పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తాం
పర్లాకిమిడి: దివ్యాంగులు పరిశ్రమల స్థాపనకు అనేక పథకాలు ఉన్నాయని, ఎవ్వరూ దరఖాస్తు చేసుకోవడం లేదని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సునరాం సింగ్ అన్నారు. గురువారం స్థానిక పాతపట్నం రోడ్డు సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దివ్యాంగులకు జీవనోపాధి, ఉపాధి కల్పనపై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో మనోస్థైర్యం కల్పించి, వారికి పారాశ్రామిక సామర్థ్యం కల్పించే దిశగా సమర్థ్ దివ్యాంగుల సంస్థ పనిచేయాలన్నారు. గ్రామీణ ఉద్యోగ్ శిక్షణా సంస్థ జీవన్ దాస్, సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యదర్శి అడ్డాల జగన్నాథ రాజు, జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ జీవన్ దాస్ హాజరయ్యారు. జిల్లాలో సమితి స్థాయిలో రాయగడలో జరిగిన ఉద్యోగ మేళాకు అర్హులైన దివ్యాంగులకు అవకాశం అధికారులు కల్పించలేదని సమర్థ్ దివ్యాంగుల సంస్థ కార్యదిర్శి సంతోష్ మహారాణా అన్నారు. ఇకపై జాబ్ మేళాలో చదువుకున్న దివ్యాంగులకు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ, ఉపాధి కల్పించేవిధంగా ఏర్పాటు చేస్తామని సునారాం సింగ్ అన్నారు.
జిల్లా పరిశ్రామిక శాఖ అధికారి
సునారాం సింగ్