హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తం
భామిని: ఆస్పత్రి ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చి,హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ భాస్కరరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన భామిని మండలంలోని బత్తిలి, భామిని, బాలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బత్తిలి పీహెచ్‌సీలో నిర్వహిస్తున్న నూట్రీ–గార్డెన్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. భామిని పీహెచ్‌సీలో మందుల నిల్వలు పరిశీలించి,ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలను గుర్తించారు. బాలేరు పీహెచ్‌సీలో వైద్యసిబ్బంది హాజరు పట్టీ పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ వెంట బత్తిలి డాక్టర్లు రవీంద్ర, దామోదరరావు, భామిని వైద్యులు సోయల్, సంతోషిలక్ష్మి, బాలేరు వైద్యాధికారి శివకుమార్, సీహెచ్‌ఓ భాస్కరరావు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కరరావు
Comments
Please login to add a commentAdd a comment