ఫోర్జరీ సంతకాలు.. ఒకరు అరెస్టు
కొరాపుట్: ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ నిధులను దారి మళ్లించి బెట్టింగ్‌లకు ఉపయోగించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి అరైస్టెయ్యారు. కొరాపుట్ విజిలెన్స్ విభాగం పరిధిలోని కలహండి జిల్లా త్వముల్–రాంపూర్ సమితి పొడపొదర్, తెలంగి పంచాయతీల పీఈవో దేవానంద సాగర్‌ని అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని భవానీపట్న కోర్టులో హాజరుపరిచి జైలుకి తరలించారు. నిందితుడు రెండు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌ల సంతకాలను ఫోర్జరీ చేశారు. అనంతరం రూ.3 కోట్ల నిధులను తన సొంత ఖాతాకి బదలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడి నష్టపోయాడు. అధికారుల ఆడిట్‌లో ఈ విషయం తేలడంతో వారు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు.
ట్రాక్టర్ బోల్తా.. చిన్నారి మృతి
రాయగడ: జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్ సమితి పరిధిలోని పెర్నాకాడు గ్రామ మలుపులో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో 28 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి గుడుబలి గ్రామానికి చెందిన మేఘన గొబరెంగ(6)గా సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. గుడుబలి గ్రామానికి చెందిన 30 మంది ఒక ట్రాక్టర్‌లో పెర్నాకాడు గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కిందపడి ఊపిరాడక మేఘన అనే చిన్నారి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను చంద్రపూర్ ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని మునిగుడ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోర్జరీ సంతకాలు.. ఒకరు అరెస్టు