
పోలీస్ స్టేషన్ ముట్టడి!
రాయగడ:
తన డ్రైవర్‌ను అరెస్టు చేశారంటూ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాల్ల కొండబాబు, అతని అనుచరులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడి ఘెరావ్ చేశారు. స్టేషన్ ఎదుట లారీలను రోడ్డుకు అడ్డంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. సుమాు ఏడు గంటలు ట్రాఫిక్ స్తంభించింది. ఇటు ఆంధ్రకు వచ్చివేళ్లే వాహనాలు సుమారు ఆరు కిలోమీటర్లు నిలిచిపొయాయి. అలాగే రాయగడ మీదుగా కొరాపుట్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సైతం నిలిచిపొయాయి.
నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు..
తన కారు డ్రైవరు శంకరావునుని మంగళవారం తెల్లవారుజాము మూడు గంటలకు ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారని కొండబాబు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అతనిని అరెస్టు చేయడం ఎంతవరకు సమసంజసమని ప్రశ్నించారు. నక్సలైట్ల పేరిట చందాలు వసూళ్లు చేసే బడా నాయకులపై కేసులు ఉన్నా వారిని అరెస్టు చేయని పోలీసులు చిన్నవారిపై తమ జులుంను చూపించడం తగదన్నారు . మంగళవారం ఉదయం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన మద్దతుదారులు బైఠాయించి నిరసన తెలియజేశారు. డ్రైవరును విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. జిల్లా అదనపు ఎస్‌పీ అమూల్య ధర్, ఎస్‌డీపీవో గౌరహరి సాహులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఐదేళ్ల క్రితం ఒక కేసుకు సంబంధించి డ్రైవర్ శంకరరావుకు నోటీసులు పంపిస్తున్నా దానిని తిరస్కరించేవాడని.. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేయాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు వివరించారు. చట్టపరంగా అతన్న అరెస్టు చేశామే తప్పా ఎవరి ఒత్తిడికి లొంగి అరెస్టు చేయలేదని వివరించారు. ఏదిఏమైనప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తికి కోర్టుకు తరలించడం ఖాయమని చెప్పడంతొ కొండబాబు తన ఆంాదోళలనను విరమించారు.