
భారీ వర్షంతో రాకపోకలు బంద్
కొరాపుట్: కొరాపుట్–సునాబెడా పట్టణాల మధ్య గురువారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి స్తంభించిపోయింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిర్మితమవుతున్న మార్గం బురదమయం కావడంతో ఈ దుస్థితి నెలకొంది. రాయ్‌పూర్–విశాఖపట్నం జాతీయ రహదారి–26 కావడంతో దాని ప్రభావం మూడు రాష్ట్రాలపై పడింది. రాత్రిపూట సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, వెళ్లే అంతర్రాష్ట్ర బస్సులు పదుల సంఖ్యలో నిలిచిపోయాయి. సుమారు 7 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిలిచిపోయిన వాహనాల్లో అంబులెన్సులు కూడా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పలేదు.

భారీ వర్షంతో రాకపోకలు బంద్

భారీ వర్షంతో రాకపోకలు బంద్

భారీ వర్షంతో రాకపోకలు బంద్

భారీ వర్షంతో రాకపోకలు బంద్