ఆకట్టుకున్న వంటల పోటీలు
రాయగడ:
స్థానిక మున్సిపల్ టౌన్‌హాల్‌లో రాయగడ జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన వంటల పోటీల్లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతికి అద్దంపట్టే పిండివంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంట్లో స్వయంగా తయారు చేసుకొని వచ్చిన మహిళలు ఈ పోటీల్లో వాటిని ప్రదర్శించారు. స్థానిక సాయి ఇంటర్నేషనల్ చెఫ్ సత్యనారాయణ, ఆశాలత పట్నాయక్, ప్రణతి పాత్రోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రుచి, శుచి, అలంకరణ తదితరమైన వాటికి ప్రాధాన్యత కల్పించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో ప్రథమ బహుమతిని కె.సంతోషిణి, ద్వితీయ బహుమతిని పి.నాగమణి, తృతీయ బహుమతిని కె.సత్యలు గెలిపొందగా, ఎం.సోనాలి, పద్మావతి పాడి, ఎం.రేవతిలకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. విజేతలకు ఉగాది వేడుకల్లో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
ఆకట్టుకున్న వంటల పోటీలు