జయపురం: ముఖ్యమంత్రి బస్సు సేవా పథకంలో భాగంగా మూడు రోజుల క్రితం ప్రవేశపెట్టిన 50 సీట్ల ఏసీ బస్సులు అప్పుడే మూలకు చేరాయి. ఈ బస్సుౖలు నడపడంపై రాష్ట్ర ప్రైవేట్ బస్సుల యాజమాన్య అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిందని, దీంతో తర్వాత ఉత్తర్వులు విడుదల చేసేవరకు బస్సులను నిలిపి వేయాలని ఒడిశా స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఓఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా జయపురం పాత బస్టాండ్‌లో 7 ఏసీ బస్సులు నిలిపివేశారు. గతంలో లక్ష్మి ఏసీ బస్సులు సెమిలిగుడ ప్రభుత్వ బస్టాండ్‌లో పడి ఉండేవి, అయితే ముఖ్యమంత్రి బస్సుసేవా పథకంలో వీటిని మూడు రోజుల క్రితం గుణుపూర్‌కు రెండు బస్సులు, జయపురం–కాశీపూర్, జయపురం– మల్కన్‌గిరి, జయపురం–కలహండి(కెటాగాం), జయపురం –కొటియా, జయపురం – భవాణీపట్నలకు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ మరలా నిలిపివేయడంతో సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.