పార్వతీపురంటౌన్: పార్వతీపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమ య్యాయి. ఈ మేరకు అధ్యక్షుడిగా నల్ల శ్రీనివాసరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బి.సత్యనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు పార్వతీపురం బార్ అసోసియేషన్‌కు 2025–26 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 17 నామినేషన్ వేసిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో ఉపాధ్యక్షుడిగా సూర్ల కృష్ణ, జనరల్ సెక్రటరీగా నీలం రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా ఎంవీ వెంకట రాఘవేంద్ర, కోశాధికారిగా మంత్ర పూడి వెంటకరమణలను ఎన్నుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు.
విజయనగరంలో..
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. సంఘం అధ్యక్షుడిగా కలిశెట్టి రవిబాబు, సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామరాజు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రవిబాబు 58 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి ధవళ వెంకట రావుపై విజయం సాధించారు. కాగా సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామ రాజు తన ప్రత్యర్థి సారిక సతీష్‌పై కేవలం నాలుగు ఓట్లు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శిగా నలితం సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.శివప్రసాద్, కోశాధికారిగా కళ్ళెంపూడి వెంకట్రావు, లైబ్రరీ కార్యదర్శిగా తాడిరాజు, స్పోర్ట్స్ సెక్రటరీగా చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం