వర్ ఆచారి హాజరై బాటసారులకు మజ్జిగ, పుచ్చకాయలను పంపిణీ చేశారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని ట్రస్టు సభ్యులను సూచించారు. ట్రస్టు కార్యదర్శి దయానిధి ఖండగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు జి.బ్రహ్మాజీ, లాడి చంద్రమౌళి, సన్యాసి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రుల కాన్వాయ్‌పై రాళ్ల దాడి●● కానిస్టేబుల్‌కు గాయాలు ● మయూర్భంజ్ జిల్లాలో సంఘటన భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లాలో రాష్ట్ర మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ జిల్లా బంగిరిపోషి ప్రాంతం కాల వైశాఖి వైపరీత్యంతో భారీగా ప్రభావితమైంది. ప్రాంతీయుల్ని పరామర్శించి నష్టం తీవ్రతని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ఇరువురు మంత్రులు బయల్దేరారు. వీరిలో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణచంద్ర మహాపాత్రో ఉన్నారు. కాల వైశాఖి వైపరీత్యం నష్టా న్ని అంచనా వేయడానికి ఆదివారం ఇద్దరు మంత్రులు చేసిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. వీరి రాకలో జాప్యం కారణంగా స్థానిక ప్రభావిత వర్గాలు ఆగ్రహంతో నిరసనలు చేపట్టి వారి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా రాళ్లు రువ్వడంతో మంత్రుల కారు అద్దాలు పగిలాయి. ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. నష్టం అంచనా క్షేత్ర స్థాయి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల వైశాఖి వైపరీత్యానికి గురైన పలు ప్రాంతాల్ని సందర్శించకుండా వెనుదిరగడంతో ఆగ్రహించిన వర్గం ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మంత్రుల పక్షపాత వైఖరి పట్ల ప్రభుత్వం బదులు ఇవ్వాలని ఆందోళనకు దిగిన గ్రామస్తులు నిరసన ప్రదర్శించారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ తలకు గాయమైంది. వాహనాలపై రాళ్లు వర్షం కురిపించారు. భద్రతా సిబ్బంది సకాలంలో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి కుదుటపడింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం రాయగడ: ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మునిగుడ పోలీసులు ఆదివారం రైల్వే స్టేషన్ సమీపంలోని తోపుడు బండిపై స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది అటువైపుగా వెళుతున్న సమయంలొ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
కాల వైశాఖి పరిహారంపై హామీ
భువనేశ్వర్: రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో కాల వైశాఖి (గాలి వాన) విధ్వంసం సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో గూడు చెదిరి పలువురు ప్రజలు తలదాచుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పీడిత ప్రజలకు తక్షణమే పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతంలో 400కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మయూర్భంజ్ జిల్లాలో బంగిరిపోషి ప్రాంతం భారీగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో కాల వైశాఖి తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి ఆదివారం ప్రత్యక్షంగా అంచనా వేశారు. ఈ సందర్భంగా, బాధిత వర్గాలకు నష్టాలకు పూర్తి ఆర్థిక పరిహారం అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆన్లైన్లో పరిహారం చెల్లింపు క్షేత్ర స్థాయిలో కాల వైశాఖి నష్టం నివేదికను ఖరారు చేసిన ప్రకారం ఆదివారం సాయంత్రం నాటికి బాధితులకు పరిహార నిధులు అందుతాయి. తక్షణ సహాయ చర్యలో భాగంగా ఈ మొత్తం ఆన్లైన్లో బాధితుల ఖాతాలకు ప్రత్యక్షంగా బదిలీ అవుతాయని మంత్రి వివరించారు. ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. లేని వారికి ప్రత్యక్షంగా నగదు రూపంలో పరిహారం చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. 19 పంచాయతీల్లో విధ్వంసం వాస్తవానికి మయూర్భంజ్ జిల్లాలో గత రెండు రోజులుగా కాల వైశాఖి విధ్వంసం సృష్టిస్తోంది. ప్రధానంగా బంగిరిపోషి, బిషోయ్, కులియానా, సొరొసొకొనా మరియు కరంజియా మండలాల్లో విస్తృత విధ్వంసం సృష్టించింది. జిల్లాలో 19 పంచాయతీల్లో 400 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక కుటుంబాలు నిరాశ్రయులై ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితుల బాగోగుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు స్థానిక సీనియర్ రెవెన్యూ అధికారులు బాధిత ప్రాంతాల్లో సందర్శించి సత్వర సహాయం అందజేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక అధికారులు, విపత్తు ప్రతిస్పందన బృందాలతో కలిసి, సాధారణ స్థితిని పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. అవసరమైన వారికి ఆహారం, తాత్కాలిక ఆశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించేలా చూస్తోంది. -
భగత్ సింగ్ సేవలు స్ఫూర్తిదాయకం
జయపురం: దేశ విముక్తి కోసం ప్రాణాలను చిరు నవ్వుతో అర్పించిన విప్లవ వీరులు సహిద్ భగత్ సింగ్, శుఖ్దేవ్, రాజగురు నిజమైన దేశ భక్తులని వక్తులు అన్నారు. స్థానిక యాదవ భవనంలో ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి అధ్యక్షతన భగత్ సింగ్, శుఖ్దేవ్, రాజగురు వర్ధంతిని నిర్వహించారు. భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భగత్ సింగ్, శుఖ్దేవ్, రాజగురు చిత్రపటాలకు నివాళులర్పించారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, ప్రమోద్ కుమార్ తివారీ, అలేక్ పాత్రో, కె.సత్యనారాయణ పాల్గొన్నారు. -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
పనస కాయల లోడ్ వ్యాన్ బోల్తా : గిరిజన మహిళ మృతి
● రంగబయలు పంచాయతీ కోసంపుట్టు ఘాట్‌రోడ్డులో ఘటనముంచంగిపుట్టు (అల్లూరి జిల్లా): మండలంలో రంగబయలు పంచాయతీ కోసంపుట్టు గ్రామ సమీపంలో గల ఘాట్‌రోడ్డులో పనసకాయల లోడుతో వెళుతున్న వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందపూరు బ్లాక్ తుభ గ్రామానికి చెందిన గిరిజన మహిళ కిల్లో కుమ్మి(42) మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ఆదివారం రంగబయలు పంచాయతీ కోసంపుట్టు, పట్నపడాల్పుట్టు, జోడిగుమ్మ గ్రామాల్లో పసనకాయలను కొనుగోలు చేసి, వ్యాన్‌లో లోడు చేసుకొని వస్తుండగా కోసంపుట్టు ఘాట్‌రోడ్డు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుక ఉన్న కిల్లో కుమ్మి అనే మహిళ కింద పడిపోయింది.ఆమె మీద వ్యాన్ బోల్తా పడింది. వాహనం కింద నలిగిపోయి మహిళ మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్,పనసకాయల కొనుగోలుదారులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా వ్యాన్ కింద నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. స్థానిక ఎంపీటీసీ సిరగం భాగ్యవతి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి,వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. వాహనం ఎక్కడిది,పనసకాయల కొనుగోలుదారులు ఎక్కడివారు అనేది తెలియాల్సి ఉంది.గత రెండు నెలల వ్యవధిలో కోసంపుట్టు ఘాట్‌రోడ్డులో మూడు సార్లు వాహనాలు బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు.ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
‘ప్రసాద్’ నిధుల కోసం ప్రయత్నాలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఇంకా ఎలాంటి ఫాలోఅప్ చేయకపోవడంపై తనకు అసంతృప్తిగా ఉందని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కుటుంబసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఇందుకోసం ఆలయం ముందర నిర్మాణాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి.. అద్భుతంగా అభివృద్ది పనులు చేపట్టాలని భావించామని, తర్వాత ఫాలో అప్ సరిగ్గా లేకపోవడంతో పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీం మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. ఆ నిధులు వచ్చేవరకు భక్తులకు తాత్కాలిరంగా సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి సోదరుడు హరిప్రసాద్, టీడీపీ ఇన్చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
ఝివురీ అడ్డగింతపై ఆందోళన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి చత్తీస్‌గఢ్ సరిహద్దున గల ఝివురి నది ముందు అడ్డంగా వేసిన ఇసుక బస్తాలు వెంటనే తొలగించాలని బీజేడీ శ్రేణులు చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వందలాది మంది కార్యకర్తలు, బిజేడి నాయకులు ఆదివారం ఝివురి నదీ ప్రాంతాన్ని సందర్శించారు. 2003లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం తగదని అన్నారు. మాజీ మంత్రి పద్మిని దియాన్ అధ్యక్షతన నిర్వహించిన ఝివురి బచావ్ అభిజాన్ సభలో మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ ఝివురి నది నుంచి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే కొరాపుట్ ప్రజలు మౌనంగా ఉండబోరని అన్నారు. గతంలో ఉభయ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాన్ని పక్క రాష్ట్రం ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇసుక బస్తాలు తొలగించేంత వరకు బీజేడీ పోరాడుతుందని స్పష్టం చేశారు. సభలో కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, జిల్లా పరిషత్ సభ్యులు త్రిపతి చలాన్, కొట్‌పాడ్ సమితి ఉపాధ్యక్షుడు బాబులి పాణిగ్రహి, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వరచంద్ర పాణిగ్రహి, ఉపాధ్యక్షుడు దురుపుత భొత్ర, సీనియర్ బీజేడీ నేతలు పద్మన్ బిశాయి, మహమ్మద్ సలీమ్, లక్ష్మీపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుజానితో పాటు వందలాది మంది స్థానిక బీజేడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
శిష్టకరణ సంఘం నూతన కార్యవర్గం
కొరాపుట్: నబరంగ్‌పూర్ శిష్ట కరణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా కేంద్రంలోని అఖండల మణి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సతీష్ పట్నాయక్, ఉపాధ్యక్షునిగా కిశోర్ పట్నాయక్, వివిధ విభాగాల కార్యదర్శులుగా మహేశ్వర్ పట్నాయక్, అవని ప్రసాద్ పట్నాయక్, కోసాధికారిగా చంద్ర ఖర్ పట్నాయక్, న్యాయ సలహాదారుడుగా అరవింద పట్నాయక్, సలహాదారులుగా రబి పట్నాయక్, పి.రామ్మూర్తి పట్నాయక్, ప్రసన్న పట్నాయక్ ఎంపికయ్యారు. సంఘ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించినట్లు శ్రీకాకుళం స్టేషన్ సీఐ ఎం.వి.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిటర్న్ అధికారిగా తనతో పాటు నరసన్నపేట సీఐ ఎస్.వి.రమణమూర్తి వ్యవహరించినట్లు తెలిపారు. అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఆదిత్యాలయానికి భక్తుల తాకిడి అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. ప్రత్యేక ఆదివారంతో పాటు వత్సవలస రాజమ్మతల్లి ఉత్సవాల కొనసాగింపు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కొందరు సూర్యనమస్కారాల పూజలు చేయించుకోగా...మరికొందరు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లుతో పెద్దగా ఉపశమనం కలుగకపోవడంతో భక్తులు విమర్శలకు దిగారు. వీఐపీల పేరిట చాలా మంది ఫేక్ వీఐపీలు దర్శనాలకు వెళ్లడంపై క్యూలైన్లలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3,76,300, విరాళాల రూపంలో రూ.1,41,803, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.75 లక్షల వరకు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వై.భద్రాజీ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ జిల్లా సలహాదారుడిగా చందనరావు శ్రీకాకుళం న్యూకాలనీ: బాలల హక్కుల వేదిక పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా సలహాదారుడిగా తమ్మినేని చందనరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి నియామక పత్రం అందజేశారు. చందనరావు సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి జిల్లా కమిటీ చొరవతో చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని తమ్మినేని పేర్కొన్నారు. ఈయన నియామకం పట్ల సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి డి.ప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ అరుణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి ఆమదాలవలస గేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ చల్లపేటకు చెందిన కరిమెళ్ల సూరిబాబు(55) ఆమదాలవలస గేటు ప్రాంతంలో వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. కుటుంబం లేకపోవడంతో అక్కడే ఉంటున్నాడు. ట్రాక్ దాటేందుకు వచ్చాడో, ఇంకేం జరిగిందో తెలియదు గానీ ఆదివారం పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు శవ పంచనామా కోసం తరలించారు. రైలు ఢీకొని యువకుడు మృతి పొందూరు: పొందూరు రైల్వేగేటు సమీపంలో ఆదివారం అమరావతి రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. సుమారు 30 ఏళ్ల గల ఈ యువకుడు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. యువకుడు ఎరుపు టీషర్టు, నీలం ప్యాంట్ ధరించాడని, ముఖం గుర్గు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. వివరాల కోసం 9493474582 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. శ్రీకూర్మంలో భక్తజన సందోహం గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాధా రణ భక్తులతో పాటు చిన వత్సవలస రాజమ్మ తల్లి సంబరాల నుంచి తిరుగుపయనమైన వారు కూడా క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథం పర్యవేక్షించారు. మరోవైపు సరైన పార్కింగ్ స్థలం లేక వాహనదారులకు ఎప్పటిలాగే ఈ వారం కూడా ఇబ్బందులు తప్పలేదు. కారు, ఆటో, బైక్‌లు పెట్టేందుకు స్థలం చూపించకపోయినా ఆశీలు మాత్రం పంచాయతీ పేరిట వసూలు చేస్తుండటంపై పలువురు వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు. -
రక్తదానం.. ప్రాణదానం
రాయగడ: స్థానిక బాలాజీ నగర్లో గల శ్రీకళ్యాణ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 54 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాతులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్ పరివేక్షణలో జరిగిన ఈ శిబిరంలో ఆమో ఒడిశా ప్రతినిధి శివప్రసాద్ దొర పాల్గొన్నారు. మల్కన్‌గిరిలో మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో గల కుమిటిగూడ వీధిలో ఉన్న సత్యసాయి మందిరంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కె.గోపాల్‌కృష్ణ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 8 యూనిట్ల రక్తం సేకరించి జిల్లా బ్లడ్ బ్యాంక్‌కు అందజేశారు. మల్కన్‌గిరి సత్యసాయి కమిటీ సభ్యులు కె.క్రష్ణకుమారి, ఎం.దమయంతి, ఎ.ఉమ, బాలాజీ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ రోగికి డబ్బుల చెల్లింపు
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించినప్పటకీ రోగుల నుంచి ఇంప్లాట్స్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఈ నెల 17న సాక్షిలో ‘ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పట్టణంలోని గాయత్రి ఆస్పత్రిలో వెన్నుపూస శస్త్రచికిత్స చేసుకున్న రోగి గోవింద నుంచి సిబ్బంది రూ. 25 వేలు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ జనార్దనరావు, ఆరోగ్యమిత్ర మురళీధర్ ఆస్పత్రి ప్రతినిధుల నుంచి రూ. 25 వేలు వసూలు చేసి బాధిత వ్యక్తికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
డయేరియా బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గుర్ల: డయేరియా ప్రబలి గత ఏడాది అక్టోబరులో 13 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో పది మంది తాలూకు కుటుంబసభ్యులకు మాత్రమే జనసేన పార్టీ ఆర్థిక సాయం అందింది. ఐదు నెలల కిందట గుర్లలో పర్యటన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గుర్లలో శనివారం నెల్లిమర్ల ఎమ్మెల్యే (జనసేన) లోకం నాగమాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎంఎస్ఎంఈ చైర్మన్ టి.శివశంకర్ పాల్గొన్నారు. గుర్ల అంటే గుర్లలో వారికి మాత్రమే... గత ఏడాది అక్టోబరులో గుర్ల మండల కేంద్రంతో పాటు సమీపంలోని కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లోనూ డయేరియా విజృంభించింది. దీంతో గుర్లలో పది మంది, కోటగండ్రేడులో ఒకరు, నాగళ్లవలసలో ఇద్దరు చనిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం కోటగండ్రేడుకు చెందిన మరడాన అప్పలనర్సమ్మ ఒక్కరే డయేరియా కారణంగా చనిపోయారని ప్రకటించి చేతులు దులుపుకుంది. వైఎస్సార్సీపీ తరఫున రూ.2 లక్షల చొప్పున 13 మంది కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది నవంబరు 26న శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చెక్కులు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన తరఫున కేవలం పది మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన డయేరియా మృతురాలు అప్పలనర్సమ్మ కుటుంబాన్ని జనసేన విస్మరించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గుర్ల అన్నారని, ఆ గ్రామంలోని పది మంది కుటుంబాలకు మాత్రమే చెక్కులిచ్చి సరిపెట్టడం చర్చనీయాంశమైంది. పది మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత లేదు
విజయనగరం అర్బన్: ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక పూర్తిగా తప్పులతో కూడినదని అంబేడ్కర్ ఫోరం ఏపీ అధ్యక్షుడు భానుమూర్తి ఆరోపించారు. దీనిని పరిశీలించాలని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ కలెక్టర్లోని డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తికి శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం కమిషన్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 (1)(2) సవరించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. డీఆర్వోను కలిసిన వారిలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, మల్లాన సత్యనారాయణ, రెల్లి, ఉపకులాల అధ్యక్షుడు సోము మురళీమోహన్ ఉన్నారు. రాష్ట్ర గవర్నర్‌కు అంబేడ్కర్ ఫోరం రాష్ట్ర కమిటీ ఫిర్యాదు -
బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధం
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుల గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. రెండోసారి మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనుండడంతో పోటీదారుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్లు పోటీ పడనున్నట్టు నిర్వాహకులు హరిశంకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించేందుకు అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోటీలకు సంబంధించి 16 మంది న్యాయ నిర్ణేతల నిర్ణయం తుది తీర్పుగా భావించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోటీదారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
గుడ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి కొట్ట గ్రామ సమీపంలో కోడి గుడ్లు రవాణా చేస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గుడ్లు నేలమట్టం కాగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్‌గిరి జిల్లా మతిల్తిలో కోడిగుడ్లను దుకాణాలకు అమ్మేందుకు జయపురం నుంచి ఒక ఆటో వెళ్లింది. మత్తిలిలో దుకాణాలకు గుడ్లు సరఫరా చేసి మిగిలిన గుడ్లతో తిరిగి వస్తుండగా బొయిపరిగుడ సమితి కొట్ట గ్రామ సమీపంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. గుడ్లు రోడ్డపై పడగా ఆటో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడనవారిలో జయపురం సమితి కుంతరకాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామ మండల్, డిమ్ల గ్రామానికి చెందిన శివ పొరజలు ఉన్నారు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాల్య వివాహం అడ్డగింత పర్లాకిమిడి: స్థానిక కాశీనగర్ బ్లాక్ పోలూరు గ్రామంలో ఏప్రిల్‌లో జరగనున్న బాల్య వివాహాన్ని కాశీనగర్ జిల్లా శిశు సురక్షా అధికారులు ముందస్తుగా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామానికి చెందిన ఒక అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండానే పోలూరు గ్రామానికి చెందిన వరుడితో ఏప్రిల్‌లో వివాహం చేయించేందుకు పెద్దలు నిశ్చయించారు. అయితే చైల్డ్‌లైన్ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు రాణిపేట గ్రామానికి వెళ్లి వధువు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండకుండా వివాహం జరిపించడం నేరమని నచ్చజెప్పారు. అనంతరం వరుడు నివసిస్తున్న పోలూరు గ్రామానికి వెళ్లి అతడి కౌన్సిలింగ్ ఇచ్చి వివాహంను నిలుపుదల చేశారు. సామూహిక అక్షరాభ్యాసాలకు ఆహ్వానం మల్కన్‌గిరి: స్థానిక బుట్టిగూడ వీధిలో కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ సామూహిక అక్షరాభ్యాసాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు శనివారం పంపిణీ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అక్షరాభ్యాసాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఈనెల 28వ తేదీలోగ పాఠశాలల్లో చేరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానపత్రాలు అందించారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఉమా ప్రసాద్ దాస్, జిల్లా అదనపు విద్య అధికారి రాఘురాం సాజన్ తదితరులు పాల్గొన్నారు. -
వంశధార జలాలు శివారు ప్రాంతాలకు ఎప్పుడిస్తారు?
హిరమండలం: వంశధార జలాలను శివారు ప్రాంతాలకు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం బృందం గొట్టా బ్యారేజీ, వంశధార రిజర్వాయర్లను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టా బ్యారేజీని ఆధునీకరించడంతో పాటు కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరారు. దీనివల్ల లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. వంశధార రిజర్వాయర్‌కు అనుసంధానంగా నేరడి వద్ద బ్యారేజీ ఎప్పుడు కడతారని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోతోందన్నారు. తక్షణం గొట్టాలో ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తిచేసి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించాలన్నారు. ఒడిశాతో సరిహద్దు జలాల సమస్యను పరిష్కరించి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. వంశధార జలాలు శివారు ప్రాంతాలుగా ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అందడం లేదన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తిచేయాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న డిమాండ్‌తో ఏప్రిల్ 5న ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యులు మోహనరావు, పోలాకి ప్రసాద్, సిర్ల ప్రసాదరావు, సూరయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
పది మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలి
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం విధుల్లో మినహాయింపు కోరిన ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ సభ్యులు ఈ మేరకు శనివారం డీఈఓ యు.మాణిక్యంనాయుడుని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పదో తరగతి సబ్జెక్టు టీచర్లను మూల్యాంకనం విధుల్లో వేసినపుడు తొలిత ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయాలని కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుమతి ఇస్తూ ఇంకా అవసరం ఉన్న పరిస్థితులను గుర్తించిన తరువాతే తప్పనిసరి విధులుగా కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న సీనియారిటీ అభ్యంతరాలను సమర్పించడానికి గడువు పెంచాలని కోరారు. డీఈఓని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్టణ, రెడ్డి శంకరరావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. డీఈఓకి పీఆర్టీయూ జిల్లా కమిటీ వినతి -
బోడసింగిపేటలో చోరీ
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో గిట్టుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో శనివారం వేకువజామున ఒక దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో కొంత నగదుతో పాటు విలువైన కిరాణా సామగ్రి అపహరించుకుపోయారు. కనిమెరక గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ గుప్తా బోడసింగిపేటలో కిరాణా దుకాణాన్ని కొన్నాళ్లుగా నడుపుతున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం వచ్చి చూడగా దుకాణం షట్టర్లు పగులకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ యు.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారారాలను సేకరించారు. దుకాణంలో ఉంచిన రూ.12వేల నగదుతో పాటు రూ.13 వేల విలువ చేసే కిరాణా వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితుడు గుప్తా తెలిపాడు. బెల్లం ఊట ధ్వంసం సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని కుశిమిగూడ పరిధిలో మూడు వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటలు శనివారం ధ్వంసం చేసినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు శనివారం తెలిపారు. సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో దాడులు జరిపినట్టు తెలిపారు. భూమిలో డ్రమ్ములతో పాతి ఉంచిన బెల్లం ఊటలు వెలికి తీసి పారబోసి, డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాసంగిలో గజరాజుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంట పొలాల్లో గజరాజుల గుంపు శనివారం సాయంత్రం కనిపించాయి. ఉదయం వెంకటరాజపురం, బాసంగి, గదబవలసలో వరి పంటలను ధ్వంసం చేసిన గజరాజులు సాయంత్రానికి బాసంగి పరిసర ప్రాంతాల్లోకి చేరాయి. రాత్రికి మళ్లీ వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రబీ వరి పంట ఉభాలు వేసి నెల రోజులు కావడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 258 కేజీల గంజాయి స్వాధీనం పాచిపెంట: మండలంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద పట్టుబడిన గంజాయిని చూపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలో కొటికిపెంట పంచాయతీ గోగాడవలస సమీపంలో హరిత రహదారిపై అనుమానాస్పదంగా రెండు కార్లు ఉన్నాయని మాతుమూరు ఇంచార్జ్ వీఆర్ఓ తమకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఈ మేరకు పాచిపెంట ఎస్ఐ వెంకటసురేష్ సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లి కార్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రొయ్యల చెరువులో దిగి యువకుడి మృతి గుమ్మలక్ష్మీపురం: రాజమండ్రి సమీపంలోని పాలకొల్లులో రొయ్యల చెరువులో పనికి వెళ్లిన గిరిజన యువకుడు మండంగి కిరణ్ (25) రొయ్యల చెరువులో దిగి శనివారం మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు తల్లిదండ్రులు లక్కమ్మ, శంకరరావు ఇతర కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గ్రామానికి చెందిన కిరణ్ కుటుంబ పోషణ నిమిత్తం రొయ్యల చెరువులో పని చేసేందుకు రెండు నెలల క్రితం వె వెళ్లాడు. రొయ్యల చెరువులో కర్రలు పాతాలంటూ యజమాని చెప్పడంతో శనివారం చెరువులో దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడంటూ.. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది రావాలంటూ పాలకొల్లు నుంచి తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. నేడు అక్షరాస్యత అర్హత పరీక్ష విజయనగరం అర్బన్: అక్షరాస్యత అర్హత కోసం చేపట్టిన ఉల్లాస్ కోర్సు పరీక్షను ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు వయోజన విద్య ఉప సంచాలకులు ఎ.సోమేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 48,578 మంది అభ్యాసకులు ఈ పరీక్ష రాయనున్నారు. దీనికోసం 1,051 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇన్విజిలేటర్‌గా అంగన్వాడీ టీచర్లు వ్యవహరిస్తారు. వయోజన విద్య శాఖకు సంబంధించి రాష్ట్ర పరిశీలకులుగా ఎ.దొరబాబు జిల్లాలో హాజరుకానున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, ఏపీఎం వెలుగు, సీడీపీఓ, ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్థాయిలో సీసీ వెలుగు, ఐసీడీఎస్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. -
యథేచ్ఛగా విక్రయాలు..!
ఇదీ పరిస్థితి పాలకొండ పట్టణంలో కొన్నాళ్ల వరకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. తర్వాత అధికారులు పట్టు సడలించటంతో మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో 50 కేసులు నమోదు చేసి సుమారు రూ.40 వేలు అపరాధ రుసుము వసూలు చేశారు. తర్వాత ఈ అంశంపై పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో పాలకొండలో పాలథీన్ నిషేధం అటకెక్కింది. పార్వతీపురం పట్టణంలో వీటి వినియోగం భారీగా ఉంటోంది. మొత్తం చెత్త ఉత్పత్తిలో 30–40 శాతం భాగం దీనిదే. ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదు చేసి రూ.85 వేలు మాత్రమే అపరాధ రుసుం విధించటం దీనికి తార్కాణం. అయినా ప్లాక్టిక్ వినియోగం తగ్గలేదు. కురుపాం నియోజకవర్గానికి ఒడిశా నుంచి భారీగా పాలథీన్ సంచులు, తదితరాలు చేరుకుంటున్నాయి. పాలథీన్ నిషేధంలో సాలూరు నగర పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్లాస్టిక్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపడితే, వినియోగం క్రమేపీ తగ్గుతుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. -
పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు
భువనేశ్వర్: నగరంలో గంజాయి, మద్యం ఇతరేతర మాదక ద్రవ్యాల విక్రయాల జోరు పెరుగుతోంది. ఊహాతీతమైన రీతుల్లో ఈ పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా ఓంఫెడ్ పాల కేంద్రాల్లో గంజాయి దమ్ము సిగరెట్లు విక్రయిస్తున్నట్లు బట్టబయలైంది. స్థానిక జయదేవ్ విహార్ ప్రాంతంలోని 2 ఓంఫెడ్ పాల కేంద్రాల్లో సిగరెట్ల ముసుగులో గంజాయి విక్రయిస్తున్న రాకెట్ గుట్టు రట్టు అయింది. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో కమిషనరేట్ పోలీస్ స్పెషల్ క్రైమ్ శాఖ ఈ ముఠా వ్యవహారాన్ని ఛేదించింది. గంజాయి అక్రమ విక్రయానికి ఆశ్రయం కల్పించిన 2 ఓంఫెడ్ పాల కేంద్రాలను సీజ్ చేశారు. -
క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విరాట్ రైడర్స్
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితిలో శుక్రవారం నుంచి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 6 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఫైనల్లో విరాట్ రైడర్స్, లిఖల్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లిఖిల్ వారియర్స్ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా గజేంద్ర మాఝి నిలిచారు. విజేతలకు మత్తిలి ఐఐసీ దేవదత్త మల్లిక్, సమితి సభ్యుపు బాలారాజ్ కోపే, మత్తిలి విద్యుత్ విభాగం ఇంజినీర్ చిత్తరంజన్ మహరణ, మత్తిలి కాలేజీ ప్రిన్సిపాల్ సుభ్రత్ కుమార్ భత్ర తదితరులు ట్రోఫీ అందజేశారు. -
ప్రజలు సహకరించాలి
ప్లాస్టిక్ చేతి సంచులు, కవ ర్లు నగరంలో నిషేధించాం. ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. వ్యాపా రులు పర్యావరణానికి హాని చేకూరని చేతి సంచులను విక్రయించాలి. ప్రజలు గుడ్డ చేతి సంచుల వినియోగించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్టేందుకు సహకరించాలి. – శ్యామ్ ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం కఠిన చర్యలు తప్పవు ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలి. వాడిన వాటిని చెత్త కుప్పల్లో, కాలువల్లోకి వదిలేస్తున్నారు. నిషేధం పక్కాగా అమలు చేస్తాం. స్వర్ణాంధ్రా–స్వచ్ఛాంధ్రా కార్యాక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా చర్యలు చేపడతాం. – టి.జయరాం, నగర పంచాయతీ కమిషనర్,పాలకొండ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.. నిషేధిత ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్ సంచులు విక్రయించే వ్యాపారులతో కూడా మాట్లాడాం. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. – బి.వెంకటరమణ, ఎంపీడీఓ, వీరఘట్టం -
మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ కన్నుమూత
భువనేశ్వర్: కేంద్రపడా జిల్లా ఔల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ (66) శుక్రవారం కన్నుమూశారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేబేంద్ర శర్మ అంకితభావంతో ఎదిగిన నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై 15వ రాష్ట్ర శాసనసభకు 2014లో ఎన్నికయ్యారు. ఆయన మరణంతో ఈ ప్రాంతంలో సర్వత్రా విచారం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఆవరణలో శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తదితర ప్రముఖులు దివంగత మాజీ శాసన సభ్యుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. -
పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పది ఆపై తరగతులు ఉత్తీర్ణులైన వారంతా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమల్లో వీరికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టరేట్ చాంబర్లో శనివారం జరిగింది. ముందుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా ఉపాధి అధికారి అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు. పనస చెట్లను విరివిగా పెంచాలి బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీనిని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పనస నర్సరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ, కన్వర్జెన్నీ పనులు, పల్లె పండగ, ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, పీఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారమ్ పాండ్స్ తవ్వడానికి జిల్లాలో శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి డ్వా మా పీడీ ఎస్.శారదాదేవి, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ఉగాది కాదు.. ఇది కూటమి దగా!
శృంగవరపుకోట : రానున్న ఉగాది వలంటీర్లకు కూటమి ప్రభుత్వం చేసే దగా.. అని ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని, రూ.10వేల వేతనం ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత లేదని మాట మార్చారన్నారు. కూటమి సర్కారును నిలదీసేందుకు ఈ నెల 30వ తేదీన ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక తొలి నెలలోనే వలంటీర్లను దూరం పెట్టి సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇచ్చి వలంటీర్ల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మిద్దాం ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా తన చాంబర్లో శనివారం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి వ్యాప్తి, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షయ వ్యాధి చికిత్స విధానం తెలియజేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
20.16 లక్షల మొక్కల పెంపకం
● జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన వీరఘట్టం: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఈ ఏడాది 18 నర్సరీల్లో 20.16 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖ అధికారి జి.ఎ.పి. ప్రసూన అన్నారు. వీరఘట్టం మండలం రేగులపాడులో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొక్కల పెంపకం బాధ్యతను అటవీ సెక్షన్, బీట్ ఆఫీసర్లకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పాలకొండ రేంజ్ పరిధిలో 20,507 హెక్టార్లు, కురుపాం రేంజ్ పరిధిలో 32,681 హెక్టార్లు, పార్వతీపురం రేంజ్లో 26,301 హెక్టార్లు, సాలూరు రేంజ్లో 28,230 హెక్టార్లు కలిపి జిల్లా మొత్తం 1,07,719 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయన్నారు. వన నర్సరీల్లో పెంచే మొక్కలను ఈ ఏడాది జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం, సీతంపేట, భామిని, పాలకొండ అటవీ ప్రాంతాల్లో నాటించి అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. త్వరలో కుంకీ ఏనుగులను తెప్పించి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న 11 ఏనుగుల గుంపును సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక ఎలిఫెంట్ జోన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆమె వెంట పాలకొండ రేంజర్ కె.రామారావు, వీరఘట్టం సెక్షన్ ఆఫీసర్ పి.రవిబాబు, సోషల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సోమేశ్వరరావు, తదితరులు ఉన్నారు. -
స్కూల్లో చాలని మధ్యాహ్న భోజనాలు
మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం మధ్యా హ్న భోజనాలు చాలలేదు. దీంతో హోటల్ నుంచి పార్సిళ్లు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెట్టారు. శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య తెలియకుండానే వంట చేయడంతో సుమారుగా 15 మంది విద్యార్థులకు అన్నం సరిపోలేదు. దీంతో మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి 170 మందికి మాత్రమే వంట చేయడానికి బియ్యం ఇస్తున్నారని వంట నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై హెచ్ఎం ఎం. సలాన చిట్టిబాబును వివరణ కోరగా తాను శ్రీకాకు ళం వెళ్లానని, వంట నిర్వాహకులు సరుకులు పక్క దారి పట్టిస్తున్నారని, చెప్పినా వినడం లేదని తెలిపా రు. స్కూల్ అసిస్టెంట్ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించానని పేర్కొన్నారు. ఆయనను వివరణ కోరగా 170 మందికి బియ్యం ఇచ్చానని, తిన్నవారికే గుడ్లు, చెక్కీలు ఇవ్వాలని, తినని విద్యార్థులకు ఇవ్వవద్దని ప్రభుత్వం చెబుతోందని ‘సాక్షి’కి తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి సిరిపారి గ్రామ పంచాయతీలోని బహరదులకి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడిని హత్యచేసి మృతదేహాన్ని గ్రామానికి కొద్దిదూరంలో పడేసి వెళ్లిపోయారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం మృతదేహం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తు మేరకు మృతుడు కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి లులుపొదొరొ గ్రామానికి చెందిన కుమార స్వామి హలువ (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోర్జరీ సంతకాలు.. ఒకరు అరెస్టు
కొరాపుట్: ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ నిధులను దారి మళ్లించి బెట్టింగ్‌లకు ఉపయోగించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి అరైస్టెయ్యారు. కొరాపుట్ విజిలెన్స్ విభాగం పరిధిలోని కలహండి జిల్లా త్వముల్–రాంపూర్ సమితి పొడపొదర్, తెలంగి పంచాయతీల పీఈవో దేవానంద సాగర్ని అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని భవానీపట్న కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు. నిందితుడు రెండు పంచాయతీలకు చెందిన సర్పంచ్ల సంతకాలను ఫోర్జరీ చేశారు. అనంతరం రూ.3 కోట్ల నిధులను తన సొంత ఖాతాకి బదలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడి నష్టపోయాడు. అధికారుల ఆడిట్లో ఈ విషయం తేలడంతో వారు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ బోల్తా.. చిన్నారి మృతి రాయగడ: జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్ సమితి పరిధిలోని పెర్నాకాడు గ్రామ మలుపులో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో 28 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి గుడుబలి గ్రామానికి చెందిన మేఘన గొబరెంగ(6)గా సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. గుడుబలి గ్రామానికి చెందిన 30 మంది ఒక ట్రాక్టర్లో పెర్నాకాడు గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కిందపడి ఊపిరాడక మేఘన అనే చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను చంద్రపూర్ ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని మునిగుడ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.