పర్లాకిమిడి: పట్టణంలోని కరణం వీధిలో విజయా క్లబ్‌లో ప్రపంచ నాటక దినోత్సవాన్ని ప్రగతి శీల నాట్యరంగస్థలం ‘తరంగరంగ్’ ఆధ్వర్యంలో సాధారణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తరంగరంగ సంస్థ అధ్యక్షులు దేవేంద్రదాస్ అధ్యక్షతన జరుగగా, క్రియేటివ్ ఆర్ట్స్ అధ్యక్షులు నృసింహాచరణ్ పట్నాయక్, ఒడిశా సంగీత నాటక అకాడమి సభ్యులు రఘునాథ పాత్రో, రంగస్థల నటులు ఆదర్శదాస్ పాల్గొన్నారు. ఒడిశాలో గజపతిలో పర్లాఖిముండిలో రఘునాథ పోరిచ్చా నాటకం తొలుత ప్రదర్శించబడిందని దేవేంద్ర దాస్ అన్నారు. పర్లాకిమిడి మట్టిని ఏ రంగస్థల కళాకారులు మరిచిపోలేదన్నారు. రోజురోజుకు ఆదరణ తగ్గుతున్న రంగస్థల నాటక మండలిని ముందుకు నడిపించేందుకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాటక మహోత్సవాలు జరుపుతామని ఆదర్శదాస్ అన్నారు. సమావేశంలో నాట్యకళాకారులు మనోజ్ పాఢి, మంచ్ అధినేత ఫృధ్వీరాజ్, కళాకారిణి మాతాంగినీ గురు, మమతా పాఢి, శుభాంశు శేఖర్ పట్నాయిక్, సత్యపాఢియారీ పాల్గొన్నారు.
ఉత్సాహంగా నాటక దినోత్సవం


