శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025
శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు
నగదు : రూ. 5,86,369
బంగారం : 1 గ్రాము 200 మిల్లీ గ్రాములు
వెండి : 98 గ్రాముల 250 మిల్లీ గ్రాములు
– భువనేశ్వర్/పూరీ
కొత్త ఉత్తేజం
శాసన సభలో దీర్ఘకాలంగా బలం దిగజార్చుకున్న కాంగ్రెస్ భావి ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు తాజా ఆందోళన దోహదపడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా 13.4 శాతానికి దిగజారి కేవలం 14 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఓట్ల వాటా పెంపొందించేందుకు పార్టీ కొన్ని అత్యవసర చర్యలతో వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తు కార్యకర్తల్లో ఉత్త ఉత్తేజం ప్రేరేపిస్తుందన్నారు. కాంగ్రెస్‌లో సప్తగిరి ఉలాకా, నబజ్యోతి పట్నాయక్, సాగర్ చరణ్ దాస్, సోఫియా ఫిరదౌస్, మంగు ఖిలాతో మరికొంత మంది యువ నాయకుల్లో నాయకత్వ నైపుణ్యాలకు రాష్ట్ర కాంగ్రెస్ పదును పెడుతుంది. భక్త చరణ్ దాస్ నేతృత్వంలో 2025 సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ శిబిరంలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.
● మహిళల భద్రత నినాదంతో భారీ ఉద్యమం
● ఘంటానాదంతో పాదయాత్ర
భువనేశ్వర్:
రాష్ట్రంలో కాంగ్రెస్ తన ఉనికిని బలపరచుకునే దిశలో సరికొత్త పంథాలో బల ప్రదర్శన చేస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత శాసన సభ ముట్టడి తొలి ఉద్యమంగా కనిపించింది. దీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ ఈ తరహాలో భారీ ఉద్యమానికి శంఖారావం చేయడం విశేషం. ప్రధానంగా భక్త చరణ్ దాస్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన నుంచి పీసీసీ కార్యాచరణ వాడీవేడిగా కొనసాగుతుంది.
మహిళల భద్రత నినాదంతో శాసన సభ లోపల, బయట తీవ్ర స్థాయిలో విజృంభించి అలజడి రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకరు సురమా పాఢి సస్పెన్షన్ వేటు వేశారు. అంచెలంచెలుగా సభలో కాంగ్రెస్ సభ్యులు అందరిని సభా కార్యకలాపాల నుంచి దూరం చేశారు. సభలో కాంగ్రెస్ బలం 14 మంది సభ్యులు కాగా వీరందర్ని స్పీకరు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. త్వరలో సభలో బడ్జెటు సమావేశాలు ముగియనున్నాయి. ఈ లోగా కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు తొలగించే అవకాశాలు కనిపించడం లేదు. 14 మంది సభ్యుల వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యల కింద స్పీకరు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో సభ కాంగ్రెస్ శూన్యంగా మారింది. ఈ చర్యని అప్రజాస్వామిక చర్యగా ప్రభావిత కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్టీ సభ్యుల సస్పెన్షన్ వ్యతిరేకంగా చేపట్టిన శాసన సభ ముట్టడి ఆందోళన తార స్థాయికి చేరింది.
పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హోరాహోరీ పోరు చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై వేరొకరు రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాత్రింబవళ్లు నిరసన సందర్భంగా పోలీసులు రాష్ట్ర శాసన సభ లోనికి ప్రవేశించడం రాష్ట్ర శాసన సభ చరిత్రలో కళంకం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరమైన కట్టుబాట్లను అధిగమించి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు మారణాంతక దాడికి పాల్పడ్డారని రాష్ట్ర పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం తథ్యమని పోలీసులు బాహాటంగా హెచ్చరించారు.
స్థానిక క్యాపిటల్ పోలీస్ ఠాణాలో కాంగ్రెస్ ఆందోళనకారుల వ్యతిరేకంగా 3 వేర్వేరు ఫిర్యాదులు (ఎఫ్‌ఐఆర్) శుక్ర వారం నమోదు చేశారు. ఈ నెల 26న శాసన సభ తూర్పు ప్రవేశ మార్గం ఆవరణలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన వ్యతిరేకంగా ఒక కేసు నమోదు కాగా ఈ నెల 27న శాసన సభ ముట్టడి పురస్కరించుకుని పోలీసు వాహనాలకు నిప్పు అంటించిన ఆరోపణ కింద మరో కేసు నమోదు చేశారు. శాసన సభ ముట్టడి ఆందోళనలో శాంతిభద్రతలకు భంగం కలిగించిన ఆరోపణ కింద మూడో కేసు నమోదు చేశారు. ఈ చర్యని రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుడు భక్త చరణ్ దాస్ పక్షపాత చర్యగా వ్యాఖ్యానించారు. పోలీసుల ఆరోపణ ప్రకారం రాళ్లు రువ్వి పోలీసుల్ని గాయపరచిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరని ఆయన స్పష్టం చేశారు. పలువురు కాంగ్రెసేతర వర్గాలు ఈ ఆందోళనలో కలిసిపోయిన విషయాన్ని పోలీసు వర్గాలు విస్మరించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కార్యకర్తల వ్యతిరేకంగా కేసులు బనాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
పోలీసుల చర్యలతో వెనుకంజ వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిర్విరామంగా కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు. ఆయన పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల స్వల్ప వ్యవధిలో శాసన సభ ముట్టడి ఆందోళన చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపారు. 2000 నుండి 2024 వరకు వరుసగా ఆరు ఎన్నికల్లో కాంగ్రెస్ నిరుత్సాహ ఫలితాలతో కార్యకర్తల వర్గం నిరుత్సాహం చెందింది. తాజా ఆందోళనతో కార్యకర్తల్లో కొత్త చురుకుదనంతో పోరాట స్ఫూర్తిని బలోపేతం చేసినట్లు రాష్ట్ర పీసీసీ కొత్త కార్యవర్గం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తుంది. ఉనికిని బలపరచుకునే దిశలో కాంగ్రెస్ నిరవధికంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
నాటక దినోత్సవం పర్లాకిమిడిలో నాటక దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. –IIలోu
కొనసాగుతున్న నిరసన
ఒక వైపు శాసన సభలో ప్రవేశం లేకుండా సస్పెన్షన్‌కు గురైన సభ్యులు శుక్రవారం నగరంలో దేవాలయాలు సందర్శించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారుకు మహా దేవుడు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ భవన్ నుంచి ఘంటానాదంతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పాదయాత్ర నిర్వహించారు.
న్యూస్‌రీల్
కాంగ్రెస్ బల ప్రదర్శన