పర్లాకిమిడి: కాశీనగర్ సమితి సింగిపురం గ్రామం వద్ద ఒడిశా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. కటక్ నుంచి గుణుపురం వెళ్తున్న బస్సు సింగిపురం గ్రామం వద్ద ఉదయం 4 గంటల సమయంలో అదుపు తప్పింది. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులను పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గంగా జలంతో బీజేడీ నిరసన
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభలో విపక్ష బిజూ జనతా దళ్ సభ్యులు గంగాజలంతో నిరసన తెలిపారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ సభ్యుల అప్రజాస్వామిక చర్యలతో సభా ప్రాంగణం అపవిత్రం అయిందని మండిపడ్డారు. సభని పవిత్రంగా పునరుజ్జీవం పోసేందుకు గంగా జలంతో శుద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గురువారం సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రదర్శన చోటు చేసుకుంది. బీజేడీ సభ్యులు ఇత్తడి కలశాలతో నీటిని తీసుకుని సభలోకి ప్రవేశించారు. సభలో నలువైపులా పవిత్ర జలాన్ని చల్లుతూ విభిన్న రీతిలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా స్పీకర్ సురమా పాఢి జోక్యం చేసుకొని శాసన సభ్యులు కలశాలను తీసుకొని సబ్ లోపలికి రావద్దని వారించారు. దీంతో సభ వెలుపల తమ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది.
పాత్రికేయుడికి గాయాలు
భువనేశ్వర్: కాంగ్రెస్ కార్యకర్తల రాష్ట్ర శాసనసభ ముట్టడి ఆందోళన సందర్భంగా ఓ పాత్రికేయుడు గాయపడ్డాడు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ కవరేజీ చేస్తుండగా స్థానిక ప్రైవేటు టీవీ ఛానెల్ పాత్రికేయుడు చిక్కుకున్నాడు. గాయాలు కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
29లోగా నవోదయ విద్యార్థులు రిపోర్టు చేయాలి
సరుబుజ్జిలి: జవహర్ నవోదయ ఫలితాలు విడులై న నేపథ్యంలో ఎంపికై న విద్యార్థులు ఈ నెల 29 లో గా ధ్రువపత్రాలను వెన్నెలవలస నవోదయ విద్యాలయానికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ డి.పరశురామయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకట న విడుదల చేశారు. కార్యాలయం పనివేళల్లో మాత్రమే సంప్రదించాలని పేర్కొన్నారు.
పూరిల్లు దగ్ధం
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదుపురంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. కార్జివీధికి చెందిన యర్రమ్మ కుటుంబ సభ్యులతో కలిసి తన పూరింటిలో నిద్రపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోడలు శేషమ్మ మేల్కొని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి బయటకు పరుగులు తీశారు. అగ్ని కీలలు ఎగసిపడటంతో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నర్తు ప్రేమ్‌కుమార్ స్పందించి స్థానిక యువకుల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు రెండు లక్షల రూపాయల సామగ్రి, రూ.30వేలు నగదు కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
గంజాయితో మహిళ అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి తరలిస్తున్న మహిళను గురువా రం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ మొబైల్ సీఐ జి.వి.రమణ తెలిపారు. శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రంజువాలిక్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ చేయగా 10.3 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీల్లో సిబ్బంది విఠలేశ్వరరా వు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు


