ఇరుగ్రామాల యాదవుల కొట్లాట
బాడంగి: గొర్రెల మేత విషయంలో ఇరుగ్రామాలకుచెందిన యాదవులు కొట్లాటకు దిగడంతో ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మండలంలో జరగ్గా గాయపడిన వారి బంధువులు తెలిపిన సమాచారం ఇలా ఉంది. మండలంలోని గొల్లాది, కామన్నవలస గ్రామాలకుచెందిన యాదవులు గొడవపడి కర్రలతో కొట్టుకోగా కామన్నవలసకు చెందిన పడాల లక్షుం, కామేశ్వరరావు, సింహాచలం, ఆదినారాయణలు, గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు, చప్పసత్యం గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని 108లో స్థానిక ఆస్పత్రికి తీసుకురాగా ప్రథమచికిత్స చేసిన డాక్టర్ హారిక వారిలో ఈపుఈశ్వరరావు, పడాల లక్షుంల పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు క్షతగాత్రుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరుగురికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
ఇరుగ్రామాల యాదవుల కొట్లాట