భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో సభ్యులు సోమవారం కాసేపు మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ మృతిపై సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. విపక్ష నేత నవీన్ పట్నాయక్ తరఫున ప్రసన్న ఆచార్య ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సురమా పాఢి సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం సభలో సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించి దివంగత మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర శర్మకు నివాళులు అర్పించారు.
పవిత్ర పుష్కరిణిలో తేలిన శవం
భువనేశ్వర్: పూరీలోని పవిత్ర శ్వేత గంగ పుష్కరిణిలో మృత దేహం తేలింది. బాలాసోర్ బొస్తా ప్రాంతానికి చెందిన గోవింద బింధాని శవంగా గుర్తించారు. ఈ శవాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. శవ పరీక్ష కోసం సదరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
శియ్యాళీలో గ్రీవెన్స్
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి శియ్యాళీ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామ ముఖి పరిపాలన, గ్రీవెన్సు సెల్‌కు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌పండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్పందన కార్యక్రమానికి మొత్తంగా 79 వినతులు అల్లడ, కిడిగాం, గోరిబంద, ఖండవ పంచాయతీల నుంచి అందాయి. వాటిలో ఒకటి అక్కడికక్కడే పరిష్కరించగా, గ్రామసమస్యలు 29, వ్యక్తిగతం 50 ఉన్నాయి. కార్యక్రమానికి గుసాని సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్ బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి డంబురధర మల్లిక్, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ ఎంఎం ఆలీ, డీఎస్‌ఎస్‌ఓ సంతోష్‌కుమార్ నాయక్, సర్పంచు, సమితి సభ్యులు పాల్గొన్నారు.
దేబేంద్ర శర్మకు నివాళి