ప్రహసనంగా ఎంజీ రోడ్డు విస్తరణ
జయపురం: జయపురం మహాత్మాగాంధీ రోడ్డులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు రోడ్డు విస్తరణకు గత నవంబర్‌లో శ్రీకారం చుట్టారు. 40 అడుగుల రోడ్డు ఏర్పాటు లక్ష్యంగా రోడ్డుకు ఇరువైపులా 40 అడుగుల లోపున గల దుకాణాలను, ఇళ్లను కొలతలు కొలిచి ఆక్రమణలను బుల్డోజర్లతో తొలగించారు. రోడ్డు వెడల్పు అయి ట్రాఫిక్ సమస్య తీరుతుందని ప్రజలు సంతోషించారు. అయితే 2024 నవంబర్ నెలలో ఆక్రమణలను తొలగించిన అధికారులు, నాలుగు నెలలు గడిచినా వాటిని పట్టించుకోలేదు. అందువల్ల అటు వ్యాపారులు ఇటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్చ్ 23న రోడ్డుకు ఇరువైపులా కాలువల తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలు ఎంజీ రోడ్డు కమలా మెడికల్ కూడలి నుంచి జైలు రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు బ్లాక్ చేసి కాలువల తవ్వకాలు జరుపుతున్నారు. విస్తరణ ఎప్పటికి పూర్తవుతుందోనని స్థానికులు అంటున్నారు. విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదిన జరపాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రహసనంగా ఎంజీ రోడ్డు విస్తరణ