యువకుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి సిరిపారి గ్రామ పంచాయతీలోని బహరదులకి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడిని హత్యచేసి మృతదేహాన్ని గ్రామానికి కొద్దిదూరంలో పడేసి వెళ్లిపోయారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం మృతదేహం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తు మేరకు మృతుడు కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి లులుపొదొరొ గ్రామానికి చెందిన కుమార స్వామి హలువ (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దారుణ హత్య