కమ్యునిటీ సర్వీస్ సెంటర్ ప్రారంభం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి కేంద్రంలోని గునయిపొడ ల్యాంప్స్ కార్యాలయంలో కమ్యునిటీ సర్వీస్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. కొరాపుట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణీగ్రాహీ రిబ్బన్ కత్తిరించి ఈ విభాగం ప్రారంభించారు. ఇందులో ఖాతాదారులకు 23 రకాల సేవలు అందనున్నాయి. వెనుకబడిన లమ్తాపుట్‌లో ఇటు వంటి సేవలు అందించడంపై ఈశ్వర్ పాణీగ్రాహీ హర్షం వ్యక్తం చేసారు.
మద్యం మత్తులో హల్‌చల్
శ్రీకాకుళం ౖక్రైమ్ : జిల్లాకేంద్రంలోని మంగువారితోటలో శుక్రవారం ఓ సస్పెక్ట్ షీటర్ మద్యం తాగి హల్‌చల్ సృష్టించినట్లు ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపారు. బొమ్మలాట ఢిల్లీ అలియాస్ ఢిల్లీశ్వరరావు అనే యువకుడు శుక్రవారం ఉదయం మంగువారితోట బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి ఆ మైకంలో అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించాడని, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బందితో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారని పేర్కొన్నారు.