ఇదీ యంత్రాంగం తీరు..!
● కూటమి నేతల సిఫారసు ఉంటేనే
వ్యవసాయ యంత్రాల మంజూరు
● కూటమి ఆదేశాలు అధికారులు అమలు చేస్తున్నారనే ఆరోపణలు
విజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రంధి దేముడు. ఈయనది గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామం. వ్యవసాయ యంత్ర పనిముట్లు రాయితీపై ఇస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది చెప్పడంతో దుక్కిసెట్టు కోసం దరఖాస్తు చేశాడు. దుక్కిసెట్టు నిమిత్తం రైతు కట్టాల్సిన వాటాను చెల్లించడానికి రైతు సేవా కేంద్రం సిబ్బందిని అడిగితే మీకు దుక్కి సెట్టు మంజూరు చేయలేం అని తేల్చి చెప్పడంతో మిన్నుకుండిపోయాడు.
ఈ పరిస్థితి ఈ ఒక్క రైతుదేకాదు. జిల్లాలోని అనేక మంది రైతులది. అందరికీ అన్నం పెట్టే రైతులతో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసిన రైతులు ఏపార్టీ వారా? అని అరా తీస్తున్నారు. కూటమి పార్టీకి చెందిన రైతులైతే వారికి యంత్ర పరికరాల మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తటస్థంగా ఉండే రైతులైతే వారికి యంత్ర పరికరాలు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన నేతల ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీకు తెలియంది ఏం ఉంది? అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయాల్సిందే కదా అంటూ వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి వాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతల వ్యవహార శైలి తెలిసిన చాలామంది రైతులు యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేసినా కూటమి నేతలు మంజూరు కానివ్వరనేది రైతుల భావన.
456 మంది దరఖాస్తు
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు జిల్లావ్యాపంగా 456 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటికి సంబంధించి కూటమి నేతలు చెప్పి న లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేసిన ట్లు తెలిసింది. 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. దుక్కి సెట్లు, మోటార్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్‌వీటర్స్, రోటోవీడర్స్ యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీకి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.2.50 నిధులు కేటా యించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు
దరఖాస్తులు పరిశీలించి మంజూరు
జిల్లాలో యంత్ర పరికరాల కోసం 456 మంది దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించి యంత్ర పరికరాలు మంజూరు చేయనున్నాం.
వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
ఇదీ యంత్రాంగం తీరు..!
ఇదీ యంత్రాంగం తీరు..!