విద్యుత్ షాక్‌తో అటెండర్ మృతి
అరసవల్లి: ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా ఎస్‌ఈ కార్యాలయం నీటి కోసం మోటార్ స్విచ్ వేయడానికి వెళ్లిన కార్యాలయ అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు(47) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో అందరూ విధుల్లో ఉండగా ఈదుర్ఘటన జరగడంతో ఇటు ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అటు జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం మోటార్ వేయడానికి వెళ్లి ఇంకా రాలేదని మరో అటెండర్ శార్వాణి వెళ్లినప్పటికే అచేతనంగా ఆనందరావు పడి ఉండటంతో మిగిలిన సిబ్బందికి సమాచారాన్ని అందించింది. 108 వాహనం సిబ్బంది వచ్చేసరికే మృతి చెందినట్లు వారు ధృవీకరించారు.వన్‌టౌన్ ఎస్సై హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. స్థానిక దేశెల్ల వీధిలో నివాసముంటున్న ఆనందరావు స్వస్థలం నందిగాం మండలం కల్లాడ గ్రామం. భార్య దుర్గ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆనందరావు మృతి పట్ల జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, జెడ్పీ చైర్‌పర్సన్ కార్యాలయ సీసీ అప్పన్న, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రంగప్రసాద్, డీఈ లలితకుమారి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
విద్యుత్ షాక్‌తో విద్యార్థి దుర్మరణం
బూర్జ: మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన బూరి మణికుమార్ (18) విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందాడు. మామయ్య నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇంటి గోడలను నీటితో తడుపుతూ ఇనుప నిచ్చెన తీస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేసరికే మృతిచెందాడు. మణికుమార్‌కు తల్లిదండ్రులు దుర్గారావు, కేసరి, సోదరి ఉన్నారు. చేతికందిన కుమారుడు విద్యుత్ షాక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీకాకుళం ఆర్‌డబ్ల్యూఎస్
కార్యాలయంలో ఘటన
కల్లాడలో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment