
రెవెన్షా క్యాంపస్‌లో ఉద్రిక్తత
భువనేశ్వర్: కటక్‌లోని రెవెన్షా విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్‌కు బయట వారు వస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. బయటి వ్యక్తుల ప్రవేశం, దాడులను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన చేస్తున్నారు. వైస్ చాన్స్‌లర్ కార్యాలయం ముంగిట విద్యార్థులు ఆందోళన చేశారు.
దుబాయ్‌కు రాష్ట్ర పంటలు
భువనేశ్వర్: రాష్ట్రంలో పంటలకు అంతర్జాతీయ గిరాకీ లభించింది. ఇక్కడ పండించిన కూరగాయలు పొటల్స్, మునగకాయలు విదేశాలకు ఎగుమతి కావడం విశేషం. ఈ ఉత్పాదనలను స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయంగా రవాణా చేశారు. దీంతో ఒడిశా వ్యవసాయ ఎగుమతుల్లో ఒక మైలురాయిని సాధించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
జయపురం: సబ్ డివిజన్ పరిధి కుంద్ర సమితి కావిడియగుడ ఎస్‌ఎస్‌డీ ఉన్నత పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం సురేంద్ర హరిజన్ తన బైక్‌పై కుమార్తె రాహిల్‌తో కలిసి కుంద్ర నుంచి దిగాపూర్ వెళ్తున్నాడు. కాగా కావిడియగుడ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక ఆటో వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేంద్ర ముఖం, చెవులకు బలమైన గాయాలయ్యాయి. ఆటోలో కూర్చున్న బిభుతి పట్నాయిక్ కాలుకి దెబ్బలు తగిలాయి. రాహిల్‌కు తలపై గాయమవ్వడంతో పాటు కాలు విరిగింది. ప్రమాదాన్ని చూసిన పాఠశాల ఉపాధ్యాయుడు దేవేంద్ర శనాపతి, సామాజిక కార్యకర్త సుందరబారిక్ మల్ల, లొబి కొరలియలు గాయపడిన వారిని వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్ తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు క్వింటాళ్ల తాబేళ్ల అక్రమ తరలింపు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు చెక్‌గేట్ వద్ద గురువారం తాబేళ్ల అక్రమ తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. ఎంవీ 79 గ్రామం వద్ద ఓ మినీ వ్యాన్‌లో 6 క్వింటాళ్ల తాబేళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ తాబేళ్లను ఆంధ్రా నుంచి అక్రమంగా కలిమెలకు తరలిస్తున్నారు. మొత్తం 300 తాబేళ్లు ఉన్నాయి. ఎంవీ 88 గ్రామానికి చెందిన సురాజ్ మాల్లిక్, ఎంపీవీ 83 గ్రామానికి చెందిన శక్తి పథ్‌లను అరెస్టు చేశారు. తాబేళ్ల విలువ రూ.5 లక్షలకుపైనే ఉంటుందని మోటు ఫారెస్టర్ మురళి తెలిపారు.
రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ
కొరాపుట్: కేంద్ర రైల్వే మంత్రి అశ్వీని శ్రీవైష్ణవ్‌ను నబరంగ్‌పూర్ బీజేపీ ఎంపీ బలభద్ర మజ్జి గురువారం న్యూ ఢిల్లీలో కలిశారు. రైల్వే, ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్, తదితర ఆంశాలపై చర్చించారు. ఒడిశా రాష్ట్రంలో రైల్వే, తదితర శాఖలలో అనేక ఖాళీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వ ఖాళీలు సామరస్య పూర్వకంగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వ పథకాల గూర్చి ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుందన్నారు.

రెవెన్షా క్యాంపస్‌లో ఉద్రిక్తత

రెవెన్షా క్యాంపస్‌లో ఉద్రిక్తత

రెవెన్షా క్యాంపస్‌లో ఉద్రిక్తత

రెవెన్షా క్యాంపస్‌లో ఉద్రిక్తత