అడుగంటిన మహేంద్ర తనయ | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన మహేంద్ర తనయ

Mar 28 2025 1:45 AM | Updated on Mar 28 2025 1:39 AM

పర్లాకిమిడి: ప్రచండ ఎండలకు మహేంద్ర తనయలో నీరు అడుగంటింది. పర్లాకిమిడి, పాతపట్నం సరిహద్దుల్లో నీరు కనుమరుగైంది. పర్లాకిమిడి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు రోజుకు 12 మిలియన్‌ గ్యాలన్లు అవసరం వుండగా మహేంద్రతనయ నది నుంచి పంపుసెట్‌ల ద్వారా నీటిని తోడి 7 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని మాత్రమే ప్రజాఆరోగ్యశాఖ అందించగలుగుతోంది. గత ఏడు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు.తాగునీట సమస్యపై ఇటీవలే కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement