ఇదీ పరిస్థితి
పాలకొండ పట్టణంలో కొన్నాళ్ల వరకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. తర్వాత అధికారులు పట్టు సడలించటంతో మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో 50 కేసులు నమోదు చేసి సుమారు రూ.40 వేలు అపరాధ రుసుము వసూలు చేశారు. తర్వాత ఈ అంశంపై పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో పాలకొండలో పాలథీన్ నిషేధం అటకెక్కింది. పార్వతీపురం పట్టణంలో వీటి వినియోగం భారీగా ఉంటోంది. మొత్తం చెత్త ఉత్పత్తిలో 30–40 శాతం భాగం దీనిదే. ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదు చేసి రూ.85 వేలు మాత్రమే అపరాధ రుసుం విధించటం దీనికి తార్కాణం. అయినా ప్లాక్టిక్ వినియోగం తగ్గలేదు. కురుపాం నియోజకవర్గానికి ఒడిశా నుంచి భారీగా పాలథీన్ సంచులు, తదితరాలు చేరుకుంటున్నాయి. పాలథీన్ నిషేధంలో సాలూరు నగర పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్లాస్టిక్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపడితే, వినియోగం క్రమేపీ తగ్గుతుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
యథేచ్ఛగా విక్రయాలు..!