
చీకటిలోనే రాకపోకలు..
పిల్లలు ఇబ్బంది పడుతున్నారు
పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ప్రత్యేక తరగతులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి చీకటి పడడంతో ఇబ్బంది పడుతున్నారు. వారు ఇంటికి చేరుకునేంత వరకు భయంభయంగా ఉంటోంది. విషసర్పాలు, కీటకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అధికారులు స్పందించి లైట్లు వేయాలి.
– ఎం.గిరిప్రసాద్, వసుంధర్‌నగర్
ప్రమాదాలు జరిగే అవకాశం..
రాష్ట్రీయ రహదారి కావడంతో భారీ వాహనాలు అతివేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యుత్ దీపాలు లేకపోవడంతో వాహనం వెళ్లిపోయిన తర్వాత కాసేపు రోడ్డు కనిపించడం లేదు. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి.
– గండి రాంబాబు, విద్యానగర్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణ ప్రారంభంలో రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. దీంతో చీకటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రీయ రహదారికి అనుసరించి ఉన్న వైకేఎం కాలనీ, వసుంధర నగర్, శక్తినగర్, ఆఫీషియల్ కాలనీ, విద్యానగర్ వరకు రహదారికి ఇరువైపులా విద్యుత్ లైట్లు లేవు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఏడు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో చీకటిలోనే భయం భయంగా ఇంటికి చేరుకుంటున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు.
ఇబ్బందిపడుతున్న ప్రజలు

చీకటిలోనే రాకపోకలు..

చీకటిలోనే రాకపోకలు..