జయపురం: కెనాల్‌లో గల్లంతైన స్థానిక మహారాణిపేట రామ్‌దాస్‌లైన్ యువకుడు పి.నిఖిలేష్ మృతదేహాన్ని దాదాపు 60 గంటల తర్వాత వెలికి తీశారు. ఈ సంఘటనపై జయపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోస్టుమార్టం తర్వాత అతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పట్టణ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి వెల్లడించారు. ఉదయం కుంధారగుడ సమీప ప్రధాన కెనాల్‌లో శవం తేలుతుండటం ప్రజల చూశారు. ఆ మృతదేహం ధన్‌పూర్ శాఖ కెనాల్ వరకు కొట్టుకువెళ్లి అక్కడి గేట్‌కు చిక్కుకుంది. ఆ ప్రాంత ప్రజలు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు, నిఖిలేష్ కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మృత దేహాన్ని బయటకు తీయగా కుటుంబ సభ్యులు గుర్తు పట్టారు. అనంతరం నిఖిలేష్ మృతదేహాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ యువకుడు సతిగుడ డేమ్ ఎల్లో బ్రిడ్జి వద్ద కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.