Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy to Visit Chittoor Assurance for mango farmers1
అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతు­న్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్‌ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపా­ళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరో­వైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగ­ట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. కొందరు పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఫోన్‌ చేసి వైఎస్‌ జగన్‌ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం. వైఎస్‌ జగన్‌ బంగారు­పాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా మార్కెట్‌ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మంది, మార్కెట్‌ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్‌కు వైఎస్‌ జగన్‌ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్‌ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్‌కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్‌ జగన్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా... మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసనబంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Huge drop in students in govt schools in Andhra Pradesh2
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!

వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్‌రోల్‌మెంట్‌ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్‌గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్‌రోల్‌ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్‌లో కూడా ఎన్‌రోల్‌మెంట్‌ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశా­లు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థు­లుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యా­రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తు­న్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్‌కు మంగళం.. సీబీఎస్‌ఈ, ఐబీ విధానం ఔట్‌... టోఫెల్‌ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్‌లు నిలిపివేత.. డిజిటల్‌ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆల­స్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివే­య­డంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్‌ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నా­రు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చి­దిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్‌ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్‌రోల్‌ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్‌) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్‌కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్‌ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్‌ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా­యి. 2024 జూన్‌ 12న చంద్రబాబు సీఎంగా ప్రమా­ణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబి­య్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్‌ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‌‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపా­యాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్‌ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నా­రు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభు­త్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూట­మి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపో­యింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్‌ స్టార్‌’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్‌ జగన్‌ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యా­ర్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మా­ర్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్‌లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు.

Rasi Phalalu: Daily Horoscope On 09-07-2025 In Telugu3
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి రా.1.11 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మూల తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.06 నుండి 1.50 వరకు, తదుపరి రా.3.37 నుండి 5.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: రా.10.15 నుండి 11.53 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.... పనుల్లో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.వృషభం... సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం... ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కర్కాటకం... ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం... ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్థిరాస్తి వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కన్య.... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కనిపిస్తుంది.తుల... నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. భూలాభాలు పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.వృశ్చికం... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.ధనుస్సు... వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. ఒప్పందాలు కుదురుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.మకరం.... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కుంభం... పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.మీనం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

11 People Fell Ill After Drinking Kalthi Kallu in Hyderabad4
కల్తీ కల్లు తాగి 13 మందికి అస్వస్థత

కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన కూకట్‌పల్లిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వ్యవధిలోనే ఒకే రకమైన అనారోగ్య సమస్యలతో 11 మంది అస్వస్థతకు గురై ఒకే ఆసుపత్రిలో చేరడంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వీరంత వాంతులు, విరోచనాలు, లో బీపీ , కడుపునొప్పి తదితర సమస్యలతో కూకట్‌పల్లి రాందేవ్‌ రావ్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. బాధితులందరూ ఒక రోజు అటు ఇటుగా కల్లు తాగినవారే కావడంతో కల్తీ కల్లు కారణంగానే వారు అస్వస్థతకు గురై ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న వారిలో అడ్డగుట్టకు చెందిన యోబు, నడిగడ్డ తండాకు చెందిన దేవదాసు, గోకుల్‌ ప్లాట్స్‌ కు చెందిన పోచవ్వ, హెచ్‌ఏంటీ శాతవాహన నగర్‌ కు చెందిన చాకలిలక్ష్మి, శంశీగూడ ఇందిరానగర్‌ కు చెందిన గోవిందమ్మ, పెంటేష్‌, హెచ్‌ఎంటీ హిల్స్‌కు చెందిన యాదగిరి, నరసింహ, హైదర్‌ నగర్‌ కు చెందిన మాధవి, కోటేశ్వర్‌ రావు, మానప్ప ఉన్నారు. వీరందరూ హైదర్‌ నగర్, శాతవాహన నగర్, ఎల్లమ్మబండ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించటం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. ఈ విషయమై ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఆరోగ్యస్థితిపై మేడ్చల్‌ జిల్లా వైద్యశాఖ అధికారి ఉమా గౌరి సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా కల్లు తాగినట్లు గుర్తించామని, అక్యూట్‌ గ్యాస్రై్టటిస్‌ తదితర లక్షణాలు ఉన్నాయని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.బుధవారం ఉదయం నిర్వహించే వైద్యపరీక్షల అనంతరం డయాలసిస్‌ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తామన్నారు. రాందేవ్‌ రావ్‌ ఆసుపత్రిలో 11 మంది చికిత్స పొందుతున్నారని, మిగతా చోట్ల మరో ఇద్దరు ఉన్నట్లు చెబుతున్నారని మొత్తంగా 13 మంది ఆసుపత్రి పాలైనట్లు తెలిసిందన్నారు. బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే మాధవరం పరామర్శ విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే ఆసుపత్రికి చేసుకుని వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీ కల్లు విషయంలో పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే గాందీకల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన వారిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరామర్శించారు. అక్కడే ఉన్న వైద్యులను, పోలీసులు, ఎక్షైజ్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలాకాలంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

AP Govt Fails To Provide Relief Price Of Mango Farmers5
ఇదండీ బాబు సర్కారు తీరు..కిలో మామిడికి నాలుగు రూపాయ‌లిస్తే చాలట‌!

ఢిల్లీః: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమో ఉందో ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడూ రైతులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. మరోసారి కూడా అదే పునరావృతం చేసింది. తాజాగా ఏపీలోని మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతుంటే.. బాబు సర్కారు మాత్రం చర్యల్లో ఫెయిల్‌ అయ్యింది. తాజాగా ఈరోజు(మంగళవారం. జూలై 08) ఏపీలోని మామిడి రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఏపీలోని మామిడి రైతులకు కిలో గిట్టుబాట ధర రూ. 4 ఇస్తే చాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనికి మళ్లీ వినతి పత్రం కూడా సమర్పించారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. ఈ మాత్రం దానికి కేంద్ర మంత్రిని కలవడం ఎందుకు? వినతి పత్రం ఇవ్వడం ఎందుకు? అనే విమర్శ వినిపిస్తోంది. కనీసం కర్ణాటకకు ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా లేదు..ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే.. చంద్రబాబు సర్కారుకు ఏపీలోని రైతులపై ఎంత శ్రద్ధం ఉందో అనే విషయం అవగతమవుతుంది. కనీసం కర్ణాటకలో మామిడి రైతుకు ఇచ్చే కనీస మద్దతు ధర కిలోకు రూ. 16గా ఉంది. మరి ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కూడా ఇప్పించలేకపోయింది బాబు సర్కార్‌. మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది, కనీసం కర్ణాటక తరహా రేటైనా ఇవ్వండని అడగలేదు బాబు ప్రభుత్వం. దాంతో రైతు సమస్యలపై బాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌,సిన్సియారిటీ లేవని విషయం అర్థమైంది. మొక్కుబడిగా, హడావుడిగా..వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మామిడి రైతులకు మద్దతుగా పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కుబడిగా, హడావుడిగా కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలిశారు. ఎంఐఎస్ స్కీం కింద కిలో నాలుగురూపాయ‌ల చొప్పున 260 కోట్లిస్తే చాలని అచ్చెన్నాయుడు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే మామిడికి ధర లేక రైతులు చెట్టను నరికేసుకుంటున్న నేపథ్యంలో ఈ ధరతో వారిని ఉద్ధరించాలని అనుకోవడం నిజంగా సిగ్గు చేటని విమర్శలు వస్తున్నాయి.

Indian Army to Test DRDO Mounted Gun System That Fires6
ధ్వంసం చేస్తూ.. దిశ మార్చుకుంటూ

అహ్మద్‌నగర్‌: వేగంగా దూసుకెళ్తూ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ గురిచూసి లక్ష్యాలను ఛేదించే అధునాతన శతఘ్ని విభాగంలో భారత్‌ మరో ఘనత సాధించింది. తొలిసారిగా గరిష్టస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దేశవాళీ శతఘ్ని (మౌంటెడ్‌ గన్‌ సిస్టమ్‌–ఎంజీఎస్‌)ని తయారు చేసినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రకటించింది.తద్వారా శతఘ్నుల్ని వేగంగా మోహరించే అడ్వాన్స్‌డ్‌ టోవ్డ్‌ ఆరి్టలరీ గన్‌ సిస్టమ్‌(ఏటీఏజీఎస్‌)లో భారత్‌ మరో ముందడుగువేసింది. త్వరలో ఈ ఎంజీఎస్‌ను పూర్తిస్థాయి పరీక్షల కోసం భారత సై న్యానికి అప్పగించనున్నారు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ పరీక్షల్లో ఎంజీఎస్‌ తన సత్తాను చాటితే ఆ తర్వాత దీనిని సైన్యంలో విలీనం చేస్తారు. బాలాసోర్, పోఖ్రాన్‌లో దీనిని విజయవంతంగా పరీక్షించి చూశా మని వెహికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (వీఆర్‌డీఈ) చీఫ్‌ జి.రామమోహనరావు చెప్పారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు⇒ 155ఎంఎం/52 కాలిబర్‌ మందుగుండును పేల్చే సామర్థ్యంతో ఈ అధునాతన శతఘ్నిని రూపొందించారు. డీఆర్‌డీవోకు చెందిన అహ్మద్‌నగర్‌లోని వీఆర్‌డీ దీనిని తయారు చేసింది. ⇒ 85 సెకన్ల వ్యవధిలోనే వేగంగా విచ్చుకుని మందుగుండును లోడ్‌ చేసుకోగలదు. ఒక నిమిషంలో ఆరుసార్లు బాంబులను ప్రయోగించగలదు. ⇒ మందుగుండును ప్రయోగించగానే తన జాడ శత్రువులకు తెలీకుండా ఉండేందుకు వేగంగా ముడుచుకుని వేరే చోటుకు ప్రయాణం సాగించగలదు. ఒక చోట ఉండి భిన్న దిశలో బాంబులను ప్రయోగించగలదు. ⇒ ఇందులోంచి మందుగుండును పేల్చే గన్‌ బరువే ఏకంగా 30 టన్నులు. ⇒ గరిష్టంగా 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేయగలదు. దీని క్యాబిన్‌ను పూర్తిగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచంతో నిర్మించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు సైనికులు ప్రయాణించవచ్చు. ⇒ ఈ శతఘ్నిలో దాదాపు 85 శాతం పరికరాలు భారత్‌లో తయారైనవే. ⇒ దిగ్గజ ఫ్రాన్స్‌ సీజర్, ఇజ్రాయెల్‌ అ ట్మోస్‌ 2000 సిస్టమ్‌ల తరహాలో ఈ శ తఘ్నిని రూపొందించారు. ఒక్కో యూనిట్‌ ధర తో పోలిస్తే దీని తయారీ ఖర్చు తక్కువ.

Belarusian star Sabalenka in Wimbledon semis7
సబలెంకా శ్రమించి...

లండన్‌: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరేందుకు బెలారస్‌ స్టార్‌ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్‌ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్‌ లౌరా సిగెముండ్‌ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్‌ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్‌లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. సెట్‌ను 6–2తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్‌లో సిగెముండ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్‌ మొత్తంలో రెండు ఏస్‌లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నెట్‌ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్‌ కొట్టిన ఈ బెలారస్‌ స్టార్‌ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్‌లో సెమీఫైనల్‌ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్‌లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్‌ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అల్‌కరాజ్‌ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్‌ నోరి (బ్రిటన్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 13 ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌తో అల్‌కరాజ్‌ తలపడతాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రిట్జ్‌ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్‌ (రష్యా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. గట్టెక్కిన సినెర్‌ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్‌ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్‌లో సినెర్‌ తొలి రెండు సెట్‌లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్‌లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్‌ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్‌ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్‌ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో దిమిత్రోవ్‌ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం.

Nutritional Value And Usage Of Porridge8
గంజితో గట్టి మేలు.. ఎలా వాడాలి?

న్యూఢిల్లీ: ఉరుకులు పరుగుల జీవితంలో నఖశిఖపర్యంతం మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలు. అన్ని ఆరోగ్య సమస్యలు అవతలి వాళ్లకు చూడగానే కనిపించవు. కానీ జుట్టు సరిగాలేకపోయినా, జుట్టు ఊడిపోయినా ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెడతారు. జుట్టు రాలిపోయే సమస్యకు ఇప్పుడు ఎంతో మంది వందల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో రకాల ఖరీదైన షాంపూలు ఉపయోగిస్తున్నారు.అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుపెట్టకుండానే జుట్టు రాలే సమస్యను గంజితో పరిష్కరించుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్‌లలో శతాబ్దాలుగా గంజిని జుట్టు పోషణ కోసం విరివిగా ఉపయోగిస్తున్నా భారత్‌లో గంజి వినియోగం అంతంతే. ఈ నేపథ్యంలో గంజిని వృథాగా పారబోయకుండా ఒత్తయిన జుట్టు కోసం సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు జపాన్, చైనాలో గంజిని ఉపయోగిస్తారు.గంజి వాడకంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వెంట్రుకల కొనలు పగిలిపోవడంలాంటివి బాగా తగ్గుతాయి. గంజి వినియోగంతో జుట్టు మరింతగా మెరుస్తూ, పొడవు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి–విటమిన్, ఇ–విటమిన్‌తోపాటు ఐనోసైటోల్, నియాసినమైడ్‌ వంటి కీలకమైన అమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పోషణకు ఎంతో మేలుచేకూరుస్తాయి. పాడైన జుట్టును రిపేర్‌ చేయడంలో ఐనోసైటోల్, నియాసినమైడ్‌లు కీలకపాత్ర పోషిస్తాయి. శతాబ్దాలుగా వినియోగం గంజితోపాటు చాలా సేపు బియ్యాన్ని నానబెట్టడం ద్వారా వచ్చే నీరు కూడా జుట్టుకు ఎంతో మేలుచేస్తుంది. బియ్యాన్ని ఉడకబెట్టాక గిన్నెలోకి వొంపే గంజిలో అత్యావశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొంతమేర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ గంజిని జుట్టుకు పట్టిస్తే కేశనాళికలు బలంగా మారతాయి. అమైనో యాసిడ్‌లు, ప్రోటీన్ల కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుక మందం సైతం పెరుగుతుంది.గంజిలో ఉండే ఐనోసైటోల్‌ అనే కార్బోహైడ్రేడ్‌ ఇందుకు చాలా దోహదంచేస్తుంది. ఐనోసైటోల్‌ కారణంగా కేశాలు మరింత దృఢంగా మారతాయి. కేశాల మరమ్మతు, పెరుగుదలకు ఐనోసైటోల్‌ బాగా పనికొస్తుంది. గంజిలోని సిసీŠట్‌న్, మిథియోనైన్‌లు జుట్టును బలంగాచేస్తాయి. దాంతో జుట్టు అంత త్వరగా కొనలు విరిగిపోవు. చిట్లిపోవడం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టుకు ఈ అమైనా యాసిడ్‌లు భరోసా ఇస్తాయి. ప్రాచీన జపాన్‌లోనూ మహిళలు గంజిని విరివిగా ఉపయోగించారని తెలుస్తోంది.చైనాలోని హువాంగ్లూ గ్రామంలో యావో మహిళల జుట్టు పొడవుగా, బలంగా, అందంగా ఉంటుంది. గంజితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్లే తమ కేశాలు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయని వాళ్లు చెప్పారు. గంజిలోని గొప్పదనాన్ని ఇప్పటికే కనిపెట్టిన కొన్ని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను గంజి ఆధారంగా తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నాయి. హెయిర్‌ మాస్‌్కలు, కండీషనర్లు ఇలా కేశ సంబంధ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్రధాన సరుకు గంజే. గంజిని ఎలా వాడాలి? రోజూ వంటలోకి వండుకున్నట్లే బియ్యాన్ని ఏమాత్రం దుమ్ము, ధూళి, మట్టిలేకుండా చక్కగా జల్లెడ పట్టుకున్నాక నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. ఈ గంజిని వెంటనే జుట్టుకు పట్టించకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 24 నుంచి 48 గంటలపాటు అలాగే పాత్రలోనే ఉంచాలి. పాత్రపై మూత బదులు వస్త్రంతో కప్పి కొనల వెంట రబ్బర్‌తో చుట్టాలి. ఇలా ఒకటి, రెండు రోజులు పులియబెట్టాక నేరుగా జుట్టుకు పట్టించండి. నెమ్మదిగా కుదుళ్ల వద్ద మసాజ్‌ చేయండి.దీంతో గంజి జుట్టుకు సమంగా అంటుకుంటుంది. రక్తప్రసరణ సైతం సరిగా అవుతుంది. తలస్నానం చేశాక కూడా జుట్టు ఆరిన తర్వాత ఇలా గంజి పట్టించవచ్చు. ఒక 20 లేదా 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అతిగా వాడితే మాత్రం దురద వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహాతో ఈ చిట్కాను కొనసాగించవచ్చు.

Sakshi Guest Column On GST Some Changes By Central Govt9
జీఎస్టీ చిక్కుముళ్లు వీడేనా?

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై ఎన్నో ఏళ్లుగా పట్టిన మంకుపట్టు సడలించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించేందుకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కొన్ని మార్పులు తేవడానికి సమాయత్తం అయింది. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలఖరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ 56వ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థం అవుతున్నది. వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరగడం వల్ల ఉత్పత్తి రంగం కళకళలాడే అవ కాశం ఉంది. గత కొన్నేళ్లుగా జీఎస్టీకి సంబంధించి ఎవరేమి మాట్లా డినా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల దేశంలో వినిమయ సంస్కృతిని మరింత పెంచడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతున్నారు. పరో క్షంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని హేతుబద్ధీకరిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.సరళతరం కాకపోగా చిక్కులు8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్‌ అండ్‌ సింపుల్‌ టాక్స్‌)గా చెప్పబడిన ‘జీఎస్‌టీ’ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెట్టింది. నిజానికి, గత 8 ఏళ్లుగా జీఎస్టీపై జరిగినంత చర్చ, వాదోపవాదాలు మరే అంశం మీదా జరగలేదు. జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. అయితే, జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయనీ, ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందనీ చెప్పడం అర్ధ సత్యమే. జీఎస్టీ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలు వర్గాల వారు గగ్గోలు పెడుతున్నారు. పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 55 సమావేశాలు జరిపినప్పటికీ జీఎస్టీ మండలి భేటీలలో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు.జీఎస్టీ చిక్కుళ్లలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1,400కు పైబడిన వస్తువులు, 500 రకాల సేవలను ఈ నాలుగు శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారు గానీ అందులో హేతుబద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తన సహచర మంత్రి నిర్మలా సీతారామన్‌ కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై ఇంత మొత్తం జీఎస్టీ వేయడం వల్ల... వారు జీవిత, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై 5% జీఎస్టీ విధించినా కొంతవరకు అర్థం ఉందిగానీ... ఏకంగా 18% పన్ను వేయడం అన్యాయమని పాలసీదారుల అసోసియేషన్‌ సైతం కేంద్రానికి విన్న వించినప్పటికీ సానుకూల స్పందన రావడం లేదు.నిత్యావసరాలపై ఇంతా?ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపు దారులకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య వివాదాలు తలెత్తి చివ రకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్‌ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు అందించిన ఆర్థిక సహ కారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు కేంద్రం ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. దీన్ని ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను పెడచెవిన పెట్టింది.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపై, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపై 5% జీఎస్టీ మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా వ్యవహరించారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తులపై, ప్యాకింగ్‌ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలపై 18% జీఎస్టీ విధించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మినహాయించి విలాస వస్తువుల పైననే పన్ను వేస్తామని చెప్పిన దానికీ, ఆచరణలో చేస్తున్న దానికీ పొంతన ఉండటం లేదు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35 శాతం జీఎస్టీ విధించాలంటూ జీఎస్టీ రేట్ల హేతు బద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం జీఎస్టీ మండలికి ఓ నివేదిక అందించింది. పన్నులు పెంచితే ఆరోగ్య హానికర ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలు మానేస్తారా అన్నది చర్చనీయాంశం. అదే నిజ మైతే మద్యం మీద కూడా అధికంగా పన్నులు వేయాల్సి ఉంటుంది.ఎంఎస్‌ఎంఇలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న వాటిల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీ రంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్‌ఎంఇ రంగం జీఎస్టీ కారణంగా కుదేలయిందన్నది చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలావరకు మూతబడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్‌ చెయిన్‌ తెగిపోయిందని ఆ రంగంపై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతిమంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ, మరోవైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్క రించుకోవడానికి జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది. ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవకాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసిపోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుకతోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. వీటి మాటెలా ఉన్నా, అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతున్నదా, లేదా అన్నదే కొలమానం. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి

 US to seal major trade deal with India soon announces Trump10
త్వరలో ఇండియాతో ట్రేడ్‌ డీల్‌

న్యూయార్క్‌: ఇండియాతో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, ఈ విషయంలో ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై ఎంతమేరకు సుంకాలు విధించబోతున్నామో తెలియజేస్తూ తమ అధికారులు ఆయా దేశాలకు లేఖలు పంపిస్తున్నారని వెల్లడించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), చైనాతో తాజాగా ట్రేడ్‌ డీల్‌ కుదిరిందని, ఇకపై భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడారు. లేఖలు పంపించడం వరకే తమ బాధ్యత అని, తమతో ఒప్పందానికి ముందుకు రావాలో వద్దో ఆయా దేశాలే తేల్చుకోవాలని, తుది నిర్ణయం వారిదేనని పరోక్షంగా స్పష్టంచేశారు. కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై 200 శాతం దాకా సుంకాలు విధిస్తున్నాయని, అమెరికాను దోచుకోవడమే వాటి విధానామా? అని ప్రశ్నించారు. ఇకపై అమెరికాలో ఉత్పత్తులు విక్రయించుకోవాలంటే సుంకాలు చెల్లించకతప్పదని తేలి్చచెప్పారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, ఆ ఘనత తనకే చెందాలని ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే వ్యాపారం, వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు.విదేశాలపై ఏప్రిల్‌ 2న విధించిన సుంకాల తాత్కాలిక రద్దును ట్రంప్‌ సర్కారు ఆగస్టు 1వ తేదీ దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్‌ సంతకంతో అమెరికా ప్రభుత్వం లేఖలు పంపించిన దేశాల జాబితాలో ఇండియా లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్, బోస్నియా, కాంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, మలేషియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, టునీíÙయా తదితర దేశాలకు ఈ లేఖలు అందాయి. మయన్మార్, లావోస్‌పై 40 శాతం టారిఫ్‌ మయన్మార్, లావోస్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ మోత మోగించారు. రెండు దేశాల ఉత్పత్తులపై 40 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాల అధినేతలకు రాసిన లేఖలను సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. అలాగే కాంబోడియా, థాయ్‌లాండ్‌పై 36 శాతం, సెర్బియా, బంగ్లాదేశ్‌పై 35 శాతం, ఇండోనేíÙయాపై 32 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జిగోవినాపై 30 శాతం, కజకిస్తాన్, మలేషియా, టునీíÙయాపై 25 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ టారిఫ్‌లకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచే ఆలోచన చేయొద్దని ఆయా దేశాల అధినేతలను సున్నితంగా హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌పై 10 శాతం సుంకాలుపునరుద్ఘాటించిన ట్రంప్‌న్యూయార్క్‌/వాషింగ్టన్‌: బ్రిక్స్‌ కూట మిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తమ దే శాన్ని, కరెన్సీ (డాలర్‌) ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకే అది ఆవిర్భవించిందని మంగళవారం ఆరోపించారు. ‘‘డాలర్‌కు అంతర్జాతీయంగా ఉన్న విలువను నాశ నం చేసేందుకు బ్రిక్స్‌ దేశాలు ప్రయ త్ని స్తున్నాయి. తెలివైన అధ్యక్షుడెవరూ అలా జరగనివ్వరు. అది ఒక పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓటమి చవిచూడటం వంటిదే.అలా ఎప్పటికీ జరగనివ్వం. ప్రపంచ కరెన్సీల్లో ఇప్పటికీ, ఎప్పటికీ డాలరే కింగ్‌. దాని ఆధిపత్యాన్ని సవాలు చేయాలనుకుని బ్రిక్స్‌ దేశాలు అనుకుంటే, తద్వారా మాతో ఆటలు ఆడాలనుకుంటే అభ్యంతరం లేదు. కానీ అందుకు మూల్యంగా వాటన్నింటిపైనా మరో 10 శాతం సుంకాలు విధించి తీరతాం. కేవలం బ్రిక్స్‌కూటమిలో ఉన్నందుకు అవి చెల్లించాల్సిన భారీ మూల్యమిది. అందుకు అవి సిద్ధంగా ఉన్నాయని నేను భావించడం లేదు’’ అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement