ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!
విజయనగరం ఫోర్ట్: ఇటీవల గజపతినగరం మండలంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
● కొద్దినెలల క్రితం గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామంలో ఉన్న రైస్ మిల్లు గొడౌన్‌కు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో వీఆర్వో వెళ్లి రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని, తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.
● ఇదే మండలంలో ఉన్న మరో మిల్లులో ిపీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు మిల్లు వద్దకు చేరుకుని పీడీఎస్ బియ్యం తరలించే వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 1500 కేజీలుగా గుర్తించారు. వాటిని అధికారులు సీజ్ చేసి మిల్లు యాజమానిపైన, తరలించిన వ్యక్తిపైన కేసులు నమోదు చేశారు.
● ఇలా ఈ మూడు చోట్లే కాదు. జిల్లాలోని అనేక చోట్ల పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని మిల్లులకు తరలిస్తూ మిల్లులో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటినే మళ్లీ ప్రజాపంపిణీ వ్యవస్థ గొడౌన్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
పీడీఎస్ బియ్యం అధికారుల కళ్లముందే తరలిపోతున్నా తమకేమీ కనబడడం లేదన్న రీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పీడీఎస్ బియ్యం ఎక్కువగా పక్కదారి పట్టిస్తున్నా గ్రామాల్లో ఉండే వీఆర్వోలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం తరలిపోతున్నట్లు తెలుస్తోంది.
2024–25 లో 90 కేసులు నమోదు:
2024–25 లో పీడీఎస్ తరలించిన 90 మందిపై 6 ఎ కేసులు నమోద య్యాయి. 1959 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 2025–26లో 23 మందిపై 6 ఎ కేసులు నమోదయ్యాయి. 99.86 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు.
టన్నుల కొద్దీ తరలిస్తున్న వ్యాపారులు
రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్
మళ్లీ అవే బియ్యం పౌరసరఫరాల శాఖ గొడౌన్లకు తరలింపు
ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం
పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించకూడదు. సీ ఎస్‌డీటీలు ఆకసిక్మక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లయితే అటువంటి వారిపై 6ఎ కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెడతాం. కె.మధుసూదన్‌రావు,
జిల్లా పౌరసరఫరాల అధికారి
ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!
ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!
ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!