
ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
పర్లాకిమిడి: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బుధవారం కూడా కొనసాగాయి. పర్లాకిమిడి పట్టణంలో ఘనంగా అధికార యంత్రాంగం నిర్వహించింది. దివంగత శ్రీకృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ శ్మశాన వాటికలోని సమాధివద్ద కలెక్టర్, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి ఇతర అధికారులు దేశ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలో చిత్రకారవీధి జంక్షన్ వద్ద మహారాజా విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేశారు. అనంతరం సొండివీధి సరస్వతీ శిశు విద్యామందిర్ వద్ద స్కూల్ విద్యార్థుల ర్యాలీని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ప్రారంభించారు. ఉత్కళమాత, మహారాజా కృష్ణచంద్ర గజపతి, పండిత గోపబంధుదాస్, మధుసూదన్ దాస్, ఫకీర్ మోహాన్ సేనాపతి, బోయితబోంధన పండుగ వేషాధారణలతో విద్యార్థులు అలరించారు. అనంతరం మార్కెట్ జంక్షన్ వద్ద మహారాజా కృష్ణచంద్రగజపతి కాంస్య విగ్రహానికి కలెక్టర్, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, సేరివీధి భేతాళ క్లబ్ సమరయోధుల, కత్రి కర్రసాములతో విన్యాసాలు చేశారు. గజపతి ప్యాలస్ వరకూ ఉత్కళ దివాస్ ర్యాలీ కొనసాగింది.

ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ వేడుకలు