● ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టి
చిత్రంలో ఈగెల్‌ను చూశారా.. ఇది విజయనగరం ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టికి నిలువెత్తు రూపం. మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు 16 బైక్ చైన్స్, 2,500 చైన్ లింక్స్‌తో ఈగెల్‌ను సృష్టించారు. దీనిని గాజువాక సిటీ ఐటీఐలో డ్యూయల్ వీఈటీ (సీమెన్స్– టాటా స్ట్రైవ్ సంయుక్త) నిర్వహణలో బుధవారం నిర్వహించిన ‘ప్రాజెక్టు ఇన్నోవేషన్ చాలెంజ్ కాంపిటేషన్–2025 జోన్–1 పోటీల్లో ప్రదర్శించారు. మొత్తం 30 ప్రదర్శనల్లో ‘ఈగెల్’ ప్రాజెక్టు మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఎమ్మెల్సే చిరంజీవిరావు, కార్పొరేటర్ సరసింహపాత్రుడు, ప్రభుత్వ ఐటీఐ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్‌వీరమణ, ఐఎంసీ చైర్మన్ బాలాజీ, కోరమండల్ ప్రతినిధి శ్రీనివాసరావు, టాటా స్ట్రైవ్ ప్రతినిధులు రమేష్, మార్కండేయులు, సంతోష్, జోన్– ఐటీఐ ప్రిన్సిపాల్స్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతిని అందుకున్నారు. – విజయనగరం అర్బన్
● ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టి