స్వాభిమాన్ ఏరియాలో ఎమ్మెల్యే మంగుఖీలో పర్యటన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా దూర్గమ్ ప్రాంతమైన ధూలిపూట్ పంచాయతీలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో తొలిసారిగా బుధవారం పర్యటించారు. ఆయనకు సంప్రదాయబద్ధంగా గిరిజనులు పూలమాలలు వేసి స్వాగడం పలికారు. అనంతరం అంత్యోదయ గృహ యోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంగుఖీ పంచాయతీలో నెలకున్న సమస్యలను జిల్లా కలెక్టర్‌తో చర్చించి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గోవిందపాత్రో, చిత్రకొండ సమితి ప్రతినిధి విదేశీ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.


