విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం
జయపురం: స్థానిక ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడుగా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన భగవాన్ సాబత్‌ను మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ చంద్ర పట్నాయక్ అధ్యక్షత వహించారు. భగవాన్ సాబత్‌కు దుశ్శాలువతో సత్కరించి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ సిబ్బంది పద్మావతి, విశ్వరంజన్ గౌడ పాల్గొన్నారు.
జరిమానా పేరిట వేధిస్తున్నారు
మల్కన్‌గిరి: వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు చూపిస్తున్నా మైన్స్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు జరిమానాల పేరిట అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మల్కన్‌గిరి జిల్లా జిల్లా టిప్పర్, ట్రక్ సంఘం యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధశారం జిల్లా కేంద్రంలో బొండబక్కల్ క్రీడా మైదానంలో వందకు పైగా ట్రక్‌లను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్లను తీర్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో సంతోష్ కుమార్ రౌత్, ప్రభాకర్ ప్రధాన్, బునరావు, లాలిత్ సుమానీ, సురజీత్ నాంధి, జి.శ్యామ్‌సుందర్, రాజా పాత్రో, వాసుదేవరావు, గోవింద చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యసిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి
పర్లాకిమిడి: జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉందని, తక్షణమే వాటిని భర్తీ చేయాలని బీజేపీ యువజన నాయకులు కోట్ల యువరాజ్ కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహాలింగను సర్క్యూట్ హౌస్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. సామాజిక ఆరోగ్యకేంద్రాలలో హెల్త్ ఏటీఎంలు ప్రవేశపెట్టాలని కోరారు.
వ్యక్తి ఆత్మహత్య
మల్కన్‌గిరి: బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని పర్కన్‌మాల పంచాయతీ టెక్‌గూడ గ్రామానికి చెందిన సత్తి పంగీ(55) అనే వ్యక్తి మంగళవారం రాత్రి విషం తాగేశాడు. గమనించిన భార్య వెంటనే గ్రామస్తుల సహకారంతో కుడుములగుమ్మ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బలిమెల ఐఐసీ ధీరాజ్ పట్నాయక్ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖొయిర్‌పూట్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, సత్తి కొన్నాళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఆర్టీసీ పరిధిలోని శ్రీకాకుళం–1, 2 డిపోలు, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల్లో పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బి.కె.మూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలోని ఈయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు రద్దు చేసి 1/2019 సర్క్యూలర్ అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో కొంతమంది ఉద్యోగులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగులను ఉద్యమాలవైపు నెడుతున్నారన్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాలోని నాలుగు డిపోల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విజయనగరం జోన్‌లో 19 డిపోల్లో ఉద్యమం చేస్తామన్నారు. ఆయనతో పాటు ఈయూ నాయకులు ఎ.దిలీప్‌కుమార్, జి.త్రినాథ్, కేజీరావు తదితరులు ఉన్నారు.
విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం
విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం
విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం
విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం


