తరలిపోతున్న వృక్ష సంపద..!
● పట్టించుకోని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు
కొమరాడ: మండలం నుంచి వేలాది రూపాయల విలువ చేసే అటవీ సంపద రాత్రివేళ నాటుబళ్లు, ట్రాక్టర్‌ల సహాయంతో తరలిపోతోంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్ష సంపద నరికి వేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఒడిశా సరిహద్దు నుంచి టేకు కలప చడీచప్పుడు లేకుండా రవాణా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అక్రమ వ్యాపారులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. టేకుకలప తరలించాలంటే కచ్చితంగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కొమరాడ మండలం నుంచి పార్వతీపురం సా మిల్లులకు తరలించిన తరువాత అక్కడినుంచే సంబంధిత శాఖ అధికారులకు మామూళ్లు వెళ్తాయని సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తరలిపోతున్న వృక్ష సంపద..!
Comments
Please login to add a commentAdd a comment