భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం 69వ రైల్వే సేవా పురస్కారాల ప్రదానోత్సవం స్థానిక రెటాంగ్ కాలనీ కల్యాణ మండంలో మంగళవారం జరిగింది. మండల సీనియర్ కార్మిక అధికారి ఎస్‌డీపీవో ఆర్.ఎన్.ఎ.పరిడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం హెచ్.ఎస్.బాజ్వా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర అతిథులుగా తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం మండల శాఖ అధ్యక్షురాలు గురు సిమ్రాన్ కౌర్, అదనపు మండల రైల్వే అధికారి ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) పి.కె.బెహెరా, ఏడీఆర్‌ఎం (ఇంఫ్రా) సుభ్రజ్యోతి మండల్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందజేసిన 56 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.
రైల్వేసేవా పురస్కారాలు ప్రదానం