పర్లాకిమిడి:
స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న చాకలి రేవు చెరువు మట్టితీత పనులపై పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కంట్రాక్టర్లతో బుధవారం సమీక్షించారు. ఈ చెరువుపై పలు రజక కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. చెరువులో మట్టి, గుర్రపు డెక్క పేరుకుపోవడంతో రజక సంఘం నాయకులు చెరువు పునరుద్ధరించాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఈ పనులు గత కొన్ని రోజులుగా జరుగుతుండగా అకస్మాత్తుగా పరిశీలించారు. నిధుల సమస్య లేకుండా గ్రామీణ తాగునీరు, శానిటేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రతాప్ బెహరాతో మాట్లాడారు. పనులు వెంటనే చేపట్టినందుకు పురపాలక అధ్యక్షురాలు నిర్మలకు కృతజ్ఞతలు తెలిపారు.